శారదాపీఠం భూములపై సీఎం రేవంత్‌ కీలక నిర్ణయం | CM Revanth key decision on Sharada Peetham lands | Sakshi
Sakshi News home page

శారదాపీఠం భూములపై సీఎం రేవంత్‌ కీలక నిర్ణయం

Feb 28 2026 7:21 PM | Updated on Feb 28 2026 7:35 PM

CM Revanth key decision on Sharada Peetham lands

హైదరాబాద్‌: తెలంగాణలోని శారదాఫీఠం భూముల అంశానికి సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. భూములను శారదా పీఠానికే కొనసాగించాలని ఆదేశించారు. అదే సమయంలో జలమండలికి భూ కేటాయింపులు రద్దు చేశారు. 

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారుల సీఎం రేవంత్‌ సమావేశం అయ్యారు. 99 రోజుల కార్యచరణ ప్రణాళికపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ముఖ్యంగా శారదాపీఠం భూముల అంశంపై సీఎం ఆరా తీశారు. ఈ క్రమంలోనే నిర్మాణాల తాజా స్థితిని తెలియజేయనందుకు అధికారులపై రేవంత్‌ ఫైర్‌ అయినట్లు సమాచారం. 

కాగా, 2019లో తెలంగాణలో విశాఖ శ్రీశారదా పీఠానికి  అప్పటి కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్ పరిధిలో సుమారు రెండున్నర ఎకరాల భూమిని కేటాయించింది. విలువైన ప్రభుత్వ భూమిని కేవలం రూపాయికే కట్టబెట్టడంపై ఆ సమయంలో చర్చలు నడిచాయి. ఈ భూమి కేటాయింపు పీఠం యొక్క ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల నిమిత్తం జరిగిందని, ఇది ఆ పీఠం విజ్ఞప్తి మేరకే జరిగినట్లు తెలుస్తోంది.

బీఆర్‌ఎస్‌ ధ్వజం
శారదా పీఠం భూములు అంశానికి సంబంధించి రేవంత్‌ సర్కార్‌పై బీఆర్‌ఎస్‌ ధ్వజమెత్తింది. తెలంగాణలో ఇళ్లు కూల్చడం అయిపోయిందని, ఇక దేవాలయాలు కూల్చడానికి కాంగ్రెస్‌ నేతలు సిద్ధమయ్యారంటూ హరీష్‌ రావు విమర్శించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండటం ఇష్లం లేదా అంటూ ప్రశ్నించారు. 

Advertisement
 
Advertisement
Advertisement