రామ్మెహన్‌ నాయుడికి ఝలక్‌.. నిలదీసిన టీడీపీ నేత | TDP leader deals a blow to Rammohan Naidu. | Sakshi
Sakshi News home page

రామ్మెహన్‌ నాయుడికి ఝలక్‌.. నిలదీసిన టీడీపీ నేత

Jul 7 2026 2:50 PM | Updated on Jul 7 2026 3:02 PM

TDP leader deals a blow to Rammohan Naidu.

సాక్షి, విజయనగరం: కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడుకు విజయనగరంలో ఈరోజు (మంగళవారం) చేదు అనుభవం ఎదురైంది. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్వాసితులకు పరిహారం అందలేదని టీడీపీ నేత బంగార్రాజు రామ్మోహన్‌ నాయుడిని నిలదీశారు. సొంతపార్టీ నేత తనను ప్రశ్నించడంతో కేంద్రమంత్రి ఒక్కసారిగా కంగుతిన్నారు.

ఏం సమాధానం చెప్పాలో తెలియక కొద్దిసేపు కారులోనే ఉండిపోయారు. అనంతరం పోలీసుల సాయంతో అక్కడి నుండి నెమ్మదిగా జారుకున్నారు. పార్టీలో కేంద్రమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిని సొంతపార్టీ నేతలే ప్రశ్నించడం  ఇప్పుడు పొలిటికల్‌ వర్గాల్లో హాట్ టాఫిక్‌గా మారింది. కూటమి ప్రభుత్వం పరిపాలనలో ఎలా విఫలమైందో ఈ ఒక్క సన్నివేశంతో అర్థం చేసుకోవచ్చని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement