#Axiom4: శుభాంషు శుక్లా అంతరిక్ష యాత్ర వాయిదా | Axiom 4 Mission launch gets postponed For This Reason | Sakshi
Sakshi News home page

#Axiom4: శుభాంషు శుక్లా అంతరిక్ష యాత్ర వాయిదా

Jun 9 2025 9:11 PM | Updated on Jun 9 2025 9:19 PM

Axiom 4 Mission launch gets postponed For This Reason

యాక్సియమ్‌ స్పేస్‌ సంస్థ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని(ISS)కి చేపట్టిన నాలుగో మావన సహిత అంతరిక్ష యాత్ర వాయిదా పడింది. ఈ నెల 10న సాయంత్రం 5.52 గంటలకు (భారత కాలమానం ప్రకారం) నింగిలోకి దూసుకెళ్లాల్సింది. అయితే ప్రతికూల వాతావరణంతో రెండు రోజులు వాయిదా వేసినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ యాత్ర కోసం 

 చేపట్టనున్న నాలుగో మావన సహిత అంతరిక్ష యాత్ర భారత్‌కు చెందిన కెప్టెన్‌ శుభాంశు శుక్లాను(shubhanshu shukla) ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. శుక్లాతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) పయనం కావాల్సి ఉంది. వాస్తవానికి యాక్సియం-4 మిషన్‌ కోసం వీరు గత నెల 29నే నింగిలోకి పయనం కావాల్సింది. అయితే, దాన్ని తొలుత ఈ నెల 8కి, అనంతరం 10కి మార్చారు. తాజాగా మరోసారి వాయిదా పడింది.

తాజా షెడ్యూల్‌ ప్రకారం జూన్‌ 11వ తేదీన ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్‌ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్‌లో ఈ మిషన్ ప్రారంభం కానుంది. 28 గంటల ప్రయాణానంతరం ఐఎస్ఎస్ చేరుకుని, అక్కడ 14 రోజులు గడుపుతారు. శుభాంశు శుక్లా (భారతదేశం), పెగ్గీ విట్సన్ (అమెరికా), స్లావోస్ట్ ఉజ్నాన్స్కీ (పోలండ్), టిబర్ కపు (హంగరీ) ఈ యాత్రలో పాల్గొంటారు. యాక్సియమ్ స్పేస్ (Axiom Space) ద్వారా చేపట్టబడిన ఈ మిషన్, "ఏఎక్స్-4" (AX-4) అని పిలుస్తారు. 

భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన తొలి మానవసహిత అంతరిక్షయాత్ర ‘గగన్‌యాన్‌’ కోసం ఇస్రో తీవ్ర కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి ముందే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) మన వ్యోమగామి పంపించడం విశేషం. ఐఎస్‌ఎస్‌లో శుక్లా చేపట్టబోయే ప్రయోగాలు గగన్‌యాన్‌కు ఎంతో ఉపకరిస్తాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ భావిస్తోంది. ఇక.. 1984లో రష్యాకు చెందిన సోయుజ్‌ రాకెట్‌ ద్వారా రోదసీ యానం చేసిన రాకేశ్‌ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లనున్న భారత వ్యోమగామి శుభాంశు శుక్లా కావడం గమనార్హం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement