breaking news
Bus accident
-
హరిత ట్రావెల్స్ బస్సు కర్ణాటకలో బోల్తా
-
హరిత ట్రావెల్స్ బస్సు బోల్తా.. ప్రొద్దుటూరువాసి మృతి
సాక్షి, కడప: కడప నుండి బెంగళూరు వెళ్తున్న హరిత ట్రావెల్స్ బస్సు కర్ణాటకలో ప్రమాదానికి గురైంది. ఆంధ్ర- కర్ణాటక బార్డర్‌లోని శ్రీనివాసపురం తాలూకా రాయల్పాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని మంచినీళ్ల కోట సమీపంలో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి, 10మందికి పైగా గాయాలు పాలైనట్టు సమాచారం. మంగళవారం వేకువ జామున 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. మృతి చెందిన మహిళ ప్రొద్దుటూరుకు చెందిన అనిత (58)గా గుర్తింపు. గాయపడిన వారిలో కడప, రాయచోటి, బెంగళూరు ప్రాంతాలకు చెందిన వారు ఉన్నట్టు తెలుస్తోంది. గాయపడినవారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి ఆందోళన కరంగా ఉన్నట్టు తెలుస్తోంది.ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు రక్షణ చర్యలు చేపట్టాయి. ప్రమాద ఘటనపై రాయల్పాడు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. -
కర్ణాటక ఆర్టీసీ బస్సు బోల్తా..
కర్నూలు: కర్ణాటక బస్సుకు పెను ప్రమాదం తప్పింది. కర్నూల్ జిల్లాలోని తుగ్గలి సమీపంలో కర్ణాటక ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. బస్సు వేగం సమానంగా ఉండటంతో ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో 26 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు. ఈ రోజు(శనివారం, ,నవంబర్ 29) ఉదయం బస్సు ప్రమాదానికి గురైనట్లు సమాచారం. స్టీరింగ్ రాడ్ విరిగిపోయి పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడిండి బస్సు. మంత్రాలయం నుండి బెంగళూరుకు వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.అంతకుముందు కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు చిన్నారులతో సహా ఐదుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని స్థానికి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జిల్లాలోని ఎమ్మిగనూరు మండలం కోటేకల్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.రోడ్డు ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం -
వామ్మో..తృటిలో తప్పించుకున్నాడు, లేదంటే!
UP cyclist miraculous escape ఉత్తరప్రదేశ్‌లోని ఎటావాలో జరిగిన ఒకరోడ్డు ప్రమాద ఘటన నెట్టింట వైరల్‌గా మారింది. ప్రైవేట్ బస్సు అదుపు తప్పి దుకాణంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో అక్కడే నిలబడి ఉన్న సైక్లిస్ట్ ఒకరు తృటిలోప్రాణా పాయం నుంచి తప్పించుకున్నాడు. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.ఎటావా నుండి మెయిన్‌పురి వైపు వెళ్తున్న బస్సు, అదుపు తప్పి మదర్ డెయిరీ ప్లాంట్ ప్రధాన గేటును బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో దాదాపు డజను మంది ప్రయాణికులు గాయపడ్డారు , బస్సు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. అయితే అప్పుడే కొన్ని అడుగుల దూరం నుంచి వచ్చిన సైక్లిస్ట్, చివరి క్షణంలో తనవైపు దూసుకొస్తున్న బస్సును గుర్తించి చాకచక్యంగా పక్కకు తప్పుకున్నాడు. దీంతో అతడు దాదాపు చావు నుంచి తప్పించుకున్నాడు. ఈ భూమ్మిద నూకలు మిగిలి ఉండటం అంటే ఇదేనేమో అంటూ అక్కడున్నవారు ఊపిరి పీల్చుకున్నారు.చదవండి: స్మృతి పెళ్లికి బ్రేక్స్ : వైరల్ స్ర్కీన్ షాట్స్, ఎవరీ మేరీ డికోస్టాప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం బస్సు ముందు ప్రయాణిస్తున్న కారు అకస్మాత్తుగా బ్రేక్‌లు వేయడంతో, బస్సు డ్రైవర్‌ను కారును ఢీకొట్టకుండా తప్పించుకునే ప్రయత్నంలో, డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు నేరుగా మదర్ డైరీ గేటులోకి దూసుకెళ్లింది. బస్సులో దాదాపు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో దాదాపు డజను మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు , పోలీసులు వెంటనే సహాయ చర్యలు చేపట్టి, గాయపడిన వారిని చికిత్స కోసం సైఫాయి మెడికల్ యూనివర్సిటీకి తరలించారు. అధికారులు బస్సును స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిర్ల[node:field_tags]క్ష్యం , అతివేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక ఆధారాలు సూచిస్తున్నాయి. బస్సు డ్రైవర్‌ను ప్రశ్నిస్తామని పోలీసులు తెలిపారు. यूपी -जिला इटावा में प्राइवेट बस बेकाबू होकर मदर डेयरी की दीवार से टकराई। 2 सिक्योरिटी गार्ड और 33 यात्री घायल हुए।साइकिल वाला : 'इसे कहते हैं मौत को छूकर टक से वापस आना' pic.twitter.com/9BtBfymaYv— Sachin Gupta (@SachinGuptaUP) November 24, 2025 -
ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం
ఉత్తరఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెహ్రీ జిల్లాలోని నరేంద్రనగర్ ప్రాంతం సమీపంలో ప్రయాణిస్తున్న బస్సు లోయలో బోల్తాపడింది. ఈఘటనలో ఐదుగురు మృతిచెందగా, పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 18మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారిలో ఐదుగురు మృతి చెందగా మిగిలిన 13 మందికి తీవ్రగాయాలైనట్లు పేర్కొన్నారు. క్షతగాత్రులను చికిత్స కోసం స్థానిక ఆసుపత్రులకు తరలించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదం జరిగిన ప్రాంతం కుంజాపురి ఆలయానికి సమీపంలో ఉంటుంది. కాగా బస్సుప్రమాద ఘటనపై ఆరాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర సింగ్ దామీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం తననుతీవ్రంగా కలిచివేసిందన్నారు. గాయాలైన ప్రయాణికులను వెంటనే జిల్లాయంత్రాంగం స్థానిక ఆసుపత్రులకు తరిలించిందని తీవ్రంగా గాయపడ్డవారిని రిషికేష్ లోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు. -
AP: అర్ధరాత్రి వాహనాలు ఢీ.. లారీని పెళ్లి బస్సు.. కారు..
సాక్షి, కృష్ణా: గన్నవరంలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఓ లారీని ఢీకొట్టింది. అదే సమయంలో వెనుక వస్తున్న కారు.. ట్రావెల్స్ బస్సును ఢీకొంది. అయితే, ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ గాయపడటంలో అతడిని ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. గన్నవరం వే బ్రిడ్జ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 18 మంది ప్రయాణీకులు ఉన్నారు. వారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు.. బస్సును వెనుక నుండి ఢీకొన్న కారణంగా కారు ముందు భాగంగా పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదం సమయంలో కారులోని ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కావడంతో అందులో ప్రయాణిస్తున్న వారు సురక్షితంగా బయటపడ్డారు.అయితే, లారీ హనుమాన్ జంక్షన్ నుండి హైదరాబాద్ వెళ్లేందుకు వే బ్రిడ్జి వద్ద యూటర్న్ తీసుకుంటుండగా ప్రమాదం జరిగినట్టు తెలిసింది. ఇక, ఎస్వీకే ట్రావెల్స్ బస్సు విజయవాడ నుండి శ్రీకాకుళం పెళ్ళికి వెళ్లి తిరిగి వస్తుంది. ఈ ప్రమాదం కారణంగా బస్సు డ్రైవర్ గాయపడటంతో అతడిని పిన్నమనేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు.. తప్పిన ప్రమాదం..!
హైదరాబాద్: వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్తున్న సమయంలో పెద అంబర్‌పేట వద్ద బస్సు టైర్ల కింద నుంచి పొగలు వ్యాపించాయి. బస్సు ఓవర్ హీట్‌తో టైర్ల కింద నుంచి పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే రోడ్డుపైనే నిలిపేశాడు. బస్సులో 25 మంది ప్రయాణికులు ఉండగా, వారిని దించేశారు. అయితే ఆ తర్వాత ఆ ప్రయాణికుల్ని వేమూరి కావేరి ట్రావెల్స్ యాజమాన్యం పట్టించుకోలేదు. ప్రయాణికుల్ని కనీసం పట్టించుకోకపోవడంతో వారు తీవ్ర చలిలోనే పడిగాపులు కాస్తూ రోడ్డుపై నిలబడిపోయారు. కాగా, కొన్ని రోజుల క్రితం వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. కర్నూలు జిల్లాలో ఈ దుర్ఘటనలో మొత్తం 20 మంది మృత్యువాత పడ్డారు. బస్సులోని 19 మంది ప్రయాణికులతో పాటు బైకర్ సైతం మరణించారు. -
మరో స్లీపర్ బస్సు ప్రమాదం.. ముగ్గురు మృతి
కాన్పూర్: దేశంలో తరచూ చోటుచేసుకుంటున్న బస్సు ప్రమాదాలు అందరిలో ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం కాన్పూర్ సమీపంలోని అరౌలి ప్రాంతంలోని ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఢిల్లీ నుండి బిహార్‌లోని సివాన్‌కు వెళ్తున్న డబుల్ డెక్కర్ స్లీపర్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. ప్రాథమిక నివేదికల ప్రకారం బస్సు అతివేగంగా సెంట్రల్ డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టింది. పగిలిన గాజు ముక్కలు, చెల్లాచెదురుగా పడిన సామాను, గాయపడిన ప్రయాణికులతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది.ప్రయాణికులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రమాదానికి ప్రధాన కారణం డ్రైవర్ నిద్రలోకి జారుకోవడమేననే ఆరోపణలున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాద సమయంలో బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నట్లు కనిపించాడని సాక్షులు తెలిపారు. కాగా ఘటన జరిగిన వెంటనే డ్రైవర్, క్లీనర్ ఇద్దరూ పారిపోయారు. ఈ విషయాన్ని అరౌలి పోలీసు ఇన్స్పెక్టర్ జనార్ధన్ సింగ్ యాదవ్ ధృవీకరించారు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసు బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టాయి. బోల్తా పడిన బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఆరు అంబులెన్స్‌లలో గాయపడిన వారిని బిల్హౌర్ ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు ప్రయాణికులు మృతిచెందారని వైద్యులు ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారిని తదుపరి చికిత్స కోసం కాన్పూర్‌లోని ఆసుపత్రులకు తరలించారు. డాక్టర్ సంజీవ్ దీక్షిత్, ఏసీపీ మంజయ్ సింగ్ సహా పలువురు ఉన్నతాధికారులు ఆస్పత్రులోని గాయపడిన వారిని పరామర్శించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాన్ని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇది కూడా చదవండి: బిహార్ ‘ఫలితం’పై వివాదం.. మేనల్లుడు హత్య -
జగన్ షాక్ ఒకే కుటుంబంలో 18 మంది....
-
మక్కా యాత్రే చివరి ప్రయాణం..
ముషీరాబాద్: సౌదీలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి చెందడం నగరవాసుల్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా వారి జీవిత ప్రయాణం ముగిసింది. విద్యానగర్ ఏడవ వీధి మార్క్స్ భవన్ పక్కన గల 1–9–295/11/ఏ/1 ఇంటి యజమాని ఎస్కే నసీరుద్దీన్ (70) తన కుటుంబ సభ్యులతో కలిసి ఉమ్రా యాత్రకు వెళ్లారు. ఆయన రైల్వే ఉద్యోగి. భార్య అక్తర్ బేగం (60), ఆమెజాన్లో మేనేజర్‌గా పని చేసే రెండవ కుమారుడు సలావుద్దీన్ (40), భార్య ఫర్హానాతో పాటు వీరి ముగ్గురు పిల్లలు జైన్ (5), రిదా(6), షీజా(7) వెంట ఉన్నారు.అమెరికాలో సాప్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న నసీరుద్దీన్ పెద్ద కుమారుడు సిరాజుద్దీన్ భార్య సనా, ఆమె ముగ్గురు పిల్లలు హుజేర్, మెహరీష్, హుమేజాలు కూడా వీరికి తోడయ్యారు. అలాగే అప్పటికే వివాహమై నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న ఆయన ముగ్గురు కుమార్తెల్లో పెద్ద కూతురు అమీనాబేగం (మూసారాంబాగ్), ఆమె కుమార్తె అనీస్ (21), రెండవ కుమార్తె షబానా బేగం (హిమాయత్‌నగర్), ఆమె కుమారుడు జాఫర్, మూడవ కుమార్తె రిజ్వానా బేగం, ఆమె ఇద్దరు పిల్లలు మరియన్, షాజహాన్..మొత్తం 18 మంది అల్ మక్కా ట్రావెల్స్ ద్వారా సౌదీ వెళ్లారు. అమెరికాలో నివసించే పెద్ద కుమారుడు సిరాజుద్దీన్‌తో పాటు ముగ్గురు కూతుళ్ల భర్తలు మాత్రం ఇళ్ల వద్ద ఉండిపోయారు.‘తల్లి’డిల్లిన వయో వృద్ధురాలునసీరుద్దీన్ కుటుంబ సభ్యులు 18 మంది అగ్నికి ఆహుతి కాగా, ఆయన తల్లి రోషన్‌బీ, పెద్ద కుమారుడు సిరాజుద్దీన్ ఒక్కడు మాత్రమే మిగి లాడు. ఇతను గత కొంత కాలంగా అమెరికాలో ఉద్యోగం చేస్తూ అక్కడే ఉంటున్నాడు. భార్య సనా, ముగ్గురు పిల్లలు మాత్రం విద్యానగర్‌లోని తల్లిదండ్రుల వద్ద నివసిస్తున్నారు. సిరాజుద్దీన్ తన సమీప బంధువులతో అమెరికా నుంచి మాట్లాడుతూ పెద్దపెట్టున రోదించాడు. నసీరుద్దీన తల్లి రోషన్‌బీ తల్లడిల్లిపోయింది. కాగా 18 మందిలో 10 మంది చిన్నారులే ఉండడం స్థానికుల హృదయాన్ని కలచి వేసింది. వీరంతా ఏడాది నుంచి 10 సంవత్సరాల లోపు వారే కావడం గమనార్హం. నసీరుద్దీన తల్లి 90 ఏళ్లు పైబడిన రోషన్‌బీ తల్లడిల్లిపోయింది. ఆమెను ఓదార్చడం ఎవరితరం కాలేదు. తమ కుటుంబసభ్యులు తమ చివరి మజిలీని ముస్లింలకు పవిత్ర స్థలమైన మక్కాలోనే ముగించారు కాబట్టి వారి అంత్యక్రియలను కూడా అక్కడే నిర్వహిస్తే వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని, కాబట్టి 18 మంది అంత్యక్రియలు అక్కడే నిర్వహించాలని బంధువులు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఆ మేరకు వహీద్, మునీర్‌లతో పాటు మరో ఐదుగురు మక్కాకు వెళ్లేందుకు పాస్‌పోర్టులను హజ్ కమిటీకి అందజేశారు. మౌన సాక్షిగా మిగిలిన ఇల్లునసీరుద్దీన్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు మొత్తం 18 మంది మృతి చెందడంతో కనీసం ఆయన ఇంటి తలుపులు తెరిచే వారు కూడా లేకుండా పోయారు. సమీప బంధువులు వచ్చినా అక్కడ నిలబడి ఆ ఇంటి వైపు మౌనంగా చూస్తున్నారు తప్ప ఏమి చేయలేకపోతున్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పరామర్శవిషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్‌లు నసీరుద్దీన్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నాగోల్‌లో అల్మారా దుకాణం నిర్వహించే అబ్దుల్ రషీద్ భార్య అమీనాబేగం, వారి కుమార్తె అనీస్ ఫాతిమా సౌదీలో మరణించడంతో మూసారాంబాగ్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల తదితరులు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
సౌదీ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి
-
Saudi Arabia: ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకోవాలని CS, DGPకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
-
సౌదీ ప్రమాదంపై YSRCP అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
-
సౌదీ ప్రమాదంలో మృతులంతా హైదరాబాదీలే!
హైదరాబాద్: సౌదీ అరేబియా బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్యపై గందరగోళం నెలకొంది. అయితే ఈ ప్రమాదంపై తెలంగాణ హజ్ కమిటీ స్పందించింది. ఘటనలో 45 మంది మరణించారని.. అంతా హైదరాబాద్‌కు చెందిన వాళ్లేనని స్పష్టత ఇచ్చింది. మరోవైపు మృతుల పూర్తి వివరాలను సమర్పిస్తామని పోలీసులు అంటున్నారు.నాలుగు ఏజెన్సీల ద్వారా యాత్రికులు అక్కడికి వెళ్లారు. మక్కా యాత్ర తర్వాత మదీనాకు బయల్దేరారు. మదీనాకు 25కి.మీ. దూరంలో ముఫ్రిహాత్ వద్ద యాత్రికుల బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీ కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ఉన్నారు. ప్రమాదంలో అంతా మరణించారు. మృతుల్లో 17 మంది పురుషులు, 28 మంది మహిళలు ఉన్నారు. అంతా హైదరాబాద్‌కు చెందిన వాళ్లే అని హజ్ కమిటీ పేర్కొంది. మృతుల్లో మల్లేపల్లి, బజార్‌ఘాట్, ఆసిఫ్‌నగర్ తదితర ప్రాంతాలకు చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది.మరోవైపు.. ఈ ఘోర ప్రమాదంపై నగర పోలీసులు ప్రకటన చేశారు. మొత్తం 54 మంది బృందం నవంబరు 9న హైదరాబాద్ నుంచి జెడ్డాకు వెళ్లింది. నవంబరు 23 వరకు టూర్ ప్లాన్ చేశారు. వీరిలో నలుగురు వ్యక్తులు నిన్న కారులో మదీనాకు వెళ్లారు. మరో నలుగురు మక్కాలోనే ఉండిపోయారు. మిగతా 46 మంది మక్కా నుంచి మదీనాకు బస్సులో బయల్దేరారు. మదీనాకు 25 కిలోమీటర్ల దూరంలో ఈ బస్సు చమురు ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో 45 మంది చనిపోయారు. అబ్దుల్ షోయబ్ అనే వ్యక్తి ఒక్కరే బయటపడ్డారు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో ఉన్నాడు అని సజ్జనార్ తెలిపారు. సోమవారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో (భారత కాలమానం ప్రకారం) ఈ ఘటన చోటుచేసుకుంది. డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొనగానే మంటలు చెలరేగి బస్సు మొత్తం వ్యాపించాయి. ప్రమాద సమయంలో యాత్రికులంతా గాఢ నిద్రలో ఉండటంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం నేపథ్యంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు జెడ్డాలోని భారత ఎంబసీ వెల్లడించింది.ప్రధాని సహా పలువురి దిగ్భ్రాంతిసౌదీ అరేబియాలో జరిగిన ఘోర ప్రమాదంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. రియాద్‌లోని ఎంబసీ, జెడ్డాలోని కాన్సులేట్ కావాల్సిన సహాయం అందిస్తున్నాయని ప్రధాని మోదీ తన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. సౌదీ అరేబియా ప్రభుత్వ అధికారులతో భారత ప్రతినిధులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. -
మక్కా వెళ్లి వస్తుండగా.. ఒక్కరు కూడా మిగల్లేదు.. ఎక్కువ మంది హైదరాబాదీలే
-
సౌదీ ఘటనలో హైదరాబాదీ యువకుడు సురక్షితం
సౌదీ అరేబియా మదీనా సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంలో 42 మంది భారతీయ ఉమ్రా యాత్రికులు సజీవ దహనం అయ్యింది తెలిసిందే. మృతుల్లో అత్యధికంగా తెలంగాణ హైదరాబాద్‌కు చెందినవాళ్లే ఉన్నారు. అయితే ఈ ప్రమాదం నుంచి ఇద్దరు సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది.హైదరాబాద్ అసిఫ్ నగర్, హబీబ్ నగర్‌కు చెందిన 44 మంది మక్కా యాత్ర కోసం అల్ మక్కా, ఫ్లై జోన్ ట్రావెల్స్ నుంచి టికెట్లు బుక్ చేసుకున్నారు. ఈ నెల 9వ తేదీన వాళ్లు అక్కడికి వెళ్లారు. మొత్తం 46 మంది ప్రయాణికులతో కూడిన బస్సు మక్కా యాత్ర తర్వాత గత రాత్రి మదీనాకు వెళ్తోంది. ఆ సమయంలో దాటాక వాళ్లు ప్రయాణిస్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో 42 మంది మరణించగా.. మృతుల్లో హైదరాబాద్‌కు చెందిన వాళ్లే 16 మంది ఉన్నారు. అయితే మృతుల్లో నగరానికి రెండు కుటుంబాలకు చెందిన 15 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఒక కుటుంబంలో 8 మంది, మరో కుటుంబంలో ఏడుగురు ప్రమాదంలో సజీవ దహనం అయ్యారు. ఆ కుటుంబాల వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది. బస్సు డ్రైవర్‌తో పాటు హైదరాబాద్‌కు చెందిన షోయబ్ అనే యువకుడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ విషయాన్ని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ధృవీకరించారు.‘‘మక్కా యాత్రికులు మరణించడం దురదృష్టకరం. హైదరాబాద్ నుంచి 44 మంది యాత్రికులు వెళ్లారు. ప్రమాద సమయంలో బస్సులో 46 మంది ఉన్నారు. నగరానికి చెందిన 16 మంది మరణించారు. వాళ్ల వివరాలు సేకరిస్తున్నాం. షోయబ్ అనే యువకుడు మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు’’ అని తెలిపారు. మరోవైపు.. ప్రమాద సమాచారం అందుకున్న బంధువులు ట్రావెల్ ఏజెన్సీలకు వద్దకు చేరుకుంటున్నారు. అయితే ఫ్లై జోన్ ట్రావెల్స్ నిర్వాహకులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.సాయంత్రానికే ఆ స్పష్టత: నాంపల్లి ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదం దిగ్భ్రాంతిని గురిచేసింది. మెహదీపట్నం నుంచి ఒక యువకుడు ఉదయాన్నే నాకు కాల్ చేశాడు. ఇక్కడ బాధిత కుటుంబాలను కలిసాను. సంబంధిత ట్రావెల్స్ నుంచి బాధిత కుటుంబాలకు సరైన సమాచారం ఇవ్వడం లేదు. మా పార్టీ అధినేత, ఎంపీ అసరుద్దీన్ ఓవైసీ ఇండియన్ ఎంబసీ, సౌదీ ఎంబసీతో మాట్లాడుతున్నారు. బాధ్యత కుటుంబాలను ఆదుకుంటాం. ప్రతి కుటుంబాన్ని స్వయంగా వెళ్లి కలుస్తాం. మృతదేహాలను ఇక్కడికి రప్పించడంపై సందేహాలు నెలకొన్నాయి. మా బృందం ఒకటి సాయంత్రానికి సౌదీ చేరుకుంటుంది. ఆ తర్వాతే మృతదేహాల తరలింపునకు అవకాశం ఉందా? లేదా? అనే దానిపై క్లారిటీ వస్తుంది. -
సౌదీ ప్రమాదం: మృతి చెందిన హైదరాబాదీలు వీళ్లే..
సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదంలో ఉమ్రా యాత్రికులు దుర్మరణం పాలయ్యారు. బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీ కొట్టి మంటలు చెలరేగడం.. అంతా గాఢ నిద్రలో ఉండడంతో సజీవ దహనం అయ్యారు. వీళ్లంతా భారత్ నుంచే అక్కడికి వెళ్లినట్లు సమాచారం. అయితే మృతులు హైదరాబాద్‌కు చెందిన యాత్రికులే. ‘‘సీఎం ఆదేశాల మేరకు మృతుల వివరాల కోసం సౌదీ ఎంబసీని సంప్రదించాం. ఇప్పటిదాకా అందిన నివేదికల ప్రకారం మృతుల్లో దాదాపు 16 మంది తెలంగాణ వాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. ’’ అని మంత్రి దుదిళ్ల శ్రీధర్‌బాబు చెబుతున్నారు. Click here for the list of Passengers Detailsహైదరాబాద్ నుంచి మొత్తం 44 మంది యాత్రికులు అక్కడికి వెళ్లారు. మరణించిన 16 మంది మల్లేపల్లి బజార్‌ఘాట్ ప్రాంతానికి చెందిన వాళ్లని తెలుస్తోంది. రహీమున్నీసా, అబ్దుల్ ఖాదీర్ మహమ్మద్, ఫర్హీన్ బేగం, మహ్మద్ మస్తాన్, గౌసియా బేగం, మహ్మద్ మౌలానా, ఫర్వీన్ బేగం, షెహనాజ్ బేగం, షౌకత్ బేగం, మహ్మద్ సోహైల్, జకీన్ బేగం, జహీయా బేగం, మరో నలుగురు మల్లేపల్లి నుంచి వెళ్లినట్లు తెలుస్తోంది. పైన చిత్రాల్లో ఉన్నవాళ్లంతా హైదరాబాద్ నుంచి ఉమ్రా యాత్రకు వెళ్లినవాళ్లే. వీళ్లలో చాలా మంది తమ బంధువుల ఫోన్లకు స్పందించడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరణించిన వివరాలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ట్రావెల్ ఏజెన్సీ వద్దకు బంధువులుహైదరాబాద్ నుంచి మొత్తం 44 మంది ఉమ్రా యాత్రకు వెళ్లారు. మల్లేపల్లిలోని అల్ మీనా ట్రావెల్స్ నుంచి 20 మంది, ఫ్లైజోన్స్ ట్రావెల్స్ నుంచి 24 మంది టికెట్లు బుక్ చేసుకున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రమాదం నేపథ్యంలో ఏజెన్సీల వద్దకు వద్దకు జనాల తాకిడి పెరిగింది. తమ వాళ్లు ఎలా ఉన్నారనే ఆందోళనతో పలువురు అక్కడికి చేరుకుని ఆరా తీస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఘటన నుంచి బస్సు డ్రైవర్‌తో పాటు హైదరాబాద్‌కు చెందిన షోయబ్ అనే వ్యక్తి సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది.ఈ ఘోర ప్రమాదంపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ‘‘ఈ ఘటనపై రియాద్‌లోని భారత రాయబార కార్యాలయంలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అయిన అబూ మాథెన్ జార్జ్‌తో నేను మాట్లాడా. వారు ఈ ఘటనపై సమాచారం సేకరిస్తున్నామని చెప్పారు. హైదరాబాదుకు చెందిన రెండు ట్రావెల్ ఏజెన్సీలను నేను సంప్రదించాను. ప్రయాణికుల వివరాలను రియాద్ ఎంబసీకి, విదేశాంగ కార్యదర్శికి పంపించాను. మృతదేహాలను భారత్‌కు తీసుకురావాలని, ఎవరైనా గాయపడినట్లయితే వారికి తగిన వైద్య చికిత్స అందేలా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా విదేశాంగ మంత్రి డా. ఎస్. జైశంకర్‌ను కోరుతున్నా అని అన్నారు. #WATCH | Delhi | On the bus accident in Saudi Arabia, Hyderabad MP Asaduddin Owaisi says, "...Forty-two Hajj pilgrims who were travelling from Mecca to Medina were on a bus that caught fire...I spoke to Abu Mathen George, Deputy Chief of Mission (DCM) at the Indian Embassy in… pic.twitter.com/z88Pa8GmsS— OTV (@otvnews) November 17, 2025స్పందించిన విదేశాంగ శాఖసౌదీ అరేబియా మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని, తగిన సహాయ సహకారాలు అందిస్తామని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ భరోసా ఇచ్చారు. మరోవైపు.. సౌదీలో జరిగిన బస్సు ప్రమాదంపై ఉన్నతాధికారులు అప్రమత్తం అయ్యారు. జెడ్డాలో ఉన్న కాన్సులేట్ జనరల్, రియాద్‌లోని డిప్యూటీ అంబాసిడర్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. యాత్రికుల వివరాలపై పూర్తి సమాచారం తెలియజేయాలని కోరారు. మరోపక్క.. విదేశీ వ్యవహారాల శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని పూర్తి వివరాలు అందజేయాలని ఢిల్లీలో ఉన్న రెసిడెంట్ కమిషనర్, కో ఆర్డినేషన్ సెక్రెటరీకి తెలంగాణ ప్రభుత్వం నుంచి అదేశాలు జారీ అయ్యాయి. -
మీర్జాగూడ ప్రమాద ఘటనకు 15 రోజులు
చేవెళ్ల: మీర్జాగూడ ప్రమాద ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఈనెల 3న ఆర్టీసీ బస్సు, కంకర టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో 19 మంది దుర్మరణం చెందగా 27 మందికిపైగా గాయపడిన విషయం తెలిసిందే. క్షతగాత్రుల్లో కొందరిని హుటాహుటిన వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి, చేవెళ్లలోని పీఎంఆర్ ఆస్పత్రికి మరికొందరిని ఉస్మానియా, నిమ్స్, ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదం జరిగిన తర్వాత రెండు మూడు రోజులు నాయకులు, అధికారులు పరామర్శల పేరుతో హడావుడి చేశారు. మృతుల కుటుంబాలతోపాటు గాయపడ్డవారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మృతుల కుటుంబాలకు రూ.9లక్షలు ప్రకటించాయి. క్షతగాత్రులకు రూ.2.5 లక్షల పరిహారం అందిస్తామని చెప్పాయి. 15 రోజులు కావస్తున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. వెంటాడుతున్న ఆర్థికభారం.. ప్రమాదంలో గాయపడిన వారిలో ఎక్కువ మందిని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చేర్పించి వైద్యం చేయించారు. కొందరు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకొని బిల్లులు చెల్లించారు. క్షతగాత్రుల్లో చాలా వరకు రోజు కూలీ చేసుకునే నిరుపేదలు, ప్రైవేటు పనులు చేసుకునే చిరుద్యోగులే ఉన్నారు. ఇంటికి పెద్దదిక్కయిన వారు గాయాలతో ఆస్పత్రుల్లో చేరడంతో వారి కుటుంబాలను ఆర్థిక భారం వెంటాడుతోంది. ప్రభుత్వం ప్రకటించిన పరిహారంలో పైసా కూడా ఇప్పటివరకు ఎవరికీ అందలేదు. చేస్తామన్న సాయం చేస్తే కుటుంబాలకు ఆసరా అవుతుందని బాధితులు వాపోతున్నారు. గాయపడిన వారి వివరాలు ఉన్నతాధికారులకు నివేదించినట్లు స్థానిక రెవెన్యూ, వైద్యాధికారులు చెబుతున్నారు. కుటుంబం ఆగమైంది బస్సు ప్రమాదంలో గాయపడి ఉస్మానియా ఆస్పత్రిలో 11 రోజులు చికిత్స పొంది శుక్రవారం డిశ్చార్జి అయ్యాను. రోజు కూలీ చేసుకొని జీవించే నా చేయి విరిగింది. ఆపరేషన్ చేసి 36 కుట్లు వేశారు. ఇప్పట్లో పనిచేసే పరిస్థితి లేదు. నా భార్య కాలికి గాయంతో ఇంట్లోనే ఉండడంతో పిల్లల పోషణ, కుటుంబ జీవనం భారంగా మారింది. ప్రభుత్వం ఆదుకోవాలి. – సయ్యద్ అబ్దుల్లా, అత్తాపూర్ఎలా ఉందని అడిగేవారే లేరుఆస్పత్రిలో ఉన్న రోజుల్లో నాయకులు వచ్చి పరామర్శించారు. డిశ్చార్జి అయి ఇళ్లకు వచ్చిన తర్వాత మళ్లీ ఎలా ఉందని అడిగిన వారే లేరు. రోజుకూలీగా పనిచేస్తాను. ప్రమాదంలో మోకాలికి బలమైన గాయం కావడంతో నడవలేకపోతున్నాను. వైద్యం చేయించి వివరాలు తీసుకుని పంపించారు. పరిహారం విషయం ఎవరూ ఏమీ చెప్పడం లేదు. – నర్సింహులు, అంతారంపైసా కూడా రాలేదు బస్సు ప్రమాదంలో ముఖానికి బలమైన గాయం కావడంతో నగరంలోని సిటిజన్ ఆస్పత్రిలో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాను. రూ.3 లక్షలకు వరకు ఖర్చయింది. ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తున్నాను. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాను. ప్రభుత్వం ఇస్తామని చెప్పిన పరిహారం పైసా కూడా రాలేదు. అధికారులు వివరాలు అడిగి తీసుకున్నారు. – రవి, వికారాబాద్ -
సౌదీలో ఘోర ప్రమాదం.. హైదరాబాదీలు దుర్మరణం!
సాక్షి, ఢిల్లీ/హైదరాబాద్: సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం సంభవించింది(Saudi Arabia Bus Accident). మక్కా నుండి మదీనాకు ఉమ్రా యాత్రికులతో వెళ్తున్న బస్సు అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలిపోయి అందులోని 45 మంది సజీవ దహనం అయ్యారు. మృతులంతా హైదరాబాద్(తెలంగాణ) వాసులేనని తేలింది.స్థానిక కాలమానం ప్రకారం.. ఆదివారం అర్ధరాత్రి దాటాక 1.30గం. ప్రాంతంలో ముఫ్రిహాత్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. డీజిల్ ట్యాంకర్‌ను బస్సు ఢీ కొట్టడంతో రెండు వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండడంతో అగ్నికి ఆహుతి అయ్యారు. మక్కా యాత్ర ముగించుకుని మదీనాకు వెళ్తున్న సమయంలో ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది. మృతుల్లో 11 మంది మహిళలు, 10 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. ప్రమాద స్థలంలో అత్యవసర సేవలు కొనసాగుతున్నాయి. డ్రైవర్‌తో పాటు షోయబ్ అనే యువకుడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ప్రస్తుతం యువకుడికి ఐసీయూలో చికిత్స అందుతోంది.సీఎం రేవంత్ దిగ్భ్రాంతిఈ ఘోర ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. కేంద్రం, సౌదీ ఎంబసీతో మాట్లాడాలని సూచించారు. ఈ నేపథ్యంలో విదేశాంగ మంత్రిత్వ శాఖతో ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సంప్రదింపులు జరుపుతున్నారు. కంట్రోల్ రూమ్ నెంబర్లు సౌదీలో బస్సు ప్రమాదానికి సంబంధించిన వివరాలు, సహయచ చర్యల వివరాలు తెలుసుకునేందుకు తెలంగాణ సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. బాధిత కుటుంబాలు 24X7 సమాచారం కోసం +91 79979 59754, +91 99129 19545 ఫోన్నెంబర్లను ఆశ్రయించాలని అధికారులు సూచిస్తున్నారు. ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్‌తో సమన్వయం చేయాలని అధికారులకు ఇప్పటికే సీఎస్ అదేశాలు జారీ చేశారు. జెడ్డా హెల్ప్‌లైన్ నెంబర్ ఇదే.. సౌదీ అరేబియాలో మదీనా సమీపంలో జరిగిన దుర్ఘటనలో భారతీయ ఉమ్రా యాత్రికులు దుర్మరణం పాలయ్యారు. ఈ నేపథ్యంలో జెడ్డాలోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో 24x7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నంబర్: 8002440003 ద్వారా బాధితుల సమాచారం కోసం ఎప్పుడైనా సంప్రదించవచ్చని అధికారులు సూచిస్తున్నారు. -
సూర్యాపేట: క్షణం ఆలస్యమైనా ఆ 43 మంది మృత్యుఒడిలోకే..
సాక్షి, సూర్యాపేట: మరో ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి(NH-65)పై గత రాత్రి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. అయితే సిబ్బంది, ప్రయాణికులు అప్రమత్తం కావడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది.హైదరాబాద్ నుంచి కందుకూరుకు వెళ్తున్న విహారి ట్రావెల్స్ బస్సులో చిట్యాల మండలం పిట్టంపల్లికి చేరుకోగానే పొగలు మొదలయ్యాయి. బస్సు సిబ్బంది అప్రమత్తం చేయడంతో ప్రయాణికులు వెంటనే బస్సు అద్దాలు, తలుపుల నుంచి బయటకు దూకి వారి ప్రాణాలను కాపాడుకున్నారు. ఆ వెంటనే బస్సు మంటల్లో కాలిపోయింది. ఘటనాస్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 43 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అదే నిర్లక్ష్యమా?కర్నూలు ఘోర బస్సు ప్రమాదంలో 19 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్‌పై తనిఖీల పేరుతో హడావిడి చేశారు. అయితే అది రెండు రోజుల ముచ్చటగానే మిగిలిపోయింది. తాజా ఘటనతో.. నిబంధనలు పాటించని ప్రైవేట్ ట్రావెల్స్ లపై చర్యలు తీసుకోవడంలో రవాణాశాఖ అధికారుల అలసత్వం మరోసారి బయటపడింది. తాజాగా పిట్టంపల్లి వద్ద ప్రమాదానికి గురైన విహారి ట్రావెల్స్ బస్సుకు ఫిట్నెస్ లేదని తేలింది. అంతేకాదు ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్ రిజిస్ట్రేషన్‌తో.. తెలంగాణ కేంద్రంగా ఏపీ, తమిళనాడుకు నిబంధనలకు విరుద్ధంగా బస్సులు విహారి యాజమాన్యం నడిపిస్తోందని బయటపడింది. సీటింగ్ కోసమని అనుమతులు తీసుకుని స్లీపర్ మార్చేశారని.. బస్సుపై ఐదు చలాన్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది. దీంతో.. వరుస ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వ యంత్రాంగాలు నిద్రమత్తు వీడడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిబ్బంది సకాలంలో స్పందించకపోయి ఉన్నా.. ప్రయాణికులు అప్రమత్తం కావడంలో క్షణం ఆలస్యమైనా.. అంతా మృత్యువు ఒడిలోకి చేరుకునేవారేమో!. -
మరో ప్రమాదం.. బస్సును ఢీకొన్న వ్యాన్
-
ట్యాంకర్‌ను ఢీకొట్టిన బస్సు..
హథ్రాస్: ఉత్తరప్రదేశ్‌లోని హథ్రాస్ జిల్లాలో గురువారం సాయంత్రం చోటుచేసుకున్న బస్సు ప్రమాదంలో నలుగురు చనిపోగా 21 మంది గాయపడ్డారు. అలీగఢ్ నుంచి హథ్రాస్ వైపు వెళ్తున్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సును అలీగఢ్–ఆగ్రా హైవేపైనున్న సమామాయి గ్రామ సమీపంలో ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 12 ఏళ్ల బాలుడు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన 21 మందిని ఆస్పత్రులకు తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బస్సు డ్రైవర్ బైక్‌ను తప్పించేందుకు ప్రయతి్నంచిన క్రమంలో అదుపుతప్పి ట్యాంకర్‌ను ఢీకొట్టినట్లు చెబుతున్నారు. ట్రక్కును ఢీకొట్టిన డబుల్ డెకర్ బస్సు.. యూపీలోని ఉన్నావ్‌లో బుధవారం అర్ధరాత్రి ఆగ్రా–లక్నో ఎక్స్‌ప్రెస్‌వే పైన ప్రైవేట్ డబుల్ డెకర్ బస్సు, కూరగాయలతో వెళ్తున్న ట్రక్కును ఢీకొట్టింది. అనంతరం డివైడర్ మీదుగా దూసుకెళ్లి రోడ్డు పక్కన గుంతలో పడిపోయింది. హసన్‌పూర్‌లో జరిగిన ఈ ప్రమాదంలో బస్సు లోని 60 మందికి గాను 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. సమీప గ్రామస్తులు అక్కడికి చేరుకుని, బస్సు అద్దాలు పగులగొట్టి, ప్ర యాణికులను బయటకు లాగారు. పోలీసులు వచ్చి తీవ్రంగా గాయపడిన కొందరిని లక్నోకు తరలించారు. బస్సు మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. -
మీర్జాగూడ బస్సు ప్రమాదంలో ముగ్గురు కుమార్తెలను కోల్పోయిన ఎల్లయ్య
-
Chevella Bus Accident: అంతా 30 సెకన్లలో జరిగింది…
-
Chevella RTC Bus Accident: వాహనదారుల్లో భయాందోళన..!
-
నేను కూలి చేసి నా సెల్లిని సదివిస్తా..
వికారాబాద్/తాండూరుటౌన్: ‘అమ్మకు జెరం వచ్చిందిని.. మా అమ్మమ్మ ఇంటికి పోయివారం ఆయే. నిన్న రాత్రి అమ్మను దవఖానాకు సూపిస్కొస్త అని మా నాయిన గూడపోయిండు.. ఆల్లిద్ద రూ పొద్దుగూకినంక ఒస్తరనుకుంటే పొద్దుగాళ్ల పదిగంట్లకే మీ అమ్మనాయిన చచ్చిపోయిండ్రని ఫోనొచ్చింది’అంటూ తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు బాలికలు విలపించటం కన్నీరు పెట్టించింది. వికారాబాద్ జిల్లా హాజీపూర్‌కి చెందిన దంపతులు లక్ష్మి–బందెప్ప బస్సు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఉండటానికి చిన్న ఇల్లు తప్ప ఏ ఆస్తిపాస్తులు లేని ఈ దంపతులు మృతితో వారి ఇద్దరు కూతుళ్లు శిరీష, భవానీ అనాథలయ్యారు. వారిని ‘సాక్షి’ పరామర్శించగా తల్లడిల్లిపోయారు. ‘మాయమ్మ, మా నాయిన సచ్చిపోయిండ్రని సుట్టాలందరు ఒచ్చిండ్రు.. రేపెల్లుండి ఎవరిండ్లకు ఆల్లు పోతరు.. ఇంక నేను మా సెల్లె ఇంట్ల ఉండాలె. మాకింక దిక్కెవరు. మాయమ్మతోని కలిసి నేనుగూడ కూలికి పోతుంటి. వారం పదిదినాలసంది పానం బాగలేకపోతె మా అమ్మమ్మ ఇంటికి తోలిచ్చినం. దవాఖానాకు పోయి పానం బాగా చేపిచ్చుకొని ఒస్తమని పోయిండ్రు.. ఇప్పుడు మా నాయిన లేడు. మాయమ్మలేదు. ఎంత కష్టమైనా సరే నేను కూలికి పోయి మా సెల్లిని మంచిగ సదివిపిస్త. మా అమ్మమ్మను తోలుకొచ్చుకోని నా జతకు పండుకోబెట్టుకుంటా..’ అంటూ శిరీష చెప్పుకొచ్చింది. -
Chevella Bus Incident: ప్రాణం పోవడం ఖాయమనుకున్నా
చేవెళ్ల: మీర్జాగూడ వద్ద జరిగిన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన వారిలో ప్రస్తుతం 13 మంది చేవెళ్లలోని పట్నం మహేందర్‌రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద ఘటనపై వారిని కదిలించగా ఉబికివచ్చే కన్నీళ్లతో తమ అనుభవాలను పంచుకున్నారు. మృత్యువు అంచులవరకు వెళ్లి వచి్చనట్లుగా ఉందని, షాక్ నుంచి తేరుకోవడానికి సమయం పట్టిందని పేర్కొన్నారు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న జయసుధ లక్డీకాపూల్/ధారూరు: ‘బస్సులో కంకరలో కూరుకుపోయి ప్రాణాలపై ఆశ వదులుకున్నా.. సీటు దొరక్కపోవడంతో కండక్టర్‌తో మాట్లాతుండగా టిప్పర్ ఢీకొట్టింది.. క్షణాల్లో అంతా జరిగిపోయింది. నా ప్రాణం పోవడం ఖాయమనుకున్నా. బస్సు మొత్తం కంకరతో నిండిపోయింది. చేతుల వరకు కూరుకుపోయా, కాపాడాలని మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. చివరకు ఒకరి వద్ద ఫోన్ అడుక్కొని తమ్ముడికి కాల్ చేశా. గంటలోపు తమ్ముడు, భర్త వచ్చారు. అప్పటి వరకు అలాగే ఉన్నా. నా ఎడమ కాలుపై ఇద్దరు పడ్డారు. కుడి కాలు బస్సు సీటులో ఇరుక్కుపోయి విరిగిపోయింది. నా కాలుపై పడిన ఇద్దరు ఎప్పుడో చనిపోయారు. భర్త, తమ్ముడు రాగానే చేతులతో కంకర తీయడం మొదలుపెట్టారు. వాళ్ల చేతులు రక్తమయంగా మారాయి. చివరకు బయటపడ్డా’అని ధారూరు మండలం కేరెళ్లికి చెందిన జయసుధ తెలిపారు. చేవెళ్లలోని గురుకుల పాఠశాలలో పార్ట్‌టైమ్ టీచర్‌గా పనిచేస్తూ రోజూ గ్రామం నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. మీర్జాగూడ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో గాయపడింది. ఎడమ కాలు పక్క ఎముకలు విరిగ్గా, కుడి కాలుకు కూడా గాయాలయ్యాయి. జయసుధ కాలుకు శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం ఆమె నిమ్స్ చికిత్స పొందుతున్నారు. తలచుకుంటేనే భయంగా ఉంది బస్సు తాండూరులోనే నిండిపోయింది. ధారూరు, వికారాబాద్ వచ్చేసరికి సీట్లు లేక చాలామంది నిల్చున్నారు. ప్రమాదంలో నడుం వరకు కంకరలో కూరుకుపోయాను. నా కాలుకు రేకు దిగింది. రెండు ఫీట్లు ముందుండి ఉంటే ప్రాణాలు పోయేవి. బతికిపోయాను అనుకున్నా. తలచుకుంటేనే భయంగా ఉంది. – బస్వరాజ్, కోకట్ ప్రాణాలు పోతాయనుకున్నా.. నగరంలో స్వీపర్‌గా పనిచేస్తాను. ధారూరు నుంచి రోజూ తాండూరు నుంచి వచ్చే మొదటి బస్సుకే వెళ్తుంటాను. సోమవారం కూడా ఎప్పటిలాగే బస్సు ఎక్కగా సీట్లు లేకపోవడంతో డ్రైవర్ పక్కనే ఉన్న బ్యానెట్‌పై కూర్చున్నా. మీర్జాగూడ గేట్ రాగానే మలుపులో ఎదురుగా వేగంగా వస్తున్న టిప్పర్‌ను చూసి లారీ వస్తుంది తమ్మి అని డ్రైవర్‌కు చెప్పా. డ్రైవర్ బస్సును పక్కకు మలిపేలోపు టిప్పర్ ఢీకొట్టింది. కంకరలో మొత్తం మునిగిపోయా. నా చేయి మాత్రమే పైకి ఉండిపోయింది. తోటి ప్రయాణికులు నా చేయి పట్టుకొని బయటకు తీశారు. ప్రాణాలు గాలిలో కలిసిపోతాయనుకున్నా. తీవ్ర గాయాలతో బతికిబయటపడ్డా. – నాగమణి, ధారూరు రైలు మిస్సు కావడంతో.. హైదరాబాద్‌లో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నాను. వీక్లీ ఆఫ్ కావడంతో ఇంటికి వచ్చాను. ఎప్పుడు వచి్చనా రైలుకు వెళ్తాను. సోమవారం ఉదయం 4.30కు రైలు మిస్ కావడంతో 4.40 గంటలకు తాండూరు నుంచి వెళ్లే మొదటి బస్సు ఎక్కాను. బస్సు డ్రైవర్ కంట్రోల్ చేశాడు. కానీ టిప్పర్ డ్రైవర్ వచ్చి ఢీకొట్టాడు. నిలబడి ఉన్న నేను కంకరలో ఇరుక్కుపోయాను. నా ముందు ఒకతని ప్రాణాలు పోయాయి. జేసీబీ వచ్చే వరకు బయటకు రాలేకపోయా. ఇలా ఆస్పత్రి పాలవుతాననుకోలేదు. – బి.శ్రీనివాస్, తాండూరు కంకరలో కూరుకుపోయా.. మన్నెగూడ నుంచి చేవెళ్లలో ఆస్పత్రికి చూపించుకునేందుకని బస్సు ఎక్కాను. బస్సు నిండిపోవడంతో నిలబడి ఉన్నా. కంకరలో సగం వరకు కూరుకుపోయా. డోర్‌కు దగ్గరలో ఉండడంతో స్థానికులు రెండు చేతులు పట్టి బయటకు లాగారు. లేదంటే ప్రాణాలు పోయేవి. రోడ్డు బాగాలేకే ఈ ప్రమాదం జరిగింది. అసలే అనారోగ్యంతో ఉన్నాను. ఈ ప్రమాదంతో మరింతగా బాధపడుతున్నాను. – అనసూయ, బోంగుపల్లి ఏం జరిగిందో అర్థం కాలేదు వికారాబాద్‌లో ఉంటూ హైదరాబాద్‌లో డ్రైవర్‌గా పనిస్తున్నాను. వారానికి ఒకరోజు ఇంటికి వచ్చి వెళ్తాను. ఆదివారం వచ్చి సోమవారం హైదరాబాద్‌కు వెళ్తున్నాను. బస్సులో ఉన్న నాకు ఏం జరిగిందో అర్థం కాలేదు. ఒక్కసారిగా పెద్ద శబ్దం వచి్చంది. తరువాత చూస్తే అంతా దుమ్ము, కంకర. అందులో పడిన వారి అరుపులు వినిపించాయి. నాకు ముక్కుకు, తలకు కంకర తగిలి గాయలయ్యాయి. – ఆర్.అఖిల్, పూడూరు -
దేవుడి దయతో బతికిపోయాం
తాండూరు రూరల్: దేవుడి దయతో బతికిపోయాం అని చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనలో ప్రాణాలతో బయటపడిన తల్లి పుష్పలత, కూతురు క్రిస్టినా పేర్కొన్నారు. పెద్దేముల్ మండలం కందనెల్లి గ్రామానికి చెందిన పుష్పలత కొన్నేళ్లుగా కుటుంబ సభ్యులతో కలిసి తాండూరులో నివాసం ఉంటోంది. పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. పుష్పలతకు ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స కోసం కూతురు క్రిస్టినాతో కలిసి సోమవారం ఆర్టీసీ బస్సులో బయలుదేరింది. అఖరి సీట్లు ఇద్దరూ కూర్చున్నారు. ఒక్కసారిగా భారీ శబ్దంతో బస్సు అదుపుతప్పింది. నేను కిందపడ్డాను. కంకర పొగ వల్ల నా కూతురు కనిపించలేదు. నడుములోతు కంకర ఉంది. మమ్మీ, మమ్మీ అంటూ క్రిస్టినా ఏడుపు వినిపించింది. వెంటనే కూతురి కాళ్ల కింద ఉన్న కంకరను తొలగించా. ఆ తర్వాత ఎడమవైపు కిటికీలోంచి బ్యాగులు బయటకు విసిరేసి దూకేశాం. లిఫ్ట్ అడిగి వికారాబాద్‌కు వచ్చాం. అక్కడి నుంచి ఆటోలో తాండూరుకు చేరుకున్నాం. నా భర్త పదేళ్ల నుంచి పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యాడు. ప్రస్తుతం నా ఫ్యామిలీకి నేను ముఖ్యం. నేను బతకాలి. భగవంతుడే నన్ను, నా కూతుర్ని కాపాడాడు. క్రిస్టినాకు మూగ దెబ్బలు తగలడంతో పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నానని తల్లి పుష్పలత తెలిపారు. -
కోలుకుంటున్న క్షతగాత్రులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా/ చేవెళ్ల/మొయినాబాద్: మీర్జాగూడ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు కోలుకుంటున్నారు. స్వల్ప గాయాలతో వికారాబాద్, చేవెళ్ల ఆస్పత్రుల్లో చేరిన 27 మందిలో ఇప్పటికే ఆరుగురు డిశ్చార్జ్ కాగా, మంగళవారం మరో ఐదుగురు ఇళ్లకు వెళ్లిపోయారు. ప్రస్తు తం ఉస్మానియా ఆస్పత్రిలో ఆరుగురు, పీఎంఆర్‌లో 12 మంది, వికారాబాద్‌లో ఒకరు, నిమ్స్‌లో ఇద్దరు, మెడ్లైఫ్లో ఒకరు చికిత్స పొందుతున్నారు. స్వల్ప గాయాలతో చేవెళ్ల పీఎంఆర్ ఆస్పత్రిలో చేరిన ఎండీ యోనస్, జె.జగదీశ్‌తోపాటు వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన బి.ప్రవీణ, సయ్యద్ తహ్రా, సయ్యద్ ఖాతిజలు కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి ఇంటికి పంపారు.మెరుగైన వైద్యం కోసం ఉస్మానియాకు.. తలకు తీవ్ర గాయాలైన సయ్యద్ అస్మాను మెరుగైన చికిత్స కోసం ఉస్మానియాకు తరలించారు. షేక్ తస్లీమా, సయ్యద్ అబ్దుల్లా, సయ్యద్ ఖాజావలి, సయ్యద్ షఫీలను కూడా ఉస్మానియాకు పంపారు. ప్రస్తుతం వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో మోహిని స్వప్న మాత్రమే చికిత్స పొందుతోంది. పీఎంఆర్ ఆస్పత్రిలో 12 మందికి చికిత్స అందిస్తున్నారు. సుజాత, నందినికి నిమ్స్‌లో చికిత్స చేశారు. టిప్పర్ యజమాని లక్ష్మణ్‌నాయక్ బండ్లగూడ జాగీర్‌లోని మెడ్‌లైఫ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. శకలాలే ఆనవాళ్లు.. ఘోర ప్రమాదంతో భీతావహంగా మారిన మీర్జాగూడ మంగళవారం నిశ్శబ్దంగా కనిపించింది. కంకర లోడుతో వచ్చిన టిప్పర్ ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో 19 మంది మరణించగా, 27 మంది గాయపడిన విషయం తెలిసిందే. సోమ వారం శవాల దిబ్బలు, క్షతగాత్రుల ఆర్తనాదాలు, బంధువుల రోదనలతో కంపించిన ఈ ప్రాంతం సాధారణంగా మారిపోయింది. ఆ మార్గంలో వెళ్లేవాళ్లు ప్రమాద స్థలాన్ని ఆసక్తిగా, ఒకింత భయంగా పరిశీలిస్తూ ఘటనపై చర్చించుకున్నారు. రోడ్డు పక్కన కంకర దిబ్బలు, వాహనాల శకలాలు ప్రమాదానికి ఆనవాళ్లుగా మిగిలాయి. టిప్పర్, బస్సును చేవెళ్ల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిద్ర వస్తుంటే మధ్యలో చాయ్ తాగాం ఏడాది క్రితమే టిప్పర్ కొనుగోలు చేశాను. అప్పటికే నాతో కలిసి పనిచేసిన మహారాష్ట్రకు చెందిన ఆకాశ్కాంబ్లేను డ్రైవర్‌గా నియమించుకున్నా. ఆదివారం రాత్రి లక్డారం సమీపంలోని క్వారీలో కంకర లోడ్ చేయించాం. సోమవారం తెల్లవారుజాము వరకు నేనే టిప్పర్ నడిపాను. రాత్రంతా డ్రైవింగ్ చేయడం వల్ల నిద్ర వస్తుంటే మధ్యలో ఓ హోటల్ వద్ద ఆపి ఇద్దరం చాయ్ తాగాం. అప్పటి వరకు నా చేతిలో ఉన్న స్టీరింగ్‌ను ఆకాశ్ కాంబ్లే తీసుకున్నాడు. గమ్యస్థానానికి మరికొద్ది నిమిషాల్లో చేరుకుంటామనగా ఈ దుర్ఘటన జరిగింది. ఆ సమయంలో ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు. టిప్పర్‌లోనే స్పృహ తప్పిపోయాను. పోలీసులు నన్ను బయటికి తీసి వికారాబాద్ ఆస్పత్రికి తరలించారు. నేను కానీ, ఆకాశ్ కాంబ్లే కానీ మద్యం సేవించలేదు. – లక్ష్మణ్ నాయక్, టిప్పర్ యజమానిప్రాణం పోవడం ఖాయమనుకున్నా నిమ్స్‌లో చికిత్స పొందుతున్న జయసుధ లక్డీకాపూల్/ధారూరు: ‘బస్సులో కంకరలో కూరుకుపోయి ప్రాణాలపై ఆశ వదులుకున్నా.. సీటు దొరక్కపోవడంతో కండక్టర్‌తో మాట్లాతుండగా టిప్పర్ ఢీకొట్టింది.. క్షణాల్లో అంతా జరిగిపోయింది. నా ప్రాణం పోవడం ఖాయమనుకున్నా. బస్సు మొత్తం కంకరతో నిండిపోయింది. చేతుల వరకు కూరుకుపోయా, కాపాడాలని మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. చివరకు ఒకరి వద్ద ఫోన్ అడుక్కొని తమ్ముడికి కాల్ చేశా. గంటలోపు తమ్ముడు, భర్త వచ్చారు. అప్పటి వరకు అలాగే ఉన్నా. నా ఎడమ కాలుపై ఇద్దరు పడ్డారు. కుడి కాలు బస్సు సీటులో ఇరుక్కుపోయి విరిగిపోయింది.నా కాలుపై పడిన ఇద్దరు ఎప్పుడో చనిపోయారు. భర్త, తమ్ముడు రాగానే చేతులతో కంకర తీయడం మొదలుపెట్టారు. వాళ్ల చేతులు రక్తమయంగా మారాయి. చివరకు బయటపడ్డా’అని ధారూరు మండలం కేరెళ్లికి చెందిన జయసుధ తెలిపారు. చేవెళ్లలోని గురుకుల పాఠశాలలో పార్ట్‌టైమ్ టీచర్‌గా పనిచేస్తూ రోజూ గ్రామం నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. మీర్జాగూడ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో గాయపడింది. ఎడమ కాలు పక్క ఎముకలు విరిగ్గా, కుడి కాలుకు కూడా గాయాలయ్యాయి. జయసుధ కాలుకు శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం ఆమె నిమ్స్ చికిత్స పొందుతున్నారు. -
Chevella tragedy: తడి ఆరని కళ్లు
పెద్దమ్మ కొడుకు పెళ్లికి వస్తే ముగ్గురికి చీరలు కట్టి వాళ్లమ్మ మురిసిపోయింది. ముద్దుగా తయారైండ్రు.. ఎవరి దిష్టి తగిలిందో నా బిడ్డలకు.. మమ్ములను దిక్కులేనోళ్లను చేసి వెళ్లిపోయిండ్రు. రెండు నెలల్ల ఇద్దరం జాబ్ చేస్తం.. వచ్చి నిన్ను అమ్మను హైదరాబాద్ తీస్కపోతాం నాయినా అంటూ చెప్పి బస్సెక్కిండ్రు. ఇట్ల నన్ను పూర్తిగా ఇడిసిబెట్టి పోతరనుకోలేదు.. – ఎల్లయ్యగౌడ్ వికారాబాద్: ‘అయ్యో పాపం ఎల్లయ్యా.. నీకు నలుగురూ బిడ్డలేనా అని చాలామంది మాట్లాడినా ఎన్నడూ బాధ కాలేదు. నా నలుగురు కూతుళ్లు ‘నిన్ను నలుగురిలో దర్జాగా నిలబెడతాం... నిన్ను గెలిపిస్తాం నాయనా’ అని నాకు కొండంత ధైర్యం చెప్పేవారు. ఒక బిడ్డకు పెళ్లి చేసి, అత్తగారింటికి పంపి నెలకూడా కాకుండానే మిగతా ముగ్గురు బిడ్డలను దేవుడు తీస్కపోయిండు’ అంటూ అంబిక–ఎల్లయ్యగౌడ్ దంపతులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. చెట్టంత బిడ్డలను పోగొట్టుకున్న వీరి బాధ వర్ణనాతీతం.సోమవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల (Chevella) మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వికారాబాద్ జిల్లా యాలాల మండల పరిధిలోని పెర్కంపల్లికి చెందిన తనూష, సాయిప్రియ, నందిని మృతి చెందిన విషయం తెలిసిందే. మంగళవారం ‘సాక్షి’ఎల్లయ్యగౌడ్ను కలిసి పరామర్శించే ప్రయత్నం చేయగా, కూతుళ్ల గురించి విలపిస్తూ చెప్పిన జ్ఞాపకాలు ఆయన మాటల్లోనే... ‘సదువులో ఎప్పుడూ ముందుండేవారు. వారు బాగా సదివి నాకు ఫీజులు తగ్గించేవారు.. అందరూ రెకమండేషన్లు అంటూ నాయకుల చుట్టూ తిరిగి ఫీజులు తగ్గించుకుంటే, నా బిడ్డలు బాగా సదివి క్లాస్ ఫస్ట్ వచ్చేవారు.. మా నాయన డ్రైవింగ్ చేస్తాడు.. మేము బాగా సదువుతున్నాంగా.. ఫీజు తగ్గించండని సార్లను అడిగి తక్కువ చేయించేవారు. ఇంటర్ సదివేటప్పుడే యోగా నేర్చుకొని, అంతా యోగా టీచర్లు అయ్యారు.. వాళ్లే వేరే వాళ్లకు నేర్పించెటోళ్లు. కూతుళ్లను సదివించటానికే ఊర్లోనుంచి తాండూరు టౌన్‌కు వచ్చేశా. ఇప్పుడు వాళ్లే లేకపోతే నాకు దిక్కెవరు. జిల్లేడు చెట్టుకు పెళ్లి చేస్తా అనుకోలేదు బిడ్డా..నా బిడ్డలు బాగా సదివి నన్ను నలుగుట్లో గొప్పగా నిలబెడతమన్నారు. కానీ ఇట్ల మమ్ములనే ఒంటరోళ్లను చేసి పోతారనుకోలేదు. బాగా సదివించి కొలువులు చేస్తుంటే.. శాతనైనంతలో గొప్పగా పెళ్లిళ్లు చేసి అత్తగారింటికి సాగనంపుతాననుకున్నా. కానీ ఇట్ల జిల్లెడు చెట్టుకు పెళ్లిళ్లు చేసి ముగ్గురిని ఒకేసారి పాడెగట్టి సాగనంపుతానను కోలేదు. మొన్న పెద్దమ్మ కొడుకు పెళ్లికి వస్తే ముగ్గురికి చీరలు కట్టి వాళ్లమ్మ మురిసిపోయింది. ముద్దుగా తయారైండ్రు.. ఎవరి దిష్టి తగిలిందో నా బిడ్డలకు ..మమ్ములను దిక్కులేనోళ్లను చేసి వెళ్లిపోయిండ్రు.పదోతరగతి, ఇంటర్లో ఒచ్చిన మార్కులు చూసి.. సదువులో నా బిడ్డెల ఉశారు సూసి కోఠి ఉమెన్స్ కాలేజీలో మేడం ఫ్రీ సీటు ఇచ్చింది. నేను మంచి అంగి తొడుక్కోకపోయినా నా చిన్నబిడ్డ ఒప్పుకునేది కాదు.. మంచి అంగి తొడిగి తలదువ్వి నొసటికి బొట్టుపెట్టి భుజంపై తట్టేది. చెప్పులు పాతగ అయితే వాళ్లకు ఇచ్చిన ఖర్చుల్లోకి మిగలవట్టి కొత్త చెప్పులు తెచ్చెటోళ్లు.. డ్రైవింగ్ చేయడానికి పోతే చాయ్ బిస్కెట్ కూడా తాగెటోన్ని కాదు.పది రూపాయలు ఉంటే నా బిడ్డలకు పెన్ను కొనివ్వచ్చు. 20 రూపాయలు ఉంటే నోటు బుక్కు వస్తదికదా అనుకునే వాన్ని. వాళ్లు హైదరాబాద్‌లో ఉన్నా, కూడా రోజు మూడుసార్లు ఫోన్ చేసేవారు..తిన్నావా? టీ.తాగినవా నాయిన ఇంటికి పోయినవా.. తొందరగా ఇంటికిపో అంటూ గుర్తు చేస్తుండ్రి.. రెండు నెలల్ల ఇద్దరం జాబ్ చేస్తం.. వచ్చి నిన్ను అమ్మను హైదరాబాద్ (Hyderabad) తీస్కపోతాం నాయినా అంటూ చెప్పి బస్సెక్కిండ్రు. ఇట్ల నన్ను పూర్తిగా ఇడిసిబెట్టి పోతరనుకోలేదు.. ముగ్గురు బిడ్డలు ఎప్పు డూ ఒకేసారి బస్సుల పోలేదు. సాయిప్రియ రైల్లో పోతే ఇద్దరు బిడ్డలు బస్సుల పోతుండ్రి.. ఇప్పుడే ఇట్ల ముగ్గురు ఒకే బస్సుల పోయిండ్రు.. తిరిగి రాలేదు. నా ధైర్యం మొ త్తం వాల్లే.. ఇప్పుడు వాళ్లే లేకపోతే ఎట్లుండాల్నో ఏమి అర్థం అయితలేదు’అంటూ ఎల్లయ్యగౌడ్ కన్నీరు మున్నీరయ్యాడు. -
మరో బస్సు ప్రమాదం.. ముగ్గురు మృతి
ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో సోమవారం రాత్రి బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా, 38 మంది గాయపడ్డారు. ఇండోర్ - మోవ్ మధ్య సిమ్రోల్ భేరు ఘాట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. జిల్లా యంత్రాంగం తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెండాడు. తొమ్మిది మంది క్షతగాత్రులను ఇండోర్‌లోని ఎంవై ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. Madhya Pradesh CM Mohan Yadav tweets, "The accident caused by a bus overturning between Indore and Mhow, resulting in the death of three citizens, is extremely heartbreaking. Instructions have been given to provide Rs 2 lakh each to the immediate family members of the deceased… pic.twitter.com/382VQuhF8M— ANI (@ANI) November 3, 2025బస్సు ఓంకారేశ్వర్ నుండి ఇండోర్‌కు వెళుతుండగా పెద్ద గుంతలో బోల్తా పడిందని జిల్లా కలెక్టర్ శివం వర్మ మీడియాకు తెలిపారు. ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నారని, డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడా లేదా అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఈ ప్రమాదంపై ‘ఎక్స్’లో స్పందిస్తూ, ఇది హృదయ విదారక ఘటనగా అభివర్ణించారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు.ఇది కూడా చదవండి: కోయంబత్తూరు ఘటన: సినీ ఫక్కీలో నిందితుల అరెస్ట్ -
తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజు మూడు ప్రమాదాలు
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి. ఒకే రోజు మూడు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఏపీలోని సత్యసాయి జిల్లాలో ఐచర్ వాహనాన్ని ట్రావెల్స్ బస్సు ఢీకొంది. హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 8 మంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రి కి తరలించారు. రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండలం దామాజిపల్లి వద్ద ఘటన జరిగింది.నల్లగొండ జిల్లా: వేములపల్లి మండలం బుగ్గుబావిగూడెం వద్ద ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కావలి నుంచి హైదరాబాద్ వెళ్తున్నచెర్రీ ట్రావెల్స్ బస్సు నార్కెట్ పల్లి -అద్దంకి హైవే పై ట్రాక్టర్ ను డికొట్టింది. బస్సు వెనుక నుంచి ఢీకొట్టడంతో రోడ్డుపై ట్రాక్టర్ పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదు మందికి గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన వారిని మిర్యాలగూడ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 45 A మంది ప్రయాణికులు ఉన్నారు.కరీంనగర్ జిల్లా: తిమ్మాపూర్ మండలం రేణికుంట బ్రిడ్జి రాజీవ్ రహదారిపై వడ్ల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఆర్టీసీ బస్సు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 15 మంది గాయపడ్డారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ క్షతగాత్రులను అంబులెన్స్‌లో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. మెట్పల్లి డిపోకి చెందిన బస్సు.. హైదరాబాద్‌నుంచి మెట్టుపల్లికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. -
ఘోర ప్రమాదం..ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర టిప్పర్ 19 మంది మృతి.
-
తెలంగాణ ఆర్టీసీ చరిత్రలో రెండో అతిపెద్ద దుర్ఘటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ చరిత్రలో భారీ ప్రాణ నష్టం సంభవించిన రెండో అతిపెద్ద ప్రమాదం ఇది. చేవెళ్ల సమీపంలో ఆర్టీసీ అద్దె బస్సును టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో 19 మంది చనిపోయిన విషయం తెలిసిందే. 2018 సెప్టెంబరు 11న కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయం నుంచి ఘాట్ రోడ్డు మీదుగా వస్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి దిగువకు దొర్లిపోవటంతో ఏకంగా 64 మంది చనిపోయారు. ఇదే ఆర్టీసీ చరిత్రలో అతిపెద్ద దుర్ఘటన. ఆ తర్వాత అంతమంది చనిపోయింది మాత్రం సోమవారం నాటి ప్రమాదంలోనే. ⇒ 2013 అక్టోబరు 30న మహబూబ్‌నగర్ జిల్లా పాలెం సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు బెంగళూరు నుంచి వస్తూ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల కల్వర్టు గోడను ఢీకొని అగ్నికి ఆహుతైన దుర్ఘటనలో 45 మంది చనిపోయారు. తెలంగాణ ఆవిర్భావానికి కొన్ని నెలల ముందు జరిగిన ఈ ఘటనలో ప్రమాదానికి గురైంది ప్రైవేటు బస్సు. అది దేశ చరిత్రలోనే భారీ ప్రమాదాల్లో ఒకటికొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయం నుంచి జగిత్యాల వైపు వెళ్తున్న ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు లోయలోకి పడిపోయిన దుర్ఘటన దేశ చరిత్రలోనే అతిపెద్ద ప్రమాదాల్లో ఒకటిగా నిలిచింది. దాదాపు 12 లక్షల కిలోమీటర్లు తిరిగిన పాత డొక్కు బస్సును నడపటం పెను ప్రమాదానికి కారణమైంది. దేవాలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో, ఈ బస్సులో 104 మంది ఎక్కారు. నిరోధించాల్సిన డ్రైవర్, కండక్టర్లు అధిక టికెట్ ఆదాయం ఆశతో నియంత్రించలేదు.రెగ్యులర్‌గా దిగాల్సిన మార్గంలో కాకుండా తక్కువ దూరం ఉండే మరో నిషేధిత మార్గంలో డ్రైవర్ నడిపారు. ఓవర్ లోడ్, పాత డొక్కు బస్సు, ప్రమాదకర మార్గం... అన్ని లోపాలు వెరసి బస్సు అదుపు తప్పి లోయలోకి జారిపోయింది. ఆ తర్వాత ఎక్కువ ప్రాణనష్టం జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదం సోమవారం చేవెళ్ల సమీపంలో చోటు చేసుకున్నదే. ⇒ 2016లో ఖమ్మం జిల్లా నాయకునిగూడెం వద్ద కెనాల్లోకి ఓ ప్రైవేటు బస్సు దూసుకెళ్లిన దుర్ఘటనలో 10 మంది ప్రయాణికులు మృతి చెందారు. -
మీర్జాగూడ రోడ్డు ప్రమాదంపై ప్రముఖుల సంతాపం
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది మరణించటంపై రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు ప్రముఖలు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి.. బస్సు ప్రమాదంలో అనేకమంది ప్రాణాలు కోల్పోవడం చాలా దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు నా సానుభూతిని తెలుపుతున్నా. గాయపడిన ప్రయాణికులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. – ద్రౌపదీ ముర్ము, రాష్ట్రపతి క్షతగాత్రులు కోలుకోవాలి.. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుతున్నా. ఇంతమంది ప్రాణనష్టం బాధాకరంగా ఉంది. – సీపీ రాధాకృష్ణన్, ఉప రాష్ట్రపతి చాలా బాధాకరం.. ఈ క్లిష్ట సమయంలో మృతిచెందిన వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి. మరణించిన వారి ప్రతి కుటుంబానికి పీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.2లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందిస్తాం. – నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి ప్రమాదం దిగ్భ్రాంతికరం.. మీర్జాగూడ వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో భారీగా ప్రాణనష్టం జరగటం దిగ్భ్రాంతి కలిగించింది. మృతుల కుటుంబాలను ఆదుకోవడంతో పాటు క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా. – కే.చంద్రశేఖర్‌రావు, బీఆర్ఎస్ అధినేత ఘటన కలచివేసింది..తెలంగాణలోని చేవెళ్ల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం దిగ్భ్రాంతి కలిగించింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం.. ఈ ఘటన తీవ్రంగా కలచివేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి. – వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు బాధిత కుటుంబాలకు సానుభూతి.. ఈ ప్రమాదం తీవ్రంగా కలిచివేసింది. మృతుల కుటుంబాలకు సానుభూతి. రోడ్డు భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టం చేయాలి. ఇటువంటి దుర్ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. – జి.కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి అండగా ఉంటాం.. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రివర్గ సహచరులు వెంటనే స్పందించి ఇచి్చన ఆదేశాలతో యంత్రాంగం ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టింది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. – మల్లు భట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం బాధితులను ఆదుకోవాలి చేవెళ్ల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం అత్యంత బాధాకరం. మృతుల కుటుంబాలను, గాయపడిన వారిని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. – కే.తారకరామారావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్మంత్రులు, ప్రముఖుల సంతాపం సాక్షి, హైదరాబాద్: ఈ ఘటన దురదృష్టకరమని, సన్నిహితులను కోల్పోయిన వారి కుటుంబాల కోసం దేవుని ప్రార్థిస్తున్నామని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ఓ ప్రకటనలో తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్యతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నానని, ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు బాధితులకు అండగా ఉండాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డితో కూడా మాట్లాడి బాధితులకు అవసరమైన సాయం చేయాలని సూచించినట్టు ఆయన తెలిపారు.కాగా, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ఇలాంటి దుర్ఘటనల కట్టడికి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు కోరారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించేందుకు చేవెళ్లలోని పీఎంఆర్ జనరల్ ఆస్పత్రికి తరలించినట్టు శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి తెలిపారు.మీర్జాగూడ రోడ్డు ప్రమాదం తెలుసుకుని తీవ్ర ది్రగ్బాంతికి గురైనట్టు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు. టిప్పర్లపై కవర్ కప్పేలా చర్యలు తీసుకోవాలని, అదే జరిగి ఉంటే చేవెళ్ల వద్ద ఇంతటి దుర్ఘటన జరిగి ఉండేది కాదని బీజేపీ ఎమ్మెల్సీ, తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సి.అంజిరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
చేవెళ్ల ప్రమాదంలో మృత్యువుకు బలయ్యాడు!
సాక్షి,రంగారెడ్డి: చేవెళ్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఆర్టీసీ బస్సు డ్రైవర్ దస్తగిరి బాబా కూడా ఉన్నారు. గతంలో తన చాకచక్యంతో అనేక ప్రాణాలను కాపాడిన ఆయన.. ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో మరణించడం పట్ల తోటి ఆర్టీసీ ఉద్యోగులు,అధికారులు విచారం వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులు గతంలో దస్తగిరి బాబా ప్రదర్శించిన అద్భుత ధైర్యాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఏడాదిన్నర క్రితం, వికారాబాద్‌లోని అనంతగిరి కొండపై బస్సు బ్రేకులు ఫెయిలయ్యాయి. ఆ సమయంలో దస్తగిరి చాకచక్యంగా వ్యవహరించి, బస్సులోని ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు.అప్పట్లో తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి ప్రయాణికులను రక్షించిన దస్తగిరి.. చేవెళ్ల ప్రమాదంలో మృతి చెందడంపై ఆర్టీసీ ఉద్యోగులు, అధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.కాపాడండి’.. నడుములోతు కంకరలో ఇరుక్కుని టీచర్ ఆర్తనాదాలు ఒకే కుటుంబంలో ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతి -
‘కాపాడండి’.. నడుములోతు కంకరలో ఇరుక్కుని టీచర్ ఆర్తనాదాలు
సాక్షి,రంగారెడ్డి: చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని విషాదంలో ముంచింది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న కంకర లారీ ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.ప్రమాదానికి కారణంగా భావిస్తున్న టిప్పర్‌లో 30 టన్నులకు బదులుగా 50 టన్నుల కంకర లోడ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఢీకొట్టిన వెంటనే టిప్పర్లోని కంకర మొత్తం బస్సులోకి ప్రవేశించి, ప్రయాణికులపై పడటంతో ఊపిరాడక అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. కంకరలో ఇరుక్కుని బయటకు రాలేక ప్రయాణికులు చేసిన ఆర్తనాదాలు స్థానికులను కంటతడి పెట్టించాయి.ఈ ప్రమాదంలో తోల్కట్టలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మ్యాథ్స్ కాంట్రాక్ట్ టీచర్‌గా పనిచేస్తున్న జయసుధ తీవ్రంగా గాయపడ్డారు. నడుములోతు కంకరలో ఇరుక్కుని ఆమె కాళ్లు వాచిపోవడంతో కుటుంబ సభ్యులు ఆమెను నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కేరెల్లి గ్రామానికి చెందిన జయసుధ వికారాబాద్‌లో బస్సు ఎక్కగా, ఆమెతో పాటు రావాల్సిన మరో నలుగురు ఉపాధ్యాయులు ఆలస్యంగా రావడంతో వేరే బస్సులో ప్రయాణించి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.ప్రమాదం తీవ్రతకు బస్సు డ్రైవర్ వైపు సీట్లలో ఉన్న ప్రయాణికులు అధికంగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఘటనా స్థలంలో దృశ్యాలు హృదయవిదారకంగా ఉండగా, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. -
Mirzaguda Bus Accident: CPR చేసిన కాపాడలేకపోయాం
-
Chevella Bus Incident: కంకర మొత్తం బస్సులోకి వెళ్లడంతో కూరుకుపోయిన ప్రయాణికులు
-
Chevella Road Accident: రావొద్దని చెప్పినా వచ్చారు.. నా ముగ్గురు బిడ్డలు చనిపోయారు
-
హృదయవిదారకంగా.. చేవెళ్ల ఘోర ప్రమాద చిత్రాలు
-
ఒకే కుటుంబంలో ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతి
సాక్షి, చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందినట్టు మంత్రి పొన్న ప్రభాకర్ అధికారికంగా ప్రకటించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులకు ఆసుపత్రుల్లో చికిత్స జరుగుతోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మరోవైపు.. ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలను అధికారులు, పోలీసులు గుర్తిస్తున్నారు. బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెలు మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. తాండూరుకు చెందిన ఎల్లయ్య గౌడ్ ముగ్గురు కూతుళ్లు నందిని (డిగ్రీ ఫస్టియర్), సాయిప్రియ (డిగ్రీ థర్డ్ ఇయర్), తనూష (ఎంబీఏ) హైదరాబాద్‌లో చదువుకుంటున్నారు. ఇటీవల బంధువుల పెళ్లి ఉండటంతో ముగ్గురు సొంతూరుకు వచ్చారు. ఈరోజు తెల్లవారుజామున తిరిగి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం కారణంగా మృతి చెందారు. దీంతో, వారి కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. పోస్టుమార్టం అనంతరం తనూష, సాయి ప్రియా, నందిని మృతదేహాలు గ్రామానికి చేరుకున్నాయి,. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు ఈ ప్రమాదంలో పది మంది మహిళలు, ఒక చిన్నారి, ఎనిమిది మంది పురుషులు ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా పలువురి మృతుల వివరాలను అధికారులు వెల్లడించారు. 1.దస్తగిరి బాబా, డ్రైవర్; 2.తారిబాయ్ (45), దన్నారమ్ తండా; 3.కల్పన(45), బోరబండ; 4.బచ్చన్ నాగమణి(55); భానూరు; 5.ఏమావత్ తాలీబామ్, ధన్నారం తాండ; 6.మల్లగండ్ల హనుమంతు, దౌల్తాబాద్ మండలం;7.గుర్రాల అభిత (21) యాలాల్; 8.గోగుల గుణమ్మ,బోరబండ;9.షేక్ ఖాలీద్ హుస్సేన్, తాండూరు;10.తబస్సుమ్ జహాన్, తాండూరు.11. తనూషా, సాయిప్రియ, నందిని(ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెల్లు)12. అఖిల(తాండూరు).13. ఏనుగుల కల్పన14. నాగమణి, 15. జహంగీర్. క్షతగాత్రులు వీరే..వెంకటయ్యబుచ్చిబాబు-దన్నారమ్ తండాఅబ్దుల్ రజాక్-హైదరాబాద్వెన్నెలసుజాతఅశోక్రవిశ్రీను- తాండూరునందిని- తాండూరుబస్వరాజ్-కోకట్ (కర్ణాటక)ప్రేరణ- వికారాబాద్సాయిఅక్రమ్-తాండూరుఅస్లామ్-తాండూరు -
Chevella Bus Incident: కంకరలో కూరుకుపోయిన ప్రయాణికులు
-
TS: చేవెళ్లలో ఘోర బస్సు ప్రమాదం.. 17 మందికిపైగా మృతి
-
ఎమ్మెల్యేపై దాడికి యత్నం.. చేవెళ్ల ప్రమాదస్థలి వద్ద ఉద్రిక్తత
సాక్షి, రంగారెడ్డి: చేవెళ్ల మీర్జాగూడ బస్సు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సహాయక చర్యలు కొనసాగుతుండడంతో మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు అంటున్నారు. తాజాగా ఘటనాస్థలికి వెళ్లిన ఎమ్మెల్యే కాలె యాదయ్యకు నిరసన సెగ తలిగింది. రోడ్డు విస్తరణ ఎందుకు చేపట్టలేకపోయారు? అంటూ స్థానికులు ఆయన్ని నిలదీశారు. చేవెళ్ల ఘటనా స్థలంలో సోమవారం ఉదయం స్థానికులు ఆందోళన చేపట్టారు. జాతీయ రహదారిపై ఇప్పటిదాకా రోడ్డు విస్తరణ చేపట్టకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే కాలె యాదయ్యను నిలదీశారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ యాదయ్యపై దాడికి యత్నించబోయారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని శాంతింపజేశారు. దీంతో ఎమ్మెల్యే యాదయ్య వచ్చిన కారులో అలాగే వెళ్లిపోయారు.తాండూరుకు చెందిన ఆర్టీసీ బస్సు ఈ ఉదయం 4.45గం. బస్టాండ్ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరింది. అయితే అక్కడ 30 మంది ఎక్కారు. ఫస్ట్ ట్రిప్ కావడం.. ఎక్స్‌ప్రెస్ బస్సే అయినప్పటికీ పల్లె వెలుగు పేరిట నడపం, ప్రతీ స్టాపులో ఆపుతూ రావడంతో విద్యార్థులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో ఎక్కారు. కంకర లోడ్‌తో వెళ్తున్న టిప్పర్ మీర్జాగూడ టర్నింగ్ పాయింట్లో స్పీడ్‌ను కంట్రోల్ చేయలేకపోవడంతో అదుపుతప్పింది. బస్సును ఢీ కొట్టి ఆపై.. గుంత కారణంగా అదుపు తప్పి అలాగే బస్సు మీద ఒరిగిపోయింది. టిప్పర్ లారీ అతివేగం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు నిర్థారించగా.. బస్సు మీదకు ఒరిగిపోవడం, ఈ క్రమంలో కంకర మొత్తం బస్సులో పడిపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని చెబుతున్నారు. బస్సుకు కుడి వైపు కూర్చున్న 21 మంది స్పాట్లోనే మరణించినట్లు చెబుతున్నారు. ఘటనలో టిప్పర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సు డ్రైవర్ దస్తగిరి స్పాట్లోనే చనిపోగా.. కండక్టర్ రాధ ప్రాణాలతో బయటపడింది. మృతులంతా తాండూరు, చేవెళ్ల వాసులుగా తెలుస్తోంది. స్థానికులు, పోలీసులు కంకర నుంచి ప్రయాణికులను బయటకు తీసి రక్షించారు. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. యుద్ధప్రతిపాదికన సహాయక చర్యలు చేపట్టాలని సీఎస్, డీజీపీలను ఆదేశించారు. దీంతో మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను హైదరాబాద్‌కు తరలించే యోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. -
చేవెళ్లలో ఘోర ప్రమాదం.. 20 మంది మృతి
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో సోమవారం వేకువ జామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చేవెళ్ల వద్ద ఆర్టీసీ బస్సును కంకర లోడ్‌తో వెళ్తున్న టిప్పర్ లారీ ఢీ కొట్టి బోల్తా పడిపోయింది. ఈ ఘటనలో 20 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదంలో 19మంది మరణించారని రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. క్షతగాత్రులకు చికిత్స అందుతుండగా.. వాళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చేవెళ్ల మండల పరిధిలో సోమవారం వేకువ ఝామున ఈ ఘోరం జరిగింది. తాండూరు డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్ బస్సు ఈ వేకువ జామున హైదరాబాద్‌కు బయల్దేరింది. తొలి ట్రిప్పు బస్సు కావడంతో అధిక సంఖ్యలో జనాలు ఎక్కారు. ఈలోపు.. బస్సు మీర్జాగూడ వద్దకు చేరుకోగానే కంకర లోడ్‌తో వెళ్తున్న టిప్పర్ వేగంగా దూసుకొచ్చి ఢీ కొట్టింది. ఆపై టిప్పర్ ఒరిగిపోవడంతో కంకర లోడ్ మొత్తం బస్సులోకి పడిపోయింది. తాండూరు బస్టాండ్ నుంచి బస్సు బయల్దేరిన దృశ్యంప్రమాదం ధాటికి బస్సు ముందు భాగం ధ్వంసం అయ్యింది. బస్సు, టిప్పర్ డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన గురించి సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. కంకరలో కూరుకుపోయిన వాళ్లను బయటకు తీసి ఆస్పత్రులకు తరలించారు. ఘటనా స్థలం వద్ద, బస్సుల్లో దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి. తమను కాపాడాలంటూ కంకరలో కూరుకుపోయిన వాళ్లు వేడుకోవడం.. అచేతనంగా కొందరు పడి ఉండడం కలవరపాటుకు గురి చేస్తోంది. ఈ ప్రమాదంలో 20 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. మరో 32 మందికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. గాయపడినవాళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది.బస్సులో కంకర మధ్య విగతజీవిగా యువతి.. ఆ వెనక సగం కూరుకుపోయి సాయం కోసం ఎదురు చూస్తున్న యువకుడుకంకర టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది. అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన టిప్పర్.. అదుపు తప్పి బస్సుపై బోల్లా పడిందని పోలీసులు చెబుతున్నారు. కంకర మొత్తం బస్సులో పడిపోవడంతో ఈ తీవ్రత ఎక్కువైందని అంటున్నారు.ప్రమాద సమయంలో బస్సులో 72 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం సెలవు కావడంతో సిటీ నుంచి వెళ్లినవాళ్లు తిరుగు పయనమైనట్లు స్పష్టమవుతోంది. అందులో విద్యార్థులు, ఉద్యోగులే ఎక్కువగా ఉన్నారు. మొత్తం 20 మంది మృతుల్లో 10 మంది మహిళలు, ఒక చిన్నారి, 8 మంది పురుషులు(ఇద్దరు డ్రైవర్లుసహా) ఉన్నారు. మృతుల్లో పది నెలల పసికందు, ఆమె తల్లి కూడా ఉండడం కలిచివేస్తోంది. కేబిన్లలో ఇరుక్కుపోయిన టిప్పర్ డ్రైవర్, బస్సు డ్రైవర్ మృతదేహాన్ని బయటకు తీశారు. మరో 15 మంది ప్రయాణికులను కాపాడగలిగారు. కంకరను పూర్తిగా తొలగించేందుకే జేసీబీ సహాయం తీసుకున్నారు.👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ఇదిలా ఉంటే.. సహయ చర్యల్లో పాల్గొన్న సీఐ భూపాల్‌కు గాయాలయ్యాయి. జేసీబీ ఆయన కాలు మీదకు ఎక్కింది. దీంతో ఆయనకు చికిత్స అందించారు. ఇక ఈ ప్రమాదం వల్ల చేవెళ్ల-వికారాబాద్ బీజాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మూడు కిలోమీటర్ల వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో అధికారులు రంగంలోకి ట్రాఫిక్‌ను క్లియర్ చేసే పనిలో ఉన్నారు. -
కర్నూలు కావేరి బస్సు డ్రైవర్ లక్ష్మయ్య అరెస్ట్
కర్నూలులో వి కావేరి బస్సు ప్రమాదం కేసు డ్రైవర్ లక్ష్మయ్యను అరెస్ట్ చేసిన పోలీసులు. బస్సు ప్రమాద కేసులో ఏ1గా ఉన్న మిరియాల లక్ష్మయ్య ఏ2 బస్సు యజమాని కోసం పోలీసుల గాలింపు.కర్నూలు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున 19 మంది సజీవ దహనానికి కారణమైన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మిరియాల లక్ష్మయ్య అర్హత లేకున్నప్పటికీ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. ప్రమాదం నేపథ్యంలో పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామానికి చెందిన లక్ష్మయ్య కుటుంబ నేపథ్యం, ప్రవర్తన, అలవాట్లపై అధికారులు ఆరా తీశారు. ఈయన 5వ తరగతి వరకే చదువుకున్నాడని, అయితే టెన్త్ ఫెయిల్ అయినట్లు సర్టిఫికెట్ ఇచ్చి, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడని గుర్తించారు.మొదట లారీ క్లీనర్‌గా, తర్వాత డ్రైవర్‌గా పని చేశాడు. 2004లో లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నప్పుడు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి చెట్టుకు ఢీకొనడంతో అప్పట్లో లారీ క్లీనర్ మృతి చెందాడు. ఆ తర్వాత లారీ డ్రైవర్‌గా మానేసి కొన్నాళ్లు ట్రాక్టర్ కొని స్వగ్రామంలో వ్యవసాయం చేశాడు. తర్వాత ట్రావెల్స్ బస్సు డ్రైవర్‌గా ఏడెనిమిదేళ్ల నుంచి వెళ్తున్నాడని తెలిసింది. లక్ష్మయ్య తండ్రి రాములు రెండు నెలల కిందట మృతి చెందాడు. ఇతనికి భార్య, ఓ కుమారుడు, ఓ కుమార్తె, ఒక సోదరుడు, ఇద్దరు అక్కలు ఉన్నారు. లక్ష్మయ్యకు అప్పుడప్పుడు మద్యం సేవించే అలవాటు ఉందని సమాచారం. -
Rajasthan Bus Accident : మంటల్లో మరో బస్సు.. ఇద్దరు మృతి
-
నిజాలు దాచి.. ‘బెల్ట్’ ఫుటేజీ మాయం!
రోజూ ఉండే షాపు.. ఈ రోజులేదు లక్ష్మీపురం హైవేకు దగ్గరలో రోజూ ఉండే బెల్ట్ షాపు ఈ రోజు లేదు. పేపర్లో ఆ షాపు ఫొటో రావడంతో మూసేసి వెళ్లిపోయారు. బెల్ట్ షాపు తొలగించాలని ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం బెల్ట్ షాపులను నిషేధించాలి. – రాకేష్, లక్ష్మీపురంసాక్షి ప్రతినిధి కర్నూలు: లక్ష్మీపురంతోపాటు ఎన్‌హెచ్ 44 సమీపంలోని దాబాలు, ఇతర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించాం.. ఎక్కడా బెల్ట్‌షాపులు లేవ్..! తాజాగా ప్రభుత్వ ప్రకటన ఇదీ!! మా గ్రామంలో 24 గంటలు మందు అమ్ముతున్నారు.. వైన్ షాపు లేకున్నా, నాలుగు బెల్ట్ షాపులు మాత్రం అందుబాటులో ఉన్నాయి!! బెల్ట్ షాపుల ఎదుట నిలుచుని లక్ష్మీపురం వాసులు చెబుతున్న నిఖార్సైన నిజాలివీ!! కర్నూలు జిల్లాలో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం దుర్ఘటన కనివీని ఎరుగని పెను విషాదం. చిన్నారులు సైతం బుగ్గి కావడంపై దేశమంతా కన్నీరు పెట్టింది. మద్యం భూతమే ఈ విషాదానికి కారణ భూతమైంది. విచ్చలవిడిగా, వేళాపాళా లేకుండా దొరుకుతున్న మద్యమే 20 ప్రాణాలు గాలిలో కలిసిపోవటానికి ప్రధాన కారణం. అధికారులు సైతం దీన్ని ధ్రువీకరించారు. దీన్ని కప్పిపుచ్చుతూ... అది బెల్ట్ షాపు మద్యం కాదని, ప్రమాదానికి కారణమైన బైకర్లు లైసెన్స్డ్ మద్యమే సేవించారంటూ, అక్కడే కొనుగోలు చేశారంటూ ప్రభుత్వం నిస్సిగ్గుగా సమర్థించుకోవడం తీవ్ర విస్మయం కలిగిస్తోంది. పెద్దటేకూరు సమీపంలోని రేణుక ఎల్లమ్మ వైన్స్‌లో రాత్రి 7 గంటలకు, 8.20 గంటలకు రెండు దఫాలు మద్యం కొనుగోలు చేశారని, ఆ ప్రాంతంలో బెల్ట్‌షాపులే లేవని ఎక్సైజ్ శాఖ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే తమ ఊరిలో బెల్ట్ షాపులు ఉన్నాయని, గత రెండు రోజులుగా మాత్రమే మూసివేశారని లక్ష్మీపురం గ్రామస్తులే చెబుతున్నారు. దుర్ఘటన జరిగాక హడావుడిగా బెల్ట్ షాపులను మూసివేయడం, ఆ దుకాణాల ఎదుట సీసీ టీవీ ఫుటేజీని తొక్కిపెడుతుండటం పట్ల సర్వత్రా అనుమానాలు రేకెత్తుతున్నాయి. రెండు రోజులుగా బెల్ట్‌షాపు మూత.. మాయమైన సీసీ టీవీ ఫుటేజీ..! బైకర్లు శివశంకర్, ఎర్రిస్వామి ప్రమాదానికి ముందు అర్ధరాత్రి వరకూ ఇద్దరూ మద్యం సేవిస్తూనే ఉన్నారు. మూడోసారి పెద్దటేకూరు వైన్‌షాప్ వద్దకు వెళ్లే ఓపిక లేక లక్ష్మీపురంలోని బెల్ట్‌షాపులో మద్యం కొనుగోలు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదం జరగడం.. మద్యం సేవించి లక్ష్మీపురం నుంచి బైకర్లు బయలుదేరారని మీడియాలో రావడంతో అక్కడి బెల్ట్ షాపును శనివారం మూసేశారు. ఆదివారం కూడా దుకాణం తెరవలేదు! ‘సాక్షి’ ప్రచురించిన కథనం నేపథ్యంలో కొందరు అధికారులు లక్ష్మీపురం బెల్ట్‌షాపు వద్ద ఉన్న సీసీ ఫుటేజ్‌ని ఆగమేఘాలపై స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. రెండురోజులుగా బెల్ట్‌షాపు మూతపడటం, సీసీటీవీ ఫుటేజీలను అధికారులు తీసుకెళ్లడంతో లక్ష్మీపురం బెల్ట్‌షాపులోనే వారు మద్యం కొనుగోలు చేశారనే అనుమానాలు బలపడుతున్నాయి. లక్ష్మీపురంలో తన తల్లిని చూసేందుకు ఎర్రిస్వామి వెళుతుంటాడు. మూడో దఫా లక్ష్మీపురం బెల్ట్‌షాపులో మద్యం సేవించారా? లేదా? అనేది విచారణలో పోలీసులు తేల్చాల్సి ఉంది. లక్ష్మీపురంలో బెల్ట్‌షాపు ఉందా? లేదా? అని పరిశీలించేందుకు వెళ్లిన ‘సాక్షి’తో పలువురు మాట్లాడారు.పెట్రోల్ బంక్‌లో శివశంకర్ ఉన్న సీసీ ఫుటేజీ విడుదల చేసిన అధికారులు... లక్ష్మీపురంలో అతను మద్యం కొన్నాడని స్థానికులు చెబుతున్నా... అక్కడి సీసీ ఫుటేజీని బయటపెట్టలేరా? గుడి, బడి పక్కన బెల్ట్ షాపులు లక్ష్మీపురంలో హైవే, గుడి, బడి పక్కన బెల్ట్ షాపులున్నాయి. ఒకవైపు సీఎం బెల్ట్ షాపు పెడితే బెల్ట్ తీస్తానని చెబుతున్నారు. వాస్తవంగా అందుకు భిన్నంగా పరిస్థితులు ఉన్నాయి. మద్యం తాగి బైక్ నడపడంతోనే రోడ్డు ప్రమాదం జరిగి 20 మంది చనిపోయారు. – నారాయణరెడ్డి, లక్ష్మీపురం 24 గంటలు మందు అమ్ముతున్నారు మా గ్రామంలో 24 గంటలూ మందు అమ్ముతున్నారు. వైన్ షాపు లేకున్నా నాలుగు బెల్ట్ షాపులు అందుబాటులో ఉన్నాయి. చిన్న పిల్లలు కూడా మద్యం సేవిస్తున్నారు. రోడ్ల పక్కనే తాగుతుండడంతో రాకపోకల సమయంలో మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని పోలీసులు, ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం శూన్యం. చంద్రబాబునాయుడు ఏపీని మద్యాంధ్ర ప్రదేశ్‌గా మార్చారు. – రాజమోహన్‌రెడ్డి, లక్ష్మీపురం మా ఊరి బెల్ట్ షాపుల్లో నిత్యం మందు దొరుకుతుంది మా గ్రామంలో ఉన్న బెల్ట్ షాపుల్లో నిత్యం మందు దొరుకుతుంది. అర్ధరాత్రైనా, మధ్యరాత్రైనా, తెల్లవారుజామునైనా మందుకు కరువు ఉండదు. అయినా అధికారులెవరూ పట్టించుకోవడంలేదు. – పేరిపోగు ప్రతాప్, లక్ష్మీపురంఎక్కడా తనిఖీలు చేయడం లేదుమా ఊరు పరిధిలో నాలుగు బెల్ట్ షాపులు ఉన్నాయి. గతంలో ఎక్సైజ్ వాళ్లు కంట్రోల్ చేసేవాళ్లు. ఇప్పుడు అవేమి జరగడంలేదు. నేరుగా వైన్ షాపు వారే మద్యాన్ని తెచ్చి బెల్ట్ షాపులకు ఇచ్చిపోతున్నారు. ఎక్కడ తనిఖీలు చేయడంలేదు. అందుబాటులో ఉండడంతో విచ్చల విడిగా మందు తాగుతున్నారు. బ్రిడ్జిలు, స్కూళ్లు, పార్కుల్లో తాగుతున్నారని ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించడంలేదు. – సత్యంరెడ్డి, గ్రామస్తుడు, లక్ష్మీపురం చిన్న పిల్లలు కూడా తాగుతున్నారు లక్ష్మీపురంలో మద్యం అమ్మకాలు పబ్లిక్‌గా జరుగుతున్నాయి. ఏకంగా వైన్ షాపు వారే వచ్చి ఇళ్లలో అమ్మే వారికి బాటిళ్లు ఇచ్చిపోతున్నారు. పోలీసులు పట్టించుకోవడంలేదు. చిన్న పిల్లలు కూడా మద్యం తాగి పెడదారి పడుతున్నారు. – నేసే శేఖర్, లక్ష్మీపురం ఈ రోజు తెరవలేదు... లక్ష్మీపురంలో నీళ్లకు ఇబ్బంది ఉంది కానీ మందుకు ఇబ్బంది లేదు. వైన్ షాపు లేకున్నా ఎప్పుడు చూసినా బెల్ట్ షాపులు అందుబాటులో ఉంటున్నాయి. మొత్తం నాలుగు బెల్ట్ షాపులు ఉన్నాయి. ఈ రోజు ఒక్క షాపు కూడా తెరవలేదు. – తెలుగు సుంకన్న, లక్ష్మీపురం బెల్ట్ షాపులను నిర్మూలించాలిమహిళల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని బెల్ట్ షాపులను నిర్మూలించాలి. ప్రభుత్వం తరచూ తనిఖీ చేస్తే కట్టడి చేయవచ్చు. ఆ పని చేయడంలేదు. తాగిన మైకంలో ఎవరు ఏం చేస్తున్నారో అర్థం కావడంలేదు. మందు తాగి బండి నడపడం వల్లే ప్రమాదం జరిగి 20 మంది చనిపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం బెల్ట్ షాపులపై పునరాలోచన చేయాలి. – దూడల తిరుపాలు, లక్ష్మీపురం అనర్థాలపై అవగాహన కల్పించాలి మద్యాన్ని ఎక్కువగా తీసుకోవడం ద్వారా కలిగే అనర్థాలపై అవగాహన కలి్పంచాలి. అదే సమయంలో బెల్ట్ షాపులను తొలగించాలి. పిల్లల నుంచి పెద్ద వారి వరకు మందు తాగుతుంటే కాలం ఎటు పోతుందో అర్థం కావడంలేదు. – మాసుంసాహెబ్, లక్ష్మీపురం మద్యం ఖాళీ సీసాలతో హంద్రీ కలుషితంపబ్లిక్ ప్లేసుల్లో మందు తాగడాన్ని అరికట్టాలి. హైవే పక్కన, స్కూళ్ల సమీపంలో మందు తాగడంపై నిఘా వేసి ఉంచాలి. ఇళ్ల మధ్య కూడా రాత్రిళ్లు తాగుతున్నారు. హంద్రీనది మద్యం ఖాళీ సీసాలతో కలుషితం అవుతోంది. – చంద్రశేఖర్, లక్ష్మీపురం -
పొలాల్లోకి దూసుకెళ్లిన ప్రైవేటు బస్సు
మార్కాపురం: ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు పొలాల్లోకి దూసుకెళ్లిన సంఘటన ఆదివారం రాత్రి ప్రకాశం జిల్లా మార్కాపురం–కుంట మధ్య జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మార్కాపురం నుంచి బెంగళూరు వెళ్తున్న ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కొట్టాలపల్లి గ్రామ మూల మలుపు తిరగగానే ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి పొలాల్లోకి వెళ్లిపోయింది.ఆ సమయంలో బస్సులో ఉన్న ఎనిమిది మంది ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అయితే, డ్రైవర్ వెంటనే బ్రేక్ వేయడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. సంఘటనాస్థలాన్ని మార్కాపురం రూరల్ ఎస్ఐ అంకమ్మరావు తన సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. -
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో పొగలు
పొదలకూరు: ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు భయంతో దిగిపోయారు. ఈ ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణానికి సమీపంలోని మర్రిపల్లి వద్ద శనివారం రాత్రి చోటుచేసుకుంది. ప్రయాణికుల కథనం మేరకు.. పొదలకూరు పట్టణంలోని బస్టాండ్ నుంచి సాయి సింధూ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు బెంగళూరుకు బయలుదేరింది.రెండు కి.మీ. దూరంలోని మర్రిపల్లి వద్దకు చేరుకునే సరికి పొగలు వచ్చాయి. దీంతో డ్రైవర్ బస్సును నిలిపివేశాడు. ప్రయాణికులు భయపడి కిందకు దిగేశారు. కొందరు మరో బస్సులో వెళ్లగా, మరికొందరు దగ్గరలోని బంధువుల ఇళ్లకు వెళ్లారు. -
వేమూరి కావేరి బస్సు ప్రమాదంపై రెండు ఎఫ్ఐఆర్లు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కావేరి బస్సు ప్రమాద ఘటనపై చిక్కుముడి వీడింది. బైక్, బస్సు ప్రమాదం ఒకటి కాదని.. రెండు వేర్వేరు ప్రమాదాలని పోలీసులు తేల్చారు. బైకర్స్ మద్యం సేవించి లక్ష్మీపురం నుంచి బయలుదేరగా చిన్నటేకూరు దాటిన తర్వాత వారి బైక్ డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో శివశంకర్ అక్కడికక్కడే మృతిచెందగా, వెనుక కూర్చున్న ఎర్రిస్వామి కిందపడిపోయాడు. ఈ ఘటన తర్వాత కొన్ని వాహనాలు ఇదే దారిలో వెళ్లాయి. 13 నిమిషాల తర్వాత వచి్చన కావేరి బస్సు డ్రైవర్.. ఆ బైక్‌ను గుర్తించడంలో విఫలమై ఢీకొట్టడంతో విషాదం చోటుచేసుకుంది.నిమిషాల వ్యవధిలో జరిగిన ఈ ఘటనలపై పోలీసులు రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఈ నెల 24న బైక్‌ను ఢీకొట్టి ప్రమాదానికి కారణమైన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సుపై సెక్షన్ 12(ఏ), 106(1) బీఎన్ఎస్ కింద కేసు నమోదు చేశారు. ఏ1గా వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్, ఏ2గా బస్సు యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. అయితే పోలీసుల విచారణలో రెండూ వేర్వేరు ఘటనలని తేలాక ఈ నెల 25న మరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. చాకలి ఎర్రిస్వామి ఫిర్యాదు మేరకు మృతిచెందిన బైకర్ శివశంకర్‌పై సెక్షన్ 281, 125(ఏ), 106(1) కింద కేసు నమోదు చేశారు. విచారణ ఇంకా కొనసాగుతోందని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. మృతదేహాలు అప్పగింత డీఎన్ఏ శాంపిల్స్ రిపోర్ట్‌ను ఎఫ్ఎస్ఎల్ (ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీ) జిల్లా కలెక్టర్‌కు పంపడంతో మృతదేహాలను బాధిత కుటుంబాలకు అందజేశారు. కర్నూలు జనరల్ ఆస్పత్రి మార్చురీ వద్ద భీతావహ వాతావరణంలో ఈ ప్రక్రియ పూర్తయింది. ఆదివారం 17 మృతదేహాలను బంధువులకు అప్పగించగా.. బిహార్ వాసి అమృత్‌కుమార్ మృతదేహాన్ని తాము తీసుకెళ్లలేమని, ఆనవాళ్లు కూడా లేని మాంసపు ముద్దకు ఇక్కడే అంత్యక్రియలు చేయాలని కుటుంబ సభ్యులు వేడుకున్నారు. దీంతో కర్నూలు కార్పొరేషన్ అధికారులు అమృత్‌కుమార్ అంత్యక్రియలు పూర్తిచేశారు. ఇక తమిళనాడు వాసి ప్రశాంత్ మృతదేహాన్ని సోమవారం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఆరాంఘర్‌లో బస్సు ఎక్కింది కుప్పం వాసి త్రిమూర్తి.. హైదరాబాద్‌లోని ఆరాంఘర్‌లో బస్సు ఎక్కిన ప్రయాణికుడిని కుప్పం నియోజకవర్గం గుడుపల్లె మండలం యామగానిపల్లెకు చెందిన త్రిమూర్తిగా గుర్తించడంతో డీఎన్ఏ పరీక్షల అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. చెక్కుల పంపిణీ పూర్తి చేసిన తెలంగాణ ప్రభుత్వం బస్సు ప్రమాదంలో మృతిచెందిన ఆరుగురు ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షలు చొప్పున పరిహారం అందజేసింది. గద్వాల ఆర్డీవో అలివేలు చెక్కులను బాధిత కుటుంబాలకు అందజేశారు. ఏపీ ప్రభుత్వం తరఫున హోంమంత్రి అనిత ప్రకటించినట్లుగా మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున పరిహారాన్ని త్వరలో అందజేస్తామని కర్నూలు కలెక్టర్ సిరి తెలిపారు. కోలుకుంటున్న బస్సు ప్రమాద బాధితుడు కర్నూలు (హాస్పిటల్): కర్నూలు శివారులో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంలో తీవ్ర అస్వస్థతకు గురైన గుణసాయి అనే ప్రయాణికుడు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో కోలుకుంటున్నాడు. మచిలీపట్నంకు చెందిన ఈయన ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నాడు. బస్సులో ప్రయాణిస్తుండగా మంటలు రావడంతో ఆ పొగ పీల్చి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఈ క్రమంలో అతని ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్కు గురయ్యాయి. దీంతో అతన్ని కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేర్పించారు. వైద్యులు అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆర్‌ఐసీయులో ఉంచి వైద్యం అందిస్తున్నారు. శనివారం వరకు విషమంగా ఉన్న అతని ఆరోగ్యం వైద్యుల కృషి ఫలితంగా ఆరోగ్యం మెరుగుపడింది. ఆస్పత్రిలో చేరిన ఎర్రిస్వామి.. బస్సు ప్రమాదంలో కీలక సాక్షిగా ఉన్న ఎర్రిస్వామి శనివారం రాత్రి ప్రభుత్వాస్పత్రిలో కడుపునొప్పితో చేరాడు. బైక్ నుంచి అతను కింద పడటంతో కడుపు వద్ద గీరుకుపోయింది. దీనికితోడు పలుచోట్ల నొప్పులు ఉండటంతో కుటుంబసభ్యుల కోరిక మేరకు పోలీసులు అతన్ని ఆసుపత్రిలో చేరి్పంచారు. అతనికి అ్రల్టాసౌండ్ స్కాన్, ఎక్స్‌రే, సీటీ స్కాన్ వంటి పరీక్షలు చేసిన వైద్యులు.. లోపల ఎలాంటి గాయాల్లేవని నిర్ధారించారు. మరికొన్ని పరీక్షలు చేసి కోలుకుంటే డిశ్చార్జ్ చేయనున్నట్లు తెలిసింది. -
కర్నూలు బస్సు ప్రమాదం..19 మృత దేహాలకు డీఎన్ఏ పరీక్షలు పూర్తి
సాక్షి,కర్నూలు: తెలుగు రాష్ట్రాల్లో పెను విషాదం నింపిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన 19 మృత దేహాలకు డీఎన్ఏ పరీక్షలు పూర్తయ్యాయి. ఈ పరీక్షలు కర్నూలు వైద్య కళాశాల ఫోరెన్సిక్ విభాగంలో జరిగాయి. ఇప్పటి వరకు డీఎన్ఏ పరీక్షలు పూర్తయిన మొత్తం మృతదేహాల రిపోర్ట్ వివరాల్ని వైద్యులు ఎస్పీకి అందించారు. వాటి ఆధారంగా అధికారులు భౌతిక కాయల్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించేలా అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు 14 మృత దేహాలను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో బిహార్ చెందిన ఆర్గా అనే వ్యక్తి మృతదేహానికి వారి కుటుంబ సభ్యులు కర్నూలు జోహరాపురంలో అంత్యక్రియలు చేశారు. బిహార్‌కు తీసుకుని వెళ్లేందుకు సమయం పట్టడంతో ప్రభుత్వ అనుమతితో అక్కడ అంత్యక్రియలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు బస్సు ప్రమాదంలో ఇంకా రెండు మృతదేహాల డిఎన్ఎ రిపోర్టు అందాల్సి ఉండగా.. ఇప్పటి దాకా 17 మృతదేహాల డీఎన్ఏ రిపోర్ట్‌లను అధికారులు పొందారు. ఈ రోజు రాత్రికి 19 మృతదేహాల్లో 18 మృతదేహాల్ని వారి కుటుంబ సభ్యులకు అందించనున్నారు. తమిళనాడుకు చెందిన మృతుడు ప్రశాంత్ కుటుంబ సభ్యులు రేపు కర్నూలుకి రానున్న నేపద్యంలో ఆ మృత దేహాన్ని రేపు అప్పగించనున్నారని సమాచారం. -
Kurnool: ప్రాణాల కంటే ఫొటోలే ముఖ్యమా?
కర్నూలు(సెంట్రల్): ఎగిసిపడుతున్న అగ్ని కీలలు.. మరో వైపు ప్రయాణికుల ఆర్తనాదాలు.. కళ్ల ముందు భయానక వాతావరణం.. ఆ సమయంలో కొందరు వ్యక్తులు మృత్యువును సైతం ఎదిరించి కొందరి ప్రాణాలను కాపాడారు. కర్నూలు శివారులో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన బస్సు దుర్ఘటనలో ప్రయాణికులను కాపాడేందుకు వాహనదారులు ఎంతో ధైర్యంగా సాహసం చేసి మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించారు. బస్సులో కళ్లెదుటే మంటల్లో ఆహుతవుతున్నా ప్రయాణికులను కొందరు వాహనదారులు ప్రాణాలకు తెగించి కాపాడే ప్రయత్నం చేశారు. మంటల్లో దగ్ధమవుతున్న బస్సు డోర్లు, కిటికీలు, అద్దాలు పగలగొట్టి కొందరిని బయటకు లాగారు. ఫలితంగా 43 మంది ఉన్న కావేరి ట్రావెల్స్‌లో 24 మంది ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఎంత ప్రయతి్నంచినప్పటికీ 19 మందిని కాపాడలేకపోవడంతో అగ్నికి ఆహుతై బస్సులోనే ప్రాణాలను వదిలి వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చారు. ప్రమాద సమయంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న ధర్మవరానికి చెందిన హరీష్ అనే వ్యక్తి సహాయక చర్యల్లో కీలకంగా వ్యవహరించాడు. అతడిని చూసి ప్రేరణ పొందిన మరికొంతమంది తమలో మానవత్వాన్ని నిద్రలేపి ముందుకొచ్చారు. ఈ క్రమంలో మంటలు ఉద్ధృతమవుతున్న సమయంలో బస్సు కిటికీలు, అద్దాలను బద్దలు కొట్టి ఐదుగురును బయటకు లాగినట్లు తెలుస్తోంది. అంతేకాక వెంటనే పోలీసులు, ఫైర్, 108 అంబులెన్స్‌లకు సమచారం ఇచ్చారు. అయితే అప్పటికే అంబుల్సెన్‌లు చేరుకోకపోవడంతో తమ సొంత వాహనాల్లో ప్రమాదం నుంచి బయట పడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మరికొంత మందిని కాపాడే ప్రయత్నంలో ఉండగా ఒక్క ధాటిగా మంటలు ఎగిసిపడటంతో మిగతా వారిని కాపాడలేకపోయారు. కళ్ల ముందు కొందరు మంటల్లో ఆహుతి అవుతున్న వారిని చూసి బరువెక్కిన హృదయాలతో చలించిపోయారు. వెనక డోర్‌ను బద్దలు కొట్టి.. బస్సులోని వ్యక్తుల ప్రాణాలను కాపాడడంలో బస్సు రెండో డ్రైవరు, క్లీనరు కూడా కీలకంగా వ్యవహరించారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణికులను రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. వెనక డోర్‌ను బద్దలు కొట్టి దాదాపు 10 మంది దాకా బయటకు వెళ్లేలే చేశారని సమాచా రం. అప్పటికే కొంతమంది ప్రయాణికులు డోర్‌ను బద్దలు కొట్టేందుకు ప్రయతి్నస్తున్నా ఓపెన్ కాకపోవడంతో వారు పెద్ద రాడ్డు తీసుకొని బద్దలు కొట్టినట్లు తెలుస్తోంది. దీంతో చాలా మంది ప్రయాణికులు ప్రాణాలతో బయట పడ్డారు. వారు తమకేమి అనుకొని రన్నింగ్ డ్రైవర్ మాదిరిగా పారిపోయి ఉంటే మృతుల సంఖ్య మరింత పెరిగేది. కొందరు సోషల్ మీడియా కోసం తాపత్రయం... బస్సు ప్రమాద సమయంలో కొందరు మాత్రం తమలో మానవత్వం లేదనే విధంగా ఘటన స్థలంలో వ్యవహరించినట్లు ప్రత్యక్షంగా చూసిన వారు చెబుతున్నారు. కళ్లముందు మంటల్లో ప్రాణాలు కలిసి పోతుంటే కాపాడే ప్రయత్నం చేయకుండా సోషల్ మీడియా కోసం ఫొటోలు, వీడియోలు తీసి అప్లోడ్ చేస్తూ కనిపించారని చెప్పారు. ఆపదలో ఉన్న వారిని రక్షించడం కోసం ప్రతి ఒక్కరూ ప్రయతి్నంచి ఉంటే మరికొంతమంది ప్రాణాలతో బయటపడే అవకాశం ఉండేది. ఇప్పటికైనా ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకోవడానికి ప్రయతి్నంచాల్సిన అవసరం ఉంది. పత్తాలేని పెట్రోలింగ్ వాహనం.. 44వ జాతీయ రహదారిలో ఎన్హెచ్ఏఐ(నేషనల్ హై అథారిటీ ఆఫ్ ఇండియా) రోడ్డు భద్రతను గాలికొదిలినట్లు తెలుస్తోంది. ఏదైనా ప్రమాదం జరిగితే క్షణాల్లో అక్కడ ఉండాల్సిన పెట్రోలింగ్ వాహనం, అంబులెన్స్‌లు కనిపించలేదు. ఈ ప్రమాద ఘటనన జరిగిన ప్రదేశం నుంచి 30 కిలోమీటర్ల పరిధిలో పుల్లూరు టోల్‌ప్లాజా, 24 కిలోమీటర్ల పరిధిలో అమడగుంట్ల టోల్ ప్లాజాలు ఉన్నాయి. ఆయా టోల్ ప్లాజాల పరిధిలో పెట్రోలింగ్ వాహనాలు, అంబులెన్స్‌లు అందుబాటులో ఉండాలి. అయితే ప్రమాద సంఘటనకు రెండు టోల్ ప్లాజాల నుంచి ఎలాంటి పెట్రోలింగ్ వాహనాలు రాలేదు. చివరికి అమడగుంట్ల టోల్ ప్లాజాకు సంబంధించి అంబులెన్స్ కూడా రాకపోవడంతో చిత్తూరు జాతీయ రహదారి 40కు చెందిన నన్నూరు టోల్ ప్లాజా అంబులెన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. దీనిని బట్టి టోల్ ఫీజులను వసూలు చేసేందుకు ఆసక్తి చూపుతున్న ఎన్హెచ్ఏఐ..రోడ్డులో వెళ్లే వాహనాలు, ప్రయాణికుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవడంలేదని తేటతెల్లమవుతోంది. ఎట్టా కాలిందో సూడు.. ఎంత నరకం చూశారో పాపం దగ్ధమైన బస్సును చూస్తూ వాహనదారుల దిగ్భ్రాంతి ప్రమాదంతో జిల్లా ప్రజల్లో విషాదం వెల్దుర్తి: కర్నూలు – బెంగళూరు జాతీయ రహదారిపై బస్సు ప్రమాద ఘటన నుంచి జిల్లా ప్రజలు ఇంకా తేరుకోలేక పోతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున చావుకేకతో ఉలిక్కిపడిన జనం శనివారం కూడా అదే ప్రమాద విషయాన్ని చర్చించుకుంటూ కనిపించారు. పత్రికలు, టీవీలు, సామాజిక మాధ్యమాల్లో వచ్చిన కథనాలపై విశ్లేషిస్తూ కనిపించారు. కాగా జాతీయ రహదారి మీదుగా వెళ్తున్న వాహనదారులు ప్రమాద ఘటన స్థలంలో నిలిచి పక్కనే దగ్ధమైన బస్సును పరిశీలిస్తున్నారు. ‘అబ్బా ఎట్టా కాలిపోయిందో సూడు బస్సు.. ఈ బస్సే ఇట్టయిందంటే ఆ మంటలకు బస్సులో చచ్చిపోయిన్నోళ్లు ఎంత నరకం అనుభవించింటారో కదా’ అంటూ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కనిపించారు. జాతీయ రహదారి మీదుగా వెళ్తున్న వివిధ రాష్ట్రాల ప్రయాణికులు, వాహనదారులు బస్సు దుర్ఘటను చూసి అయ్యో పాపం అంటూ వెళ్తున్నారు. బైక్ పడిన ప్రాంతం, చనిపోయిన బైకిస్ట్ గురించి, బస్సు ఈడ్చుకుంటూ వెళ్లిన ఆనవాళ్లు, పూర్తిగా దగ్ధమైన బస్సుపై వివిధ రకాలుగా వి చారు.‘ ఒక వ్యక్తి వల్ల ఇంత ఘోరం జరిగిందా? ప్రమాదానికి మద్యం కారణం’ అంటూ కొందరు ఘటనా స్థలంలో చర్చించుకుంటూ కనిపించారు. వెనుకాల వచ్చిన వాహనదారులు రోడ్డుపై పడిన బైక్‌ను పక్కకు తీసినా సరిపోయేదని.. ప్రైవేటు వాహనాల వేగాన్ని నియంత్రించాలని.. ప్రమాద సమయంలో వాహనదారులు ఇంకా స్పందించి ఉంటే బాగుండేది’ అని మాట్లాడుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరో వైపు సంఘటన స్థలంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. బైక్ పడిన ప్రాంతం నుంచి బస్సు దగ్ధమైన చోటు వరకు చోటు చేసుకున్న పరిణామాలపై వివరాలు సేకరిస్తూ కనిపించారు. ప్రాణాల కంటే ఫొటోలే ముఖ్యమా? కొందరు ప్రాణాల కంటే ఫొటోలే ముఖ్యమన్నట్లుగా వ్యవహరించడం చాలా బాధాకరం. వారిలో మానవత్వం లేదు. మనిషి ప్రాణాలకు విలువ కనిపించలేదు. కళ్ల ముందే ప్రాణ భయంతో కాపాడండి అంటూ మహిళలు, పిల్లలు అరుపులు, కేకలు పెడుతున్నా పట్టించుకోకుండా వీడియోలు తీసుకొని సోషల్ మీడియాలో ప్రొజెక్టు చేసుకున్నారు. అయితే కొందరు మాత్రం వారిలో ఇంకా మానవత్వం చావలేదని నిరూపించారు. ప్రాణాలకు తెగించి కొందరిని కాలే బస్సు నుంచి బయటకు లాగారు. ధర్మవరానికి చెందిన హరీష్ అనే వ్యక్తి ఎంత మంచివాడంటే చెప్పలేం. అందరూ అతన్ని ఆదర్శంగా తీసుకొని సహాయక చర్యల్లో పాల్గొని కొందరిని ప్రాణాల నుంచి రక్షించారు. – హైమారెడ్డి, హైదరాబాద్, ప్రమాద ఘటన ప్రత్యక్ష సాక్షి -
ఆ ఒక్కరు ఎవరు?
సాక్షి ప్రతినిధి కర్నూలు: కర్నూలు సమీపంలో అగ్నికి ఆహుతైన బస్సులో టిక్కెట్లు ముందుగా బుక్ చేసుకున్న 40 మందిలో ఓ వ్యక్తి చివరి నిమిషంలో బస్సు ఎక్కక పోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఇదే క్రమంలో ముందుగా టిక్కెట్ బుక్ చేసుకోకుండా ఆరంఘర్‌లో బస్సు ఎక్కిన ఓ వ్యక్తి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. దీంతో 19 మంది మృతుల్లో 18 మందికి సంబంధించిన కుటుంబ సభ్యుల నుంచి ఫోరెన్సిక్ వైద్యులు డీఎన్ఏ నమూనాలు సేకరించారు. మరో మృతుని బంధువులు మాత్రమే రాలేదు. కలెక్టరేట్, పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నెంబర్లకు కూడా ఎవ్వరూ ఫోన్ చేయలేదు. ఎవరైనా రెండు రోజులుగా కుటుంబ సభ్యులతో సంబంధాలు లేకుండా ఉండి, వ్యక్తి మిస్సయ్యారని భావిస్తే కంట్రోల్ రూంకు ఫోన్ చేయాలని కలెక్టర్ సిరి తెలిపారు. ఈ వ్యక్తి బంధువులు వస్తే, వారి డీఎన్ఏ సేకరించి, దాంతో సరిపోలిన డీఎన్ఏ ఉన్న మృతదేహాన్ని అప్పగిస్తారు. ఒకటి రెండు రోజుల్లో డీఎన్ఏ రిపోర్టులు రానున్నాయి. ఆ వెంటనే 18 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహానికి సంబంధించి సంబంధితులు ఎవరూ రాకపోతే మార్చురీలోనే ఉంచనున్నారు. ప్రమాదంపై ఎఫ్ఎస్ఎల్లో పరిశోధన బస్సు ప్రమాదం, ప్రమాద తీవ్రత కారణాలపై ఎఫ్ఎస్ఎల్ (ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ) అధికారులు పరిశోధన చేస్తున్నారు. ఇప్పటి వరకు బస్సు ప్రమాదంపై ఎలాంటి ప్రాథమిక నివేదిక ఇవ్వలేదని, మూడు రోజుల్లో నివేదిక ఇస్తామని ఫోరెన్సిక్ అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. అయితే ఫోరెన్సిక్ వర్గాల విశ్వసనీయ సమాచారం మేరకు.. బైక్ పెట్రోల్ ట్యాంకు పేలి మంటలు చెలరేగడంతో పాటు బస్సు డీజిల్ ట్యాంకు పక్కన లైటింగ్, ఇతర అవసరాల కోసం వినియోగించే రెండు పెద్ద బ్యాటరీలు పేలాయి. దీనివల్ల పేలుడు సంభవించింది. అలాగే ప్రయాణికుల సెల్ఫోన్లతో పాటు లగేజీ క్యారియల్‌లో ఉన్న 200 సెల్ఫోన్లలో కొన్ని పేలాయి. అయితే సెల్ఫోన్లు పేలడంతో ప్రమాద తీవ్ర పెరగలేదని వారు చెబుతున్నారు. గతంలో మహబూబ్‌నగర్ జిల్లా పాలెంలో జరిగిన జబ్బార్ బస్సు ట్రావెల్స్‌లో కూడా బ్యాటరీలు పేలాయని చెప్పారు. ప్రస్తుత బస్సు ప్రమాదంలో మాత్రం సెల్ఫోన్లలో కొన్ని మాత్రమే కాలిపోయాయని, తక్కినవన్నీ బాక్సులో అలాగే ఉన్నాయని తెలిపారు. డడీఎన్ఏ నమూనాలు విమానంలో తీసుకెళ్లేందుకు నిరాకరణబస్సు ప్రమాదంలో మృతుల గుర్తింపు అందుకే ఆలస్యం! కర్నూలు (హాస్పిటల్): కర్నూలు శివారులో జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి డీఎన్ఏ నమూనాలతో పాటు వారి కుటుంబీకుల రక్త శాంపిల్స్‌ను విమానంలో విజయవాడ తీసుకెళ్లేందుకు నిరాకరించినట్టు సమాచారం. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు మృతదేహాల నుంచి ఫోరెన్సిక్ నిపుణులు నమూనాలు తీసి డబ్బాల్లో భద్రపరిచారు. వాటిని విమానంలో విజయవాడ తరలించేందుకు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే చివరి నిమిషంలో విమానంలో డీఎన్ఏ నమూనాలు తీసుకెళ్లేందుకు నిరాకరించారని సమాచారం రావడంతో వైద్యులు నిట్టూర్చారు. దీంతో రాత్రి 2 గంటల సమయంలో మొత్తం మృతదేహాల నుంచి సేకరించిన నమూనాలతో పాటు కుటుంబీకుల రక్త శాంపిల్స్‌ను మహాప్రస్థానం వాహనంలో మంగళగిరిలోని ఫోరెన్సిక్ సైన్స్ లే»ొరేటరీకి పంపించారు. సాధారణంగా కర్నూలు నుంచి విజయవాడకు వాహనంలో వెళ్లేందుకు 8 నుంచి 12 గంటల సమయం పడుతుంది. అదే విమానంలో అయితే గంటలో వెళ్లిపోవచ్చు. ప్రమాదాలు జరిగినప్పుడు మృతదేహాలు గుర్తించలేని స్థితిలో ఉన్న సమయంలో డీఎన్ఏ పరీక్షల నివేదిక అనివార్యమైనప్పుడు.. సమయాన్ని ఎంతగా తగ్గిస్తే అంత త్వరగా బాధితులకు సాంత్వన చేకూర్చవచ్చు. విమానంలో వాటిని తరలించేందుకు ఎయిర్‌పోర్టు అధికారులు అంగీకరించకపోవడం విమర్శలకు తావిస్తోంది. విమానంలో పంపి ఉంటే డీఎన్ఏ నివేదికలు 12 గంటలు ముందుగా వచ్చే అవకాశం ఉండేది. ప్రస్తుతం డీఎన్ఏ పరీక్షల నివేదికలు రావాలంటే సోమవారం వరకు ఆగాల్సిందే. అప్పటివరకు మృతదేహాల కోసం వారి కుటుంబసభ్యులు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
ప్రత్యక్ష నరకం!
కర్నూలు (హాస్పిటల్): ‘ఎవరి శరీరానికైనా కొంచెం నిప్పు తగిలితే సుర్రుమంటుంది. కానీ అత్యధిక వేడితో శరీరం కాలిపోతున్నా వారికి తెలియలేదంటే పరిస్థితి ఎంతటి భయానకంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. బస్సు మంటల్లో కాలిపోతున్నప్పుడు వెలువడిన విష వాయువులు పీల్చడం వల్ల అందులో ప్రయాణిస్తున్న వారు స్పృహ కోల్పోయారు. ఇదే సమయంలో మంటలు వారిని దహించేసి ఉంటాయి’ అని కర్నూలు మెడికల్ కాలేజ్ ఫోరెన్సిక్ విభాగాధిపతి డాక్టర్ టి.సాయిసుదీర్ వెల్లడించారు. కర్నూలు శివారులో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు మంటల్లో కాలిపోయి మరణించిన విషయం తెలిసిందే. కాళ్లు, చేతులు బూడిదైపోగా.. మిగిలిన మొండేల నుంచి డీఎన్ఏ పరీక్ష కోసం శాంపిల్స్ సేకరించారు. శనివారం వరకు 18 మంది మృతుల కుటుంబీకుల నుంచి రక్త నమూనాలు సేకరించారు. వీటిని మంగళగిరిలోని ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీకి పంపించారు. రెండు రోజుల్లో నివేదికలు రానున్నాయి. మరో గుర్తు తెలియని వ్యక్తి కుటుంబీకుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాదం జరిగిన బస్సును సునిశితంగా పరిశీలించిన డాక్టర్ సాయిసు«దీర్ శనివారం ‘సాక్షి’తో పలు విషయాలు పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ‘వరంగల్‌లో రైలు ప్రమాదం తర్వాత ఒకేసారి మంటల్లో కాలిపోయి కుప్పగా, ముద్దగా మారిన మృతదేహాలను ఇప్పుడే చూస్తున్నా. ఘటన స్థలాన్ని చూడగానే అయ్యో పాపం.. ఏమిటీ దారుణం అని బాధపడ్డాను. కాలిన బస్సు ఎక్కి మృతదేహాలను పరిశీలించాను. బస్సు తగలబడుతున్నప్పుడు ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయాణికులు ఎంతగా ప్రయత్నించారో ఆ దృశ్యాలను చూస్తే అర్థమవుతుంది. ముందున్న తలుపు తెరుచుకోకపోవడంతో వెనుక వైపునకు వెళ్లేందుకు అందరూ ప్రయత్నించినట్లున్నారు.ఇదే సమయంలో వారిని కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, హైడ్రో కార్బన్స్ వంటి విపరీతమైన విష వాయువులు కమ్మేసి ఉంటాయి. ఈ వాయువులు ఒకేసారి పీల్చడం వల్ల అందరూ ఎక్కడికక్కడ స్పృహ తప్పి పడిపోయి ఉంటారు. ఇలా బస్సు మధ్యలో కొందరు, చివరలో కొందరు కుప్పకూలిపోయినట్లు కనిపించారు. అదే సమయంలో వ్యాపించిన మంటలకు వారు ఆహుతై ఉంటారు. ఇలాంటి మంటలు నిమిషాల వ్యవధిలోనే మనిషిని ముద్దగా, బొగ్గుగా మార్చేస్తాయి. దాదాపుగా అన్ని మృతదేహాలకు శరీరంలో కేవలం తల, మొండెం మాత్రమే మిగిలాయి. పుర్రెలు కనిపిస్తున్నా వాటిని ముట్టుకుంటే రాలిపోతున్నాయి. బస్సులో ఇలాంటి దృశ్యాలను చూసి చలించిపోయాను. కొద్దిసేపటి తర్వాత తేరుకుని నా వృత్తి ధర్మాన్ని నెరవేర్చేందుకు ప్రణాళిక వేసుకున్నా. ఏయే ఏర్పాట్లు కావాలో.. అక్కడున్న అధికారులకు వివరించాను. ఇందుకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సహకరించారు. తాత్కాలిక మార్చురీలో పోస్టుమార్టం పోస్టుమార్టం నిర్వహించేందుకు నాతో పాటు ఫోరెన్సిక్ ప్రొఫెసర్ డాక్టర్ పి.బ్రహ్మాజీ మాస్టర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ కె.నాగార్జున, డాక్టర్ పి.హరీష్‌కుమార్, డాక్టర్ వి.సురేఖ, డాక్టర్ ఎండి. మహమ్మద్ సాహిల్‌తో పాటు 10 మంది పీజీలు కలిసి ఆరు బృందాలుగా ఏర్పడ్డాం. ఒక్కొక్కరు మూడు చొప్పున మృతదేహాల చొప్పున పోస్టుమార్టం చేశాం. ప్రమాదం జరిగిన స్థలంలోనే తాత్కాలిక మార్చురీ గదిని ఏర్పాటు చేయించాం. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అక్కడ పోస్టుమార్టం నిర్వహించాం. మరికొన్ని మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీ గదిలో పోస్టుమార్టం నిర్వహించడంతో పాటు డీఎన్ఏ పరీక్ష కోసం నమూనాలు తీశాం. మృతదేహాల్లో కండరాల టిష్యూ, దంతాలు, తొడ ఎముకలను నమూనాలుగా సేకరించాం. మిగిలిన మృతదేహాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి కాబట్టి ఏ మృతదేహం ఎవరిదో గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్ష అనివార్యమైంది. కుటుంబ సభ్యుల డీఎన్ఏతో పోలచ్చి చూసి పోలీసుల సమక్షంలో మృతదేహాలను వారి రక్త సంబం«దీకులకు అప్పగిస్తాం. చాలా మంది శరీరాలు బొగ్గుగా, ముద్దగా, బూడిదగా మారినా, వారి శరీరాలపై ఆభరణాలు మాత్రం అలాగే ఉన్నాయి. ముఖ్యంగా మహిళల మెడల్లో మంగళసూత్రాలు, చేతి గాజులు, చైన్లు వంటివి కాలకుండా కనిపించాయి. బంగారు ఆభరణాలు కరిగిపోవాలంటే ఇంకా ఎక్కువ వేడి అవసరం. -
అర్హత లేకున్నా హెవీ డ్రైవింగ్ లైసెన్స్!
కారెంపూడి: కర్నూలు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున 19 మంది సజీవ దహనానికి కారణమైన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మిరియాల లక్ష్మయ్య అర్హత లేకున్నప్పటికీ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. ప్రమాదం నేపథ్యంలో పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామానికి చెందిన లక్ష్మయ్య కుటుంబ నేపథ్యం, ప్రవర్తన, అలవాట్లపై అధికారులు ఆరా తీశారు. ఈయన 5వ తరగతి వరకే చదువుకున్నాడని, అయితే టెన్త్ ఫెయిల్ అయినట్లు సర్టిఫికెట్ ఇచ్చి, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడని గుర్తించారు.మొదట లారీ క్లీనర్‌గా, తర్వాత డ్రైవర్‌గా పని చేశాడు. 2004లో లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నప్పుడు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి చెట్టుకు ఢీకొనడంతో అప్పట్లో లారీ క్లీనర్ మృతి చెందాడు. ఆ తర్వాత లారీ డ్రైవర్‌గా మానేసి కొన్నాళ్లు ట్రాక్టర్ కొని స్వగ్రామంలో వ్యవసాయం చేశాడు. తర్వాత ట్రావెల్స్ బస్సు డ్రైవర్‌గా ఏడెనిమిదేళ్ల నుంచి వెళ్తున్నాడని తెలిసింది. లక్ష్మయ్య తండ్రి రాములు రెండు నెలల కిందట మృతి చెందాడు. ఇతనికి భార్య, ఓ కుమారుడు, ఓ కుమార్తె, ఒక సోదరుడు, ఇద్దరు అక్కలు ఉన్నారు. లక్ష్మయ్యకు అప్పుడప్పుడు మద్యం సేవించే అలవాటు ఉందని సమాచారం. -
ఓఆర్ఆర్ వద్ద బస్సు ప్రమాదం.. పలువురికి గాయాలు
సాక్షి, హైదరాబాద్: పెద్ద అంబర్‌పేట ఔటర్ రింగ్ రోడ్డు వద్ద శనివారం ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు బోల్తా పడడంతో అందులోని ప్రయాణికులకు గాయాలయ్యాయి. దీంతో ఆంబులెన్స్‌లో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తుండగా బస్సు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. -
డ్రైవర్లు అప్రమత్తం చేస్తే..
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఘోర రోడ్డు ప్రమాదాల జాబితాలో ముందు వరుసలో ఉండేవి రెండు ఘటనలు కాగా..మొదటిది 2013 అక్టోబర్‌లో మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట సమీపంలోని పాలెం గ్రామ శివారులో జరిగింది. జబ్బార్ ట్రావెల్స్ బస్సు కల్వర్టు గోడను ఢీకొని 45 మంది అగ్నికి ఆహుతి అయ్యారు. రెండోది శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు సమీపంలో జరిగిన దుర్ఘటన. ఇవి రెండూ ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండగా జరిగినవి కావడం గమనార్హం. కాగా ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్లు అప్రమత్తంగా వ్యవహరించి ప్రయాణికులను మేల్కొలిపేందుకు ప్రయతి్నస్తే ప్రాణ నష్టం తక్కువగా జరిగేందుకు అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కానీ ఎక్కువ ఘటనల్లో డ్రైవర్లు.. భయంతోనో, ఇతరత్రా కారణాలతోనో బస్సును, ప్రయాణికులను వదిలేసి పరారవుతున్నారు. ప్రమాదం ధాటికి, మంటలకు మేల్కొనే ప్రయాణికులు తేరుకుని ఏం జరిగిందో తెలుసుకునేలోగానే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. గాయపడిన వారిని సకాలంలో రక్షించలేక పోవడం, మంటలు చెలరేగినప్పుడు తప్పించుకునేందుకు అవకాశం లేకపోవడం వంటివి చోటు చేసుకుంటున్నాయని అంటున్నారు. రెండు ఘటనల్లోనూ అంతే..విమాన పైలెట్ల విషయంలో కీలక నిబంధన ఉంది. విమానం ఏదైనా ప్రమాదానికి గురవుతుందనుకున్నప్పుడు.. ముందుగా ప్రయాణికులను, ఆ తర్వాత విమాన సిబ్బందిని రక్షించే కీలక బాధ్యత పైలట్‌ది. వారిని రక్షించే ప్రయత్నం చేసిన తర్వాతనే తనను తాను రక్షించుకునేందుకు యత్నించాలి. ఇది అంతర్జాతీయ ఏవియేషన్ నిబంధన. పైలట్ శిక్షణలో దీనికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. బస్సు డ్రైవర్లు కూడా ఇలాంటి బాధ్యతే నిర్వర్తించాలి. నిబంధనల్లో ప్రత్యేకంగా పొందుపరచనప్పటికీ, డ్రైవింగ్ శిక్షణలో ఈ అంశాన్ని ప్రత్యేకంగా చెప్తారు. పునఃశ్చరణ తరగతుల్లోనూ దీన్ని వివరిస్తారు.కానీ ప్రైవేటు బస్సు డ్రైవర్లకు అసలు శిక్షణే ఉండటం లేదు. పునఃశ్చరణ అనేది వారెప్పుడూ వినని మాట అంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి నిర్లక్ష్యం, అవగాహన లోపమే ఈ రెండు భారీ ప్రమాదాల్లో ఏకంగా 65 మంది ప్రాణాన్ని బలిగొంది. బస్సులు రోడ్డు ప్రమాదానికి గురై మంటలు అంటుకోగానే డ్రైవర్లు వెంటనే బస్సు దిగి పారిపోయారు. కర్నూలు ఘటనలో మంటలకు బస్సు వైరింగ్ వ్యవస్థ దెబ్బతిని తలుపులు తెరుచుకోకపోవటంతో ప్రయాణికులు కిటికీ అద్దాలు పగులగొట్టుకుని బయటకు రావాల్సి వచి్చంది. డ్రైవర్లు పారిపోయేముందు తలుపులు తెరిచి ప్రయాణికులను పెద్దగా అరుస్తూ అప్రమత్తం చేసి ఉంటే చాలామంది ప్రాణాలు దక్కించుకునే అవకాశం ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. లారీ డ్రైవర్లకు బస్సుల అప్పగింత!సాధారణ బస్సులతో పోలిస్తే ఓల్వో, బెంజ్, స్కానియా లాంటి కంపెనీ అధునాతన బస్సులను నడపాల్సిన తీరు వేరుగా ఉంటుంది. ప్రత్యేక శిక్షణ అవసరం. ఆర్టీసీ అలా ప్రత్యేకంగా శిక్షణ ఇచి్చన డ్రైవర్లకు మాత్రమే ఈ బస్సులు అప్పగిస్తోంది. కానీ పలు ప్రైవేటు ట్రావెల్స్ సంస్థలు ఎలాంటి శిక్షణ లేకుండా, లారీలు, ట్రాక్టర్లు నడిపిన వారికి కూడా ఈ బస్సులు ఇస్తున్నాయనే ఆరోపణలున్నాయి. దీంతో కీలక సమయంలో ఎలా వ్యవహరించాలో వీరికి తెలియటం లేదు.తప్పించుకోనీకుండా చేస్తున్న పొగ ప్రమాదం జరిగిన కొన్ని క్షణాలు, నిమిషాల తర్వాత మేల్కొనే ప్రయాణికులు పొగ వల్ల తప్పించుకోలేకపోతున్నారు. బస్సులోకి మంటలు వ్యాపించటం కంటే ముందుగానే దట్టంగా పొగ వ్యాపించడం జరుగుతోంది. మంటలు బస్సు దిగువ భాగం నుంచి వ్యాపిస్తాయి. ప్రయాణికులు ఉండే డెక్ కింద సామాను ఉంచే భాగం ఉంటుంది. ప్రైవేటు బస్సు నిర్వాహకులు ప్రయాణికుల టికెట్ ఆదాయం కంటే అక్రమంగా సరుకు రవాణా చేసేందుకే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇందుకోసం దిగువ భాగంలో ఎక్కువ సామాను ఉంచేలా స్థలం ఏర్పాటు చేసుకుంటున్నారు. దాన్ని రకరకాల సామగ్రితో నింపేస్తున్నారు. మంటలకు అవి కాలిపోయి దట్టమైన పొగ బస్సులోకి క్షణాల్లో వ్యాపిస్తోంది.నిద్రలో ఉంటున్న ప్రయాణికులు ఆ పొగను పీల్చి అస్వస్థతకు గురై స్పృహ కోల్పోతున్నారు. ఎక్కువమంది మృత్యువు పాలవుతున్నారు. ఇక బస్సులో నిబంధనలకు విరుద్ధంగా బెర్తులకు భారీ కర్టెన్లు ఏర్పాటు చేస్తున్నారు. సీట్లకు రెగ్జిన్ కవర్ అమర్చుతున్నారు. ప్రయాణికులకు దిండ్లు, దుప్పట్లు, సీట్ల మీద పరుచుకునేందుకు దుప్పట్లు ఉంచుతున్నారు. ఇవన్నీ మంటల తీవ్రతను పెంచుతున్నాయి. పొగతో ఉక్కిరిబిక్కిరయ్యే ప్రయాణికులను వీటి మంటలు వేగంగా చుట్టుముడుతున్నాయి. -
ఒక్కొక్కరిదీ ఒక్కో దీనగాథ
కర్నూలు (హాస్పిటల్)/ రావులపాలెం/ఇంకొల్లు(చినగంజాం): ఒక్కగానొక్క కుమారుడిని అల్లారుముద్దుగా పెంచుకున్నారు. వారి ఆశలను నెరవేర్చి ఆ యువకుడు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించి కుటుంబానికి తోడుగా నిలబడ్డాడు. బస్సు ప్రమాదం ఆ యువకుడిని కబళించింది. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన సీహెచ్.శ్రీనివాసరావు బ్యాంకులో అప్రెంటిస్‌గా పని చేస్తున్నారు. ఆయనకు భార్య విజయలక్ష్మి, కుమారుడు మేఘనాథ్‌తో పాటు ఒక కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం ఈ కుటుంబం హైదరాబాద్‌లో నివాసం ఉంటోంది. మేఘనాథ్ బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సాధించి కుటుంబానికి అండగా ఉంటున్నాడు. దీపావళి పండుగకు హైదరాబాద్‌కు వచ్చిన మేఘనాథ్.. తిరిగి గురువారం రాత్రి బెంగళూరు బయలుదేరాడు. బస్సు ఎక్కానని రాత్రి 10.30 గంటలకు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పాడు. అవే అతని చివరి మాటలయ్యాయి. అదే అతనికి చివరి పుట్టినరోజు ఒడిశా రాష్ట్రం రాయగఢ్ జిల్లా అంబోదల ప్రాంతానికి చెందిన కె.దీపక్‌కుమార్ (24) బెంగళూరులోని కేపీఎంజీ సంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అతని తండ్రి కె.శ్రీనివాసరావు, తల్లి కె.లీలారాణి ఉద్యోగ రీత్యా ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు. దీపక్‌కుమార్ తన పుట్టిన రోజు 16వ తేదీతో పాటు దీపావళి పండుగను కుటుంబ సభ్యుల మధ్య జరుపుకునేందుకు ఇటీవల హైదరాబాద్ వచ్చాడు. పుట్టిన రోజుతో పాటు పండుగను ఎంతో సంతోషంగా జరుపుకున్నాడు. ఆ ఆనంద క్షణాలను మూట గట్టుకుని బెంగళూరుకు గురువారం రాత్రి పయనమయ్యాడు. తాను బస్సెక్కానని ఇంటికి మెసేజ్ కూడా పెట్టాడు. బస్సు ప్రమాదం అతనికి ఇదే చివరి పుట్టిన రోజుగా మారుస్తుందని ఊహించలేకపోయాడు. తల్లీ కూతురు మృతి హైదరాబాద్‌కు చెందిన చందన బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తోంది. ఆమె ఇటీవల దీపావళి పండుగ కోసం హైదారాబాద్‌కు వచ్చింది. ఎంతో వైభవంగా ఆమె కుటుంబ సభ్యులతో దీపావళి పండుగను జరుపుకుంది. అయితే తిరిగి బెంగళూరుకు వెళ్లేందుకు తల్లి సంధ్యారాణిని కూడా తన వెంట తీసుకెళ్లింది. దీంతో రోడ్డు ప్రమాదంలో బస్సు దగ్ధం కావడంతో ఇద్దరూ విగత జీవులుగా మిగిలారు. మళ్లీ త్వరలో వస్తానంటూ.. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభికి చెందిన చిట్టోజు మేఘనాథ్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. ఆయన తండ్రి శ్రీనివాసాచారి గ్రామంలోని ఐఓబీలో బంగారం తూకం వేసే ఉద్యోగి. మేఘనాథ్ భార్య, ఇద్దరు పిల్లలు హైదరాబాద్‌లో ఉంటున్నారు. వీకెండ్లో మేఘనాథ్ నగరానికి వచ్చి వెళుతుంటాడు. ఇటీవల దీపావళి సెలవులకు వచ్చిన మేఘనాథ్.. బెంగళూరు వెళ్లేందుకు ట్రావెల్స్ బస్సు ఎక్కాడు. బస్సు ఎక్కాక ఇంటికి ఫోన్ చేసి చెప్పాడు. మళ్లీ త్వరలో వస్తానని పిల్లలకూ చెప్పాడు. ఇది జరిగిన కొన్ని గంటలకే మేఘనాథ్ మృత్యు ఒడికి చేరాడని తెలిసి ఆ కుటుంబం రోదన వర్ణనాతీతం. మేఘనాథ్ తల్లిదండ్రులు శ్రీనివాసాచారి, విజయలక్ష్మి, చెల్లి యశ్వని ఘటనా స్థలానికి వెళ్లి గుండెలవిసేలా రోదించారు. వల్లభిలో విషాదం అలుముకుంది. -
కాలిపోతున్నాం.. కాపాడండి..
కర్నూలు (సెంట్రల్): కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు సమీపంలో జాతీయ రహదారి–44పై జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారు చివరి వరకు ప్రాణాలను కాపాడుకోవడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నించారని ప్రత్యక్ష సాక్షులు ఆవేదన వ్యక్తం చేశారు. బైక్‌ను బస్సు ఢీకొట్టి.. అలాగే 300 మీటర్ల మేర బైక్‌ను లాక్కు పోవడంతో తొలుత బస్సు ముందు భాగంలో మంటలు వ్యాపించాయి. దీంతో ముందు ఉన్న వారు బస్సు మధ్యకు వచ్చి ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేయడానికి విఫల యత్నం చేశారు. అంతలో మంటలు అలుము కోవడంతో ఎక్కువ మంది ఒకేచోట గుమికూడి కిందపడి పోయారు. ఈ క్రమంలో ‘కాలిపోతున్నాం.. కాపాడండి.. బయటకు లాగేయండి.. దేవుడా కాపాడు..’ అంటూ ఆర్తనాదాలు చేశారు. వారి అరుపులు బయటకు వినిపిస్తున్నా తాము ఏమీ చేయలేని పరిస్థితి అని అప్పటికే బస్సులోంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్న వారు తెలిపారు. తొలుత మంటలను అదుపు చేయడానికి నీళ్ల బాటిళ్లతో డ్రైవర్ ప్రయత్నం చేశాడని, అలా కాకుండా ఆయన ఎమర్జెన్సీ డోర్లను బద్దలు కొట్టి ఉంటే మరింత మంది ప్రాణాలతో బయటపడే వారని చెప్పారు.పెద్ద కుదుపు రావడంతో ఒక్కసారిగా లేచాం మాది కర్ణాటకలోని బసవ కల్యాణం. పనిపై హైదరాబాద్ వెళ్లి తిరిగి వెళ్తున్నాను. అర్ధరాత్రి 2.30 – 2.40 గంటల మధ్య ప్రమాదం జరిగింది. అందరూ నిద్రలో ఉన్నారు. అయితే ఒక్కసారిగా పెద్ద కుదుపు రావడంతో చాలా మంది నిద్ర లేచారు. నేనూ అప్పుడే లేచాను. ఏమి జరిగిందోనని చూసుకునేలోపే మంటలు వచ్చాయి. ఎమర్జెన్సీ విండోలు తెరుచుకొని వెళ్లాలని డ్రైవర్ అరిచాడు. వెంటనే నేను ముందుకు వెళ్లి డ్రైవర్ సీటులో నుంచి కిందకు దూకేశాను. – ఆకాష్, బస్సులో నుంచి ప్రాణాలతో బయటపడిన వ్యక్తి కాపాడండని అరుపులు వినిపించాయి ఒక్కసారిగా బాంబు పడ్డట్లు పెద్ద శబ్దం వినిపించడంతో రోడ్డు వైపు చూశాను. కొద్ది దూరంలో బస్సు మంటల్లో తగలబడిపోతూ కనిపించింది. పరుగెత్తుకుంటూ దగ్గరకు వెళ్లాను. అయితే పెద్ద ఎత్తున మంటలు వస్తుండడంతో ఏమీ చేయలేకపోయాను. బస్సులో నుంచి కాపాడండి.. మంటల్లో కాలిపోతున్నామని కేకలు వినిపించాయి. ఆడోళ్ల గోడు చెవులారా విన్నాను. అయినా ఏమీ చేయలేని పరిస్థితి. నా జీవితంలో ఇలాంటి ఘటనను చూడలేదు. – మల్లికార్జున, నాయకల్లు (ఘటన స్థలికి సమీపంలోని కేఫ్‌లో సెక్యూరిటీ గార్డు) ఫైర్ ముందు నుంచి వచ్చింది బస్సులో ప్రయాణం చేస్తున్న సమయంలో 2.30 గంటలప్పుడు బస్సు ముందు నుంచి ఫైర్ వచ్చింది. దీంతో అందరూ వెనక్కి వెళ్లారు. ఎమర్జెన్సీ డోర్ తెరచుకోకపోవడంతో వెనక డోర్‌ను పగలగొట్టే ప్రయత్నం చేశారు. నేను మధ్యలో ఉన్న గ్లాస్‌ను పగలగొట్టి దూకేశాను. బెంగళూరుకు ఇంటర్వ్యూ కోసం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. – అశ్విన్, హైదరాబాద్, కూకట్పల్లికళ్ల ముందే కాలిపోయారు బస్సు కళ్ల ముందే కాలిపోయింది. ఆ సమయంలో నేను మెలకువగా ఉండడంతో డ్రైవర్ సీటు నుంచి కిందకు దూకేశాను. నేను దూకిన తర్వాత ఒక్కసారిగా పెద్ద శబ్ధం వచి్చంది. ఆ తర్వాత మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. ఆర్పాలన్నా ఏమి చేయలేని పరిస్థితి. కాపాడాలని కేకలు వినిపించాయి. ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. ఈ పరిస్థితి శత్రువులకు కూడా రాకూడదు. – జయంత్ కుశ్వాల్, హైదరాబాద్ -
మృత్యుశకటం
బస్సు డ్రైవర్ చేసిన తప్పు 19 మంది సజీవ దహనానికి కారణమైంది! నిద్రలో ఉన్న వారిని శాశ్వత నిద్రలోకి పంపింది. కొన్ని కుటుంబాలను చిదిమేసి శాశ్వత చీకట్లు నింపింది. ఘటనా స్థలిని చూసిన వారి కంట నీరు తెప్పించింది. కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారు జామున జరిగిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదం తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ దేశాన్ని కలచి వేసింది. నిమిషాల వ్యవధిలో కొన్ని కుటుంబాలు, కొన్ని కుటుంబాల పెద్ద దిక్కులు, భవిష్యత్ ఆశలు అగ్నికీలలకు ఆహుతయ్యాయి. ప్రయాణికుల ఆర్తనాదాలు,చావు కేకలతో ఎన్హెచ్ృ44 భీతిల్లింది. మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా బొగ్గు, మసిగా మారాయి. ఈ భీతావహ ఘటన స్లీపర్ బస్సు ప్రయాణాలపై మరోమారు పెద్ద చర్చనే లేవనెత్తింది.సాక్షి ప్రతినిధి కర్నూలు/ కర్నూలు (హాస్పిటల్): హైదరాబాద్ నుంచి గురువారం రాత్రి బెంగళూరుకు బయలు దేరిన వేమూరి కావేరి ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్ కోచ్ (స్కానియా) బస్సు (డీడీ 01ఎన్9490) శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు సమీపంలో ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఏకంగా 19 మంది సజీవ దహనమయ్యారు. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు ఘటన వివరాలు ఇలా ఉన్నాయి... మొత్తం 44 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లతో హైదరాబాద్‌లో బయలుదేరిన బస్సు శుక్రవారం తెల్లవారుజామున 2.14 గంటలకు కర్నూలు సమీపంలోని పుల్లూరు టోల్ ప్లాజా దాటింది. 2.30 గంటలకు టాయిలెట్ కోసం కర్నూలులో ఆపారు. కొంత మంది మాత్రమే బస్సు దిగారు. మిగిలిన వారంతా గాఢనిద్రలో ఉన్నారు. ఆ తర్వాత బయలుదేరిన బస్సు చిన్నటేకూరు దాటగానే 2.45 గంటలకు ఓ బైక్‌ను ఢీకొంది. బైక్‌పై ప్రయాణిస్తున్న శివశంకర్ అనే యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. అయితే ప్రమాదం తర్వాత కూడా ఆపకుండా డ్రైవర్ బస్సును ముందుకు నడిపాడు. ఇదే పెను ప్రమాదానికి కారణమైంది. ఆ సమయంలో బస్సు 100 కిలోమీటర్ల వేగంతో వెళుతోంది. బైక్‌ను ఢీకొట్టిన తర్వాత ముందుకు వెళ్లిపోతే ప్రమాదం తమపైకి రాదని భావించిన డ్రైవర్ బస్సును వేగంగా నడిపారు. శివశంకర్ రోడ్డు పక్కన పడిపోయాడు. బైక్ మాత్రం బస్సు కింద ఇరుక్కుపోయింది. దీంతో బస్సు బైక్‌ను 300 మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ఆ రాపిడికి మంటలు రేగాయి. ఈ క్రమంలో బైక్ పెట్రోల్ ట్యాంకు పగిలిపోయి మంటలు చెలరేగాయి. బస్సు ఎడమ వైపు డోర్ల భాగంలో మంటలు కనిపించాయి. అప్పుడు డ్రైవర్ బస్సును ఆపాడు. డ్రైవర్ లక్ష్మయ్యతో పాటు మరో డ్రైవర్ వాటర్ బాటిళ్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఈలోపు ముందు భాగంతోపాటు బస్సు మధ్య భాగంలో కూడా మంటలు వ్యాపించాయి. బైక్‌ను ఢీకొట్టడంతో బస్సు డోర్‌లోని సెన్సార్ వైర్లు తెగిపోయాయి. దీంతో డోర్ పూర్తిగా లాక్ అయి తెరుచుకోలేదు. దీంతో డ్రైవర్లు భయపడి ప్రాణాలు కాపాడుకునేందుకు బస్సులోంచి దూకేశారు. మంటల ధాటికి దట్టమైన పొగ బస్సు మొత్తం కమ్ముకుంది. ఒకరి ముఖం మరొకరికి కన్పించని పరిస్థితి. పొగ, మంటల ధాటికి ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఊపిరాడక ఆర్తనాదాలు పెట్టారు. క్షణాల్లో మంటలు డోర్ కర్టన్లు, బెడ్షీట్లు, బెడ్లకు అంటుకుని అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. కొందరు మాత్రం బస్సు అద్దాలు పగులగొట్టి కిందకు దూకి గాయాలతో బయటపడ్డారు. తక్కిన వారు ప్రమాదం నుంచి తప్పించుకోలేక అగ్నికి ఆహుతయ్యారు. బస్సు మొత్తం నిమిషాల వ్యవధిలో పూర్తిగా దగ్ధమైంది. జాతీయ రహదారిపై వెళుతున్న వాహనదారులు ప్రమాద ఘటనను వీడియో, ఫొటోలు తీసి పోలీసు అధికారులకు పంపారు. దీంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్‌తో మంటలను అదుపు చేశారు. డ్రైవర్లు సహా 27 మంది ప్రయాణికులు సురక్షితం హైదరాబాద్‌లో బస్సు ఎక్కడానికి 40 మంది టికెట్ బుక్ చేసుకున్నారు. వీరిలో ఒకరు వ్యక్తిగత కారణాలతో ప్రయాణం రద్దు చేసుకోవడంతో బస్సు ఎక్కలేదు. మిగతా 39 మందితోపాటు నలుగురు చిన్న పిల్లలు ఉన్నారు. ఈ లెక్కన 43 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆపై హైదరాబాద్ శివారు ప్రాంతం ఆరంఘర్‌లో టికెట్ ముందుగా బుక్ చేసుకోని ఒకరు బస్సు ఎక్కారు. ఇద్దరు డ్రైవర్లతో కలిపి బస్సులో 46 మంది ఉన్నారు. వీరిలో ఒకరు మాత్రమే కర్ణాటకలోని బాగేపల్లిలో బస్సు దిగాల్సి ఉంది. మిగతా వారంతా బెంగళూరుకు వెళ్లాల్సిన వారే. వీరిలో ప్రమాదం తర్వాత 27 మంది ప్రాణాలతో బయట పడ్డారు. ప్రమాద సమయంలో అద్దాలు ధ్వంసం చేసి దూకడంతో పాదాలు, కాళ్లకు గాయాలయ్యాయి. కొంత మందికి తలపై కూడా చిన్నచిన్న గాయాలయ్యాయి. వీరిలో 23 మంది పెద్దవాళ్లు, ఇద్దరు పిల్లలు కాగా.. మరో ఇద్దరు డ్రైవర్లు. తక్కిన 19 మంది చనిపోయారు. మృతుల్లో 17 మంది పెద్దలు, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. క్షతగాత్రులను పోలీసులు 108లో కర్నూలు జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఇంకొందరు కర్నూలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరికొందరు గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డారు. బస్సు ప్రమాద ఘటనపై కేసు నమోదు కర్నూలు సమీపంలోని కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద వేమూరి కావేరి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనపై ఉలిందకొండ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రయాణికుడు రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బస్సు యాజమాన్యంపై 125 (ఎ), 106 (1) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఉలిందకొండ పీఎస్ ఎస్ఐ ధనుంజయ తెలిపారు. బస్సు డ్రైవర్లు శివనారాయణ, మిరియాల లక్ష్మయ్యను అదుపులోకి తీసుకుని ప్రమాద ఘటనకు దారితీసిన కారణాలపై విచారిస్తున్నారు. పనికి వెళ్లొస్తానని అటే వెళ్లిపోయాడు..అమ్మా డోన్ వద్ద పని ఉందంట. మాట్లాడుకుని మళ్లీ వస్తానని రాత్రి పోయినోడు మళ్లీ రాకుండానే పోయినాడు...అంటూ ఆ తల్లి గంటల తరబడి మార్చురీ వద్ద విలపిస్తున్న దృశ్యం కంటతడి పెట్టిస్తోంది. కర్నూలు జిల్లా కర్నూలు మండలం బి.తాండ్రపాడుకు గ్రామానికి చెందిన నాగన్న కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు. ఆయన భార్య యశోదమ్మ ఇద్దరు కుమారులను పెంచి పెద్ద చేసింది. ఇందులో పెద్దవాడైన శ్రీహరి గౌండా పనిచేస్తుండగా చిన్నవాడైన శివశంకర్ గ్రానైట్ పనులకు వెళ్లేవాడు. శివశంకర్ ఎప్పటిలాగే గురువారం రాత్రి కూడా డోన్ వద్ద పని ఉందని మాట్లాడుకుని వస్తానని వెళ్లాడు. ఆ తర్వాత మళ్లీ తల్లికి ఫోన్ చేయలేదు. ఉదయం లేచే సరికి బైక్‌పై వెళుతూ బస్సు కింద పడి శివశంకర్ మృతిచెందాడని పోలీసులు చెప్పడంతో ఆ తల్లి గుండెలవిసేలా విలపించింది. అద్దాలు పగలగొట్టినా బయటకు రాలేని పరిస్థితి స్లీపర్ కోచ్ బస్సులో లోయర్, అప్పర్ బెర్త్‌లు ఉన్నాయి. అప్పర్ బెర్త్‌లో ఉన్నవారు అద్దాలు పగలగొట్టి సులభంగా బయటకు దూకారు. గాయాలతో బయటపడ్డారు. అప్పర్ బెర్త్ అద్దాలు ధ్వంసం చేస్తే బయటకు దూకేయొచ్చు. కానీ లోయర్ బెర్త్‌లో అద్దాలు ధ్వంసం చేసినా, ఐరన్ యాంగ్లర్లు అడ్డుగా ఉన్నాయి. దీంతో మనిషి దూరలేని పరిస్థితి! అప్పర్ బెర్త్ లాగే, లోయర్ బెర్త్‌లు కూడా ఉండి ఉంటే అద్దాలు ధ్వంసం చేసి ఇంకొందరు కిందకు దూకి ప్రాణాలతో బయట పడే అవకాశం ఉండేది. గుర్తుపట్టలేని విధంగా మృతదేహాలు తెల్లవారుజామున 3.30 గంటలకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ట్రాఫిక్‌ను మళ్లించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఇతర పోలీసులు బస్సును పరిశీలించారు. ఇనుప కడ్డీలు మినహా బస్సులో ఏమీ మిగల్లేదు. నల్లటి మసి దిబ్బలు మాత్రమే కన్పించాయి. తెల్లవారిన తర్వాత కలెక్టర్ సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్లా, డీఐజీ కోయ ప్రవీణ్‌తో పాటు వైద్యాధికారులు, ఫోరెన్సిక్ నిపుణులు వచ్చారు. వీరి సమక్షంలో బూడిదను తొలగించి.. నల్లగా బొగ్గులా మారిన మాంసపు ముద్దలను అతి కష్టం మీద వెలికి తీశారు. మొత్తం 19 మృతదేహాలను ప్రత్యేక టెంట్లో ఉంచారు. వాటి నుంచి ఫోరెన్సిక్ అధికారులు డీఎన్ఏ పరీక్షల కోసం శాంపిల్స్ తీసుకున్నారు. మృతదేహాలకు వైద్యులు అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. ఆ తర్వాత మృతదేహాలను కర్నూలు జనరల్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. 14 మంది మృతుల కుటుంబ సభ్యుల డీఎన్ఏ శాంపుల్స్ కూడా వైద్యులు సేకరించారు.బస్సు ఆపి ఉంటే ప్రమాదం తప్పేది బస్సు బైక్‌ను ఢీకొట్టిన వెంటనే నిలిపేసి ఉంటే అసలు ప్రమాదమే జరిగేది కాదు. బైక్‌పై ప్రయాణించే శివశంకర్ మాత్రమే చనిపోయేవాడు. అయితే, ప్రమాదం తమపైకి రాకుండా ఉండేందుకు డ్రైవర్ లక్ష్మయ్య బస్సును అదే వేగంతోనే నడిపాడు. దీంతో బైక్ బస్సు కింద ఇరుక్కుపోవడం, 300 మీటర్ల మేర రోడ్డుకు రాపిడికి గురై పెట్రోలు ట్యాంకు పగలడం, మంటలు చెలరేగి బస్సుకు వ్యాపించడంతో పెను ప్రమాదం సంభవించింది. కాగా, బస్సు ప్రమాద ఘటన అధికారులతో పాటు అందరినీ తీవ్రంగా కలచి వేసింది. నేషనల్ హైవేపై అటు, ఇటు వెళ్లే వాహనదారులు బస్సును, అందులో బూడిదైన మృతదేహాలను చూసి దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఫోరెన్సిక్ అధికారులు, పోలీసులు మృతదేహాలను వెలికి తీసి మాంసం ముద్దలను పక్కనే టెంట్‌లోకి తీసుకెళుతున్న దృశ్యాలను చూసి ఘటనాస్థలిలోని వ్యక్తులు చలించిపోయారు. పలువురు కన్నీరు పెట్టుకున్నారు. ఓ మహిళ మృతదేహంపై మంగళసూత్రం దండ కనిపించింది. బస్సు ప్రమాదం నుంచి బయటపడ్డ వారి వివరాలు 1. అశ్విన్‌రెడ్డి, హైదరాబాద్– కర్నూలు జీజీహెచ్‌లో చికిత్స 2. ఎం.సత్యనారాయణ, ఖమ్మం– కర్నూలు జీజీహెచ్‌లో చికిత్స 3. జి.సుబ్రహ్మణ్యం, కాకినాడ– కర్నూలు అశ్విని హాస్పిటల్లో చికిత్స 4. గుణసాయి, హైదరాబాద్– కర్నూలు జీజీహెచ్‌లో చికిత్స 5. ఆండోజు నవీన్‌కుమార్, హైదరాబాద్– కర్నూలు జీజీహెచ్‌లో చికిత్స 6. నేలకుర్తి రమేష్, నెల్లూరు– గాయాలు లేకపోవడంతో బంధువుల ఇంట్లో బస 7. శ్రీలక్ష్మి, నెల్లూరు– గాయాలు లేకపోవడంతో బంధువుల ఇంట్లో బస 8. వేణు గుండ, ప్రకాశం జిల్లా– బెంగళూరు వెళ్లిపోయారు 9. శ్రీహర్ష, నెల్లూరు– కర్నూలు జీజీహెచ్ నుంచి డిశ్చార్జ్ 10. శివ, బళ్లారి–బెంగళూరు వెళ్లిపోయారు 11. గ్లోరియా ఎల్సాశామ్ కేరళ– బెంగళూరు వెళ్లిపోయారు 12. ఎంజి. రామరెడ్డి, తూర్పుగోదావరి– హైదరాబాద్ వెళ్లిపోయారు 13. జయసూర్య, హైదరాబాద్– కర్నూలు జీజీహెచ్‌లో చికిత్స 14. ఉమాపతి, హైదరాబాద్–బెంగళూరు వెళ్లిపోయారు 15. పంకజ్, బీదర్– పోలీస్ స్టేషన్లో ఉన్నారు 16. చరిత్, హైదరాబాద్– బెంగళూరు వెళ్లారు 17. హారిక, బెంగళూరు– కర్నూలు జీజీహెచ్‌లో చికిత్స 18. కీర్తి, హైదరాబాద్– హైదరాబాద్ వెళ్లారు 19. వేణుగోపాల్‌రెడ్డి, శ్రీసత్యసాయి జిల్లా– హిందుపురం వెళ్లారు 20. ఆకాష్, బీదర్– కర్నూలులో ఉన్నారు 21. మహమ్మద్ ఖైజర్, బెంగళూరు– బెంగళూరు వెళ్లారు 22. జయంత్ కుశ్వల, హైదరాబాద్– కర్నూలులో ఉన్నారు 23. కె.అశోక్, రంగారెడ్డి జిల్లా– కర్నూలు జీజీహెచ్ నుంచి డిశ్చార్జ్ 24. జశ్విత, నెల్లూరు– కర్నూలులో బంధువుల ఇంట్లో బస 25. అఖీర, నెల్లూరు– కర్నూలులో బంధువుల ఇంట్లో బస 26. మిర్యాల లక్ష్మయ్య (డ్రైవర్)– పల్నాడు జిల్లా27. శివనారాయణ (డ్రైవర్)– ప్రకాశం జిల్లాకంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించడంతోపాటు సహాయం కోసం కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. కర్నూల్ కలెక్టరేట్ 08518277305 కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి 9121101059, 9494609814, 9052951010 ఘటనాస్థలం 9121101061 పోలీసు కంట్రోల్ రూమ్ 9121101075మృతుల వివరాలుపేరు రాష్ట్రం 1. జి.ధాత్రి (27) పూనూరు, బాపట్ల, ఏపీ 2. జి.రమేష్ (31)3. అనూష (28) 4.శశాంక్ (7) 5.మన్విత (4) 6. కె. శ్రీనివాసరెడ్డి (39) రావులపాలెం ,ఆంధ్రప్రదేశ్ 7. చందన (23) తెలంగాణ8.సంధ్యారాణి (43) తెలంగాణ 9. అనూష (22) తెలంగాణ 10. గిరిరావు (48) తెలంగాణ 11.ఆర్గా బండోపాధ్యాయ(32) తెలంగాణ12. మేఘనాథ్ (25) తెలంగాణ13. ఫిలోమన్ బేబీ(64) కర్ణాటక14. కిషోర్‌కుమార్(41) కర్ణాటక15. ప్రశాంత్(32) తమిళనాడు16.యువన్ శంకర్‌రాజ్(22) తమిళనాడు 17. కె.దీపక్‌కుమార్ (24) ఒడిశా 18.అమృత్‌కుమార్ (18) బిహార్ 19.గుర్తు తెలియని వ్యక్తి (50) (ఆరంఘర్ వద్ద బస్ ఎక్కాడు) 20 శివశంకర్ (23, బైక్‌పై వెళ్తున్న వ్యక్తి) బి.తాండ్రపాడు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్రాష్ట్రాల వారీగా మృతుల సంఖ్యఆంధ్రప్రదేశ్ 7 తెలంగాణ 6 కర్ణాటక 2 తమిళనాడు 2 బిహార్ 1 ఒడిశా 1 గుర్తుతెలియని వ్యక్తి 1 -
Kurnool: శభాష్ రమేష్.. మంటల మధ్య ఆరుగురి ప్రాణాలు కాపాడిన రియల్ హీరో!
సాక్షి,కర్నూలు: హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు గురువారం అర్ధరాత్రి తర్వాత కర్నూలు శివారులో ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలి బూడిదైపోయింది. అత్యంత విషాదకరంగా 19 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాద సమయంలో బస్సులో ఉన్న రమేష్ అనే వ్యక్తి తన తోటి ఆరుగురు ప్రయాణికుల్ని ప్రాణాలకు తెగించి కాపాడాడు. ప్రమాద సమయంలో బస్సులో మంటలు చెలరేగి, చుట్టూ వ్యాపించాయి. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా హాహాకారాలు చేస్తూ బస్సులో చిక్కుకుపోయారు. బయట నుంచి సహాయం అందించేందుకు వీలుకాలేదు. అప్పుడే నేనున్నాంటూ బస్సులో రమేష్ అనే ప్రయాణికుడు ప్రాణాలకు తెగించాడు. బస్సు అద్దం పగలగొట్టి తనతో పాటు మరో ఆరుగురిని బయటకు రప్పించాడు. ఈ విషయాన్ని ప్రమాదం జరిగిన సమయంలో హిందూపురం నుంచి నంద్యాలకు వెళ్తున్న ప్రత్యక్ష సాక్షి మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో నేను హిందూపురం నుంచి నంద్యాలకు నా కారులో వెళ్తున్నా. అద్దలు పగలగొట్టుకుని బయటకు వస్తున్న ఆరుగురు ప్రయాణికుల్ని నా కారులో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించా. మంటలు వ్యాపిస్తుంటే బస్సు లోపల రమేష్ అనే వ్యక్తి అద్దాలు పగలగొట్టి ప్రయాణికుల ప్రాణాల్ని కాపాడారు. ఆస్పత్రికి చికిత్స పొందుతున్న రమేష్‌తో పాటు మిగిలిన ప్రయాణికులు క్షేమంగా ఉన్నారు. బస్సు చుట్టూ మంటలు అంటుకున్నాయి. లోపలి నుంచి బయటకు వచ్చేందుకు.. బయట నుంచి బస్సు లోపలికి వెళ్లి ప్రయాణికుల్ని కాపాడేందుకు వీలు లేదు’ అని పేర్కొన్నారు. సదరు హిందూపురం నివాసి సైతం ప్రమాదంలో గాయపడ్డ ప్రయాణికుల్ని సకాలంలో ఆస్పత్రికి తరలించారు. వైద్యం అందడంతో వారి ప్రాణాలతో బయటపడ్డారు. ఈ వ్యక్తి కూడా ప్రాణదాతగా నిలిచి ప్రశంసలందుకుంటున్నాడు. ఆరుగురి ప్రాణాలను కాపాడిన రమేష్ అనే ప్రయాణికుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. View this post on Instagram A post shared by Jana Varahi Media | Pawankalyan | Janasena (@jana_varahi_media) -
Kurnool: మరో ప్రమాదం.. బస్సును తొలగిస్తుండగా క్రేన్ బోల్తా
సాక్షి,కర్నూలు: కర్నూలు జిల్లా బస్సు ప్రమాదంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శుక్రవారం సాయంత్రం ప్రమాదానికి కారణమైన బస్సును రోడ్డుపై నుంచి తొలగిస్తుండగా క్రేన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో క్రేన్ ఆపరేటర్‌కు గాయాలయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు,పోలీసులు క్రేన్ ఆపరేటర్‌ను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న కావేరి ట్రావెల్ బస్సు కర్నూల్ జిల్లా చిన్నటేకూరు వద్ద అగ్ని ప్రమాదానికి గురైంది. ఆ బస్సు పల్సర్ బైక్‌ను ఢీకొట్టి మంటలు జరిగాయి. ప్రమాదం జరిగిన తర్వాత బస్సు ఆగకుండా 300 మీటర్లు ముందుకు ఈడ్చుకుని వెళ్లడంతో ఘోరం జరిగింది.బస్సులో ప్రయాణిస్తున్న వారిలో 19మంది మరణించినట్లు ఏపీ హోంమంత్రి అనిత అధికారికంగా ప్రకటించారు. -
కర్నూలు బస్సు ప్రమాదం: ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికుల వివరాలు
సాక్షి,కర్నూలు : కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద శుక్రవారం తెల్లవారు జామున ఘోర బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు (నంబర్ DD01 N9490) కర్నూలు ప్రజానగర్‌కు చెందిన శంకర్ పల్సర్ బైక్ ఢీకొట్టింది. బైక్ ఢీకొట్టిన తర్వాత బస్సు దాదాపు 300 మీటర్లు లాక్కెళ్లింది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు బస్సు మొత్తాన్ని చుట్టుముట్టాయి. ప్రయాణికులు తేరుకునేలోపే భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. కర్నూలు జిల్లా బస్సు ప్రమాద ఘటనలో గాయపడిన,సురక్షితంగా ఉన్న ప్రయాణికుల వివరాలు :బస్సు ప్రమాద ఘటనలో మృతుల వివరాలు:1. జె. ఫిలోమిన్ బేబీ (64)2. కిషోర్ (64)3. ప్రశాంత్ (32)4. ఆర్గా బందోపధ్యాయ (23)5. యువన్ శంకర్ రాజా (22)6. మేఘనాథ్ (25)7. ధాత్రి (27)8. అమృత్ కుమార్ (18)9. చందన మంగ (23)10. అనూష (22)11. గిరి రావు (48)12. కేనుగు దీపక్ కుమార్ (24)13. జి. రమేష్ 14. జి అనూష 15. మనిత16. కేశనాథ్ 17. సంధ్యారాణి 18. కర్రీ శ్రీనివాస రెడ్డి 19. పంచాల శివశంకర్ (ద్విచక్ర వాహనదారుడు) 20. బస్సు ప్రమాద ఘటనలో మృతి చెందిన ఒకరి పేరు తెలియాల్సి ఉంది.సురక్షితంగా ఉన్న ప్రయాణికులు:శ్రీలక్ష్మి, జస్విత (8), అభీరా (1.8) కపర్ అశోక్ (27) అశ్విన్ రెడ్డి ఆకాశ్ జయంత్ కుశ్వాల్ – మధ్యప్రదేశ్ (హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు)పంకజ్ ప్రజాపతి శివా గ్లోరియా ఎల్సా సామ్ – బెంగళూరుచారిత్ (21) మొహమ్మద్ ఖిజర్ (51) తరుణ్ (27) – బస్సులో ఎక్కకముందే ప్రయాణం రద్దు చేసుకున్నారుగాయపడిన ప్రయాణికులు:మన్నెంపల్లి సత్యనారాయణ (27), తండ్రి ఎం. రవి – సత్తుపల్లి, ఖమ్మం జిల్లాబడంత్ర జయసూర్య (24), తండ్రి సుబ్బరాయుడు – మియాపూర్, హైదరాబాద్అండోజ్ నవీన్ కుమార్ (26), తండ్రి కృష్ణాచారి – హయత్‌నగర్, హైదరాబాద్సరస్వతి హారిక (30), తండ్రి రంగరాజు – బెంగళూరునెలకుర్తి రమేష్ (36) – దత్తలూరు మండలం, నెల్లూరు జిల్లాముసలూరి శ్రీహర్ష (25) – నెల్లూరు జిల్లాపునుపట్టి కీర్తి (28) – ఎస్.ఆర్. నగర్, హైదరాబాద్వేణుగోపాల్ రెడ్డి (24) – తెలంగాణఎం.జి. రామరెడ్డి – తూర్పు గోదావరి జిల్లాఘంటసాల సుబ్రమణ్యం – కాకినాడ, ఆంధ్రప్రదేశ్గుణ సాయి – తూర్పు గోదావరి జిల్లా డ్రైవర్ల వివరాలు 1.లక్ష్మయ్య, పల్నాడు జిల్లా – ప్రధాన డ్రైవర్. సంఘటన సమయంలో బస్సు నడుపుతున్నారు. ప్రమాదం తర్వాత సంఘటనా స్థలం నుంచి పారిపోయారనే వార్తలు వచ్చాయి. ప్రస్తుతం లక్ష్మయ్య పోలీసుల అదుపులో ఉన్నారు. 2.శివనారాయణ, ప్రకాశం జిల్లా – స్పేర్ డ్రైవర్. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నారు. విచారణ కొనసాగుతోంది.ప్రయాణికుల రాష్ట్రాలవారీగా: • తెలంగాణ రాష్ట్రం – 6 • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం – 11 • మధ్యప్రదేశ్ – 1 • కర్ణాటక రాష్ట్రం – 4మరో ముగ్గురు ఏ రాష్ట్రానికి చెందినవారు తెలియాల్సి ఉంది. -
కర్నూలు బస్సు ప్రమాదం.. మరణాలపై హోంమంత్రి అనిత అధికారిక ప్రకటన
సాక్షి,అమరావతి: హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు గురువారం అర్ధరాత్రి దాటాక కర్నూలు శివారులో ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మరణాలపై ఏపీ హోంమంత్రి అనిత అధికారిక ప్రకటన చేశారు.(Kurnool Bus Fire Accident)కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో హోంమంత్రి అనిత మాట్లాడుతూ..‘వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 19మంది మృతి చెందగా.. 27మంది ప్రాణాలతో బయటపడ్డారు. గాయపడ్డ ఆరుగురిలో ముగ్గురికి ప్రాక్చర్లు అయ్యాయి. ప్రమాదం ఎలా జరిగిందో తేల్చేందుకు నాలుగు బృందాలు పనిచేస్తున్నాయి. మృతదేహాలను గుర్తించేందుకు 16మంది ఫోరెన్సిక్ నిపుణులను ఏర్పాటు చేసినట్లు’ వెల్లడించారు. -
కర్నూలు ప్రమాదం.. ఇద్దరు ఐటీ ఉద్యోగులు మృతి
సాక్షి, హైదరాబాద్: కర్నూలులో(Kurnool Bus Fire Accident) జరిగిన బస్సు ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. బెంగళూరు వెళ్తున్న వేమురి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు మృతిచెందారు. వారిని ఏపీకి చెందిన గన్నమనేని ధాత్రి (27), తెలంగాణకు చెందిన అనూషరెడ్డిగా గుర్తించారు.వివరాల ప్రకారం.. ఏపీలోని బాపట్ల జిల్లా యద్ధనపూడి మండలం పూసపాడుకు చెందిన గన్నమనేని ధాత్రి (27), తెలంగాణలోని యాదాద్రి జిల్లా గుండాల మండలం వస్తకొండూరుకు చెందిన అనూషరెడ్డి.. వీరిద్దరూ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. ధాత్రి ఇటీవల హైదరాబాద్‌లోని మేనమామ ఇంటికి వచ్చారు. అక్కడి నుంచి బెంగళూరు వెళ్లేందుకు గురువారం రాత్రి వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఎక్కి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.అదే బస్సులో అనూషరెడ్డి కూడా వెళ్లారు. దీపావళికి స్వగ్రామానికి వచ్చిన ఆమె గురువారం రాత్రి బెంగళూరుకు బయల్దేరారు. ఖైరతాబాద్‌లో అనూషరెడ్డి బస్సు ఎక్కి ఈ దుర్ఘటనలో మృతిచెందారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ల మృతితో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. అనూష మృతితో ఆమె తల్లిదండ్రులు కన్నీమున్నీరవుతున్నారు.ఇదిలా ఉండగా.. వేమురి కావేరి ట్రావెల్స్(vemuri Kaveri Travels) బస్సు ప్రమాదం బాధితులకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో కర్నూల్ బస్సు ప్రమాదంలో మరణించిన తెలంగాణ పౌరులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా.. గాయపడిన క్షతగాత్రులకు రెండు లక్షల రూపాయలు ఇవ్వనున్నట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కర్నూలు ప్రమాదంలో బైకర్ సహా 20 మంది ప్రయాణీకులు మృతి చెందిన విషయం తెలిసిందే. -
కర్నూలు ప్రమాదం: ప్రయాణికుల వివరాలు ఇవిగో..
సాక్షి, కర్నూలు: కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైకర్ సహా 20 మంది ప్రయాణికులు మృతి చెందారు. కాగా, హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమురి కావేరి ట్రావెల్స్ బస్సు కర్నూలు శివారు చిన్నటేకూరులో జాతీయ రహదారి 44పై అగ్ని ప్రమాదానికి గురైంది. బైక్, బస్సు ఢీకొన్న కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైకర్ శివశంకర్ మృతి చెందాడు. ఇక, బస్సులు ప్రయాణించిన వారి జాబితా ఇలా ఉంది. బస్సు ప్రయాణికుల జాబితా ఇదే.. అశ్విన్‌రెడ్డి(36),జి.ధాత్రి(27),కీర్తి(30)పంకజ్(28), యువన్ శంకర్రాజు(22)తరుణ్(27), ఆకాశ్(31),గిరిరావు(48),బున సాయి(33), గణేశ్(30), జయంత్ పుష్వాహా(27)పిల్వామిన్ బేబి(64),కిశోర్ కుమార్(41)రమేష్, అతని ముగ్గురు కుటుంబ సభ్యులురమేష్(30), అనూష(22), మహ్మద్ ఖైజర్(51), దీపక్ కుమార్ 24అన్డోజ్ నవీన్‌కుమార్(26), ప్రశాంత్(32)ఎం.సత్యనారాయణ(28), మేఘనాథ్(25)వేణు గుండ(33), చరిత్(21), చందన మంగ(23)సంధ్యారాణి మంగ(43), గ్లోరియా ఎల్లెస శ్యామ్(28)సూర్య(24)హారిక(30), శ్రీహర్ష(24)శివ(24), శ్రీనివాసరెడ్డి(40), సుబ్రహ్మణ్యం(26)కె.అశోక్(27),ఎం.జి.రామారెడ్డి(50)ఉమాపతి(32), అమృత్ కుమార్(18), వేణుగోపాల్‌రెడ్డి(24).ప్రమాదం నుంచి తప్పించుకున్న 21 మంది వివరాలు.. -
కర్నూలు బస్సు ప్రమాదం.. మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: కర్నూలులో చోటుచేసుకున్న కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బస్సులపై ప్రతీరోజు రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపడితే వేధింపులు అంటున్నారు. అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం అని వ్యాఖ్యలు చేశారు.మంత్రి పొన్నం ప్రభాకర్ తాజాగా ట్విట్టర్ వేదికగా వీడియోలో మాట్లాడుతూ..‘కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. బస్సు ప్రమాద ఘటన దురదృష్టకరం.. చాలా బాధ కలుగుతుంది. మృతులకు సంతాపం వ్యక్తం చేస్తున్నా. బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరాలు తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం నుండి తక్షణం తీసుకోవాల్సిన చర్యలు ఉంటే రవాణా శాఖ నుండి ఆదేశించాం.కర్నూల్ లో జరిగిన బస్సు సంఘటన దురదృష్టకరం.. చాలా బాధ కలుగుతుందిమృతులకు సంతాపం వ్యక్తం చేస్తున్న..బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి గారు వివరాలు తెలుసుకోవడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం నుండి తక్షణం తీసుకోవాల్సిన చర్యలు ఉంటే రవాణా శాఖ నుండి ఆదేశించాంఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి,… pic.twitter.com/LrveQHLJsO— Ponnam Prabhakar (@Ponnam_INC) October 24, 2025ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి, కర్నూలు జిల్లా కలెక్టర్ ఎస్పీలతో ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ మధ్య ప్రతిరోజు వేలాది మంది ప్రయాణం చేస్తుంటారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. త్వరలో ఏపీ, కర్ణాటక, తెలంగాణ రవాణా శాఖ మంత్రులు, రవాణా శాఖ కమిషనర్లతో సమావేశం ఏర్పాటు చేస్తాం. స్పీడ్ లిమిట్ ప్రమాదాలను నివారిస్తుంది. ఇలాంటి నిబంధనలు కచ్చితత్వం చేస్తాం. ప్రమాదం జరిగిన బస్సు ఒడిశాలో రిజిస్ట్రేషన్ అయింది. హైదరాబాద్ నుండి బెంగళూరు తిరుగుతుంది. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. క్షతగాత్రులకు మంచి చికిత్స అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరాం’ అని చెప్పుకొచ్చారు. -
అయ్యో శివుడా!.. గుండెలవిసేలా రోదిస్తున్న యశోదమ్మ
సాక్షి, కర్నూలు: కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైకర్ సహా 20 మంది మృతి చెందినట్టు సమాచారం. అయితే.. బస్సు, బైక్ ఢీకొనడంతో ఈ ఘోరం జరిగింది. ప్రమాదం సందర్బంగా బైక్‌ను బస్సు దాదాపు 300 మీటర్లు లాక్కెళ్లిపోయింది. ఈ ఘటనలో ప్రమాదానికి కారణమైన బైకర్ శంకర్ చనిపోయాడు. శంకర్‌ను కర్నూలు మండలం ప్రజానగర్‌కు చెందిన వ్యక్తిగా నిర్ధారించారు.కాగా, శివశంకర్ మరణంతో అతని తల్లి యశోద, కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కన్నీరు మున్నీరుగా విలపించారు. తమ బిడ్డ ఇలా మృతి చెందడం పట్ల విలపిస్తోంది. గ్రానైట్, పెయింటింగ్ పనులు చేసే శివశంకర్ నిన్న తెల్లవారుజామున డోన్ నుంచి బయలుదేరి ఇంటికి వస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. బస్సు ముందుభాగంలోకి బైక్ వెళ్లడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదం కారణంగా బస్సులోనే పలువురు సజీవ దహనం అయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ఉండగా.. వారిలో ఇద్దరు చిన్నారులు, పది మంది మహిళలు ఉన్నారు. ఇప్పటి వరకు 20 మంది చనిపోయినట్టు సమాచారం. ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదంలో నల్లగొండకు చెందిన అనూషా రెడ్డి మృతి..ఇదిలా ఉండగా.. ఘటనా స్థలానికి ఫొరెన్సిక్ బృందం చేరుకుంది. డీఎన్ఏ పరీక్షల ద్వారా మృతదేహాలను గుర్తించి బంధువులకు అప్పగిస్తున్నారు. అలాగే, ఘటన స్థలానికి రవాణా శాఖ అధికారులు చేరుకున్నారు. బైక్‌ను బలంగా ఢీకొట్టడం వల్లే బస్సులో మంటలు వచ్చాయని అధికారులు తెలిపారు. కావేరి ట్రావెల్స్ పేరిట ఒడిశాలో రిజిస్ట్రేషన్ చేసి బస్సు నడుపుతున్నారు. 2018 మే 2న రిజిస్ట్రేషన్ చేశారు. తల్లీకూతుళ్లు మిస్సింగ్.. ఈ బస్సుకు 2030 ఏప్రిల్ 30 వరకు టూరిస్ట్ పర్మిట్ జారీ అయ్యింది. ప్రమాదానికి గురైన బస్సు ఫిట్‌గా ఉంది. 2027 మార్చి 31 వరకు ఫిట్‌నెట్ ఉంది. 2026 ఏప్రిల్ 20 వరకు బస్సుకు ఇన్సూరెన్స్ ఉంది. బైక్‌ను బలంగా ఢీకొట్టడం వల్లే బస్సులో మంటలు వచ్చాయి. అన్ని కోణాల్లో పూర్థి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తు నివేదిక మేరకు భవిష్యత్తులో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి
ఢిల్లీ: కర్నూలు బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ఈ ఘటన విచారకరమని పేర్కొన్నారు. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. మృతులకు సంతాపం ప్రకటించారు.The loss of lives in a tragic bus fire accident in Kurnool, Andhra Pradesh is deeply unfortunate. I extend my heartfelt condolences to the bereaved family members and pray for the speedy recovery of those injured.— President of India (@rashtrapatibhvn) October 24, 2025ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్రమంలోనే ప్రధాని కార్యాలయం.. మృతుల కుటుంబాలకు రెండు లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. అలాగే, క్షతగాత్రులకు 50వేల తక్షణ సాయం ఇవ్వనున్నట్టు తెలిపింది. Extremely saddened by the loss of lives due to a mishap in Kurnool district of Andhra Pradesh. My thoughts are with the affected people and their families during this difficult time. Praying for the speedy recovery of the injured.An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be…— PMO India (@PMOIndia) October 24, 2025 -
నిర్లక్ష్యంతో బతుకులు బుగ్గి.. కర్నూలులో ఘోర ప్రమాదం (చిత్రాలు)
-
కర్నూలు ప్రమాదం.. నెల్లూరు రమేష్ కుటుంబ సభ్యులు మృతి
సాక్షి, కర్నూలు : కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక కుటుంబం మొత్తం సజీవ దహనమైంది. నెల్లూరుకు చెందిన రమేష్ సహా అతడి భార్య, పిల్లలు చనిపోయారు. దీంతో, వారి బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు.కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో నలుగురు నెల్లూరు జిల్లా వాసులు చనిపోయారు. వారిని వింజమూరు మండలం గోల్లవారిపాలెంకు చెందిన గోళ్ళ రమేష్ కుటుంబ సభ్యులుగా గుర్తించారు. రమేష్ కుటుంబం బెంగళూరులో స్థిరపడింది. వీరంతా హైదరాబాద్ వెళ్లి బెంగళూరు వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గొల్ల రమేష్ (35), అనూష (30), మన్విత (10), మనీశ్ (12) మృతి చెందారు. బంధువులు ఘటనా స్థలికి చేరుకున్నారు.ఇక, హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ డీడీ01ఎన్9490 బస్సులో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. కర్నూలు శివారు చిన్నటేకూరులో జాతీయ రహదారి 44పై శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. బస్సును బైక్ ఢీకొట్టి ముందు భాగంలోకి దూసుకెళ్లడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 30 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అర్ధరాత్రి సమయంలో బస్సులో మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో పలువురు సజీవ దహనం అయినట్లు తెలుస్తోంది(Kurnool Bus Accident). క్షతగాత్రుల్ని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు, ఫైర్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నాయి. -
కర్నూలులో ఘోర బస్సు ప్రమాదం.. పలువురి సజీవ దహనం
కర్నూలు, సాక్షి: జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి సమయంలో ఓ ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో పలువురు సజీవ దహనం అయినట్లు తెలుస్తోంది(Kurnool Bus Accident). క్షతగాత్రుల్ని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు, ఫైర్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నాయి. వేమూరి కావేరీ ట్రావెల్స్‌కు చెందిన బస్సు నెంబర్ డీడీ01ఎన్9490 సుమారు 40 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తోంది. కల్లూరు మండలం చిన్నటేకూరు ఉల్లిందకొండ క్రాస్ వద్దకు చేరుకోగానే ఓ బైక్‌ను ఢీ కొట్టడంతో మంటలు చెలరేగాయి. క్షణాల్లో ఆ మంటలు బస్సు అంతటా వ్యాపించాయి. డ్రైవర్, హెల్పర్‌తో పాటు పలువురు ప్రయాణికులు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. మరికొందరు సజీవ దహనం అయినట్లు తెలుస్తోంది. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నప్పుడు.. అర్ధరాత్రి 3.30గం. ప్రాంతంలో ఈ ఘోరం చోటు చేసుకుంది. ‘‘బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తోంది. బైక్‌ను ఢీ కొటటడంతో మంటలు చెలరేగాయి. డ్రైవర్ గమనించి మరో డ్రైవర్‌ను నిద్ర లేపాడు. చిన్నపాటి ప్రమాదం అనుకుని వాటర్ బబుల్‌తో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ, అంతలోనే మంటలు ఎక్కువయ్యేసరికి ప్రయాణికులను నిద్ర లేపాడు. ఎమర్జెన్సీ డోర్ బద్దలు కొట్టి మరికొందరు బయటపడ్డారు. గాయపడ్డవాళ్లు కర్నూలు కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. ఎంత మంది చనిపోయారన్నది ఇప్పుడే చెప్పలేం’’ అని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు. డ్రైవర్ పరారీలో ఉండగా.. స్పేర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
టూరిస్ట్ బస్సు ప్రమాదం.. పలువురు మృతి
వాషింగ్టన్: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. టూరిస్టు బస్సు బోల్తా పడిన ఘటనలో ఐదుగురు మృతి చెందినట్టు తెలుస్తోంది. పలువురు గాయపడినట్టు అక్కడి అధికారులు తెలిపారు. ఇక, టూరిస్టుల్లో ఎక్కువ మంది భారత్, చైనా, ఫిలిప్పీన్స్‌కు చెందిన వారు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు.వివరాల ప్రకారం.. అమెరికాలోని పెంబ్రోక్ సమీపంలో టూరిస్ట్ బస్సు ప్రమాదానికి గురైంది. ప్రఖ్యాత నయాగరా జలపాతం అందాలను చూసేందుకు వెళ్లి తిరిగి న్యూయార్క్‌కు వస్తున్న ఓ టూరిస్టు బస్ బోల్తా పడింది. కాగా, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అదుపుతప్పి బోల్తా పడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందగా, పలువురు గాయపడినట్లు స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి. ఈ ఘటన అక్కడి స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.40 గంటలకు జరిగింది.FATAL BUS CRASH: A tour bus returning to New York City from Niagara Falls crashed and rolled, killing and injuring multiple people. https://t.co/gjbBasVrWC#News12NY #NYC pic.twitter.com/uQpfsAkuCe— News 12 New York (@News12) August 22, 2025ఈ క్రమంలో చాలా మంది సీటు బెల్టులను ధరించకపోవడంతో వారిని సులభంగా బస్సు నుంచి బయటికి తీసుకొచ్చినట్లు ఓ పోలీస్ అధికారి పేర్కొన్నారు. కాగా, బస్సు ప్రమాదానికి గురైన సమయంలో 54 మంది ప్రయాణిస్తున్నారు. పర్యాటకుల్లో అత్యధికులు భారత్, చైనా, ఫిలిప్పీన్స్‌కు చెందిన వారు ఉన్నట్లు అధికారులు తెలిపారు. బస్సు బోల్తా పడిన విషయం తెలియడంతో వెంటనే స్థానిక యంత్రాంగం అప్రమత్తమైంది. నాలుగు హెలికాప్టర్లు, పలు అంబులెన్స్‌లలో క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించాయి. ఈ ఘటనతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇదొక విషాద ఘటన అని న్యూయార్క్ గవర్నన్ క్యాథీ హోచుల్ పేర్కొన్నారు. తమ యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టిందని తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించి ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. A tour bus carrying passengers from Niagara Falls to New York City overturned on westbound Interstate 90 (I-90) in Pembroke, New York, near mile marker 403.9. The crash resulted in multiple fatalities and dozens of injuries.According to reports, the bus collided with a… pic.twitter.com/ttRKbpSgzs— T_CAS videos (@tecas2000) August 22, 2025 -
ఘోర రోడ్డు ప్రమాదం: 10 మంది యాత్రికులు దుర్మరణం
బరద్వాన్: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. యాత్రికులతో బిహార్ వెళుతున్న బస్సు.. రోడ్డు ప్రమాదానికి గురౌవడంతో 10 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటనలో 35 మందికి గాయాలు కాగా, పలువురి పరిస్థితి విషమంగా ఉంది. యాత్రికులతో బిహార్ వెళుతున్న బస్సు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బరద్వాన్ జిల్లాలో ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. నేషనల్ హైవే 19పై రోడ్డు ప్రక్కన ఆపి ఉంచిన ట్రక్కును బస్సు డ్రైవర్ గమనించకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. నాలా ఫెర్రీ ఘాట్ వద్ద వేగంగా వెళ్తున్న బస్సు ఒక్కసారి ట్రక్కును ఢికొట్టడంతో 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ వద్ద రోడ్డు ప్రమాదం
-
కామారెడ్డి జిల్లాలో బస్సు ప్రమాదం
-
జమ్మూకశ్మీర్ లో అదుపుతప్పిన అమర్ నాథ్ యాత్రికుల కాన్వాయ్
-
ఉత్తరాఖండ్ లో బస్సు బోల్తా
-
ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. నదిలో పడిన బస్సు
ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన బస్సు.. అలకనంద నదిలోకి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు. 10 మంది గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రుద్ర ప్రయాగ్ జిల్లా ఘోల్తీర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.ప్రమాద సమయంలో బస్సులో 18 మంది ఉన్నట్లు సమాచారం. పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో నది పొంగిపొర్లుతుంది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది. యుద్ధ ప్రాతిపదికన సహాయక, రక్షణ చర్యలు చేపడుతున్నాయని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తెలిపారు.#WATCH | Uttarakhand | One person dead, seven injured after an 18-seater bus falls into the Alaknanda river in Gholthir of Rudraprayag district. Teamsof SDRF, Police and Administration conduct search and rescue oeprationdVideo source: Police pic.twitter.com/dgdznAc0ck— ANI (@ANI) June 26, 2025 -
Himachal Pradesh: లోయలో పడిన బస్సు
-
Himachal: 200 అడుగుల లోయలో పడిన బస్సు.. ఇద్దరు మృతి
మండి: హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలో ఈరోజు(మంగళవారం) ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో నిండిన బస్సు అదుపుతప్పి 200 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. బాధితులకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్నవారిని వెలికి తీసుకువచ్చి, అంబులెన్స్‌లలో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో ఇద్దరు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. #WATCH | Himachal Pradesh: 17 people injured when their bus fell into a gorge in Patrighat of Mandi district. Rescue and relief operations underway. The injured are being rushed to a hospital. The bus was going from Jahu to Mandi. (Video: District Administration Mandi, Himachal… pic.twitter.com/Gl2SL6cpTi— ANI (@ANI) June 17, 2025తీవ్రంగా గాయపడిన వారిని మండి ఆస్పత్రికి తరలించారు. భారీ వర్షం కారణంగా బస్సు అదుపుతప్పి లోయిలో పడిపోయింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. మండి జిల్లాలో ఒక ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గురైందని డీఎస్పీ సర్కాఘాట్ సంజీవ్ గౌతమ్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 30 మంది ఉన్నారు. ఇది బస్సు సీటింగ్ సామర్థ్యం కంటే అధికం. డ్రైవర్ నిర్లక్ష్యం కూడా ప్రమాదానికి కారణంకావచ్చని పోలీసులు భావిస్తున్నారు.ఇది కూడా చదవండి: ఆరు వారాల్లో ఐదు హెలికాప్టర్ ప్రమాదాలు.. ఏం జరుగుతోంది? -
కర్ణాటకలో APSRTC బస్సు ప్రమాదం.. నలుగురు మృతి
-
కర్ణాటకలో APSRTC బస్సుకి ప్రమాదం.. చిత్తూరువాసుల మృతి
బెంగళూరు: కర్ణాటకలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఏపీఎస్ఆర్టీసీకి చెందిన బస్సు, ఓ లారీ ఢీ కొట్టడంతో నలుగురు స్పాట్లోనే మరణించారు. 16 మందికి గాయాలు కాగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు చిత్తూరు వాసులుగా తెలుస్తోంది.తిరుపతి నుంచి ఏపీ 03 జెడ్ 0190 నెంబర్ బస్సు బెంగళూరుకు వెళ్తోంది. కోలారు జిల్లా హోసాకోట్‌లోని పుట్టిపురా గేట్ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టడంతో బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. క్షతగాత్రులను స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల వివరాలుకేశవరెడ్డి(44)తులసి(21)ప్రణతి(5)ఏడాదిన్నర వయసున్న చిన్నారి -
పెళ్లి నుంచి తిరిగొస్తూ.. తిరిగిరాని లోకానికి
-
ట్రావెల్ బస్సు ఢీకొని ముగ్గురికి గాయాలు
పెరవలి: మండలం ఖండవల్లి వద్ద మోటార్ సైకిళ్లను ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు తీవ్ర గాయాలపాలయ్యారు. పెరవలి ఎస్ఐ ఎం.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు తాడేపల్లిగూడేనికి చెందిన కపిలేశ్వరపు రామకృష్ణ అతని భార్య ఆదిలక్ష్మి, కుమారుడు హర్షతో కలసి మోటార్ సైకిల్‌పై పెనుగొండ మండలం రామన్న పాలెం వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టటంతో వారు ముగ్గురు రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డారు. మహిళకు ముఖంపై తగలటంతో తీవ్ర రక్తస్రావం అయ్యిందని, మిగిలిన ఇద్దరికి గాయాలయ్యాయని చెప్పారు. వీరు ముగ్గురిని వైద్యం కోసం తణుకులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించామని, ప్రాణ హాని లేదని వైద్యులు తెలిపారన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఘోరం..లోయలో పడిన బస్సు.. 21 మంది ప్రయాణికులు దుర్మరణం
కొలంబో: శ్రీలంకలో (Sri Lanka) పెను విషాదం చోటు చేసుకుంది. కోట్మాలేలోని కరండీ ఎల్లా ప్రాంతం నుంచి 78 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 21 మంది ప్రయాణికులు మరణించగా.. 30 మందికి పైగా తీవ్రంగా గాయ పడ్డారు. Over 20 people have been killed after a bus fell down a precipice in Kotmale in the Gerandi Ella area on Sunday.Deputy Minister of Transport Dr. Prasanna Gunasena said that at least 77 people were in the bus at the time of the accident.#Srilanka #lka #accident pic.twitter.com/8V6jEBKByD— Easwaran Christian Rutnam (@easwaranrutnam) May 11, 2025ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు,రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడ్డ క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.మరోవైపు,పరిమితికి మించి ప్రయాణికులతో ప్రయాణించ వల్లే ప్రమాదం చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదం జరిగే సమయంలో బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఉండడం, కోట్మాలే ప్రాంతంలో బస్సు అదుపు తప్పి లోయలో పడినట్లు సమాచారం. దుర్ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బస్సు ప్రమాదానికి గల కారణాల్ని అన్వేషిస్తున్నారు. -
Jammu And Kashmir: పూంచ్ జిల్లాలో లోయలో పడిన బస్సు
-
గచ్చిబౌలి: ఆర్టీసీ బస్సు కింద పడి టెన్త్ విద్యార్థి మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలో విషాదం చోటు చేసుకుంది. గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు కింద పడి టెన్త్ విద్యార్థి మృతి చెందింది. టెన్త్ పరీక్ష రాయించి చెల్లిని అన్న బైక్‌పై తీసుకెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో అన్నకు తీవ్ర గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు.గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీకి చెందిన విద్యార్థిని టెలికాం నగర్లో 10వ తరగతి పరీక్షలు రాస్తుంది. నిన్నటి (శుక్రవారం) నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభమవ్వగా, ఇవాళ రెండో రోజైన శనివారం తన అన్న బైక్ పై పరీక్షకు వెళ్లింది. పరీక్ష రాసిన అనంతరం తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో గచ్చిబౌలి ఫ్లైఓవర్ వద్ద వారు ప్రయాణిస్తున్న బైక్ ఆర్టీసీ బస్సు చక్రాల కింద పడింది. ఈ ఘటనలో బైక్‌పై వెనుక కూర్చున్న విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందగా.. అన్న తీవ్రంగా గాయపడ్డారు. -
హైదరాబాద్‌లో విషాదం.. మార్నింగ్ వాక్కు వెళ్లి అడిషనల్ ఎస్పీ మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హయత్‌నగర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో అడిషనల్ ఎస్పీ టీఎం. నందీశ్వర బాబ్జీ అక్కడికక్కడే మృతిచెందారు. దీంతో, ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.వివరాల ప్రకారం.. హయత్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని లక్ష్మారెడ్డి పాలెం కాలనీ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. అడిషనల్ ఎస్పీ టీఎం. నందీశ్వర బాబ్జీ రోడ్డు దాటుతున్న సమయంలో అతడిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నందీశ్వర బాబ్జీ అక్కడిక్కడే మృతి చెందారు. ప్రస్తుతం రాచకొండ కమిషనరేట్ కంట్రోల్ రూమ్‌లో ఆయన విధులు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల క్రితమే ఆయనకు ప్రమోషన్ వచ్చింది. ఈ క్రమంలో ఇంకో మూడు రోజుల్లో డీజీపీ ఆఫీసుల్లో రిపోర్టు చేయాల్సి ఉంది. -
దక్షిణ మెక్సికోలో ఘోర ప్రమాదం.. 41 మంది సజీవ దహనం
దక్షిణ మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది. బస్సును ట్రక్కు ఢీకొట్టడంతో మంటలు చెలరేగి 41 మంది సజీవ దహనమయ్యారు. ఈ సమయంలో బస్సులో 48 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ఘటన టబాస్కో రాష్ట్రంలో శనివారం తెల్లవారుజామున ఈఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్లూ ప్రాణాలు కోల్పోగా.. ట్రక్కు డ్రైవర్ కూడా మృతి చెందారు. ఘటనా స్థలంలో ఇప్పటి వరకు 18 మందికి చెందిన అవశేషాలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంపై పోలీసులు విచారణ చేపట్టారు. -
రోడ్డు ప్రమాదం: 8 మంది దుర్మరణం
జైపూర్: రాజస్థాన్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. ఓ బస్సు అదుపు తప్పి కారును ఢీకొట్టడంతో భారీ సంఖ్యలోప్రాణనష్టం వాటిల్లింది. రాజస్థాన్‌లోని దుడు రీజియన్లజజైపూర్-అజ్మీర్ హైవేపై మౌంఖపూరాకు అతి దగ్గర్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం మధ్యాహ్న సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా, ఆరుగురికి తీవ్ర గాయ్యాలయ్యాయి.బస్సు ముందు టైర్ పేలిపోవడంతో అది కాస్తా అదుపు తప్పింది. ఆ సమయంలో బస్సును కంట్రోల్ చేయడానికి యత్నించిన డ్రైవర్ ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టాడు. దాంతో కారులో ఉన్న వారు పలువురు ప్రాణాలు కోల్పోగా, కొంతమంది తీవ్ర గాయాల పాలయ్యారు. గాయపడిన వారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. -
నాలుగు రోజులు మృత్యువుతో పోరాడిన దీక్షిత..
పెందుర్తి: రాజమండ్రిలో బుధవారం జరిగిన కావేరి ట్రావెల్స్ బస్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఈల్లా దీక్షిత(22) చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. సుజాతనగర్‌కు చెందిన దీక్షిత, మర్రిపాలెనికి చెందిన ఆమె బంధువు కల్యాణి ఇంటర్వ్యూ నిమి త్తం విశాఖ నుంచి హైదరాబాద్‌కు కావేరి ట్రావెల్స్ బస్‌లో ఈ నెల 22న బయలుదేరారు. రాజమండ్రి వద్దకు వెళ్లేసరికి బస్ బోల్తా పడడంతో కల్యాణి అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో గాయపడిన దీక్షితను నగరంలోని ఓ ప్రైవే ట్ ఆస్పత్రికి చికిత్స నిమి త్తం తీసుకువచ్చారు. నాలుగు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన దీక్షిత కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో కూరుకుపోయారు. మరోవైపు ప్రమాదం జరిగి నాలుగు రోజులైనా కావేరి ట్రావెల్స్ యాజమాన్యం గానీ, ప్రభుత్వం గానీ కనీసం స్పందించకపోవడం పట్ల బంధువులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. -
కావేరి ట్రావెల్స్ బస్సు బోల్తా
-
రోడ్డు ప్రమాదం: కావేరి ట్రావెల్స్ బస్సు బోల్తా
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు(Bus Accident) బుధవారం అర్థరాత్రి 12.30 సమయంలో రాజమహేంద్రవరం సమీపంలో బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 18 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు కావేరి ట్రావెల్స్ బస్సు సుమారు 50 మంది ప్రయాణికులతో బయల్దేరింది. ఈ బస్సు రాజమహేంద్రవరం రూరల్ కాతేరు– కొంతమూరు మధ్యలో అగ్రహారం వద్దకు వచ్చేసరికి బోల్తా పడింది(Road Accident). రోడ్డు పనులు జరుగుతుండటంతో డైవర్షన్ ఇచ్చిన విషయాన్ని డ్రైవర్ దగ్గరకు వచ్చేవరకూ గమనించకపోవడం, ఒక్కసారిగా వేగంగా కుడివైపునకు బస్సు తిప్పడంతో బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ యువతి (20) అక్కడికక్కడే మృతి చెందింది. 25 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే క్షతగాత్రుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో ముగ్గుర్ని కాకినాడ ఆస్పత్రికి, ఇద్దర్ని రాజమండ్రి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే క్షతగాత్రుల్లో 13 మందిని ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు. -
కారు ప్రమాదంలో దంపతుల మృతి: Tirupati
-
సూర్యాపేటలో రెండు బస్సులు ఢీ.. ఇద్దరు మృతి
-
చిత్తూరు వద్ద ఘోర బస్సు ప్రమాదం
చిత్తూరు, సాక్షి: జిల్లా శివారు వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న టిప్పర్‌ను తప్పించబోయి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, 22 మందికి గాయాలయ్యాయి.చిత్తూరు శివారులో గంగాసాగరం(Gangasagaram) వద్ద అర్ధరాత్రి 2 గం. సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తచ్చూరు హైవే నిర్మాణ పనుల్లో భాగంగా ఓ టిప్పర్ అక్కడ ఆగి ఉంది. అదే సమయంలో అతివేగంతో దూసుకొచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు(Private Travel Bus).. ఆ టిప్పర్‌ను తప్పించబోయి డివైడర్‌ను ఢీ కొట్టి పడిపోయింది. బస్సు తిరుపతి నుంచి మధురైకి వెళ్తున్నట్లు తెలుస్తోంది.ప్రమాదంపై సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్(Sumit Kumar) ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చిత్తూరు జిల్లా ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. వీళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో.. సీఎంసీ వేలూరు ఆసుపత్రి కి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.గంగసాగరం సమీపంలోని గాజుల పల్లి ఫ్లై ఓవర్ వద్ద టిప్పర్ లారీ వేగంగా ప్రవేట్ బస్సు ఢీ కొట్టడం తో ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన బస్సు తిరుపతి నుంచి మధురైకు వెళ్తోంది. రంగనాధన్ ఇన్ ట్రావెల్స్ బస్సు ఇది. నలుగురు స్పాట్లో చనిపోయారు. విషమంగా ఉన్న ఆరుగురిని చీలాపల్లి సి.ఏం.సి ఆసుపత్రి కు తలించాం. మిగిలిన వారు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. :::శ్రీనివాసరావు, చిత్తూరు రూరల్ సీఐ -
యూపీకి వెళ్తున్న తెలంగాణ బస్సులో మంటలు.. వ్యక్తి సజీవదహనం
లక్నో/హైదరాబాద్: తెలంగాణ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని కాశీకి వెళ్తున్న ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. షాట్ సర్క్యూట్ కారణంగా బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. ఈ ప్రమాద ఘటన యూపీలోని బృందావనంలో చోటు చేసుకుంది.వివరాల ప్రకారం.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బైంసా నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీకి పర్యాటకులతో బస్సు బయలుదేరింది. కాశీకి వెళుతున్న బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తి సజీవ దహనమయ్యాడు. మృతుడిని నిర్మల్ జిల్లా పల్సికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.కాగా, అగ్ని ప్రమాద సమయంలో 50 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్టు సమాచారం. అయితే, ప్రమాదాన్ని పసిగట్టిన బస్సు డ్రైవర్ అప్రమత్తం చేయడంతో ప్రయాణికులంతా హుటాహుటిన బస్సు దిగిపోయారు. ఇక, బస్సులోనే ఉండిపోయిన ఆ వ్యక్తి మాత్రం సజీవ దహనమయ్యాడు. దీంతో, అతడి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం
-
తిరుమల ఘాట్రోడ్లో బస్సు ప్రమాదం
తిరుపతి: తిరుమల ఘాట్రోడ్లో బస్సు ప్రమాదం(Bus Accident) జరిగింది. భక్తులను తీసుకుని వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. ఘాట్రోడ్లో ప్రమాదానికి గురైంది. బస్సు అదుపు తప్పి, పిట్టగోడను ఢీకొట్టింది ఆర్టీసీ బస్సు . ఈ ఘటనలో పలువురు భక్తులకు(Several Devotees) గాయాలయ్యాయి. ఇందులో 10 మంది భక్తులకు తీవ్రగాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించే క్రమంలో ట్రాఫిక్ జామ్ సమస్య అడ్డంకిగా మారి జాప్యం చోటు చేసుకుంది. ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు.. రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయింది. ఫలితంగా కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. అలిపిరి వరకూ ట్రాఫిక్ జామ్ కావడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద అగ్నిప్రమాదంఈరోజు తిరుమల(Tirumala) లడ్డూ కౌంటర్ల వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో భక్తులు భయబ్రాంతులకు గురై పరుగులు తీశారు. ఆపై సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి నష్టం వాటిల్లలేదని సమాచారం.లడ్డూ కౌంటర్లలో 47వ నెంబర్ కౌంటర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కౌంటర్లోని కంప్యూటర్ యూపీఎస్‌లో షార్ట్ సర్క్యూట్ రావడంతోనే ప్రమాదం జరిగినట్లు సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద నిత్యం భక్తుల రద్దీ ఉండడం సహజమే.అయితే ఇటీవల తిరుపతి తొక్కిసలాట ఘటన తర్వాత.. స్వామివారిని దర్శించుకుంటున్న భక్తుల సంఖ్యలో మార్పు కనిపిస్తోంది. ఈ క్రమంలో లడ్డూ కౌంటర్ల వద్ద అగ్నిప్రమాదంతో ఒక్కసారిగా అలజడి చేలరేగగా.. కాసేపు అక్కడున్న భక్తులు అందోళనకు గురయ్యారు.చదవండి: తిరుపతి తొక్కిసలాట ఘటనపై వైఎస్సార్సీపీ న్యాయపోరాటం -
Bus Accident: నలుగురు దుర్మరణం
ఉత్తరాఖండ్: ఉత్తరాఖండ్(Uttarakhand)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. పౌరీ గర్వాల్ జిల్లాలో ఓ బస్సు(Bus Accident) అదుపుతప్పి కొండపై నుంచి లోయలోకి పడిపోవడంతో నలుగురు మృత్యవాత పడ్డారు. ఈ ఘటనలో 15 మంది వరకూ గాయాలయ్యాయి,. బస్సు అదుపు తప్పడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు ప్రమాదానికి గురైందన్న వార్త తెలుసుకున్న పోలీసులు, జిల్లా అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దాంతో పాటు స్థానికంగా ఉన్నవారు కూడా ఆ ప్రాంతానికి తమ సాయం అందిస్తున్నారు. గాయపడ్డవారిని ఆస్పత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు.. నలుగురు మృతి
సాక్షి, సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ప్రమాదంలో నలుగురు మృతిచెందగా.. మరో 17 మంది గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండలం ఐలాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. అలాగే, 17 మంది కూలీలు గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. కూలీలు పనుల కోసం ఒడిశా నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
శబరిమలలో హైదరాబాద్ స్వాముల బస్సు బోల్తా.. ఒకరు మృతి
తిరువనంతపురం: హైదరాబాద్ నుండి కేరళ వెళ్లిన అయ్యప్ప స్వాముల బస్సు ప్రమాదానికి గురైంది. శబరిమల ఘాట్ రోడ్డులో అదుపు తప్పి బస్సు బోల్తా పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా.. స్వాములు తీవ్రంగా గాయపడ్డారు.వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి శబరిమల వెళ్లిన అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా పడింది. పంబా వెళ్తున్న క్రమంలో ఘాట్ రోడ్డులో బస్సు బోల్తా పడిపోవడంతో ప్రమాదం జరిగింది. పంపా నదికి 15 కిలోమీటర్ల దూరంలో బస్సు బోల్తా కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 22 మంది ఉన్నారు.ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ రాజు అక్కడికక్కడే మృతిచెందగా.. స్వాములు గాయపడ్డారు. వీరిలో ఎనిమిది మంది స్వాములు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, క్షతగాత్రులను కొట్టాయం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అయ్యప్ప స్వాములను ఉప్పర్గూడకు చెందిన వారిగా గుర్తించారు. -
ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయపడిన బస్సు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 27 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు 1500 అడుగుల లోయలో పడింది. ఈ దుర్ఘటనలో పలువురు మృతి చెందారు. పోలీసుల వివరాల మేరకు.. ఉత్తరాఖండ్ రాష్ట్రం నైనిటాల్ జిల్లాకు చెందిన ఓ బస్సు 27మంది ప్రయాణికులతో భీమ్టాల్ నుండి హల్ద్వానీకి వెళ్తుంది. అయితే నైనిటాల్ జిల్లా భీమ్‌తాల్‌లోని అమ్దాలి సమీపంలో బస్సు అదుపు తప్పింది. పక్కన ఉన్న 1500అడుగుల లోయలో పడింది. ఈ ప్రమాదం ముగ్గురు మృతి చెందారు. పదిమంది గాయపడ్డారు. ప్రమాదంతో అప్రమత్తమైన పోలీసులు, స్థానిక రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. నైనిటాల్ నుండి ఎస్డీఆర్ఎఫ్,అగ్నిమాపక శాఖ బృందాలను సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. Uttarakhand | A team of SDRF team is carrying out a rescue operation at Bhimtal bus accident site along with local police, local people and Fire Department pic.twitter.com/Adlbmb4F9E— ANI (@ANI) December 25, 2024కాగా, రోడ్డు ప్రమాదంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఎక్స్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. స్థానిక అధికారులు ప్రమాద బాధితులకు తక్షణమే సహాయక చర్యలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రయాణికులందరూ క్షేమంగా ఉండాలని కేదార్ బాబాను కోరుకున్నారుभीमताल के निकट बस के दुर्घटनाग्रस्त होने का समाचार अत्यंत दुःखद है। स्थानीय प्रशासन को त्वरित राहत एवं बचाव कार्य के लिए निर्देशित किया है। बाबा केदार से सभी यात्रियों के सकुशल होने की कामना करता हूं।— Pushkar Singh Dhami (@pushkardhami) December 25, 2024 -
ట్రక్కును ఢీకొన్న బస్సు.. 38 మంది మృతి
బ్రెసీలియా: బ్రెజిల్ దేశంలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. హైవేపై బస్సును ట్రక్కు ఢీకొన్న ఘటనలో దాదాపు 38 మంది మృతిచెందగా.. మరికొందరు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.వివరాల ప్రకారం.. బ్రెజిల్‌లోని మినాస్గైరస్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. హైవేపై ట్రక్కును బస్సు ఢీకొన్న ఘటనలో 38 మంది మృతిచెందారు. బస్సు ప్రయాణంలో ఉండగా టైర్ ఊడిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు బ్రెజిల్ దేశ మీడియా తెలిపింది. అయితే, టైర్ ఉడిపోవడంతో డ్రైవర్ బస్సును కంట్రోల్ చేసే సమయంలో వేగంగా ట్రక్కు ఢీకొన్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో మరో 13 మంది గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.MG: acidente com ônibus, carreta e carro deixa 38 mortosÔnibus vinha de São Paulo com 45 passageiros. O acidente ocorreu quando um pneu do coletivo estourou, em Teófilo Otoni, Minas Gerais pic.twitter.com/JAzdqjOol5— Regresso Nacional (@RegressoNaciona) December 22, 2024 -
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలో బస్సు ప్రమాదం
-
రాళ్ల గుట్టను ఢీకొన్ని కావేరి ట్రావెల్స్ బస్సు..
సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కావేరి ట్రావెల్స్‌కు చెందిన బస్సు ప్రమాదానికి గురికావడంతో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ సమీపంలో కావేరి ట్రావెల్స్‌కు చెందిన బస్సు ప్రమాదానికి గురైంది. అదుపు తప్పి రాళ్ల గుట్టను బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. బాధితులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే, డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో బస్సు ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది. -
Mumbai : ఆర్టీసీ బస్సు ప్రమాదం.. వెలుగులోకి సంచలన విషయాలు
ముంబై : ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు బీభత్సం సృష్టించిన ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బస్సు డ్రైవర్ సంజయ్ మోర్కి ఎలక్ట్రిక్ బస్సు నడపడం రాదని, ఈవీ బస్సుపై అవగాహన లేకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు విచారణ అధికారులు నిర్ధారించారు. విచారణలో బస్సు డ్రైవర్ సంజయ్ ఇదే విషయాన్ని పోలీసులకు చెప్పినట్లు తేలింది. పోలీస్ కస్టడీలో ఉన్న పోలీసుల విచారణలో బస్సు డ్రైవర్ సంజయ్ మోర్ పలు కీలక విషయాల్ని వెల్లడించాడు. ఎలక్ట్రిక్ బస్సు నడపడంలో తనకు అనుభవం లేదని, కేవలం ఒక్క రోజు ఈవీ బస్సును డ్రైవింగ్ చేసినట్లు చెప్పాడు. ఆ ఒక్క రోజు కేవలం మూడుసార్లు నడిపిట్లు చేసినట్లు, అనంతరం విధులకు హజరైనట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు.కాబట్టే 60 కేఎంపీహెచ్ వేగంతో వెళ్తున్న ఈవీ బస్సును ఎలా కంట్రోల్ చేయాలో తనకు అర్ధం కాలేదని, కాబట్టే ఈ ఘోర ప్రమాదానికి దారి తీసినట్లు పోలీసులకు చెప్పాడు. అనుభవం లేకపోవడంతో ఎలక్ట్రిక్ బస్సు అదుపు తప్పి ఘోర ప్రమాదానికి దారి తీసింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే కిటికి అద్దాలు పగులగొట్టి, తన క్యాబిన్లో ఉన్న బ్యాగ్ తీసుకుని పారిపోయినట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.ముంబై ఆర్టీసీ విభాగంపై విమర్శలుముంబై ఆర్టీసీ నిబంధనల ప్రకారం.. ఆరు వారాల పాటు ఎలక్ట్రిక్ బస్సు డ్రైవింగ్ శిక్షణ పూర్తి చేయాల్సి ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా సంజయ్ మోరాకు ఈవీ బస్సులో విధులు అప్పగించడంపై ముంబై ఆర్టీసీ అధికారుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఆర్టీసీ బస్సు బీభత్సంగత సోమవారం సాయంత్రం 9.30 గంటల సమయంలో హౌసింగ్ కాలనీలో కుర్లాలోని ఎస్జీ బార్వేరోడ్‌లో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిలవ్వడంతో దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. 42మందికి తీవ్ర గాయాలయ్యాయి. 20కి పైగా వాహనాలు ధ్వంస మయ్యాయి. బస్సు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు బస్సు డ్రైవర్ సంజయ్ మోర్(43)ని అరెస్ట్ చేశారు. బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్ట్)కు చెందిన బస్సు కుర్లా స్టేషన్ నుంచి అంధేరికీ వెళ్తుండగా బ్రేక్‌లు ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగినట్టు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నిర్ధారించారు. 👉చదవండి : ఆర్టీసీ బస్సు బీభత్సం.. జనాలపైకి దూసుకెళ్లి.. -
ఫస్ట్ డే డ్యూటీకి వెళ్లింది.. అంతలోనే అంతులేని విషాదం
19 ఏళ్ల అఫ్రీన్ షా ఎంతో హుషారుగా తన జీవితంలో తొలి రోజు ఉద్యోగానికి వెళ్లింది. కానీ అదే ఆమెకు చివరి రోజు అవుతుందని ఆమె ఊహించలేదు. అఫ్రీన్ షా కుటుంబ సభ్యులు కూడా అనుకోలేదు. మొదటి రోజు డ్యూటీ ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చే సమయంలో ఆటోలు దొరక్కపోవడంతో తండ్రి అబ్దుల్ సలీంకు అఫ్రీన్ ఫోన్ చేసింది. కుర్లా స్టేషన్‌కు వెళ్లమని కూతురికి ఆయన సలహా ఇచ్చాడు. కొద్దిసేపటి తర్వాత ఆయనకు మరోసారి ఫోన్ వచ్చింది. అర్జెంటుగా ఆస్పత్రికి రావాలని ఫోన్ చేశారు. అతడు ఆస్పత్రికి వచ్చే చూసేసరికి కూతురు నిర్జీవంగా కనిపించడంతో సలీం కుప్పకూలిపోయారు. అపురూపంగా పెంచుకున్న తన కుమార్తె మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించాడు.కన్నిస్ అన్సారీ(55) అనే నర్సు నైట్ షిప్ట్ డ్యూటీ చేసేందుకు బయలుదేరి అనూహ్యంగా పప్రాణాలు కోల్పోయింది. వీరిద్దరితో పాటు మరో ఐదుగురిని బస్సు రూపంలో మృత్యువు కబళించింది. ముంబై మహానగరంలోని కుర్లా ప్రాంతంలో సోమవారం రాత్రి జరిగిన బస్సు ప్రమాదం ఏడుగురిని బలిగొంది. 42 మందిని గాయాలపాల్జేసింది. కుర్లా రైల్వే స్టేషన్ - అంధేరి మధ్య నడిచే రూట్ నంబర్ 332 బృహన్ ముంబయి ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్ట్) బస్సు అదుపుతప్పి విధ్వంసం సృష్టించడంతో ఈ ఘోరం జరిగింది. కుర్లా వెస్ట్‌లోని అంజుమన్-ఇ-ఇస్లాం స్కూల్ సమీపంలో నిన్న రాత్రి 9.30 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.డ్రైవర్ తప్పిదం వల్లే..బస్సు డ్రైవర్ సంజయ్ మోర్(43) తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వేగంగా దూసుకొచ్చిన బస్సు.. పోలీసు వ్యాను, కార్లు, టూవీలర్లు, తోపుడు బండ్లతో సహా 22 వాహనాలను ఢీకొట్టింది. చివరకు గోడను ఢీకొని ఆగిపోయింది. ప్రమాద తీవ్రత చూసిన వారంతా ఉగ్రదాడిగా భయపడి పరుగులు తీశారు. ‘ప్రమాదానికి గురైన వాహనాల జాబితాను సిద్ధం చేశాం. 22 వాహనాలను బస్సు ఢీకొట్టినట్టు మా దృష్టికి వచ్చింది. బస్సు డ్రైవర్ సంజయ్ మోర్ మరిన్ని వాహనాలను ఢీకొట్టాడో, లేదో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామ’ని ముంబై జోన్ 5 పోలీస్ డిప్యూటీ కమిషనర్ గణేష్ గవాడే మీడియాతో చెప్పారు.బస్సు కండిషన్లోనే ఉందిబస్సు బ్రేకులు ఫెయిల్ కావడం వల్లే ప్రమాదం జరిగిందన్న వార్తలను గవాడే తోసిపుచ్చారు. బస్సు మంచి కండిషన్లో ఉందని, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే దుర్ఘటన జరిగిందన్నారు. డిసెంబర్ 1 నుంచి డ్రైవర్ సంజయ్ మోర్ బెస్ట్ బస్సు నడుపతున్నాడని, గతంలో అతడు మాన్యువల్ మినీ బస్సు నడిపేవాడని వెల్లడించారు. ప్రయాణికులతో కూడిన బస్సును నడిపేందుకు అవసరమైన శిక్షణ తీసుకున్నాడా, లేదా విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు. కాగా, డ్రైవర్‌ను డిసెంబర్ 21 వరకు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కుర్లా కోర్టు ఆదేశాలిచ్చింది.చదవండి: 150 అడుగుల బోరుబావిలో బాలుడు..‘ప్రమాదానికి కారణమైన బస్సులో ఎటువంటి సాంకేతిక లోపం లేదు. యాక్సిలరేట్ ఇచ్చిన తర్వాత వేగాన్ని నియంత్రించడంలో డ్రైవర్ విఫలమయ్యాడు. భయాందోళనకు గురై బ్రేక్‌కు బదులుగా యాక్సిలరేటర్ తొక్కాడు. అతడు మొదట ఆటోరిక్షాను ఢీకొట్టాడు. ఆ తర్వాత పోలీసు వాహనం, ద్విచక్ర వాహనాలు, తోపుడు బండ్లను ఢీకొట్టాడు. గోడను ఢీకొట్టిన తర్వాత మాత్రమే బస్సు ఆగింద’ని డీసీపీ గణేష్ గవాడే తెలిపారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని, సంబంధిత శాఖలు విచారించి నివేదిక సమర్పించాక తదుపరి చర్యలు చేపడతామన్నారు. సంజయ్ మోర్ మద్యం సేవించి బస్సు నడిపాడా లేదా అన్నది నిర్ధారించేందుకు అతడికి పోలీసులు వైద్య పరీక్షలు చేయించారు. ప్రమాదంపై విచారణకు జరిపేందుకు ఫోరెన్సిక్, రీజినల్ ట్రాన్స్‌ఫోర్ట్ కార్యాలయ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.ప్రత్యక్ష సాక్షులు ఏమన్నారంటే?బస్సు ప్రమాదాన్ని చూసి ప్రత్యక్ష సాక్షులు భయాందోళన చెంతారు. సహాయక చర్యల్లో పాల్గొని బాధితులను ఆస్పత్రులకు తరలించడంలో సాయపడ్డారు. ప్రత్యక్ష సాక్షి జైద్ అహ్మద్ (26) మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను రైల్వే స్టేషన్‌కు వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరుతుండగా పెద్ద శబ్ధం వినిపించింది. వెంటనే సంఘటనా స్థలానికి పరిగెత్తాను. పాదచారులతో పాటు ఆటోరిక్షా, మూడు కార్లు, ఇతర వాహనాలను బస్సు ఢీకొట్టింది. నా కళ్ల ముందు కొన్ని మృతదేహాలను చూశాను. ఆటోరిక్షాలో ఉన్న ప్రయాణికులను రక్షించి బాబా ఆసుపత్రికి తీసుకెళ్లాం. మరో మూడు చక్రాల వాహనం కూడా క్షతగాత్రులకు సహాయం అందించింద’ని తెలిపాడు.సీఎం ఫడ్నవీస్ దిగ్భ్రాంతిముంబై బస్సు ప్రమాదంపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. క్షతగాత్రుల చికిత్సకు అయ్యే ఖర్చును బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్ట్) భరిస్తుందన్నారు. -
Mumbai: ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది
-
ఆర్టీసీ బస్సు బీభత్సం.. జనాలపైకి దూసుకెళ్లి..
ముంబై: కుర్లాలోని ఎస్జీ బార్వేరోడ్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిలవ్వడంతో పాదచారులపై దూసుకెళ్లినట్లు సమాచారం. మృతులను శివమ్ కశ్యప్ (18), కనీజ్ ఫాతిమా (55), అఫీల్ షా (19), అనమ్ షేక్ (20)లు మరణించారు. 29మంది గాయపడ్డారు. ఐదారు ఆటోలు, 10 ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. సోమవారం సాయంత్రం 9.30 గంటల సమయంలో హౌసింగ్ కాలనీలో బృహన్ ముంబయి ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్ట్)కు చెందిన కుర్లా- అంధేరి రైల్వే స్టేషన్ మధ్య నడిచే రూట్ నంబర్ 332 బస్సుగా గుర్తించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు బస్సు డ్రైవర్ సంజయ్ మోర్(43)ని అరెస్ట్ చేశారు. సహాయక చర్యల్ని ముమ్మరం చేపట్టారు. ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బస్సు బ్రేకులు ఫెయిలవ్వడంతో జరిగిన ప్రమాద తీవ్రతను చూసిన స్థానికులు ఉగ్రదాడి తరహాలో ఉండడంతో భయాందోళనకు గురయ్యారు. పలువురు ప్రాణ భయంతో పారిపోయారు. పరిస్థితిని అదుపు చేసేందుకు క్విక్ రెస్పాన్స్ టీమ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది రంగంలోకి దిగారు.బృహన్ ముంబయి ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్ట్)కు చెందిన బస్సు కుర్లా స్టేషన్ నుంచి అంధేరికీ వెళ్తుండగా బ్రేక్‌లు ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగినట్టు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. అయితే ఆ బస్సు డ్రైవర్ సంజయ్ మోర్ కాంట్రాక్ట్ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. బస్సు ప్రమాదానికి గల కారణాల్ని గుర్తించేందుకు ఆర్టీఓ అధికారి రవి గైక్వాడ్ నిపుణుల బృందం రంగంలోకి దిగింది.జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ సత్యనారాయణ చౌదరి స్వయంగా కుర్లా పోలీస్ స్టేషన్లో డ్రైవర్‌ను విచారించారు. సంజయ్ మోర్‌ను వైద్య పరీక్షల నిమిత్తం జేజే ఆస్పత్రికి తరలించి విచారణ చేపట్టారు. ఇదీ చదవండి : నా డెత్ లేఖ సుప్రీం కోర్టుకు చేరాలి -
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. 10 మంది మృతి
ముంబై : మహరాష్ట్రలో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. బస్సు బోల్తాపడి 10 ప్రయాణికులు మరణించారు. పలువురి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. బస్సు ప్రమాదంపై పోలీసులు తెలిపిన వివరాల మేరకు... మహరాష్ట్ర స్టేట్ రోడ్డు ట్రాన్స్ పోర్ట్ కార్పేషన్(ఎంఎస్ఆర్టీసీ)కు చెందిన బస్సు శుక్రవారం మధ్యాహ్నం భండారా నుండి సకోలి మీదుగా గోండియా అనే ప్రాంతానికి వెళ్తుంది.ఆ సమయంలో ఓ మలుపు వద్ద ఆర్టీసీ బస్సుకు అకస్మాత్తుగా ఓ ద్విచక్ర వాహనదారుడు ఎదురుగా వచ్చాడు. ఆకస్మిక పరిణామంతో అప్రమత్తమైన బస్సు డ్రైవర్ ప్రమాదం జరగకుండా బస్సును పక్కకి తిప్పాడు. దీంతో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో బస్సులో ఉన్న 35 మంది ప్రయాణికుల్లో 10 మరణించారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రాణ భయంతో బస్సు డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. బస్సు ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు, తోటి వాహనదారులు ప్రయాణికుల్ని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు.ప్రమాద బాధితులకు ఎక్స్ గ్రేషియాబస్సు ప్రమాదంపై మహరాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే విచారం వ్యక్తం చేశారు. ప్రమాద బాధితులకు తక్షణమే రూ.10లక్షలు ఎక్స్‌గ్రేషియా అందించాలని రవాణా శాఖకు ఆదేశాలు జారీచేశారు. మృతుల కుటుంబ సభ్యులకు మహరాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంపై ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ..‘గోండియా జిల్లాలోని సడక్ అర్జున్ సమీపంలో శివషాహి ఆర్టీసీ బస్సు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ప్రయాణికుల మరణం నన్ను కలచి వేస్తుంది. మరణించిన వారికి నా నివాళి’అని తెలిపారు. ‘ఈ ఘటనలో గాయపడిన ప్రయాణికులకు మెరుగైన వైద్య సేవల కోసం అవసరమైతే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను' అని ఫడ్నవీస్ ట్వీట్లో పేర్కొన్నారు. गोंदिया जिल्ह्यातील सडकअर्जुनीनजीक शिवशाही बसचा दुर्दैवी अपघात होऊन काही प्रवाशांचा मृत्यू झाल्याची घटना अतिशय दुर्दैवी आहे. मृतांना मी भावपूर्ण श्रद्धांजली अर्पण करतो. त्यांच्या कुटुंबीयांच्या दु:खात आम्ही सहभागी आहोत.या घटनेत जे लोक जखमी झाले, त्यांना खाजगी रुग्णालयात उपचार…— Devendra Fadnavis (@Dev_Fadnavis) November 29, 2024 -
కష్టజీవులను కబళించిన మృత్యుశకటం.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
గార్లదిన్నె: వారంతా వ్యవసాయ కూలీలు.. రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేదలు. రోజూ మాదిరిగానే ఉదయాన్నే పనులకు వెళ్లారు. పనులు ముగించుకుని ఆటోలో ఇంటికి వెళ్తుండగా ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యుశకటం కబళించింది. ఈ ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం చెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా గార్లదిన్నెకు సమీపంలోని 44వ నంబరు జాతీయ రహదారిపై శనివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన 12 మంది వ్యవసాయ కూలీలు గార్లదిన్నె మండలం తిమ్మంపేట వద్ద అరటి తోటలో ఎరువు వేసే పనికోసం ఉదయమే ఆటోలో వచ్చారు. అక్కడ పని ముగించుకుని మధ్యాహ్నం ఇంటికి తిరుగు పయనమయ్యారు. తలగాచిపల్లి క్రాస్ వద్ద ఆటో గార్లదిన్నె వైపునకు మలుపు తీసుకుంటుండగా.. అదే సమయంలో అనంతపురం నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలపెద్దయ్య అలియాస్ తాతయ్య (55), చిన్ననాగమ్మ (48) రామాంజినమ్మ (47), పెద్ద నాగమ్మ (60) అక్కడికక్కడే మృతిచెందారు. మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఆటోలో నుంచి రోడ్డు మీద పడి తీవ్రగాయాలతో హాహాకారాలు, ఆర్తనాదాలు చేస్తున్న కూలీలను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు.ఎస్ఐ గౌస్ మహమ్మద్ బాషా తన సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనాల్లో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్ననాగన్న (55), జయరాముడు (48), కొండమ్మ (50), ఈశ్వరయ్య మృతిచెందారు. లక్ష్మీదేవి, పెద్దులమ్మ, రామాంజినమ్మ, గంగాధర్, ఆటో డ్రైవర్ నీలకంఠ తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో చిన్ననాగన్న–చిన్ననాగమ్మ, ఈశ్వరయ్య–కొండమ్మ దంపతులు.ఒకేరోజు ఎనిమిది మంది మృతిచెందడం, ఐదుగురు గాయపడడంతో ఎల్లుట్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అనంతపురం ప్రభుత్వాస్పత్రి వద్ద బాధిత కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ ప్రమాదంపై గార్లదిన్నె పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ జగదీష్, అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లు తదితరులు పరిశీలించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నట్లు కలెక్టర్ వినోద్‌కుమార్ తెలిపారు.మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి:వైఎస్ జగన్అనంతపురం జిల్లాలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గార్లదిన్నె మండలం తలగాచిపల్లె వద్ద ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఎనిమిది మంది మరణించారు. వీరంతా కూలి పనులకు వెళ్లొస్తూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలకు వైఎస్ జగన్ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని.. వారికి అవసరమైన సాయం అందజేయాలని కోరారు. -
ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డుప్రమాదం
-
కల్వర్టును ఢీకొట్టిన బస్సు.. 12 మంది మృతి
జైపూర్: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సికార్‌లో మంగళవారం మధ్యాహ్నం బస్సు కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా, పలువురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. సలాసర్ నుంచి వెళ్తున్న బస్సు సికర్ జిల్లాలోని లక్ష్మణ్‌గఢ్ వద్దకు రాగానే ఎదురుగా కల్వర్టును ఢీకొట్టింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం లక్ష్మణ్‌గఢ్‌లోని ప్రభుత్వ సంక్షేమ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు 12 మంది మృతి చెందినట్లు నిర్ధారించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ మహేంద్ర ఖిచాడ్ తెలిపారు. #Sikar: #लक्ष्मणगढ़ पुलिया के पास भीषण हादसामृतकों की संख्या पहुंची12, एक और घायल ने तोड़ा दम, 35 से अधिक लोग हुए थे घायल, सीकर अस्पताल में पांच मृतकों के शव, सात शव रखे है लक्ष्मणगढ़ अस्पताल की मोर्चरी में, घायलों का जारी है इलाज, सुजानगढ़ से नवलगढ़ आ रही थी बस #RajasthanNews pic.twitter.com/LHZCnSpscb— Manoj Bisu Sikar (@manoj_bisu) October 29, 2024 -
విజ్ఞాన యాత్రలో విషాదం
విజయవాడ స్పోర్ట్స్/సాక్షి, అమరావతి: బెజవాడ బార్ అసోసియేషన్ (బీబీఏ) న్యాయవాదులు చేపట్టిన విజ్ఞాన యాత్రలో విషాదం చోటుచేసుకుంది. దసరా సెలవులు కావడంతో ఈ నెల 2న 80 మంది న్యాయవాదులు విజయవాడ నుంచి 2 బస్సుల్లో యాత్రకు బయలుదేరారు. ఆంధ్రా, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లోని పలు న్యాయస్థానాలు, విజ్ఞాన ప్రాంతాలను చూసుకుంటూ ఈ నెల 6న రాజస్థాన్ చేరుకున్నారు. 7న రాత్రి రాజస్థాన్‌లోని జైసల్మేర్ నుంచి జైపూర్ వస్తుండగా మార్గ మధ్యలోని జో«ధ్‌పూర్ వద్ద మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు ఓ బస్సు ప్రమాదానికి గురైంది.ఈ ప్రమాదంలో ఆలిండియా లాయర్స్ యూనియన్ అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ సతీమణి జ్యోత్స్న మృతిచెందారు. రాజేంద్రప్రసాద్‌తో పాటు బీబీఏ కార్యదర్శి అరిగల శివరామప్రసాద్ (రాజా), న్యాయవాదులు పద్మజ, అరుణదేవి, నాగరాజు, గంగాభవాని, జయలక్ష్మీ, సత్యవాణి, శ్రీనివాసరావు, దుర్గాప్రసాద్‌తో పాటు మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన వారు స్వల్పగాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు జోధ్‌పూర్‌లోని ఆసుపత్రికి తరలించారు. మృతురాలు జ్యోత్స్న విద్యార్ధి ఉద్యమ కార్యకర్తగా పనిచేశారు. నేటి తరుణీతరంగాలు, సేఫ్ లను స్థాపించడంతో కీలకభూమిక పోషించారు. జ్యోత్స్న మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాన్ని విమానంలో బుధవారం విజయవాడ తీసుకువచ్చేందుకు న్యాయవాదులు సన్నాహాలు చేస్తున్నారు. క్షతగాత్రులైన వారు సైతం విమానంలో విజయవాడ చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, విమానం టికెట్లు లభించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని బీబీఏ కార్యదర్శి రాజా తెలిపారు. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతిఈ ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ సతీమణి జ్యోత్స్న మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు. మహిళలు, విద్యార్థినులను చైతన్యం పరిచేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించిన జ్యోత్స్న మృతి బాధాకరమన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బస్సు ప్రమాదానికి గల కారణాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని, అవసరమైన సాయం అందించాలని తన కార్యాలయ అధికారులకు సీఎం సూచించారు. రాజస్థాన్ సీఎం బజన్ లాల్ శర్మతో ఫోన్లో మాట్లాడి బాధితులకు అవసరమైన సాయం అందించాలని కోరారు. -
కేరళలో బస్సు ప్రమాదం.. ఇద్దరి మృతి
తిరువనంతపురం: కేరళలోని ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కోజికోడ్ తిరువంబాడి ప్రాంతంలో కర్టాటక ఆర్టీసీ బస్సు అదుపు తప్పి కల్వర్టును ఢీకొని కాళియంబుజ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదం మంగళవారం మధ్యాహ్నం 1:40 గంటల సమయంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.#Kerala: A tragic accident occurred in Thiruvambadi, Kozhikode, on Tuesday when a KSRTC bus veered off course, hitting a culvert and plunging into the Kaliyambuzha River.The incident, which took place around 1:40 p.m., claimed the life of 63-year-old Rajeswari from… pic.twitter.com/sPyFzhmyAW— South First (@TheSouthfirst) October 8, 2024 నదిలో పడేముందు బస్సు బోల్తా పడటంతో పలువురు ప్రయాణికులకు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని కోజికోడ్ మెడికల్ కాలేజీ, ఓమసేరీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందినవారిలో అనక్కంపోయిల్కు చెందిన 63 ఏళ్ల రాజేశ్వరి వృద్దురాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు తెలిపారు. -
జమ్ముకశ్మీర్‌లో బస్సు బోల్తా.. ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్ల మృతి
జమ్ముకశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మంది సైనికులు గాయపడినట్లు సమాచారం. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. భద్రతా విధుల్లో భాగంగా బీఎస్ఎఫ్కు చెందిన ఏడు బస్సుల కాన్వాయ్ బయలుదేరింది. ఈ క్రమంలో బ్రెల్ గ్రామం వద్ద ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. సమాచారం అందిన వెంటనే స్థానికులు, సాయుధ బలగాలు అక్కడకు చేరుకొని సహాయ కార్యక్రమాలు చేపట్టాయి. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారుఘటనా స్థలంలో స్థానికులు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు మూడు దశల్లో జరుగుతున్నాయి. సెప్టెంబర్ 18న తొలిదశ పోలింగ్ పూర్తికాగా.. రెండో దశ సెప్టెంబర్ 25న జరగనుంది. -
చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి
సాక్షి, చిత్తూరు: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు లారీలను బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఎనిమిది మంది మృతిచెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. మొగిలిఘాట్ వద్ద శుక్రవారం మధ్యాహ్నాం ఈ ప్రమాదం జరిగింది. అయితే, బస్సు అదుపు తప్పి లారీని ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని అంబులెన్స్‌ల సాయంతో స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘాట్ రోడ్లో ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. ఇక, లారీ చిత్తూరు నుంచి ఐరన్ లోడ్‌తో బెంగళూరు వెళ్తోంది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ మనోహర్‌తో పాటు బస్సులో ప్రయాణీకులు మృతి చెందారు. -
విశాఖ కైలాసగిరి వద్ద టూరిస్ట్ బస్సుకి ప్రమాదం
విశాఖపట్నం, సాక్షి: కైలాసగిరి వద్ద సోమవారం సాయంత్రం ఘోరం జరిగింది. ఓ టూరిస్ట్ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 18 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. బ్రేక్ ఫెయిల్ కావడంతో మలుపు వద్ద కొండను బస్సు ఢీ కొట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారని, వీళ్లంతా పశ్చిమ బెంగాల్‌కు చెందిన టూరిస్టులు అని తెలుస్తోంది. వీళ్లలో 18 మందికి 18 మందికి స్వల్ప గాయాలు కాగా.. చికిత్స నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు. 16 మందికి ప్రాథమిక చికిత్స చేసి డిశ్చార్జ్ చేయగా.. మరో ఇద్దరికి మాత్రం కేజీహెచ్ వైద్యులు చికిత్స కొనసాగిస్తున్నారు. -
లోయలో పడిన బస్సులు 44 మంది దుర్మరణం
పాకిస్థాన్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఆదివారం (ఆగస్ట్ 25) జరిగిన రెండు వేర్వేరు బస్సు ప్రమాదాల్లో 44 మంది మరణించారు.పాకిస్థాన్‌లో జరిగిన రెండు వేర్వేరు బస్సు ప్రమాదాల్లో కనీసం 44 మంది మరణించారని, వీరిలో 12 మంది యాత్రికులు ఇరాన్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్నారని రెస్క్యూ అధికారులు తెలిపారు.పంజాబ్ ప్రావిన్స్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ మధ్య సరిహద్దులోని ఆజాద్ పట్టాన్ సమీపంలో ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 22మంది మరిణించారు. ప్రమాదంపై అత్యవసర సేవల ప్రతినిధి ఫరూక్ అహ్మద్ మాట్లాడుతూ..15 మంది పురుషులు, ఆరుగురు మహిళలు, ఒక బిడ్డతో సహా ఇప్పటి వరకు 22 మంది మరణించారని తెలిపారు. అయితే ఈ ప్రమాదం ఎందుకు జరిగిందనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. మరో దుర్ఘటనలో బలూచిస్తాన్‌లోని మక్రాన్ కోస్టల్ హైవేపై పాకిస్థాన్ పౌరులు ఇరాన్‌లోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ప్రమాదకరమైన రహదారిలో పోలీసుల నుంచి తప్పించుకుని ఇరాన్‌లోకి ప్రవేశించే క్రమంలో డ్రైవర్ మితిమీరిన వేగంతో నడపడంతో బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో సుమారు 12 మంది ప్రయాణికులు మరణించినట్లు పోలీసు అధికారి అస్లాం బంగూల్జాయ్ చెప్పారు. -
నేపాల్ లో ఘోర ప్రమాదం.. బస్సులో 40 మంది భారతీయులు
-
ఘోర బస్సు ప్రమాదం.. పది మంది మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బులంద్‌షహర్ జిల్లాలోని సేలంపూర్ వద్ద ఓ వ్యాన్‌ను బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా.. 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. #Bulandshahr #बुलंदशहर: बस और पिकअप की टक्कर में 9 लोगों की #मौत, 16 #घायल #गाजियाबाद की एक कंपनी से मैक्स में सवार सभी लोग अपने घर अलीगढ़ रक्षाबंधन का त्यौहार मनाने जा रहे थे#Accident #ghaziabad #RoadAccident @bulandshahrpol @myogioffice @dmbulandshahr @Uppolice @UPGovt pic.twitter.com/TLETZCCwMw— Goldy Srivastav (@GoldySrivastav) August 18, 2024 ఈ ప్రమాదంలో చనిపోయిన వారంతా అలీగఢ్ జిల్లా రాయ్ పూర్ ఖాస్ అహిర్ నాగ్లా గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. జిల్లా కలెక్టర్ చంద్రప్రకాశ్ సింగ్, ఎస్ఎస్పీ శ్లోక్ కుమార్ జిల్లా ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు. ఈ ప్రమాద ఘటనపై స్పందించిన సీఎం యోగి ఆదిత్యనాథ్.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. కాగా, మృతులను అలీఘర్ జిల్లా అత్రౌలీ తహసీల్‌లోని రాయ్‌పూర్ ఖాస్ అహిర్ నాగ్లా గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. -
ఆర్టీసీ బస్సు ప్రమాదం.. నడిరోడ్డుపై టైర్లు ఊడిపోయి..
సాక్షి, జగిత్యాల: జగిత్యాల జిల్లాలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణీకులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు చక్రాలు ఒక్కసారిగా ఊడిపోవడంతో ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో బస్సు రోడ్డుపై కుంగిపోయింది. అధిక లోడ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.కాగా, జగిత్యాల నుండి నిర్మల్ వెళ్తున్న ఆర్టీసీ పల్లె వెలుగు బస్సుకు ప్రమాదానికి గురైంది. అయితే, బస్సులో దాదాపు 150 మంది ప్రయాణీకులు ఎక్కారు. దీంతో, బస్సు కొంత దూరం వెళ్లగానే అధిక లోడ్ కారణంగా టైర్లు ఊడిపోయాయి. ఒక్కసారిగా భారీ శబ్ధంతో బస్సు రోడ్డుపై కుంగిపోయింది. అకస్మాత్తుగా జరిగిన పరిణామంతో ఏమైందో అర్థం కాక ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. డ్రైవర్ ఎంతో చాకచక్యంగా బస్సును నిలిపాడు.మరోవైపు.. ఈ ప్రమాదం కారణంగా ఊడిపోయిన బస్సు వెనుక భాగంలోని రెండు చక్రాలు పక్కనే ఉన్న చెట్ల పొదల్లో పడిపోయాయి. కాగా, ఈ ప్రమాదం కారణంగా బస్సులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక, వరుస సెలవుల కారణంగా ప్రయాణీకులు స్వగ్రామాలకు వెళ్తున్నారు. -
వీడియో: ట్రాఫిక్‌లో ఓల్వో బస్సు బీభత్సం.. వాహనాలు నుజ్జునుజ్జు
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఫుల్ ట్రాఫిక్ ఉన్న రోడ్డుపై ఓల్వో బస్సు ఒకటి అదుపు తప్పడంతో ముందున్న వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడగా.. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం.. బెంగళూరులోని హెబ్బాల్ ఫ్లైఓవర్‌పై ఓ ఓల్వో బస్సు వెళ్తోంది. ఈ క్రమంలో ఉన్నట్టుండి డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోయాడు. డ్రైవర్ బ్రేకులు వేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. బస్సు ముందుకు సాగుతుండటంతో సెకన్ల కాలంలోనే ముందున్న వాహనాలపైకి దూసుకెళ్లింది. ముందుగా బైక్‌లను ఢీకొట్టిన బస్సు.. ఆపై రెండు కార్లను ఢీకొట్టి ఆగిపోయింది.ఇక, ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, వీడియో బస్సును కంట్రోల్ చేసేందుకు డ్రైవర్ ఎంత ప్రయత్నించాడో చూడవచ్చు. మరోవైపు.. ఈ ప్రమాద ఘటనపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. CCTV footage shows a Volvo bus going out of control and crashing into several vehicles. The incident, involving a BMTC AC Volvo bus, occurred at Hebbal in #Bengaluru. In this accident, two people were injured, and four cars and four bikes were damaged. pic.twitter.com/3AIMyhYVLK— Neelima Eaty (@NeelimaEaty) August 13, 2024 -
ఏలూరులో బస్సు ప్రమాదం, వేగంగా లారీని ఢీ కొట్టి..
ఏలూరు, సాక్షి: జిల్లాలో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 20 మంది ప్రయాణికులకు గాయాలైనట్లు సమాచారం. పార్వతీపురం నుంచి విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం కోసం ప్రయాణికులతో ఓ బస్సు వెళ్తోంది. అయితే ఏలూరు కలపరు టోల్గేట్ వద్ద ఆగి ఉన్న లారీని ఈ వేకువజామున బస్సు ఢీ కొట్టింది. వేగానికి బస్సు ముందు భాగంగా.. లారీలోకి చొచ్చుకుపోయింది. బస్సులోనే ఇద్దరు ప్రయాణికులు ఇరుక్కుపోగా.. ఒకరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే.. తన క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను పోలీసులు బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. గాయపడిన ప్రయాణికుల్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసుల నుంచి మరింత సమాచారం అందించాల్సి ఉంది. -
ఒడిశాలో బస్సు ప్రమాదం.. హైదరాబాద్ టూరిస్టులు మృతి
సాక్షి,హైదరాబాద్: తీర్థ యాత్రలో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ పాతబస్తీ ఛత్రినాక నుంచి 23 మంది కలిసి ఒక ట్రావెల్ బస్సులో తీర్థయాత్రకు వెళ్లారు. వీరు ప్రయాణిస్తున్న బస్సు ఒడిశాలోని బరంపురం సమీపంలో ప్రమాదానికి గురైంది. హైవేపై బస్సు ట్రక్కును ఢీకొట్టడంతో బస్సు ముందు భాగం ధ్వంసమైంది. ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో పాటు ఇద్దరు యాత్రికులు మృతి చెందారు. మృతులను ఉదయ్‌సింగ్,క్రాంతిభాయ్, ఉప్పలయ్యగా గుర్తించారు. ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. మొత్తం 20 మంది గాయాల పాలయ్యారు. గాయపడ్డ వారందరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
నేపాల్ బస్సు ప్రమాదం.. ఏడుగురు భారతీయుల మృతి
నేపాల్‌లో శుక్రవారం తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. నారాయణఘాట్-ముగ్లింగ్ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో రెండు బస్సులు పక్కనే ఉన్న నదిలో పడ్డాయి. దీంతో దాదాపు 65 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు.వారిలో ఏడుగురు భారతీయులు ఉండగా.. తాజాగా ఆ ఏడుగురు భారతీయులు మరణించినట్లు తేలింది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. కాగా నేపాల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో చిట్వాన్ జిల్లాలోని నారాయణ్‌ఘాట్-ముగ్లింగ్ రహదారి వెంబడి సిమల్తాల్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో రెండు బస్సులు పక్కనే ఉన్న త్రిశూలి నదిలో పడిపోయాయి. 24 మంది ప్రయాణికులతో ఓ బస్సు కాఠ్మాండూ వెళుతోంది. మరో బస్సులో 41 మంది ఉన్నట్లు గుర్తించారు.రెండు బస్సుల్లో దాదాపు 65 మంది ప్రయాణికులు ఉండగా.. వారందరూ గల్లంతయ్యారు. వారిలో ఏడుగురు భారతీయులు కూడా ఉన్నారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.. అదే మార్గంలో మరోచోట కూడా బస్సుపై కొండచరియ విరిగిపడటంతో దాని డ్రైవర్ తీవ్రంగా గాయపడి మృతి చెందారు. బస్సు ప్రమాదం, భారతీయులు మృతి, కొండచరియలు, భారీ వర్షాలుఈ ఘటనపై నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ విచారం వ్యక్తంచేశారు. అధికారులు వెంటనే బాధితుల గాలింపునకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ దేశ సాయుధ దళాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. -
లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. మహారాష్ట్ర నాసిక్‌లో దుర్ఘటన
ముంబై: మహారాష్ట్ర నాసిక్‌లో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. ఓ బస్సు లోయ పడిన ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మరో 28 మందికి గాయాలు కాగా.. వాళ్లను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. సత్పురా ఘాట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న వాహనాన్ని బస్సు డ్రైవర్ ఓవర్ టేక్ చేశాడు. ఆ ప్రయత్నంలో ముందు మలుపు ఉండడంతో వేగంగా వెళ్తున్న బస్సును నియంత్రించలేకపోయాడు. దీంతో బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు.బస్సులోని ఓ ప్రయాణికుడు.. ఆ జర్నీని లైవ్ టెలికాస్ట్ కోసం చిత్రీకరించాడు. బస్సు ప్రమాదం తర్వాత కూడా ఆ వీడియో రికార్డయ్యింది. ప్రయాణికుల ఆర్తనాదాలు ఆ వీడియోలో వినిపించాయి. ఆపై ప్రమాద ఘటన తాలుకా వీడియో నెట్టింటకు చేరింది.Nashik: A bus fell into a valley in Nashik, LIVE video of the accident has surfaced#BusAccident #Nashik #Satpura #ViralVideo pic.twitter.com/bSidD45caK— Siraj Noorani (@sirajnoorani) July 9, 2024 -
ఘోర రోడ్డు ప్రమాదం! ఆగి ఉన్న లారీని..
ఆదిలాబాద్: కామారెడ్డి జిల్లా కేంద్రం సమీపంలోని జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున రోడ్డుపై ఆగి ఉన్న లారీని ప్రైవేట్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా, 28 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదిలాబాద్‌కు చెందిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు 34 మంది ప్రయాణికులతో సోమవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌కు బయలుదేరింది.మంగళవారం తెల్లవారుజామున దాదాపు 3 గంటల ప్రాంతంలో కామారెడ్డి సమీపంలోకి రాగానే క్యాసంపల్లి శివారులో జాతీయ రహదారిపై నిలిపి ఉంచిన లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ఆదిలాబాద్‌లోని అంబేడ్కర్‌నగర్ కాలనీకి చెందిన అఫ్సర్‌ఖాన్ (25) మృతి చెందగా, మరో 28 మందికి గాయాలయ్యాయి.స్థానికుల సమాచారంతో రూరల్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ షేక్ రఫీక్తోపాటు మరో ప్రయాణికుడు మోబీన్కు తీవ్ర గాయాలుకాగా వైద్యులు నిజామాబాద్‌కు రిఫర్ చేశారు. గాయాలపాలైన వారంతా ఆదిలాబాద్, నిర్మల్ ప్రాంతాలకు చెందిన వారే. అఫ్సర్‌ఖాన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నటట్లు దేవునిపల్లి ఎస్సై రాజు తెలిపారు. -
ఔటర్ రింగ్ రోడ్డులో బస్సు బోల్తా.. ఇద్దరు మృతి
సాక్షి,హైదరాబాద్ : హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డులో బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి ఔటర్ రింగు రోడ్డు మీదుగా ముంబాయి వెళుతున్న మార్నింగ్ స్టార్ బస్సు నార్సింగ్ సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 2 ప్రయాణికులు మృతి చెందారు. 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ క్షతగాత్రులను అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు బస్సు ప్రమాదం 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
ఎన్ఐఏ చేతికి ‘బస్సుపై ఉగ్రదాడి’ కేసు
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో ఇటీవల బస్సుపై ఉగ్రవాదుల దాడి కేసు దర్యాప్తును కేంద్రం హోంశాఖ... జాతీయ పరిశోధన సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించింది. జమ్మూకశ్మీర్ శాంతిభద్రతలు, అమర్నాథ్ యాత్రకు సంబంధించిన సన్నాహాలపై వరుస సమీక్షా సమావేశాల అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ నుంచి మాతా వైష్ణోదేవీ ఆలయానికి వెళ్తున్న యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై రియాసి జిల్లాలో జూన్ 9న ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. డ్రైవర్‌కు బుల్లెట్ తగలడంతో బస్సు అదుపుతప్పి లోయలోకి పడిపోయింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మహిళలు సహా తొమ్మిది మంది మరణించారు. 41 మంది గాయపడ్డారు. -
లోయలో పడ్డ బస్సు.. ముగ్గురు మహిళలు మృతి, 24 మందికి గాయాలు
డెహ్రడూన్: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గంగోత్రి జాతీయ రహదారిపై ఉన్న గంంగగనాని సమీపంలో బస్సు లోయలో పడింది. డ్రైవర్ కంట్రోల్ తప్పడంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు మరణించగా.. మరో 24 మందికి గాయాలయ్యాయి.గంగనానికి 50 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కంట్రోల్ తప్పిన డ్రైవర్.. వాహనాన్ని క్రాష్ బారియర్లకు ఢీకొట్టాడు. లోయలో పడి ఓ చెట్టుపై ఆగిపోయింది. గంగోత్రి నుంచి ఉత్తరకాశీ వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ఆ బస్సులో 27 మంది ప్రయాణికులు ఉన్నారు. సరైన సమయంలో సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. గాయపడ్డవారిని ఉత్తరకాశీ జిల్లా ఆస్పత్రి, భట్వాడి హెల్త్ సెంటర్‌కు తరలించారు. -
అదుపుతప్పి లోయలో పడిన బస్సు.. 28 మంది మృతి
పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 28 మంది దుర్మరణం చెందారు.బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.వివరాలు... 54 మంది ప్రయాణికులతో బస్సు దక్షిణ బలూచిస్థాన్‌లోని టర్బాట్ నగరం నుంచి ఉత్తరాన 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజధాని క్వెట్టాకు బయల్దేరింది. ఈ క్రమంలో కొండ ప్రాంతంలో మలుపు వద్ద బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ సహా మొత్తం 28 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సుమారు 22 మంది వరకు ప్రయాణికులకు గాయాలయ్యాయి. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు.సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హెలికాప్టర్లో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. మరోవైపు ఈ ఘటనపై ఆ దేశ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. -
అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్‌బోర్డ్ ప్రయాణం
ఖమ్మం: ఆర్టీసీ బస్సులో తలుపు వద్ద నిలుచున్న వివాహిత ప్రమాదవశాత్తు జారి వెనుక టైరు కింద పడి మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. కొణిజర్ల మండలం పెద్దమునగాలకు చెందిన దూరి అనూష (26) ఖమ్మంలోని డీమార్ట్‌లో పనిచేస్తోంది. శనివారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు కొణిజర్లలో ఎక్స్‌ప్రెస్ బస్సు ఎక్కింది. అప్పటికే ప్రయాణికుల రద్దీ ఉండటంతో ఆమె ఫుట్‌బోర్డ్‌పై నిలబడింది. బస్సు ఎంపీడీఓ కార్యాలయం సమీపానికి రాగానే మరో వాహనాన్ని ఓవర్టేక్ చేసేందుకు బస్సు డ్రైవర్ యత్నించాడు. ఇంతలోనే ఎదురుగా ద్విచక్రవాహనం రాగా డ్రైవర్ బ్రేక్ వేయడంతో తలుపు వద్ద నిలబడిన అనూష జారి రోడ్డుపై పడింది. అప్పటికే బస్సు కదలడంతో వెనుక టైరు ఆమె పైనుంచి వెళ్లగా నడుము భాగం నుజ్జునుజ్జయి ఘటనా స్థలిలోనే మృతి చెందింది. మృతురాలికి భర్త అశోక్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ పోషణ కోసం పనిచేస్తున్న ఆమె మృతి చెందిందనే సమాచారంతో కుటుంబీకులు చేరుకుని కన్నీరుమున్నీరుగా రోదించారు. కాగా, అనూష మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్ వాహనంలో ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శంకర్రావు తెలిపారు. -
పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: పల్నాడులో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. అలాగే, వారి కుటుంబాలకు అండగా నిలుస్తామని సీఎం జగన్ చెప్పారు. కాగా, పల్నాడులో బస్సు ప్రమాదంపై సీఎం జగన్ స్పందించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో బాధిత కుటుంబాలకు సహాయంగా నిలుస్తామన్నారు. మరణించిన వారి కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా, పల్నాడులో జరిగిన బస్సు ప్రమాదంలో ఆరుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. మృతిచెందిన వారికిలో ఇద్దరు డ్రైవర్లు, నలుగురు ప్రయాణీకులు ఉన్నారు. కాగా, ప్రైవేటు ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు హైస్పీడ్‌లో ఉన్న సమయంలో టిప్పర్‌ను ఢీకొట్టింది. -
పీవోకేలో బస్సు ప్రమాదం.. 20 మంది దుర్మరణం
పెషావర్: పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లోని గిల్గిట్–బల్టిస్తాన్‌లో శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కనీసం 20 మంది మృత్యువాతపడ్డారు. రావల్పిండి నుంచి గిల్గిట్ వైపు 43 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు దియామెర్ జిల్లాలో కారకోరం హైవేపైని పర్వత ప్రాంతంలో అదుపు తప్పి నది ఒడ్డున పడింది. ఈ దుర్ఘటనలో 20 మంది చనిపోగా మరో 21 మంది గాయపడ్డారు. డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోయినందునే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. -
ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం.. రాష్ట్రపతి, ప్రధాని విచారం
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. భారీ గుంతలో బస్సు బోల్తా పడిన ఘటనలో 12 మంది మృతిచెందగా మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లా ఖాప్రి గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన బస్సు బోల్తాపడింది. కాగా, ఓ డిస్టిలర్లీ సంస్థకు చెందిన బస్సుగా పోలీసులు గుర్తించారు. పని ముగించుకుని కార్యాలయ బస్సులో ఉద్యోగులు ఇళ్లకు తిరిగి వెళ్తుండగా రాత్రి ఎనిమిదిన్నర సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఇక, రోడ్డు పక్కనే ఉన్న 40 అడుగుల భారీ గుంతలో బస్సు పడ్డ వెంటనే 12మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఆస్పత్రిలో మరొకరు చికిత్స పొందుతూ దుర్మరణం పాలయ్యారు. President Droupadi Murmu tweets, "The news of many people getting killed in a bus accident in Durg district of Chhattisgarh is very sad. My deepest condolences to all the bereaved families! I wish for the speedy recovery of the injured." pic.twitter.com/bkqAVvKGNR — ANI (@ANI) April 9, 2024 మృతిచెందిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ ఘటనలో మరో 14 మంది తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. ఇక, ఘటనపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. छत्तीसगढ़ के दुर्ग में हुआ बस हादसा अत्यंत दुखद है। इसमें जिन्होंने अपने प्रियजनों को खोया है, उनके प्रति मेरी संवेदनाएं। इसके साथ ही मैं घायलों के शीघ्र स्वस्थ होने की कामना करता हूं। राज्य सरकार की निगरानी में स्थानीय प्रशासन पीड़ितों की हरसंभव मदद में जुटा है। — Narendra Modi (@narendramodi) April 9, 2024 ఈ ఘటనపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. దుర్గ్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం చాలా బాధాకరం. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో స్థానిక యంత్రాంగం బాధితులకు అన్ని విధాలా సాయం అందించడంలో నిమగ్నమై ఉందన్నారు. ఛత్తీస్‌గఢ్ సీఎం బస్సు ప్రమాద ఘటనపై స్పందించారు. ఈ సందర్బంగా క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడినవారు వెంటనే కోలుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. #WATCH | Chhattisgarh: On Durg bus accident, SP Jitendra Shukla says, "Today around 8.30 pm, workers of a distillery were leaving after their shift ended... All the people were rescued and admitted to various hospitals. As per data so far, 12 people have died... * people who were… pic.twitter.com/MPPa3rrIhl — ANI (@ANI) April 9, 2024 -
బస్సు లోయలో పడి 45 మంది మృతి
కేప్ టౌన్: ఈస్టర్ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న వారిని బస్సు ప్రమాదం కబళించింది. దక్షిణాఫ్రికాలోని లింపొపొ ప్రావిన్స్‌లో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 45 మంది ప్రాణాలు కోల్పోగా ఒక్క చిన్నారి గాయాలతో సజీవంగా బయటపడింది. బోట్స్వానాకు చెందిన వీరంతా దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఈస్టర్ ఉత్సవాలకు వెళ్తున్నారు. అదుపు తప్పిన బస్సు కొండప్రాంతంలోని ఎంమట్లకలా వద్ద వంతెన బారియర్లను ఢీకొట్టింది. ఆ పక్కనే ఉన్న 164 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ముక్కలైన బస్సులో భారీగా మంటలు చెలరేగి కొందరు సజీవ దహనం కాగా, మరికొందరు దూరంగా పడిపోయారు. ఘటనలో డ్రైవర్ సహా మొత్తం 45 మంది ప్రాణాలు కోల్పోగా ఎనిమిదేళ్ల చిన్నారి మాత్రమే సజీవంగా బయటపడింది. మంటల్లో కొందరి మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా కాలిపోయాయి. కొన్ని మృతదేహాలు పూర్తిగా కాలిపోయిన స్థితిలో నుజ్జయిన బస్సులో ఇరుక్కుపోయాయి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎనిమిదేళ్ల చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పొరుగు దేశం బొట్స్వానాకు చెందిన బాధితులంతా దక్షిణాఫ్రికాలోని మోరియా పట్టణంలో ఘనంగా జరిగే ‘జియోన్ క్రిస్టియన్ చర్చి’ ఈస్టర్ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఘటనపై దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమఫొసా బొట్స్వానా అధ్యక్షుడు మసిసితో ఫోన్లో మాట్లాడారు. ఆయనకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అన్ని విధాలుగా సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈస్టర్ పండుగ రద్దీ సమయంలో రోడ్డు ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలని దక్షిణాఫ్రికా ప్రభుత్వం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను సైతం చేపట్టినప్పటికీ దుర్ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. #BREAKING : Bus Accident Kills 45 In South Africa At least 45 people were killed as a result of a bus accident, South Africa's Department of Transportation said. An 8-year-old girl is reportedly the only survivor. The crash occurred near Mamatlakala in the northern province of… pic.twitter.com/15tGAbdAM0 — upuknews (@upuknews1) March 29, 2024 బ్రిడ్జి పై నుంచి కింద పడి నేలను ఢీకొట్టిన తర్వాత బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. దీంతో ప్రమాదంలో మరణించిన కొందరి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా మాడిపోయాయి. కొన్ని మృతదేహాలు శిథిలాల కింద చిక్కుకుపోగా మరికొన్ని చెల్లాచెదురుగా పడిపోయాయి. ఘటనా స్థలంలో రెస్క్యూ చర్యలు కొనసాగుతున్నాయి. బస్సు బోట్సువానా నుంచి మొరియా పట్టణానికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఇదీ చదవండి.. ప్రముఖ సైకాలజిస్ట్ కన్నుమూత -
ఘోర ప్రమాదం..పెళ్లి బస్సులో మంటలు అయిదుగురి మృతి
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఘాజీపూర్ జిల్లాలో ఓ బస్సుపై హైటెన్షన్ విద్యుత్ తీగలను తాకడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో అయిదుగురు మృత్యువాత పడగా.. 11 మందికి గాయాలయ్యాయి. వివరాలు.. మౌ జిల్లా నుంచి పెళ్లి బృందం బస్సు ఘాజీపూర్‌లోని మహావీర్ ఆలయానికి వెళ్తోంది. బస్సు ముర్దా పట్టణంలో ఓవర్‌హెడ్ హైవోల్టేజీ వైర్లను తాకడంతో మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు పరుగెత్తుకొచ్చి బస్సుల్లో నుంచి ప్రయాణికులను రక్షించేందుకు సాయం చేశారు. మంటల్లో చిక్కుకొని నిమిషాల వ్యవధిలోనూ బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సులో మెుత్తం 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఘాజీపూర్ విషాద ఘటనపై ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ స్పందించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిజేశారు. మృతుల కుటుంబానికి రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా, గాయపడిన వారందరికీ ఉచిత వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. చదవండి: ఎన్నికల ఎఫెక్ట్.. హెలికాప్టర్లకు పెరిగిన డిమాండ్.. यूपी के गाजीपुर में हाइटेंशन तार की चपेट में आने से बस में आग लग गई! बस में करीब 50 बाराती सवार थे , कई लोगों के जिंदा जलने की खबर है! ग्रामीणों ने दो थाने की पुलिस को भगा दिया है! एक महिला के अनुसार पुलिस ने रूट डायवर्ट किया था!#Ghazipur #accident pic.twitter.com/FsCDegtzdw — ShivRaj Yadav (@shivayadav87_) March 11, 2024 -
Bamako: మాలిలో ఘోర బస్సు ప్రమాదం
బమాకో: పశ్చిమ ఆఫ్రికాలోని మాలిలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 31 మంది మరణించారు. మంగళవారం రాత్రి కెనీబా పట్టణంలో బ్రిడ్జిపై నుంచి వెళుతున్న బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది. డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బస్సు బుర్కినా ఫాసోకు వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో చనిపోయిన వారిలో మాలి పౌరులతో పాటు ఇతరులు కూడా ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పశ్చిమ ఆఫ్రికాలో ప్రజా రవాణాలో ఏ మాత్రం ప్రమాణాలు ఉండవు. బస్సులు, రైళ్లు కిక్కిరిసి వెళుతుంటాయి. దీంతో ఇక్కడ ప్రమాదాలు జరగడం సర్వసాధారణం. ఇదీ చదవండి.. రష్యా హక్కుల నేతకు 30 నెలల జైలు -
రెయిలింగ్‌ను ఢీకొని బస్సు బీభత్సం.. ఇద్దరు మృతి!
గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న బస్సు రోడ్డుపైనున్న రెయిలింగ్‌ను బలంగా ఢీకొని, 25 అడుగులు కిందనున్న ప్రదేశంలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన ఖేడా జిల్లాలోని నడియాద్ ప్రాంతంలో చోటుచేసుకుంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం అహ్మదాబాద్-వడోదర ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణీకులతో వెళుతున్న ఒక బస్సు రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్‌ను బలంగా ఢీకొని, 25 అడుగులు కిందికి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారని, పలువురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఎస్పీ సహా పోలీసు సిబ్బంది సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నారు. ఎస్పీ రాజేష్ గధియా మీడియాతో మాట్లాడుతూ ప్రమాదానికి గురైన బస్సు అహ్మదాబాద్ నుంచి పూణె వెళుతోందని తెలిపారు. బస్సులో దాదాపు 23 మంది ప్రయాణికులు ఉన్నారు. హైవేపై అకస్మాత్తుగా ఎడమవైపు నుంచి వచ్చిన సిమెంట్ ట్యాంకర్.. బస్సును ఢీకొంది. దీంతో బస్సు అదుపు తప్పి, రెయిలింగ్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాదానికి కారణమైన ట్యాంకర్ డ్రైవర్‌పై కేసు నమోదు చేశామన్నారు. #WATCH | Nadiad: SP Rajesh Gadhiya says, "...The bus was going from Ahmedabad to Pune in which there were about 23 passengers. The driver of a cement tanker suddenly turned left and hit the bus...Two people have died & several people have been injured...A case will be filed… https://t.co/B9DKPMKTf5 pic.twitter.com/LrSFa3AepN — ANI (@ANI) February 23, 2024 -
నెల్లూరులో బస్సు ప్రమాదానికి కారణాలు
-
నెల్లూరు జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం
-
వికారాబాద్: ఆర్టీసీ బస్సుకు ప్రమాదం.. ప్రయాణికులకు గాయాలు
వికారాబాద్, సాక్షి: అనంతగిరి అడవుల్లో శనివారం మధ్యాహ్నాం ఘోర ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో కిక్కిరిసి ఉన్న ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి.. అడవుల్లోని పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులకు తీవ్రగాయాలు అయినట్లు తెలుస్తోంది. మరో 20 మందికి స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. తాండూరు ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు ప్రయాణికులను వికారాబాద్ నుంచి తాండూరుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అనంతగిరి గుట్ట దిగుతుండగా కెరెల్లి సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పొదల్లోకి వెళ్లింది. ఆ సమయంలో బస్సులో వంద మంది ఉన్నట్లు తెలుస్తోంది. స్వల్ప గాయాలైన వారిని వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించి చికిత్సలు నిర్వహిస్తున్నారు. -
గద్వాల్ జిల్లాలో బస్సు ప్రమాదం సీసీటీవీ ఫుటేజ్
-
సంక్రాంతి ప్రయాణం..మధ్యలోనే ఊహించని దారుణం
-
Gadwal Bus Fire Accident: బస్సులో చెలరేగిన మంటలు.. మహిళ సజీవ దహనం
సాక్షి, గద్వాల జిల్లా: బీచుపల్లి వద్ద ఘోర బస్సు ప్రమాదం జరిగింది. 10వ బెటాలియన్ సమీపంలో వాల్వో బస్సు బోల్తా పడింది. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. మంటల్లో చిక్కుకుని మహిళ సజీవదహనం అయ్యింది.. 10 మందికి గాయపడ్డగా, వారిని ఆసుపత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుంచి కడప వెళ్తుండగా ఆ ఘటన చోటుచేసుకుంది. బస్సులో 34 మంది ఉన్నట్లు సమాచారం. ప్రయాణికులు అద్దాలగొట్టి బయటపడ్డారు.


