Leader
-
తిరుపతిలో దారుణం.. మహిళను జుట్టు పట్టి ఈడ్చుకెళ్లిన TDP కార్యకర్త
-
ఆలయ చైర్మన్ రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య
-
మద్ది శ్రీనివాస్ రాసలీలలు.. భార్య సంచలన నిజాలు
-
టీడీపీ ఎంపీ డ్రగ్స్ కేసుపై పోలీసుల షాకింగ్ నిజాలు
-
భార్యకు అడ్డంగా దొరికిన వెలగపూడి అనుచరుడు
-
వేరే మహిళతో.. వెలగపూడి అనుచరుడి రాసలీలలు
-
డ్రగ్స్ పార్టీలో పట్టుబడ్డ టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్
-
టీడీపీ కీలక నేత.. నోరు విప్పితే బూతు పురాణం!
శ్రీకాకుళం కార్పొరేషన్లో మరో ఇంజనీరింగ్ అధికారి అవుట్. మున్సిపల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న పి.కమలాకర్ కీలక నేత టార్చర్ భరించలేక సెలవు పెట్టేసినట్టు తెలిసింది. చెప్పిన పనులన్నీ చేయలేక చేతులెత్తేశారు. అడ్డగోలుగా బిల్లులు చెల్లించలేక తప్పుకుంటున్నారు. కీలక నేత నోటి దురుసును తట్టుకోలేక వెళ్లిపోవడమే మంచిదంటూ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అనారోగ్య సమస్యలు చూపించి సెలవు కోసం దరఖాస్తు చేశారు. అంతకుముందే వీఆర్ కోసం కూడా దరఖాస్తు చేశారు. ఎంతవేగంగా తనను వదిలేస్తే అంత మంచిదని కోరుకుంటున్నారు. గార తహసీల్దార్‌గా పనిచేస్తున్న చక్రవర్తి కూడా సెలవుపై వెళ్లిపోయారు. ఈయన కూడా కీలక నేత, అనుచరుల సతాయింపు భరించలేక సెలవు పెట్టేసి ఆఫీసుకు రావడం మానేశారు. అంపోలులో వివాదాస్పద భూములను పచ్చ నేతలకు రాసిచ్చేయాలని ఒత్తిడి చేయడమే కాకుండా అందరి మధ్య నోటికొచ్చినట్టు బూతులు తిట్టడంతో మనస్థాపానికి గురై సెలవుపై వెళ్లిపోయినట్టు తెలిసింది. జిల్లా పౌరసరఫరాల అధికారులు సైతం ఇదే రకమైన సతాయింపునకు గురవుతున్నారు. కీలక నేత మాటలు తట్టుకోలేక, ఆయన చెప్పినదల్లా చేయలేక ఎంత వేగంగా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలా? అని చూస్తున్నారు. గ్రామాల్లో ఉన్న రేషన్ డీలర్లను తీసేయమని, సస్పెండ్ చేయమని ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసింది. ఆ నేత చెప్పినట్టు చర్యలు తీసుకుంటే సదరు డీలర్లు హైకోర్టుకు వెళ్లి అనుకూల ఆర్డర్లు తెచ్చుకోవడంతో తప్పని పరిస్థితుల్లో చర్యలు ఉపసంహరించుకోవల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దానికి కారణం అధికారులే అంటూ ఒంటికాలిపై లేచి వారిని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నట్టు సమాచారం. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళం నియోజకవర్గంలో కీలక నేత టార్చర్ భరించలేక అధికారులు భయపడుతున్నారు. చెప్పినట్టు చేయాలని, సూచించినట్టు బిల్లులు చేయాలని, ఆదేశించిన వారిపై చర్యలు తీసుకోవాలని పీకమీద కత్తి మీద పెడుతుండటంతో హడలెత్తిపోతున్నారు. చర్యలు తీసుకోకపోతే కీలక నేత ఒత్తిడి.. చర్యలు తీసుకుంటే కోర్టుల నుంచి అక్షింతలు.. వెరసి ముందుకెళ్లితే నుయ్యి వెనక్కి వెళ్లితే గొయ్యి అన్న చందంగా అధికారుల పరిస్థితి తయారైంది. దీపం ఉండగా ఇళ్లు చక్క దిద్దుకోవాలన్న ఆలోచనతో సంపాదించడమే పనిగా పెట్టుకున్న సదరు కీలక నేత దాని కోసం అడ్డదారులు తొక్కుతూ అధికారులను ఒత్తిడికి గురి చేస్తున్నారు. నోరు విప్పితే బూతులే.. ఆ కీలక నేత నోరు విప్పితే చాలు బూతులే వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఏకంగా ఉద్యోగుల పైకే వచ్చేస్తూ పరుష పదజాలంతో దూషిస్తున్నారు. ఇలాగే, గతంలో ఓ జిల్లా అధికారిని నోటికొచ్చినట్టు మాట్లాడితే ఆయన తిరగబడ్డాడు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అధికారి కావడంతో వ్యవహారం పెద్దదైపోతుందని రాజీ ధోరణికి వచ్చారు. ఆ తర్వాత కార్పొరేషన్లో దక్షిణామూర్తి అనే అధికారి కూడా కీలక నేత బూతులు భరించలేక వెళ్లిపోయారు. తాజాగా మరో ఇద్దరు బాధితులు.. డయేరియాకు ముందు కమిషనర్‌గా వచ్చిన హనుమంతు కూర్మారావు సస్పెన్షన్ వెనక కూడా కీలక నేత హస్తం ఉందని ఆరోపణలు ఉన్నాయి. చేసిందంతా చేసి తిరిగి ఇంటికి వెళ్లి పరామర్శించి, తనకేమి సంబంధం లేదన్నట్టుగా కలరింగ్ ఇచ్చుకున్నారు. తాజాగా మున్సిపల్ ఇంజనీర్ కమలాకర్ కూడా ఈయన బాధితుడయ్యారని అంటున్నారు. సతాయింపుతో పాటు అడ్డగోలుగా బిల్లులు చెల్లించాలని ఒత్తిడి చేయడంతో రిటైర్మెంట్ దగ్గరకు వచ్చే వేళ తప్పు చేస్తే తనకు రావాల్సిన బెనిఫిట్స్‌కు గండి పడుతుందన్న ఉద్దేశంతో ముందస్తు అప్రమత్తతతో సెలవుపై వెళ్లేందుకు దరఖాస్తు పెట్టుకున్నట్టు చర్చ జరుగుతోంది. ఈయన్నే కాదు కార్పొరేషన్ పనిచేస్తున్న అనేక మంది అధికారులను కీలక నేత నోటికొచ్చినట్టు మాట్లాడటమే కాకుండా బూతు పురాణం విప్పుతున్నట్టు ఎప్పటి నుంచో విని్పస్తోంది. అన్నింటా అదే తీరు.. మున్సిపల్ కార్పొరేషన్, రిమ్స్, తహసీల్దార్, మండల పరిషత్ కార్యాలయాలతో పాటు ఇతర కార్యాలయాల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగులపైన సదరు కీలక నేత జులుం ప్రదర్శిస్తున్నారు. కొందరు అధికారులు జీ హుజూర్ అంటుండగా.. తమకు ఎప్పటికైనా ముప్పు తప్పదనే వారు సెలవుపై వెళ్లిపోతున్నారు. -
TG: కాంగ్రెస్ నేత దారుణ హత్య
సాక్షి, నిజామాబాద్ : జిల్లాలో దారుణం జరిగింది. గౌరారం వద్ద కాంగ్రెస్ నేత గోపిని దుండగులు కారుతో వేగంగా ఢీకొట్టారు. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ వివరాలు తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. అయితే ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
రాసలీలలతో అడ్డంగా దొరికిపోయి కన్పించకుండా పోయిన బిఆర్ నాయుడు
-
కోటం రెడ్డికి ఎదురు తిరిగినందుకు.. టీడీపీ నేత ఇల్లు కూల్చివేత..!
-
ఆ బూతులేంటి..? కోటంరెడ్డి పై రెచ్చిపోయిన నెల్లూరు టీడీపీ నేత
-
మహిళల ఫొటోలు తీసి.. మంగళగిరిలో టీడీపీ కార్యకర్త అరాచకాలు
-
ట్రంప్ నిన్ను వదలం.. ఖమేనీ సన్నిహితుడి వార్నింగ్
ఇరాన్ సుప్రీం ఆయతుల్లా ఖమేనీ అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడుల్లో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆయన హత్యతో పశ్చిమాసియా భగ్గుమంది. ఇరాన్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. అయితే ఖమేనీ హత్యపై ఇరాన్ దేశ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీ తీవ్రంగా స్పందించారు. తమ దేశ సుప్రీం హత్యకు ట్రంప్ మూల్యం చెల్లించాల్సిందేనని హెచ్చరించారు.ఫిబ్రవరి 28 ఇరాన్ చరిత్రలో అత్యంత విషాదకరమైన రోజు ఆ దేశ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ.. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడిలో మృతి చెందారు. దీంతో ఇరాన్ శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రతీకారేచ్చతో రగిలిపోయి ఏక కాలంలో గల్ఫ్ దేశాలతో పాటు ఇజ్రాయెల్‌పై దాడులకు తెగబడుతుంది. తాజాగా ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ లారిజానీ ఈ అంశంపై స్పందించారు. ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామన్నారు."మేము మా నాయకుడి రక్తానికి మా ప్రజల మృతికి నిరంతరం ప్రతీకారం తీర్చుకుంటాం. ట్రంప్ దీనికి మూల్యం చెల్లించాలి. చెల్లిస్తాడు కూడా మేము ఆయనను ఒంటరిగా వదిలిపెట్టం, అతను మా నాయకున్ని చంపడంతో పాటు 1000 మందికి పైగా ప్రాణాలను బలిగొన్నాడు. ఇది మాములు విషయం కాదు " అని అన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇస్లామిక్ రిపబ్లిక్‌ను విడగొట్టే కుట్రలు పన్నుతున్నాయని తెలిపారు.వెనెజువెలా మాదిరి ఇరాన్లో కూడా ప్రభుత్వాన్ని కూలదోయాలనుకున్నారు. కానీ వారు అనుకున్న విధంగా జరగలేదు. ఇరాన్‌లోని పరిస్థితిని అంచనా వేయడంలో వారు పూర్తిగా విఫలమయ్యారని లారిజానీ అన్నారు. గల్ఫ్ దేశాలు వారి దేశంలో నుంచి తమపై దాడి చేయకుండా నియంత్రించాలని లేని పక్షంలో ప్రతి దాడి చేయడం తప్పదన్నారు.లారిజానీ ఖమేనీకి సన్నిహితుడు ఇతను గతంలో IRGCలో పనిచేశారు. ఇతని సోదరుడు సాదిక్ లారిజానీ ప్రస్తుతం ఇరాన్ సుప్రీం లీడర్ పోటీదారులలో ఒకరు. -
లీడర్ ప్రతీకారం
శరవణన్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘లీడర్’. పాయల్ రాజ్‌పుత్, శ్యామ్, ఆండ్రియా, సంతోష్ ప్రతాప్, లాల్ ప్రధాన పాత్రల్లో నటించారు. లెజెండ్ శరవణ స్టోర్స్ప్రొడక్షన్స్ పతాకంపై ఆర్ఎస్ దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్‌లో రిలీజ్ కానుంది.తాజాగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. ‘‘నా కూతురితో పాటే నేనుండాలి. దాని కోసం ఈ ప్రపంచాన్నే ఎదరించమన్నా ఎదిరించి గెలుస్తాను’ వంటి సంభాషణలు టీజర్లో ఉన్నాయి. ‘‘తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునే శక్తివేల్ పాత్రలో శరవణన్ నటించారు. మాస్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో ఈ సినిమా ప్రేక్షకులను ఆలరించేలా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. -
నువ్వు అసలు మనిషివేనా? ఛైర్మెన్ పదవిలో ఉంటూ రాసలీలలా
-
విప్లవ వీరుడి నుంచి.. క్షిపణి జ్వాలల వరకు..
కొన్ని దశాబ్దాల పాటు ఇరాన్ రాజకీయాలను, సైనిక వ్యూహాలను తన కనుసన్నలతో శాసించిన సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ప్రస్థానం ఊహించని రీతిలో ముగిసింది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన మెరుపు దాడిలో ఆయన మరణించినట్లు వెలువడుతున్న వార్తలు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి.విప్లవ వీరుడి నుంచి సుప్రీం లీడర్ వరకు..1939లో మషద్‌లోని ఒక సాంప్రదాయ మతపరమైన కుటుంబంలో జన్మించిన ఖమేనీ ప్రస్థానం ఒక పోరాట గాథలా సాగింది. 1979లో నాటి ఇస్లామిక్ విప్లవంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అప్పటి షా మహమ్మద్ రెజా పహ్లావీ అణచివేత పాలనకు వ్యతిరేకంగా గళమెత్తి, పలుమార్లు జైలు శిక్షను అనుభవించారు. విప్లవం విజయవంతం అయ్యాక, ఇరాన్ గణతంత్ర వ్యవస్థలో తిరుగులేని నేతగా ఎదిగి, 1981 నుండి 1989 వరకు దేశ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించి తనదైన పాలన సాగించారు.నాడు తృటిలో ప్రాణాపాయం తప్పించుకుని..ఖమేనీ జీవితంలో 1981 నాటి హత్యాయత్నం ఒక కీలక మలుపు. నాటి దాడిలో ఆయన తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నప్పటికీ, ఆయన కుడి చేయి పాక్షికంగా పక్షవాతానికి గురైంది. అప్పటి నుండి ఆయన తన వైకల్యాన్ని కూడా ఒక శక్తిగా మార్చుకుని, దేశాన్ని నడిపించడంలో ముందున్నారు. 1989లో ఖొమేనీ మరణానంతరం ఇరాన్ ‘అత్యున్నత నాయకుని’గా బాధ్యతలు చేపట్టి, మూడు దశాబ్దాలకు పైగా దేశ భవిష్యత్తును తన వేళ్లతో శాసించారు.ప్రాంతీయ శక్తిగా ఇరాన్ విస్తరణఖమేనీ నాయకత్వంలో ఇరాన్ ప్రభావం దేశ సరిహద్దులు దాటింది. లెబనాన్, ఇరాక్, సిరియా, యెమెన్ వంటి దేశాల్లోని ఇరాన్ అనుకూల వర్గాలకు అండగా నిలుస్తూ, అమెరికా, ఇజ్రాయేల్లకు ఖమేనీ నిరంతరం సవాలు విసిరారు. ఆయన హయాంలోనే ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమం ప్రపంచ దేశాల దృష్టిని అమితంగా ఆకర్షించింది. ఇది అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠకు దారితీసింది.ఉక్కుపాదంతో అంతర్గత అణచివేతబాహ్య శత్రువులనే కాకుండా, అంతర్గతంగా తలెత్తిన అసమ్మతిని కూడా ఖమేనీ కఠినంగా ఎదుర్కొన్నారు. 2009 నాటి ‘గ్రీన్ మూవ్మెంట్’ నిరసనలు, అలాగే 2019, 2022లలో ప్రజల నుంచి వచ్చిన తీవ్ర తిరుగుబాట్లను ఆయన తన అధికార బలంతో పూర్తిగా అణచివేశారు. తనను తాను ఇరాన్ సార్వభౌమాధికార రక్షకుడిగా అభివర్ణించుకున్నప్పటికీ, ఆయన పాలనలో రాజకీయ స్వేచ్ఛ కరువైందన్న విమర్శలు సర్వత్రా వినిపించాయి.అగ్రరాజ్యంతో అలుపెరుగని పోరాటంఅమెరికాతో ఖమేనీకి ఉన్న వైరానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ముఖ్యంగా 2015 నాటి అణు ఒప్పందం నుంచి 2018లో డొనాల్డ్ ట్రంప్ వైదొలగడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి. ట్రంప్ ఇరాన్ సుప్రీం ఖమేనీని అత్యంత క్రూరమైన వ్యక్తిగా, ఆయన వర్గాన్ని ‘రక్తపిపాసి ముఠా’గా అభివర్ణించారు. అయితే ఖమేనీ ఏనాడూ అమెరికా ఒత్తిళ్లకు లొంగలేదు. ట్రంప్ ఆయన మరణాన్ని ధృవీకరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.ప్రతీకార జ్వాలల్లో మధ్యప్రాచ్యంఖమేనీ అంతంతో ఇరాన్ తన ‘ట్రూత్ ఫుల్ ప్రామిస్ 4’ ఆపరేషన్‌ను ప్రారంభించి, అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణి దాడులతో విరుచుకుపడింది. అబుదాబి, దోహాలతో పాటు బహ్రెయిన్‌లోని అమెరికా నౌకాదళ ప్రధాన కార్యాలయంపై పడుతున్న క్షిపణులు ఈ ప్రాంతంలో యుద్ధ ఉద్రిక్తతను మరింతగా పెంచాయి.ఇది కూడా చదవండి: ఖమేనీ మృతితో నెతన్యాహు పరారీ? -
ఉత్తర కొరియా తదుపరి పగ్గాలు ఆమెకే?
ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా అగ్రనేత కిమ్ జోంగ్ ఉన్ తన వారసురాలిని ఖరారు చేశారా? గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న ఈ చర్చకు తాజా పరిణామాలు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. తన కుమార్తె కిమ్ జు ఆయేను దేశ తదుపరి అత్యున్నత నేతగా తీర్చిదిద్దే క్రమంలో కిమ్ కీలక అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.ఇటీవల జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో జు ఆయే స్వయంగా స్నిపర్ రైఫిల్‌ను ధరించి, లక్ష్యాన్ని ఛేదిస్తున్న చిత్రాలను ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా కేసీఎన్ఏ (KCNA) విడుదల చేయడం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. సైనిక అధికారులకు కిమ్ జోంగ్ ఉన్ ఇటీవల కొత్త తరం స్నిపర్ రైఫిళ్లను కానుకగా అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కిమ్ తన కుమార్తెకు కూడా ఒక రైఫిల్‌ను బహుకరించడం విశేషం. ఈ ఆయుధాలను అద్భుతమైన ఆయుధాలుగా వర్ణించిన కిమ్, ఇవి తన నమ్మకానికి ప్రతీకలని పేర్కొన్నారు.ఉత్తర కొరియా అధికార పార్టీ అయిన వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా (డబ్ల్యూపీకే) ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో అకాడమీ ఆఫ్ డిఫెన్స్ సైన్స్ తయారు చేసిన అత్యాధునిక రైఫిళ్లను కిమ్ పంపిణీ చేశారు. ఈ క్రమంలోనే కిమ్ కుమార్తె జు ఆయే(13) తన తండ్రి తరహాలోనే లెదర్ జాకెట్ ధరించి షూటింగ్ రేంజ్లో పాల్గొన్నారు. ఈ దృశ్యాలు కిమ్ ఆమెకు ఇస్తున్న ప్రాధాన్యతను చాటిచెబుతున్నాయి. గతంలో ఆమెను కేవలం కుమార్తెగా పిలిచిన ప్రభుత్వ మీడియా ఇప్పుడు ‘గౌరవనీయ కుమార్తె’గా సంబోధిస్తుండటం గమనార్హం.జు ఆయే ఇప్పటికే తన వారసత్వ శిక్షణను పూర్తి చేసుకుని, అధికారిక హోదాను ఖరారు చేసే దశకు చేరుకుందని దక్షిణ కొరియా నిఘా సంస్థ (ఎన్ఐఎస్) చెబుతోంది. ఆమె ఇప్పటికే విధానపరమైన అంశాల్లో తనదైన ముద్ర వేస్తోందని, దేశంలో అప్రకటిత రెండో అత్యున్నత నేతగా చలామణి అవుతోందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.మరోవైపు కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రైఫిల్‌ను స్వీకరించారు. అయితే, మొదటిసారిగా కేసీఎన్ఏ ఆమెను పార్టీ కేంద్ర కమిటీలోని ‘జనరల్ అఫైర్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్’గా గుర్తించి, ఆమె అధికార పరిధిని స్పష్టం చేసింది.ఒకప్పుడు కిమ్ వారసురాలిగా యో జోంగ్ పేరు వినిపించినప్పటికీ, ఇప్పుడు జు ఆయే తెరపైకి రావడం కొరియా రాజకీయాల్లో కొత్త మలుపుగా పరిగణిస్తున్నారు. కిమ్ ఇల్ సంగ్ స్థాపించిన ఈ సామ్రాజ్యంలో జు ఆయే బాధ్యతలు చేపడితే, కిమ్ కుటుంబం నుంచి నాలుగో తరం నాయకురాలిగా ఆమె చరిత్ర సృష్టించనుంది. కిమ్ జోంగ్ ఉన్ అడుగుజాడల్లో నడుస్తూ, సైనిక కవాతులు, క్షిపణి ప్రయోగాల్లో చురుగ్గా కనిపిస్తున్న జు ఆయే, రాబోయే రోజుల్లో ఆ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. ఇది కూడా చదవండి: ‘తొడిమ ఆకుపచ్చ.. పండు పసుపు పచ్చ’ -
టీడీపీ జెండా మోసినందుకు నా చెప్పుతో నేనే కొట్టుకుంటున్నా
-
RRR దౌర్జన్యం.. టీడీపీ నేత ఇల్లు, ఆఫీస్ కూల్చివేత
-
రఘు రామపై మరో సంచలన వీడియోలో రెచ్చిపోయిన TDP నేత..
-
అనపర్తిలో ఆగని కూటమి సర్కార్ అక్రమ కూల్చివేతలు
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: అనపర్తిలో కూటమి సర్కార్ అక్రమ కూల్చివేతలు ఆగడం లేదు. ఆక్రమణల పేరుతో వైఎస్సార్సీపీ నేతకు చెందిన జీబీఆర్ విద్యాసంస్థల నిర్మాణాలు కూల్చివేస్తున్నారు.సమీపంలోనే దుప్పలపూడి గ్రామంలో మెయిన్ రోడ్డుని ఆక్రమించి ఉన్న ఇతర నిర్మాణాల జోలికి వెళ్లని అధికారులు.. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి బంధువులకు చెందిన నిర్మాణాలు కావడంతో కూటమినేతల ఒత్తిడితో అధికారులు కూల్చివేతలు చేపట్టారు. భారీ పోలీసు బలగాలను మోహరింపజేసి విద్యాసంస్థల నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. -
నడిరోడ్డుపై భార్యను చంపిన TDP కార్యకర్త
-
"కోటికి పైగా ప్రజలకు ఒకే ఒక్కడు"
నిన్న (మంగళవారం) తారిఖ్ రెహ్మాన్ ప్రధానమంత్రి ప్రమాణస్వీకారం ఢాకాలో జరిగింది. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. పలువురు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. అయితే భారత్ చూపు మాత్రం నితై రాయి చౌదరిపైనే ఉంది. ఎందుకంటే ఆ దేశంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏకైక హిందువు చౌదరినే. ఈ నేపథ్యంలో ఆయన పొలిటికల్ కెరీర్ పై ఓ లుక్ వేద్దాం పదండి.బంగ్లాదేశ్ లో గత రెండేళ్లుగా చెలరేగిన రాజకీయ అస్థిరత, హింసకు తెరపడింది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఇంతకాలం అక్కడ చెలరేగిన హింసలో మైనార్టీలే తీవ్రంగా నష్టపోయారు. అక్కడి మత ఛాందస వాదులు చెలరేగి అక్కడి హిందువులపై దాడులు చేసి చంపడంతో పాటు వారి ఆస్తులను, ఆలయాలను ధ్వంసం చేశాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన BNP ప్రభుత్వం ఇప్పుడు హిందువుల సంరక్షణకు ఏ చర్యలు తీసుకుంటుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈ నేపథ్యంలోనే తారిఖ్ రెహ్మాన్ ప్రభుత్వం తన మంత్రివర్గంలో హిందూ నేత నితై రాయి చౌదరికి చోటు కల్పించింది.వ్యక్తిగత జీవితంనితైరాయి చౌదరి 1949 జనవరి 7న జన్మించారు. తన వివాహం జూమా అనే మహిళతో జరిగింది. వారికి ముగ్గురు పిల్లలు. నితై రాయి వృత్తి రీత్యా న్యాయవాది. వారి కుమారుడు దేబాసిష్ రాయ్ చౌదరి ప్రస్తుతం బంగ్లాదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఆయన కుమార్తె నిపున్ రాయ్ చౌదరి రాజకీయ నాయకురాలు బీఎన్ పీలో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గా ఉన్నారు. ఆమె భర్తసైతం ప్రస్తుతం బీఎన్ పీ పార్టీ నుంచి ఎంపీగా గెలుపొందారు. మరో కుమారుడు మిథున్.పొలిటికల్ కెరీర్ నితై రాయి రాజకీయ జీవితం క్షేత్రస్థాయి నుంచే మెుదలైంది. అక్కడి నుంచే ఆయన జాతీయ నాయకునిగా ఎదిగారు. 1988లో తొలిసారిగా మాగురా-2 నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. అనంతరం 1990 లలో మూడు నెలల పాటు యువజన, క్రీడా శాఖ మంత్రిగా పనిచేశారు. హుస్సేన్ మహ్మద్ ఎర్షాద్ పాలన అనంతరం BNPలో చేరారు. అక్కడి నుండి అంచెలంచలుగా ఎదుగుతూ ఆ పార్టీ ఉపాధ్యాక్షుని స్థాయి వరకూ ఎదిగారు.BNPలో ఆయన జనరల్ సెక్రటరీగా ఉన్నారు. పార్టీకి సంబంధించిన నిర్ణయాల రూపకల్పణలో తన సలహాను అందిస్తారు. అయితే గతంలో ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హాసీనాని బహిరంగంగా విమర్శించేవారు. ఆమెది ఫాసిస్ట్ పాలనని నియంతృత విధానాలని విమర్శించేవారు. 2001లో బీఎన్పీ కూటమి అధికారంలో ఉన్నప్పుడు హిందువులపై దాడి చేయించిందని ఆరోపించారు.భారత్ సంబంధాలుఅయితే భారత్ - బంగ్లా సంబంధాలపై నితైరాయి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. భారత్ కు వ్యూహాత్మక పరంగా బంగ్లాదేశ్ ఎంతో ప్రముఖమైన స్థానంలో ఉందన్నారు. అందుకే భారత్ బంగ్లాతో మెత్రి కోరుకుంటుందని తెలిపారు. అయితే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ సైతం ఆ సంబంధాలను మరింత బలోపేతం చేయాలని భావిస్తోందని తెలిపారు. అయితే ఇంతకాలం అక్కడ మైనార్టీలపై దాడులు జరిగిన నేపథ్యంలో కొత్తగా కొలువుదీరిన రెహ్మాన్ ప్రభుత్వం వాటిపై ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో వేచిచూడాలి. అయితే మంత్రి పదవి చేపట్టిన నితైరాయి చౌదరికి సైతం ఆ దేశంలోని హిందువులను కాపాడాల్సిన బాధ్యత ఉంది.భారత్- బంగ్లా సంబంధాలుబంగ్లాదేశ్ నూతన ప్రధానమంత్రి తారిఖ్ రెహ్మాన్‌ను భారత ప్రధాని మోదీ ఆయనను భారత్‌కు ఆహ్వానించారు. నిన్న మంగళవారం ఢాకాలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత ప్రభుత్వ ప్రతినిధిగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హాజరయ్యారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంపిన వ్యక్తిగత లేఖను ఆయనకు స్వయంగా అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో బంగ్లాదేశ్ తో భారత్ మైత్రిని కోరుకుంటుందని ప్రధాని మోదీ చాటిచెప్పారు. అయితే ఈ నేపథ్యంలో తారిఖ్ రెహ్మాన్ సర్కార్ ఇండియాపై ఏ వైఖరి అవలంభిస్తోందో వేచి చూడాలి. -
స్కూల్ బాలికలపై బాలకృష్ణ అనుచరుడి లైంగిక దాడి..!
-
యువత దెబ్బ.. జనసేన MLA కనబడుట లేదు
-
టీడీపీ నేత జాబ్ స్కామ్.. లోకేష్ కి ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం?
-
IT అధికారులకే లంచం.. అడ్డంగా బుక్కైన TDP నేత
-
దురంధర్ పాటకు గన్ డ్యాన్స్.. చిక్కుల్లో కాంగ్రెస్ నేత
కర్ణాటకకు చెందిన ఓ కాంగ్రెస్ నేత చిక్కుల్లో పడ్డారు. ఓ ప్రైవేట్ పార్టీకి వెళుతున్న సందర్భంలో చేతిలో పిస్తోలు పట్టుకొని ఇటీవల సూపర్ హిట్టైన దురంధర్ చిత్రంలోని ఓ పాటకు డాన్స్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పోలీసులు అతనిపై విచారణ చేపట్టారు.మథీన్ పటేల్ అనే కాంగ్రెస్ నేత అక్కడి కల్బుర్గి నియోజకవర్గ ఎమ్మెల్యేలకు అత్యంత సన్నిహితుడు. అయితే ఆయన ఇటీవల ఓ ప్రైవేట్ పార్టీకి హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన ఫంక్షన్‌లోకి వస్తుండగా ఆయన అనుచరులు నానా హంగామా చేశారు. గన్స్‌తో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం మథీన్ పటేల్ సైతం చేతిలో రివాల్వార్‌తో ఫోజులిచ్చారు.ఇటీవల విడుదలై సూపర్ హిట్టైన దురందర్ చిత్రంలోనే ఓ ఫేమస్ పాటకు డ్యాన్స్ చేశారు. అయితే ఇది సామాజిక మాధ్యమాల్లో వైరలై పోలీసుల దాకా చేరడంతో ఆయనపై విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో కల్బుర్గి పోలీస్ కమిషనర్ శరణప్పా ఈ అంశంపై స్పందించారు.మథీన్ పటేల్ పట్టుకున్న ఆయుధాలు నకిలీవా లేదా లైసెన్స్డ్కు చెందినవా అనే విషయాలు పరిశీలిస్తున్నాం. అదేవిధంగా ఆ ఫంక్షన్లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారా అనే అంశాన్ని తెలుసుకుంటున్నాం. ఒకవేళ ఆ గన్స్ లైసన్స్ లేనివైతే ఆయనపై చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ తెలిపారు.ఆ వీడియోలో, మథీన్ పటేల్ బ్లాక్ కలర్ SUVలో ఎంట్రీ ఇస్తారు. ఆయన అనుచరులు గన్స్‌తో స్వాగతం పలుకుతారు. అనంతరం వారితో కలిసి గన్స్‌తో డాన్స్ చేస్తాడు. ఈ సన్నివేశం ఇటీవల రిలీజైన దురంధర్ చిత్రంలోని రెహమాన్ డకైట్ (అక్షయ్ ఖన్నే) ఎంట్రీ లాగానే ప్లాన్ చేశారు. దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.A display of “gun culture” by a #Congress leader in #Kalaburagi district has now become a major topic of debate.A Congress leader named Mateen Patel, said to be a close associate of #Afzalpur Assembly constituency MLA #MYPatil, is at the center of the controversy after videos… pic.twitter.com/hFASTKkwuH— Hate Detector 🔍 (@HateDetectors) February 10, 2026 -
కూటమి పాలనపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఘాటు వ్యాఖ్యలు
-
Bangladesh: కీలక నేత కన్నుమూత.. ఎన్నికల ముందు విషాదం
ఢాకా: కొద్దిరోజుల్లో ఎన్నికలు జరగనున్న బంగ్లాదేశ్‌లో విషాదం అలముకుంది. సీనియర్ నేత, అవామీ లీగ్ మాజీ మంత్రి రమేష్ చంద్ర సేన్ (86) కన్నుమూశారు. దినాజ్‌పూర్ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన హఠాత్తుగా అస్వస్థతకు గురికాగా, జైలు అధికారులు ఆయనను దినాజ్‌పూర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అతనిని పరీక్షించి అప్పటికే మరణించినట్లు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు అధికారులు తెలిపారు.ఫిబ్రవరి 12న సాధారణ ఎన్నికలు జరగనున్న తరుణంలో రమేష్ చంద్ర సేన్ మృతి ప్రాధాన్యత సంతరించుకుంది. షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్‌లో కీలక నేతగా ఉన్న రమేష్ చంద్ర సేన్, గతంలో నీటి వనరుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆగస్టు 17న ఆయనను అదుపులోకి తీసుకున్నప్పటి నుండి దినాజ్‌పూర్ జైలులో ‘డివిజన్ ప్రిజనర్’గా ఉంచారు. జైలుకు తరలించక ముందు నుంచే ఆయన అనారోగ్యంతో ఉన్నారని, పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారని జైలు సూపరింటెండెంట్ ఫర్హాద్ సర్కార్ పేర్కొన్నారు.1940 ఏప్రిల్ 30న ఠాకూర్ గావ్ జిల్లాలో జన్మించిన రమేష్ చంద్ర సేన్, అవామీ లీగ్ పార్టీలో అనుభవజ్ఞుడైన నేతగా పేరుపొందారు. మొత్తం ఐదుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 1997లో ఉపఎన్నిక ద్వారా తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టిన ఆయన, ఆ తర్వాత 2008, 2014, 2018, 2024 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. షేక్ హసీనా ప్రభుత్వంలో 2009 నుండి 2014 వరకు మంత్రిగా సేవలు అందించడమే కాకుండా, పార్టీ సలహాదారుగా కూడా వ్యవహరించారు.బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం పతనమైన తర్వాత జరుగుతున్న ఈ సాధారణ ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. ప్రస్తుతం మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం పర్యవేక్షణలో ఫిబ్రవరి 12న పోలింగ్ జరగనుంది. ఇప్పటికే వెలువడిన పలు సర్వేల ప్రకారం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) ఈ ఎన్నికల్లో ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటువంటి తరుణంలో అవామీ లీగ్ సీనియర్ నేత మృతిచెందడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా నిలిచింది.ఇది కూడా చదవండి: ‘ఎప్స్టీన్’ ఆరోపణలు.. దలైలామా ఏమన్నారంటే.. -
ఈసారి మంత్రి వంతు!
ఢాకా: పదవీచ్యుత షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలాక బంగ్లాదేశ్‌లో హిందువులపై మూకదాడులు సర్వసాధారణమైపోగా ఇప్పుడా బాధితుల జాబితాలో ఏకంగా కేంద్ర మాజీ మంత్రి చేరిపోయారన్న వార్త స్థానికంగా కలకలం రేపింది. అవామీ లీగ్ నేత, సీనియర్ హిందూ నాయకుడు రమేశ్ చంద్రసేన్ శనివారం పోలీస్ కస్టడీలో అనుమానాస్పద స్థితిలో మరణించారు. విద్యార్థి సంఘాలు, అతివాద కూటముల సారథ్యంలో మొహమ్మద్ యూనుస్ నేతృత్వంలో కొలువుతీరిన తాత్కాలిక ప్రభుత్వం ఇన్నాళ్లూ అధికార పార్టీగా కొనసాగిన అవామీ లీగ్ నేతలనూ లక్ష్యంగా చేసుకుందన్న వాదనలకు తాజాగా చంద్రసేన్ మరణం మరింత బలం చేకూర్చింది. హత్య, ఇతర ఆరోపణలపై జల వనరుల శాఖ మాజీ కేంద్ర మంత్రి రమేశ్‌ను అరెస్ట్‌చేసి దినాజ్‌పూర్ జిల్లా జైలుకు తరలించిన యూనుస్ ప్రభుత్వం ఆయనకు ఉద్దేశపూర్వకంగా జైలుగదిలో కనీస సౌకర్యాలు కల్పించలేదని గతంలోనే విమర్శలు వెల్లువెత్తాయి. వైద్య వసతులు లేకపోవడంతో 85 ఏళ్ల రమేశ్ తీవ్ర అనారోగ్యంపాలయ్యారని, చివరకు శనివారం ఉదయం ప్రాణాపాయ స్థితిలో దినాజ్‌పూర్ వైద్యబోధనాస్పత్రికి తరలించినా కేవలం పావుగంటకే ప్రాణాలు కోల్పోయారని స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. సాధారణ హిందువులపై బెదిరింపులు, చోరీల వంటి తప్పుడు ఆరోపణలతో చితకబాది, నిప్పంటించి అల్లరిమూకలు చంపేస్తుంటే యూనుస్ సర్కార్ ఇలా హిందూ నేతలను కస్టడీలో ప్రాణాలు తీస్తోందని ఆరోపణలు వెల్లువెత్తాయి. రమేశ్ బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో ఐదుసార్లు విజయం సాధించారు. 2024 ఎన్నికల్లోనూ ఎంపీగా గెలిచారు. రమేశ్‌తో కలిపి ఇప్పటిదాకా ఐదుగురు అవామీ లీగ్ నేతలను కస్టడీలోనే చంపేశారని బంగ్లాదేశీయులు త సామాజిక మాధ్యమాల్లో వార్తలను షేర్చేస్తున్నారు. ‘‘ రమేశ్ అజాత శత్రువు. ఎంతో మందికి సాయపడ్డారు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ముఖ్యనేత మిర్జా ఫక్రూల్ ఇస్లాం ఆలాంగిర్ను ఎదిరించి రమేశ్ పెద్ద నేతగా ఎదిగారు. అది వాళ్లకు నచ్చలేదు. ఇలాంటి నేతనూ అతివాద తాత్కాలిక సర్కార్ పొట్టనపెట్టుకుంది. నేతలనే కాదు సాధారణ అవామీలీగ్ కార్యకర్తలు వేలాదిగా ఇటీవల బలయ్యారు. 2024 ఆగస్ట్‌లో హసీనా ప్రభుత్వం గద్దెదిగాక ఈ హత్యల పరంపర మొదలైంది’’ అని బంగ్లాదేశ్‌లో కంటెంట్ క్రియేటర్ ప్రదీప్ చౌదరి తన ‘ఫేస్బుక్’ ఖాతాలో రాసుకొచ్చారు. -
నారా బాబా 9 దొంగలు..! పుణ్యశీల అదిరిపోయే సెటైర్లు
-
ఆప్ నేత దారుణ హత్య.. సీసీటీవీ విజువల్స్
చండీఘడ్: పంజాబ్‌లో దారుణం జరిగింది. ఆమ్ ఆద్మీపార్టీ నేత ఒబెరాయ్ దారుణహత్యకు గురయ్యారు. జలంధర్ ప్రాంతంలో దుండగులు బ్లాక్ హూడీ ధరించి, ఓబెరాయ్ వాహనం దగ్గరికి వచ్చి 10 సెకన్లలో ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. తీవ్రగాయాలైన ఒబెరాయ్ ప్రాణాలు వదిలారు. కాల్పుల కలకలంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. గురుద్వారాలోని మోడల్ టౌన్ ప్రాంతంలో జీప్‌లో ఉండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపారు. తీవ్రగాయాలైన జలందర్ కారులోనే కుప్పకూలారు. దీంతో వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. దర్యాప్తులో ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. నిందితులు బ్లాక్ హుడీ ధరించిన దృశ్యాలు కనిపించాయి. వాటి ఆధారంగా నిందితుల్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, గతంలో ఒబెరాయి సతీమణి అక్కడి మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ టికెట్‌పై పోటీచేసి ఓడిపోయింది. जालंधर में AAP नेता लक्की ओबरॉय की गोली मारकर हत्या। CCTV फुटेज में गोली मारते दिखा हमलावर।#punjab #AAP @AamAadmiParty pic.twitter.com/kZzrzbCX44— ANews Office (@AnewsOffice) February 6, 2026 -
'పిల్లలందరికీ తండ్రులే హీరోలురా'.. ఆసక్తిగా గ్లింప్స్
బిజినెస్‌మేన్‌గా కెరీర్ ప్రారంభించి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు అరుల్ శరవణన్. ది లెజెండ్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఆయన లెజెండ్ శరవణన్‌గా ప్రేక్షకుల మనసుల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రస్తుతం లెజెండ్ శరవణన్ హీరోగా నటిస్తోన్న చిత్రం లీడర్. ఈ మూవీకి దురై సెంథిల్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. ఫైట్ సీన్స్ చూస్తుంటే కూతురి కోసం తండ్రి ఎంతవరకైనా వెళ్తాడనే కాన్సెప్ట్‌తో ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. గ్లింప్స్ చివర్లో పిల్లలందరికీ తండ్రులే హీరోలురా అంటూ చెప్పే డైలాగ్ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. కాగా.. ఈ సినిమాకు జీబ్రాన్ సంగీతమందిస్తున్నారు. -
ఒక మహిళ అంత ఘోరంగా మాట్లాడుతుంటే.. అనితకు ఆ మాటలు వినపడలేదా
-
జగన్ వచ్చాక ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాం
-
జంగిల్ రాజ్ గుర్తుపెట్టుకో.. అధికారం శాశ్వతం కాదు
-
చంద్రబాబు క్షమాపణ చెప్పాలి.. బీజేపీకి సంబంధం ఉంది..
-
జోగి రమేష్ ను కలిసిన YSRCP నేతలు
-
GVMC ఉద్యోగి ప్రాణం తీసిన పట్టాభి!
-
బట్టలు తీసేయండి.. మహిళా రికార్డింగ్ డ్యాన్సర్లతో జనసేన ఎమ్మెల్యే అనుచరులు
-
నిన్ను బతకనీయను.. కార్యకర్త తలపై ఇనుప రాడ్డుతో టీడీపీ నేత దాడి
-
విశాఖ జిల్లాలో రెవెన్యూ సిబ్బందిపై టీడీపీ నేత దాడి
-
తల్లీ కూతుళ్ల మధ్య చిచ్చు పెట్టి దాడి చేసిన టీడీపీ నేత
-
ఉస్మాన్ హాదీ హత్యకు అదే కారణం.. ఛార్జ్ షీట్లో సంచలన విషయాలు.!
బంగ్లాదేశ్ ప్రస్తుతం హింస కొనసాగుతూనే ఉంది. ఇటీవల అక్కడ రాడికల్ నేత ఉస్మాన్ హాదీ మరణంతో అక్కడ అక్కడి మతతత్వ శక్తులు ఆదేశంలోని హిందువులే టార్గెట్‌గా దాడులు చేస్తున్నాయి. ఇటీవలే కొందరు దుండగులు హిందువులపై దాడి చేసి హతమార్చారు. గత కొద్ది రోజులుగా బంగ్లాదేశ్‌లోని హిందువులపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి.ఈ నేపథ్యంలోనే తాజాగా విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హదీ హత్యపై బంగ్లాదేశ్ పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ హత్యను రాజకీయ ప్రతీకార చర్యగా బంగ్లాదేశ్ పోలీసులు అభివర్ణించారు. అవామీ లీగ్, ఛత్రా లీగ్‌తో సంబంధం ఉన్న దాదాపు 17 మందిపై చార్జిషీట్ దాఖలు చేసినట్లు తెలిపారు. కాగా.. ఈ కేసులో ఇప్పటివరకు 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు.హాది బహిరంగ వ్యాఖ్యలు అవామీ లీగ్, ఛత్రా లీగ్ దాని అనుబంధ సమూహాల నాయకులు, కార్యకర్తలను ఆగ్రహానికి గురి చేశాయని ఢాకా అదనపు పోలీస్ కమిషనర్ మొహమ్మద్ షఫీకుల్ ఇస్లాం అన్నారు. కాల్పులు జరిపిన వ్యక్తి ఫైసల్ కరీం మసూద్‌కు ఛత్రా లీగ్‌తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని తెలిపారు. మరో నిందితుడు తైజుల్ ఇస్లాం చౌదరి బప్పీ పల్లబి థానా ఛత్రా లీగ్ అధ్యక్షుడు, అవామీ లీగ్ నామినేట్ చేసిన వార్డు కౌన్సిలర్ అని వెల్లడించారు. హత్య తర్వాత మసూద్,మరో కీలక నిందితుడు అలంగీర్ షేక్ పారిపోవడానికి అతను సహాయం చేశాడని ఆరోపణలు ఉన్నాయన్నారు. రాజకీయ ప్రతీకారం కారణంగానే హాది హత్యకు గురయ్యాడని దర్యాప్తులో తేలిందని ఏసీపీ ఇస్లాం అన్నారు.కాగా.. ఛత్రా లీగ్ అనేది బహిష్కరించబడిన ప్రధాన మంత్రి షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీ విద్యార్థి విభాగం. తాజాగా ఈ విభాగానికి చెందిన 17 మంది నిందితులపై చార్జిషీట్ దాఖలు చేశారు. మరోవైపు హాదీ హత్య తర్వాత న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ హాది పార్టీ, ఇంక్విలాబ్ మంచా ఢాకాలో ర్యాలీ నిర్వహించింది. బంగ్లాదేశ్‌లో నివసిస్తున్న భారతీయులందరికీ పని కల్పించడాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేసింది.మరోవైపు హాదీ హత్య నిందితులు భారతదేశంలో ఆశ్రయం పొందారని ఆరోపిస్తున్నారు. వారిని అప్పగించడానికి నిరాకరిస్తే ఢాకా అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఇంక్విలాబ్ మంచా హెచ్చరించింది. అయితే హాది హంతకులు భారతదేశంలోకి ప్రవేశించారనే వాదనలను భారత అధికారులు తోసిపుచ్చారు. వారు తమ సరిహద్దు దాటినట్లు ఎటువంటి ఆధారాలు లేవని అన్నారు. -
బీజేపీ నేత నవనీత్ కౌర్‌కు అసదుద్దీన్ కౌంటర్
ముంబై: బీజేపీ నేతలు, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మధ్య మరోసారి మాటల యుద్ధం నడిచింది. ఇటీవల మహారాష్ట్ర బీజేపీ నేత నవనీత్ రాణా చేసిన వ్యాఖ్యలకు హైదరాబాద్ ఎంపీ అసుదుద్దీన్ ఒవైసీ కౌంటరిచ్చారు. కుటుంబంలో పిల్లల్ని కనడం అనే అంశంపై ఇరు నేతల మధ్య విమర్శలపర్వం కొనసాగింది. మీకు నచ్చిన విధంగా పిల్లల్ని కనండి. మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు అని ఒవైసీ తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అంతకుముందు బీజేపీ నేత, మాజీ ఎంపీ నవనీత్ కౌర్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘కొంతమంది అధికంగా సంతానాన్ని ఉత్పత్తి చేస్తూ హిందుస్థాన్‌ని పాకిస్థాన్‌లా మార్చాలని ప్రయత్నిస్తున్నారు. దానిని అడ్డుకోవాలంటే హిందువులు సైతం తప్పనిసరిగా ముగ్గురు, నలుగురు పిల్లలని కనాలి. నేను అందరు హిందువులకు ఇదే విజ్ఞప్తి చేస్తున్నాను. వీళ్లంతా నలుగురు భార్యలు,19 మంది పిల్లలు అని బహిరంగంగా చెప్పుకుంటారు. వారంతా మౌలానానా, మరోకరా అనేది నాకు తెలియదు. కానీ వారంతా అధికమంది పిల్లలను కనడం ద్వారా హిందుస్థాన్‌ని పాకిస్థాన్‌లా మార్చాలనుకుంటున్నారు. కనుక మనం కూడా ఒక్కరితో సంతృప్తి చెందకూడదు. తప్పనిసరిగా ఎక్కువ మంది పిల్లలని కనాలి" అని ఆమె అన్నారు. దీంతో, ఆమె వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తాజాగా ఆమె వ్యాఖ్యలపై ఎంపీ అసుదుద్దీన్ స్పందించారు. ఈ క్రమంలో అసద్ మాట్లాడుతూ.. ఆమె వ్యాఖ్యలకు పరోక్షంగా కౌంటరిస్తూ మాట్లాడారు. "మహారాష్ట్రలో ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలుంటే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కాదు. ఇదివరకూ ఈ నియమం తెలంగాణలో కూడా ఉండేది కాని ఇప్పుడు రద్దు చేశారు. నాకు ఇప్పుడు ఆరుగురు పిల్లలున్నారు. మీరు కూడా నలుగురిని కనండి మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారు" అని వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఇరువురు నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. -
చీకటి ఒప్పందంతో రాయలసీమకు చంద్రబాబు ద్రోహం..
-
వేలు చూపిస్తూ వార్నింగ్.. ఏరా.. నీ అంతు చూస్తా.. CIకి టీడీపీ నేత బెదిరింపు
-
ఉస్మాన్ హాదీ హత్యపై నిందితుడి సంచలన వీడియో
బంగ్లాదేశ్‌లో తీవ్ర సంక్షోభం సృష్టించిన రాడికల్ నేత ఉస్మాన్ హాదీ హత్య విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉస్మాన్ హత్యలో ప్రధాన నిందితుడిగా ఉన్న మసూద్ ఈ అంశంపై కీలక సమాచారం తెలుపుతూ వీడియో విడుదల చేశాడు. ఉస్మాన్ హాదీ మృతితో తనకు ఏటువంటి సంబంధం లేదని తెలిపాడు. ఈ నిందితుడు ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మసూద్ భారత్‌లో తలదాచుకున్నట్లు బంగ్లా ఆరోపించింది. రాడికల్ విద్యార్థి లీడర్ ఉస్మాన్ హాది హత్యతో బంగ్లాదేశ్‌లో ఏ స్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఉస్మాన్ మృతితో ఆ దేశంలో విద్వేశజ్వాలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. హిందువులే టార్గెట్‌గా దాడులు జరిగాయి. ఇవి చాలవన్నట్లు ఇటీవలే అక్కడి మీడియా కథనాలు ఉస్మాన్ హాదీ హంతకులు భారత్‌లో తలదాచుకున్నారని తప్పుడు కథనాలు ప్రచారం చేశాయి. ఈ నేపథ్యంలో ఉస్మాన్ హత్యలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న మసూద్ దుబాయ్‌లో ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన వీడియో విడుదల చేశారు. ఈ వివరాల్ని సీఎన్ఎన్ మీడియా సంస్థ ప్రచురించింది.ఫైసల్ కరీం మసూద్ మాట్లాడుతూ" నేను ఉస్మాన్ హాదీని చంపలేదు. బంగ్లాదేశ్‌లో నేను నాకుటుంబం రాజకీయంగా తీవ్రంగా హింసించబడుతున్నాం. ఆ హింస నుంచి తప్పించుకోవడానికి నేను దుబాయ్‌కి వచ్చాను. ఉస్మాన్ హాదీతో నాకుంది కేవలం వ్యాపార సంబంధమే, నా ఐటీ సంస్థ ప్రయోజనం కోసం ఉస్మాన్ని కలిశాను. అతనికి రాజకీయ విరాళాలు కూడా ఇచ్చాను " అని మసూద్ వీడియోలో తెలిపారు.ఈ హత్య ఖచ్చితంగా జమాతే-ఈ- ఇస్లామి సృష్టేనని దీని వెనుక ఆ కార్యకర్తలు ఉండవచ్చని మసూద్ అనుమానం వ్యక్తం చేశారు. తాను భారత్‌లో తలదాచుకున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అసత్యాలని అన్నారు. జమాతి-ఈ- ఇస్లామి అనిదే బంగ్లాదేశ్‌లోని ఓ రాజకీయ పార్టీ ఇది ఇస్లామిక్ భావజాలలను ప్రోత్సహిస్తోంది.అయితే రెండురోజుల క్రితం ఉస్మాన్ హాదీ హత్యతో సంబంధమున్నట్లు భావిస్తున్న ఫైజల్ కరీం మసూద్, షేక్ ఆలంగీర్ అనే ఇద్దరు నేరస్థులు బంగ్లాదేశ్ జిల్లాలోని మైమాన్సింగ్ జిల్లా సరిహాద్దు గుండా మేఘాలయలో ప్రవేశించారని బంగ్లాదేశ్ పోలీసులు ఆరోపించింది. అయితే ఈ ఆరోపణల్ని అప్పుడే మేఘాలయ పోలీసులు ఖండించారు. -
20 పొట్టేళ్ల తలలు దండ చేసి బాలకృష్ణకు వేస్తే నీకు కనిపించలేదా?
-
ఎవడబ్బ సొమ్మని మా భూమిలోకి వస్తారు.. మీకు చేతనైతే..
-
ఉస్మాన్ హాదీ హత్య అందుకే..?
బంగ్లాదేశ్ ప్రస్తుతం హింసతో అట్టుడుకిపోతుంది. ఇటీవల అక్కడ రాడికల్ నేత ఉస్మాన్ హాదీ మరణంతో అక్కడ అక్కడి మతతత్వ శక్తులు ఆదేశంలోని హిందువులే టార్గెట్‌గా దాడులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే హత్యకు గురైన ఉస్మాన్ హాదీ సోదరుడు అక్కడి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరిలో జరిగే ఎన్నికలను ప్రక్కదోవ పట్టించేందుకు యూనస్ ప్రభుత్వమే ఉస్మాన్ని హత్య చేయించిందని ఆరోపించారు.బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపై ప్రస్తుతం దేశవ్యాప్త చర్చ నడుస్తోంది. స్టూడెంట్ లీడర్ ఉస్మాన్ హాదీ మరణం తర్వాత ఆ దేశంలోని మతతత్వ శక్తులు భారత్‌పై పగ పెంచుకున్నాయి. ఈ సందర్భంలోనే అక్కడ నివసిస్తున్న దీపు చంద్ర దాస్ అనే హిందూ యువకుడిని అక్కడి అల్లరిమూకలు తీవ్రంగా కొట్టిచంపారు. అనంతరం మరో హిందూ కుటుంబంపై దాడి చేయగా వారు తృటిలో తప్పించుకున్నారు. ఈ ఘటనలతో భారత్‌లో నిరసనలు మిన్నంటాయు ఢిల్లీలోని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ కార్యలయాన్ని వీహెచ్‌పీ ఆధ్వర్యంలో ముట్టడించారు.అయితే ఇటీవల జరిగిన ఉస్మాన్ హాదీ హత్యపై ఆయన తమ్ముడు ఒమర్ హాది సంచలన ఆరోపణలు చేశారు. బంగ్లాదేశ్ ప్రభుత్వమే ఎలక్షన్లని తప్పుదారి పట్టించాలనే ఉద్దేశంతో ఉస్మాన్ హాదీని హత్య చేయించిందని ఆరోపించారు. బంగ్లాదేశ్‌లోని షాబాద్‌లో ఉస్మాన్ మృతి సంతాపంగా ర్యాలీ నిర్వహించారు అందులో అతన సోదరుడు మాట్లాడుతూ. "మీరే ఉస్మాన్ హాదీని చంపించారు. ఇప్పుడు అతని చావు పేరుతో ఎన్నికలకు ఇబ్బందులు కలిగించే ప్రయత్నం చేస్తున్నారు.నా సోదరుడు ఎన్నికలు జరగాలని కోరుకున్నాడు. ఆయన నిర్ణయాన్ని గౌరవించి ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి" అని ఒమర్ తెలిపారు.ఉస్మాన్ హాదీ విదేశీ శక్తులకు తలొగ్గడానికి నిరాకరించాడని అందుకే ఆయనను కుట్రపన్ని హత్య చేయించారని తెలిపారు. అతని చావుకు కారణమైన వారు ఏదో ఒకరోజు దేశాన్ని వదిలి పారిపోవాల్సివస్తుందని హెచ్చరించారు. ఉస్మాన్ హాదిని హత్య చేసిన వారిని గుర్తించడానికి ప్రభుత్వానికి 30 రోజుల గడువు ఇస్తున్నామని అంతలోపు వారిని అరెస్టు చేయకపోతే బంగ్లావ్యాప్తంగా తీవ్ర నిరసనలు చేపడతామని అక్కడి నాయకులు యూనస్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. -
ఆడవారి దుస్తులపై మాట్లాడే హక్కు శివాజీకి లేదు
-
గర్భిణీపై దాడిలో నిజం బయటపెట్టిన జనసేన నేత
-
నా తల్లి చావుకి కారణం వాడే.. ఇదిగో వీడియో ప్రూఫ్.. TDP నేతపై సంచలన కామెంట్స్
-
గోడౌన్ లో గోమాంసం.. TDP నేతను తప్పించేందుకు బిగ్ ప్లాన్
-
బంగ్లాదేశ్‌లో మరో నేతపై కాల్పులు
తీవ్ర నిరసనలు, అ శాంతితో భగ్గుమంటున్న బంగ్లాదేశ్‌లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. నేషనల్ సిటిజన్ పార్టీకి చెందిన నేతపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో ఆయనను వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు.బంగ్లాదేశ్ ప్రస్తుతం నిరసనలతో అట్టుడుకుతుంది. కొద్దిరోజుల క్రితం ఆదేశానికి చెందిన రాడికల్ నేత ఉస్మాన్ హాదీ మరణం ఆ దేశంలో తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి. ఉస్మాన్ మృతితో ఆయన మద్దతుదారులు చెలరేగిపోయారు. ఢాకాలో మీడియా హౌజ్‌లపై దాడి చేస్తూ విధ్వంసం సృష్టించారు. అంతే కాకుండా దైవదూషణ చేశారనే నెపంతో ఓ హిందూ యువకుడిని అత్యంత దారుణంగా కొట్టిచంపారు. ఈ ఘటనను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇదిలా ఉండగా ఈరోజు ఉదయం ఆదేశంలో నేషనల్ సిటిజన్ పార్టీకి చెందిన మహమ్మద్ మోతేలాబ్ సికిదార్ అనే నాయకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.దీంతో ఆయనను హుటాహుటీన దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై అక్కడి పోలీస్ అధికారి మాట్లాడుతూ " మహమ్మద్ మోతేలాబ్ సికిదార్‌పై గుర్తు తెలియని వ్యక్తులు ఈ రోజు ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. బుల్లెట్లు ఆయన చెవిని చీల్చుకుంటూ వెళ్లాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఎటువంటి ప్రమాదం లేదు" అని తెలిపారు.మహమ్మద్ మోతేలాబ్ సికిదార్ నేషనల్ సిటిజన్ పార్టీకి చెందిన నాయకుడు. శ్రామిక్ శక్తి విభాగంలో ఈయన సెంట్రల్ ఆర్గనైజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఖులానా మెట్రోపాలిటన్ యూనిట్లో ర్యాలీకి సంబంధించిన ఏర్పాట్లు చేస్తుండగా దుండగులు ఆయనపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి రాజకీయ నాయకులపై కాల్పులు ఆ దేశంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. -
అజ్ఞాతంలోకి జనసేన నాయకుడు
నరసరావుపేట టౌన్: చిలకలూరిపేట రోడ్డు ప్రమాద కేసుతో వెలుగు చూసిన నకిలీ కార్ల వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. నకరికల్లు గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులను ఇప్పటికే అదుపులోకి తీసుకొని నరసరావుపేట రూరల్ పోలీసులు విచారిస్తున్నారు. వాళ్లు ఇచ్చిన సమాచారంతో నకరికల్లు గ్రామానికి చెందిన జనసేన నాయకుడు ఈ వ్యవహారంలో కీలక నిందితుడుగా భావించి, అజ్ఞాతంలో ఉన్న అతని కోసం గాలిస్తున్నారు. సీజింగ్ వాహనాలను తక్కువ ధరకు విక్రయించి వాటిపై రుణాలు తీసుకొని అవి ఎగ్గొట్టేందుకు నకిలీ నంబర్లు అంటించుకొని తిరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే అనుమానం ఉన్న 20 కి పైగా వాహనాలను స్వాధీనం చేసుకొని స్టేషన్‌కు తరలించారు. వాహనాలకు సంబంధించి నిజానిజాలు తేల్చి పూర్తి వివరాలు అందజేయాలని రవాణా శాఖ అధికారులను పోలీసులు కోరారు. రవాణా శాఖ అధికారులు మూడు వాహనాలకు నంబర్ ప్లేట్లు మార్చినట్లు, చాసిస్ నంబర్ ఆధారంగా తేల్చారు. మిగిలిన వాహనాలను పరిశీలించి నివేదిక సోమవారం నాటికి అందజేయనున్నారు. నేడు అరెస్ట్ చూపే అవకాశం.. పోలీసుల అదుపులో ఉన్న నకరికల్లు మండలానికి చెందిన అంజి, భానులను సోమవారం పోలీసులు అరెస్ట్ చూపే అవకాశం ఉందని సమాచారం. వీరిద్దరిపై నరసరావుపేట వన్‌టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే కేసులు నమోదై ఉన్నాయి. ఈ వ్యవహారంలో నకరికల్లు గ్రామానికి చెందిన జనసేన నాయకుడు ప్రధాన నిందితుడిగా భావిస్తున్నారు. అతని వద్ద నుంచే కార్లు తెచ్చి విక్రయించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. చిలకలూరిపేట హైవే రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి చెందిన సంఘటన తర్వాత సదరు జనసేన నాయకుడు అజ్ఞాతంలోకి వెళ్లటం పోలీసుల అనుమానాలకు బలం చేకూరుతోంది. అతను పట్టుబడితే నకిలీ కార్ల వ్యవహారం ఒక కొలిక్కి వస్తుందని పోలీస్ అధికారులు చెబుతున్నారు. -
"సెవన్ సిస్టర్స్ చీలిపోతుంది"
బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ లీడర్ హసంత్ అబ్దుల్లా భారత్‌పై కారు కూతలు కూశారు. భారత్‌ను చీల్చే ప్రయత్నాలు చేసే వ్యక్తులకు, సంస్థలకు తమ దేశం ఆశ్రయం ఇస్తుందని విద్వేశపూరిత వ్యాఖ్యలు చేశారు. ఆ ఆశ్రయంతో భారత్‌లోని ఈశాన్యప్రాంతం ప్రాంతం విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉందని తీవ్రంగా మాట్లాడారు. కాగా ఆ వ్యాఖ్యలను అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఖండించారు.బంగ్లాదేశ్ ఎన్సీపీ లీడర్ అబ్దుల్లా భారత్‌ను బెదిరిస్తూ పిచ్చిగా మాట్లాడారు. అబ్దుల్లా మాట్లాడుతూ "నేను ఒక విషయం భారత్‌కు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. బంగ్లాదేశ్‌లో భారత్‌కు వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తులకు, ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం కల్పిస్తాం. దానివల్ల భారత్ నుంచి ఈశాన్య ప్రాంతం వేరయ్యే అవకాశముంది". అని హెచ్చరించారు. బంగ్లాదేశ్ సౌర్వభౌమాధికారాన్ని, మానవహక్కులని గౌరవించని వారికి భారత్ ఆశ్రయం కల్పిస్తే బంగ్లాదేశ్ సమాధానమిస్తుందని తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలపై అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ స్పందించారు. "ఈ వ్యాఖ్యలు చాలా ప్రమాదకరమైనవి, గతేడాది నుంచి తరచుగా ఈశాన్య రాష్ట్రాలని భారత్ నుంచి విడగొడతాం అని వ్యాఖ్యానిస్తున్నారు. భారత్ ఈ విషయంలో మౌనంగా ఉండకూడదు" అని హిమంత అన్నారు. భారత్‌లోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్. త్రిపుర రాష్ట్రాలను కలిపి సెవెన్సిస్టర్స్ అని అంటారు.బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం భారత్‌లో తలదాచుకుంటుంది. గతేడాది ఆ దేశంలో జరిగిన ఘర్షణల తర్వాత హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్‌లో ఆశ్రయం పొందింది. అయితే కొద్దిరోజుల క్రితం హసీనాకు బంగ్లాదేశ్‌లోని కోర్టులు 21 సంవత్సరాల జైలుశిక్షతో పాటు మరణశిక్ష విధించాయి. దీంతో షేక్ హసీనాను బంగ్లాకు అప్పగించాలని బంగ్లాదేశ్ భారత్‌ను కోరింది. అయితే దీనిపై భారత్ ఇంకా ఎటువంటి అధికారిక నిర్ణయం వెల్లడించలేదు. -
ప్రియాంక గాంధీపై పార్టీ నేత సంచలన లేఖ
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిపై ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పార్టీ నాయకత్వం సరిగ్గా లేదని ఆ పార్టీ అగ్రనేత సోనియాగాంధీకి లేఖ రాశారు. త్వరలోనే నాయకత్వ బాధ్యతలు ప్రియాంక గాంధీకి అప్పగించాలన్నారు. అందుకోసం యావద్దేశం ఎదురుచూస్తుందని తెలిపారు. ఈ లేఖతో అధికార బీజేపీ కౌంటర్ స్టార్ట్ చేసింది. కాంగ్రెస్‌లో మరోసారి గ్రూప్ వార్ నడుస్తోందని శుక్రవారం కామెంట్ చేసింది. కాంగ్రెస్‌కు ప్రస్తుతం దేశవ్యాప్తంగా గడ్డుకాలం నడుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు పరాజయం పాలవడంతో పాటు పలు రాష్ట్రాల్లో ఆపార్టీ ఘోర పరాజయం మూటగట్టుకుంది. దీంతో ఆ పార్టీ నాయకత్వంపై బహిరంగంగానే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల్లో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. 16 రోజుల పాటు యాత్ర నిర్వహించారు. ఆయన అక్కడ ఇండియా కూటమికి చుక్కెదురైంది. కాంగ్రెస్ పార్టీ 63 స్థానాల్లో పోటీ చేసి కేవలం 6స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. దీంతో పార్టీ భవిష్యత్తుపై మరోసారి చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఒరిస్సాకు చెందిన బరాబతి-కటక్ నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ మెుఖ్యుం సోనియాగాంధీకి లేఖ రాశారు. మాజీ ఎమ్మెల్యే లేఖలో "ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి జాతీయ స్థాయితో పాటు రాష్ట్రాలలో ఆశాజనకంగా లేదు. కేంద్రంలో మనం మూడు సార్లు వరుసగా పరాజయం పాలయ్యాము. ఈ పరిస్థితి పార్టీనే దైవంగా కొలిచే మాలాంటి కార్యకర్తలకు మింగుడు పడడం లేదు. బిహార్, ఢిల్లీ, మహారాష్ట్ర, కశ్మీర్‌లతో పాటు ఇతర ప్రాంతాల్లో ఓడిపోవడానికి పార్టీ అంతర్గత సంక్షోభాలు కారణమన్నారు. భారత్‌లో ప్రస్తుతం 35 సంవత్సరాలలోపు జనాభా గలవారు దాదాపు 65శాతం మంది ఉన్నారు. భవిష్యత్తు మెుత్తం యువత చేతుల్లోనే ఉంటుంది. కనుక ప్రస్తుత జాతీయ అధ్యక్షుడిగా ఉన్న మల్లికార్జున్ ఖర్గే గారి (83) వయస్సు రీత్యా వారి ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోలేరు. కనుక ప్రస్తుత పరిస్థితుల్లో ఎంపీ ప్రియాంక గాంధీ చేతికి పార్టీ బాధ్యతలు అప్పగించాలి. దేశ యుువత వారి నాయకత్వం కోసం వేచిచూస్తుంది". అని లేఖలో ఆయన పేర్కొన్నారు. పార్టీలో సరైన నాయకత్వం లేకే జ్యోతిరాధిత్య సిందియా, హిమంత్ బిశ్వాస శర్మ, జైవీర్ శెర్గిల్ లాంటి కీలక నాయకులు కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారని తెలిపారు. ప్రస్తుతం ఒడిస్సాతో పాటు దేశవ్యాప్తంగా పార్టీ పరిస్థితి ఏమి బాగాలేదని ఇప్పటికైనా మేల్కోని తగిన చర్యలు తీసుకోకపోతే కాంగ్రెస్‌కు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశముందని పేర్కొన్నారు. అయితే ఈ లేఖపై బీజేపీ పార్టీ అటాక్ స్టార్ట్ చేసింది. కాంగ్రెస్‌లో అంతర్గతంగా రాహుల్ గాంధీ గ్రూప్, ప్రియాంక గాంధీ గ్రూప్ వార్ నడుస్తోందని తెలిపింది. అవి ఇప్పుడు బహిర్గతమయ్యాయని బీజేపీ కామెంట్ చేసింది. -
‘నీవేమైనా పెద్ద మొగోడివి అనుకుంటున్నావా’..!
జమ్మలమడుగు: ఆట ఆడిస్తే తాట తీస్తానంటూ ఒక టీడీపీ సీనియర్ నాయకుడికి ఓ సీఐ సీరియస్ వార్నింగ్ ఇచ్చిన ఘటన జమ్మలమడుగు నియోజకవర్గంలో చోటు చేసుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. జూదం ఆడిస్తున్న టీడీపీ సీనియర్ నాయకుడిని ఓ సీఐ స్టేషన్‌కు పిలిపించారు. అతన్ని నిలుచోబెట్టి అరగంట పాటు మాటల తూటాలు పేల్చారు. నీవేమైనా పెద్ద మొగోడివి అనుకుంటున్నావా.. నీ కథ అంతా తెలుసు.. ఇలాగే ఆట ఆడిస్తే నీ సంగతి తేలుస్తా.. అంటూ హెచ్చరించారు. నేను సీనియర్ నాయకుడిని.. నన్నే ఇన్నేసి మాటలు అంటావా.. కనీసం కూర్చోమని కూడా చెప్పవా.. అంటూ సదరు నేత ఏదో చెప్పబోతుండగా.. నిలబడే మాట్లాడు.. ఏం నీ కత.. అంటూ ఆ సీఐ గద్దించడంతో ఆ నాయకుడు బిత్తరపోయాడు. నీవు రమ్మంటే నేను వచ్చాను.. నువ్వు అలా మాట్లాడొద్దు అంటూ ఆ నేత సీఐతో అన్నాడు. ఆ తర్వాత తనకు జరిగిన చేదు అనుభవాన్ని ఆ నాయకుడు తన పార్టీ ముఖ్య నేతల దృష్టికి తీసుకెళ్లడంతో వారు సీఐకి ఫోన్ చేసి నువ్వు మా స్టేషన్‌కు పనికిరావు.. ఎక్కడికైనా వెళ్లిపో అంటూ బెదిరించినట్లు తెలిసింది. -
అనకాపల్లి జిల్లాలో టీడీపీ నేత బూతుపురాణం
-
YSRCP నేత తల్లిదండ్రులపై దుండగులు దాడి
-
పనికిమాలిన పనులు కాదు ప్రజలకు ఉపయోగపడే పని చెయ్
-
కారుమూరి వెంకట్ రెడ్డికి బెయిల్
-
బాబుకు పోయే కాలం దగ్గరకు వచ్చింది! మిగిలింది 3 సంవత్సరాలే
-
YSRCP నేత ఓబుల్ రెడ్డిపై హత్యాయత్నం
-
మహిళతో టీడీపీ నేత బూతుపురాణం.. ఆడియో లీక్ వైరల్..
-
డబ్బులు పంచుతూ అడ్డంగా బుక్కైన కాంగ్రెస్ నేత
-
టీడీపీ నేత గోడౌన్ లో గోమాంసం
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వైఎస్సార్సీపీ నేతలు
-
YSRCP మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు గుండెపోటు
-
వైఎస్ఆర్ సీపీ నేత కైలే అనిల్ కుమార్ పై కేసు
-
బాలికపై జనసేన నేత సత్య వెంకటకృష్ణ లైంగిక వేదింపులు
-
కోనసీమలో దారుణం.. బాలికపై జనసేన నేత అత్యాచారయత్నం
సాక్షి, కోనసీమ జిల్లా: ఐ.పోలవరం మండలంలో దారుణం జరిగింది. బాలికపై జనసేన నాయకుడు లైంగిక దాడికి యత్నించాడు. తమ కుమార్తెను లైంగికంగా వేధిస్తున్నాడని జనసేన నాయకుడు రాయపురెడ్డి సత్య వెంకట కృష్ణ(బాబీ)పై జిల్లా ఎస్పీకి బాధితురాలి తల్లి ఫిర్యాదుర చేశారు. నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. చిన్నారులపై లైంగిక వేధింపులకు గురిచేసేవాళ్లను చంపేయాలంటూని బాధితురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. -
మైనర్ బాలికపై జనసేన నేత.. ఈ వెధవని వదలకండి
-
సీతక్కా.. టీ కావాలా? కాఫీ కావాలా?
-
ఖమ్మంలో సీపీఎం నేత హత్య
సాక్షి, ఖమ్మం: సీపీఎం నాయకుడు సామినేని రామారావు దారుణ హత్యకు గురయ్యారు. చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో ఘటన జరిగింది. ఉదయం ఇంట్లో వాకింగ్ చేస్తుండగా.. ముగ్గురు వ్యక్తులు వచ్చి గొంతు కోసి హత్య చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలోనే హత్య జరిగిందని గ్రామస్థులు అంటున్నారు. సామినేని రామారావు సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీ మాజీ సభ్యులుగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని రామారావు పని చేశారుసామినేని రామారావు హత్యపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామారావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు. దోషులను చట్టపరంగా శిక్షిస్తామని.. కలుషిత హింస రాజకీయాలకు తావులేదని భట్టి అన్నారు. క్లూస్ టీం, సైబర్ టీం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. -
ఆరోజు జగన్ కోటి రూపాయలు ప్రకటిస్తే..! నువ్వు 2 లక్షలు ఇస్తావా?
-
వసంత కృష్ణ ప్రసాద్ కు బిగ్ షాక్.. జనసేన లీడర్ సంచలన వ్యాఖ్యలు
-
అలాంటోడికి చావే కరెక్ట్..! నారాయణరావు కోడలు సంచలన నిజాలు
-
మా నాన్నది ఆత్మహత్య కాదు! అర్ధరాత్రి 10గంటలకు పోలీసులు మా ఇంటికొచ్చి..!!
-
తుని బాలిక ఘటన.. చెరువులో దూకి నిందితుడి ఆత్మహత్య
-
ఒరేయ్ పిచ్చి కుక్క.. తుని 13 ఏళ్ల బాలిక ఘటనపై KA పాల్ స్టాంగ్ రియాక్షన్..
-
తుని బాలిక ఘటనలో ట్విస్ట్.. చెరువులో దూకిన నిందితుడు
-
రెచ్చిపోయిన జేసీ అనుచరులు.. YSRCP నేతపై కర్రలతో దాడి
-
నోరు జారిన అచ్చం
-
శ్రీవారి దర్శనం టికెట్ల పేరిట టీడీపీ నాయకుడి మోసం
-
జనసైనికులను పట్టించుకోవా పవన్?
-
టీడీపీ జోలికొస్తే.. జనసేన నేతలైనా వదిలేదెలే..
-
మద్యం సిండికెట్ కొత్త రూల్స్.. TDP సంచలన ఆడియో..
-
పకడ్బందీ ప్లాన్.. ఇలా దొరికేశారేంటి? టీడీపీ నేత సంచలన ఆడియో
-
చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే ఓ పోరంబోకు !
-
Fake Liquor Case: పోలీసుల అదుపులో A1 జనార్దన్ రావు.. భయం గుప్పిట్లో కరకట్ట పెద్దలు
-
లిక్కర్ కేసులో A1 జనార్దన్ రావు అరెస్ట్
-
జగన్ పాలనే బాగుంది! జనసేన ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్
-
అయ్యన్నకు మతి భ్రమించింది.. హోం మంత్రికి కళ్ళు కనిపించడం లేదు
-
అంతా కల్తీ మద్యం.. టీడీపీ నేత బార్ సీజ్..
-
Fake Liquor: టీడీపీ నేత సురేంద్ర నాయుడు అరెస్ట్
-
నకిలీ మద్యం ప్లాంట్ వెనుక.. టీడీపీ బడా నేత!!
-
బాబు.. పవన్.. గుర్తుపెట్టుకోండి ఆ పాపం ఊరికే పోదు
-
టీడీపీ నేతపై జేసీ ప్రభాకర్ రెడ్డి బండబూతులు..
-
Magazine Story: నకిలీ మద్యం.. కోట్ల డీల్.. నాయుడు అరెస్ట్..
-
పోలీస్ స్టేషన్ లో కల్తీ మద్యం కింగ్ టీడీపీ నేత సురేంద్ర నాయుడు
-
నిప్పు పెట్టింది వీడే.. ఆధారాలతో బయటపెట్టిన దళితులు
-
మాజీ మంత్రి జోగి రమేష్ పై కేసు నమోదు
-
వెంకట్ రెడ్డిని చంపేస్తాం..
-
స్కిట్ చేశానని కక్షతో.. చేతులు, కాళ్లకు సంకెళ్ళేసి మంచానికి కట్టేసి..!
-
అప్పు తీర్చమన్నందుకు మహిళను చితక్కొట్టిన టీడీపీ నేతలు
-
నాగార్జున యాదవ్ పై పోలీసుల దౌర్జన్యం
-
కారును ఈడ్చుకెళ్లిన టిప్పర్.. ఏడుగురిని చంపిన టీడీపీ నేత అత్యాశ
-
ఏడుగురు మృతికి కారకుడైన టీడీపీ నేత
-
టీడీపీ నేత ఇసుక అక్రమ రవాణాకు ఏడుగురు బలి
సాక్షి, నెల్లూరు: టీడీపీ నేత ఇసుక అక్రమ రవాణాకు ఏడుగురు బలైయ్యారు. ప్రమాదానికి కారణమైన ఇసుక టిప్పర్ టీడీపీ నేతదిగా గుర్తించారు. అప్పారావు పాలెం రీచ్ నుంచి నెల్లూరుకు రోజూ ట్రిప్పులు వేస్తున్నారు. మంత్రి ఆనం ప్రధాన అనుచరుడికి చెందిన టిప్పర్గా సమాచారం. ఇసుక టిప్పర్.. రాంగ్ రూట్లో వచ్చిన కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. కారును టిప్పర్ ఢీకొట్టిన తర్వాత.. వాహనాన్ని కొంత దూరం ఈడ్చుకెళ్లినట్టు స్థానికులు చెబుతున్నారు.కారు నుంచి మృతదేహాలను వెలికితీయడానికి పోలీసులు, ఫైర్ సిబ్బంది రెండున్నర గంటలపైగా శ్రమించారు. మృతులను నెల్లూరు పట్టణంలోని ముత్తుకూరు గేట్, గుర్రం వారి వీధికి చెందిన తాళ్లూరు రాధ(38), శ్రీనివాసులు (40), సారమ్మ(40), వెంగయ్య(45), లక్ష్మి(30), డ్రైవర్‌గా పోలీసులు గుర్తించారు.ఈ రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించడం అత్యంత విషాదకరమన్నారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. -
పార్టీ పరువు తీస్తున్న నేతలు.. పట్టించుకోని పవన్
-
మహిళలపై మంత్రి సత్యకుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు
-
బాలాపూర్ లడ్డూ 30 లక్షలకు కొన్నా.. మోదీగారి రియాక్షన్ ఇదే..
-
వైఎస్ జగన్ ఒక పెళ్లికి వెళితే వచ్చిన జనం కూడా నీ సభకు రాలేదు
-
మా నాన్నను చంపొద్దు..!
-
నా వద్దే టోల్ వసూలు చేస్తారా? రెచ్చిపోయిన టీడీపీ నేత
సాక్షి, కర్నూలు: అధికార అండతో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. నందవరం మండలం హాలహర్వి (NH 167) టోల్ గేట్ సిబ్బందిపై టీడీపీ నేత పాలకుర్తి శ్రీనివాస్‌రెడ్డి దాడికి దిగారు. తన వద్దే టోల్ వసూలు చేస్తారా అంటూ టోల్ గేట్ సిబ్బందిపై దౌర్జన్యానికి దిగారు. టోల్ గేట్ సిబ్బందిని అసభ్య పదజాలంతో దూషించిన టీడీపీ నేత.. దాడికి పాల్పడ్డారు. దాడి దృశ్యాలు సీసీ పుటేజ్‌లో రికార్డయ్యాయి.కాగా, శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలో తెలుగుదేశం పార్టీ నేతలు వైఎస్సార్సీపీ నాయకులపై గూండాగిరి చేసిన సంగతి తెలిసిందే. వైఎస్సార్సీపీకి చెందిన మండల పరిషత్ అధ్యక్షుడు (ఎంపీపీ) పురుషోత్తమరెడ్డి హత్యకు ఇటీవల విఫలయత్నం చేసిన ‘పచ్చ’ బ్యాచ్ అకృత్యాలు, దౌర్జన్యాలు, దోపిడీలను ప్రజల ముందు ఉంచడానికి మంగళవారం(ఆగస్టు 27) చిలమత్తూరులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ నేతలు ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు.ప్రెస్‌మీట్ నిర్వహిస్తే తన బండారం ఎక్కడ బయట పెడతారోనన్న భయంతో టీడీపీ నాయకుడు నాగరాజు యాదవ్ టీడీపీ గూండాలు, అనుచరులతో కలిసి స్థానిక చెన్నంపల్లి క్రాస్‌లోని వైఎస్సార్సీపీ కార్యాలయం వద్దకు దూసుకువచ్చారు. టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీ కార్యాలయం వైపు వస్తున్నారని తెలుసుకున్న సీఐ జనార్దన్ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. టీడీపీ గూండాలు అధికార మదంతో రోడ్డును దిగ్బంధించి నానా రభస సృష్టించారు. -
నన్ను చంపాలని చూస్తే.. నరసాపురం సీఐపై YSRCP దళిత నేత సంచలన వ్యాఖ్యలు
-
టీడీపీ నేత శ్రీనివాసులురెడ్డి కొత్త రూల్.. ఎస్పీకి వార్నింగ్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: జిల్లా ఎస్పీకి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులురెడ్డి వార్నింగ్ ఇచ్చారు. వినాయక చవితి వేడుకల్లో డీజేలకు అనుమతి తీసుకోవాలని ఎస్పీ స్పష్టం చేయగా.. డీజేలకు అనుమతి కోరితే ఊరుకునేది లేదంటూ.. మీ అనుమతులు మాకు అక్కర్లేదంటూ శ్రీనివాసులురెడ్డి హుకుం జారీ చేశారు. డీజేలకు అనుమతులు తీసుకోవాలని పోలీసులు చెబుతున్నా.. అలా తీసుకోవడం కుదరదంటూ ఆయన చట్టాన్ని చేతిలోకి తీసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.వినాయక చవితి పందిళ్లు, డీజే మ్యూజిక్ సిస్టమ్స్ పెట్టుకోవాలంటే పోలీసుల అనుమతి తప్పనసరి అని ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ తెలిపారు. ప్రభుత్వమే ఉచిత విద్యుత్ ఇస్తుంటే మీరు ఆంక్షలు పెట్టడం ఏంటంటూ శ్రీనివాసులురెడ్డి ప్రశ్నించారు.ప్రభుత్వ నిబంధనలను కూడా అధికార పార్టీ నేతలు ఉల్లంఘిస్తూ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ప్రతి ఏడాదీ ఉత్సవ నిర్వాహకులు అనుమతులు తీసుకుంటున్నారు. అనుమతి ప్రకారం కావాల్సిన భద్రతను పోలీస్‌శాఖ కల్పిస్తోంది. కానీ అనుమతులు తీసుకోవాలంటే.. ఊరుకునేది లేదంటూ శ్రీనివాసులురెడ్డి కొత్త రూల్ పెట్టారు. -
టీడీపీ గూండాల అరాచకం..! నా తమ్ముడిని కత్తులతో..
-
పెన్షన్ కావాలా 30వేలు కొట్టు.. జనసేన నేత అక్రమ వసూళ్లు
-
పోలీసులపై మరోసారి స్పీకర్ అయ్యన్న బూతుల పర్వం
-
అరుణ నోరు తెరిస్తే బండారం బయటపడుతుందని హోంమంత్రి అనితకు భయం
-
TDP నేత సంచలన ఆడియో.. తిరుపతి ఇంచార్జి మంత్రి జల్సాలు.. లాడ్జీల్లో సరసాలు..
-
Video: సీపీఐ అగ్ర నేత సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూత
-
Mutyala Naidu: కోర్టు ఆదేశాలను లెక్కచేయని జనసేన నేత
-
YSRCP కార్యకర్త కాలు విరగొట్టిన SI.. హైకోర్టు ఆగ్రహం
-
కష్టపడి తెచ్చి గిఫ్ట్ ఇవ్వాలి.. మీలా కొట్టుకొచ్చి ఇవ్వడం కాదు..
-
వంగలపూడి అనితకు మాస్ కౌంటర్
-
పులివెందుల గడ్డ.. జగన్ అన్న అడ్డా.. ఆగస్టు 14 తో బాబు పతనం మొదలు
-
సంచలన ఆడియో.. ఆ వందకోట్లు నొక్కింది వీడే.. పవన్ ఎమ్మెల్యేపై టీడీపీ నిందలు
-
పింఛన్ లబ్ధిదారులతో బలవంతంగా కాళ్లు మొక్కించుకున్న టీడీపీ నేత
-
బీఆర్ఎస్ నేతలపై ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు
-
నాగబాబుకు స్టేజ్ మీద షాక్ ఇచ్చిన జనసేన నేత
-
ఎంత కావాలి.. ఎక్కడికి పంపాలి? అంటూ టీడీపీ నేత రూప్ కుమార్ డీల్
-
యూజ్ లెస్ ఫెలోస్ అంటూ అధికారులపై మంత్రి నారాయణ చిందులు
-
Kesineni Chinni: కరెంటు బిల్లుపై నిలదీసిన మహిళ.. దెబ్బకు పారిపోయిన ఎంపీ
-
కాంగ్రెస్ నేత మారెల్లి అనిల్ హత్య కేసులో కొనసాగుతున్న దర్యాప్తు
-
బిష్ణోయ్ గ్యాంగ్‌కు టెర్రర్ ట్యాగ్?.. కెనడాలో పెరుగుతున్న ఒత్తిడి
ఒట్టావా: కెనడాతో సహా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్..హింస, దోపిడీ, మాదకద్రవ్యాల అక్రమ రవాణాతో పాటు, పలు హత్యలకు పాల్పడుతున్నదని కెనడియన్ నేత డేనియల్ స్మిత్ పేర్కొన్నారు. ఈ గ్యాంగ్ అంతర్జాతీయ నేర నెట్వర్క్ కలిగివున్నదని, అందుకే ఈ గ్యాంగ్‌కు టెర్రర్ ట్యాగ్ ఇవ్వాలని ఆయన ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో కోరారు.లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ లక్ష్యం నేరపూరితమైనదని, హింసాత్మకమైనదని స్మిత్ ఆ పోస్టులో పేర్కొన్నారు. ఈ ముఠా కార్యకలాపాలకు ఎటువంటి హద్దులు లేవని, దీనికి దేశంలో స్థానం ఉండకూడదని అన్నారు. బిష్ణోయ్ ముఠాను ఉగ్రవాద సంస్థగా అధికారికంగా గుర్తించడం ద్వారా, దాని ఆటలు ఇకపై సాగవని , ప్రాంతీయ స్థాయి చట్ట అమలు సంస్థల కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడదని స్మిత్ పేర్కొన్నారు. కాగా బిష్ణోయ్ నెట్‌వర్క్‌లో కీలకంగా భావిస్తున్న గోల్డీ బ్రార్‌పై చర్యలు తీసుకోవాలని భారత్ ఎప్పటినుంచో కెనడాను కోరుతూ వస్తోంది. The Lawrence Bishnoi Gang is a transnational criminal network responsible for violence, extortion, drug trafficking and targeted killings, including here in Canada. Its reach is global, and its intent is criminal and violent.We know that gang activity knows no boundaries and… pic.twitter.com/wYwdAx3pfT— Danielle Smith (@ABDanielleSmith) July 15, 2025గత జూన్‌లో బ్రిటిష్ కొలంబియా నేత డేవిడ్ ఎబీ కెనడాకు ఇదేవిధమైన అభ్యర్థన చేశారు. ఈ ముఠా అల్బెర్టా, ఒంటారియో ప్రాంతంలోని దక్షిణాసియా ప్రజలపై పలు నేరాలకు పాల్పడిందని డేవిడ్ ఎబీ ఆరోపించారు. ఇదే సమయంలో సర్రే మేయర్ బ్రెండా లాక్ ఈ పిలుపుకు మద్దతునిచ్చారు. బిష్ణోయ్ ముఠాను ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తే, కెనడియన్ చట్ట అమలు సంస్థలకు వ్యవస్థీకృత నేర నెట్‌వర్క్‌లతో పోరాడేందుకు అవకాశం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. -
కాంగ్రెస్ నేత హత్య వెనుక టీడీపీ ఎమ్మెల్యే కుమారుడు !
-
మెదక్ జిల్లా వరిగుంతం సమీపంలో కాంగ్రెస్ నేత దారుణ హత్య
-
కాంగ్రెస్ నేత హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
సాక్షి, మెదక్: కాంగ్రెస్ నేత అనిల్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కడప జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే కుమారుడికి, అనిల్‌కు మధ్య విబేధాలు ఉన్నాయి. ఓ భూమి విషయంలో గత కొద్దిరోజులుగా వివాదం నడుస్తుంది. టీడీపీ ఎమ్మెల్యే కుమారుడి వద్ద అనిల్ రూ.80 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. ఘటనాస్థలంలో ఉన్న బెంజ్ కారు కూడా టీడీపీ ఎమ్మెల్యే కుమారుడిదేనని పోలీసులు అంటున్నారు. గత ఐదు నెలలుగా బెంజ్ కారు అనిల్ వద్దనే ఉంటుందని చెబుతున్నారు.మెదక్ – జోగిపేట ప్రధాన రహదారిపై నిన్న(సోమవారం రాత్రి కాంగ్రెస్ నేత అనిల్ అనుమానాస్పదంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. మండలంలోని పైతర గ్రామానికి చెందిన మరెల్లి అనిల్(28)జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాడు. మెదక్ నుంచి స్వగ్రామానికి కారులో ఆయన ప్రయాణమయ్యాడు.చిన్నఘనాపూర్ విద్యుత్ సబ్ స్టేషన్ వద్దకు రాగానే కారు అదుపుతప్పి పక్కనే ఉన్న కల్వర్టును ఢీకొట్టింది. అటుగా వెళ్తున్న వాహనదారులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అనిల్ మృతి చెందినట్లు తెలిపారు. అయితే, అనిల్ శరీరంపై బుల్లెట్ గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ఘటనా స్థలంలో నాలుగు బులెట్లు లభ్యమయ్యాయి. -
కాంగ్రెస్ నేత మరెల్లి అనిల్ ను చంపిన దుండగులు
-
మెదక్ జిల్లాలో కాంగ్రెస్ నేత అనుమానాస్పద మృతి
సాక్షి, మెదక్ జిల్లా: కాంగ్రెస్ నేత అనిల్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని మెదక్ – జోగిపేట ప్రధాన రహదారిపై సోమవారం రాత్రి చోటుచేసుకుంది. మండలంలోని పైతర గ్రామానికి చెందిన మరెల్లి అనిల్(28)జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాడు. మెదక్ నుంచి స్వగ్రామానికి తన కారులో ప్రయాణమయ్యాడు.చిన్నఘనాపూర్ విద్యుత్ సబ్ స్టేషన్ వద్దకు రాగానే కారు అదుపుతప్పి పక్కనే ఉన్న కల్వర్టును ఢీకొట్టింది. దీంతో అనిల్‌కు ఛాతీలో బలమైన దెబ్బ తగిలి స్పృహ తప్పి పడిపోయాడు. అటుగా వెళ్తున్న వాహనదారులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అనిల్ మృతి చెందినట్లు తెలిపారు. అయితే, అనిల్ శరీరంపై బుల్లెట్ గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ఘటనా స్థలంలో నాలుగు బులెట్లు లభ్యమయ్యాయి. -
శ్రీకాకుళం జిల్లాలో YSRCP కార్యకర్త దారుణ హత్య
-
ఎమ్మెల్యే వేధింపులు.. టీడీపీ నేత ఆత్మహత్యాయత్నం
-
నువ్వూ ఆడదానివే కదా.. ప్రశాంతి రెడ్డిని ఏకిపారేసిన YSRCP మహిళా నేతలు


