లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని షామ్లిలో దారుణం చోటు చేసుకుంది. స్వల్ప వివాదానికే ఒక వ్యక్తి తన భార్యను, ఇద్దరు చిన్న కుమార్తెలను హత్య చేశాడు. అంతేకాదు ముగ్గురు బాధితుల మృతదేహాలను వారి ఇంటి ప్రాంగణంలోని ఏడు అడుగుల లోతైన గొయ్యిలో పాతిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. తల్లీ పిల్లలు ఆరు రోజులుగా కనిపించకుండా పోవడంతో అందిన ఫిర్యాదు మేరకు జరిగిన విచారణలో ఈ నేరం వెలుగులోకి వచ్చింది. విచారణలో, ఫరూఖ్ నేరం అంగీకరించాడని తెలుస్తోంది.
నిందితుడిని కాంధ్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని గర్హి గ్రామానికి చెందిన ఫరూక్‌గా గుర్తించారు. పోలీసుల ప్రకారం, ఫరూక్ తన భార్య తాహిరా (32) బుర్ఖా ధరించకుండా తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చినప్పుడు ప్రారంభమైన వాగ్వాదం తీవ్రమైంది. దీంతో కోపోద్రిక్తుడైన భర్త తొలుత భార్యను కాల్చి చంపాడు. ఆ తరువాత కుమార్తెలు అఫ్రీన్ (14) , సెహ్రీమ్ (7)కూడా పొట్టనబెట్టుకున్నాడు.
ఈ జంటమధ్య గత కొన్ని నెలలుగా తరచుగా గొడవలు ఎదుర్కొంటున్నారని పోలీసు అధికారులు తెలిపారు. కుటుంబ వివాదాలతో ఫరూక్ తల్లిదండ్రులు దావూద్ ,అస్గారి నుండి విడిగా ఉంటున్నాడు. ఈ దంపతులకు మొత్తం ఐదుగురు పిల్లలు ఉన్నారు, వారిలో ముగ్గురు సంఘటన సమయంలో లేనందున ప్రాణాలతో బయటపడ్డారు. డిసెంబర్ 9-10 రాత్రి హత్యలు జరిగాయని పోలీస్ సూపరింటెండెంట్ ఎన్ పి సింగ్ తెలిపారు. టీ తయారుచేసే నెపంతో ఫరూఖ్ తన భార్యను నిద్రలేపి, ఆపై ఆమెను , పెద్ద కుమార్తెను కాల్చి చంపాడు. ఈ దారుణాన్ని చూసిన చిన్న కుమార్తె గొంతు కోసి చంపేశాడు. ఆ తరువాత ఇంట్లోనే లోతైన గొయ్యి తవ్వి, మృతదేహాలను పాతిపెట్టి, ఆ ప్రదేశాన్ని ఇటుకలతో కప్పేశాడ. పథకం ప్రకారం ఈ హత్యలు జరిగినట్టు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. ఆర్థిక ఒత్తిడి, తరచుగా వాదనలు, కోపం, అవమాన భారంతోనే ఈ తప్పు చేశానని ఫరూఖ్ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.
Shamli, Uttar Pradesh: A husband allegedly killed his wife and two daughters and buried their bodies in a 9-foot-deep pit at home
SP N.P. Singh says, “On Tuesday evening around 5 PM, the village head of Gaungori Daulat under Kandhla police station informed us that a man named… pic.twitter.com/RITXJLfsCY— IANS (@ians_india) December 17, 2025


