బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ లీడర్ హసంత్ అబ్దుల్లా భారత్‌పై కారు కూతలు కూశారు. భారత్‌ను చీల్చే ప్రయత్నాలు చేసే వ్యక్తులకు, సంస్థలకు తమ దేశం ఆశ్రయం ఇస్తుందని విద్వేశపూరిత వ్యాఖ్యలు చేశారు. ఆ ఆశ్రయంతో భారత్‌లోని ఈశాన్యప్రాంతం ప్రాంతం విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉందని తీవ్రంగా మాట్లాడారు. కాగా ఆ వ్యాఖ్యలను అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఖండించారు.
బంగ్లాదేశ్ ఎన్సీపీ లీడర్ అబ్దుల్లా భారత్‌ను బెదిరిస్తూ పిచ్చిగా మాట్లాడారు. అబ్దుల్లా మాట్లాడుతూ "నేను ఒక విషయం భారత్‌కు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. బంగ్లాదేశ్‌లో భారత్‌కు వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తులకు, ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం కల్పిస్తాం. దానివల్ల భారత్ నుంచి ఈశాన్య ప్రాంతం వేరయ్యే అవకాశముంది". అని హెచ్చరించారు. బంగ్లాదేశ్ సౌర్వభౌమాధికారాన్ని, మానవహక్కులని గౌరవించని వారికి భారత్ ఆశ్రయం కల్పిస్తే బంగ్లాదేశ్ సమాధానమిస్తుందని తెలిపారు.
అయితే ఈ వ్యాఖ్యలపై అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ స్పందించారు. "ఈ వ్యాఖ్యలు చాలా ప్రమాదకరమైనవి, గతేడాది నుంచి తరచుగా ఈశాన్య రాష్ట్రాలని భారత్ నుంచి విడగొడతాం అని వ్యాఖ్యానిస్తున్నారు. భారత్ ఈ విషయంలో మౌనంగా ఉండకూడదు" అని హిమంత అన్నారు. భారత్‌లోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్. త్రిపుర రాష్ట్రాలను కలిపి సెవెన్‌సిస్టర్స్ అని అంటారు.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం భారత్‌లో తలదాచుకుంటుంది. గతేడాది ఆ దేశంలో జరిగిన ఘర్షణల తర్వాత హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్‌లో ఆశ్రయం పొందింది. అయితే కొద్దిరోజుల క్రితం హసీనాకు బంగ్లాదేశ్‌లోని కోర్టులు 21 సంవత్సరాల జైలుశిక్షతో పాటు మరణశిక్ష విధించాయి. దీంతో షేక్ హసీనాను బంగ్లాకు అప్పగించాలని బంగ్లాదేశ్ భారత్‌ను కోరింది. అయితే దీనిపై భారత్ ఇంకా ఎటువంటి అధికారిక నిర్ణయం వెల్లడించలేదు.


