ఒక పెద్ద గ్రహశకలం భూమికి చేరువగా వస్తోందని నాసా (NASA) ఒక హెచ్చరిక జారీ చేసింది. ఈ శిల కొన్ని గంటల్లో భూమిని సమీపిస్తుందని భావిస్తున్నారు. దీనికి ఆస్టరాయిడ్ (గ్రహశకలం)2025 YU15 అని పేరు పెట్టారు. దీని వెడల్పు 410 అడుగులు. NASA JPL దాని పరిమాణాన్ని ఒక పెద్ద భవనంతో పోల్చింది. దీని వల్ల ఎలాంటి ముప్పు ఉంది?
ఈ ఆస్టరాయిడ్‌ను 2025లో గుర్తించారు. ఇది ఫిబ్రవరి 21న భూమికి దగ్గరగా వస్తుందనీ, ఇది భూమికి దగ్గరగా ఉన్నప్పుడు, భూమికి , ఆస్టరాయిడ్ మధ్య దూరం 5.89 మిలియన్ కిలోమీటర్లు మాత్రమే ఉంటుందని నాసా చెప్పింది. భూమికి చేరువగా వస్తున్న ఆస్టరాయిడ్ 2025 YU15 ను శాస్త్రవేత్తలు నిశితంగా గమనిస్తున్నారు 7.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో భూమికి కొంత సమీపం నుండే వెళ్తున్నప్పటికీ, దీని దీనివల్ల ఎలాంటి ప్రమాదం లేదని వారు భరోసా ఇస్తున్నారు. అయినప్పటికీ, వీటిని ట్రాక్ చేయడం చాలా ముఖ్యం. గ్రహాల గురుత్వాకర్షణ శక్తి వల్ల వీటి కక్ష్యలో స్వల్ప మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఖగోళ శాస్త్రవేత్తలు వీటి పట్ల అప్రమత్తంగా ఉంటారు.
ఇది గంటకు 21,306 మైళ్ల వేగంతో ప్రయాణిస్తోంది. భూమికి అత్యంత సమీపంలోకి వచ్చినప్పుడు, ఇది 36,60,000 మైళ్ల దూరంలో ఉంటుంది. ఖగోళ శాస్త్రం ప్రకారం ఈ దూరం తక్కువే అయినప్పటికీ, శాస్త్రవేత్తలు దీనిని నిశితంగా పరిశీలిస్తున్నారు. ఆస్టరాయిడ్ 2025 YU15 'అటెన్' (Aten) సమూహానికి చెందినది. ఈ తరహా గ్రహశకలాలు భూమి కక్ష్యను దాటుతుంటాయి.
ఆస్టరాయిడ్ 2025 YU15 వల్ల ముప్పు ఉందా?
దీనివల్ల తక్షణ ముప్పు ఏమీ లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రమాదకరమైన వస్తువులను గుర్తించడానికి నాసా కొన్ని కఠినమైన నిబంధనలను పాటిస్తుంది. ఏదైనా గ్రహశకలం భూమికి 7.4 మిలియన్ కిలోమీటర్ల లోపు ఉండి, 85 మీటర్లకుమించి వెడల్పు ఉంటేనే దానిని ప్రమాదకరమైనదిగా భావిస్తారు. అందువల్ల, ఆస్టరాయిడ్ 2025 YU15 ప్రయాణం సురక్షితమైనదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: సుందర్ పిచాయ్‌తో సరదాగా, సర్‌ప్రైజింగా : వైరల్ వీడియోలు
భారత్ ,అంతర్జాతీయ సంస్థలు ఎందుకు గమనిస్తున్నాయి?
భారతదేశం కూడా గ్రహశకలాల పరిశోధనలో తన పట్టును పెంచుకుంటోంది. ఇస్రో (ISRO) ఛైర్మన్ ఎస్. సోమనాథ్ భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు. భారీ గ్రహశకలాలను దగ్గరగా అధ్యయనం చేయడంపై భారత్ దృష్టి సారించింది. ముఖ్యంగా 2029లో భూమికి దగ్గరగా రానున్న 'అపోఫిస్' (Apophis) గ్రహశకలంపై పరిశోధనలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం నాసా,ఈఎస్ఏ (ESA), జాక్సా (JAXA) వంటి సంస్థలతో భారత్ సహకరించనుంది. భవిష్యత్తులో గ్రహశకలాలపై ల్యాండింగ్ చేసే ప్రయత్నాలు కూడా జరగవచ్చు.
నేషనల్ సైన్స్ ఫౌండేషన్ ప్రకారం, భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి చాలా శక్తివంతమైనది, అది సెకనుకు 9.8 మీటర్ల వేగంతో ఒక వస్తువును లాగగలదు. కొన్నిసార్లు, ఉల్కలు కూడా భూమి వైపుకు లాగబడతాయి. గ్రహశకలాలు , ఉల్కలు రెండూ భూమిపై పడితే హానికరం కావచ్చు.అందుకే ఖగోళ సైంటిస్టులు దీన్ని అత్యంత జాగ్రత్తగా గమనిస్తున్నారు.
ఇదీ చదవండి: బంగారాలూ..మీరే నా సర్వస్వం : నటుడి భావోద్వేగ సందేశం


