
96 లక్షల కి.మీ.లుఐఎస్‌ఎస్‌లో 14 రోజులు పూర్తి చేసుకున్న శుభాంశు
14న తిరిగొచ్చే అవకాశం: నాసా
వాషింగ్టన్: నూటా నలభై కోట్ల మంది కలలను మోస్తూ నింగిలోకి దూసుకెళ్లి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని చేరి పలు రకాల పరిశోధనలతో బిజీగా మారిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అక్కడ 14 రోజులను పూర్తిచేసుకున్నారు. ఐఎస్‌ఎస్‌లో ఉంటూ ఇప్పటికే పుడమిని 230 సార్లు చుట్టేశారు. ఈయనతోపాటు ఐఎస్‌ఎస్‌కు విచ్చేసిన వ్యోమగాములు పెగ్గీ వాట్సన్ (అమెరికా), ఉజ్నాన్‌స్కీ విస్నేవ్‌స్కీ (పోలండ్), టిబర్ కపు (హంగరీ)ల యాగ్జియం–4 బృందం ఇప్పటిదాకా ఐఎస్‌ఎస్‌లో ఉంటూ అంతరిక్షంలో 96 లక్షల కిలోమీటర్లు ప్రయాణించింది.
ఐఎస్‌ఎస్‌కు చేరుకున్నాక శుభాంశు బృందం శాస్త్రసాంకేతిక రంగాలకు చెందిన పలు రకాల ప్రయోగాలు చేసింది. భూమి మీద ఆచరణలో ఉన్న ఎన్నో సిద్ధాంతాలను శూన్యస్థితిలో అక్కడ పరిశీలించింది. జీవవైద్య శాస్త్రం, రేడియోధారి్మకత, న్యూరోసైన్స్, వ్యవసాయం, అంతరిక్ష సాంకేతికత ఇలా విభిన్న రంగాలకు సంబంధించి ప్రయోగాలు చేసింది. యాగ్జియం–4 మిషన్ వంటి ఒక ప్రైవేట్ వ్యోమగాముల బృందం ఇంతటి విస్తృతస్థాయిలో పరిశోధనలు చేయడం ఇదే తొలిసారి.
అరవైకి పైగా ప్రయోగాలు ఈ బృంద సభ్యులు విజయవంతంగా పూర్తిచేశారు. చక్కెరవ్యాధిగ్రస్తులకు మెరుగైన చికిత్స విధానాలు, కేన్సర్ ట్రీమ్‌మెంట్‌లో కొత్తతరహా టెక్నాలజీ వాడకం, సుదీర్ఘకాలం ఖగోళయానం చేస్తే వ్యోమగామిపై రేడియేషన్ చూపే దుష్ప్రభావం, శూన్యస్థితిలో విత్తనాలు, సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా మనుగడ.. ఇలా భిన్న అంశాలపై శుభాంశు బృందం ప్రయోగాలు చేసి ఫలితాలను విశ్లేíÙంచింది. భూమి నుంచి 250 మైళ్ల ఎత్తులో 230 సార్లు భూమిని చుట్టేసిన ఈ బృందం త్వరలోనే తిరిగి రానుంది. వారి తిరుగు ప్రయాణం ఈ నెల 14న ఉండొచ్చని నాసా పేర్కొంది.