స్కూల్‌పై బాంబుల వర్షం.. 50 మందికిపైగా మృతి | Iran-Israel War, More Than 50 Students Killed After US Israel Joint Airstrikes On School In Iran Minab, Check Details Inside | Sakshi
Sakshi News home page

స్కూల్‌పై బాంబుల వర్షం.. 50 మందికిపైగా మృతి

Feb 28 2026 5:08 PM | Updated on Feb 28 2026 6:45 PM

Israeli Bombs Rain Down On School In Minab

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. మినాబ్‌లోని స్కూల్‌పై ఇజ్రాయెల్‌ బాంబుల వర్షం కురిపించింది.  ఈ దాడిలో 50 మందికిపైగా విద్యార్థులు మృతి చెందారు. ఇవాళ ఉదయం(శనివారం) ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ మెరుపు దాడులకు దిగింది. ఇజ్రాయెల్‌, అమెరికా తీరుపై రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది. వరల్డ్‌ ఆర్డర్‌ను మార్చేలా అమెరికా నాయకత్వం వ్యవహరిస్తోందంటూ మాస్కో మండిపడింది. ఇరాన్‌లోని పలు ప్రాంతాలపై ఇజ్రాయెల్‌ సైన్యం దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్‌ దాడుల నేపథ్యంలో సుప్రీం లీడర్‌ ఖమేనీని సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు సమాచారం.

బాంబు దాడుల నేపథ్యంలో ఇరాన్‌లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా సైన్యం ఇరాన్‌పై దాడులు చేపట్టిందన్న ట్రంప్.. అమెరికాకు పొంచి ఉన్న ప్రమాదాన్ని అరికట్డడానికే దాడులంటూ ఆయన తెలిపారు. ఇరాన్ అణ్వాయుధాలు మళ్లీ తయారు చేస్తోందన్న ట్రంప్‌.. అమెరికా సైనిక స్థావరాలకు ముప్పు ఉండడం వల్లే ఈ దాడులంటూ పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌పై ఇరాన్ ఎదురుదాడి ‍ప్రారంభించింది. బాలిస్టిక్‌ మిసైళ్లతో ఇరాన్ దాడికి దిగింది. ఇజ్రాయెల్‌, ఇరాన్‌ యుద్ధంతో పశ్చిమాసియా రగులుతోంది. ఒకేసారి ఇరాన్‌ 10 దేశాలపై మిస్సైళ్లు ప్రయోగించింది.

కాగా, ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా దాడులు నేపథ్యంలో విమానాలు రద్దయ్యాయి. శంషాబాద్‌ నుంచి వెళ్లాల్సిన పలు విమానాలను రద్దు చేశారు. ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దయ్యాయి. పశ్చిమాసియాకు వెళ్తే విమానాలు రద్దు చేస్తున్నట్లు ఎయిర్‌లైన్స్‌ ప్రకటించింది. పశ్చిమాసియా ఘర్షణలతో  ఎయిరిండియా విమానం వెనక్కి తిరగొచ్చింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement