లవ్‌ జిహాద్‌ కాదు, ఆమె ఇష్టమే నా ఇష్టం! | Kumbh Mela fame Monalisa Bhosle defends interfaith marriage with Farman Khan | Sakshi
Sakshi News home page

లవ్‌ జిహాద్‌ కాదు, ఆమె ఇష్టమే నా ఇష్టం!

Mar 12 2026 6:59 PM | Updated on Mar 13 2026 12:29 PM

Kumbh Mela fame Monalisa Bhosle defends interfaith marriage with Farman Khan

మహా కుంభమేళా 2025లో పూసల దండలు అమ్ముకుంటూ  ఫ్యామస్‌ అయిన మోనాలీసా భోంస్లే (Monalisa Bhosle) మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రియుడు నటుడు ఫర్మాన్ ఖాన్‌ పెళ్లాడి ఫ్యాన్స్‌ అందరికీ సర్‌ప్రైజ్‌  ఇచ్చింది. అయితే ఈ పెళ్లి 'లవ్ జిహాద్' నెట్టింట తీవ్ర దుమారం రేగింది. దీనిపై ఈ జంట వివరణ  ఇచ్చారు. గురువారం (మార్చి 12, 2026) తిరువనంతపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తమ పెళ్లిపై వస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు.

తాము తమ మతాలు మార్చుకోలేదని మోనాలీసా స్పష్టం చేసింది. తాను హిందువుగా, తన భర్త ముస్లింగానే కొనసాగుతామని మోనాలీసా వివరించింది. అలాగే 'లవ్ జిహాద్' ఆరోపణలను కూడా ఆమె తోసిపుచ్చింది. ఈ వివాహం తన సొంత నిర్ణయమని తేల్చి చెప్పింది. తన తండ్రి తనతో పాటు కేరళకు వచ్చినప్పటికీ, ఈ పెళ్లి పట్ల ఆయన ఇంకా అసంతృప్తితో ఉన్నారని, త్వరలోనే ఆయనను ఒప్పించు కోగలననే ధీమా వ్యక్తం చేసింది. తన అత్త కొడుకుతో పెళ్లి చేయాలని తల్లిదండ్రులు భావించారని, కానీ తనకు ఇష్టం లేక ఫర్మాన్ ఖాన్‌ను ఎంచుకున్నానని ఆమె చెప్పారు.

తల్లి దండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా జరిగిన  తమ మతాంతర వివాహానికి సంబంధించి విమర్శలపై  స్పష్టత ఇస్తూ  "ప్రేమలో మత మార్పిడి అవసరం లేదు" అని ఫర్మాన్ ఖాన్  ( Farman Khan)పేర్కొన్నాడు.. అలాగే మోనాలీసా మైనర్ అంటూ వస్తున్న వార్తలను ఫర్మాన్ ఖాన్ ఖండించారు. ఆమె ఆధార్ కార్డ్, పుట్టిన తేదీ ధృవీకరణ పత్రాలను మీడియాకు చూపించారు. మోనాలిసా కోరుకున్న విధంగా ఆచారాలను అనుసరించడానికి తాను అంగీకరించాననీ, ఎందుకంటే ఆమె ఆనందాన్నే తన ఆనందమని చెప్పు కొచ్చాడు. ఈ సందర్భంగా తమకు కేరళ ప్రజల మద్దతు లభించడం సంతోషమని,మోనాలీసాకు ఇష్టమైతే అక్కడే స్థిరపడతా మన్నాడు.

ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లాకు చెందిన ఖాన్,  ఇండోర్ నివాసి మోనాలీసా వివాహం కేరళలోని ఒక ఆలయంలో హిందూ ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు. కేరళ ప్రభుత్వానికి చెందిన K-SMART యాప్ ద్వారా వీరి వివాహం చట్టబద్ధంగా నమోదైంది. ఈ వివాహ వేడుకకు కేరళ విద్యాశాఖ మంత్రి వి. శివన్ కుట్టి, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. గోవిందన్ లాంటి ప్రముఖ రాజకీయ నేతలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కాగా 'నాగమ్మ' అనే మలయాళ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఇందులో ఫర్మాన్ ఖాన్ విలన్‌గా, మోనాలీసా హీరోయిన్‌గా నటిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement