
సాక్షి,తాడేపల్లి: భారత వ్యోమగామి శుభాంశు శుక్లాకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అంతరిక్ష కేంద్రం నుండి విజయవంతంగా తిరిగి రావటంపై హర్షం వ్యక్తం చేశారు. శుక్లాతోపాటు ఆయన టీమ్‌కు అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఇది భారత్ గర్వించదగిన సమయం అంటూ ట్వీట్ చేశారు.
A proud moment for India! Congratulations to Group Captain #ShubhanshuShukla and the entire #Axiom4 crew on their successful return from the ISS. pic.twitter.com/hMqBlWSN4x
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 15, 2025
యాక్సియం-4 మిషన్ ప్రయోగం విజయవంతమైంది. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా బృందం సురక్షితంగా భూమికి చేరుకుంది. 18 రోజులపాటు ఐఎస్‌ఎస్‌లో గడిపిన శుక్లా బృందం.. భారత కాలమానం ప్రకారం జులై 15 మధ్యాహ్నాం భూమ్మీదకు స్పేస్‌ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా సురక్షితంగా తిరిగొచ్చింది. దీంతో ఇస్రో వర్గాలు సంబురాల్లో మునిగితేలాయి. ఈ సందర్భంగా శుభాంశు శుక్లా బృందానికి వైఎస్ జగన్ శుభాంకాంక్షలు తెలిపారు.
