చైనా.. మనకు పొరగునున్న దేశం. ఈ దేశం తీరు ఎవ్వరికీ అర్థం కాదు. ఒకవైపు మిత్రత్వం చేస్తూనే తమ సరిహద్దుల్లో ఉన్న భూభాగాల్ని తమదే అంటుంది. ఆ విషయం ఇటీవల రష్యా భూభాగాన్ని తన మ్యాప్‌లో చూపించడంతో చైనా వైఖరి మరోసారి బయటపడింది. అంతకుముందు భారత్ భూభాగాల్ని అనేకసార్ల తన మ్యాప్‌ల్లో చూపించింది చైనా.
సత్సంబంధాలు దిశగా పయనిస్తున్నా..
చైనాతో ప్రస్తుతం భారత్ సత్సంబంధాలు దిశగా పయనిస్తున్నప్పటికీ, అవకాశం వస్తే దొంగ దెబ్బ తీయడానికి కూడా వెనుకాడదు అనేది గతంలో చాలాసార్లు నిరూపణ అయ్యింది. గాల్వాన్ ఎపిసోడ్‌లో ఎంతటి రాద్దాంతం జరిగిందో అందరికి తెలిసిందే. 2020, జూన్ 15వ తేదీన భారత–చైనా గాల్వాన్ జరిగిన ఘటన హింసాత్మకమనే చెప్పాలి.
ఈ సంఘటనలో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోగా, అనేకమంది చైనా సైనికులు కూడా మరణించారు. ఇది 45 సంవత్సరాల తర్వాత లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (LAC) వద్ద జరిగిన అత్యంత హింసాత్మక ఘర్షణగా నిలిచిపోయింది. ఆ తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ జోక్యంతో చైనా దూకుడు తగ్గించింది. అదే సమయంలో భారత్‌తో స్నేహ సంబంధాలకోసం చేతులు చాచింది. ఆ క్రమంలోనే ఇటీవల ఇరదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడ్డాయి. ఐదేళ్ల తర్వాత భారత విమానాలు.. చైనా గగనతలంలోకి వెళుతున్నాయి.
చైనా మారిందా.. నటిస్తుందా..?
కానీ తన వైఖరిని పూర్తిగా మార్చుకుందా అనేది ప్రశ్నార్థకమే. ఎప్పుడు ఏదో వివాదంతో అగ్నికి ఆజ్యం పోయాలనే చూస్తూ, అవకాశం కోసం ఎదురుచూస్తూ తన పొరుగు దేశాలను ఏదో రకంగా గిల్లుతూనే ఉంటుంది. ఇప్పుడు రష్యా విషయంలో కూడా అదే జరిగింది. రష్యాతో స్నేహం నటిస్తూనే ఆ దేశ భూభాగాన్ని చైనా తన మ్యాప్‌లో చూపించింది. దీన్ని బట్టి అర్థమయ్యే విషయం ఏంటంటే.. ప్రత్యర్థి దేశం ఏమాత్రం బలహీనంగా ఉన్నా వారిపైకి మెల్లగా తన అస్త్రాలను వదులుతుంది. రష్యా విషయంలో కూడా అదే జరిగింది.
ప్రస్తుతం రష్యా ఆర్థిక పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. ఉక్రెయిన్‌తో సుదీర్గకాలంగా చేస్తున్న యుద్ధం కారణంగా రష్యా సైతం ఆర్థికంగా గాడిన పడటానికి అపసోపాలు పడుతోంది. ఇటువంటి తరుణంలో రష్యా భూభాగాన్ని తన మ్యాప్‌లో చూపించే యత్నం చేసింది డ్రాగన కంట్రీ. ఒక రాయి వేసి చూద్దాం అసలు ఏం జరుగుతుందా అనే వైఖరిని బాగా వంట బట్టించుకున్న చైనా.. అవకాశం వచ్చినప్పుడు ఈ జిత్తులు మారిన చేష్టలు చేస్తూనే ఉంటుంది.
అమెరికాతో తీవ్రపోటీ..
అగ్రరాజ్యం అమెరికాతో సంబంధాలు ఆశాజనకంగా లేవనే సంగతిని పక్కన పెడితే. ఆ దేశంతో ఇటీవల కాలంలో నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి వెళ్లింది చైనా. పూర్తిగా ఇరు దేశాల మధ్య శత్వుత్వం లేకపోయినా తీవ్ర పోటీ ఉంది. ఆ క్రమంలోనే వారి మధ్య టారిఫ్ వార్ గట్టిగానే జరిగింది. ఇది కేవలం టారిఫ్ వార్‌గా అభివర్ణించినా, విషయం మాత్రం సీరియస్‌గానే ఉండటంతో మిత్రత్వం కోసం భారత్‌తో మిత్రత్వం కోసం పాకులాడింది.
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటి అనే భావన చైనాలో ఉండటమే కాదు.. అత్యంత నమ్మదగిన దేశాలలో భారత్ ఒకటి అనే విషయాన్ని కూడా చైనా బాగానే గ్రహించింది. దాంతోనే భారత్‌తో స్నేహం కోసం నిరీక్షించి మరీ ఆ దిశగా సక్సెస్ అయ్యింది. ఆ క్రమంలోనే ఐదేళ్ల తర్వాత ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు గాడిలో పడ్డాయి.
అరుణాచల్ ప్రదేశ్ మాదేనంటూ..
ఇటీవల చోటు చేసుకున్న ఘటనను చూసుకుంటే.. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ మహిళను చైనా ఎయిర్‌పోర్ట్‌లో ముప్పుతిప్పలు పెట్టారు చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు. తన పాస్‌పోర్ట్‌ను పరిశీలించే క్రమంలో అరుణాచల్ ప్రదేశే్-భారత్ అని ఉందేంటని ఆ అధికారులు ఆ మహిళను వేధింపులకు గురి చేశారు. యూకేలో ఉంటున్నభారత సంతతికి చెందిన అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన మహిళను చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు తీవ్ర ఇబ్బందులు పెట్టారు. ఆమె పాస్‌పోర్ట్‌పై అరుణాచల్‌ప్రదేశ్-భారతదేశం అని ఉండటంతో చైనా అధికారుల కోపం కట్టలు తెంచుకుంది. అరుణాచల్ ప్రదేశ్ అనేది చైనాలో బాగమని ఆమెతో వాదించారు. ఆ పాస్‌పోర్ట్ చెల్లదు అంటూ తీవ్ర అసహనానికి గురిచేశారామెను.
పెమా వాంఘజామ్ థోంగ్‌డాక్ అనే లండన్ నుంచి జపాన్‌కు వెళ్తున్న సమయంలో ఇది చోటు చేసుకుంది. మధ్యంతర విరామంలో భాగంగా చైనాలోని షాంఘై ఎయిర్‌పోర్ట్‌లో మూడు గంటలు పాటు వేచి ఉన్న ఆమెకు.. చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇబ్బందులకు గురి చేశారు. కానీ అక్కడ భారత ఎంబాసీ అధికారులు జోక్యం చేసుకోవడంతో చివరకు ఆ మహిళ ఎలాగోలా బయటపడింది. మరి ఈ విషయం ప్రపంచానికి తెలిసినప్పుడు చైనా ప్రభుత్వానికి తెలియదా.. కచ్చితంగా తెలిసే ఉంటుంది. మరి ఏమైనా మాట్లాడిందా అంటే అదీ లేదు. ఇది చిన్న విషయంగా కనిపించినా, ఇటువంటి వాటిని ఆదిలోనే తుంచేయాలి. అలాగే డ్రాగన్ కంట్రీపై సీరియస్‌గా భారత్ దృష్టిసారించి ఉండాల్సిందే.
ఇదీ చదవండి:


