breaking news
Chevella Road Accident
-
చేవెళ్ల ప్రమాదంలో మృత్యువుకు బలయ్యాడు!
సాక్షి,రంగారెడ్డి: చేవెళ్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఆర్టీసీ బస్సు డ్రైవర్ దస్తగిరి బాబా కూడా ఉన్నారు. గతంలో తన చాకచక్యంతో అనేక ప్రాణాలను కాపాడిన ఆయన.. ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో మరణించడం పట్ల తోటి ఆర్టీసీ ఉద్యోగులు,అధికారులు విచారం వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులు గతంలో దస్తగిరి బాబా ప్రదర్శించిన అద్భుత ధైర్యాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఏడాదిన్నర క్రితం, వికారాబాద్‌లోని అనంతగిరి కొండపై బస్సు బ్రేకులు ఫెయిలయ్యాయి. ఆ సమయంలో దస్తగిరి చాకచక్యంగా వ్యవహరించి, బస్సులోని ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు.అప్పట్లో తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి ప్రయాణికులను రక్షించిన దస్తగిరి.. చేవెళ్ల ప్రమాదంలో మృతి చెందడంపై ఆర్టీసీ ఉద్యోగులు, అధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.కాపాడండి’.. నడుములోతు కంకరలో ఇరుక్కుని టీచర్ ఆర్తనాదాలు ఒకే కుటుంబంలో ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతి -
చేవెళ్ల ప్రమాదం.. కుటుంబ సభ్యుల ఆవేదన
-
Chevella Incident: తల్లిదండ్రులను కోల్పోయి గుక్కపెట్టి ఏడుస్తున్న పిల్లలు
-
Chevella: బస్సు ప్రమాద కారణాలపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్
-
Chevella Bus Incident: రెప్పపాటులో ప్రమాదం అతివేగం వల్లే జరిగింది
-
Chevella: చెవి నొప్పి అని తీసుకొచ్చా మా నాన్న చనిపోయాడు
-
Chevella Bus Incident: శోకసంద్రంలో చేవెళ్ల హాస్పిటల్
-
‘కాపాడండి’.. నడుములోతు కంకరలో ఇరుక్కుని టీచర్ ఆర్తనాదాలు
సాక్షి,రంగారెడ్డి: చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని విషాదంలో ముంచింది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న కంకర లారీ ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.ప్రమాదానికి కారణంగా భావిస్తున్న టిప్పర్‌లో 30 టన్నులకు బదులుగా 50 టన్నుల కంకర లోడ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఢీకొట్టిన వెంటనే టిప్పర్లోని కంకర మొత్తం బస్సులోకి ప్రవేశించి, ప్రయాణికులపై పడటంతో ఊపిరాడక అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. కంకరలో ఇరుక్కుని బయటకు రాలేక ప్రయాణికులు చేసిన ఆర్తనాదాలు స్థానికులను కంటతడి పెట్టించాయి.ఈ ప్రమాదంలో తోల్కట్టలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మ్యాథ్స్ కాంట్రాక్ట్ టీచర్‌గా పనిచేస్తున్న జయసుధ తీవ్రంగా గాయపడ్డారు. నడుములోతు కంకరలో ఇరుక్కుని ఆమె కాళ్లు వాచిపోవడంతో కుటుంబ సభ్యులు ఆమెను నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కేరెల్లి గ్రామానికి చెందిన జయసుధ వికారాబాద్‌లో బస్సు ఎక్కగా, ఆమెతో పాటు రావాల్సిన మరో నలుగురు ఉపాధ్యాయులు ఆలస్యంగా రావడంతో వేరే బస్సులో ప్రయాణించి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.ప్రమాదం తీవ్రతకు బస్సు డ్రైవర్ వైపు సీట్లలో ఉన్న ప్రయాణికులు అధికంగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఘటనా స్థలంలో దృశ్యాలు హృదయవిదారకంగా ఉండగా, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. -
చేవెళ్ల దుర్ఘటన.. కారణాలు ఇవే!
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బస్సు ప్రమాద దుర్ఘటనకు (Chevella Bus Accident) టిప్పర్ ఓవర్ లోడ్, ఓవర్ స్పీడ్ కారణమని ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. పరిమితికి మించి కంకర నింపుకుని, మితిమీరిన వేగంతో వెళుతూ బస్సును టిప్పర్ ఢీకొట్టడంతో భారీ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 19 మంది చనిపోగా, 32 మంది వరకు గాయపడినట్టు సమాచారం.మరోవైపు రోడ్డుపైన ఉన్న భారీ గుంత (గొయ్యి) కూడా ప్రమాదానికి కారణమని చెబుతున్నారు. గుంతను తప్పించబోయి టిప్పర్ డ్రైవర్ బస్సును ఢీకొట్టాడని అంటున్నారు. ఢీకొట్టిన వెంటనే టిప్పర్.. బస్సుపైకి ఒరిగిపోవడంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. టిప్పర్లోని కంకర.. ఒక్కసారిగా బస్సులోని ప్రయాణికులపై పడడంతో వారిలో చాలా మంది ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయారు. టిప్పర్‌లో 35 టన్నుల కంకర ఉండాల్సి ఉండగా 60 టన్నుల కంకర ఉన్నట్టు తెలుస్తోంది. బస్సు డ్రైవర్ వైపు సీట్లు అన్ని నుజ్జు నుజ్జు అయ్యాయి. దీంతో ఈ వరుసలోని వారందరూ దాదాపు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో ఇద్దరు డ్రైవర్లు సహా ఆరుగురు పురుషులు ఉన్నారు. చదవండి: అలా ప్రమాదం నుంచి బయటపడ్డానుప్రమాదానికి కారణాలు1. టిప్పర్ ఓవర్ లోడ్, ఓవర్ స్పీడ్2. రోడ్డుపైన భారీ గుంత3. టిప్పర్‌లో పరిమితికి మించిన కంకర4. గొయ్యి రావడంతో తప్పిన టిప్పర్ కంట్రోల్5. టిప్పర్లోని కంకరపై టార్పాలిన్ లేకపోవడం6. టిప్పర్లోన కంకర మొత్తం బస్సుపై పడడం7. బస్సులో సీట్లకు మించి ప్రయాణికులు -
Chevella Road Accident: బస్సు ప్రమాద ఘటనపై జగన్, దిగ్భ్రాంతి
-
'రెప్పపాటులో జరిగిపోయింది'
టిప్పర్ లారీ వేగంగా వచ్చి ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగిందని చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనలో ప్రాణాలతో బయటపడిన నర్సింహులు అనే ధూమ్ ధామ్ కళాకారుడు చెప్పాడు. రెప్ప పాటు సమయంలో ప్రమాదం చోటు చేసుకుందని మీడియాకు వెల్లడించాడు. తామంతా చూస్తుండగానే పలువురి ప్రాణాలు పోయాయని చెప్పాడు. ''నేను కండెక్టర్ పక్కన నిల్చున్న. దేవుడి దయతో బయటపడ్డాన''ని తెలిపాడు.ప్రాణాలతో బయటపడిన కండక్టర్బస్సు కండక్టర్ రాధ ప్రమాదం నుంచి గాయాలతో బయటపడింది. మహేందర్ రెడ్డి జనరల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆమెను మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, బి. మనోహర్ రెడ్డి తదితరులు పరామర్శించారు. ప్రమాదం ఎలా జరిగిందని అడిగి తెలుసుకున్నారు. స్థానికుల ఆందోళనబస్సు ప్రమాదం ఘటన స్థలానికి పెద్ద సంఖ్యలో చేరుకున్న స్థానికులు ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజాపూర్ హైవేను వెంటనే పూర్తి చేసి, తమ ప్రాణాలకు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు చేవెళ్ల- వికారాబాద్ మార్గంలో ట్రాఫిక్ స్తంభించడంతో ఆలూరు నుంచి వాహనాలను పోలీసులు మళ్లిస్తున్నారు. ఆర్టీసీ ఉన్నతాధికారుల విచారణఆర్టీసీ ఉన్నత అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల రీజనల్ మేనేజర్లు, హైదరాబాద్ ఈడీ తదితరులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి దారి తీసిన పరిస్థితుల గురించి ఆరా తీశారు. కేసు నమోదు, దర్యాప్తుబస్సు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు. ప్రమాద ఘటనలో ఇప్పటివరకు 19 మంది చనిపోయారని చెప్పారు. గాయపడిన వారిని మహేందర్ రెడ్డి మెడికల్ హాస్పిటల్, చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించారు. తాండూర్ నుంచి హైదరాబాద్‌కు బస్సులో 72 మంది ప్రయాణికులు బయలుదేరారని చెప్పారు. ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. యమకింకర టిప్పర్ప్రమాదానికి కారణం అయిన టిప్పర్ నెంబర్ TG 06 T 3879గా అధికారులు గుర్తించారు. ఉదిత్య అనిత పేరుతో మహబూబ్‌నగర్ రిజిస్ట్రేషన్ అయినట్టు తెలుస్తోంది. పరిమితికి మించి కంకర నింపడంతో పాటు మితిమీరిన వేగం ఘోర ప్రమాదానికి కారణమైందని ప్రాథమిక సమాచారం.హృదయవిదారకం.. చేవెళ్ల బస్సు ప్రమాదం చిత్రాలు -
Chevella Incident: గ్రామస్తుల ఆందోళనతో పారిపోయిన ఎమ్మెల్యే
-
Chevella Bus Incident: కంకర మొత్తం బస్సులోకి వెళ్లడంతో కూరుకుపోయిన ప్రయాణికులు
-
Chevella Road Accident: రావొద్దని చెప్పినా వచ్చారు.. నా ముగ్గురు బిడ్డలు చనిపోయారు
-
హృదయవిదారకంగా.. చేవెళ్ల ఘోర ప్రమాద చిత్రాలు
-
చేవెళ్ల ఘటన అత్యంత విషాదకరం: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: తెలంగాణలోని చేవెళ్ల దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాజాగా ప్రమాదంపై వైఎస్ జగన్ స్పందించారు. రోడ్డు ప్రమాద ఘటన అత్యంత విషాదకరం, బాధాకరమని.. తీవ్రంగా కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. -
Chevella Bus Incident: ఆర్టీసీ బస్సు ప్రమాదంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి
-
Chevella Road Accident: కంకరలో కూరుకుపోయిన ప్రాణాలు
-
Chevella Road Accident: కంకరలో కూరుకుపోయిన ప్రాణాలు
-
చేవెళ్ల ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన.. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. గాయపడిన వాళ్లు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. అదే సమయంలో ప్రధాని సహాయ నిధి నుంచి పరిహారం ప్రకటించారు.తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం జరగడం చాలా బాధాకరం. ఈ క్లిష్ట సమయంలో బాధితులు, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి(PMNRF) నుంచి మరణించిన ప్రతి వ్యక్తి కుటుంబానికి రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా (ఆర్థిక సహాయం) అందించబడుతుంది. గాయపడిన వారికి రూ. 50,000 చెల్లించబడుతుంది అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారాయన. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో జరిగిన దుర్ఘటనలో సంభవించిన ప్రాణనష్టం నన్ను చాలా బాధించింది. ఈ క్లిష్ట సమయంలో బాధితులు, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.మరణించిన వారి కుటుంబానికి పీఎంఎన్ ఆర్ ఎఫ్ నుండి రూ.2…— PMO India (@PMOIndia) November 3, 2025తాండూరు డిపో నుంచి ప్రయాణికులతో బయల్దేరిన బస్సు.. మీర్జాగూడ క్రాస్ వద్ద ఘోర ప్రమాదానికి గురైంది. కంకర లోడ్‌తో వస్తున్న టిప్పర్ లారీ అదుపు తప్పి బస్సును ఢీ కొట్టింది. ఆపై కంకర లోడు మొత్తం బస్సులోకి పడిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో పలువురు ప్రయాణికులు స్పాట్లోనే కన్నుమూశారు. తెలంగాణ ప్రభుత్వం మీర్జాగూడ బస్సు ప్రమాదంపై విచారణకు ఆదేశించింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. -
ఒకే కుటుంబంలో ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతి
సాక్షి, చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందినట్టు మంత్రి పొన్న ప్రభాకర్ అధికారికంగా ప్రకటించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులకు ఆసుపత్రుల్లో చికిత్స జరుగుతోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మరోవైపు.. ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలను అధికారులు, పోలీసులు గుర్తిస్తున్నారు. బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెలు మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. తాండూరుకు చెందిన ఎల్లయ్య గౌడ్ ముగ్గురు కూతుళ్లు నందిని (డిగ్రీ ఫస్టియర్), సాయిప్రియ (డిగ్రీ థర్డ్ ఇయర్), తనూష (ఎంబీఏ) హైదరాబాద్‌లో చదువుకుంటున్నారు. ఇటీవల బంధువుల పెళ్లి ఉండటంతో ముగ్గురు సొంతూరుకు వచ్చారు. ఈరోజు తెల్లవారుజామున తిరిగి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం కారణంగా మృతి చెందారు. దీంతో, వారి కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. పోస్టుమార్టం అనంతరం తనూష, సాయి ప్రియా, నందిని మృతదేహాలు గ్రామానికి చేరుకున్నాయి,. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు ఈ ప్రమాదంలో పది మంది మహిళలు, ఒక చిన్నారి, ఎనిమిది మంది పురుషులు ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా పలువురి మృతుల వివరాలను అధికారులు వెల్లడించారు. 1.దస్తగిరి బాబా, డ్రైవర్; 2.తారిబాయ్ (45), దన్నారమ్ తండా; 3.కల్పన(45), బోరబండ; 4.బచ్చన్ నాగమణి(55); భానూరు; 5.ఏమావత్ తాలీబామ్, ధన్నారం తాండ; 6.మల్లగండ్ల హనుమంతు, దౌల్తాబాద్ మండలం;7.గుర్రాల అభిత (21) యాలాల్; 8.గోగుల గుణమ్మ,బోరబండ;9.షేక్ ఖాలీద్ హుస్సేన్, తాండూరు;10.తబస్సుమ్ జహాన్, తాండూరు.11. తనూషా, సాయిప్రియ, నందిని(ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెల్లు)12. అఖిల(తాండూరు).13. ఏనుగుల కల్పన14. నాగమణి, 15. జహంగీర్. క్షతగాత్రులు వీరే..వెంకటయ్యబుచ్చిబాబు-దన్నారమ్ తండాఅబ్దుల్ రజాక్-హైదరాబాద్వెన్నెలసుజాతఅశోక్రవిశ్రీను- తాండూరునందిని- తాండూరుబస్వరాజ్-కోకట్ (కర్ణాటక)ప్రేరణ- వికారాబాద్సాయిఅక్రమ్-తాండూరుఅస్లామ్-తాండూరు -
Chevella Bus Incident: కంకరలో కూరుకుపోయిన ప్రయాణికులు
-
TS: చేవెళ్లలో ఘోర బస్సు ప్రమాదం.. 17 మందికిపైగా మృతి
-
ఎమ్మెల్యేపై దాడికి యత్నం.. చేవెళ్ల ప్రమాదస్థలి వద్ద ఉద్రిక్తత
సాక్షి, రంగారెడ్డి: చేవెళ్ల మీర్జాగూడ బస్సు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సహాయక చర్యలు కొనసాగుతుండడంతో మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు అంటున్నారు. తాజాగా ఘటనాస్థలికి వెళ్లిన ఎమ్మెల్యే కాలె యాదయ్యకు నిరసన సెగ తలిగింది. రోడ్డు విస్తరణ ఎందుకు చేపట్టలేకపోయారు? అంటూ స్థానికులు ఆయన్ని నిలదీశారు. చేవెళ్ల ఘటనా స్థలంలో సోమవారం ఉదయం స్థానికులు ఆందోళన చేపట్టారు. జాతీయ రహదారిపై ఇప్పటిదాకా రోడ్డు విస్తరణ చేపట్టకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే కాలె యాదయ్యను నిలదీశారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ యాదయ్యపై దాడికి యత్నించబోయారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని శాంతింపజేశారు. దీంతో ఎమ్మెల్యే యాదయ్య వచ్చిన కారులో అలాగే వెళ్లిపోయారు.తాండూరుకు చెందిన ఆర్టీసీ బస్సు ఈ ఉదయం 4.45గం. బస్టాండ్ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరింది. అయితే అక్కడ 30 మంది ఎక్కారు. ఫస్ట్ ట్రిప్ కావడం.. ఎక్స్‌ప్రెస్ బస్సే అయినప్పటికీ పల్లె వెలుగు పేరిట నడపం, ప్రతీ స్టాపులో ఆపుతూ రావడంతో విద్యార్థులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో ఎక్కారు. కంకర లోడ్‌తో వెళ్తున్న టిప్పర్ మీర్జాగూడ టర్నింగ్ పాయింట్లో స్పీడ్‌ను కంట్రోల్ చేయలేకపోవడంతో అదుపుతప్పింది. బస్సును ఢీ కొట్టి ఆపై.. గుంత కారణంగా అదుపు తప్పి అలాగే బస్సు మీద ఒరిగిపోయింది. టిప్పర్ లారీ అతివేగం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు నిర్థారించగా.. బస్సు మీదకు ఒరిగిపోవడం, ఈ క్రమంలో కంకర మొత్తం బస్సులో పడిపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని చెబుతున్నారు. బస్సుకు కుడి వైపు కూర్చున్న 21 మంది స్పాట్లోనే మరణించినట్లు చెబుతున్నారు. ఘటనలో టిప్పర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సు డ్రైవర్ దస్తగిరి స్పాట్లోనే చనిపోగా.. కండక్టర్ రాధ ప్రాణాలతో బయటపడింది. మృతులంతా తాండూరు, చేవెళ్ల వాసులుగా తెలుస్తోంది. స్థానికులు, పోలీసులు కంకర నుంచి ప్రయాణికులను బయటకు తీసి రక్షించారు. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. యుద్ధప్రతిపాదికన సహాయక చర్యలు చేపట్టాలని సీఎస్, డీజీపీలను ఆదేశించారు. దీంతో మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను హైదరాబాద్‌కు తరలించే యోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. -
ఎన్‌హెచ్-163.. నెత్తుటి రహదారిపైనే ఘోర విషాదం
చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదంతో తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఘటనలో 17 మంది అక్కడికక్కడే మరణించగా.. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. అయితే ప్రమాదానికి అపోజిట్ వెహికల్ అతివేగం కారణమని తెలుస్తున్నప్పటికీ.. స్థానికులు మాత్రం ‘అలసత్వం’ కూడా ఓ కారణమనే విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన మార్గాల్లో హైదరాబాద్–బీజాపూర్ NH-163 రహదారి ఒకటి. వాణిజ్య, వ్యవసాయ, ప్రయాణ అవసరాలకు కీలకంగా ఉపయోగపడుతోంది. అయితే చాలా ఏళ్లుగా ప్రమాదాలకు కేంద్రబిందువుగా మారింది కూడా. తాజాగా వేగంగా దూసుకొచ్చిన కంకర టిప్పర్ బస్సును ఢీ కొట్టి బోల్తాపడి ప్రమాదం జరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇరుకు రోడ్డులో ఆ టిప్పర్ స్పీడ్ కంట్రోల్ కాకనే ఈ ఘోరం జరిగినట్లు స్పష్టమవుతోంది. దీంతో.. రహదారి విస్తరణ జరగకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని స్థానికులు అంటున్నారు. నిరుడు.. ఇదే సమయంలో ఈ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. డిసెంబర్లో ఆలూరు వద్ద లారీ అదుపు తప్పి కూరగాయలు అమ్ముకునేవాళ్లపై దూసుకెళ్లడంతో ఆరుగురు మరణించారు. ఆ సమయంలో స్థానికులు రోడ్డుపై భైఠాయించి.. రహదారి విస్తరణను డిమాండ్ చేశారు. అంతకు ముందు.. సెప్టెంబర్‌లో ఒకే రోజు జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మరణించారు. ఈ ఏడాది జూన్‌లో కేజీఆర్ గార్డెన్ సమీపంలో ఓ భారీ గుంతలో వాహనం బోల్తా పడి ఇద్దరు మరణించారు.ప్రమాదాలకు కారణాలివే.. ఇరుకైన రహదారి: రెండు వైపులా వాణిజ్య కార్యకలాపాలు, కూరగాయల మార్కెట్లు ఉండటంతో వాహనాల రాకపోకలు కష్టతరంగా మారాయి.రోడ్డు విస్తరణ జాప్యం: NH-163గా గుర్తింపు వచ్చినప్పటికీ, 46 కిలోమీటర్ల విస్తరణ పనులు ఇంకా పూర్తికాలేదు.గుంతలు, మలుపులు: వర్షాకాలంలో నీరు నిలిచే గుంతలు, అజాగ్రత్త మలుపులు ప్రమాదాలకు దారితీస్తున్నాయి.సిగ్నలింగ్ లోపం: ట్రాఫిక్ నియంత్రణ, స్పీడ్ బ్రేకర్లు, జాగ్రత్త సూచనలు లేకపోవడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయి.మొదలైన రెండు రోజులకే.. ఎన్‌హెచ్-163 ఇరుకు రోడ్డు వల్ల మొయినాబాద్ నుంచి చేవెళ్ల వరకు నిత్యం ప్రమాదాలు జరుగుతూ, వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో.. పోలీస్ అకాడమీ నుంచి మన్నెగూడ వరకు సుమారు 46 కి.మీ మేర నాలుగు లేన్ల రోడ్డు విస్తరణ కోసం గత ప్రభుత్వ హయాంలో రూ. 920 కోట్లు మంజూరయ్యాయి. ఈలోపు రోడ్డు విస్తరణలో చెట్లకు నష్టం కలుగుతుందని పేర్కొంటూ పర్యావరణ ప్రేమికులు అడ్డుపడ్డారు. కొన్ని గ్రామాల పెద్దలతో కలిసి జాతీయ పర్యావరణ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఆశ్రయించడంతో పనులు నిలిచిపోయాయి. అయితే.. ప్రజాప్రతినిధుల చొరవతో ఈ అంశంలో పురోగతి చోటు చేసుకుంది. ఈ రోడ్డు విస్తరణలో భాగంగా మొత్తం 950 చెట్లకు సంబంధించి అధికారులు ఒక ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు. 150 చెట్లను రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లో నాటించేందుకు అధికారులు హామీ ఇచ్చారు. మిగిలిన చెట్లను రోడ్డుకు మధ్యలో ఉంచడానికి వీలుగా డిజైన్ చేశారు. ఈ విజ్ఞప్తులతో పర్యావరణ ప్రేమికులు ఆ పిటిషన్లను ఉపసంహరించుకోగా.. మొన్న శుక్రవారమే(అక్టోబర్ 31) మొయినాబాద్-చేవెళ్ల రహదారి విస్తరణ పనులు ప్రారంభం అయ్యాయి. ఇంతలోనే ఈ ఘోరం చోటు చేసుకోవడం గమనార్హం. -
చేవెళ్ల దుర్ఘటన.. మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి
Chevella road accident Updates..చేవెళ్ల ఆర్టీసీ బస్సు ప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశంచేవెళ్ల బస్సు ప్రమాదంపై విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశంఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటనఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి మీర్జాగూడ ప్రమాదం కలచివేసింది.మృతుల కుటుంబాలను ఆదుకుంటాం ప్రభుత్వ పరిహారంతోపాటు సాయం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం ఆర్టీసీ ఇన్సూరెన్సును కూడా అందిస్తాం బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చే చర్యలు చేపడతాం గ్రీన్ ట్రిబునల్లో ఉండటం వల్ల రోడ్డు విస్తరణ ఆలస్యంరంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి చేవెళ్లలో బస్సు ప్రమాదం జరిగిందిఈ ప్రమాదంలో మొత్తం 19మంది మంది మృతి చెందారుప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి,పీఎం హాస్పిటల్‌కు తరలించాంమృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించారు ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు గ్రీన్ ట్రిబునల్లో ఉండటం వల్ల రోడ్డు విస్తరణ ఆలస్యం అయ్యింది మూడు రోజుల క్రితం దాన్ని డిస్మిస్ చేయడం జరిగిందికొద్దిరోజుల్లో రోడ్డు పనులు ప్రారంభం కానున్నాయి కానీ అనుకోని విధంగా ఈ ప్రమాదం జరిగిందిచేవెళ్ల బస్సు ప్రమాదంతో భారీ ట్రాఫిక్ జామ్చేవెళ్ల బస్సు ప్రమాదంతో భారీ ట్రాఫిక్ జామ్ రోడ్డు ప్రమాదంతో హైదరాబాద్-బీజాపూర్ హైవేపై స్తంభించిన వాహనాలుచేవెళ్ల-వికారాబాద్ మార్గంలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయిచేవెళ్ల ప్రమాదంపై రాష్ట్రపతి దిగ్భ్రాంతిచేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే బాధిత కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ఇవ్వాలని ఆమె ప్రార్థించారు. ఈ ఘటనలో గాయపడిన ప్రయాణికులు త్వరగా కోలుకోవాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు.కేసు నమోదు..మీర్జాగూడ ప్రమాద ఘటనపై కేసు నమోదు..బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు.ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ గుర్తింపు.మహారాష్ట్రకు చెందిన ఆకాశ్ కాంబ్లేగా గుర్తించారు.ప్రమాదంలో బస్సు డ్రైవర్ దస్తగిరి(38) మృతి. ఆలూరు నుంచి వాహనాల మళ్లింపుమీర్జాగూడ దగ్గర బస్సు ప్రమాదంతో భారీగా ట్రాఫిక్ జామ్.చేవెళ్ల-వికారాబాద్ మార్గంలో స్తంభించిన ట్రాఫిక్.ఆలూరు నుంచి వాహనాల మళ్లింపు.ఆలూరు-చేవెళ్ల మీదుగా హైదరాబాద్‌కు మళ్లింపు. మంత్రి పొన్నం ఎక్స్‌గ్రేషియా ప్రకటన.. ఇప్పటి వరకు 19 మంది మృతి చెందారు.బస్సు ప్రమాదంపై విచారణకు ప్రభుత్వం ఆదేశిస్తుంది.గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందిస్తున్నాం.రోడ్డు విస్తరణను ఎవరు అడ్డుకుంటున్నారో అన్ని బయటకు వస్తాయి.ఘటనపై రాజకీయం చేసేందుకు ఇది సమయం కాదు.బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. మృతుల కుటుంబాలకు ఐదు లక్షలు ఎక్స్గ్రేషియాక్షతగాత్రులకు రెండు లక్షల పరిహారం.కాసేపట్లో ఘటనా స్థలానికి సీఎం రేవంత్.. స్పాట్‌కు చేరుకున్న ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిఘటనా స్థలికి చేరుకున్న ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి.కాసేపట్లో చేరుకోనున్న రవాణా మంత్రి పొన్నంతీవ్రంగా గాయపడిన వారిని హైదరాబాద్‌కు తరలిస్తున్న అధికారులు..కొనసాగుతున్న సహాయక చర్యలు.మృతుల సంఖ్య పెరిగే అవకాశం.తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ కామెంట్స్..రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నన్ను తీవ్రంగా కలచివేసింది.ఈ ప్రమాదంలో మహిళలు, పిల్లలు సహా 20 మంది ప్రాణాలు కోల్పోయారు.నా ఆలోచనలు, ప్రార్థనలు తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలతో ఉన్నాయి.ఈ దుఃఖ సమయంలో వారికి ఓదార్పు లభిస్తుందని ఆశిస్తున్నాను.ప్రమాదంలో గాయపడిన వారికి నా సానుభూతిని అందిస్తున్నాను.వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.చేవెళ్ల ఘటనపై సెక్రటేరియట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటుప్రమాద వివరాలు - అధికారుల మధ్య సమన్వయం చేయనున్న కంట్రోల్ రూమ్.ప్రమాద సమాచారం కోసం AS: 9912919545SO: 9440854433 నంబర్లను సంప్రదించాలని కోరిన ప్రభుత్వంఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తీవ్ర దిగ్బ్రాంతి..ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడిన మంత్రిచేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న మంత్రిఅవసరమైన వారందరినీ హైదరాబాద్‌కు తరలించి చికిత్స అందించాలని ఆదేశాలు. ఉన్నతాధికారులంతా తక్షణమే ఆసుపత్రికి వెళ్లాలని మంత్రి ఆదేశంమంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర విచారంక్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం.ప్రమాదానికి గల కారణాలపై ఆరా, దిగ్భ్రాంతిసీఎం ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం సహాయక చర్యలు వేగం.బాధితులకు న్యాయం చేస్తాం.క్షతగాత్రులకు ప్రభుత్వం మెరుగైన వైద్య చికిత్స అందిస్తుంది.ఎంపీ డీకే అరుణ తీవ్ర దిగ్భ్రాంతి..ప్రమాదంలో 19 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం బాధాకరంఈ దుర్ఘటన వార్త తీవ్రంగా కలిచివేసిందిమృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాక్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలిఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలిప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలచివేసింది: కేంద్రమంత్రి కిషన్ రెడ్డిప్రమాద ఘటనపై స్పందించిన కిషన్ రెడ్డి.మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.ప్రమాదంలో గాయపడిన వారికి అవసరమైన వైద్య సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను.మంత్రి శ్రీధర్ బాబు దిగ్భ్రాంతి..బస్సు ప్రమాద దుర్ఘటనపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తీవ్ర దిగ్భ్రాంతి.జిల్లా కలెక్టర్, పోలీస్, ఇతర విభాగాల ఉన్నతాధికారులను అప్రమత్తం చేసిన మంత్రిప్రమాదం జరిగిన తీరును, క్షతగాత్రుల ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించాలని ఉన్నతాధికారులను ఆదేశంక్షతగాత్రులకు చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందించాలని ఆదేశం.ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి శ్రీధర్ బాబుగాయపడిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా ఉంటుందన్న హామీ.క్షతగాత్రులకు సంబంధించిన పూర్తి సమాచారం కుటుంబ సభ్యులకు తెలియజేసే ఏర్పాట్లు చేయాలని ఆదేశంమృతుల కుటుంబాలను ఆదుకోవాలి: కేసీఆర్ప్రమాదంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు సంతాపాన్ని ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకోవడంతో పాటు గాయపడిన ప్రయాణికులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.కేటీఆర్ సంతాపం..ప్రమాదంపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రయాణికులు మృతి చెందడంచ, పలువురు తీవ్రంగా గాయపడటం పట్ల ఆయన సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందించాలని, మృతుల కుటుంబాలను, గాయపడిన వారిని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల మండలం, ఖానాపూర్ స్టేజి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 17 మందికి పైగా ప్రయాణికులు మృతి చెందడం అత్యంత బాధాకరం.మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. పలువురు తీవ్రంగా గాయపడటం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాను.ప్రభుత్వం తక్షణమే స్పందించి వెంటనే…— KTR (@KTRBRS) November 3, 2025టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దిగ్భ్రాంతి..బస్సు ఘోర ప్రమాదంపై టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చేవెళ్ళేలో జరిగిన రోడ్డు ప్రమాదంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గాయపడ్డవారికి తగిన వైద్య చికిత్సలు చేయాలని సూచించారు. అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మృతులను తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.సీఎం రేవంత్ విచారం.. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని అధికారులకు సూచించారు. మంత్రులు ఘటనా స్థలానికి చేరుకోవాలని సూచించారు. 👉మరోవైపు... మీర్జాగూడలో ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన సంబంధించి వివరాలు, కారణాలపై ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో మాట్లాడారు. అలాగే, క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు మంత్రి పొన్నం సూచించారు. ఆర్టీసీ అధికారులు ఘటన స్థలానికి వెళ్లాలని మంత్రి ఆదేశించారు.👉ఇదిలా ఉండగా.. మీర్జాగూడ వద్ద తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మూడు జేసీబీల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. కంకరలో కూరుకుపోయిన వారిని బయటకు తీస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.👉ఆర్టీసీ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వీరిలో ఎక్కువగా విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. విద్యార్థులు హైదరాబాద్‌లోని పలు కళాశాలల్లో చదువుతున్నట్లు సమాచారం. ఆదివారం సెలవు కావడంతో ఇళ్లకు వెళ్లి.. తిరిగి నగరానికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంతో హైదరాబాద్-బీజాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్‌జామ్ అయింది. చేవెళ్ల-వికారాబాద్ మార్గంలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. -
చేవెళ్లలో ఘోర ప్రమాదం.. 20 మంది మృతి
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో సోమవారం వేకువ జామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చేవెళ్ల వద్ద ఆర్టీసీ బస్సును కంకర లోడ్‌తో వెళ్తున్న టిప్పర్ లారీ ఢీ కొట్టి బోల్తా పడిపోయింది. ఈ ఘటనలో 20 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదంలో 19మంది మరణించారని రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. క్షతగాత్రులకు చికిత్స అందుతుండగా.. వాళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చేవెళ్ల మండల పరిధిలో సోమవారం వేకువ ఝామున ఈ ఘోరం జరిగింది. తాండూరు డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్ బస్సు ఈ వేకువ జామున హైదరాబాద్‌కు బయల్దేరింది. తొలి ట్రిప్పు బస్సు కావడంతో అధిక సంఖ్యలో జనాలు ఎక్కారు. ఈలోపు.. బస్సు మీర్జాగూడ వద్దకు చేరుకోగానే కంకర లోడ్‌తో వెళ్తున్న టిప్పర్ వేగంగా దూసుకొచ్చి ఢీ కొట్టింది. ఆపై టిప్పర్ ఒరిగిపోవడంతో కంకర లోడ్ మొత్తం బస్సులోకి పడిపోయింది. తాండూరు బస్టాండ్ నుంచి బస్సు బయల్దేరిన దృశ్యంప్రమాదం ధాటికి బస్సు ముందు భాగం ధ్వంసం అయ్యింది. బస్సు, టిప్పర్ డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన గురించి సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. కంకరలో కూరుకుపోయిన వాళ్లను బయటకు తీసి ఆస్పత్రులకు తరలించారు. ఘటనా స్థలం వద్ద, బస్సుల్లో దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి. తమను కాపాడాలంటూ కంకరలో కూరుకుపోయిన వాళ్లు వేడుకోవడం.. అచేతనంగా కొందరు పడి ఉండడం కలవరపాటుకు గురి చేస్తోంది. ఈ ప్రమాదంలో 20 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. మరో 32 మందికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. గాయపడినవాళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది.బస్సులో కంకర మధ్య విగతజీవిగా యువతి.. ఆ వెనక సగం కూరుకుపోయి సాయం కోసం ఎదురు చూస్తున్న యువకుడుకంకర టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది. అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన టిప్పర్.. అదుపు తప్పి బస్సుపై బోల్లా పడిందని పోలీసులు చెబుతున్నారు. కంకర మొత్తం బస్సులో పడిపోవడంతో ఈ తీవ్రత ఎక్కువైందని అంటున్నారు.ప్రమాద సమయంలో బస్సులో 72 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం సెలవు కావడంతో సిటీ నుంచి వెళ్లినవాళ్లు తిరుగు పయనమైనట్లు స్పష్టమవుతోంది. అందులో విద్యార్థులు, ఉద్యోగులే ఎక్కువగా ఉన్నారు. మొత్తం 20 మంది మృతుల్లో 10 మంది మహిళలు, ఒక చిన్నారి, 8 మంది పురుషులు(ఇద్దరు డ్రైవర్లుసహా) ఉన్నారు. మృతుల్లో పది నెలల పసికందు, ఆమె తల్లి కూడా ఉండడం కలిచివేస్తోంది. కేబిన్లలో ఇరుక్కుపోయిన టిప్పర్ డ్రైవర్, బస్సు డ్రైవర్ మృతదేహాన్ని బయటకు తీశారు. మరో 15 మంది ప్రయాణికులను కాపాడగలిగారు. కంకరను పూర్తిగా తొలగించేందుకే జేసీబీ సహాయం తీసుకున్నారు.👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ఇదిలా ఉంటే.. సహయ చర్యల్లో పాల్గొన్న సీఐ భూపాల్‌కు గాయాలయ్యాయి. జేసీబీ ఆయన కాలు మీదకు ఎక్కింది. దీంతో ఆయనకు చికిత్స అందించారు. ఇక ఈ ప్రమాదం వల్ల చేవెళ్ల-వికారాబాద్ బీజాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మూడు కిలోమీటర్ల వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో అధికారులు రంగంలోకి ట్రాఫిక్‌ను క్లియర్ చేసే పనిలో ఉన్నారు.


