యుద్ధం ఎఫెక్ట్.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్, సిల్వర్ రేటు! | Iran-Israel Conflict: Gold, Silver Prices Surge | Sakshi
Sakshi News home page

యుద్ధం ఎఫెక్ట్.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్, సిల్వర్ రేటు!

Feb 28 2026 5:41 PM | Updated on Feb 28 2026 5:54 PM

Iran-Israel Conflict: Gold, Silver Prices Surge

ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్‌పై దాడి చేయడం మొదలుపెట్టేశాయి. దీంతో పెట్టుబడిదారుల్లో భయం పెరిగిపోయింది. ఈ తరుణంలో అందరూ సురక్షితంగా భావించే బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. ఈ కథనంలో లేటెస్ట్ గోల్డ్ రేటు.. దేశంలోని ఏ నగరంలో ఎలా ఉందో వివరంగా తెలుసుకుందాం.

హైదరాబాద్, విజయవాడ నగరాల్లో తులం 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 7140 పెరిగి రూ. 1,68,170 వద్దకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 6550 పెరిగి రూ. 1,54,650 వద్దకు చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా ఉన్నాయి.

చెన్నైలో కూడా ధరలు పెరిగాయి. దీంతో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 1,69,640 (రూ. 7090 పెరిగింది). 22 క్యారెట్ల రేటు రూ. 1,55,500 (రూ. 6500 పెరిగింది) వద్ద ఉంది.

ఢిల్లీ విషయానికి వస్తే.. దేశ రాజధాని నగరంలో 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 7140 పెరిగి, రూ. 1,68,860 వద్ద నిలిచింది. ఇదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 6550 పెరిగి రూ. 1,54,800 వద్ద నిలిచింది.

వెండి ధరలు
బంగారం బాటలోనే వెండి అన్నట్లు.. వెండి రేటు కూడా అమాంతం పెరిగిపోయింది. దీంతో హైదరాబాద్, విజయవాడ మొదలైన నగరాల్లో కేజీ సిల్వర్ రేటు రూ. 3.20 లక్షలు చేరింది. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 2.95 లక్షల వద్ద నిలిచింది.

ఇదీ చదవండి: అమెరికాను విడిచిపెడుతున్న లక్షలాది మంది ప్రజలు!

Advertisement
 
Advertisement
Advertisement