సాక్షి,ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీలో వాయు కాలుష్యానికి ట్రాఫిక్ సమస్య కూడా ప్రధాన కారణమని కోర్టు తెలిపింది. ఢిల్లీ వాయుకాలుష్యంపై బుధవారం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో ఉన్న తొమ్మిది టోల్‌ప్లాజాలను వేరే చోటుకు మార్చాలని ఎన్‌హెచ్‌ఐఏకు నోటీసులు జారీ చేసింది.
ఢిల్లీ వాయుకాలుష్యంపై నమోదైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది. వాయు కాలుష్య నివారణకు సరైన నిర్ణయం త్వరతగతిన తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. ఢిల్లీనగరంలోని 9టోల్ప్లాజాల తాత్కాలిక సస్పెండ్కు వారంలోగా నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ "మాకు టోల్‌గేట్స్ ద్వారా మీరు సంపాదించే ఆదాయం వద్దు. కానీ మీరు ఖచ్చితంగా ఈ టోల్స్ వల్ల సమస్యలు సృష్టిస్తున్నారు. టోల్ప్లాజా లేకుండా ఖచ్చితమైన ప్లాన్ జనవరి 31లోగా రూపొందించాలి" అని జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు.
కాగా ప్రస్తుతం ఢిల్లీ ఎదుర్కొంటున్న వాయు కాలుష్యానికి గత ఆప్ ప్రభుత్వమే కారణమని ఆరాష్ట్ర మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా అన్నారు. రాజధానిలో ప్రస్తుతం నెలకొన్న వాయుకాలుష్య పరిస్థితులపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీకి కాలుష్యం అనే జబ్బు అంటించింది కేజ్రీవాల్ సర్కారేనన్నారు. అయితే వాయు కాలుష్యానికి బాధ్యత వహించాల్సిందిపోయి ఇప్పుడు ఆ అంశంపై కేజ్రీవాల్ రాజకీయాలు చేస్తున్నారన్నారని మంత్రి ఆరోపించారు.


