వికారాబాదు జిల్లా: నా రెండో కూతురు ఉద్యోగం చేస్తూ నెలకు రూ.60 వేలు సంపాదించేది.. ఇప్పుడు ముగ్గురు కూతుళ్లు నాకు పంపిన జీతమా ఇది పటేలా? అంటూ.. తనూష, సాయిప్రియ, నందిని తండ్రి ఎల్లయ్యగౌడ్ రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ప్రభుత్వం అందజేసిన నష్టపరిహారం అందుకున్న సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలివి. మీర్జాగూడ బస్సు ప్రమాదంలో ముగ్గురు కుమార్తెలను కోల్పోయిన బాధిత తల్లిదండ్రులను వారి స్వగ్రామమైన పేర్కంపల్లిలో.. ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి మంగళవారం పరామర్శించారు. అనంతరం మృతులు ఒక్కొక్కరికి ప్రభుత్వం ప్రకటించిన రూ.5 లక్షలు, ఆర్టీసీ తరపున రూ.2 లక్షల చెక్కులను మొత్తం రూ.21 లక్షల విలువైన చెక్కులను ఎల్లయ్యగౌడ్‌కు ఆయన అందజేశారు.



