రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద సోమవారం వేకువ ఝామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కంకర లోడుతో టిప్పర్ లారీ వేగంగా దూసుకొచ్చి ఆర్టీసీ బస్సును ఢీ కొట్టి.. ఆపై బస్సుపై బోల్తా పడింది. ఈ ఘటనలో 19 మంది అక్కడికక్కడే మరణించారు. కంకరలో కూరుకుపోయి ప్రయాణికులు రక్షించామంటూ ఆర్తనాధాలు చేశారు. మరికొందరు విగతజీవిగా సీట్లలోనే ఉండిపోయారు. ఘటనా స్థలంలో దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి.


