ఢిల్లీలో ప్రస్తుతం వాయు కాలుష్యం తీవ్ర ప్రమాదకరమైన స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. వాయు కాలుష్యం పరిమితికి మించి ఉండడంతో ప్రభుత్వం సైతం పలు కీలక చర్యలకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలో చైనా, భారత్‌కు ఒక ఆఫర్ ఇచ్చింది. ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి కొన్ని మెలకువలు పాటించాలని తెలిపింది. వాటిని ఒక్కొక్కటిగా వివరిస్తూ బీజింగ్ ఎంబసీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.
ఢిల్లీ వాయుకాలుష్యం రోజురోజుకి తీవ్ర ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది. గాలికాలుష్యం నియంత్రణ కోసం ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ఫలించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఢిల్లీలో పనిచేసే అన్ని సంస్థలకు 50శాతం వర్క్‌ఫ్రమ్ హోమ్ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆంక్షలతో పనులు చేయలేకపోతున్న నిర్మాణరంగ కార్మికులకు ప్రభుత్వం రూ. 10 వేలు పరిహారం అందిస్తుంది. అయినప్పటికీ గాలి నాణ్యత మెరుగవుతుందన్న ఆశలు పూర్తిస్తాయిలో లేవు.
ఈ విషయమై ఆ రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి సైతం తొమ్మిది నెలల్లో గాలి కాలుష్యాన్ని తగ్గించలేమని అది సాధ్యమయ్యే ప్రక్రియ కాదని తెలిపారు. ఈ నేపథ్యంలో చైనా ఢిల్లీకి ఒక సజేషన్ ఇచ్చింది ఒకప్పుడు చైనా రాజధాని బీజింగ్‌లో కూడా తీవ్రమైన వాయుకాలుష్యం ఉండేదని అయితే తగిన చర్యలు తీసుకోవడంతో ప్రస్తుతం ఆపరిస్థితులు మారాయని తెలిపింది.
ప్రస్తుతం చైనా-భారత్ రెండు దేశాలు పట్టణీకరణ కారణంగా విపరీతమైన వాయు కాలుష్యాన్ని ఎదురుకుంటున్నాయని చైనా ఎంబసీ స్పోక్స్ పర్సన్ యూ జింగ్ పేర్కొన్నారు. అయితే చైనా గత దశాబ్దకాలంగా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో ప్రస్తుతం పరిస్థితి కొంత మెరుగైందని తెలిపారు. భారత్ సైతం కొన్ని నియామాలు పాటిస్తే గాలి కాలుష్యాన్ని అరికట్టవచ్చన్నారు.
బీఎస్ 6 వెహికల్స్ మాత్రమే అనుమతించాలి.
సర్సీస్ పూర్తి చేసుకున్న వాహనాలకు అనుమతి నిరాకరణ.
కార్లపై పెరుగుదలపై ఆంక్షలు విధించాలి.
వాహనాలు రోడ్డుపై రావడానికి సరిసంఖ్య, బేసిసంఖ్యలతో లాటరీ సిస్టమ్ తీయాలి
మెట్రో నెటెవర్క్‌ను విస్తరించాలి.
బస్సు సదుపాయాలని మెరుగుపరచాలి.
ప్రస్తుత వాహనాలను ఎలక్ట్రిక్ విధానంలోకి మార్చాలి.
అంతేకాకుండా కాలుష్య నియంత్రణకు బీజింగ్‌తో కలిసి పనిచేయాలని యూ జింగ్ తెలిపారు. డిసెంబర్ 15న ఢిల్లీ, బీజింగ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌కు సంబంధించిన చిత్రాలను ఆమె ఎక్స్‌లో షేర్ చేసింది. దీనిలో ఢిల్లీ AQI 447గా ఉండగా, బీజింగ్ AQI 67 గా ఉంది. అయితే భారత్ 2020 ఏప్రిల్ 1నుండే ఢిల్లీలో బీఎస్6 వాహనాల వాడకం తప్పనిసరి చేసింది.


