breaking news
Shubhanshu Shukla
-
అంతరిక్షంపై చిన్నారుల్లో అమితాసక్తి
సాక్షి, న్యూఢిల్లీ: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర విజయవంతం కావడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. అంతరిక్షంపై చిన్నారుల్లో ఆసక్తి నానాటికీ పెరుగుతోందని చెప్పారు. అంతరిక్ష రంగంలో 200కుపైగా స్టార్టప్ కంపెనీలు ఏర్పాటయ్యాయని తెలిపారు. ఆయన ఆదివారం 124వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ‘ఆత్మనిర్భర్ భారత్’కు అతిపెద్ద ఆధారం ‘వోకల్ ఫర్ లోకల్’ అని పునరుద్ఘాటించారు. ‘2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్’ అనే లక్ష్య సాధన కోసం కృషి చేస్తున్నామని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. గత కొన్ని వారాల్లో క్రీడలు, సైన్స్, సాంస్కృతికం తదితర రంగాల్లో ఎన్నో ఘనతలు నమోదయ్యాయని, అవి ప్రతి భారతీయుడికీ గర్వకారణమని చెప్పారు.శుభాంశు శుక్ల అంతరిక్ష యాత్రతో దేశమంతా పులకించిపోయిందని, ఆయన క్షేమంగా తిరిగి వచ్చాక గర్వంతో ఉప్పొంగిపోయిందని, ప్రతి హృదయం సంతోషంతో నిండిపోయిందని వ్యాఖ్యానించారు. 2023 ఆగస్టులో చంద్రయాన్–3 ప్రయోగం విజయవంతమైనప్పుడు భారతీయులు ఎంతగానో గర్వించారని గుర్తుచేశారు. చిన్నారుల్లో సైన్స్, అంతరిక్షం పట్ల ఆసక్తి పెరిగిందని, చంద్రుడిపైకి చేరుకుంటామని చెబుతున్నారని వెల్లడించారు. స్పేస్ సైంటిస్ట్ కావాలన్న ఆలోచన వారిలో నాటు కుందని, ఇదొక శుభ పరిణామమని ఉద్ఘాటించారు. ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే... ఒలింపియాడ్‌లో మన విద్యార్థుల ఘనత ‘‘చిన్నారుల్లో నూతన ఆవిష్కరణ పట్ల ఉత్సాహం పెంచడానికి ఇన్‌సై్పర్–మానక్ అభియాన్ ప్రారంభించాం. ఒక్కో పాఠశాల నుంచి ఐదుగురిని ఎంపిక చేశాం. లక్షలాది మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో చేరారు. చంద్రయాన్–3 తర్వాత వారి సంఖ్య రెట్టింపయ్యింది. స్పేస్ స్టార్టప్‌లు ఐదేళ్ల క్రితం కేవలం 50 ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 200 దాటేసింది. 21వ శతాబ్దంలో నూతన శక్తితో సైన్స్ పురోగమిస్తోంది. కొన్ని రోజుల క్రితం ఇంటర్నేషనల్ కెమిస్ట్రీ ఒలింపియాడ్‌లో మన విద్యార్థులు దేవేశ్ పంకజ్, సందీప్ కుచీ, దేవదత్ ప్రియదర్శి, ఉజ్వల్ కేసరి పతకాలు గెలుచుకున్నారు. దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చారు. ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్ లో మన విద్యార్థులు ఆరు పతకాలు సాధించారు. విప్లవాల మాసం ఆగస్టు ఆగస్టు రాబోతోంది. ఆగస్టు అంటే విప్లవాల మాసం. 18 ఏళ్ల స్వాతంత్య్ర సమర యోధుడు ఖుదిరాం బోస్‌ను ఆగస్టులోనే బ్రిటిష్ పాలకులు ఉరి తీశారు. లోకమాన్య బాల గంగాధర్ తిలక్ ఆగస్టు 1న మరణించారు. ఆగస్టు 8న గాంధీ నాయకత్వంలో క్విట్ఇండియా ఉద్యమం మొదలైంది. ఆగస్టు 15న మనకు స్వాతంత్య్రం వచ్చింది. దేశ విభజన కూడా ఇదే నెలలో జరిగింది. ప్రతిఏటా ఆగస్టు 14వ తేదీని ‘విభజన అకృత్యాల సంస్మరణ దినం’గా నిర్వహించుకుంటున్నాం. 1905 ఆగస్టు 7న స్వదేశీ ఉద్యమం ఆరంభమైంది. స్వదేశీ ఉత్పత్తులు వాడాలన్న పిలుపునకు అప్పటి ప్రజలు స్పందించారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఏటా ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం నిర్వహిస్తున్నాం. In the 124th episode of Mann Ki Baat, Prime Minister Narendra Modi says, "In Mann Ki Baat, once again, we will talk about the successes of the country, the achievements of the countrymen. Recently, there was a lot of discussion in the country about the return of Shubhanshu Shukla… pic.twitter.com/WcVQa0fXOG— ANI (@ANI) July 27, 2025అదే మనందరి సంకల్పం మన దేశం మరింత అభివృద్ధి చెందాలంటే స్థానిక ఉత్పత్తులు విరివిగా ఉపయోగించాలి. మన దేశంలో తయారైన వస్తువులే విక్రయించాలి. అవే కొనుక్కోవాలి. అదే మనందరి సంకల్పం కావాలి. ఎందుకంటే వాటి తయారీ కోసం మనం స్వేదం చిందించాం. కొన్నిసార్లు కొన్ని విషయాలు కొందరికి అసాధ్యంగా కనిపిస్తాయి. కానీ, మనమంతా ఒక్కటై పని చేస్తే అసాధ్యాలే సుసాధ్యాలవుతాయి. అందుకు తగిన ఉదాహరణ స్వచ్ఛ భారత్ మిషన్. ఈ కార్యక్రమానికి 11 ఏళ్లు పూర్తి కాబోతున్నాయి. ఇదొక ప్రజా ఉద్యమంగా మారింది. స్వచ్ఛతను ప్రజలు తమ బాధ్యతగా భావిస్తున్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ అవసరం ఇప్పటికీ ఉంది. 4,500 పట్టణాలు, నగరాలు ఇందులో భాగమయ్యాయి. 15 కోట్ల మందికిపైగా జనం పాలుపంచుకున్నారు. ఇది సాధారణ విషయం కాదు. ఒడిశాలో మాజీ నక్సలైట్ల విజయాలు స్ఫూర్తిదాయకం జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలో మాజీ నక్సలైట్లు చేపల పెంపకంలో అద్భుత విజయాలు సాధిస్తున్నారు. హింసను వీడి మత్స్య రంగంలో ప్రవేశించారు. క్లిష్టమైన పరిస్థితుల్లోనూ అభివృద్ధి దీపం వెలిగించవచ్చని నిరూపించారు. కొన్నిసార్లు దట్టమైన చీకటి నుంచే ప్రకాశవంతమైన వెలుగు ఉద్భవిస్తుంది. గతంలో తుపాకులు పట్టుకొన్న నక్సలైట్లు ఇప్పుడు వలలు చేతబూని చేపల వేట సాగిస్తున్నారు. చక్కటి ఆదాయం పొందుతూ బతుకులు మార్చుకుంటున్నారు. ఈ విజయ గాథలు అందరికీ స్ఫూర్తిదాయకం. -
ఇది అద్భుత క్షణం.. భార్య, కుమారుడిని హత్తుకుని శుభాంశు ఎమోషనల్
ఢిల్లీ: భారత అంతరిక్ష చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన అద్భుతమైన అధ్యాయానికి ఘనమైన ముగింపు లభించింది. మన వ్యోమగామి, వాయుసేన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా 18 రోజుల అంతరిక్ష యాత్రను విజయవంతంగా ముగించుకుని అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి క్షేమంగా తిరిగొచ్చారు. ఇక, తాజాగా శుభాంశు శుక్లా ఎట్టకేలకు తన కుటుంబాన్ని కలుసుకున్నారు. హూస్టన్‌లోని పునరావాస కేంద్రంలో భార్య కమ్నా, కుమారుడు కైశ్‌ను కలిసి ఎమోషనల్ అయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.హూస్టన్‌లోని పునరావాస కేంద్రంలో శుభాంశు శుక్లా.. తన కుటుంబ సభ్యులను కలిశారు. ఈ సందర్భంగా ఎమోషనల్‌గా భార్య, కుమారుడిని హత్తుకున్నారు. రెండు నెలల తర్వాత వారిని కలవడంతో శుభాంశ్ ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. దీనికి సంబంధించి ఫొటోలను శుభాంశు.. సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ సందర్భంగా తన ఆనందాన్ని.. పోస్టులో చెప్పుకొచ్చాడు. సోషల్ మీడియాలో పోస్టులో శుభాంశు.. ‘అంతరిక్షయానం అద్భుతం. చాలా రోజుల తర్వాత కుటుంబ సభ్యులను కలుసుకోవడం సైతం అంతే అద్భుతం. ఈ ప్రయాణం కోసం రెండు నెలలు క్వారంటైన్లో గడిపాను. ఈ సమయంలో దూరం నుంచి నా కుటుంబాన్ని చూడాల్సి వచ్చింది. భూమికి తిరిగివచ్చి ఫ్యామిలినీ హత్తుకున్నప్పుడు ఇంటికి వచ్చినట్లే అనిపిస్తోంది. కొన్నిసార్లు మనం బిజీగా ఉంటాం. మన జీవితాల్లోని వ్యక్తులు ఎంత ముఖ్యమైన వారో మర్చిపోతుంటాము. ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన వారిని కలిశాను. అంతరిక్ష ప్రయాణాలు మాయాజాలంగా అనిపిస్తాయి. అయితే మనుషుల వల్లే అవి అలా మారాయి’ అని ఎమోషనల్ అయ్యారు.Gp Capt Shubhanshu Shukla reunites with his family after returning from space ❤️🇮🇳 pic.twitter.com/yfENxJr7ed— ISRO Spaceflight (@ISROSpaceflight) July 16, 2025మరోవైపు, శుభాంశు సతీమణి కమ్నా స్పందిస్తూ.. ‘శుభాంశు సురక్షితంగా భూమిపైకి చేరుకున్నారు. ఈ అద్భుత ప్రయాణం తర్వాత తను తిరిగి మమ్మల్ని కలవడమే మాకు అతిపెద్ద సెలబ్రేషన్. ఇకపై తను మునుపటి జీవితాన్ని కొనసాగించడంపైనే దృష్టి నిలుపుతాం. అంతరిక్షంలో ఉన్న సమయంలో తను ఇంటి ఆహారాన్ని మిస్ కావాల్సి వచ్చింది. ఇంటికి వచ్చాక తనకు ఇష్టమైన ఆహారాన్ని వండేందుకు ఇప్పటికే ప్లాన్ చేసుకుంటున్నా అని’ ఆనందంతో పోస్టు పెట్టారు. Our hero has returned! 👨🚀Group Captain #ShubhanshuShukla's successful completion of the historic Axiom Mission 4 is a giant leap for India's space dreams and a powerful step toward Gaganyaan. The nation is filled with pride. 🚀🇮🇳 pic.twitter.com/rSEhnhjZ1v— Piyush Goyal (@PiyushGoyal) July 15, 2025 -
కబుర్లు చెప్తా.. కమ్మటి భోజనం పెడతా
లక్నో: అంతరిక్షరంగంలో భారత కీర్తిపతాకను అంతర్జాతీయ అంతరిక్షకేంద్రంలో ఎగరేసి పుడమికి తిరిగొచ్చిన వ్యోమగామి శుభాంశు శుక్లా రాక కోసం లక్నోలో ఆయన కుటుంబం ఎదురుచూస్తోంది. ఈ సందర్భంగా శుక్లా సతీమణి కామ్నా మీడియాతో మాట్లాడారు. ‘‘అద్వితీయమైన ఆయన అంతరిక్ష యాత్ర ముగింపు తర్వాత కుటుంబంతో ఎప్పుడు గడుపుతారా అని మేమంతా ఎదురు చూస్తున్నాం. ఆయన లక్నోకు రాగానే ఇంటి భోజనం రుచి చూపిస్తా. తినలేకపోయిన ఆయనకు ఎంతో ఇష్టమై న వంటకాలను కొసరి కొసరి వడ్డిస్తా’’ మా ఆరేళ్ల అబ్బాయి కియాశ్ సహా కుటుంబం మొత్తం సర దాగా గడుపుతాం’’ అని ఆయన భార్య కామ్నా చెప్పారు. ‘‘ఈయన వెళ్లిన వెంటనే నాకు ఫోన్ చేశా రు. సంభ్రమాశ్చర్యాలకు గురయ్యా. ఆయన గొంతు వినగానే ప్రాణం లేచొచ్చింది. అక్కడ ఆయన చేసిన శాస్త్రసాంకేతిక ప్రయోగాలపైనే మేమిద్దరం మాట్లాడుకున్నాం. భూమికి దూరంగా అంతెత్తులో గడపడం అసాధారణంగా ఉందని నాతో అనేవారు. అక్కడ ఉన్న ఈ 18 రోజుల్లో ఆయనతో జరిపిన ఈ ఫోన్‌కాల్ సంభాషణలు నా జీవితంలో మర్చిపోలే ను. ఆయన స్వదేశాను గమనం మా కుటుంబానికే కాదు యావత్ దేశానికి గర్వకారణం కావడం నాకెంతో నచ్చింది అని ఆమె అన్నారు. -
శుభ సప్తకం
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) లోకి అడుగు పెట్టిన తొలి భారతీయుడిగా శుభాంశు శుక్లా ఘనత సాధించారు. యాగ్జియం –4 మిషన్‌లో భాగంగా శుభాంశు చేపట్టిన అంతరిక్ష యాత్ర విజయవంతంగా ముగియటంతో ఇక ఇప్పుడు – ఐఎస్ఎస్లో ఉన్న ఈ 18 రోజుల్లోనూ ఆయన జరిపిన 7 ప్రధాన ప్రయోగాలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి మొదలైంది. భారత్ ఎంతో ప్రతిష్టాత్మకమైనదిగా భావిస్తున్న భవిష్యత్ మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్’కు ఇవి ఎంతో ఉపయుక్తమైనవి కావటం వలన కూడా ఈ ప్రయోగాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తిలో వివిధ జీవ, భౌతిక వ్యవస్థలను అధ్యయనం చేయటానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు వంటి ప్రసిద్ధ భారతీయ పరిశోధన సంస్థలు రూపొందించిన ఆ ప్రయోగాలు ఏమిటో చూద్దాం. 1 టార్డిగ్రేడ్ ఏంటివి?: టార్డిగ్రేడ్లు అంటే నీటి ఎలుగు బంట్లు. ఎనిమిది కాళ్లుండే సూక్ష్మజీవులు. ఇవి అధిక ఉష్ణోగ్రతలు, రేడియేషన్ వంటి తీవ్ర ప్రతికూల పరిస్థితులలో కూడా ఎక్కువ కాలం జీవించగలవు. ఏంటి ఉపయోగం?: టార్డిగ్రేడ్లు అంతరిక్షంలో ఎలా మనుగడ సాగిస్తాయో అర్థం చేసుకోవడం వల్ల అంతరిక్ష కార్యకలాపాల్లో వ్యోమగాముల రక్షణకు కొత్త వ్యూహాలను అభివృద్ధి చేయవచ్చు. శుభాంశు అంతరిక్షంలో భారత జాతి టార్డిగ్రేడ్లపై అధ్యయనం చేసి, అవి ఎలా మనుగడ సాగిస్తాయో, పునరుత్పత్తి చేస్తాయో, సూక్ష్మ గురుత్వాకర్షణకు (మైక్రోగ్రావిటీ) ఎలా స్పందిస్తాయో, రోజులు గడుస్తున్నకొద్దీ వాటిలో వచ్చే మార్పులు (ఏజింగ్ ప్యాటర్న్స్) పరిశీలించారు. ఈ అధ్యయనం వల్ల రక్షణ వ్యూహాలే కాకుండా.. అంతరిక్షంలో ఆహారాన్ని, జీవ నమూనాలను ఎలా నిల్వ చేయవచ్చో తెలుస్తుంది.2 మయోజెనిసిస్ఏంటిది?: మయోజెనిసిస్ అంటే కండరాల్లోని కణాల అభివృద్ధి/పెరుగుదల. దీర్ఘకాలిక అంతరిక్ష యాత్రల సమయంలో వ్యోమగాముల కండరాల బరువు తగ్గుతుంటుంది. తద్వారా కండరాలు బలహీనమవుతాయి.ఏంటి ఉపయోగం?: కండరాల్లో కణాలను సూక్ష్మ గురుత్వాకర్షణలో అధ్యయనం చేసి అవి ఎలా ప్రవర్తిస్తాయో, వాటిలో వచ్చే మార్పులేమిటో శుభాంశు నిశితంగా పరిశీలించారు. సూక్ష్మ గురుత్వాకర్షణలో కండరాల్లో కణాలు ఎలా ప్రవర్తిస్తాయో అర్థం చేసుకోవడం వల్ల వాటి బరువు తగ్గకుండా నివారణోపాయాలను కనిపెట్టటానికి, ఆరోగ్య పరిరక్షణకు ఈ అధ్యయనం తోడ్పడుతుంది.3 విత్తనాల పెరుగుదలఏంటిది?: అంతరిక్షంలోకి శుభాంశు పెసర, మెంతి విత్తనాలు తీసుకెళ్లి ట్రేలలో వాటిని ఉంచారు. ఏంటి ఉపయోగం?: సూక్ష్మ గురు త్వాకర్షణ ప్రభావం మొలకలపైనా, విత్తనాల పెరుగుదలపైనా ఎలా ఉంటుందో అధ్యయనం చేశారు. అంతరిక్షంలో మొక్కలను పెంచడం వల్ల దీర్ఘకాలిక మిషన్లలో వ్యోమగాము లకు స్థిరమైన ఆహార వనరు లభిస్తుంది.4 సైనోబ్యాక్టీరియాఏంటివి?: సైనోబ్యాక్టీరియా అనేవి ఆక్సిజన్‌ను, పోష కాలను ఉత్పత్తి చేయగల సూక్ష్మజీ వులు. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం భూమిపై మొట్టమొదట ప్రాణ వాయువును ఉత్పత్తి చేసిన జీవులు ఇవి.ఏంటి ఉపయోగం?: సూక్ష్మ గురుత్వాకర్షణలో సైనో బ్యాక్టీరియా ఎలా పెరుగుతుందో అర్థం చేసుకోవడం ద్వారా అంతరిక్ష కార్యకలాపాల కోసం ‘బయో రీజెనరేటివ్ లైఫ్ సపోర్ట్ వ్యవస్థ’లను అభివృద్ధి చేయవచ్చు. ఉన్న వనరులను రీ సైకిల్ చేసి ఆక్సిజన్, నీరు, ఆహారం వంటి వనరులను తయారు / ఉత్పత్తి చేయటం ద్వారా అంతరిక్షంలో మానవ మనుగడకు సహాయం చేసే కృత్రిమ వ్యవస్థలే ఈ బయో రీజెనరేటివ్ వ్యవస్థలు. ఇవి పర్యావరణ కాలుష్యాన్ని కూడా తగ్గిస్తాయి.5 మైక్రో అల్గేఏంటివి?: మంచినీరు, సముద్ర పర్యావరణ వ్యవస్థలలో కీలక పాత్ర పోషించే సూక్ష్మ, ఏకకణ జల జీవులనే సూక్ష్మ శైవలాలు (మైక్రో ఆల్గే) అంటారు. ఇవి పోషకాలను అందించగల ఆహారంగా స్వీకరించతగిన సూక్ష్మజీవులు. అలాగే బొగ్గు వంటి శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయమైన బయో ఇంధనంగానూ ఉపయోగపడతాయి.ఏంటి ఉపయోగం?: సూక్ష్మ గురుత్వాకర్షణలో సూక్ష్మ శైవలాలు ఎలా పెరుగుతాయో అర్థం చేసుకోవడం, వ్యోమగాములకు స్థిరమైన ఆహార వ్యవస్థలను అభివృద్ధి చేయటం ఈ అధ్యయన లక్ష్యం. అలాగే అంతరిక్షంలో ఇంధన సమస్యల పరిష్కారానికి కూడా ఇది దారి చూపుతుందని భావిస్తున్నారు.6 పంట విత్తనాలుఏంటిది?: ఈ ప్రయోగం ఆహార పంటల విత్తనాలపై సూక్ష్మగురుత్వాకర్షణ ప్రభావాన్ని పరిశీలించింది. ఏంటి ఉపయోగం?: శుభాంశు సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో పంట విత్తనాల పెరుగుదల, దిగుబడులపై అధ్యయనం చేశారు. దీర్ఘకాలిక అంతరిక్ష యాత్రలలో వ్యోమగాములకు పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించే విధానాలను తెలుసుకోవటానికి ఈ అధ్యయన ఫలితాలు ఉపకరిస్తాయి. 7 వాయేజర్ డిస్ప్లేలుఏంటివి?: కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు. ఈ ప్రయోగంతో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు అంతరిక్షంలో ఎలా పనిచేస్తాయి, వాటి వాడకం వల్ల వ్యోమగాములపై ఎలాంటి ప్రభావం ఉంటుందో శుభాంశు విశ్లేషించారు. ఏంటి ఉపయోగం?: సూక్ష్మ గురుత్వాకర్షణలో కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు వ్యోమగాముల కళ్లు, మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతాయి, ఎన్ని గంటల పాటు వాటిని వినియోగించవచ్చు, అంతరిక్ష అవసరాల కోసం ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు కావాలి.. వంటి విషయాలు తెలుసుకునేందుకు ఈ ప్రయోగం తోడ్పడుతుంది. -
శుభ ఆగమనం
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన అద్భుతమైన అధ్యాయానికి ఘనమైన ముగింపు లభించింది. మన వ్యోమగామి, వాయుసేన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా 18 రోజుల అంతరిక్ష యాత్రను విజయవంతంగా ముగించుకుని అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి క్షేమంగా తిరిగొచ్చారు. ఆయనతో పాటు యాగ్జియం–4 మిషన్ బృందంలోని మరో ముగ్గురు వ్యోమగాములను తీసుకుని స్పేస్ ఎక్స్ డ్రాగన్ ‘గ్రేస్’వ్యోమనౌక భారత కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 4:45 గంటలకు ఐఎస్ఎస్ నుంచి విడివడి నింగి నుంచి నేలకేసి సుదీర్ఘయానం ప్రారంభించడం తెలిసిందే.22.5 గంటల ప్రయాణం అనంతరం షెడ్యూల్ ప్రకారం అది మంగళవారం తెల్లవారుజామున 2.31 గంటలకు (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:02కు) అమెరికాలో దక్షిణ కాలిఫోరి్నయాలోని శాన్‌డీగో తీర సమీపంలో పసిఫిక్ సముద్ర జలాల్లో విజయవంతంగా దిగింది. తర్వాత కాసేపటికే ముందుగా అమెరికాకు చెందిన మిషన్ కెప్టెన్ పెగ్గీ వాట్సన్ డ్రాగన్ క్యాప్సూల్ నుంచి బయటికొచ్చారు. మిషన్ పైలట్‌గా వ్యవహరించిన 39 ఏళ్ల శుభాంశు, ఆ తర్వాత కొద్ది నిమిషాలకే నిండైన చిరునవ్వుల నడుమ బయటికి వచ్చి దేశవాసులను ఉద్దేశించి చేతులూపుతూ అభివాదం చేశారు. అప్పటిదాకా దేశవ్యాప్తంగా టీవీ తెరలకు అతుక్కుపోయి ఉత్కంఠభరితంగా వీక్షించిన ప్రజలంతా పెద్దపెట్టున హర్షధ్వానాలు చేశారు.భారత్‌మాతా కీ జై అంటూ ఆనందోత్సాహాలతో నినదించారు. శుభాంశు స్వస్థలమైన యూపీ రాజధాని లఖ్నవూలోనైతే సంబరాలు అంబరాన్నంటాయి. ఎవరిని చూసినా మిఠాయిలు పంచుకుంటూ, బాణసంచా కాలుస్తూ కన్పించారు. తనయుడు క్షేమంగా భూమికి తిరిగొచ్చిన క్షణాలను వీక్షించే క్రమంలో ఆయన తల్లిదండ్రులు ఆనందబాష్పాలు రాల్చారు. అమెరికాలోని ఫ్లోరిడాలో శుభాంశు భార్య కామ్నాది కూడా అదే పరిస్థితి! రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, విపక్ష నేతలు మొదలుకుని రాజకీయ తదితర రంగాల ప్రముఖలంతా శుభాంశును అభినందించారు.‘‘చరిత్రాత్మక అంతరిక్ష యాత్రను విజయవంతంగా ముగించుకుని భూమికి తిరిగొచ్చిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాను దేశవాసులందరితో కలిసి అత్యంత సాదరంగా స్వాగతిస్తున్నా’’అంటూ మోదీ హర్షం వెలిబుచ్చారు. వైద్యపరీక్షలు తదితరాల అనంతరం శుభాంశు బృందాన్ని వారం రోజుల పాటు క్వారెంటైన్‌కు తరలించారు. ఇస్రో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మానవసహిత అంతరిక్ష యాత్ర (గగన్‌యాన్)కు శుభాంశు ఐఎస్ఎస్ యానం భారీ ఊపునిచ్చింది. నాసా, ఇస్రో సంయుక్తంగా రూపొందించిన యాగ్జియం–4 మిషన్‌లో భాగంగా శుభాంశు, వాట్సన్‌తో పాటు స్లావోజ్ ఉజ్నాన్స్కీ విస్నియెవ్స్కీ (పోలండ్), టిబర్ కపు (హంగరీ) జూన్ 25న బయల్దేరి 26న ఐఎస్ఎస్ చేరడం తెలిసిందే. అక్కడ 18 రోజుల పాటు వారు వివిధ రకాలైన 60 ప్రయోగాలు నిర్వహించి తిరిగొచ్చారు. లఖ్‌నవూలో శుభాంశు తల్లిదండ్రులు, బంధుమిత్రుల ఆనందోత్సాహాలు విశేషాలు...⇒ శుభాంశు అంతరిక్ష, ఐఎస్ఎస్ యాత్రపై ఇస్రో రూ.550 కోట్లు వెచ్చించింది. ఈ యాత్రలో ఆయన సాధించిన అనుభవం 2027 కల్లా సాకారం చేసుకోవాలని తలపెట్టిన గగన్‌యాన్ ప్రాజెక్టుకు ఎంతగానో ఉపకరించనుంది.⇒ విస్నియెవ్స్కీ (పోలండ్), టిబర్ కపు (హంగరీ) కూడా తమ దేశాల నుంచి ఐఎస్ఎస్లో అడుగుపెట్టిన తొలి వ్యోమగాములుగా నిలిచారు.⇒ తనయుడు క్షేమంగా తిరిగి రావా లని ప్రార్థిస్తూ డ్రాగన్ క్యాప్సూల్ భూమిని చేరేదాకా ఆయన తల్లి ఆశాదేవి సుందరకాండ పారాయణం చేస్తూ గడిపారు.డ్రాగన్ వేగాన్ని తగ్గిస్తున్న ప్యారాచూట్లుఇలా తిరిగొచ్చారు...⇒ శుభాంశు బృందాన్ని తీసుకుని భారత కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 4:45 గంటలకు ఐఎస్ఎస్ నుంచి బయల్దేరిన డ్రాగన్ వ్యోమనౌక 22.5 గంటల పాటు ప్రయాణించి మంగళవారం భూమిని చేరింది. మధ్యాహ్నం 2:07 గంటలు: క్యాప్సూల్ భూ వాతావరణంలోకి ప్రవేశించే ముందు కక్ష్య నుంచి విడివడే ప్రక్రియ మొదలై 18 నిమిషాల పాటు కొనసాగింది. 2:27: సోలార్ ప్యానెళ్లు, రేడియేటర్లతో కూడిన ముందు భాగాన్ని క్యాప్సూల్ విజయవంతంగా వదిలించుకుంది. 2:33: తిరిగి క్యాప్సూల్ ముందు భాగాన్ని మూసివేసే ప్రక్రియ విజయవంతంగా జరిగింది. 2:43: గంటకు ఏకంగా 28 వేల కి.మీ. వేగంతో భూ వాతావరణంలో ప్రవేశించింది. ఆ రాపిడి ఫలితంగా ఏకంగా 1,600 నుంచి 1,900 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పుట్టుకొచ్చింది. అంతటి వేడినీ డ్రాగన్ క్యాప్సూల్ తాలూకు హీట్ షీల్డ్ విజయవంతంగా తట్టుకుంది. 2:44: విపరీతమైన వేగం కారణంగా స్పేస్ ఎక్స్ గ్రౌండ్ స్టేషన్‌తో క్యాప్సూల్‌కు 11 నిమిషాల పాటు సంబంధాలు తెగిపోయాయి. అదే సమయంలో దాని వేగాన్ని తగ్గించే ప్రక్రియ మొదలైంది. 2:54: మళ్లీ సిగ్నల్స్ కలిశాయి. 2:59: భూమికి 5 కి.మీ. ఎత్తులో రెండు ప్యారాచూట్లు తెరుచుకుని వేగాన్ని చాలావరకు తగ్గించాయి. 3:00: 2 కి.మీ. ఎత్తులో ఉండగా మరో నాలుగు ప్యారాచూట్లు విచ్చుకోవడంతో క్యాప్సూల్ వేగం గంటకు 118 మైళ్లకు దిగివచ్చింది.‘‘యాగ్జియం–4 మిషన్‌కు సారథ్యం వహించి సురక్షితంగా తిరిగొచ్చిన శుభాంశుకు, ఈ చరిత్రాత్మక మిషన్‌లో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ నా అభినందనలు’’ – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము‘‘ఐఎస్ఎస్లో అడుగుపెట్టిన తొలి భారతీయునిగా శుభాంశు సాధించిన ఘనత కోట్లాది మంది భారత యువత తమ కలలను నిజం చేసుకునేందుకు తిరుగులేని స్ఫూర్తిగా నిలిచింది. గగన్‌యాన్ ప్రాజెక్టు దిశగా ఈ యాత్ర ఓ తిరుగులేని మైలురాయి’’ – ప్రధాని మోదీశుభాంశు యాత్ర హైలైట్స్⇒ రాకేశ్ శర్మ అనంతరం 41 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అంతరిక్షంలో వెళ్లిన తొలి భారతీయునిగా శుభాంశు రికార్డు సృష్టించారు. ఐఎస్ఎస్లోకి అడుగు పెట్టిన తొలి భారతీయుడు కూడా ఆయనే. ఆయన అంతరిక్ష యాత్ర సాగిన తీరు... ⇒ 2024లో యాగ్జియం–4 వాణిజ్య మిషన్‌ను ఇస్రో, నాసా సంయుక్తంగా ప్రకటించాయి.⇒ 2025 మొదట్లోనే ప్రయోగం జరగాల్సింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పదేపదే వాయిదా పడుతూ వచ్చింది. ⇒ జూన్ 25న స్పేస్ ఎక్స్ ఫాల్కన్–9 రాకెట్ ద్వారా యాగ్జియం–4 మిషన్ అంతరిక్షానికి బయల్దేరింది. ⇒ 28 గంటల సుదీర్ఘ ప్రయాణం అనంతరం 26న విజయవంతంగా ఐఎస్ఎస్ను చేరింది. ⇒ అక్కడ శుభాంశు బృందం 18 రోజుల పాటు గడిపింది. ఆయన పలు కీలక ప్రయోగాలు చేయడంతో పాటు ప్రధాని మోదీ, విద్యార్థులు, తన తల్లిదండ్రులతో సంభాషించారు. ⇒ జూలై 13న శుభాంశు బృందం తిరుగు ప్రయాణ సన్నాహాలు మొదలయ్యా యి. ఐఎస్ఎస్లోని సహచరులు వారికి సాదరంగా వీడ్కోలు పలికారు. ⇒ జూలై 14 సాయంత్రం డ్రాగన్ వ్యోమనౌకలో శుభాంశు బృందం తిరుగు పయనమైంది. ⇒ జూలై 15 మధ్యాహ్నం 3:01 గంటలకు కాలిఫోర్నియా తీర సమీపంలో సురక్షితంగా దిగింది. -
YS Jagan Tweet: శభాష్ శుభాంశు..
-
శుభాంశు శుక్లాకు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి,తాడేపల్లి: భారత వ్యోమగామి శుభాంశు శుక్లాకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అంతరిక్ష కేంద్రం నుండి విజయవంతంగా తిరిగి రావటంపై హర్షం వ్యక్తం చేశారు. శుక్లాతోపాటు ఆయన టీమ్‌కు అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఇది భారత్ గర్వించదగిన సమయం అంటూ ట్వీట్ చేశారు. A proud moment for India! Congratulations to Group Captain #ShubhanshuShukla and the entire #Axiom4 crew on their successful return from the ISS. pic.twitter.com/hMqBlWSN4x— YS Jagan Mohan Reddy (@ysjagan) July 15, 2025యాక్సియం-4 మిషన్ ప్రయోగం విజయవంతమైంది. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా బృందం సురక్షితంగా భూమికి చేరుకుంది. 18 రోజులపాటు ఐఎస్ఎస్లో గడిపిన శుక్లా బృందం.. భారత కాలమానం ప్రకారం జులై 15 మధ్యాహ్నాం భూమ్మీదకు స్పేస్ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా సురక్షితంగా తిరిగొచ్చింది. దీంతో ఇస్రో వర్గాలు సంబురాల్లో మునిగితేలాయి. ఈ సందర్భంగా శుభాంశు శుక్లా బృందానికి వైఎస్ జగన్ శుభాంకాంక్షలు తెలిపారు. -
సాహో శుభాంశు శుక్లా.. సరికొత్త చరిత్ర సృష్టించిన ఇస్రో (ఫొటోలు)
-
శుభాంశు వచ్చేశాడు..
-
Shubhanshu Shukla: భూమిపైకి శుభాంశు శుక్లా
వాషింగ్టన్: అంతరిక్షంలో భారత కీర్తిపతాకను సమున్నతంగా ఎగరేసిన మన ముద్దుబిడ్డ శుభాంశు శుక్లా నింగి నుంచి సగర్వంగా నేలకు తిరిగొచ్చాడు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో అడుగుపెట్టిన తొలి భారతీయునిగా చెరిగిపోని రికార్డును తన పేరిట లిఖించుకున్న శుభాంశు.. మరో ముగ్గురు సహచర వ్యోమగాములతో కలిసి సురక్షితంగా భూపైకి చేరుకున్నారుయాక్సియం-4 మిషన్ లో భాగంగా... అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) వెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా, మరో ముగ్గురు వ్యోమగాములు భూమిపైకి చేరుకున్నారు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 2.50 నిమిషాలకు కాలిఫోర్నియా సమీపంలోని సముద్ర జలాల్లో ల్యాండింగ్ అయ్యారు. డ్రాగన్ స్పేస్ క్యాప్స్‌లో భూమి మీదకు చేరుకున్నారు. వ్యోమగాములను ఏడు రోజుల పాటు క్వారంటైన్‌కు తరలించేందుకు స్పేస్ ఎక్స్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఐఎస్ఎస్ నుంచి ఘనంగా వీడ్కోలు ఐఎస్ఎస్లోని ఏడుగురు సహచర వ్యోమగాములు శుభాంశు బృందానికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఆ సందర్భంగా పరస్పర కౌగిలింతలు, కరచాలనాలు ముగిసిన అనంతరం వాతావరణం ఉద్వేగపూరితంగా మారింది. 18 రోజుల పాటు కలిసి గడిపిన క్షణాలను అందరూ ఆనందంగా నెమరేసుకున్నారు. ముఖ్యంగా శుభాంశు రుచి చూపిన క్యారెట్, పెసరపప్పు హల్వాను ఎన్నటికీ మర్చిపోలేమని సహచరులు చెప్పుకొచ్చారు. జూన్ 25న శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర ప్రారంభంశుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర జూన్ 25, 2025న ప్రారంభమైంది. అమెరికాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్-9 రాకెట్ ద్వారా శుక్లా బృందం అంతరిక్షంలోకి వెళ్లింది. 28 గంటల ప్రయాణం తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లోకి ప్రవేశించారు. అక్కడ పైలట్ శుక్లా నేతృత్వంలోని గ్రూప్ మొత్తం 60 రకాల శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించింది. ఇందులో శుక్లా ఒక్కరే స్వయంగా 7 ప్రయోగాలు నిర్వహించారు. ఫ్లోటింగ్ వాటర్ బబుల్ ఐఎస్ఎస్లో 60కి పైగా ప్రయోగాలు శుభాంశు బృందం ఐఎస్ఎస్లో 18 రోజులు గడిపింది. ఆ క్రమంలో 60 కీలక ప్రయోగాలు చేపట్టింది. అంతరిక్షంలో జీరో గ్రావిటీ పరిస్థితుల్లో మానవ కండరాలకు కలిగే నష్టంపై శుక్లా అధ్యయనం చేశారు. మానవ జీర్ణవ్యవస్థ ఖగోళంలో ఎలా పని చేస్తుందనే అంశంపై భారత విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఒక వీడియోను ఆయన రూపొందించారు. దాంతోపాటు నలుగురు వ్యోమగాముల బృందం తమ మానసిక స్థితిగతులపైనా ప్రయోగాలు చేసి చూసింది. ఆ క్రమంలో ఫ్లోటింగ్ వాటర్ బబుల్ తయారు చేసి అందులో గడిపింది. అది అద్భుతమైన అనుభవమని శుభాంశు గుర్తు చేసుకున్నారు. ‘‘ఐఎస్ఎస్లో ప్రతి క్షణాన్నీ పూర్తిగా ఆస్వాదించా. ముఖ్యంగా కిటికీ పక్కన కూచుని కిందకు చూడటాన్ని. బహుశా నా జీవితంలోకెల్లా అత్యంత అద్భుతమైన అనుభూతి అది’’ అని చెప్పారు. అంతరిక్షంలో వ్యవసాయం దిశగా కూడా వ్యోమగాములు పలు కీలక పరీక్షలు జరిపారు.76 లక్షల మైళ్లు..288 భూ ప్రదక్షిణలు శుభాంశు బృందం ఐఎస్ఎస్లో గడిపిన 18 రోజుల్లో భూమి చుట్టూ ఏకంగా 76 లక్షల మైళ్లకు పైగా ప్రయాణించింది. ఆ క్రమంలో 288 సార్లు భూప్రదక్షిణలు చేసింది. నవభారత శకమిది శుభాంశు భావోద్వేగం భూమికి తిరుగు ప్రయాణమయ్యే ముందు శుభాంశు ఐఎస్ఎస్లో వీడ్కోలు ప్రసంగం చేశారు. 41 ఏళ్ల ముందు రాకేశ్ శర్మ రూపంలో తొలి భారతీయుడు అంతరిక్షంలో కాలు పెట్టిన క్షణాలను, అక్కడినుంచి భారత్ కనిపించిన తీరును వర్ణించిన వైనాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. ‘‘మా తిరుగు ప్రయాణం సందర్భంగా ఈ రోజు ఆకాశం నుంచి భారత్ ఎలా కనిపిస్తుందో చూడాలని మా బృందమంతా ఉత్సాహపడుతోంది. నేటి భారత్ ఘనమైన ఆకాంక్షల భారత్. నిర్భయ భారత్. సగర్వంగా తలెత్తుకుని సాగుతున్న భారత్. అందుకే నేడు కూడా నా దేశం మిగతా ప్రపంచమంతటి కంటే మిన్నగా (సారే జహా సే అచ్ఛా) కనిపిస్తోందని చెప్పగలను’’ అంటూ నాడు రాకేశ్ శర్మ చేసిన వ్యాఖ్యలను శుభాంశు పునరుద్ఘాటించారు. అక్కడి సహచరులపై శుభాంశు ఈ సందర్భంగా ప్రశంసల జల్లు కురిపించారు. ‘‘ఈ యాత్ర ఇంత అద్భుతంగా సాగుతుందని జూన్ 25న ఫాల్కన్–9 రాకెట్ ద్వారా అంతరిక్షానికి పయనమయ్యే క్షణాల్లో నేనస్సలు ఊహించలేదు! ఇదంతా ఇదుగో, ఇక్కడ నా వెనక నుంచున్న ఈ అద్భుతమైన వ్యక్తుల వల్లే సాధ్యమైంది. ఈ యాత్రను మా నలుగురికీ అత్యంత ప్రత్యేకమైనదిగా మార్చింది వీళ్లే. అంకితభావంతో కూడిన ఇలాంటి అద్భుతమైన వృత్తి నిపుణులతో కలిసి పని చేయడం నిజంగా మరచి పోలేని అనుభూతి’’ అంటూ హర్షం వెలిబుచ్చారు. -
వెల్ కమ్ హోమ్ శుక్లా..
-
నీ రాక కోసం.. శుభాంశు ఆగమనం నేడే
వాషింగ్టన్: అంతరిక్షంలో భారత కీర్తిపతాకను సమున్నతంగా ఎగరేసిన మన ముద్దుబిడ్డ శుభాంశు శుక్లా నింగి నుంచి సగర్వంగా నేలకు తిరిగొస్తున్నాడు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో అడుగుపెట్టిన తొలి భారతీయునిగా చెరిగిపోని రికార్డును తన పేరిట లిఖించుకున్న శుభాంశు.. మరో ముగ్గురు సహచర వ్యోమగాములతో కలిసి అక్కడ రెండున్నర వారాలకు పైగా గడిపిన విషయం తెలిసిందే. స్పేస్ఎక్స్ డ్రాగన్ ‘గ్రేస్’ వ్యోమనౌక భారత కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 4.45 గంటలకు శుభాంశు బృందాన్ని తీసుకుని భూమికి తిరుగు ప్రయాణమైంది. 22 గంటల 15 నిమిషాలకు పైగా ప్రయాణించిన అనంతరం మంగళవారం మధ్యాహ్నం 3.01 గంటలకు అమెరికాలోని కాలిఫోరి్నయా తీర సమీపంలో పసిఫిక్ మహాసముద్ర జలాల్లో దిగనుంది. ఆ వెంటనే వారికి వైద్యపరీక్షలు నిర్వహించి క్వారంటైన్‌కు తరలిస్తారు. అంతరిక్షంలోని సూక్ష్మ గురుత్వాకర్షణ పరిస్థితుల నుంచి నుంచి భూ వాతావరణానికి అలవాటు పడేదాకా శుభాంశు బృందాన్ని వారం రోజుల పాటు ఏకాంతంలో ఉంచుతారు. వైద్య పరీక్షలు తదితరాలు నిర్వహించిన అనంతరం వారు బయటి ప్రపంచంలోకి అడుగు పెడతారు. ఈ నేపథ్యంలో శుభాంశు రాక కోసం దేశమంతా నిలువెల్లా కనులు చేసుకుని ఆనందోత్సాహాలతో ఉత్కంఠగా వేచిచూస్తోంది. తిరిగొచ్చేది ఇలా... నాసా, ఇస్రో సంయుక్తంగా చేపట్టిన యాగ్జియం–4 మిషన్‌లో భాగంగా భారత వ్యోమగామి, వాయుసేన గ్రూప్ కెప్టెన్ శుభాంశుతో పాటు పెగ్గీ వాట్సన్ (అమెరికా), స్లావోజ్ ఉజ్నాన్స్కీ విస్నియెవ్స్కీ (పోలండ్), టిబర్ కపు (హంగరీ) జూన్ 25న ఐఎస్ఎస్కు బయల్దేరడం తెలిసిందే. దాదాపు 28 గంటల ప్రయాణం అనంతరం వారు 26న విజయవంతంగా ఐఎస్ఎస్లోకి ప్రవేశించారు. అక్కడ 18 రోజులు (443 గంటలు) గడిపారు. ఆ క్రమంలో 60 కీలక ప్రయోగాలు చేశారు. → సోమవారం సాయంత్రం షెడ్యూల్ కంటే 10 నిమిషాలు ఆలస్యంగా సాయంత్రం 4.45 గంటలకు శుభాంశు బృందం తిరుగు ప్రయాణం మొదలైంది. → అంతకు రెండు గంటల ముందు వారు ఐఎస్ఎస్ నుంచి ఒకరి తర్వాత ఒకరుగా డ్రాగన్ వ్యోమనౌకలోకి ప్రవేశించారు. నలుగురూ స్పేస్ సూట్లు ధరించాక వ్యోమనౌకను ఐఎస్ఎస్తో అనుసంధానించే హాచ్ను మధ్యాహ్నం 2.37కు విజయవంతంగా మూసేశారు. → తర్వాత ప్రయాణానికి తుది సన్నాహాలు దాదాపు రెండు గంటల పాటు సాగాయి. అంతరిక్షం నుంచి భూ వాతావరణంలోకి ప్రవేశించే క్షణాల్లో విపరీతమైన రాపిడికి పుట్టుకొచ్చే 1,600 డిగ్రీ సెల్సియస్ వేడిని తట్టుకునేందుకు స్పేస్‌క్రాఫ్ట్‌కు బిగించిన హీట్ షీల్డ్‌ను సరిచూడటం వంటివి పూర్తయ్యాక డ్రాగన్ ముందు భాగాన్ని ఐఎస్ఎస్ నుంచి విడదీశారు. → అనంతరం సాయంత్రం 4.45కు వ్యోమనౌక భూమికి పయనమైంది. → భూమికి దాదాపు 350 కి.మీ. ఎత్తులో ఉండగా సర్వీస్ మాడ్యూల్ నుంచి డ్రాగన్ విడిపోయింది. → భూమి చుట్టూ పలుమార్లు చక్కర్లు కొడుతూ ప్రయాణ దిశ తదితరాలను సరిచేసుకున్న అనంతరం నిర్ధారిత ప్రాంతంలో అది భూ వాతావరణంలోకి ప్రవేశించనుంది. → క్రమంలో ముందుగా దాని ముందు భాగాన్ని మూసేస్తారు. హీట్‌షీల్డ్ కిందకు ఉండేలా క్యాప్సూల్‌ను సరిచేస్తారు. → విపరీతమైన వేగంతో దూసుకొచ్చే డ్రాగన్‌ను నెమ్మదింపజేసేందుకు భూమికి సుమారు 5.7 కి.మీ. ఎత్తున రెండు రెండు ప్యారాచూట్లు తెరుచుకుంటాయి. అనంతరం 1.8 కి.మీ. ఎత్తున మరో నాలుగు ప్యారాచూట్లు విచ్చుకుంటాయి. → క్యాప్సూల్ వాతావరణంలోకి పునఃప్రవేశించే క్రమంలో పుట్టుకొచ్చే అత్యంత ప్రతికూల పరిస్థితులను తట్టుకునేలా ప్యారాచూట్లను అత్యంత దృఢంగా ఉండే నైలాన్, కెవ్లర్‌లతో తయారు చేస్తారు. → మధ్యాహ్నం 3.01 గంటలకు క్యాప్సూల్ పసిఫిక్ జలాల్లో దిగుతుంది. → అప్పటికే అక్కడ సిద్ధంగా ఉండే స్పెషల్ రికవరీ షిప్ వెంటనే డ్రాగన్ క్యాప్సూల్‌ను చేరుకుంటుంది. → దాన్ని షిప్‌లోకి చేర్చిన అనంతరం శుభాంశుతో పాటు మిగతా ముగ్గురు వ్యోమగాములు ఒక్కొక్కరిగా అందులోంచి బయటికి వస్తారు. → అనంతరం షిప్ మీదే వారందరికీ తొలి దఫా పలురకాల వైద్యపరీక్షలు నిర్వహిస్తారు. → అనంతరం వారిని హెలికాప్టర్లో ముందుగా తీరానికి, అనంతరం నాసా కార్యాలయంలోని క్వారంటైన్ కేంద్రానికి తరలిస్తారు.ఐఎస్ఎస్ నుంచి ఘనంగా వీడ్కోలు ఐఎస్ఎస్లోని ఏడుగురు సహచర వ్యోమగాములు శుభాంశు బృందానికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఆ సందర్భంగా పరస్పర కౌగిలింతలు, కరచాలనాలు ముగిసిన అనంతరం వాతావరణం ఉద్వేగపూరితంగా మారింది. 18 రోజుల పాటు కలిసి గడిపిన క్షణాలను అందరూ ఆనందంగా నెమరేసుకున్నారు. ముఖ్యంగా శుభాంశు రుచి చూపిన క్యారెట్, పెసరపప్పు హల్వాను ఎన్నటికీ మర్చిపోలేమని సహచరులు చెప్పుకొచ్చారు. ఫ్లోటింగ్ వాటర్ బబుల్ ఐఎస్ఎస్లో 60కి పైగా ప్రయోగాలు శుభాంశు బృందం ఐఎస్ఎస్లో 18 రోజులు గడిపింది. ఆ క్రమంలో 60 కీలక ప్రయోగాలు చేపట్టింది. అంతరిక్షంలో జీరో గ్రావిటీ పరిస్థితుల్లో మానవ కండరాలకు కలిగే నష్టంపై శుక్లా అధ్యయనం చేశారు. మానవ జీర్ణవ్యవస్థ ఖగోళంలో ఎలా పని చేస్తుందనే అంశంపై భారత విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఒక వీడియోను ఆయన రూపొందించారు. దాంతోపాటు నలుగురు వ్యోమగాముల బృందం తమ మానసిక స్థితిగతులపైనా ప్రయోగాలు చేసి చూసింది. ఆ క్రమంలో ఫ్లోటింగ్ వాటర్ బబుల్ తయారు చేసి అందులో గడిపింది. అది అద్భుతమైన అనుభవమని శుభాంశు గుర్తు చేసుకున్నారు. ‘‘ఐఎస్ఎస్లో ప్రతి క్షణాన్నీ పూర్తిగా ఆస్వాదించా. ముఖ్యంగా కిటికీ పక్కన కూచుని కిందకు చూడటాన్ని. బహుశా నా జీవితంలోకెల్లా అత్యంత అద్భుతమైన అనుభూతి అది’’ అని చెప్పారు. అంతరిక్షంలో వ్యవసాయం దిశగా కూడా వ్యోమగాములు పలు కీలక పరీక్షలు జరిపారు.76 లక్షల మైళ్లు..288 భూ ప్రదక్షిణలు శుభాంశు బృందం ఐఎస్ఎస్లో గడిపిన 18 రోజుల్లో భూమి చుట్టూ ఏకంగా 76 లక్షల మైళ్లకు పైగా ప్రయాణించింది. ఆ క్రమంలో 288 సార్లు భూప్రదక్షిణలు చేసింది. నవభారత శకమిది శుభాంశు భావోద్వేగం భూమికి తిరుగు ప్రయాణమయ్యే ముందు శుభాంశు ఐఎస్ఎస్లో వీడ్కోలు ప్రసంగం చేశారు. 41 ఏళ్ల ముందు రాకేశ్ శర్మ రూపంలో తొలి భారతీయుడు అంతరిక్షంలో కాలు పెట్టిన క్షణాలను, అక్కడినుంచి భారత్ కని్పంచిన తీరును వరి్ణంచిన వైనాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. ‘‘మా తిరుగు ప్రయాణం సందర్భంగా ఈ రోజు ఆకాశం నుంచి భారత్ ఎలా కని్పస్తుందో చూడాలని మా బృందమంతా ఉత్సాహపడుతోంది. నేటి భారత్ ఘనమైన ఆకాంక్షల భారత్. నిర్భయ భారత్. సగర్వంగా తలెత్తుకుని సాగుతున్న భారత్. అందుకే నేడు కూడా నా దేశం మిగతా ప్రపంచమంతటి కంటే మిన్నగా (సారే జహా సే అచ్ఛా) కనిపిస్తోందని చెప్పగలను’’ అంటూ నాడు రాకేశ్ శర్మ చేసిన వ్యాఖ్యలను శుభాంశు పునరుద్ఘాటించారు. అక్కడి సహచరులపై శుభాంశు ఈ సందర్భంగా ప్రశంసల జల్లు కురిపించారు. ‘‘ఈ యాత్ర ఇంత అద్భుతంగా సాగుతుందని జూన్ 25న ఫాల్కన్–9 రాకెట్ ద్వారా అంతరిక్షానికి పయనమయ్యే క్షణాల్లో నేనస్సలు ఊహించలేదు! ఇదంతా ఇదుగో, ఇక్కడ నా వెనక నుంచున్న ఈ అద్భుతమైన వ్యక్తుల వల్లే సాధ్యమైంది. ఈ యాత్రను మా నలుగురికీ అత్యంత ప్రత్యేకమైనదిగా మార్చింది వీళ్లే. అంకితభావంతో కూడిన ఇలాంటి అద్భుతమైన వృత్తి నిపుణులతో కలిసి పని చేయడం నిజంగా మరచి పోలేని అనుభూతి’’ అంటూ హర్షం వెలిబుచ్చారు. కలుద్దాం! అతి త్వరలో భూమిపై కలుద్దాం – ఐఎస్ఎస్ నుంచిబయల్దేరే ముందు శుభాంశు శుభాంశూ... సుస్వాగతం ‘‘యాగ్జియం–4 స్పేస్ మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుని తిరిగొస్తున్న శుభాంశుకు హార్దిక స్వాగతం. ఆయన రాక కోసం దేశమంతా ఎనలేని ఆనందోత్సాహాలతో, అత్యంత ఉత్సుకతతో ఎదురుచూస్తోంది. – కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్రసింగ్ -
సారే జహాసె అచ్ఛా ఇండియా
న్యూఢిల్లీ: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్ఎస్) సోమవారం వీడ్కోలు పలుకబోతున్నారు. ఐఎస్ఎస్కు చేరుకున్న మొట్టమొదటి ఇండియన్ అస్ట్రోనాట్‌గా చరిత్ర సృష్టించిన శుక్లా 18 రోజుల తన అంతరిక్ష యాత్ర ముగించుకొని సహచర వ్యోమగాములతో కలిసి భూమిపైకి తిరిగిరాబోతున్నారు. యాక్సియోమ్ మిషన్–4(ఏఎక్స్–4) ముగింపు దశకు చేరుకోవడంతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఆదివారం ప్రత్యేక వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శుభాంశు శుక్లా చివరి సందేశం ఇచ్చారు. ‘‘భారతదేశం ఈరోజు అంతరిక్షం నుంచి నిర్భయంగా, పూర్తి విశ్వాసంతో సగర్వంగా కనిపిస్తోంది. సారే జహాసె ఆచ్ఛా ఇండియా. ఇదొక అద్భుతమైన, నమ్మశక్యంకాని ప్రయాణం. ఐఎస్ఎస్లో అంతరిక్ష ప్రయోగాల్లో ఈరోజు నా వ్యక్తిగత అధ్యాయం ముగిసింది. కానీ, భారతీయ అంతరిక్ష సంస్థ ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది. మనమంతా కలిసి పని చేస్తే అనుకున్నది సాధించగలం. భవిష్యత్తులో మరెన్నో ఘన విజయాల కోసం మనం ఐక్యంగా కృషి చేయాలి. పరస్పరం సహకరించుకోవాలి. ఈ ప్రయోగం సఫలం కావడానికి, నేను ఇక్కడికి చేరుకోవడానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఐఎస్ఎస్లో నిష్ణాతులైన సహచర వ్యోమగాములతో కలిసి పనిచేయడం మర్చిపోలేని అనుభవం. వారు నా అంతరిక్ష యాత్రను అందమైన అనుభూతిగా మార్చారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి మన భూమిని వీక్షించడం ఎన్నో గొప్ప జ్ఞాపకాలను మిగిల్చింది. భూమిని చూసిన ప్రతిసారీ మాయజాలాన్ని చూస్తున్నట్టే ఉంది. నాకు అన్ని విధాలా మద్దతుగా నిలిచిన ఇస్రో, నాసా సైంటిస్టులకు కృతజ్ఞతలు. ఇలాంటి అంతరిక్ష యాత్రలు కేవలం శాస్త్రీయ పరిశోధనలకే కాకుండా మన దేశాలకు, మానవాళి ప్రగతికి తోడ్పడతాయి’’ అని శుభాంశు శుక్లా ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. సహచర వ్యోమగాములు ఆయనను ఆలింగనం చేసుకున్నారు. శుభాంశు శుక్లాతోపాటు అమెరికాకు చెందిన పెగ్గీ విట్సన్, పోలాండ్‌కు చెందిన సావోజ్ ఉజ్నాన్స్కీ–విస్నీవ్స్కీ, హంగేరీకి చెందిన టిబోర్ కపు సైతం మాట్లాడారు. తమ అనుభవాలు పంచుకున్నారు. → ఏఎక్స్–4 మిషన్‌లో భాగంగా గత నెల 26న అమెరికాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి నలుగురు వ్యోమగాములు శుభాంశు శుక్లా, పెగ్గీ విట్సన్, సావోజ్ ఉజ్నాన్స్కీ–విస్నీవ్స్కీ, టిబోర్ కపు బయలుదేరిన సంగతి తెలిసిందే. → ఐఎస్ఎస్ నుంచి వీరు ఇప్పటిదాకా భూగోళాన్ని 250 సార్లు చుట్టేశారు. భూమి చుట్టూ 96,56,064 కిలోమీటర్లు ప్రయాణించారు. → అంతరిక్ష కేంద్రంలో 60 రకాల శాస్త్రీయ ప్రయోగాల్లో పాలుపంచుకున్నారు. అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి కీలకమైన సమాచారం అందించారు. → స్పేస్ఎక్స్ డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌లో ఐఎస్ఎస్ నుంచి శుభాంశు శుక్లా, పెగ్గీ విట్సన్, సావోజ్ ఉజ్నాన్స్కీ–విస్నీవ్స్కీ, టిబోర్ కపు భూమిపైకి తిరిగిరాబోతున్నారు. వారి రిటర్న్ షెడ్యూల్‌ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అధికారికంగా ధ్రువీకరించింది. → భారత అంతరిక్ష ప్రయోగాల్లో శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా, ఐఎస్ఎస్కు చేరుకున్న మొదటి భారతీయుడిగా ఆయన రికార్డుకెక్కారు. ఆయన ప్రయా ణం కొత్త తరం భారతీయ శాస్త్రవేత్తలకు, అంతరిక్ష ఔత్సాహికులకు స్ఫూర్తిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.ఘనస్వాగతానికి ఏర్పాట్లు→ అంతరిక్ష యాత్ర పూర్తికావడంతో నలుగురు వ్యోమగాములు భారత కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 2.25 గంటలకు ఐఎస్ఎస్ నుంచి స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌకలోకి చేరుకుంటారు. ప్రి–ఫ్లైట్ తనిఖీలు నిర్వహిస్తారు. → అమెరికాలోని కాలిఫోరి్నయా సమీపంలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు పసిఫిక్ సముద్ర తీరంలో నలుగురు వ్యో మగాములు భూమిపై దిగే అవకాశం ఉంది. → అమెరికాలో ఏడు రోజుల క్వారంటైన్ తర్వాత స్వదేశానికి చేరుకొనే శుభాంశు శుక్లాకు ఘన స్వాగతం పలకడానికి ఆయన కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో స్వాగత ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
ఈ నెల 15న శుభాంశు శుక్లా రాక
న్యూఢిల్లీ: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో సహచరులతో కలిసి పరిశోధనల్లో నిమగ్నమైన భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా పునరాగమనానికి సమయం ఆసన్నమైంది. ఆయన ఈ నెల 14న ఐఎస్ఎస్ నుంచి బయలుదేరి, 15వ తేదీన భూమిపైకి చేరుకోబోతున్నారు. శుభాంశు శుక్లాతోపాటు మరో ముగ్గురు వ్యోమగాములు పెగ్గీ విట్సన్, స్లావోజ్ ఉజ్నాన్స్కీ–విస్నివ్స్కీ, టిబోర్ కపు భారత కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 4.35 గంటలకు ఐఎస్ఎస్ నుంచి వేరుపడతారని(అన్‌డాకింగ్), అనంతరం క్రూ డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌లో భూమి దిశగా ప్రయాణం సాగిస్తారని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ఒక ప్రకటనలో వెల్లడించింది. మంగళవారం సాయంత్రం 3 గంటలకు అమెరికాలోని కాలిఫోర్నియా తీరంలో భూమిపై అడుగు పెడతారని తెలియజేసింది. శుభాంశు శుక్లాతోపాటు ఇతర వ్యోమగాములు భూమికిపైకి తిరిగివచి్చన తర్వాత వారం రోజులపాటు క్వారంటైన్లో ఉంటారు. సైంటిస్టులు వారికి భిన్నరకాల పరీక్షలు నిర్వహిస్తారు. భూవాతావరణానికి పూర్తిస్థాయిలో అలవాటు పడిన తర్వాత వ్యోమగాములు బాహ్య ప్రపంచంలోకి వస్తారు. స్పేస్ఎక్స్ యాగ్జియం–4 మిషన్‌లో భాగంగా నలుగురు వ్యోమగాములు గత నెలలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న సంగతి తెలిసిందే. -
హల్వాదే హవా
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో రెండు వారాలుగా ఎటు చూసినా భారతీయతే ఉట్టిపడుతోంది. తన కుశాగ్రబుద్ధి, మానసిక స్థైర్యం, పైలట్ నైపుణ్యాలతో ఇప్పటికే యాగ్జియం–4 మిషన్‌లోని సహచరులను అబ్బురపరిచిన భారత వ్యోమగామి, వాయుసేన గ్రూప్కెపె్టన్ శుభాంశు శుక్లా తాజాగా భారతీయ రుచులతో వారితో పాటు ఐఎస్ఎస్లోని మిగతా సహచరుల మనసు కూడా దోచుకున్నారు! తనతో పాటు ఐఎస్ఎస్లోకి వెంట తీసుకెళ్లిన క్యారెట్ హల్వాను వారితో పంచుకున్నారు. రెండు వారాలుగా ఊపిరి సలపని పనులతో తలమునకలుగా ఉన్న వ్యోమగాములంతా శుక్రవారం ఆటవిడుపుగా, సరదా సరదాగా గడిపారు. చివరగా భోజనంలోకి నచ్చిన రుచులను తనివితీరా ఆస్వాదించారు. రొయ్యల వేపు డు స్టార్టర్‌తో మొ దలుపెట్టి చవులూరించే చికెన్ వంటకాల దాకా పలురకాలను ఆరగించా రు. చివర్లో శుభాంశు వడ్డించిన క్యారె ట్ హల్వా, పెసరప ప్పు హల్వా విందుకే హైలైట్‌గా నిలిచా యి. ఇంతటి రుచి ఇంతకు ముందెన్న డూ ఎరగమంటూ సహచరులంతా ఆయన్ను మెచ్చుకున్నారు. హల్వాను జీవితంలో మర్చిపోలేనని వ్యోమగామి జానీ కిమ్ చెప్పుకొచ్చారు. రుచిలో తేడా రాకుండా దీర్ఘకాలం పాటు నిల్వ ఉండేలా ఆ మిఠాయిలను ఇస్రో, డీఆర్డీవో శుభాంశు కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేశాయి. శుభాంశును అలా కాపాడుకున్నాం: ఇస్రో చీఫ్ రాకేశ్ శర్మ తర్వాత 41 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం అంతరిక్షంలో అడుగుపెట్టిన, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లోకి ప్రవేశించిన తొలి భారతీయునిగా శుభాంశు పేరు కొద్ది వారాలుగా దేశమంతటా మార్మోగిపోతోంది. యువతతో పాటు దేశంలోని బాల బాలికలంతా ఆయనను ఓ హీరోగా, తమ స్ఫూర్తిప్రదాతగా చూస్తున్నారు. ఇస్రో అప్రమత్తంగా వ్యవహరించబట్టి సరిపోయింది గానీ, లేదంటే ఇన్ని ఘనతలకు కారణమైన యాగ్జియం అంతరిక్ష యాత్ర ఆరంభమైన కాసేపటికే విషాదాంతమయ్యేదే! ఒళ్లు గగుర్పొడిచే ఈ వాస్తవాన్ని స్వయానా ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ బయట పెట్టారు. జూన్ ప్రథమార్ధంలో యాత్ర పలుమార్లు వాయిదా పడటం తెలిసిందే. ఆ క్రమంలో జూన్ 11 నాటి ప్రయోగాన్ని ఒక్క రోజు ముందు ఇస్రో పట్టుబట్టి ఆపించింది. ‘‘ఫాల్కన్–9 రాకెట్ తాలూకు బూస్టర్‌లో లీకేజీలను, పలు పగుళ్లను ఇస్రో బృందం జూన్ 10 సాయంత్రం గమనించింది. అప్పటికప్పుడు చర్చించి ప్రయోగాన్ని ఆపాలని నా సారథ్యంలోని ఇస్రో బృందం నిర్ణయం తీసుకుంది. లేదంటే యాగ్జియం–4 ప్రయోగం విషాదాంతం అయ్యేదేమో! అలాకాకుండా చూడటం ద్వారా మన శుభాంశును, యాగ్జి యం మిషన్‌ను కాపాడుకున్నాం’’అని తాజా గా ఓ కార్యక్రమంలో ఇస్రో చీఫ్ వివరించారు. ‘‘మేం మరీ అతిగా స్పందిస్తున్నామని స్పేస్ ఎక్స్ బృందం తొలుత నిందించింది. అయినా మేం పట్టుబట్టి ప్రయోగాన్ని నిలిపేయించాం. ఫాల్కన్ రాకెట్లో పగుళ్లను మర్నాడు స్పేస్ ఎక్స్ ఇంజనీర్లు ధ్రువీకరించారు’’అని తెలిపారు. నాసా, ఇస్రో సంయుక్త ప్రాజె క్టైన యాగ్జియం–4 జూన్ 26న విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకెళ్లడం తెలిసిందే.కుటుంబంతో శుభాంశు మాటామంతి శుభాంశు శుక్రవారం లఖ్‌నవూలోని తన కుటుంబసభ్యులతో మాట్లాడారు. తను ప్రయోగాలన్నీ దిగి్వజయంగా పూర్తి చేసి సురక్షితంగా తిరిగి రావాలని ఆయన తల్లిదండ్రులు ఆశా, శంభూదళాళ్ శుక్లా ఆకాంక్షించారు. ‘‘ఐఎస్ఎస్లో తను ఎక్కడ పని చేసే దీ, రోజంతా ఎలా గడిపేదీ శుభాంశు మాకు పూసగుచ్చినట్టు చూపించాడు. అంతరిక్షం నుంచి భూమిని చూసేందుకు రెండు కళ్లూ చాలవట! తన విధులను పూర్తిగా ఆస్వాది స్తుండటం మాకెంతో సంతోషాన్నిస్తోంది’’అని చెప్పుకొచ్చారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
2 వారాలు 230 ప్రదక్షిణలు
వాషింగ్టన్: నూటా నలభై కోట్ల మంది కలలను మోస్తూ నింగిలోకి దూసుకెళ్లి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని చేరి పలు రకాల పరిశోధనలతో బిజీగా మారిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అక్కడ 14 రోజులను పూర్తిచేసుకున్నారు. ఐఎస్ఎస్లో ఉంటూ ఇప్పటికే పుడమిని 230 సార్లు చుట్టేశారు. ఈయనతోపాటు ఐఎస్ఎస్కు విచ్చేసిన వ్యోమగాములు పెగ్గీ వాట్సన్ (అమెరికా), ఉజ్నాన్స్కీ విస్నేవ్‌స్కీ (పోలండ్), టిబర్ కపు (హంగరీ)ల యాగ్జియం–4 బృందం ఇప్పటిదాకా ఐఎస్ఎస్లో ఉంటూ అంతరిక్షంలో 96 లక్షల కిలోమీటర్లు ప్రయాణించింది. ఐఎస్ఎస్కు చేరుకున్నాక శుభాంశు బృందం శాస్త్రసాంకేతిక రంగాలకు చెందిన పలు రకాల ప్రయోగాలు చేసింది. భూమి మీద ఆచరణలో ఉన్న ఎన్నో సిద్ధాంతాలను శూన్యస్థితిలో అక్కడ పరిశీలించింది. జీవవైద్య శాస్త్రం, రేడియోధారి్మకత, న్యూరోసైన్స్, వ్యవసాయం, అంతరిక్ష సాంకేతికత ఇలా విభిన్న రంగాలకు సంబంధించి ప్రయోగాలు చేసింది. యాగ్జియం–4 మిషన్ వంటి ఒక ప్రైవేట్ వ్యోమగాముల బృందం ఇంతటి విస్తృతస్థాయిలో పరిశోధనలు చేయడం ఇదే తొలిసారి. అరవైకి పైగా ప్రయోగాలు ఈ బృంద సభ్యులు విజయవంతంగా పూర్తిచేశారు. చక్కెరవ్యాధిగ్రస్తులకు మెరుగైన చికిత్స విధానాలు, కేన్సర్ ట్రీమ్‌మెంట్‌లో కొత్తతరహా టెక్నాలజీ వాడకం, సుదీర్ఘకాలం ఖగోళయానం చేస్తే వ్యోమగామిపై రేడియేషన్ చూపే దుష్ప్రభావం, శూన్యస్థితిలో విత్తనాలు, సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా మనుగడ.. ఇలా భిన్న అంశాలపై శుభాంశు బృందం ప్రయోగాలు చేసి ఫలితాలను విశ్లేíÙంచింది. భూమి నుంచి 250 మైళ్ల ఎత్తులో 230 సార్లు భూమిని చుట్టేసిన ఈ బృందం త్వరలోనే తిరిగి రానుంది. వారి తిరుగు ప్రయాణం ఈ నెల 14న ఉండొచ్చని నాసా పేర్కొంది. -
వహ్.. శుభాంశు శుక్లా! కుపోలా విండో ఎందుకంత స్పెషల్?
భారతదేశపు వ్యోమగామి.. గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా 👨🚀 మరో అదరుదైన ఫీట్ సాధించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లోని ప్రసిద్ధ కుపోలా విండో వద్ద నుంచి భూమిని వీక్షిస్తూ ఫొటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యం నెట్టింట వైరల్ అవుతోంది. నాసా-ఇస్రో జాయింట్ మిషన్ యాక్సియమ్ మిషన్ 4లో భాగంగా శుభాంశు శుక్లా ISS చేరుకున్న సంగతి తెలిసిందే. తద్వారా ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా ఆయన చరిత్రకెక్కారు. ఈ మిషన్‌లో భాగంగా.. శుక్లా కమాండర్ పెగ్గీ విట్సన్, స్లావోస్ ఉజ్నాన్స్కీ, టిబోర్ కాపులతో కలిసి శాస్త్రీయ పరిశోధనలు నిర్వహిస్తున్నారు. మైజెనెసిస్, స్ప్రౌట్స్ ప్రాజెక్ట్, మైక్రో ఆల్గీ ప్రయోగాలు వంటి అనేక శాస్త్రీయ ప్రయోగాల్లో పాల్గొంటున్నారు. తాజాగా.. ఐఎస్ఎస్లోని కుపోలా నుంచి ఆయన చిత్రాలను నాసా రిలీజ్ చేసింది. కుపోలా మాడ్యూల్ అనేది ఐఎస్ఎస్లోని అత్యంత ప్రత్యేకమైన భాగం. అంతరిక్షం నుంచి భూమిని ప్రత్యక్షంగా చూడటానికి రూపొందించిన ఒక విండో గ్యాలరీలా ఉంటుంది.భూమి, నక్షత్రాలు, అంతరిక్ష నౌకలు వంటి వాటిని పరిశీలించేందుకు, ఫోటోలు తీయడానికి, రోబోటిక్ ఆర్మ్‌ను నియంత్రించేందుకు ఉపయోగిస్తారు.ఇది ఏడు విండోలతో కూడిన గుండ్రటి ఆకారంలో ఉంటుంది. ప్యానోరమిక్ వ్యూ (360 డిగ్రీల దృశ్యం) అందించగల సామర్థ్యం ఉంది. దీనిని ఇటలీ అంతరిక్ష సంస్థ (ASI) రూపొందించి, నాసాకి అందించింది. 2010లో ISSకి ఇది జత చేయబడింది.కుపోలా ద్వారా భూమిని చూడటం అనేది చాలా భావోద్వేగపూరితమైన అనుభవంగా ఉంటుంది. ఈ విండో గుండా తీసిన భూమి చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని విండో టు ది వరల్డ్‌గా దీనిని వ్యవహరిస్తారు. Finally, we have some awesome images of Astro Shubanshu shukla 🇮🇳🧑🏻🚀Thank you @Axiom_Space for uploading these 📸#Ax4 #ISRO #Shubanshushukla pic.twitter.com/lfwm8PC6OI— ASTROSPACE (@Arslanshaikh_) July 5, 2025ఇదిలా ఉంటే.. శుభాంశు శుక్లా ఐఎస్ఎస్లో పరిశోధనలతో పాటు సాంకేతిక ప్రదర్శనలు, విద్యార్థులతో అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రధాని మోదీతో వీడియో కాల్లో మాట్లాడుతూ.. అంతరిక్షం నుంచి భూమిని చూస్తే ఎలాంటి సరిహద్దులు కనిపించవు, అందులో భారతదేశం ఎంతో విశాలంగా కనిపిస్తుంది అని చెప్పారు. అలాగే.. జూలై 3, 4 తేదీల్లో తిరువనంతపురం, బెంగళూరు, లక్నోలో విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. షెడ్యూల్ ప్రకారం.. జులై 10వ తేదీతో శుక్లా బృందం అంతరిక్ష యాత్ర ముగియాల్సి ఉంది. -
శుభాంశు బిజీబిజీ
న్యూఢిల్లీ: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కు చేరుకున్న భారత వ్యోమగామి శుభాంశు శుక్లా తన విధుల్లో బిజీగా మారారు. ఒకరోజు విశ్రాంతి తర్వాత తన ‘ఐఎస్ఎస్ పదోరోజు’పనుల్లో భాగంగా సూక్ష్మ గురుత్వాకర్షణ స్థితిలో మనిషి ఎముకల సాంద్రత ఎలా ఉంటుంది? అనే అంశంపై ఆయన పరిశోధనలు మొదలుపెట్టారు. భారరహిత స్థితిలో ఎముకలో కణాల పుట్టుక, అభివృద్ధి, వాపు అంశాలపైనా శుక్లా శోధన సాగించారు. దీర్ఘకాలంపాటు ఖగోళయానం చేస్తే రేడియోధార్మీకత కారణంగా వ్యోమగాముల కణాల్లో డీఎన్ఏ నిచ్చెనలు దెబ్బతింటే అవి మళ్లీ మరమ్మతులు చేసుకోవాలంటే భూమి గురుత్వాకర్షణ అవసరం. కానీ ఐఎస్ఎస్లో అత్యంత స్వల్పస్థాయిలో గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. అలాంటప్పుడు రేడియేషన్ ప్రభావ స్థాయిలు ఎలా ఉంటాయనే దానిపై శుక్లా అధ్యయనం మొదలెట్టారు. నీటి ఎలుగుబంటి(టార్డీగ్రేడ్)తోపాటు శైవలాలు శూన్యస్థితిలో ఎలా పెరగగలవు? అనే అంశంపై ప్రయోగంచేశారు. వాటర్బేర్ల ఉనికి, పునరుజ్జీవం, పునరుత్పత్తి విధానాల్లో మార్పులను ఆయన గమనించారు. ఈ సూక్ష్మజీవాలు భవిష్యత్తులో సుస్థిర జీవనానికి, ఆహారం, ఇంధనంతోపాటు పీల్చేగాలికి ఊపిరులూదొచ్చు. అయితే తొలుత భారరహిత స్థితిలో ఈ అతిసూక్ష్మజీవాలు ఎలా మనుగడ సాగిస్తాయో తెల్సుకోవాల్సి ఉంది’’అని యాగ్జియం స్పేస్ సంస్థ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘శుక్లాతోపాటు యాగ్జియం బృంద సభ్యులు ఎముక శూన్యంలో ఎలా పెళుసుబారుతుంది? భూమి మీదకు రాగానే ఎలా పూర్వస్థితిని చేరుకుంటుంది? అనే దానిపైనా ప్రయోగంచేశారు. ఆస్టియోపోరోసిస్ వంటి ఎముక సంబంధ వ్యాధులకు మరింత మెరుగైన చికిత్సావిధానాల అభివృద్ధికి తాజా ప్రయోగాలు దోహదపడతాయి’’అని యాగ్జియం స్పేస్ తెలిపింది. శూన్య స్థితిలో అస్థిపంజరంలోని కండరాలు ఎందుకు సూక్ష్మస్థాయిలో స్థానభ్రంశం చెందుతాయనే అంశంపైనా శుక్లా పరిశోధన చేశారు. చాలా రోజులపాటు అంతరిక్షయాత్రల్లో భాగంగా ఐఎస్ఎస్లో గడిపే వ్యోమగాములను కండరాల క్షీణత పట్టిపీడిస్తుంది. దీనికి కణస్థాయిలో పరిష్కారం కనుగొనేందుకు శుక్లా ప్రయత్నించారు. -
అంతరిక్షం నుంచి భూమిని వీక్షించడం అద్భుత అనుభూతి
న్యూఢిల్లీ: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో వారం రోజులు పూర్తి చేసుకున్నారు. సహచర వ్యోమగాములతో కలిసి ఇప్పటికే భూమిని 113 సార్లు చుట్టేశారు. 40.66 లక్షల కిలోమీటర్లు ప్రయాణించారు. ఇది భూమికి, చంద్రుడికి మధ్యనున్న దూరానికి 12 రెట్ల దూరంతో సమానం. ఐఎస్ఎస్లో తన అనుభవాన్ని శుభాంశు శుక్లా శుక్రవారం పంచుకున్నారు. మన భారతీయ ఆమ్ రస్, గాజర్‌కా హల్వా, మూంగ్‌దాల్ హల్వా రుచులు ఆస్వాదిస్తున్నానని, వాటిని సహచరులతో పంచుకుంటున్నానని చెప్పారు. ఇతర దేశాల వంటకాలను సైతం రుచి చూస్తున్నానని తెలిపారు. ఆయన తన కుటుంబ సభ్యులు, మిత్రులతో ఐఎస్ఎస్ నుంచి సంభాషించారు. అలాగే హామ్ రేడియో ద్వారా బెంగళూరులోని యూఆర్ఎస్సీ సైంటిస్టులతో మాట్లాడారు. ఇక్కడంతా అద్భుతంగా ఉందని, తామంతా చక్కగా కలిసి ఉంటున్నామని పేర్కొన్నారు. వేర్వేరు దేశాలకు చెందిన ఆహార పదార్థాలను ఒకరికొకరం పంచుకుంటున్నామని వెల్లడించారు. వేర్వేరు దేశాల వ్యక్తులతో కలిసి పని చేయడం ఉత్సాహకరమైన అనుభవమని వ్యాఖ్యానించారు. అన్నింటికంటే ముఖ్యంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి మన భూగోళాన్ని కళ్లారా వీక్షించడం మాటల్లో చెప్పలేని అద్భుత అనుభూతిని ఇస్తోందని వివరించారు. అత్యంత ఎక్కువ కాలం అంతరిక్షంలో గడిపిన మొట్టమొదటి భారతీయ వ్యోమగామిగా శుభాంశు శుక్లా గురువారం సరికొత్త రికార్డు సృష్టించారు. 1984లో రాకేశ్ శర్మ ఏడు రోజుల 21 గంటల 40 నిమిషాలు అంతరిక్షంలో గడిపారు. శుభాంశు శుక్లా ఆ రికార్డును అధిగమించారు. -
యూపీ, కేరళ విద్యార్థులతో శుభాంశు మాటామంతీ
లక్నో/తిరువనంతపురం: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లోని భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లాతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి కేరళ, ఉత్తరప్రదేశ్ పాఠశాల విద్యార్థులు అత్యంత అరుదైన, మాటల్లో చెప్పలేని అనుభూతిని పొందారు. భారరహిత స్థితిలో స్వేచ్ఛగా గాల్లో కదలాడుతూ బంతితో ఆడుకుంటున్న శుక్లాను చూసి ఆ విద్యార్థులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. పట్టరాని ఆనందంతో పదే పదే ప్రశ్నలు సంధించారు. వాళ్ల ప్రశ్నలకు శుక్లా వివరణాత్మక సమాధాలిచ్చారు. ‘‘ ఆయన అలా శూన్యస్థితిలో చక్కర్లు కొడుతుంటే ఎంతో చూడముచ్చటగా ఉంది. మేము అడిగిన ఎన్నో ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. ఐఎస్ఎస్లో ఎలా గాల్లో ఈదినట్లుగా ముందుకు కదలాలో ఆయన స్వయంగా కదిలి చూపించారు’’ అని కోజికోఢ్లోని నయార్కుళి ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థిని సంఘవి చెప్పారు. శుక్లా సొంతూరు లక్నోలో, తిరునంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లోని విద్యార్థులూ ఆయనతో మాట్లాడారు. ఐఎస్ఎస్లో ఉన్నప్పుడు వ్యోమగాములు ఎలాంటి ఆహారం తీసుకుంటారు?. అలా కదులుతూ ఉంటే నిద్రపోవడమెలా?. హఠాత్తుగా ఒంట్లో బాగోలేకపోతే డాక్టర్ ఉండరుగా. అప్పుడెలా?. ఇక్కడి నుంచి ఐఎస్ఎస్కు వెళ్లాక ఎంతకాలానికి అక్కడి వాతావరణానికి అలవాటుపడతారు?. తిరిగొస్తే ఇక్కడ మామూలుగా మారడానికి ఎంత టైమ్ పడుతుంది?.. ఇలా విద్యార్థులు అడిగిన ఎన్నో ప్రశ్నలకు శుక్లా సమాధానాలు చెప్పారు. ‘‘ ఐఎస్ఎస్లో నిద్రపోవడం ఒక సరదా పని. ఇక్కడ నేల, పైకప్పు రెండూ ఉండవు. అందుకే కొందరు గోడలకు, కొందరు సీలింగ్‌కు అతుక్కుని నిద్రిస్తూ కనిపిస్తారు. కదలకుండా పడుకోవాలంటే నిద్రపోయే స్లీపింగ్ బ్యాగ్‌ను దేనికైనా కట్టేసుకోవాల్సిందే’’ అని ఆయన నవ్వుతూ చెప్పారు. దీంతో విద్యార్థులు విరగబడి నవ్వారు. ‘‘ ఇక్కడి వచ్చినప్పటితో పోలిస్తే ఇప్పుడు నేను ఎంతో మెరుగ్గా ఉన్నా. భారరహిత స్థితికి అలవాటు పడటం కాస్తంత ఇబ్బందిగా ఉంటుంది. తిరిగి భూమి మీదకొచ్చాక గురుత్వాకర్షణ స్థితికి మారడం కూడా ఒక సవాలే’’ అని శుక్లా అన్నారు. ‘‘ ఒంటరిగా ఉన్నామని ఫీల్ అయితే వెంటనే కుటుంబసభ్యులు, స్నేహితులతో వర్చువల్‌గా మాట్లాడి మనసును తేలికచేసుకుంటాం. తరచూ వ్యాయామం చేస్తాం. ప్రయోగాలు సరేసరి’’ అంటూ శుక్లా చెప్పుకొచ్చారు. ఇస్రో వారి విద్యార్థి సంవాద్ కార్యక్రమంలో భాగంగా వ్యోమగాములతో విద్యార్థుల మాటామంతీ పోగ్రామ్‌ను నిర్వహించారు. ‘‘ ఎప్పుడైనా కొన్ని నిమిషాలు తీరిక సమయం దొరికితే వెంటనే కిటికీల వద్దకు వెళ్లి అంతరిక్ష నుంచి మన పుడమిని చూడటం ఎంతో ఆసక్తికరంగా, ఆనందంగా ఉంటుందని ఆయన నాతో చెప్పారు’’ అని ఒక విద్యార్థి ‘పీటీఐ వీడియోస్’తో చెప్పింది. -
మధుమేహం ఉన్నవాళ్లు అంతరిక్షంలోకి వెళ్లొచ్చా..? శుభాంశు మిషన్..
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం( ఐఎస్ఎస్)లో కి అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా తన చరిత్రాత్మక మిషన్ యాగ్జియం-4లో భాగంగా పలు పరిశోధను చేయనున్న సంగతి తెలిసిందే. ఆ పరిశోధనల్లో ఏటా వేలా మంది బాధపడుతున్న దీర్థకాలిక వ్యాధి మధుమేహంపై కూడా అధ్యనం చేయనున్నారట. అంతేగాదు ఒక రకంగా ఈ అధ్యయనం ఆ వ్యాధిని ఎలా నిర్వహించాలో తెలియజేయడమే గాక మధుమేహం వ్యాధిగ్రస్తుల్లో కొండంత ఆశను రేకెత్తించే అవకాశం కూడా ఉందని సమాచారం. మరీ ఆ విశేషాలేంటో చూద్దామా..!. భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా తన యాగ్జియమ్ మిషన్4లో భాగంగా సుమారు 60కి పైగా శాస్త్రీయ ప్రయోగాల్లో పాల్గొనన్నారు. వాటిలో డయాబెటిస్ వ్యాధిపై అధ్యయనం కూడా ఉంది. ఈ వ్యాధిని ఎలా నిర్వహించొచ్చు లేదా బయటపడొచ్చు అనే దిశగా అధ్యయనాలు చేస్తున్నారు. ముఖ్యంగా మధుమేహం ఉన్న వ్యక్తులు అంతిరిక్షంలోకి వెళ్లొచ్చా..? లేదా అనే దిశగా కూడా పరిశోధనలు చేయనుంది శుభాంశు బృందం. ఎందుకంటే జీరో గ్రావిటీలో రక్తంలోని చక్కెర స్థాయిలపై ఎలాంటి ప్రభావం చూపిస్తోందని మధుమేహం ఉన్న వ్యోమగాములను అంతరిక్ష కార్యకలాపాలను పూర్తిగా మినహాయించారు. ఆ నేపథ్యంలోనే ఈ యాగ్జియ-4 మిషన్ సూట్రైడ్ అనే పరిశోధన ప్రాజెక్టులో భాగంగా ఈ దీర్ఘకాలిక వ్యాధిపై పరిశోధన చేస్తోంది. మధుమేహం ఉన్నవారు అంతరిక్షంలో నివశించడానికి, అక్కడి కార్యకలాపాల్లో పాల్గొనడానకి అనుకూలమా కాదా అనేదే ప్రధాన ధ్యేయం అని ఈ పరిశోధనకు సారథ్యం వహిస్తున్న డాక్టర్ మొహమ్మద్ ఫిత్యాన్ వెల్లడించారు. ఒకరకంగా ఈ పరిశోధన గురుత్వాకర్షణ ప్రభావం లేకుండా జీవక్రియను అధ్యయనం చేసే వీలు కల్పిస్తోందన్నరు. అంతేగాక ఇన్సులిన్ నిరోధకతపై కొత్త మార్గాన్ని అందిస్తుందని చెప్పారు.ఈ పరిధనలోని ముఖ్యాంశాలు..రెండలు వారాల మిషన్ సమయంలో ఒకరు లేదా ఇద్దరు వ్యోమగాములు కంటిన్యూయస్ గ్లూకోజ్ మానిటర్లు (CGM)లను ధరిస్తారు. ఈ పరికరాలు రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను నిరంతరం పర్యవేక్షిస్తూ డేటాను భూమికి పంపిస్తాయి. ప్రతిక్షణం ఆ వ్యోమగాముల రీడింగ్‌లు పర్యవేక్షించడం జరుగుతుందని చెప్పారు డాక్టర్ ఫిత్యాన్. ఈ మైక్రోగ్రావిటీలో ఆరోగ్యకరమైన జీవిక్రియ ఎలా మార్పులు సంతరించుకుంటోంది తెలుసుకోవడమేగాక భవిష్యత్తులో డయాబెటిస్ ఉన్న వ్యోమగాములు ఈ సీజీఎం(CGM)లను ధరించి వెళ్లడం సురక్షితం కాదో తెలుసుకోవడంలో హెల్ప్ అవుతుందని చెప్పుకొచ్చారు. ఈ పరిశోధన భూమిపై మారుమూల ప్రాంతాలు లేదా ఎలాంటి సదుపాయాలు లేని ప్రదేశాల్లో ప్రజలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. అలాగే ఈ పరిశోధన భవిష్యత్తు అధ్యయనాలకు మార్గం సుగమం చేస్తుందని ధీమాగా చెప్పారు. కాగా, ఈ పరిశోధన అనంతరం డయాబెటిస్ ఉన్న తొలి వ్యొమగామిని అంతరిక్షంలోకి పంపి పరిస్థితిని అంచనా వేయడం వంటి మరిన్ని పరిశోధనలు కూడా చేయనున్నట్లు ఫిత్యాన్ వెల్లడించారు.(చదవండి: 'కన్నీళ్లు ఉప్పొంగే క్షణం': శుభాంశు తల్లిదండ్రుల భావోద్వేగం) -
ప్రయోగాలు మొదలెట్టిన శుభాంశు
న్యూఢిల్లీ: కోట్లాది భారతీయుల అంతరిక్ష స్వప్నాన్ని సాకారం చేస్తూ యాగ్జియం–4 మిషన్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కు చేరుకున్న భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా తన శాస్త్రీయ ప్రయోగాల పర్వానికి శ్రీకారం చుట్టారు. శూన్యస్థితిలో మనిషి కండర క్షీణతపై శుక్లా అధ్యయనంమొదలెట్టారు. కండరాల క్షీణతకు గురుత్వాకర్షణ ఏ మేరకు కారణమవుతుంది? ఈ రెంటి మధ్య సంబంధాలేంటి? అంశాలపై ఆయన పరిశోధనలు సాగుతున్నాయని యాగ్జియం స్పేస్ సంస్థ పేర్కొంది. చాలా రోజులపాటు అంతరిక్షయాత్రల్లో గడిపే వ్యోమగాములను కండరాల క్షీణత పెద్దసమస్యగా తయారైంది. దీనికి పరిష్కారం కనుగొనేందుకు శుక్లా ప్రయతి్నస్తున్నారు. పరిశోధనలో భాగంగా త్రిమితీయ అస్థిపంజర కండరం నుంచి సూక్ష్మస్థాయిలో కణజాలాన్ని అత్యంత స్వల్పస్థాయి గురుత్వాకర్షణకు గురిచేసి మార్పులను గమనించారు. మయోడీ1, మయోజీ కణ నియంత్రకాల పనితీరు సూక్ష్మ గురుత్వాకర్షణ స్థితిలో ఎలా ఉందో శుక్లా పరిశీలించారు. -
ఒక్క రోజులో 16 సూర్యోదయాలు: శుభాంశు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం( ఐఎస్ఎస్)లో కి అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాతో ప్రభాని నరేంద్ర మోదీతో జరిపిన సంభాషణ ఆసక్తికరంగా సాగింది. ఈరోజు(శనివారం, జూన్ 28వ తేదీ) శుభాంశు శుక్లాతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించారు. తొలుత శుభాంశును విష్ చేసిన ప్రధాని మోదీ.. ‘ఇది శుభ్ ఆరంభ్ అని, ఇది నయా శకం’ అని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే అక్కడ పరిస్థితులను అడిగి తెలుసుకున్న మోదీ.. గొప్ప ఘనతను సాధించావంటూ కొనియాడారు. దానికి శుభాంశు బదులిస్తూ ఇది తన ఒక్కడి విజయం కాదని, భారత్ విజయమని వినమ్రతను చాటుకున్నారు. PM @narendramodi interacted with Group Captain Shubhanshu Shukla, who is aboard the International Space Station. pic.twitter.com/Q37HqvUwCd— PMO India (@PMOIndia) June 28, 2025 అదే సమయంలో అక్కడ ఎలా ఉంది అని మోదీ అడగ్గా... ఇక్కడ వాతావరణం అంతా భిన్నంగా ఉందని శుభాంశు తెలిపారు. ఈ కక్ష నుంచి చూస్తే భారత్ చాలా స్పెషల్‌గా కనిపిస్తుందని శుభాంశు స్పష్టం చేశారు. ఇక్కడ రోజుకు 16 సూర్యోదయాలు, 16 సూర్యాస్తమయాలుగా ఉందని చెప్పుకొచ్చారు. ఈ కక్షలో పరిస్థితులకు అలవాటు పడుతున్నామని, నిద్ర పోవడం అనేది చాలా పెద్ద చాలెంజ్‌గా ఉందన్నారు. ఇక్కడ గ్రావెటీ లేమి కారణంగా చిన్న చిన్న సమస్యలు తలెత్తుతున్నాయని శుభాంశు తెలిపారు. తల కాస్త భారంగా ఉంటుందని, ఇలా కొన్ని సమస్యలు ఉన్నాయని, ఇవన్నీ చిన్న చిన్న ఇబ్బందులేనని తెలిపారు. మీ యొక్క ఆశీర్వాదంతో ఐఎస్ఎస్లో అతి సులభంగా అడుగుపెట్టానని పేర్కొన్నారు శుభాంశు. ఇక ఐఎస్ఎస్ నుంచి భారత్ చాలా పెద్దదిగా కనిపిస్తుందని, మ్యాప్ కంటే భిన్నంగా ఉందని మోదీ పేర్కొనగా, ఇక్కడ నుంచి చూస్తే భారత్ చాలా స్పెషల్‌గా కనిపిస్తుందని శుభాంశు తెలిపారు. ఇలా పలు విషయాలను పంచుకుంటూ ప్రధాని మోదీ-శుభాంశుల సంభాషణ కొనసాగింది. #WATCH | Prime Minister Narendra Modi interacts with Group Captain Shubhanshu Shukla, who is aboard the International Space Station.PM Modi says "Today, you are away from our motherland, but you are the closest to the hearts of Indians...Aapke naam mein bhi shubh hai aur aapki… pic.twitter.com/lWOk7AVlL3— ANI (@ANI) June 28, 2025 -
అంతరిక్షం నుంచి భారత్ ఓ అద్భుత దృశ్యకావ్యం
న్యూఢిల్లీ: ‘‘అంతరిక్షం నుంచి భారత్ ఓ అద్భుత దృశ్యకావ్యంలా కనువిందు చేస్తోంది’’ – మన వ్యోమగామి వాయుసేనాని, యాగ్జియం–4 మిషన్ కెప్టెన్ శుభాంశు శుక్లా (39) చేసిన భావోద్వేగపూరిత వ్యాఖ్యలివి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో క్రమంగా కుదురుకుంటున్న ఆయన శనివారం ప్రధాని నరేంద్ర మోదీతో వీడియో లింక్ ద్వారా మాటామంతి జరిపారు. ‘‘మ్యాప్‌లో చూసే భారతావనికి, అంతరిక్షం నుంచి కనిపిస్తున్న దృశ్యానికి పోలికే లేదు. ఇక్కడినుంచి మన దేశం చాలా పెద్దదిగా, ఎంతో గొప్పగా కనిపిస్తోంది. అంతరిక్షం నుంచి భూమి కూడా దేశాల ఎల్లలన్నవే లేకుండా ఎటునుంచి చూసినా నిండుగా, ‘వసుధైక కుటుంబం’లా కనువిందు చేస్తోంది. భూగోళమంతా మన ఇల్లుగా, అన్ని దేశాల ప్రజలందరం సమస్త మానవాళికీ ప్రాతినిధ్యం వహిస్తున్నామని మనసుకు తోస్తోంది’’ అని వివరించారు. ఐఎస్ఎస్లో కాలుపెట్టిన తొలి భారతీయునిగా శుభాంశు తిరుగులేని చరిత్ర సృష్టించారంటూ మోదీ ప్రస్తుతించారు. ‘‘మాతృభూమి నుంచి మీరు అత్యంత దూరంగా ఉండొచ్చు గాక. కానీ ప్రస్తుతం ప్రతి భారతీయుని హృదయానికీ అత్యంత దగ్గరగా ఉన్నారు. మీ పేరులోనే శుభముంది. అందుకు తగ్గట్టే మీ యాత్ర కూడా సరికొత్త యుగానికి శుభారంభం పలికింది. మన దేశ యువతకు కొంగొత్త ఆశలతో కూడిన కొత్త అధ్యాయానికి మీ ప్రస్థానం గొప్పగా బాటలు పరిచింది’’ అంటూ కొనియాడారు. ‘‘ఇప్పుడు మనమిలా మాట్లాడుకుంటున్న ఈ సమయాన ప్రతి ఒక్క భారతీయునికీ భావోద్వేగపరంగా మీతో విడదీయలేనంతటి బంధం పెనవేసుకుపోయింది. ఆ 140 కోట్ల పై చిలుకు అవ్యక్త భావనలను, ఆకాంక్షలను వారి ప్రతినిధిగా మీకు చేరవేస్తున్నాను. త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా వెంట తీసుకెళ్లిన మీకు నా మనఃపూర్వక శుభాభినందనలు. యాగ్జియం–4 మిషన్‌కు నా శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు. తన ఐఎస్ఎస్ యాత్రను దేశ ప్రజలందరి సమష్టి ఘనతగా శుభాంశు అభివర్ణించారు.మీ సారథ్యంలో కలలకు కొత్త రెక్కలు‘‘రోజుకు 16 సూర్యోదయాలు, 16 సూర్యాస్తమయాలు ఆస్వాదిస్తున్నాం. గంటకు 28 వేల కి.మీ. వేగంతో భూమికి ప్రదక్షిణలు చేస్తున్నాం. ఈ వేగం మన దేశ ప్రగతి పరుగులకు అద్దం పడుతోంది’’ అని శుభాంశు తెలిపారు. ఐఎస్ఎస్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటూ మోదీ ఆరా తీశారు. అక్కడి పరిస్థితులకు ఎలా అలవాటు పడుతున్నారని అడిగారు. తాను బావున్నానని శుభాంశు తెలిపారు. కాకపోతే శూన్య గురుత్వాకర్షణ స్థితిలో నిద్రపోవడం కూడా పెను సవాలుగానే ఉందంటూ చమత్కరించారు! అన్నింటికీ ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నట్టు చెప్పారు. ‘‘ఇలాంటి సవాళ్ల కోసమే ఏడాది పాటు కఠోర శిక్షణ పొందాం. కానీ తీరా ఇక్కడికొచ్చాక అంతా మారిపోయింది. శూన్యస్థితి కారణంగా చిన్నచిన్న విషయాలు కూడా భూమి మీదికంటే ఎంతో భిన్నంగా ఉన్నాయి. ఇది నాకు నిజంగా సరికొత్త అనుభూతి. ‘‘అంతరిక్షంలో తరచూ తీవ్ర ఒత్తిళ్లతో కూడిన పరిస్థితులెన్నో ఎదురవుతుంటాయి. అందుకే ఏకాగ్రత, ప్రశాంతచిత్తం చాలా అవసరం. అప్పుడే సరైన నిర్ణయాలు తీసుకోగలం. శిక్షణ సందర్భంగా వీటి గురించి ఎంతో తెలుసుకున్నా. అదంతా బాగా ఉపకరిస్తోంది. భూమికి 400 కి.మీ. ఎత్తుకు చేరిన ఈ ప్రయాణం నా ఒక్కనిది కాదు. మొత్తం దేశానిది. అంతరిక్షంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం పట్ల ఎనలేని సంతోషంగా ఉన్నా. నాకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపిన మీకు, 140 కోట్ల సహచర భారతీయులకు కృతజ్ఞతలు. ఇలా ఒకనాటికి వ్యోమగామిని అవుతానని చిన్ననాడు కలలో కూడా అనుకోలేదు. మీ నాయకత్వంలో దేశం తన కలలకు కొత్త రెక్కలు తొడుక్కుంటోంది’’ అంటూ ప్రధాని నాయకత్వాన్ని ప్రశంసించారు. ‘‘యువతకు నేనిచ్చే సందేశమల్లా ఒక్కటే. ఆకాశమే మీ హద్దు!’’ అని పేర్కొన్నారు. సంభాషణను ముగిస్తూ ‘భారత్ మాతా కీ జై’ అంటూ శుభాంశు చేసిన నినాదాలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రమంతటా ప్రతిధ్వనించాయి. PM @narendramodi interacted with Group Captain Shubhanshu Shukla, who is aboard the International Space Station. pic.twitter.com/Q37HqvUwCd— PMO India (@PMOIndia) June 28, 2025 #WATCH | Prime Minister Narendra Modi interacts with Group Captain Shubhanshu Shukla, who is aboard the International Space Station.PM Modi says "Today, you are away from our motherland, but you are the closest to the hearts of Indians...Aapke naam mein bhi shubh hai aur aapki… pic.twitter.com/lWOk7AVlL3— ANI (@ANI) June 28, 2025అపార అనుభవంతో తిరిగి రండిమన గ‘ఘన’ యాత్రలకు అదే పునాదిశుభాంశుకు ప్రధాని ‘హోంవర్క్’అంతరిక్షాన్ని మరింతగా అన్వేషించాలన్న మన యువత, విద్యార్థుల సంకల్పాన్ని శుభాంశు చరిత్రాత్మక యాత్ర మరింత బలోపేతం చేస్తుందని మోదీ అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని ఆయనకు ప్రత్యేకమైన ‘హోంవర్క్’ అప్పగించారు. ‘‘తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌కు వీలైనంత త్వరలో శ్రీకారం చుట్టేందుకు భారత్ ఎంతో పట్టుదలతో ఉంది. అలాగే పూర్తి స్వదేశీ ‘భారత అంతరిక్ష కేంద్రం’ నిర్మించేందుకు, భారత వ్యోమగాములను చంద్రునిపైకి పంపేందుకు కూడా! అంతరిక్ష పరిస్థితులపై సంపూర్ణ అనుభవం గడించి విజయవంతంగా తిరిగిరండి. గగన్‌యాన్ తదితర ప్రాజెక్టులన్నింటికీ మీరు వెంటతీసుకొచ్చే వెలకట్టలేని అనుభవమే తిరుగులేని పునాది!’’ అని విశ్వాసం వెలిబుచ్చారు. అంతరిక్షంలో భారత్ సృష్టించబోయే నూతన చరిత్రకు తన యాత్ర కేవలం ఆరంభం మాత్రమేనని శుభాంశు బదులిచ్చారు.క్యారెట్ హల్వా, మామిడి రసం రుచి చూపాతనతో పాటు ఐఎస్ఎస్కు క్యారెట్ హల్వా, మామిడి రసం తీసుకొచ్చానని ప్రధానికి శుభాంశు వివరించారు. వాటిని, చవులూరించే పలు భారతీయు మిఠాయిలను ఐఎస్ఎస్లోని 10 మంది తోటి వ్యోమగాములతో శుభాంశు పంచుకున్నట్టు చెప్పారు. చరిత్ర సృష్టించిన శుభాంశు -
ISSలో శుభాంశు శుక్లా.. ఇస్రో ఎందుకో వెనుకబడింది!
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడు ఎవరు?.. ఇంకెవరు తాజాగా ఆ ఫీట్‌తో చరిత్ర సృష్టించింది భారత వైమానిక దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లానే. పైగా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ మిషన్‌లో భారతీయ అంతరిక్ష సంస్థ(ISRO) కూడా భాగంగా ఉంది. అలాంటప్పుడు ఇస్రో ఎందుకు దీనిని అంతగా ప్రమోట్ చేసుకోవడం లేదు!!.శుభాంశు శుక్లా అడుగు.. భారత అంతరిక్ష ప్రయాణంలో కొత్త అధ్యాయం. శుభాంశు పైలట్‌గా సాగిన ఐఎస్ఐఎస్కి సాగిన యాక్జియం-4 మిషన్ ప్రయాణం.. అంతరిక్షంపై భారత్ చేసిన సంతకం. కానీ, ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని ISRO తక్కువగా ప్రచారం చేయడం కోట్ల మంది భారతీయులకు నిరాశ కలిగిస్తోంది. దేశం మొత్తం గర్వపడే ఈ ఘనతను మరింత ఉత్సాహంగా, ప్రజలతో పంచుకోవాల్సిన అవసరం లేదా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో ఇస్రో ఎందుకు వెనకబడిందనే విషయాన్ని పరిశీలిస్తే..వీళ్ల తర్వాత శుక్లానే..అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ వ్యోమగామి భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ రాకేశ్ శర్మ. సోయుజ్ T-11 (Soyuz T-11) మిషన్ కోసం 1984, ఏప్రిల్ 3న ఆయన స్పేస్‌లోకి వెళ్లారు. అక్కడ సోవియట్ యూనియన్ (ఇప్పటి రష్యా) ద్వారా నిర్వహించబడిన సల్యూట్ 7లో(సెకండ్‌జనరేషన్ అంతరిక్ష కేంద్రం) ఏడు రోజులపాటు శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించారు. ఆ తర్వాత భారతీయులెవరూ స్పేస్‌లోకి వెళ్లింది లేదు. కానీ..భారతీయ మూలాలు ఉన్న కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్.. తెలుగు మూలాలున్న భారత సంతతికి చెందిన శిరీషా బండ్లా, రాజా జాన్ వూర్పుటూర్ చారి మాత్రం రోదసీ యాత్రలు చేశారు. ఈ లెక్కన రాశేష్ శర్మ తర్వాత స్పేస్‌లోకి.. అందునా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి అడుగిడిన తొలి వ్యక్తి ఘనత శుభాంశు శుక్లాదే. పైగా నలుగురితో కూడిన ఈ బృందంలో పైలట్‌గా ఉన్న శుభాంశు స్వయంగా 7 కీలక ప్రయోగాలు(60 ప్రయోగాల్లో) నిర్వహించనున్నారు. అలాంటప్పుడు భారత అంతరిక్ష చరిత్రలో మైలురాయిని ఇస్రో ఎందుకు హైలైట్ చేసుకోవడం లేదు!.అంత బడ్జెట్ కేటాయించి మరీ..అంతరిక్ష ప్రయోగంలో దూసుకుపోతున్న భారత్.. చంద్రయాన్, మంగళయాన్‌తో సూపర్ సక్సెస్ సాధించింది. అలాంటి దేశం తరఫున ఐఎస్ఎస్కి వెళ్లిన తొలి మిషన్ ఇదే. పైగా భారతదేశం భవిష్యత్తులో చేపట్టబోయే మానవసహిత అంతరిక్ష ప్రయోగం గగన్‌యాన్ మిషన్‌కు.. శుక్లా పాల్గొన్న ఈ మిషన్ ముందడుగుగా పరిగణించబడుతోంది. ఇందుకోసమే భారత ప్రభుత్వం తరఫున Department of Space (DoS) ఈ మిషన్ కోసం రూ. 715 కోట్లు కేటాయించింది. డిసెంబర్ 2024 నాటికి రూ. 413 కోట్లు ఖర్చయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ. 135 కోట్లు అదనంగా కేటాయించారు. మిగిలిన రూ. 168 కోట్లు 2026 మార్చి నాటికి వినియోగించనున్నారు.ఈ మొత్తం బడ్జెట్లో శుభాంశు శుక్లా ప్రయాణం, శాస్త్రీయ ప్రయోగాలు, శిక్షణ, అంతరిక్ష ప్రయాణానికి అవసరమైన ఇతర సాంకేతిక అంశాలు ఉన్నాయి. పైగా తాజా మిషన్‌లో జీవశాస్త్రం, వైద్యం, సాంకేతికత వంటి రంగాలకు సంబంధించిన ప్రయోగాలు జరుగుతున్నాయి. అనుకుంటే ఈ విషయాలన్నింటిని భారీగా ప్రచారం చేసుకునేదే. కానీ, ఎందుకో ఆ పని చేయడం లేదు. దీంతో Wake up ISRO! అనే చర్చ మొదలైంది.అందుకేనా?..ఇస్రో మౌనానికి కారణాలు కొన్ని ఉండొచ్చు. సాధారణంగా తక్కువ ప్రచారంతో, శాస్త్రీయ దృష్టితో ముందుకు సాగే సంస్థ ఇది. అందుకే దేశానికి గర్వకారణమైన ఘట్టం విషయంలోనూ అదే వైఖరి అవలంభిస్తుందా? అనే అనుమానం కలగకమానదు. సంస్థ సంస్కృతికి తోడు ప్రభుత్వ నియంత్రణ, అంతర్జాతీయ ఒప్పందాల పరిమితులు కూడా ప్రభావం చూపించి ఉండొచ్చని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. వీటికి తోడు..యాక్సియం-4 స్పేస్ మిషన్.. ప్రైవేట్ అంతర్జాతీయ భాగస్వామ్యం అంటే ISRO, NASA, Axiom Space సంయుక్త భాగస్వామ్యంతో జరిగిన మిషన్. అందుకే గతంలో చంద్రయాన్-3 వంటి సొంత మిషన్లకు భారీ ప్రచారం ఇచ్చిన ఇస్రో, తాజా మిషన్ అంతర్జాతీయ భాగస్వామ్యంతో జరిగినందున తక్కువ స్థాయిలో స్పందించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా.. మిషన్ ముగిసే సమయంలోనైనా ఇస్రో శుభాంశు శుక్లా ఘనతను ప్రపంచమంతా మారుమోగిపోయేలా ప్రచారం చేయాలని పలువురు భారతీయులు ఆశిస్తున్నారు.:::వెబ్‌డెస్క్ ప్రత్యేకం -
అంతరిక్షంపై భారత సంతకం
-
అంతరిక్షం నుంచి భారత్
న్యూఢిల్లీ: అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడిగా రాకేశ్ శర్మ రికార్డుకెక్కారు. 1984 ఏప్రిల్‌లో ఆయన అంతరిక్ష యాత్ర చేశారు. వారం రోజుల్లో భూమిపైకి తిరిగొచ్చారు. అంతరిక్షం నుంచి మన దేశం ఎలా కనిపిస్తోంది? అని అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ప్రశ్నించగా.. ‘సారే జహాసే అచ్ఛా’అటూ రాకేశ్ శర్మ బదులిచ్చారు. ఒకవేళ ఆయన ఇప్పుడు అంతరిక్షంలోకి వెళ్లి ఉంటే అప్పట్లో చూడని ఎన్నో దృశ్యాలు తిలకించేవారు. ముఖ్యంగా రాత్రిపూట మన ఇండియా ఎలా కనిపిస్తోందో వెల్లడించేవారు. ప్రస్తుతం ఆ అవకాశం శుభాన్షు శుక్లా దక్కింది. ఆయన గురువారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. 1984 నుంచి గమనిస్తే.. గత 41 ఏళ్లలో మన దేశం ఎంతగానో పురోగమించింది. పట్టణీకరణ విపరీతంగా పెరిగింది. రాత్రి సమయంలో చిత్రీకరించిన ఉపగ్రహ చిత్రాలు 2000 సంవత్సరం నుంచి విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి. అంతకంటే ముందున్న శాటిలైట్ కెమెరాలు ఆధునికమైనవి కావు. రాత్రి సమయంలో ఫొటోలను స్పష్టంగా చిత్రీకరించే సామర్థ్యం వాటికి లేదు. ప్రస్తుతం అడ్వాన్స్డ్ శాటిలైట్ కెమెరాలు అంతరిక్షం నుంచి ప్రతి దేశాన్ని స్పష్టంగా మన కంటికి చూపగలుగుతున్నాయి. రాత్రిపూట దేదీప్యమానంగా వెలిగే విద్యుత్ దీపాలను బట్టి ఆయా ప్రాంతాల అభివృద్ధిని అంచనా వేయొచ్చు. దేశ ప్రగతితోపాటు సామాజిక, ఆర్థిక మార్పులను ఇవి కొంతవరకు ప్రతిబింబిస్తాయనడంలో సందేహం లేదు. విద్యుత్ కాంతి విస్తృతి ఇండియాలో పట్టణీకరణ, అభివృద్ధి ఏ మేరకు జరిగిందో తెలుసుకొనేందుకు శాటిలైట్ చిత్రాల ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)కు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఎన్ఆర్ఎస్సీ) ఒక అధ్యయనం చేసింది. 2012 నుంచి 2021 వరకు రాత్రి సమయంలో అంతరిక్షం నుంచి ఉపగ్రహాలు చిత్రీకరించిన ఫొటోలు సేకరించి, విశ్లేషించింది. పదేళ్లలో దేశంలో రాత్రిపూట విద్యుత్ కాంతి(నైట్‌టైమ్ లైట్) విస్తృతి ఏకంగా 43 శాతం పెరిగినట్లు తేలింది. ముఖ్యంగా బిహార్, మణిపూర్, లద్ధాఖ్, కేరళలో ఈ విస్తృతి అధికంగా ఉండడం విశేషం. 2020 సంవత్సరంలో చాలా రాష్ట్రాల్లో తగ్గిపోయింది. ఇందుకు కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి కారణమని చెబుతున్నారు. 1984 నాటి చిత్రాలను, ఇప్పటి చిత్రాలను గమనిస్తే 1990వ దశకంలో ఆర్థిక సంస్కరణలు మొదలైన తర్వాతే ఇండియాలో పట్టణీకరణ వేగం పుంజుకున్నట్లు స్పష్టమవుతోంది. అంతరిక్షం నుంచి భారత్ అద్భుతం ఇండియన్–అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో తొమ్మిది నెలలపాటు ఉండి, ఏప్రిల్‌లో భూమిపైకి తిరిగొచ్చిన సంగతి తెలిసిందే. అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపిస్తోందని ఆమె చెప్పారు. హిమాలయ పర్వతాలపై నుంచి వెళ్లినప్పుడల్లా అందమైన చక్కటి ఫొటోలు తీసుకున్నామని తెలిపారు. గుజరాత్, ముంబైలో సౌందర్యవంతంగా కనిపించాయని వెల్లడించారు. -
'కన్నీళ్లు ఉప్పొంగే క్షణం': శుభాంశు తల్లిదండ్రుల భావోద్వేగం
శుభాంశు శుక్లా బృందం యాక్సియం-4 మెషిన్ ద్వారా అంతర్జాతీయ పరిశోదనా కేంద్రంలోకి విజయవంతంగా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఐఎస్ఎస్లో అడుగుపెట్టిన రెండో భారతీయుడిగా గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా పేరు దేశమంతటా మారుమ్రోగిపోతుంది. ఎక్కడ చూసినా.. ఈ అంశమే చర్చనీయాంశంగా మారింది. అక్కడ ఆ బృందం 14 రోజుల పాటు చేయనున్న పరిశోధనల గురించే అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎవరి నోట చూసినా..శుభాంశు శుక్లా పేరే హాట్‌టాపిక్‌గా మారింది. 140 కోట్ల పై చిలుకు బారతీయుల ఆకాంక్షలను మోసుకుంటూ రోదసిలోకి దూసుకెళ్లిను శుభాంశు బృందం మిషన్ సక్సెస్ అవ్వాలన్నేదే దేశమంతటి ఆ కాంక్ష కూడా. ఈ క్రమంలో యావత్తు దేశం గర్వపడేలా చేసే కుమారుడిని కన్న తల్లిదండ్రుల భావోద్వేగం మాటలకందనిది. అంతరిక్షంలోకి అడుగుపెట్టి తమ కొడుకుని చూసి ఆ తల్లిదండ్రులిద్దరూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఏ పేరెంట్స్‌కి అయినా ఇది గర్వంతో ఉప్పొంగే క్షణం. లక్నోలోని తమ ఇంటి నుంచి తమ కుమారుడు శుభాంశు ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఆక్సియమ్ మిషన్ 4 ఆకాశంలోకి ఎగిసిన విధానాన్ని వీక్షించారు. ముఖ్యంగా శుభాంశు తల్లి ఆశా శుక్లాకి అదంతా చూసి కన్నీళ్లు ఆగలేదు. అయితే అవి ఆనందంతో ఉప్పొంగిన ఆనందభాష్పాలని చెప్పారామె. తమ బంధువులు, సన్నిహితులు స్క్రీన్లకి అతుక్కుపోయి చూస్తున్న విధానం..పట్టరాని ఆనందాన్నిచ్చిందని అన్నారామె. మాటలే రానంతగా గొతు వణుకుతోందామెకు. అలాగే అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లోకి చేరిన వెంటనే గ్రూప్ కెప్టెన్ శుభాంశు దేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ..‘‘అంతరిక్షం నుంచి మీ అందరికి నమస్కారం. ఈ యాత్ర చాలా అద్భుతంగా ఉంది. సుమారు 41 ఏళ్ల తర్వాత మనం అంతరిక్షంలోకి తిరిగి వచ్చాం. ఈ అద్భుత యాత్రలో ప్రతి భారతీయుడూ నాకు తోడుగా ఐఎస్ఎస్లో ఉన్న భావనే కలుగుతోంది మీ అందరి ప్రేమ, ఆశీస్సులతోనే ఐఎస్ఎస్ చేరగలిగా. మనమంతా కలిసి ఈ యాత్రను మరింత ఉత్సాహభరితంగా మారుద్దాం. మీ అందరితో పాటు త్రివర్ణ పతాకం వెంట రాగా నాతోపాటు ఐఎస్ఎస్ చేరా. ఇది నా ఒక్కని ఘనత కాదు. భారతీయులందరి విజయం." అని అన్నారు. దానికి అతడి తల్లిదండ్రులు స్పందిస్తూ.. అది కేవలం తమ కుమారుడి దేశభక్తి మాత్రమే కాదు. అది చాలా వ్యక్తిగతమైనది. మా బిడ్డ ఇప్పుడు దేశ జెండా తోపాటు ఆ నక్షత్రాల మధ్య యావత్తు దేశ సామూహిక ఆకాంక్షలను తన భుజాలపై మోస్తున్నాడు. అని భావోద్వేగంగా అన్నారు.కాగా, తమ కుమారుడితో అంతరిక్షంలోనికి వెళ్లడానికి కొన్ని గంటల ముందు ఫోన్లో సంభాషించినట్లు తెలిపారు. నాన్న నా గురించి బాధపడుతూ ఉండిపోవద్దు. దేనికోసం ఇక్కడికి వచ్చానో..ఆ మిషన్‌ని విజయవంతంగా పూర్తి చేస్తాను అని చెప్పినట్లు శుభాంశు తండ్రి అన్నారు. అలాగే ఆయన అక్క సుచి కూడా 30 సెకన్లపాటు శుభాంశుతో మాట్లాడినట్లు సమాచారం. ఇక శుభాంశు కూడా బాగానే ఉన్నాడని, అతడికి శుభాకాంక్షలు కూడా తెలిపామని చెప్పుకొచ్చారు కుటుంబసభ్యులు. #WATCH | Lucknow, Uttar Pradesh: Parents, relatives of IAF Group Captain & astronaut Shubhanshu Shukla, celebrate as #Axiom4Mission lifts off from NASA's Kennedy Space Centre in Florida, US. The mission is being piloted by India's IAF Group Captain Shubhanshu Shukla. pic.twitter.com/bNTrlAq72r— ANI (@ANI) June 25, 2025 (చదవండి: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా క్యూట్ లవ్ స్టోరీ..! ప్రియతమ ఈ జర్నీలో..) -
శుభాంశు వెంట అంతరిక్షంలోకి జ్యోతి, ఉమ, సూర్య.. ఎలా తీసుకెళ్లాడంటే?
ఢిల్లీ: భారత అంతరిక్ష చరిత్రలో సువర్ణాధ్యాయానికి తెరలేచింది. భారతీయుల ఆకాంక్షలను మోసుకుంటూ రోదసిలోకి దూసుకెళ్లి కెప్టెన్ శుభాంశు శుక్లా మరో చరిత్ర లిఖించారు. గురువారం సాయంత్రం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లోకి విజయవంతంగా ప్రవేశించారు. ఆ ఘనత సాధించిన తొలి భారతీయునిగా చెరిగిపోని రికార్డును తన పేరిట లిఖించుకున్నారు.భారత కాలమానం ప్రకారం సాయంత్రం నాలుగు గంటలకు అది భూమి నుంచి 418 కి.మీ.ల ఎత్తున ఐఎస్ఎస్తో విజయవంతంగా అనుసంధానమైంది. తర్వాత ఐఎస్ఎస్తో డ్రాగన్ అనుసంధాన (డాకింగ్) ప్రక్రియ కొనసాగాయి. శుభాంశు బృందం ఆనంద హేలను కెమెరాల్లో ఆ క్షణాలను బంధించి భద్రపరిచారు. ఇక, శుభాంశు బృందం 14 రోజులపాటు అక్కడ గడపనుంది. 60కి పైగా వినూత్న ప్రయోగాలు చేసి అత్యంత విలువైన సమాచారాన్ని అందించనుంది.14 పాటు పరిశోధనలు..అయితే, ఈ అంతరిక్ష ప్రయాణానికి శుభాంశు తనతో పాటు కేరళకు చెందిన జ్యోతి, ఉమ, విజయ్, సూర్యను కూడా తీసుకెళ్లారట. మరి ఈ జ్యోతి, ఉమను శుభాంశు ఎలా తీసుకెళ్లాడనేది ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఏంటంటే.. శుక్లాతో కూడిన నలుగురు సభ్యుల బృందం ఆక్సియం-4 మిషన్‌లో భాగంగా 14 రోజుల పాటు అంతరిక్షంలో వివిధ ప్రయోగాలు చేయనున్నారు. ఈ ప్రయోగాల్లో విత్తనాల అధ్యయనం అనేది అతిముఖ్యమైనది. ఈ అంతరిక్ష ప్రయోగంలో ఉపయోగించనున్న అన్ని విత్తనాలు కేరళ నుంచి పంపినవే కావడం గమనార్హం. వీటిని కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని వెల్లాయణి, పట్టాంబి వంటి ప్రాంతీయ కేంద్రాలు అభివృద్ధి చేశాయి.విత్తనాలను అంతరిక్షంలోని సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో ఉంచి, తిరిగి భూమికి తీసుకొచ్చిన తర్వాత వాటిలో చోటుచేసే మార్పులను అధ్యయనం చేస్తారు. తద్వారా వాతావరణ మార్పులకు తట్టుకునే పంట రకాలను అభివృద్ధి చేయాలన్నది ఈ పరిశోధనల ప్రధాన లక్ష్యం. ఈ అధ్యయనం శాస్త్రీయంగా వాతావరణ మార్పులతో పోరాడేలా విత్తనాలను తయారు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని పరిశోధకుల నమ్మకం.ఇంతకీ జ్యోతి, ఉమ ఎవరంటే?జ్యోతి, ఉమ అనేవి కేరళలో చాలా పాపులర్ వరి విత్తనాలు. ఈ రెండు అధిక దిగుబడినిచ్చే వరి రకాలు. వరి సాగు కోసం రైతులు వీటిని విస్తృతంగా ఉపయోగిస్తారు. వరి విత్తనాలతో పాటు కింద చెప్పిన సీడ్స్‌ను కూడా శుభాన్షు తనతో తీసుకెళ్లారు. వీటిని పలుచోట్లలో అభివృద్ధి చేశారు. వ్యోమనౌకలో బరువు పరిమితి కారణంగా ఇస్రో (ISRO), ఈఎస్ఏ (ESA), నాసా (NASA) సూచనల మేరకు ఈ విత్తనాలను తగిన పరిమాణంలో తీసుకెళ్లారు. వరి విత్తనాలు – 20 గ్రాములు, టమాటా, వంకాయ, నువ్వులు, కూట్ల పప్పులు – ఒక్కోటి 4 గ్రాములు చొప్పున తీసుకెళ్లారు.జ్యోతి: (పట్టాంబి పరిశోధన కేంద్రం)ఉమ: (మంకొంబు పరిశోధన కేంద్రం)టమాటా: వెల్లాయణి విజయ్ (వెల్లాయణి వ్యవసాయ కళాశాల)కుట్ల పప్పు: కనకమణి (పట్టాంబి ప్రాంతీయ పరిశోధన కేంద్రం)వంకాయ: సూర్య (త్రిస్సూర్ వ్యవసాయ కళాశాల)నువ్వులు: తిలతార (కాయంకుళం ఓనట్టుకర ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం అభివృద్ధి చేసింది)ఈ ప్రయోగం ఎందుకు?ఈ ప్రయోగం ద్వారా విత్తనాలు అంతరిక్ష పరిస్థితుల్లో ఎలా ప్రతిస్పందిస్తాయి?. ఎలా మనుగడ సాగిస్తాయో తెలుసుకోవచ్చు. భూమికి తిరిగి వచ్చిన తర్వాత మొలకెత్తించి, వాటిలో సంభవించిన శారీరక, జన్యు మార్పులను విశ్లేషిస్తారు. భారతదేశం ఈ తరహా ప్రయోగాన్ని మొదటిసారిగా చేపడుతోంది. గతంలో చైనా ఇలాంటి ప్రయోగాలు చేసింది. ఇప్పటి వరకు భారతదేశం నుంచి విత్తనాలు అంతరిక్షానికి వెళ్లడం ఇదే మొదటిసారి. ఈ ప్రయోగం విజయం సాధిస్తే అది కేవలం కేరళకే కాకుండా దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగానికి శాస్త్రీయ పురోగతిలో ఓ మైలురాయి అవుతుంది. అటు శుభాంశు సైతం చరిత్రలో నిలిచిపోతారు. ఇదిలా ఉండగా.. ఫాల్కన్ 9 రాకెట్ రాకెట్ లాంచ్ అవ్వడానికి కొన్ని గంటల ముందు తన భార్య కోసం శుభాంశు ఒక భావోద్వేగమైన లేఖ రాశారు. అందులో తన కృతజ్ఞతను వ్యక్తం చేస్తూ.. తన ప్రయాణంలో నువ్వులేని లేటుని భర్తీ చేయలేనిది అని భావోద్వేగంగా రాశారు. దానికి శుభాంశు భార్య కామ్నా గర్వంతో కూడిన ప్రేమతో స్పందించారు. అదే సమయంలో, శుభాన్షు తల్లి ఆశా శుక్లా, యాక్సియం మిషన్-4కు ముందు తన కుమారుడికి కోడలు అందించిన మద్దతును ప్రశంసించారు. ‘ఇది మనందరికీ గర్వకారణమైన క్షణం. దేశంలోని త్రివేణి నగర్‌కు చెందిన ఒక అబ్బాయి ఇంతటి ఉన్నత స్థాయికి చేరుకోబోతున్నాడని అందరూ సంతోషంగా ఉన్నారు. మా కోడలు లేకుండా ఇది సాధ్యం కాదు. ఈ విజయంలో తను అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించింది’ అని ఆమె అన్నారు. -
41 ఏళ్ల తర్వాత స్పేస్ లోకి వెళ్లిన రెండో భారతీయుడు శుభాంశు శుక్లా
-
చరిత్ర సృష్టించిన శుభాన్షు
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష చరిత్రలో సువర్ణాధ్యాయానికి తెరలేచింది. మానవసహిత అంతరిక్ష యాత్ర దిశగా భారీ ముందడుగు పడింది. 140 కోట్ల పై చిలుకు బారతీయుల ఆకాంక్షలను మోసుకుంటూ నిన్న రోదసిలోకి దూసుకెళ్లి, ఆ ఘనత సాధించిన రెండో భారతీయునిగా నిలిచిన మన వాయుసేనాని గ్రూప్ కెపె్టన్ శుభాన్షు శుక్లా (39) నేడు మరోచరిత్ర లిఖించారు. గురువారం సాయంత్రం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లోకి విజయవంతంగా ప్రవేశించారు. ఆ ఘనత సాధించిన తొలి భారతీయునిగా చెరిగిపోని రికార్డును తన పేరిట లిఖించుకున్నారు. శుభాన్షుతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు ఇస్రో, నాసా సంయుక్త వాణిజ్య మిషన్ యాగ్జియం–4లో భాగంగా స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ ద్వారా బుధవారం విజయవంతంగా నింగికెగిసిన విషయం తెలిసిందే. 28 గంటల పాటు భూ కక్ష్యలో పరిభ్రమించిన అనంతరం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటల 1 నిమిషానికి అది భూమి నుంచి 418 కి.మీ.ల ఎత్తున ఐఎస్ఎస్తో విజయవంతంగా అనుసంధానమైంది. తర్వాత రెండు గంటల పాటు తప్పనిసరి తనిఖీలు, ఐఎస్ఎస్తో డ్రాగన్ అనుసంధాన (డాకింగ్) ప్రక్రియ కొనసాగాయి. 12 జతల హుక్కులతో పరస్పరం అనుసంధానమయ్యాయి. తర్వాత డ్రాగన్, ఐఎస్ఎస్ నడుమ సమాచార, ఇంధన లింకేజీ తదితర సంబంధాలు నెలకొన్నాయి. అంతా సజావుగా జరిగిపోయిందని నిర్ధారించుకున్నాక సాయంత్రం 5.44 గంటలకు ఐఎస్ఎస్ మూత తెరుచుకుని తొలుత మిషన్ కమాండర్ పెగ్గీ వాట్సన్ (అమెరికా), ఆ వెనకే శుభాన్షు ఐఎస్ఎస్లోకి ప్రవేశించారు. అనంతరం ఉజ్నాన్స్కీ విస్నేవ్‌స్కీ (పోలండ్), టిబర్ కపు (హంగరీ) వారిని అనుసరించారు. ఐఎస్ఎస్లోని ఏడుగురు వ్యోమగాములు వారికి చప్పట్ల నడుమ హార్దిక స్వాగతం పలికారు. వెల్కం డ్రింక్‌గా మంచినీళిచ్చి సేదదీర్చారు. శుభాన్షు బృందం ఆనంద హేలను కెమెరాల్లో బంధించి భద్రపరిచారు. అనంతరం పరస్పర ఆలింగనాలు, హై–ఫైవ్‌లు, క్షేమ సమాచారాలు తదితరాలతో ఐఎస్ఎస్ సందడిగా మారింది. శుభాన్షు బృందం 14 రోజులపాటు అక్కడ గడపనుంది. 60కి పైగా వినూత్న ప్రయోగాలు చేసి అత్యంత విలువైన సమాచారాన్ని అందించనుంది. ఐఎస్ఎస్లో అడుగుపెట్టిన తొలి భారతీయునిగా కొత్త చరిత్ర సృష్టించిన శుభాన్షుకు దేశ నలుమూలల నుంచీ అభినందన సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన స్వస్థలం లఖ్‌నవూలో తల్లిదండ్రులు తదితరులు హర్షాతిరేకాలు వెలిబుచ్చారు. భారత్ మాతా కీ జై అంటూ నినదించారు. హంగరీ, పోలండ్ దేశాల నుంచి ఒక వ్యోమగామి ఐఎస్ఎస్లో ప్రవేశించడం కూడా ఇదే తొలిసారి. 1984లో రాకేశ్ శర్మ అనంతరం అంతరిక్షంలోకి ప్రవేశించిన రెండో భారతీయునిగా శుభాన్షు నిలవడం తెలిసిందే.పాపాయిలా నేర్చుకుంటున్నా ఐఎస్ఎస్ నుంచి శుభాన్షు తొలి పలుకులు ఐఎస్ఎస్లో ప్రవేశించిన క్షణాలను ‘అత్యద్భుతమైనవి’గా శుభాన్షు అభివరి్ణంచారు. తన అనుభూతిని వీడియో లింకేజ్ ద్వారా అందరితోనూ పంచుకున్నారు. ‘‘తొలిసారి సహజమైన, సంపూర్ణమైన భారరహిత స్థితిలో అడుగుపెట్టా. శూన్యంలో తేలిపోతుంటే కలుగుతున్న అనుభూతి వర్ణనాతీతం!. ఇక్కడంతా కొత్త కొత్తగా, గమ్మత్తుగా ఉంది. నేను ఊహించిన దానికంటే కూడా ఎంతో గొప్పగా ఉంది. ఐఎస్ఎస్లో ప్రవేశించాక సజావుగా నుంచోవడం నేను అనుకున్న దానికంటే తేలికగానే ఉంది. కెమెరాలకు పోజివ్వడం వంటివన్నీ కూడా ఎంతో సరదాగా ఉన్నాయి. కాకపోతే తలే కాస్త భారంగా అనిపిస్తోంది. పారాడే పాపాయి మాదిరిగా నడక మొదలుకుని అన్నీ మొదటినుంచి కొత్తగా నేర్చుకుంటున్నా. శూన్య స్థితిలో నన్ను నేను నియంత్రించుకోవడానికి ప్రయతి్నస్తున్నా. చివరికి ఎలా తినాలో కూడా నేర్చుకుంటున్న పరిస్థితి!. ఆ క్రమంలో ఎన్నో తప్పటడుగులూ వేస్తున్నా. ఆ పొరపాట్లను పూర్తిగా ఆస్వాదిస్తున్నా. భారరహిత స్థితి అలవాటు లేక నా సహచరులు చేస్తున్న సరదా తప్పిదాలను కూడా అంతే ఎంజాయ్ చేస్తున్నా. ఇక్కడి పరిస్థితులకు మెల్లిగా అలవాటు పడుతున్నా. అద్భుత దృశ్యాలను ఆస్వాదిస్తున్నా. అన్ని విషయాలనూ ఒక్కొక్కటిగా నేర్చుకుంటున్నా. కొత్త వాతావరణం. ప్రతి క్షణమూ సరికొత్త అనుభూతులు. సహచరులతో కలిసి ప్రయోగాలు చేపట్టేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా’’ అని వివరించారు.శూన్యంలో తేలియాడా ప్రయోగం పొడవునా ఎదురైన అనుభూతులను శుభాన్షు ఆసక్తికరంగా వివరించారు. ‘‘బుధవారం గ్రేస్ (డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌కు శుభాన్షు బృందం పెట్టుకున్న పేరు)లో కూర్చుని ప్రయోగానికి సిద్ధమైన క్షణాల్లో నాలో ఒకే ఆలోచన మెదిలింది. ‘సరికొత్త చరిత్ర సృష్టించేందుకు బయల్దేరదాం పదా!’ అని నాకు నేను చెప్పుకున్నా. ప్రయోగం మొదలవగానే ఆ విసురుకు నా సీట్లోకి నొక్కుకుపోయా. రోదసిలోకి ప్రవేశించిన తొలి క్షణాల్లో ఏమంత పెద్దగా తేడా అనిపించలేదు. కానీ కాసేపటికే భారరహిత స్థితి తాలూకు మజా అనుభవంలోకి వచ్చింది. ‘వావ్! సూపర్ కదా!!’ అనిపించింది. ఐఎస్ఎస్ చేరేదాకా ఏకబిగిన 28 గంటల పాటు కదలకుండా కూచుని ఉండటం అలసటగా అని్పంచినా చెప్పలేని అనుభూతిని కూడా పంచింది. కాకపోతే చాలాసేపు నిద్రలోనే గడిపా. దాన్ని గుర్తు చేస్తూ నా సహచరులు ఇంకా నన్నెంతగానో ఆటపట్టిస్తున్నారు కూడా’’ అంటూ శుక్లా చెప్పుకొచ్చారు.అంతరిక్షం నుంచి నమస్కారం! ఐఎస్ఎస్తో అనుసంధానం అయ్యేముందు భారతీయులందరినీ శుభాన్షు ఆప్యాయంగా పలకరించారు. ‘అంతరిక్షం నుంచి మీకందరికీ నమస్తే. ఈ అద్భుత యాత్రలో ప్రతి భారతీయుడూ నాకు తోడుగా ఐఎస్ఎస్లో ఉన్న భావనే కలుగుతోంది’ అని శుభాన్షు అన్నారు. ‘‘మీ అందరి ప్రేమ, ఆశీస్సులతోనే ఐఎస్ఎస్ చేరగలిగా. మనమంతా కలిసి ఈ యాత్రను మరింత ఉత్సాహభరితంగా మారుద్దాం. మీ అందరితో పాటు త్రివర్ణ పతాకం వెంట రాగా నాతోపాటు ఐఎస్ఎస్ చేరా. ఇది నా ఒక్కని ఘనత కాదు. భారతీయులందరి విజయం. భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మానవసహిత అంతరిక్ష యాత్రకు ఘనమైన ఆరంభం’’ అంటూ శుభాన్షు హర్షాతిరేకాలు వెలిబుచ్చారు.అరగంట ముందుగానే డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ అనుకున్న సమయం కంటే అరగంట ముందుగానే ఐఎస్ఎస్తో అనుసంధానమైంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం వేపాయింట్ 1, 2 వద్ద ఆగకుండా చకచకా ఐఎస్ఎస్ను సమీపించడమే అందుకు కారణం. దానికి 20 మీటర్ల సమీపానికి చేరుకున్నాక డ్రాగన్ తుది అప్రోచ్‌కు సిద్ధమైంది. లేజర్ ఆధారిత సెన్సర్లు, కెమెరాల సాయంతో ఐఎస్ఎస్ హార్మనీ మాడ్యూల్ తాలూకు డాకింగ్ పోర్ట్‌తో సవ్యంగా అనుసంధానమైంది. అనంతరం ఐఎస్ఎస్లోని ఏడుగురు సిబ్బంది డ్రాగన్‌లో ఏమైనా లీకేజీలు తదితరాలు చోటుచేసుకున్నాయేమో తనిఖీ చేశారు. డ్రాగన్ లోపలి పీడనం ఐఎస్ఎస్తో సమానంగా ఉందని నిర్ధారించుకున్నారు. అలా డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా ముగిశాక వ్యోమగాములు ఐఎస్ఎస్లోకి అడుగుపెట్టారని నాసా ప్రకటించింది. ఇది దేశమంతటికీ గర్వకారణమని ఇస్రో ఒక ప్రకటనలో పేర్కొంది. జాయ్.. ఐదో ‘వ్యోమగామి’ శుభాన్షు, మరో నలుగురితో పాటు యాగ్జియం–4 మిషన్ ద్వారా ఐదో వ్యోమగామి ‘జాయ్’ కూడా ఐఎస్ఎస్ చేరింది! అదెవరా అని ఆశ్చర్యపోతున్నారా? నిజానికి అదొక హంస బొమ్మ!. వ్యోమగాములు జీరో గ్రావిటీ (శూన్య స్థితి)కి చేరగానే వారిని అలర్ట్ చేస్తుందన్నమాట. జీరో గ్రావిటీని సూచించే బొమ్మలను ఇలా అంతరిక్షంలోకి వెంట తీసుకెళ్లడం తొలి రోదసి యాత్రికుడు యూరీ గగారిన్ నాటినుంచీ వస్తున్న ఆనవాయితీ. దానికి కొనసాగింపుగా జాయ్ బొమ్మను యాగ్జియం–4 బృందం తమ వెంట తీసుకెళ్లింది. శుభాన్షు కుమారుని కోసం.. శుభాన్షు కుమారుడు కియశ్కు జంతువులంటే ఉన్న ప్రేమను దృష్టిలో పెట్టుకుని హంస బొమ్మను ఎంపిక చేసుకున్నట్టు యాగ్జియం–4 మిషన్ కమాండర్ వాట్సన్ చెప్పడం విశేషం! పాలను, నీటిని వేరుచేసే హంస భారతీయ సంప్రదాయంలో జ్ఞానానికి అత్యున్నత ప్రతీక అని శుభాన్షు తన సహచర వ్యోమగాములకు వివరించారు. నంబర్ 634 శుభాన్షు అంతరిక్షంలోకి వెళ్లిన 634వ వ్యోమగామిగా నిలిచారు. అందుకు గుర్తుగా ఐఎస్ఎస్లో ఆయనకు వ్యోమగామి నంబర్ 634 అంటూ అధికారికంగా స్పేస్ స్టేషన్ పిన్ కేటాయించారు. ‘‘నేను ఆస్ట్రోనాట్ నంబర్ 634ను. ఇక్కడ ఉండటం నిజంగా గర్వకారణంగా అనిపిస్తోంది. ఐఎస్ఎస్ నుంచి భూమిని చూసే అవకాశం దక్కిన అతి కొద్ది మందిలో నాకు చోటు దక్కడం ఎంతో ఆనందంగా ఉంది’’ అని శుభాన్షు వ్యాఖ్యానించారు. -
ఇది మనమంతా గర్వించదగ్గ క్షణం: వైఎస్ జగన్
తాడేపల్లి: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో అడుపెట్టిన శుభాంశు శుక్లా బృందానికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు , మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఇది నిజంగా మనందరికీ గర్వకారణమైన క్షణమని వైఎస్ జగన్ కొనియాడారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు జగన్.‘28 గంటల ప్రయాణం తర్వాత, అంతరిక్ష నౌక ఐఎస్ఎస్తో విజయవంతంగా డాకింగ్ జరగటం సంతోషకరం. శుభాంశు శుక్లా బృందం 14 రోజులపాటు పరిశోధనలు చేయబోతున్నారు. నాసా, ఇస్రోలు సంయుక్తంగా ఈ మిషన్‌ను విజయవంతం చేసి ఒక మైలురాయిని అధిగమించాయి.ఈ చారిత్రక విజయంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు. రానున్న రోజుల్లో మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నా’ అని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.Truly a proud moment! Very happy to learn that after a 28-hour journey, the spacecraft successfully docked with the ISS. #ShubhanshuShukla and team are set for 14 days of crucial research. The #Ax4 Mission, a joint effort by NASA and ISRO, marks a significant milestone in space…— YS Jagan Mohan Reddy (@ysjagan) June 26, 2025 ఆ 14 రోజులు ఎలా ఉంటుందనేదే అత్యంత ఆసక్తిగా ఉంది: శుభాంశు శుక్లాISSలోకి అడుగుపెట్టి.. చరిత్ర సృష్టించిన శుభాంశు -
ఆ 14 రోజులు ఎలా ఉంటుందనేదే అత్యంత ఆసక్తిగా ఉంది: శుభాంశు శుక్లా
న్యూఢిల్లీ: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన శుభాంశు శుక్లా.. మిగతా 14 రోజులు తాము ఇక్కడ చేసే పరిశోధనే అత్యంత ఆసక్తిని కల్గిస్తుందని స్పష్టం చేశాడు. ప్రస్తుతానికి కాస్త చిన్నపాటి తలనొప్పిగా ఉన్నప్పటికీ అదేమీ పెద్ద సమస్య కాదన్నాడు. తమ ముందున్న టాస్క్ అనేది చాలా ముఖ్యమని చెప్పుకొచ్చాడు శుభాంశు శుక్లా. ‘ ఇది చాలా గర్వించదగ్గ సమయం. మన అంతరిక్షయానంలో ఇదొక మైలురాయి. 14 రోజుల పరిశొధన మాకు అత్యంత కీలకం కానుంది’ అని తెలిపాడు ఐఎస్ఎస్ నుంచి స్పష్టం చేశాడు శుభాంశు.కాగా, అంతరిక్ష పరిశోధనల్లో మరో కలికితురాయి. 28 గంటల సుదీర్ఘ వ్యోమనౌక ప్రయాణం తర్వాత ఐఎస్ఎస్లోకి శుభాంశు శుక్లా బృందం అడుగుపెట్టింది. ఫలితంగా శుభాంశు శుక్లా అంతరిక్ష కేంద్రంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు.శుభాంశు శుక్లా బృందం యాక్సియం-4 మెషిన్ ద్వారా అంతర్జాతీయ పరిశోదనా కేంద్రంలోకి అడుగు పెట్టనుంది. ఇప్పటి నుంచి 14 రోజుల పాటు పరిశోధనలు చేయనుంది. ఇంతకు ముందు ఐఎస్ఎస్తో స్పేస్ డాకింగ్ ప్రక్రియ మొదలైంది. ఈ ప్రక్రియ విజయవంతమైంది. 14 రోజుల పాటు శాస్త్రీయ ప్రయోగాలు శుభాంశు శుక్లా బృందం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో 14 రోజుల పాటు శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించనుంది. ఈ ప్రయోగాలు ప్రధానంగా భారరహిత స్థితిలో మానవ శరీరంపై ప్రభావం, పోషకాహార వ్యవస్థలు, జీవనాధార సాంకేతికతలు, రోగనిరోధక వ్యవస్థ వంటి అంశాలపై దృష్టి సారించనుంది. అలాగే, ఇస్రో తరఫున శుభాంశు ఏడు ముఖ్యమైన ప్రయోగాలు చేస్తారు. దీంతో పాటు నాసా నిర్వహించే ఐదు ఉమ్మడి అధ్యయనాల్లోనూ ఆయన పాల్గొంటారు. మొత్తం మీద, యాక్సియం-4 మిషన్‌లో పాల్గొన్న వ్యోమగాములు 31 దేశాలకు చెందిన 60 శాస్త్రీయ ప్రయోగాలు చేపడతారు. ఇది ఒకే మిషన్‌లో అత్యధిక ప్రయోగాలుగా గుర్తింపు పొందుతోంది. -
NASA: ISSలోకి శుభాంశు శుక్లా టీమ్
-
Shubhanshu Shukla: ISSలోకి అడుగుపెట్టి.. చరిత్ర సృష్టించిన శుభాంశు
సాక్షి,ఢిల్లీ: అంతరిక్ష పరిశోధనల్లో మరో కలికితురాయి. 28 గంటల సుదీర్ఘ వ్యోమనౌక ప్రయాణం తర్వాత ఐఎస్ఎస్లోకి శుభాంశు శుక్లా బృందం అడుగుపెట్టింది. ఫలితంగా శుభాంశు శుక్లా అంతరిక్ష కేంద్రంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. శుభాంశు శుక్లా బృందం యాక్సియం-4 మెషిన్ ద్వారా అంతర్జాతీయ పరిశోదనా కేంద్రంలోకి అడుగు పెట్టనుంది. ఇప్పటి నుంచి 14 రోజుల పాటు పరిశోధనలు చేయనుంది. ఇంతకు ముందు ఐఎస్ఎస్తో స్పేస్ డాకింగ్ ప్రక్రియ మొదలైంది. ఈ ప్రక్రియ విజయవంతమైంది. గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా. అంతరిక్షంలో ప్రవేశించి, ఐఎస్ఎస్లో అడుగుపెట్టిన ఆయన పేరు దేశమంతటా మార్మోగిపోతోంది. మానవసహిత అంతరిక్ష యాత్ర దిశగా భరత జాతి కంటున్న ఎన్నో ఏళ్ల కలకు ఎట్టకేలకు రెక్కలు తొడిగిన ఆయన, ఆ క్రమంలో తన చిన్ననాటి కలను కూడా విజయవంతంగా నెరవేర్చుకున్నారు. #Ax4's @SpaceX Dragon spacecraft docked with the @Space_Station at 6:31am ET (1031 UTC). Next, the mission crew and our NASA astronauts will prepare to open the hatches. pic.twitter.com/Qj1sgy7RzC— NASA (@NASA) June 26, 2025అమెరికా టూ అంతరిక్షంభారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12 గంటలు దాటి ఒక నిమిషం. అమెరికాలో ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్. పదేపదే వాయిదాల అనంతరం, యాగ్జియం–4 మిషన్ వాణిజ్య మిషన్‌ను వెంట తీసుకుని స్పేస్ఎక్స్ ఫాల్కన్–9 రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. కాసేపటికే యాగ్జియం–4 క్యాప్సూల్ రాకెట్ నుంచి విడివడింది. మొత్తమ్మీద 10 నిమిషాల్లోనే భూమికి 200 కి.మీ. ఎగువ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. మిషన్ పైలట్‌గా 140 కోట్ల పై చిలుకు భారతీయుల ఆకాంక్షలను మోసుకుంటూ మన వ్యోమగామి, గ్రూప్ కెప్టెన్‌గా శుభాంశు శుక్లా (39) సగర్వంగా రోదసిలోకి ప్రవేశించారు. రాకేశ్ శర్మ తర్వాత 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం అంతరిక్షంలో అడుగు పెట్టిన రెండో భారతీయునిగా నిలిచారు. (Shubhanshu Shukla ‘నిన్నటినుంచి తెగ నిద్రపోతున్నానట’)అంతరిక్షంలో 28 గంటల ప్రయాణం అనంతరం యాగ్జియం–4 మిషన్ భారత కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం దాదాపు 4:30 గంటలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)తో అనుసంధానం అయ్యింది. అనంతరం మరో ముగ్గురు సహచర వ్యోమగాములు మిషన్ కమాండర్, నాసా ఆస్ట్రోనాట్ పెగ్గీ విట్సన్, మిషన్ స్పెషలిస్టులు స్లవోస్ ఉజ్నాన్స్కీ విస్నియెవ్స్కీ (పోలండ్), టైబర్ కపు (హంగరీ)తో కలిసి శుభాంశు శుక్లా ఐఎస్ఎస్లోకి ప్రవేశిస్తారు. LIVE: @Axiom_Space's #Ax4 mission, with crew from four different countries, is about to launch to the @Space_Station! Liftoff from @NASAKennedy is targeted for 2:31am ET (0631 UTC). https://t.co/yBgO8bxb6Z— NASA (@NASA) June 25, 202514 రోజుల పాటు శాస్త్రీయ ప్రయోగాలు శుభాంశు శుక్లా బృందం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో 14 రోజుల పాటు శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించనుంది. ఈ ప్రయోగాలు ప్రధానంగా భారరహిత స్థితిలో మానవ శరీరంపై ప్రభావం, పోషకాహార వ్యవస్థలు, జీవనాధార సాంకేతికతలు, రోగనిరోధక వ్యవస్థ వంటి అంశాలపై దృష్టి సారించనుంది. అలాగే, ఇస్రో తరఫున శుభాంశు ఏడు ముఖ్యమైన ప్రయోగాలు చేస్తారు. దీంతో పాటు నాసా నిర్వహించే ఐదు ఉమ్మడి అధ్యయనాల్లోనూ ఆయన పాల్గొంటారు. మొత్తం మీద, యాక్సియం-4 మిషన్‌లో పాల్గొన్న వ్యోమగాములు 31 దేశాలకు చెందిన 60 శాస్త్రీయ ప్రయోగాలు చేపడతారు. ఇది ఒకే మిషన్‌లో అత్యధిక ప్రయోగాలుగా గుర్తింపు పొందుతోంది.రాకేశ్ శర్మ తర్వాత శుభాంశు శుక్లారాకేశ్ శర్మ భారతదేశం తరఫున అంతరిక్షంలోకి వెళ్లిన తొలి వ్యోమగామి. ఆయన 1984లో సోవియట్ యూనియన్‌కు చెందిన సోయుజ్ టి-11 రాకెట్ ద్వారా అంతరిక్ష ప్రయాణం చేశారు. ఆయన మొత్తం 7 రోజులు 21 గంటలు 40 నిమిషాలు అంతరిక్షంలో గడిపారు. ఈ ప్రయాణంలో భాగంగా ఆయన భారతదేశాన్ని అంతరిక్షం నుంచి పరిశీలించి, శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించారు.రాకేశ్ శర్మ తర్వాత ఇప్పుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి వెళ్లిన రెండో భారతీయుడే ఈ శుభాంశు శుక్లా. నాలుగు దశాబ్దాల తర్వాత మళ్లీ భారతీయుడు అంతరిక్షంలో అడుగుపెడుతున్న సందర్భంలో రాకేశ్ శర్మే తనకు స్పూర్తంటూ శుభాంశు శుక్లా పేర్కొన్నారు. 1984లో రాకేశ్ శర్మను చూసి ఎంతోమంది యువత అంతరిక్షం పట్ల ఆసక్తి పెంచుకున్నారు. ఇప్పుడు శుభాంశు కూడా అదే మార్గాన్ని అనుసరిస్తూ, తదుపరి తరం భారతీయులకు ప్రేరణగా నిలిచారు. -
Shubhanshu Shukla ‘నిన్నటినుంచి తెగ నిద్రపోతున్నానట’
భారత వ్యోమగామి 39 ఏళ్ల భారత వైమానిక దళ పైలట్, గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా, ఆక్సియం-4 మిషన్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లోకి ఎగిసిన కొన్ని గంటల తర్వాత , కక్ష్య నుండి తన తొలి వ్యక్తిగత సందేశాన్ని పంపించారు. గాల్లోకి పంపినప్పుడు గొప్పగా అనిపించలేదు అంటూనే అంతరిక్షంలో తన ఫీలింగ్‌ను పంచుకున్నారు. "అంతరిక్షం నుంచి అందరికీ నమస్కారం. తోటి వ్యోమగాములతో ఇక్కడ ఉండటం చాలా ఆనందంగా ఉంది. వావ్, ఎంత ఆనందం.. అద్భుతమైన ప్రయాణం. లాంచ్‌ప్యాడ్‌లోని క్యాప్సూల్‌లో ఇప్పుడిప్పుడే నడక నేర్చిన చిన్నారిలా ప్రతీక్షణం ఆస్వాదిస్తున్నా..ఎలా కదలాలో, ఎలా తినాలో.. ఎలా నియంత్రించుకోవాలో తెలుసుకుంటున్నా’ అంటూ శుభాన్షు తన అనుభవాలను సందేశంలో పంచుకున్నారు. అలాగే స్పేస్‌క్రాఫ్ట్‌లో తన మొదటి గంటల్లో, జీరో గ్రావిటీకి అలవాటు పడుతూ, తన అనుభవం గురించి మాట్లాడారు. నిన్నటి నుండి చాలా నిద్రపోతూనే ఉన్నానట అంటూ చెప్పుకొచ్చారు.చదవండి: డిజిటల్ యాప్స్ బంద్, జీపే కూడా తీసేసా: సానియా మీర్జా సోదరి సంచలన పోస్ట్కాగా భారత వ్యోమగామి రాకేశ్‌శర్మ తరువాత తాజా ప్రయోగంతో 41 ఏండ్ల తర్వాత రోదసిలోకి వెళ్తున్న రెండో భారతీయుడిగా శుభాన్షు రికార్డు సృష్టిస్తున్నారు. ఐఎస్ఎస్లోకి వెళ్తున్న తొలి భారతీయుడు కూడా శుభాన్షు కావడం విశేషం.మాజీ నాసా వ్యోమగామి , గత మూడు మిషన్లలో అనుభవజ్ఞుడైన కమాండర్ పెగ్గీ విట్సన్ , మిషన్ నిపుణులు హంగేరీకి చెందిన టిబోర్ కాపు, పోలాండ్‌కు చెందిన స్లావోజ్ ఉజ్నాన్స్కీ-విస్నివ్స్కీలతో పాటు యాక్స్-4 మిషన్‌లో ఉన్న నలుగురు వ్యోమగాములలో శుక్లా ఒకరు.చదవండి: మూడు నెలల ముందే పదేళ్ల జీవితానికి ప్లాన్ : కానీ అంతలోనే! -
ఘనంగా రెండో అడుగు
న్యూఢిల్లీ: భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12 గంటలు దాటి ఒక నిమిషం. అమెరికాలో ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్. పదేపదే వాయిదాల అనంతరం, దేశమంతా ఊపిరి బిగబట్టి మరీ ఎదురుచూస్తున్న చరిత్రాత్మక క్షణాలు ఎట్టకేలకు రానే వచ్చాయి. యాగ్జియం–4 మిషన్ వాణిజ్య మిషన్‌ను వెంట తీసుకుని స్పేస్ఎక్స్ ఫాల్కన్–9 రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. కాసేపటికే యాగ్జియం–4 క్యాప్సూల్ రాకెట్ నుంచి విడివడింది. మొత్తమ్మీద 10 నిమిషాల్లోనే భూమికి 200 కి.మీ. ఎగువ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. మిషన్ పైలట్‌గా 140 కోట్ల పై చిలుకు భారతీయుల ఆకాంక్షలను మోసుకుంటూ మన వ్యోమగామి, గ్రూప్ కెపె్టన్ శుభాన్షు శుక్లా (39) సగర్వంగా రోదసిలోకి ప్రవేశించారు. రాకేశ్ శర్మ తర్వాత 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం అంతరిక్షంలో అడుగు పెట్టిన రెండో భారతీయునిగా నిలిచారు. మర్చిపోలేని ఆ క్షణాలను రోదసి నుంచే దేశవాసులందరితో పంచుకుని మురిసిపోయారు. ‘ప్రియమైన నా దేశవాసులారా! నమస్తే’ అంటూ భుజాన త్రివర్ణ పతాకం ధరించి భావోద్వేగానికి లోనయ్యారు. అంతరిక్ష ప్రవేశ యాత్ర అద్భుతంగా సాగిందంటూ సంభ్రమాశ్చర్యాల నడుమ పేర్కొన్నారు. జైహింద్, జై భారత్ అంటూ రోదసి సాక్షిగా నినదించారు. శుభాన్షు స్వస్థలం లఖ్‌నవూ నుంచి ప్రయోగాన్ని ఆద్యంతం వీక్షించిన ఆయన తల్లిదండ్రులు ఆనందాశ్రువులు రాల్చారు. తమ కుమారుడు చరిత్ర సృష్టించాడంటూ పరవశించిపోయారు. కేంద్ర మంత్రివర్గం ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో సమావేశమై శుభాన్షు ఘనతను ప్రస్తుతించింది. దేశపతాకను ఆయన అత్యున్నత స్థాయిలో రెపరెపలాడించారంటూ ప్రశంసించింది. రాజకీయ తదితర రంగాల ప్రముఖులు తదితరుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. అంతరిక్షంలో 28 గంటల ప్రయాణం అనంతరం యాగ్జియం–4 మిషన్ భారత కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం దాదాపు 4:30 గంటలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)తో అనుసంధానం అవనుంది. అనంతరం మరో ముగ్గురు సహచర వ్యోమగాములు మిషన్ కమాండర్, నాసా ఆస్ట్రోనాట్ పెగ్గీ విట్సన్, మిషన్ స్పెషలిస్టులు స్లవోస్ ఉజ్నాన్స్కీ విస్నియెవ్స్కీ (పోలండ్), టైబర్ కపు (హంగరీ)తో కలిసి శుభాన్షు ఐఎస్ఎస్లోకి ప్రవేశిస్తారు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయునిగా ఆయన సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు. యాగ్జియం–4 ఇస్రో, నాసా సంయుక్త మద్దతుతో రూపొందిన వాణిజ్య అంతరిక్ష యాత్ర.మిషన్ గ్రేస్ మిస్టర్ శుక్స్ ఐఎస్ఎస్లో ఉన్నంతకాలం శుభాన్షును శుక్స్ అనే సంకేత నామంతో పిలవనున్నారు. అలాగే తమ యాగ్జియం–4 వ్యోమనౌకకు కూడా వ్యోమగాములు నలుగురూ గ్రేస్ అని పేరు పెట్టుకున్నారు. విజయవంతంగా అంతరిక్షంలో చేరిన అనంతరం వారు ఈ మేరకు వెల్లడించారు. ‘‘ఓపికతో వేచి చూసేవారికి అంతా మంచే జరుగుతుంది. గ్రేస్ సిబ్బంది తొలి యాత్రను దేవుడు అన్నివిధాలా వెంట ఉండి నడిపించు గాక’’ అంటూ యాగ్జియం–4 బృందానికి స్పేస్ ఎక్స్ శుభాకాంక్షలు తెలిపింది.వందేమాతరం నుంచి... ‘యూ హి చలా చల్’ దాకా అంతరిక్ష యాత్రకు బయల్దేరే ముందు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడానికి, ప్రశాంతంగా ఉండటానికి వ్యోమగాములు తమకు నచి్చన సంగీతాన్ని, పాటలను ఆస్వాదించడం ఆనవాయితీ. అలా యాగ్జియం–4 యాత్రకు బయల్దేరే ముందు శుభాన్షు హృతిక్ రోషన్ హీరోగా నటించిన ‘ఫైటర్’ సినిమాలోని తనకెంతో ఇష్టమైన వందేమాతరం పాటను విన్నారు. ఐఎస్ఎస్లో ఆస్వాదించేందుకు వీలుగా పలు పాటలతో కూడిన ప్లే లిస్ట్‌ను అంతరిక్షంలోకి తీసుకెళ్లారు. అందులో షారుక్ ఖాన్ నటించిన ‘స్వదేశ్’ సినిమాలోని సూపర్‌హిట్ రోడ్డు పాట ‘యూ హి చలా చల్ రాహీ, కిత్నీ హసీఁ హై ఏ దునియా (అలా సాగిపో యాత్రికా, ఈ ప్రపంచమెంత అందమైనదో!) తదితర పాటలు అందులో ఉన్నాయి. ప్రయోగానికి ముందు శుభాన్షు ఎక్స్ పోస్టులో ఈ మేరకు వెల్లడించారు. యాదృచి్చకంగా స్వదేశ్ సినిమాలో షారుక్ కూడా నాసా సైంటిస్టు కావడం విశేషం.చిన్ననాటి కల సాకారం! గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా. అంతరిక్షంలో ప్రవేశించి, ఐఎస్ఎస్లో అడుగుపెట్టబోతున్న ఆయన పేరు దేశమంతటా మార్మోగిపోతోంది. మానవసహిత అంతరిక్ష యాత్ర దిశగా భరత జాతి కంటున్న ఎన్నో ఏళ్ల కలకు ఎట్టకేలకు రెక్కలు తొడిగిన ఆయన, ఆ క్రమంలో తన చిన్ననాటి కలను కూడా విజయవంతంగా నెరవేర్చుకున్నారు. రాకేశ్ శర్మ అంతరిక్షంలో కాలుమోపిన ఏడాదికి, అంటే 1985లో ఉత్తరప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలో శుభాన్షు జని్మంచారు. బాల్యంలో ఒక ఎయిర్ షో చూసినప్పటి నుంచే ఆకాశంపై మనసు పారేసుకున్నారు. విమానాలు, వాటి వేగం, వాటి శబ్దాలు తన బుల్లి మనసులో శాశ్వతంగా తిష్ట వేసుకుపోయాయి. పైలట్ కావాలని అప్పుడే తీర్మానించుకున్నారాయన. నేషనల్ డిఫెన్స్ అకాడెమీలో చేరి తన కల నిజం చేసుకున్నారు. 2006లో భారత వాయుసేనలో చేరారు. పదేళ్ల పై చిలుకు కెరీర్లో 2 వేల గంటల పైచిలుకు ఫ్లయింగ్ అవర్స్ అనుభవం ఆయన సొంతం. సుఖోయ్–30 ఎంకేఐ, మిగ్–29తో పాటు జాగ్వార్, డోర్నియర్–228 వంటి పలు యుద్ధ విమానాలు నడిపారు. ప్రస్తుతం గ్రూప్ కెప్టెన్‌గా చేస్తున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి ఏరోస్పేస్లో ఎంటెక్ చేశారు. 2027లో ఉద్దేశించిన గగన్‌యాన్ మిషన్ కోసం 2019లో కేంద్రం ఎంపిక చేసిన నలుగురు ఆస్ట్రొనాట్ల బృందంలో శుభాన్షు ఒకరు. అంతరిక్ష యాత్ర నిమిత్తం తొలుత బెంగళూరులో, తర్వాత రష్యాలో గగారిన్ కాస్మోనాట్ శిక్షణ కేంద్రంలో కఠోరమైన శిక్షణ పొందారు. యాగ్జియం–4 మిషన్‌కు పైలట్‌గా కీలక బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఏకాగ్రత, సునిశిత బుద్ధి తిరుగులేనివని సహచర వ్యోమగాములు కూడా కితాబిచ్చారు. ...అలా ఎన్డీఏలోకి శుభాన్షు పేరు ఇప్పుడిలా దేశమంతా మారుమోగుతోందంటే ఆయన ఎన్డీఏలో చేరి వాయుసేన పైలట్ కావడమే ప్రధాన కారణం. అయితే ఎన్డీఏలో శుభాన్షు ప్రవేశం అనుకోకుండా జరిగిందని ఆయన తండ్రి గుర్తు చేసుకున్నారు. ‘‘శుభాన్షు స్కూల్‌మేట్స్ ఎన్డీఏ పరీక్ష రాసేందుకు దరఖాస్తు ఫారాలు తీసుకొచ్చారు. కానీ వారిలో ఒకరికి వయోపరిమితి దాటిపోయింది. దాంతో శుభాన్షును రాస్తావా అని అడిగాడు. మావాడు వెంటనే సరేనన్నాడు. అలా పరీక్ష రాసి ఎన్డీఏకు సెలక్టయ్యాడు’’ అంటూ వివరించారు. తమకైతే శుభాన్షు సివిల్స్ రాసి కలెక్టర్ కావాలని ఉండేదని వెల్లడించారు. తల్లిదండ్రుల ఆనంద నృత్యం శుభాన్షు అంతరిక్షయాత్రను వీక్షించి ఆయన తల్లిదండ్రులు ఉప్పొంగిపోయారు. యాగ్జియం–4 ప్రయోగాన్ని లఖ్‌నవూలో శుభాన్షు విద్యాభ్యాసం చేసిన సిటీ మాంటెసొరీ స్కూల్లో ప్రత్యక్షప్రసారం ద్వారా వారు వీక్షించారు. యాత్ర విజయవంతం కాగానే తోటివారందరితో కలిసి భాంగ్రా నృత్యం చేస్తూ ఆనందం పంచుకున్నారు. ప్రాంగణమంతా చప్పట్లతో, ‘హిప్ హిప్ హుర్రే’, ‘భారత్‌మాతా కీ జై’ నినాదాలతో మార్మోగిపోయింది. తమకివి మరపురాని క్షణాలని శుభాన్షు తండ్రి శంభూ శుక్లా అన్నారు. ‘‘ఇవి ఆనందాశ్రువులు. ఇంతకన్నా మాట్లాడేందుకు నాకు మాటలే రావడం లేదు’’ అని తల్లి ఆశా చెప్పారు. తన కొడుకు ఇలాంటి ఘనత సాధిస్తాడని ముందే తెలుసన్నారు. యాత్ర జయప్రదం కావాలని ఆకాంక్షిస్తూ ప్రయోగానికి ముందు కుమారునికి ఆమె వర్చువల్‌గా చక్కెర కలిపిన పెరుగు తినిపించి నోరు తీపి చేశారు. తమ విద్యార్థి భారత కీర్తిని అంతరిక్షం దాకా చేర్చాడంటూ స్కూలు టీచర్లు తదితరులు కూడా హర్షం వెలిబుచ్చారు.నాడు ‘సారే జహా సే అచ్చా’ స్క్వాడ్రన్ లీడర్ రాకేశ్ శర్మ తర్వాత రోదసిలోకి ప్రవేశించిన రెండో భారతీయునిగా శుభాన్షు శుక్లా నిలిచారు. సోవియట్ యూనియన్ సల్యూట్–7 స్పేస్ మిషన్‌లో భాగంగా రాకేశ్ శర్మ 1984లో 8 రోజుల పాటు అంతరిక్ష యాత్ర చేయడం తెలిసిందే. అక్కడినుంచి భూమి ఎలా కన్పిస్తోందన్న అప్పటి ప్రధాని ఇందిర ప్రశ్నకు బదులుగా ‘సారే జహా సే అచ్చా’ అంటూ రాకేశ్ శర్మ ఇచ్చిన భావోద్వేగపూరిత సమాధానంతో జాతి యావత్తూ ఉప్పొంగిపోయింది.ప్రయోగానికి ముందూ సమస్యలే యాగ్జియం–4 ప్రయోగ వేళ సమీపించగానే సహచర వ్యోమగాములతో కలిసి శుభాన్షు నెల రోజుల క్వారెంటైన్ నుంచి బయటికొచ్చారు. ఒక్కొక్కరుగా వ్యోమనౌకలోకి ప్రవేశించారు. రాకెట్ తాలూకు ఒక తీగ వేలాడుతుండటంతో పాటు పలు సమస్యలను గమనించి అప్పటికప్పుడు సరిచేశారు. మే 29న జరగాల్సిన ఈ ప్రయోగం రాకెట్ సమస్యలతో పదేపదే వాయిదా పడుతూ వచ్చింది.14 రోజులు, 60 ప్రయోగాలు శుభాన్షు తన ముగ్గురు సహచర వ్యోమగాములతో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో 14 రోజుల పాటు గడుపుతారు. ఈ సందర్భంగా భారరహిత స్థితిలో వారు దాదాపు 60 ప్రయోగాలు నిర్వహిస్తారు. వాటిలో ఆహారం, పౌష్టికత సంబంధిత ప్రయోగాలు కూడా ఉన్నాయి. వాటిని నాసో మద్దతుతో ఇస్రో, కేంద్ర బయోటెక్నాలజీ శాఖ రూపొందించాయి. శుభాన్షు కోసం ఇస్రో ఏడు ప్రయోగాలను సిద్ధం చేసి ఉంచింది. సూక్షభార స్థితిలో మెంతులు, పెసలు ఎలా మొలకెత్తుతాయో ఆయన పరీక్షించి చూడనున్నారు. ప్రధానితో, పిల్లలతో మాటామంతి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి ప్రధాని మోదీతో శుభాన్షు మాటామంతి జరపనున్నారు. అలాగే పలు స్కూళ్లకు చెందిన విద్యార్థులతో పాటు అంతరిక్ష రంగ నిపుణులు, సంస్థల సీఈఓలు, దిగ్గజాలతో కూడా ఆయన తన అనుభవాలను పంచుకుంటారు.క్యారెట్ హల్వా, మామిడి రసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) భారతీయ వంటకాల ఘుమఘుమలాడనుంది. భారత పాక ప్రావీణ్యానికి అద్దం పట్టే కూరలు, అన్నం, మామిడి రసం వంటివాటిని శుభాన్షు ఐఎస్ఎస్కు వెంట తీసుకెళ్లారు. ‘‘తనకు క్యారెట్, పెసరపప్పు హల్వా అంటే చాలా ఇష్టం. వాటితోపాటు మరెన్నో మా ఇంటి రుచులను వెంట తీసుకెళ్లాడు. తోటి వ్యోమగాములకు కూడా రుచి చూపిస్తానని చెప్పాడు’’ అని శుభాన్షు సోదరి శుచి తెలిపా రు. ఇతర వ్యోమగాములు పప్రికా పేస్ట్ (హంగరీ), ఫ్రీజ్–ఫ్రైడ్ పైరోజీస్ (పోలండ్) వంటి వంటకాలను తమతో పాటు తీసుకెళ్లారు.నింగిని నెగ్గి, తారలు తాకి శుభాన్షుకు వాయుసేన అభినందనలు యాగ్జియం–4 మిషన్‌ను భారత్‌కు ఓ అది్వతీయానుభూతిగా వాయుసేన అభివరి్ణంచింది. ‘‘వాయుసేన యోధుడు గ్రూప్ కెపె్టన్ శుభాన్షు శుక్లా చరిత్రాత్మక అంతరిక్ష యాత్రకు శ్రీకారం చుట్టారు. నింగిని నెగ్గుతూ తారల్ని తాకుతూ దేశ గౌరవాన్ని, ప్రతిష్టను తనతోపాటు సగర్వంగా అంతరిక్షంలోకి మోసుకెళ్లారు’’ అంటూ అభినందించింది. ఆయన ప్రొఫైల్ ఫొటోను షేర్ చేసింది. ‘నీలిదుస్తుల్లో (వాయుసేన యూనిఫాంను ఉద్దేశించి) శిక్షణ, చుక్కలకేసి పయనం’ అంటూ అందమైన క్యాప్షన్ జోడించింది. ‘ఈ అద్భుత యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాం’ జాతీయ పతాకంలోని మూడు రంగులతో కూడిన అక్షరాలతో మరో సందేశాన్ని పోస్టు చేసింది. కేంద్ర మంత్రివర్గం అభినందనలు దేశ ఆకాంక్షలను మోసుకెళ్లారు: మోదీ యాగ్జియం–4 మిషన్ విజయవంతం కావడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షాతిరేకాలు వెలిబుచ్చారు. 140 కోట్ల పై చిలుకు భారతీయుల ఆశలు, ఆకాంక్షలను శుభాన్షు తనతో పాటు అంతరిక్షంలోకి మోసుకెళ్లారన్నారు. ‘‘ఐఎస్ఎస్లో అడుగు పెట్టిన తొలి భారతీయునిగా నిలవనున్న గ్రూప్ కెప్టెన్ శుక్లాకు, ఇతర వ్యోమగాములకు శుభాభినందనలు’’ అంటూ ప్రధాని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆయన సారథ్యంలో కేంద్ర మంత్రివర్గం సమావేశమై శుభాన్షుకు అభినందనలు తెలిపింది. యాగ్జియం–4 యాత్ర దిగి్వజయం కావాలని ఆకాంక్షించింది. ఈ మేరకు మంత్రివర్గం ఆమోదించిన తీర్మానాన్ని కేంద్ర సమాచార ప్రసార మంత్రి అశ్వినీ వైష్ణవ్ చదివి విని్పంచారు.సగర్వంగా ఆకాశాన్ని ముద్దాడారు: ఖర్గేశుభాన్షు సగర్వంగా ఆకాశాన్ని ముద్దాడారంటూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అభినందించారు. ఆయన యాత్ర సఫలమవాలన్నారు. -
అంతరిక్షంలో మనవాడు!
నాలుగు దశాబ్దాల అనంతరం రోదసి నుంచి భారతీయ స్వరం మోగింది. మన వైమానిక దళం గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాతోపాటు అమెరికా, పోలెండ్, హంగేరీలకు చెందిన మరో ముగ్గురు వ్యోమగాములు స్పేస్ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌకలో బుధవారం మధ్యాహ్నం సరిగ్గా 12.01 నిమిషానికి 28 గంటల అంతరిక్షయాత్ర ప్రారంభించారు. వీరు అంతరిక్షంలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు చేరుకుని 14 రోజులపాటు దాదాపు 60 పరిశోధనలు చేస్తారు. ‘మేం భూకక్ష్యలో తిరుగుతున్నాం. భారత మానవ అంతరిక్ష కార్యక్రమం మొదలైంద’ంటూ శుభాంశు శుక్లా పంపిన సందేశం ఈ మొత్తం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న శాస్త్రవేత్తల్లో భావోద్వేగం కలిగించింది. ఎప్పుడో 1984లో రాకేష్ శర్మ అంతరిక్ష యాత్ర చేశాక భారత్ నుంచి మరొకరు వెళ్లటం ఇదే ప్రథమం. ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ యాత్ర ప్రారం¿¶ మైంది. గంటకు 28,000 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే ఐఎస్ఎస్... ప్రతి 90 నిమిషాలకూ భూకక్ష్యలో ఒక రౌండ్ పూర్తిచేస్తుంది. ఆ కారణంగా మన శుభాంశు శుక్లా, మరో ముగ్గురు వ్యోమగాములు రోజూ 16 సూర్యోదయాలనూ, 16 సూర్యాస్తమయాలనూ వీక్షిస్తారు. అవనిపై ఎలావున్నా అంతరిక్షంలో దేశాల మధ్య ఇంతవరకూ కొనసాగుతున్న సహకారానికీ, సమన్వయానికీ ఐఎస్ఎస్ ఒక ప్రతీక. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, రష్యా సంస్థ రోస్కాస్మోస్, జపాన్ సంస్థ జాక్సా, కెనడా అంతరిక్ష సంస్థ సీఎస్‌ఏలు ఉమ్మడిగా ఐఎస్ఎస్ నిర్మాణానికి ముందుకు కదిలాయి. అంతరిక్షంలో ప్రపంచ దేశాలన్నీ పరస్పరం సహకరించుకోవాలని, దాన్ని శాంతియుత ప్రయోజనాలకు వినియోగించాలని, అక్కడి పరిశోధనల ఫలితాలు సమస్త మాన వాళికి అందించాలన్న లక్ష్యాలతో ఐఎస్ఎస్కు అంకురార్పణ జరిగింది. రెండున్నర దశాబ్దాల క్రితం గనుక ఇదంతా కుదిరింది. వర్తమానంలో ఇది సాధ్యమయ్యేదా? ప్రఖ్యాత సైన్స్ ఫిక్షన్ రచయిత ఆర్థర్ సి. క్లార్క్ చాన్నాళ్ల క్రితం ‘ఈ విశాల విశ్వంలో రెండే రెండు సంభావ్యతలుంటాయి... అవి–మానవాళి ఒంటరైనా కావాలి లేదా కాకపోవాలి’ అన్నారు. సకల అంతరిక్ష యాత్రల సారాంశం దాన్ని ఛేదించటమే. ఈ క్రమంలో ఐఎస్ఎస్ ఒక సాధనం. ప్రయోగశాలగా, భిన్న సాంకేతికతల నిగ్గుతేల్చేదిగా భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో సేవలందిస్తున్న ఐఎస్ఎస్ ఇప్పటికి భిన్న శాస్త్రాల్లో 4,000 ప్రయోగాలకు వేదికైంది. జీవశాస్త్రం మొదలుకొని ఔషధాల వరకూ... భూ విజ్ఞాన శాస్త్రాలు మొదలుకొని భౌతిక శాస్త్రం వరకూ... పర్యావరణ పర్యవేక్షణ నుంచి అంతరిక్ష అన్వేషణ వరకూ ఎన్నెన్నో అంశాల్లో ఐఎస్ఎస్ వ్యోమగాములకు తోడ్పాటునందిస్తోంది. గురుత్వాకర్షణ శక్తి బలంగావుండే భూ వాతావరణంలో కొన్ని కొన్ని పరిశోధ నలు అసాధ్యమవుతాయి. అత్యంత సూక్ష్మ గురుత్వాకర్షణ కలిగి భారరహిత స్థితిలో ఉండే ఐఎస్ఎస్లో సంక్లిష్టమైన పరిశోధనలూ, ప్రయోగాలూ చేయటం, వాటినుంచి ఫలితాలు రాబట్టడం ఎంతో సులభం. ఇవి మనిషి జీవితాన్ని సుఖవంతం చేయగల అనేక సృజనాత్మక సాంకేతికతల ఆవిష్కరణకు తోడ్పడ్డాయి. కమ్యూనికేషన్ల రంగంలో, వనరుల యాజమాన్య నిర్వహణలో, తాగు నీరు స్వచ్ఛతకు వినియోగించే సాంకేతికతల రూపకల్పనలో, అంతరిక్ష యాత్రకు పనికొచ్చే అధు నాతన సాంకేతికతల అభివృద్ధిలో ఈ పరిశోధనలు ఉపయోగపడ్డాయి. అంతేకాదు... మానవాళి భవిష్యత్తు అంతరిక్ష అన్వేషణలకు ఐఎస్ఎస్ వేదికవుతున్నది. ఐఎస్ఎస్ భూమ్మీద రూపొందించి ప్రయోగించింది కాదు. అది కొన్ని రోజుల్లోనో, నెలల్లోనో పూర్తయినది కూడా కాదు. అందుకు దాదాపు పదమూడేళ్లు పట్టింది. అందులోని విడిభాగాల్లో ఎవరేమి తయారుచేయాలో, ఎప్పుడు పట్టుకెళ్లాలో సమగ్ర ప్రణాళికలు రూపొందించుకోగా, 1998 నవంబర్‌లో మొదలుపెట్టి 2011 వరకూ పునర్వినియోగ అంతరిక్ష నౌకలద్వారా, రష్యన్ రాకెట్ల ద్వారా 30 దఫాలు వందకుపైగా ఐఎస్ఎస్ విడిభాగాలు, సౌరశక్తి ప్యానెళ్లు, కేబుళ్లు వగైరాలు చేర్చారు. వ్యోమగాములు స్పేస్‌వాక్ చేస్తూ ఈ కేంద్రానికి రూపకల్పన చేశారు. నిద్రపోవటానికీ, తిండికీ, వ్యాయామాలకూ, పరిశోధనలకూ ఇక్కడి నుంచి ప్రయోగించిన మాడ్యూళ్లు తోడ్పడ్డాయి. మొదట్లో ఇది గరిష్ఠంగా 2020 వరకూ పనిచేయొచ్చని అంచనా వేయగా ఇప్పటికీ నిక్షేపంలా ఉంది. తాజా అంచనా ప్రకారం 2030తో దీని జీవితకాలం పూర్తవుతుందని, ఆ తర్వాత కక్ష్య తప్పించి నేలపై పడేవిధంగా చర్యలు తీసుకోవచ్చని భావిస్తున్నారు. కానీ ట్రంప్ ఏలుబడి మొదల య్యాక 2030 కన్నా ముందే దాన్ని దించేయాలని ఎలాన్ మస్క్ వాదించటం మొదలుపెట్టారు. ప్రస్తుతం మస్క్ స్థానమేమిటన్న దాన్నిబట్టి ఐఎస్ఎస్ భవితవ్యం ఆధారపడి ఉంటుంది. మామూలుగా దూరప్రాంతాలకు వెళ్లినప్పుడే ఇంటిల్లిపాదీ ఎంతో భావోద్వేగానికి లోనవు తారు. అంతరిక్ష యాత్రంటే చెప్పేదేముంది? అందులో సాహసమూ, సమస్యలూ కలగలిసి ఉంటాయి. ఎన్నో త్యాగాలకు సిద్ధపడాలి. శిక్షణ కోసం అయినవాళ్లకు దూరంగా ఉండాలి. కష్టతరమైన వ్యాయామాలు తప్పనిసరి. శుభాంశు వీటన్నిటినీ తట్టుకుని నిలబడ్డాడు. వాయుసేన నుంచి అంతరిక్షయాత్ర వైపు అడుగులేశాడు. ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్టు ఇప్పుడు 140 కోట్లమంది భారతీయుల ఆకాంక్షలనూ, నమ్మకాలనూ మోసుకెళ్లాడు. యువతకు స్ఫూర్తిగా నిలిచాడు.శుభాంశు యాత్ర దిగ్విజయం కావాలని, మరో ముగ్గురితో కలిసి ఆయన సాగించే ప్రయోగాలూ, పరిశోధనలూ మానవాళి శ్రేయస్సుకు తోడ్పడాలని దేశ పౌరులంతా ఆకాంక్షిస్తున్నారు. -
అంతరిక్షంలోకి శుభాంశు శుక్లా.. వైఎస్ జగన్ హర్షం
సాక్షి, తాడేపల్లి: అంతరిక్ష కేంద్రానికి భారత వ్యోమగామి శుభాంశు శుక్లా బయల్దేరడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మన దేశం నుండి మొదటి వ్యోమగామి శుభాంశు శుక్లానే కావటం అందరూ గర్వించాల్సిన విషయం. శుక్లా సహా ఆయన టీమ్ ప్రయాణం సుఖవంతం కావాలి. ఈ మిషన్ విజయవంతం కావాలని కోరుకుంటున్నా’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.A proud moment for India as Group Captain Shubhanshu Shukla from the Indian Air Force becomes the first ISRO astronaut to travel to the International Space Station on Axiom Mission 4. Wishing Group Captain Shukla and the entire crew a safe journey and a successful mission. The… pic.twitter.com/MX5Z8fkFmw— YS Jagan Mohan Reddy (@ysjagan) June 25, 2025భారత అంతరిక్ష చరిత్రలో కొత్త అధ్యాయానికి తెరలేచింది. ఇస్రో-నాసా సంయుక్త యాక్సియం-4 మిషన్ కోసం భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి బయల్దేరారు. ఆయన ఈ మిషన్‌కు పైలట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. భారత కాలమానం ప్రకారం.. బుధవారం మధ్యాహ్నాం కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్-9 రాకెట్ నలుగురు వ్యోమగాములతో బయల్దేరింది. సుమారు 28 గంటల ప్రయాణం తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి శుక్లా నేతృత్వంలోని బృందం చేరుకోనుంది. -
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా క్యూట్ లవ్ స్టోరీ..! ప్రియతమ ఈ జర్నీలో..
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (International Space Station) (ఐఎస్ఎస్) వైపుకు ఈ రోజే(బుధవారం జూన్ 25)చేరుకోనున్నారు. ఈ యాక్సియం స్పేస్ సంస్థ చేపడుతున్న యాక్సియం-4 (AX-4) మిషన్‌లో శుభాంశు కీలక పాత్ర పోషించనున్నారు. నాసా ప్రకటన ప్రకారం, ఈ ప్రయోగం ఈ రోజు మధ్యాహ్నం 12:01 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రారంభమైంది. ఈ ప్రయోగం విజయవంతమైతే, గురువారం సాయంత్రం 4:30కి వ్యోమనౌక ఐఎస్ఎస్తో డాకింగ్ కానుంది. మన భారతీయ వ్వోమగామి ఈ ప్రతిష్టాత్మక మిషన్‌లో భాగం కావడంతో యావత్తు దేశం సంభ్రమాశ్చర్యాలకు లోనవ్వుతూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది. ఈనేపథ్యంలో ఆయన కుటుంబ నేపథ్యం, లవ్‌స్టోరీ గురించి తెలుసుకుందామా..!.ఆయన బుధావారం మధ్యాహ్నం ఫాల్కన్ 9 రాకెట్ రాకెట్ లాంచ్ అవ్వడానికి కొన్ని గంటల ముందు తన భార్య కోసం ఒక భావోద్వేగమైన లేఖ రాశారు. అదులో తన కృతజ్ఞతను వ్యక్తం చేస్తూ..తన ప్రయాణంలో నువ్వులేని లేటుని భర్తీ చేయలేనిది అని భావోద్వేగంగా రాశారు. దానికి శుభాంశు భార్య కామ్నా గర్వంతో కూడిన ప్రేమతో స్పందించారు. ఈ క్రమంలోనే వారి ప్రేమ కథ తెరపైకి వచ్చింది. కామ్నా దంత వైద్యురాలు. ఆమెతో శుభాంశుకి దశాబ్దాల ప్రేమ బంధం ఉంది. వారిద్దరు మొదట లక్నోలోని ప్రాథమిక పాఠశాలలో కలుసుకున్నారు. అప్పటి నుంచి వారు మంచి స్నేహితులుగా ఉండేవారు. ఆయన తరగతి గదిలో అత్యంత సైలెంట్‌గా ఉండేవాడిని. ఒక్కమాటలో చెప్పాలంటే సిగ్గరి. అలాంటి వ్యక్తి జాతీయ స్థాయిలో ప్రేరణగా నిలవడం ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంటుందన్నారు. తమ విద్యా రంగాల దృష్ట్యా వేరైనా క్షణాలు ఎన్నో ఉన్నాయి. అయినా మా మధ్య ప్రేమ అలానే స్వచ్ఛంగా ఉంది. బహుశా అదే మమల్ని పెళ్లి పీటల వరకు వచ్చేలా చేసి ఉండొచ్చు. శుభాంశు కెరీర్ పరంగా ఎన్నో ఎడబాటులను తట్టుకుని నిలిచిన అపూర్వ ప్రేమ మాది అని కామ్నా సగర్వంగా చెప్పారు. అయితే తమ కొడుకు తన తండ్రితో గడిపే క్షణాలను కోల్పోడం మాత్రం ఇప్పటికీ బాధగానే ఉంటుంది. ఎన్ని బాధ్యతలున్నా..అతడి ఫోకస్ అచంచలంగా ఉంటుదని కీర్తించారు. అంతేగాదు శుభాంశు దృఢ సంకల్పాన్ని మహాభారతంలోని అర్జునుడితో పోల్చారామె. ఆయన మంచి ఏకాగ్రతతో స్పష్టమైన వైఖరి ఉన్న వ్యక్తిత్వం గలవాడని చెబుతున్నారు కామ్నా. ఫైటర్ జెట్ల నుంచి అంతరిక్షం వరకు చేరుకున్న అతడి కెరీర్ నిజంగా చాలా గొప్పదన్నారు. నక్షత్రాలలో తన స్థానాన్ని సుస్థిరపరుచుకోవాలనే ఆ కాంక్షతోనే ఈ స్థాయికి ఆయన చేరుకున్నారని చెప్పుకొచ్చారామె. ఆయన ఎల్లప్పుడూ "పరిస్థితి ఎంత సవాలుగా ఉన్నా, ఈత కొడుతూనే ఉండండి" అనే నినాదాన్ని గట్టిగా విశ్వసిస్తారని చెప్పుకొచ్చారు కామ్నా. కార్గిల్ యుద్ధంతో కెరీర్ యూటర్న్..శుభాంశు శుక్లా లక్నోలోని అలీగంజ్ క్యాంపస్‌లోని సిటీ మాంటిస్సోరి స్కూల్ (CMS) ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. కానీ 1998లో కార్గిల్ యుద్ధం సమయంలో కెరీర్ సడెన్‌గా మలుపు తిరిగింది. ఈ యుద్ధం అతనిలో దేశానికి సేవ చేయాలనే ప్రగాఢమైన కోరికను రేకెత్తించింది. దృఢ సంకల్పంతో తన కుటుంబానికి చెప్పకుండా UPSC నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) పరీక్షకు దరఖాస్తు చేసుకుని ఉత్తీర్ణులయ్యారు. అలా శుభాంశు 2005లో కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీతో పట్టభద్రుడయ్యారు. తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో విమాన శిక్షణ పొందాడు. చివరికి 2006లో అధికారికంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ స్ట్రీమ్‌లోకి నియమితులయ్యారు. ఆయన బెంగళూరులోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) నుండి ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీని కూడా పొందారు. చాలా ఏళ్లుగా శుక్లా భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్, టెస్ట్ పైలట్‌గా సేవలందించారు. అదీగాక దాదాపు 2 వేల గంటల విమానయాన అనుభవంతో సాధించిన రికార్డు వివిధ రకాల విమానాలను అధిరోహించేలా చేసింది. ఆ కెరీర్ నేపథ్యమే 2019లో భారతదేశం ప్రతిష్టాత్మకమైన గగన్‌యాన్ మిషన్ కోసం నాలుగు వ్యోమగాములలో ఒకరిగా అతని ఎంపికకు దారితీసింది. అప్పటి నుంచి ఆయన రష్యాలోని యూరి గగారిన్ కాస్మోనాట్ శిక్షణా కేంద్రంలో, అలాగే బెంగళూరులోని భారతదేశ వ్యోమగామి శిక్షణా కేంద్రంలో కఠినమైన వ్యోమగామిగా శిక్షణ పొందారు.(చదవండి: ఇజ్రాయెల్ ప్రధానికి భారత్ అంటే ఇంత ఇష్టమా..! ఇక్కడ ఫుడ్ తోపాటు అమితాబ్‌తో..) -
స్పేస్‌లోకి శుభాంశు శుక్లా.. ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము ఏమన్నారంటే
సాక్షి,ఢిల్లీ: ఇస్రో-నాసా సంయుక్త యాక్సియం-4 మిషన్ కోసం అంతరిక్షంలోకి బయల్దేరిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా(Shubhanshu Shukla)కు రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ శుభాకంక్షలు తెలిపారు. శుభాంశు శుక్లా స్పేస్‌లోకి 1.4 బిలియన్ల మంది భారతీయుల శుభాకాంక్షల్ని,నమ్మకాల్ని, ఆకాక్షంల్ని మోసుకెళ్తున్నారని ప్రధాని మోదీ కొనియాడారు. శుభాంశు శుక్లాతో పాటు మిషన్ కమాండర్ అమెరికాకు చెందిన పెగ్గీ విట్సన్, పోలాండ్‌కు చెందిన మిషన్ స్పెషలిస్ట్స్లావోష్ ఉజ్నాన్స్కీ,హంగేరీ మిషన్ స్పెషలిస్ట్ టిబోర్ కాపులకు మోదీ శుభాంక్షలు చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాంశు శుక్లా అంతరిక్ష ప్రయాణంపై స్పందించారు. గ్రూప్ కెప్టెన్‌గా శుభాంశు శుక్లా భారత అంతరిక్ష విభాగంలో సరికొత్త రికార్డ్లను సృష్టించారు. అంతరిక్షంలోకి ఈ భారతీయుడి ప్రయాణం పట్ల మొత్తం దేశం ఉత్సాహంగా గర్వంగా ఉంది. శుభాంశు తన ఆక్సియం మిషన్ 4లోని అమెరికా, పోలాండ్, హంగేరీ వ్యోమగాములుతో తమదంతా ‘వసుధైవ కుటుంబం (ఒకే కుటుంబం)’గా నిరూపించారని ముర్ము అన్నారు.భారత సంతతికి చెందిన వ్యోమగామి శుభాంశు శుక్లా. ఆయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో గ్రూప్ కెప్టెన్‌గా సేవలందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన అమెరికా ప్రైవేట్ అంతరిక్ష సంస్థ యాక్సియమ్ స్పేస్ నిర్వహిస్తున్న Ax-4 మిషన్‌లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి వెళుతున్నారు. ఈ మిషన్ ద్వారా రాకేశ్ శర్మ తర్వాత అంతరిక్షంలో అడుగుపెట్టనున్న రెండో భారతీయుడిగా శుభాంశు శుక్లా చరిత్రలో నిలవనున్నారు. We welcome the successful launch of the Space Mission carrying astronauts from India, Hungary, Poland and the US. The Indian Astronaut, Group Captain Shubhanshu Shukla is on the way to become the first Indian to go to International Space Station. He carries with him the wishes,…— Narendra Modi (@narendramodi) June 25, 2025 As Group Captain Shubhanshu Shukla creates a new milestone in space for India, the whole nation is excited and proud of an Indian’s journey into the stars. He and his fellow astronauts of Axiom Mission 4 from the US, Poland and Hungary prove the world is indeed one family –…— President of India (@rashtrapatibhvn) June 25, 2025 -
శుభాంశు రోదసి యాత్ర విజయవంతం
-
శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర
-
భారత అంతరిక్ష చరిత్రలో కొత్త అధ్యాయం.. రోదసిలోకి శుభాంశు శుక్లా
భారత అంతరిక్ష చరిత్రలో కొత్త అధ్యాయానికి తెరలేచింది. ఇస్రో-నాసా సంయుక్త యాక్సియం-4 మిషన్ కోసం భారత వ్యోమగామి శుభాంశు శుక్లా(Shubhanshu Shukla)అంతరిక్షంలోకి బయల్దేరారు. ఆయన ఈ మిషన్‌కు పైలట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. భారత కాలమానం ప్రకారం.. బుధవారం మధ్యాహ్నాం కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్-9 రాకెట్ నలుగురు వ్యోమగాములతో బయల్దేరింది. సుమారు 28 గంటల ప్రయాణం తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి శుక్లా నేతృత్వంలోని బృందం చేరుకోనుందియాక్సియం-4 మిషన్‌లో భాగంగా.. రాకెట్ ఒక్కో దశను విజయవంతంగా దాటుకుంటూ ముందుకు సాగింది. ‘మేం భూకక్ష్యలో తిరుగుతున్నాం.. భారత్ మానవ సహిత అంతరిక్ష యాత్ర ప్రారంభమైంది. జైహింద్.. జైభారత్’ అంటూ శుభాంశు సందేశం బయటకు వచ్చింది. అంతకు ముందు.. ఆయన మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను కేవలం పరికరాలను మాత్రమే వెంట తీసుకెళ్లడం లేదని, వంద కోట్ల మందికిపైగా ఆశలను మోసుకెళ్తున్నానని అన్నారు. భారత కాలమానం ప్రకారం.. రేపు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో.. ఐఎస్ఎస్ అనుసంధానం కోసం డాకింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.ఇదిలా ఉంటే.. కోట్లాది మంది ఈ ప్రయోగాన్ని లైవ్‌లో వీక్షించారు. సుమారు 41 ఏళ్లకు.. భారత వ్యోమగామి రాకేశ్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా శుక్లాకు ఘనత సాధించారు. ఈ అరుదైన క్షణాలను శుక్లా తల్లిదండ్రులు వీక్షించారు. తాము ఎంతో సంతోషంగా ఉన్నామని.. ఏ మాత్రం భయపడటం లేదని ఈ చారిత్రక ఘట్టంపై శుక్లా తల్లి ఆశా స్పందించారు. తమ ఆనందాన్ని మాటల్లో చెప్పలేమని భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. అనంతరం.. బంధువులను ఆలింగనం చేసుకుని ఆమె ఆనందంతో చిందులు వేశారు. #WATCH | Lucknow, Uttar Pradesh: Parents, relatives of IAF Group Captain & astronaut Shubhanshu Shukla, celebrate as #Axiom4Mission lifts off from NASA's Kennedy Space Centre in Florida, US.The mission is being piloted by India's IAF Group Captain Shubhanshu Shukla. pic.twitter.com/JmbodqjyEy— ANI (@ANI) June 25, 2025 ప్రయాణానికి ముందు శుక్లా ఇలా.. రోదసీ యాత్రకు ముందు.. శుభాంశు శుక్లా తనకు ఇష్టమైన పాటలు విన్నారు. హృతిక్ రోషన్ నటించిన బాలీవుడ్ సినిమా ‘ఫైటర్’లోని వందేమాతరం ఆయన రిపీట్ మోడ్‌లో విన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా.. ఇలాంటి ప్రయోగాలకు ముందు వ్యోమగాములకు సంగీతం వినేందుకు అనుమతిస్తారు. తద్వారా మానసిక స్థితి బాగుంటుందనేది పరిశోధకుల సూచన. అందుకే ఇలాంటి సౌకర్యం కల్పిస్తారు.బ్యాకప్ పైలట్ బాలకృష్ణన్ ప్రశంసలు.. యాక్సియం-4 మిషన్‌కు పైలట్‌గా వ్యవహరించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాపై కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ ప్రశంసలు గుప్పించారు. ఈ మిషన్‌కు బ్యాకప్ పైలట్‌గా ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ వ్యవహరించారు. శుక్లాలో ఆత్మవిశ్వాసం, నిబద్ధత మెండుగా ఉన్నాయని.. యాక్సియం-4 మిషన్‌పై పూర్తి ఫోకస్ ఉందని నాయర్ వ్యాఖ్యనించారు. యాక్సియం-4 స్పేస్ మిషన్ మే చివరి వారంలో జరగాల్సి ఉంది. అయితే అప్పటి నుంచి ఏడుసార్లు రకరకాల కారణాలతో ఈ ప్రయోగం వాయిదా పడుతూ వచ్చింది. చివరకు.. ఇవాళ ప్రయోగం విజయవంతంగా జరిగింది. శుభాంశు శుక్లా భారత వైమానిక దళానికి చెందిన అధికారి. ఆయన ప్రస్తుతం యాక్సియం-4 మిషన్‌లో మిషన్ పైలట్‌గా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి ప్రయాణిస్తున్నారు. ఇది భారతదేశం తరఫున ISSకి వెళ్తున్న తొలి మిషన్ కావడం విశేషం.శుభాంశు శుక్లా గురించి:పుట్టిన తేది: 1985 అక్టోబర్ 10వయస్సు: సుమారు 39 సంవత్సరాలువృత్తి: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్స్థలం: లక్నో, ఉత్తరప్రదేశ్కుటుంబం: తండ్రి శంభు దయాల్ శుక్లా, అక్క శుచి శుక్లాభార్య: కామ్నా (డెంటిస్ట్)కొడుకు: కియాష్ (6 ఏళ్లు)1999లో కార్గిల్ యుద్ధం ఆయనపై తీవ్ర ప్రభావం చూపింది. 14 ఏళ్ల వయసులో ఎయిర్ షో చూసి ప్రేరణ పొందిన ఆయన, ఎన్డీఏ పరీక్ష రాసి కుటుంబానికి చెప్పకుండా ఎంపికయ్యారు.శుక్లా వృత్తిపరమైన జీవితంవిద్య: బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ – నేషనల్ డిఫెన్స్ అకాడమీ (2005)ఎంటెక్ – ఏరోస్పేస్ ఇంజినీరింగ్, IISc బెంగళూరువైమానిక దళంలో చేరిక: 2006లో ఫైటర్ పైలట్గావిమానాలు నడిపిన అనుభవం: సుఖోయ్-30 MKI, మిగ్-29, మిగ్-21, జాగ్వార్, హాక్ తదితర యుద్ధ విమానాలుఫ్లయింగ్ అవర్స్: 2000 గంటలకు పైగాప్రత్యేక ఘట్టం: 2019 బాలాకోట్ వైమానిక దాడుల్లో పాల్గొన్నారువ్యోమగామిగా ఎంపిక: 2019లో ISRO గగన్‌యాన్ మిషన్ కోసంశిక్షణ: రష్యాలోని యూరీ గగారిన్ కాస్మోనాట్ శిక్షణ కేంద్రం, అనంతరం బెంగళూరులోప్రస్తుత మిషన్: యాక్సియం-4 పైలట్‌గా ISSకి ప్రయాణం, 7 శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహణమిషన్లో భాగంగా..యాక్సియం-4 మిషన్ (Axiom-4 Mission) ఉద్దేశం చాలా విస్తృతమైనది. NASA, ISRO, ESA, SpaceX భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఒక ప్రైవేట్ అంతరిక్ష యాత్ర. అమెరికాకు చెందిన యాక్సియం స్పేస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతోంది. ఈ మిషన్‌లో భాగంగా, వివిధ దేశాలకు చెందిన వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి ప్రయాణించి శాస్త్రీయ పరిశోధనలు చేస్తారు. భారత వైమానిక దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ఈ మిషన్‌లో మిషన్ పైలట్‌గా ఉన్నారు. ఆయనతో పాటు అమెరికా, హంగేరీ, పోలాండ్‌కు చెందిన వ్యోమగాములు కూడా పాల్గొంటున్నారు.మిగతా ముగ్గురు వ్యోమగాములు వీరే..పెగ్గీ విట్సన్ (Peggy Whitson) – మిషన్ కమాండర్, అమెరికా. NASAకి చెందిన మాజీ వ్యోమగామి, అమెరికాలో అత్యధికంగా అంతరిక్షంలో గడిపిన వ్యక్తి (675 రోజులు). స్లావోష్ ఉజ్నాన్స్కీ (Sławosz Uznański) – మిషన్ స్పెషలిస్ట్, పోలాండ్. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA)కి చెందిన శాస్త్రవేత్త. టిబోర్ కాపు (Tibor Kapu) – మిషన్ స్పెషలిస్ట్, హంగేరీ. హంగేరీ ప్రభుత్వ HUNOR ప్రోగ్రామ్ ద్వారా ఎంపికయ్యారు.మిషన్ ముఖ్య ఉద్దేశాలు:యాక్సియం 4 స్పేస్ మిషన్‌లో భాగంగా 28 గంటలపాటు ప్రయాణించి ఈ బృందం అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం(ISS) చేరుకుంటుంది. అక్కడ 14 రోజుల పాటు ఉండి 60కి పైగా శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహిస్తుంది ఈ నలుగురు వ్యోమగాముల బృందం. ఇందులో శుభాంశు శుక్లా స్వయంగా 7 కీలక ప్రయోగాలు నిర్వహించనున్నారు. ఇవి జీవశాస్త్రం, వైద్యం, సాంకేతికత వంటి రంగాలకు సంబంధించినవి. పైగా ఇది భారతదేశం కోసం గగన్‌యాన్ మిషన్‌కు ముందడుగుగా పరిగణించబడుతోంది. అలాగే.. అంతర్జాతీయ సహకారంతో భారత అంతరిక్ష పరిశోధనలకు ప్రాధాన్యత పెంచడం కూడా ఈ మిషన్ లక్ష్యాల్లో ఒకటి. పైగా 41 ఏళ్ల తర్వాత ఒక భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్లడం ఇదే మొదటిసారి కావడం వల్ల, ఇది చారిత్రక ఘట్టంగా మారింది.బడ్జెట్ ఎంతంటే.. భారత ప్రభుత్వం తరఫున Department of Space (DoS) ఈ మిషన్ కోసం రూ. 715 కోట్లు కేటాయించింది. డిసెంబర్ 2024 నాటికి రూ. 413 కోట్లు ఖర్చయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ. 135 కోట్లు అదనంగా కేటాయించారు. మిగిలిన రూ. 168 కోట్లు 2026 మార్చి నాటికి వినియోగించనున్నారు. ఈ మొత్తం బడ్జెట్లో శుభాంశు శుక్లా ప్రయాణం, శాస్త్రీయ ప్రయోగాలు, శిక్షణ, మరియు అంతరిక్ష ప్రయాణానికి అవసరమైన ఇతర సాంకేతిక అంశాలు ఉన్నాయి. ఇది భారతదేశం తరఫున ISSకి వెళ్లే తొలి మిషన్ కావడమే కాదు.. గగన్‌యాన్ మిషన్‌కు ముందడుగుగా పరిగణించబడుతోంది. -
శుభాంశు శుక్లా రోదసీ యాత్ర.. నాసా కీలక ప్రకటన
న్యూఢిల్లీ, సాక్షి: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసీ యాత్రకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. యాక్సియం-4 మిషన్‌లో భాగంగా మొత్తం నలుగురు వ్యోమగాములు ఈనెల 25న రోదసియాత్రకు బయలుదేరుతున్నట్లు నాసా తన తాజా ప్రకటనలో తెలిపింది. ఈ మిషన్‌లో భాగంగా జూన్25న ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి ఈ స్పేస్ క్యాప్సూల్‌ను ఫాల్కన్-9 రాకెట్ నింగిలోకి మోసుకెళ్లనుంది. ఇందులో శుభాంశు శుక్లా మిషన్ పైలట్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు. శుభాంషు శుక్లా రోదసీ యాత్ర ఇప్పటివరకు ఐదు సార్లు వాయిదా పడింది. మొదట ఇది మే 29న జరగాల్సి ఉండగా, ఆ తర్వాత జూన్ 8, జూన్ 10, జూన్ 11, మరియు జూన్ 19 తేదీలకు మారింది. జూన్ 11న జరగాల్సిన ప్రయోగానికి ముందు ఫాల్కన్-9 రాకెట్లో ద్రవరూప ఆక్సిజన్ లీకేజీ కారణంగా మళ్లీ వాయిదా పడింది.ఈ వ్యోమనౌక భూమి నుంచి బయల్దేరిన 28 గంటల అనంతరం ఐఎస్ఎస్తో అనుసంధానం కానుంది. 14 రోజుల పాటు ఈ నలుగురు వ్యోమగాములు అంతరిక్ష కేంద్రంలో ఉండనున్నారు. ఇదే సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఔత్సాహిక విద్యార్థులు, అంతరిక్ష శాస్తవేత్తలు ఈ నలుగురు వ్యోమగాములతో సంభాషించనున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే విజయవంతమైతే, శుభాంషు శుక్లా ప్రైవేట్ రోదసి యాత్ర ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన తొలి భారతీయుడిగా చరిత్రలో నిలిచిపోతారు. భారత్‌కు ఏం ప్రయోజనమంటే.. గగన్‌యాన్ ప్రాజెక్టుకు పునాదిఈ మిషన్ ద్వారా శుభాంషు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ISS) 14 రోజుల పాటు అనేక శాస్త్రీయ ప్రయోగాలు చేస్తారు. ఇవి భారత గగన్‌యాన్ మిషన్‌కు అవసరమైన అనుభవాన్ని ఇస్తాయి. ఇస్రోకు అంతర్జాతీయ అనుభవంనాసా, యాక్సియమ్ స్పేస్ వంటి అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేయడం ద్వారా ఇస్రోకు ప్రాముఖ్యత పెరుగుతుంది. ఇది భవిష్యత్తులో అంతర్జాతీయ సహకారానికి దారితీస్తుంది. శాస్త్రీయ ప్రయోగాలుశుభాంషు నిర్వహించే ప్రయోగాలు మైక్రోగ్రావిటీలో కండరాల నష్టం, పంటల సాగు, టార్డిగ్రేడ్స్ (వాటర్ బేర్స్) జీవన విధానం, కంప్యూటర్ స్క్రీన్ల ప్రభావం వంటి అంశాలపై దృష్టి పెడతాయి. ఇవి ఆరోగ్యం, వ్యవసాయం, జీవశాస్త్రం రంగాల్లో కొత్త అవగాహనను తీసుకురాగలవు. భారత యువతకు ప్రేరణ1984లో రాకేశ్ శర్మ తర్వాత మళ్లీ ఒక భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్లడం భారత యువతలో శాస్త్రవేత్తల పట్ల ఆసక్తిని పెంచుతుంది. ఇది దేశంలో స్పేస్ సైన్స్‌కు బలమైన ప్రోత్సాహం అవుతుంది. ఇది కేవలం ఒక ప్రయాణం కాదు.. భారత అంతరిక్ష ప్రయాణ చరిత్రలో కొత్త అధ్యాయం కూడా.ఇది కూడా చదవండి: సంధి దిశగా ఇరాన్? తుది నిర్ణయంపై తర్జనభర్జన -
శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రపై సస్పెన్స్.. ఆరోసారి వాయిదా
ఢిల్లీ: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) అంతరిక్ష యాత్రపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర ఆరోసారి కూడా వాయిదా పడింది. ఈ నెల 22న శుభాంశు రోదసి యాత్ర చేయాల్సి ఉండగా.. యాక్సియం-4 ప్రయోగం వాయిదా పడిందని నాసా తాజాగా ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో, అంతరిక్ష ప్రయోగంలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఇక, ఈ ప్రయోగానికి సంబంధించిన కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని నాసా వెల్లడించింది.ఇదిలా ఉండగా.. శుభాంశు శుక్లా అమెరికాకు చెందిన యాక్సియం-4 మిషన్‌లో భాగంగా మరో ముగ్గురు ఆస్ట్రోనాట్లతో కలిసి అంతరిక్ష యాత్రకు వెళ్లనున్నారు. ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా), ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ)లు ఇందులో ఈ మిషన్ చేపట్టాయి. ఈ స్పేస్ క్యాప్సూల్‌ను ఫాల్కన్-9 రాకెట్ నింగిలోకి మోసుకెళుతోంది. ఇందులో శుభాంశు మిషన్ పైలట్‌గా బాధ్యతలు నిర్వహిస్తారు. ఈ ప్రయోగం తొలుత మే 29న జరగాల్సి ఉండగా పలు కారణాలతో ఇప్పటికే ఆరు సార్లు వాయిదా పడింది.ఇక, భూమి నుంచి బయల్దేరిన 28 గంటల తర్వాత ఈ వ్యోమనౌక.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)తో అనుసంధానమవుతుంది. శుభాంశు బృందం అక్కడే 14 రోజుల పాటు ఉంటుంది. భార రహిత స్థితిలో పలు ప్రయోగాలు నిర్వహించడంతో పాటు ప్రధాని మోదీ, పాఠశాల విద్యార్థులు, ఇతరులతో ముచ్చటిస్తారు.NASA's Axiom-4 mission with Indian astronaut Shubhanshu Shukla delayed for sixth time pic.twitter.com/TAaXUZpCnv— UPSC Post 📫 (@upscpost) June 20, 2025 -
శుభాంశు రోదసియాత్ర మళ్లీ వాయిదా
న్యూఢిల్లీ: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసియాత్ర ‘ఆక్సియం-4 మిషన్’ మరోసారి వాయిదా పడింది. ఈ ప్రయోగం జూలై 19న జరగాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాలతో ‘ఆక్సియం-4 మిషన్’ను జూన్ 22న నిర్వహించనున్నట్లు ‘నాసా’ పేర్కొంది. భారతదేశపు రెండవ వ్యోమగామి శుభాన్షు శుక్లాను అంతరిక్షంలోకి తీసుకెళ్లే ఆక్సియం-4 మిషన్ ప్రయోగం తరచూ వాయిదా పడుతూ వస్తోంది.దీనికి ముందు ఫాల్కన్ 9 రాకెట్ రిపేర్ కారణంగా వాయిదా అనివార్యమయ్యింది. ఈ విషయాన్ని స్పేస్ ఎక్స్ నాడు సోషల్ మీడియా ప్లాట్ఫారం ఎక్స్‌లో తెలియజేసింది. పోస్ట్ స్టాటిక్ ఫైర్ బూస్టర్ తనిఖీల సమయంలో గుర్తించిన ఎల్ఓ ఎక్స్ లీక్‌ను రిపేర్ చేసేందుకు స్పేస్ఎక్స్ బృందాలకు అదనపు సమయం అవసరం కానున్నదని తెలిపింది. మరమ్మతు పూర్తయిన తర్వాత తదుపరి ప్రయోగ తేదీని తెలియజేస్తామని స్పేస్ఎక్స్ పేర్కొంది. అంతకుముందు ప్రయోగ ప్రాంతంలో అనుకూలమైన వాతావరణం లేని కారణంగా వాయిదా పడిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తెలిపింది. భారతదేశ అంతరిక్ష లక్ష్యాలకు ఒక మైలురాయిగా ఈ మిషన్ నిలవనుంది. యాక్సియమ్ స్పేస్, నాసా, స్పేస్ఎక్స్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)ల సహకారంలో ఈ ప్రయోగం జరుగుతోంది. ఇది కూడా చదవండి: అది ప్రతీ భారతీయుని ఆత్మపై దాడి: ‘జీ7’లో ప్రధాని మోదీ -
Shubhanshu Shukla: ఆహా... అంతరిక్షంలో గాజర్ హల్వా
శుభాంశు శుక్లా అంతరిక్షయాత్రకు సంబంధించిన ఆసక్తి శాస్త్రీయ విషయాలకే పరిమితం కాలేదు.‘అక్కడ ఏంతింటారు?’ లాంటివి కూడా చాలామంది తెలుసుకోవాలనుకుంటున్నారు.శుక్లా తనతో పాటు భారతీయ రుచులను కూడా అంతరిక్షంలోకి తీసుకువెళ్లనున్నాడు.‘ఇస్రో’ ప్రత్యేకంగా సిద్ధం చేసిన వంటకాలు, గాజర్ హల్వా తీసుకువెళతాడు. ఈ వంటకాలను మొదట భారతదేశ గగన్‌యాన్ మిషన్ కోసం తయారుచేశారు. వాటిని ఇప్పుడు ‘యాక్సియం–4’ మిషన్ కోసం ఉపయోగించనున్నారు.అంతరిక్ష పరిస్థితులను తట్టుకునేలా, మై క్రో గ్రావిటీలో తినడానికి తేలికగా, సురక్షితంగా, తాజాగా ఉండేలా ఈ ఆహారపదార్థాలను తయారుచేశారు. భారతీయ వంటకాలను ‘యాక్సియం–4’ మిషన్ కోసం ఆమోదించడం అంత తేలికగా జరగలేదు.ఇదీ చదవండి: Today tips : బొద్దింకలతో వేగలేకపోతున్నారా?‘భారతీయ వంటకాలలో మసాలాలు అధికంగా ఉన్నందున వాటిని తీసుకువెళ్లడానికి అనుమతి లభించడం కష్టం అయింది. చివరకు కొన్ని రకాల ఆహారపదార్థాలను అనుమతించారు. తన వెంట తీసుకువెళుతున్న భారతీయ వంటకాలను తోటి వారికి రుచి చూపించాలని శుభాంశు ఉత్సాహంగా ఉన్నాడు’ అంటుంది లక్నోలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న శుక్లా సోదరి సుచి శుక్లా. -
శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర.. ఇస్రో కీలక ప్రకటన
ఢిల్లీ: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) రోదసియాత్ర ఇస్రో కొత్త తేదీని ప్రకటించింది. జూన్ 19వ తేదీన శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర చేపట్టనున్నారు. యాక్సియం-4 మిషన్ కింద మరో ముగ్గురు ఆస్ట్రోనాట్లతో కలిసి ఆయన నింగిలోకి వెళ్లనున్నారు. అయితే, తొలుత మే 29న ప్రయోగం జరగాల్సి ఉండగా.. సాంకేతిక సమస్యలతో పలుమార్లు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో తాజాగా ఇస్రో కొత్త తేదీని ప్రకటించింది.ఇదిలా ఉండగా.. అంతకుముందు శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) రోదసియాత్ర వాయిదా పడిన విషయం తెలిసిందే. సాంకేతిక సమస్యతో యాత్రను వాయిదా వేస్తున్నట్లు స్పేస్ఎక్స్ తెలిపింది. రాకెట్లో లిక్విడ్ ఆక్సిజన్ లీక్ కారణంగా ప్రయోగం వాయిదా పడినట్లు ‘ఎక్స్’లో పేర్కొంది. మరమ్మతులకు సమయం పడుతుందని.. త్వరలోనే కొత్త లాంచ్ తేదీని ప్రకటిస్తామని వెల్లడించింది. ప్రయోగ వాయిదా విషయాన్ని భారత రోదసి పరిశోధన సంస్థ (ఇస్రో) కూడా ధ్రువీకరించింది. ప్రయోగానికి ముందు బూస్టర్ టెస్టును తనిఖీ చేస్తుండగా ఈ సమస్యను గుర్తించినట్లు తెలిపింది. తొలుత లీక్ సమస్యను పరిష్కరించి పరీక్షించిన తర్వాత ప్రయోగం నిర్వహించాలని శాస్త్రవేత్తలు తేల్చారు. అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ ‘యాక్సియం స్పేస్’ ఈ మిషన్ నిర్వహిస్తోంది. ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా), ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ)లు ఇందులో భాగస్వామ్యం వహిస్తున్నాయి. ఈ స్పేస్ క్యాప్సూల్‌ను ఫాల్కన్-9 రాకెట్ నింగిలోకి మోసుకెళుతోంది. ఇందులో శుభాంశు మిషన్ పైలట్ బాధ్యతలు నిర్వహిస్తారు. BREAKING 🚨#Ax4 Mission with India’s Shubhanshu Shukla to launch on June 19, #ISRO says pic.twitter.com/XTX3wQE7kg— Sibu Tripathi 🪂 (@imsktripathi) June 14, 2025 -
స్పేస్X డ్రాగన్ వ్యోమనౌక ప్రయోగం వాయిదా
-
శుభాన్షు అంతరిక్ష ప్రయాణం మళ్లీ వాయిదా
న్యూఢిల్లీ: భారతదేశపు రెండవ వ్యోమగామి శుభాన్షు శుక్లాను అంతరిక్షంలోకి తీసుకెళ్లే ఆక్సియం-4 మిషన్ ప్రయోగం బుధవారం ఐదవసారి కూడా వాయిదా పడింది. ఫాల్కన్ 9 రాకెట్ రిపేర్ కారణంగా ఈ వాయిదా అనివార్యమయ్యింది. స్పేస్ ఎక్స్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ప్లాట్ఫారం ఎక్స్‌లో తెలియజేసింది.పోస్ట్ స్టాటిక్ ఫైర్ బూస్టర్ తనిఖీల సమయంలో గుర్తించిన ఎల్ఓ ఎక్స్ లీక్‌ను రిపేర్ చేసేందుకు స్పేస్ఎక్స్ బృందాలకు అదనపు సమయం అవసరం కానుంది. వీరు ఫాల్కన్ 9 యాక్స్-4 ప్రయోగం నుండి తిరిగి @Space_Station కు బయలుదేరుతున్నారు. మరమ్మత్తు పూర్తయిన తర్వాత తదుపరి ప్రయోగ తేదీని తెలియజేస్తామని స్పేస్ఎక్స్ పేర్కొంది. Standing down from tomorrow’s Falcon 9 launch of Ax-4 to the @Space_Station to allow additional time for SpaceX teams to repair the LOx leak identified during post static fire booster inspections. Once complete – and pending Range availability – we will share a new launch date pic.twitter.com/FwRc8k2Bc0— SpaceX (@SpaceX) June 11, 2025భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లాను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు పంపే ఆక్సియం-4 మిషన్ ప్రయోగం ఐదోసారి వాయిదా పడింది. ఈ వాయిదాకు ముందు కూడా ప్రయోగ ప్రాంతంలో అనుకూలమైన వాతావరణం లేని కారణంగా వాయిదా పడిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తెలిపింది. భారతదేశ అంతరిక్ష లక్ష్యాలకు ఒక మైలురాయిగా ఈ మిషన్ నిలుస్తుంది. యాక్సియమ్ స్పేస్, నాసా, స్పేస్ఎక్స్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)ల సహకారంలో ఈ ప్రయోగం జరుగుతోంది. ఇది కూడా చదవండి: ‘హనీమూన్’ కేసు.. ప్రియుడి ‘ప్లాన్’తో భర్తను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి.. -
#Axiom4: శుభాంషు శుక్లా అంతరిక్ష యాత్ర వాయిదా
యాక్సియమ్ స్పేస్ సంస్థ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని(ISS)కి చేపట్టిన నాలుగో మావన సహిత అంతరిక్ష యాత్ర వాయిదా పడింది. ఈ నెల 10న సాయంత్రం 5.52 గంటలకు (భారత కాలమానం ప్రకారం) నింగిలోకి దూసుకెళ్లాల్సింది. అయితే ప్రతికూల వాతావరణంతో రెండు రోజులు వాయిదా వేసినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ యాత్ర కోసం చేపట్టనున్న నాలుగో మావన సహిత అంతరిక్ష యాత్ర భారత్‌కు చెందిన కెప్టెన్ శుభాంశు శుక్లాను(shubhanshu shukla) ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. శుక్లాతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) పయనం కావాల్సి ఉంది. వాస్తవానికి యాక్సియం-4 మిషన్ కోసం వీరు గత నెల 29నే నింగిలోకి పయనం కావాల్సింది. అయితే, దాన్ని తొలుత ఈ నెల 8కి, అనంతరం 10కి మార్చారు. తాజాగా మరోసారి వాయిదా పడింది.Launch Of Axiom-4 Mission To ISS Postponed To June 11 Due To Bad Weather#Axiom4 #ShubhanshuShuklahttps://t.co/wsEgLTMx4R— NewsMobile (@NewsMobileIndia) June 9, 2025తాజా షెడ్యూల్ ప్రకారం జూన్ 11వ తేదీన ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్లో ఈ మిషన్ ప్రారంభం కానుంది. 28 గంటల ప్రయాణానంతరం ఐఎస్ఎస్ చేరుకుని, అక్కడ 14 రోజులు గడుపుతారు. శుభాంశు శుక్లా (భారతదేశం), పెగ్గీ విట్సన్ (అమెరికా), స్లావోస్ట్ ఉజ్నాన్స్కీ (పోలండ్), టిబర్ కపు (హంగరీ) ఈ యాత్రలో పాల్గొంటారు. యాక్సియమ్ స్పేస్ (Axiom Space) ద్వారా చేపట్టబడిన ఈ మిషన్, "ఏఎక్స్-4" (AX-4) అని పిలుస్తారు. భారత్ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన తొలి మానవసహిత అంతరిక్షయాత్ర ‘గగన్‌యాన్’ కోసం ఇస్రో తీవ్ర కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి ముందే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) మన వ్యోమగామి పంపించడం విశేషం. ఐఎస్ఎస్లో శుక్లా చేపట్టబోయే ప్రయోగాలు గగన్‌యాన్‌కు ఎంతో ఉపకరిస్తాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ భావిస్తోంది. ఇక.. 1984లో రష్యాకు చెందిన సోయుజ్ రాకెట్ ద్వారా రోదసీ యానం చేసిన రాకేశ్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లనున్న భారత వ్యోమగామి శుభాంశు శుక్లా కావడం గమనార్హం.