పెళ్లి చేసుకున్న కుంభమేళా మోనాలిసా.. వరుడు ఎవరంటే? | Kumbh Mela viral beauty Monalisa Married To Her Boyfriend Farman Khan In Kerala | Sakshi
Sakshi News home page

ప్రేమ పెళ్లి చేసుకున్న మోనాలిసా.. కాపాడాలంటూ పోలీసులకు ఫిర్యాదు!

Mar 11 2026 7:06 PM | Updated on Mar 11 2026 7:40 PM

Kumbh Mela viral beauty Monalisa Married To Her Boyfriend Farman Khan In Kerala

కుంభమేళా సమయంలో పూసలమ్ముకుంటూ ఫేమస్ అయిన యువతి మోనాలిసా భోస్లే ప్రేమ వివాహం చేసుకుంది. కేరళలోని పూవార్ అరుమనూర్‌లో ఉన్న నైనార్ ఆలయంలో ఈ వివాహ వేడుక జరిగింది. కేరళ మంత్రి వి. శివన్‌కుట్టి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. గోవిందన్ ఈ వేడుకకు హాజరైనట్లు కేరళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఫేస్‌బుక్‌ ద్వారా ప్రేమలో.. 
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన మోనాలిసాకు మహారాష్ట్రకు చెందిన ఫర్మాన్‌ ఖాన్‌ ఫేస్‌ బుక్ ద్వారా పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.   అయితే వీరి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించలేదు. 

మతాలు వేరు కావడంతో మోనాలిసా తండ్రి జై సింగ్ భోంస్లే ఈ పెళ్లిని  తీవ్రంగా వ్యతిరేకించారు. ది డైరీ ఆఫ్ మణిపూర్ అనే సినిమా షూటింగ్ కోసం మోనాలిసా కేరళకు రాగా,  తండ్రి కూడా అక్కడకు వెళ్లి ఆమెతో గొడవకు దిగారు. దీంతో ప్రాణహాని ఉందని భయపడిన ఈ జంట, తమ ప్రేమను కాపాడుకునేందుకు పోలీసులను ఆశ్రయించారు.  తన తండ్రి విజయ్ సింగ్ భోస్లే తను చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని మోనాలిసా ఫిర్యాదులొ పేర్కొంది.  

పోలీసుల సమక్షంలో పెళ్లి..
తాను మేజర్‌ని అని..ఇష్టమైన వ్యక్తితో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని మోసాలిసా చెప్పడంతో భద్రత కలిపించామని పోలీసులు చెప్పారు. శారీరకంగా ఆమెకు ఎలాంటి వేధింపులు జరగలేదని కేవలం బలవంతపు వివాహ ప్రతిపాదన వల్లే పోలీసులు జోక్యం కోరుకుందని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.  మోనాలిసా పెళ్లికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. 
 

Advertisement
 
Advertisement
Advertisement