
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హయత్‌నగర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో అడిషనల్ ఎస్పీ టీఎం. నందీశ్వర బాబ్జీ అక్కడికక్కడే మృతిచెందారు. దీంతో, ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.
వివరాల ప్రకారం.. హయత్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని లక్ష్మారెడ్డి పాలెం కాలనీ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. అడిషనల్ ఎస్పీ టీఎం. నందీశ్వర బాబ్జీ రోడ్డు దాటుతున్న సమయంలో అతడిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నందీశ్వర బాబ్జీ అక్కడిక్కడే మృతి చెందారు. ప్రస్తుతం రాచకొండ కమిషనరేట్ కంట్రోల్ రూమ్‌లో ఆయన విధులు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల క్రితమే ఆయనకు ప్రమోషన్ వచ్చింది. ఈ క్రమంలో ఇంకో మూడు రోజుల్లో డీజీపీ ఆఫీసుల్లో రిపోర్టు చేయాల్సి ఉంది.
