సాక్షి, కృష్ణా జిల్లా: జనాల్లో ఉన్న వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రజల ప్రేమను గౌరవంగా తీసుకుని, వారితో దగ్గరగా కలిసిపోవడం ఆయన శైలి. ఆ అభిమానానికి ఆయన ప్రతిస్పందన ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది.
అలా.. ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకున్న జగన్ మరోసారి అలాంటి అభిమానాన్ని గౌరవించారు. విజయవాడ జోజి నగర్ బాధితులను స్వయంగా పరామర్శించేందుకు ఈ ఉదయం ఆయన బెంగళూరు నుంచి విజయవాడకు చేరుకున్నారు. ఆ సమయంలో గన్నవరం ఎయిర్‌పోర్టు వద్ద అభిమానుల కోలాహలం నెలకొంది. అయితే..
ఓ అభిమాని ముందస్తుగా వైఎస్ జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి ఆయన దృష్టిని ఆకర్షించగలిగారు. దీంతో ఆ అభిమాని దగ్గరకు వెళ్లి వివరాలు ఆరా తీశారు. తనపేరు గోసాల రాజేష్ అని.. కైకలూరు ముదినేపల్లి నుంచి వచ్చానని.. ఆయనతో ఫొటో దిగడమే కోరి అని చెప్పాడా వ్యక్తి. దీంతో.. వైఎస్ జగన్ స్వయంగా సెల్ఫీ తీయడంతో రాజేష్ మురిసిపోయాడు.


