సెక్రటేరియట్ : మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్ లు అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .. 44 మంది మృతుల కుటుంబ సభ్యులకు 5 లక్షల చొప్పున పరిహారం అందించిన సీఎం.. ప్రమాదం లో గాయపడిన ఒకరి కి 3 లక్షల పరిహారం.. నవంబర్ 17, 2025 న సౌదీ అరేబియా లోని మదీనా సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో సజీవ దహనం అయిన 44 మంది హైదరాబాద్ వాసులు..
కార్యక్రమంలో పాల్గొన్న మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ ,ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ,సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ,సీఎంఓ ఓఎస్డీ వేముల శ్రీనివాసులు,నాంపల్లి ఎమ్మెల్యే మహమ్మద్ మాజిద్ హుస్సేన్,హజ్ కమిటీ చైర్మన్ ఖుష్రో పాషా,తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (TGMREIS) వైస్ చైర్మన్ ఫహీమ్ ఖురేషి,రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఒబేదుల్లా కొత్వాల్.
సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ పాయింట్స్..
ప్రమాదం గురించి తెలియగానే సహాయ చర్యల పైన కేంద్రం తో మాట్లాడాను..
మంత్రి అజారుద్దీన్ ను మదీనా పంపించాను..
బాధిత కుటుంబాలకు 5 లక్షల పరిహారం ఇవ్వాలని మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం..
దేశం బయట జరిగే ప్రమాదాలకు ప్రభుత్వాలు పరిహారం చెల్లించదు..కానీ భాదితుల కుటుంబాల పరిస్థితి చూసి సహాయం ప్రకటించాం..
నాంపల్లి అగ్ని ప్రమాదం లో చనిపోయిన వారి కుటుంబాలను కూడా ఆదుకున్నాం..
ప్రభుత్వం అండగా ఉంటుందనే నమ్మకం కల్గించడం ముఖ్యం..
అందుకే కుటుంబాలను సెక్రటేరియట్ కి పిలిచి పరిహారం అందించాం…
ఇది మీ ప్రభుత్వం..ఆందోళన వద్దు
మీ కష్టం,ఆనందం లో మీతో ఉంటుంది..
ఈ నెల ముస్లిం సోదరులకు చాలా పవిత్రమైనది..
అంతా కలిసి మెలిసి ముందుకు వెళ్దాం..
కొడంగల్ లో 2009 నుంచి ప్రతి సంవత్సరం ప్రతి మండలం నుంచి ఒకరి చొప్పున నేను హజ్ కు పంపిస్తున్న..


