మళ్లీ సినిమాల్లోకి ఉదయనిధి స్టాలిన్‌! | Is Udhayanidhi Stalin Re Entering to Movies? | Sakshi
Sakshi News home page

సినిమాల్లో రీఎంట్రీకి రెడీ అవుతున్న మాజీ డిప్యూటీ సీఎం?

May 25 2026 8:19 AM | Updated on May 25 2026 8:41 AM

Is Udhayanidhi Stalin Re Entering to Movies?

ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌ మళ్లీ సినిమాల్లో నటించడానికి సిద్ధమవుతున్నారా? అనే ప్రశ్నకు సినీ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి అనేక చిత్రాలను విడుదల చేసిన ఉదయనిధి స్టాలిన్‌ ఆ తర్వాత కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చారు. అలా ఆయన నటించిన తొలి చిత్రం ఒరుకల్‌ ఒరు కన్నాడి (2012) మంచి విజయాన్ని సాధించింది. 

అదే చివరి సినిమా
ఆ తర్వాత వరుసగా చిత్రాలను చేస్తూ వచ్చిన ఈయన రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనడంతో సినిమాలకు స్వస్తి చెప్పారు. ఉదయనిది స్టాలిన్‌ చివరిగా నటించిన చిత్రం మామన్నన్‌. సమకాలీన రాజకీయాల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. కాగా 2021లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన ఉదయనిధి ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా చేపట్టారు. 

రీఎంట్రీ?
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈయన ఎమ్మెల్యేగా గెలిచినా డీఎంకే పార్టీ ఓడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉదయనిధి స్టాలిన్‌ మళ్లీ సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నట్లు తాజాగా జరుగుతున్న ప్రచారం. రాజకీయ నేపథ్యంలో సాగే కథాచిత్రాల్లో నటించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ మూవీస్‌ సంస్థ నిర్వహణ బాధ్యతలను ఉదయనిధి స్టాలిన్‌ వారసుడు ఇన్బనిధి స్టాలిన్‌ చేపట్టిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement