మరోవారం వచ్చేసింది. మే నెల కూడా చివరకొచ్చేసింది. అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ చేసిన 'మరీచిక', సందిగ్దం అనే తెలుగు సినిమాలతో పాటు కాటలాన్, బ్లాస్ట్ అనే డబ్బింగ్ మూవీస్.. ఈ వీకెండ్ థియేటర్లలోకి రానున్నాయి. వీటిలో దేనిపైనా బజ్ లేదు. మరోవైపు ఓటీటీల్లో 19 వరకు మూవీస్, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.
(ఇదీ చదవండి: మళ్లీ సినిమాల్లోకి మాజీ ఉప ముఖ్యమంత్రి)
ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. ధనుష్ హీరోగా చేసిన యాక్షన్ థ్రిల్లర్ 'కర', కమెడియన్ సత్య లీడ్ రోల్ చేసిన 'జెట్ లీ', 'లీడర్' చిత్రాలు ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు ఫేసెస్, కజిన్స్ అండ్ కల్యాణమ్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాంటి డబ్బింగ్ మూవీ, సిరీస్‌లు కూడా ఉన్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ రానుందంటే?
ఓటీటీల్లో ఈ వారం రిలీజయ్యే మూవీస్ (మే 25 నుంచి 31 వరకు)
నెట్‌ఫ్లిక్స్
అన్‌టోల్డ్ యూకే: విన్ని జోన్స్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - మే 26
ఏ గుడ్ గర్ల్స్ గైడ్ టూ మర్డర్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - మే 27
మై టూ సెంట్స్ (ఇటాలియన్ సిరీస్) - మే 27
కర (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 28
ఎమి మార్టినజ్ (ఇంగ్లీష్ మూవీ) - మే 28
మర్డర్ మైండ్‌ఫుల్లీ (జర్మన్ సిరీస్) - మే 28
ద ఫోర్ సీజన్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - మే 28
బ్రెజిల్స్ 70: ద థర్డ్ స్టార్ (పోర్చుగీస్ సిరీస్) - మే 29
కలబాసస్ కాన్ఫిడెంటల్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 29
రఫా (స్పానిష్ సిరీస్) - మే 29
అమెజాన్ ప్రైమ్
స్పైడర్ నోయిర్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 27
లీడర్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - మే 28
హాట్‌స్టార్
జెట్‌లీ (తెలుగు సినిమా) - మే 25
బ్రదర్స్ అండ్ సిస్టర్స్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మే 27
కజిన్స్ అండ్ కల్యాణమ్స్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మే 29
సన్ నెక్స్ట్
ఫేసెస్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 29
జీ5
రూమ్‌మేట్స్ (కన్నడ సిరీస్) - మే 27
ఆపిల్ టీవీ ప్లస్
ప్రొపెల్లర్ వన్ వే నైట్ కోచ్ (ఇంగ్లీష్ సినిమా) - మే 29
స్టార్ సిటీ (ఇంగ్లీష్ సిరీస్) - మే 29
లయన్స్ గేట్ ప్లే
ద రేస్ (రొమేనియన్ మూవీ) - మే 29
(ఇదీ చదవండి: ఒకే ఓటీటీలోకి వచ్చిన మూడు తెలుగు సినిమాలు)


