న్యూఢిల్లీ: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)లో అడుగు పెట్టిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన వాయుసేన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాకు ప్రభుత్వం అత్యున్నత సాహస పురస్కారం అశోక చక్రను ప్రకటించింది. ఎస్‌యూ–30 ఎంకేఐ, మిగ్–21, మిగ్– 29, జాగ్వార్, హాక్, డార్నియర్, ఏఎన్–32 వంటి యుద్ధ విమానాలను నడిపిన శుక్లాకు 2 వేల గంటల ఫ్లయిట్ అనుభవముంది.
శుక్లా గతేడాది జూన్‌లో యాగ్జియం–4 మిషన్‌లో ఐఎస్‌ఎస్‌కు వెళ్లి 18 రోజులు గడపడం తెలిసిందే. తొలిసారిగా 1984లో రష్యా సూయుజ్ మిషన్‌లో రాకేశ్ శర్మ రూపంలో భారత వ్యోమగామి అంతరిక్షంలోకి వెళ్లగా..41 ఏళ్ల తర్వాత శుభాంశు ఆ ఘనత సాధించి రికార్డు నెలకొల్పారు. తాజాగా, రాష్ట్రపతి ముర్ము ప్రకటించిన 70 మంది సాహస అవార్డు గ్రహీతల్లో ఆయన కూడా ఉన్నారు. వీరి ఆరుగురికి మరణానంతరం పురస్కారం ప్రకటించారు. మేజర్ అర్షదీప్‌సింగ్, గ్రూప్ కెపె్టన్ బాలకృష్ణన్ నాయర్, నాయబ్ సుబేదార్ డోలేశ్వర్ సుబ్బాకు కీర్తిచక్ర ప్రకటించారు.


