Jetlee Movie
-
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి ఏకంగా 16 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి త్రికాల, బ్లాస్ట్ జోన్, కాటలాన్ లాంటి చిన్న, డబ్బింగ్ చిత్రాలే రిలీజయ్యాయి. మరోవైపు ఓటీటీల్లో మాత్రం కాస్త చెప్పుకోదగ్గ మూవీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఇప్పటికే ధనుష్ 'కర', సత్య 'జెట్ లీ', 'డ్రింకర్ సాయి' తదితర సినిమాలు ఓటీటీల్లోకి వచ్చేయగా ఇవి కాకుండా మరో 16కి పైగా మూవీస్, వెబ్ సిరీసులు శుక్రవారం ఒక్కరోజే రాబోతున్నాయి. ఇంతకీ అవేంటి? ఏది ఎందులోకి రానుందనేది చూద్దాం.(ఇదీ చదవండి: 'పెద్ది' కూడా రిలీజ్ అవుతోంది.. 'విశ్వంభర' ఎక్కడ?)ఈ శుక్రవారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు (మే 29)అమెజాన్ ప్రైమ్లీడర్ - తెలుగు డబ్బింగ్ మూవీసుఖమానో సుఖమమ్ - మలయాళ సినిమాద లాస్ట్ వికింగ్ - డానిష్ మూవీహాట్స్టార్కజిన్స్ అండ్ కల్యాణమ్స్ - తెలుగు డబ్బింగ్ సిరీస్లార్డ్ కర్జోన్ కీ హవేలీ - హిందీ సినిమా (మే 30)జాలీ ఎల్ఎల్బీ 3 - హిందీ మూవీజెట్ లీ - తెలుగు చిత్రం (స్ట్రీమింగ్ అవుతోంది)ఆహాసచిన్ ఏ బిలియన్ డ్రీమ్స్ - తెలుగు సినిమానెట్ఫ్లిక్స్బ్రెజిల్స్ 70: ద థర్డ్ స్టార్ - పోర్చుగీస్ సిరీస్కలబాసస్ కాన్ఫిడెంటల్ - ఇంగ్లీష్ సిరీస్రఫా - స్పానిష్ సిరీస్కర - తెలుగు డబ్బింగ్ సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది)సన్ నెక్స్ట్ఫేసెస్ - తెలుగు డబ్బింగ్ సినిమాజీ5ద అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ - బెంగాలీ సిరీస్డ్రింకర్ సాయి - తెలుగు మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది)ఆపిల్ టీవీ ప్లస్ప్రొపెల్లర్ వన్ వే నైట్ కోచ్ - ఇంగ్లీష్ సినిమాస్టార్ సిటీ - ఇంగ్లీష్ సిరీస్లయన్స్ గేట్ ప్లేద రేస్ - రొమేనియన్ మూవీహెచ్బీఓ మ్యాక్స్ద మూమెంట్ - ఇంగ్లీష్ సినిమా(ఇదీ చదవండి: కళ్లు తెరిపించే కోర్ట్ రూమ్ సినిమా.. ఓటీటీ తెలుగు రివ్యూ) -
ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్
మరోవారం వచ్చేసింది. మే నెల కూడా చివరకొచ్చేసింది. అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ చేసిన 'మరీచిక', సందిగ్దం అనే తెలుగు సినిమాలతో పాటు కాటలాన్, బ్లాస్ట్ అనే డబ్బింగ్ మూవీస్.. ఈ వీకెండ్ థియేటర్లలోకి రానున్నాయి. వీటిలో దేనిపైనా బజ్ లేదు. మరోవైపు ఓటీటీల్లో 19 వరకు మూవీస్, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.(ఇదీ చదవండి: మళ్లీ సినిమాల్లోకి మాజీ ఉప ముఖ్యమంత్రి)ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. ధనుష్ హీరోగా చేసిన యాక్షన్ థ్రిల్లర్ 'కర', కమెడియన్ సత్య లీడ్ రోల్ చేసిన 'జెట్ లీ', 'లీడర్' చిత్రాలు ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు ఫేసెస్, కజిన్స్ అండ్ కల్యాణమ్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాంటి డబ్బింగ్ మూవీ, సిరీస్‌లు కూడా ఉన్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ రానుందంటే?ఓటీటీల్లో ఈ వారం రిలీజయ్యే మూవీస్ (మే 25 నుంచి 31 వరకు)నెట్ఫ్లిక్స్అన్టోల్డ్ యూకే: విన్ని జోన్స్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - మే 26ఏ గుడ్ గర్ల్స్ గైడ్ టూ మర్డర్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - మే 27మై టూ సెంట్స్ (ఇటాలియన్ సిరీస్) - మే 27కర (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 28ఎమి మార్టినజ్ (ఇంగ్లీష్ మూవీ) - మే 28మర్డర్ మైండ్‌ఫుల్లీ (జర్మన్ సిరీస్) - మే 28ద ఫోర్ సీజన్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - మే 28బ్రెజిల్స్ 70: ద థర్డ్ స్టార్ (పోర్చుగీస్ సిరీస్) - మే 29కలబాసస్ కాన్ఫిడెంటల్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 29రఫా (స్పానిష్ సిరీస్) - మే 29అమెజాన్ ప్రైమ్స్పైడర్ నోయిర్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 27లీడర్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - మే 28హాట్స్టార్జెట్లీ (తెలుగు సినిమా) - మే 25బ్రదర్స్ అండ్ సిస్టర్స్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మే 27కజిన్స్ అండ్ కల్యాణమ్స్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మే 29సన్ నెక్స్ట్ఫేసెస్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 29జీ5రూమ్మేట్స్ (కన్నడ సిరీస్) - మే 27ఆపిల్ టీవీ ప్లస్ప్రొపెల్లర్ వన్ వే నైట్ కోచ్ (ఇంగ్లీష్ సినిమా) - మే 29స్టార్ సిటీ (ఇంగ్లీష్ సిరీస్) - మే 29లయన్స్ గేట్ ప్లేద రేస్ (రొమేనియన్ మూవీ) - మే 29(ఇదీ చదవండి: ఒకే ఓటీటీలోకి వచ్చిన మూడు తెలుగు సినిమాలు) -
ఓటీటీలోకి తెలుగు లేటెస్ట్ కామెడీ సినిమా
కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న సత్య.. హీరోగా గతంలో ఓ ప్రయత్నం చేశాడు గానీ వర్కౌట్ కాలేదు. మళ్లీ చాన్నాళ్లకు రీసెంట్‌గానే ఓ కామెడీ మూవీతో వచ్చాడు. తనకు మరింత క్రేజ్ వచ్చేలా చేసిన 'మత్తు వదలరా' దర్శకుడితో కలిసి తీసిన ఈ కామెడీ సినిమా.. ఇప్పుడు నెలలోపే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.(ఇదీ చదవండి: 'ప్రేమలు' హీరో పగబడితే.. ఓటీటీ సినిమా తెలుగు రివ్యూ)'మత్తు వదలరా' రెండు సినిమాలతో ఆకట్టుకున్న రితేశ్ రానా దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ 'జెట్ లీ'. సత్య, వెన్నెల కిశోర్, రియా సింఘా ప్రధాన పాత్రలు చేశారు. వెరైటీ ప్రమోషన్లతో ఆకట్టుకోవడంతో ఓ మాదిరి బజ్ ఏర్పడింది. కానీ మే 01న థియేటర్లలోకి వచ్చిన తొలి ఆటకే పూర్తిగా తేలిపోయింది. కామెడీ పేరుతో చేసిన చిత్రవిచిత్ర విన్యాసాలు ప్రేక్షకులకు నచ్చలేదు. దీంతో డిజాస్టర్ అయింది. ఇప్పుడీ చిత్రం ఈనెల 25 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు.'జెట్ లీ' విషయానికొస్తే.. ప్రజాపతి (అజయ్) అనే బిజినెస్‌మ్యాన్ రూ.15 వేల కోట్ల బ్యాంకింగ్ స్కామ్ చేసి దుబాయ్ పారిపోతాడు. దీంతో కేంద్ర హోంమంత్రి మేల్కోటి (శ్రీనివాస్ వడ్లమాని) ఇతడిని అరెస్ట్ చేసి తిరిగి దేశానికి రప్పించే బాధ్యతని భారత ఇంటెలిజెన్స్‌కి అప్పజెబుతాడు. అయితే కొందరి వల్ల తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలియడంతో ప్రజాపతి స్వయంగా లొంగిపోయినట్లు నటించి, ఆ తర్వాత తప్పించుకోవాలని ప్లాన్ వేస్తాడు. దుబాయ్ నుంచి కొచ్చికి ప్రజాపతిని ప్రత్యేక విమానంలో తీసుకొస్తుండగా.. ఊహించని సంఘటనలు జరుగుతాయి. ఇంతకీ అవేంటి? ఇదే విమానంలో గతం మర్చిపోయిన స్థితిలో ఉన్న డాక్టర్ వేదవ్యాస్ (సత్య) ఎవరు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మెగా కోడలి కొత్త సినిమా.. 12 రోజులకే స్ట్రీమింగ్)Get ready for first-of-its-kind inflight entertainment with bone-breaking action 💥 Fasten your seatbelts for a mad, turbulent ride ✈️ #JetLee is crash landing on 25th May on JioHotstar! 💫 #JetLeeOnJioHotstar A @RiteshRana's turbulence 🛫 Starring #Satya, #RheaSingha,… pic.twitter.com/mPAZ8dgFUq— JioHotstar Telugu (@JioHotstarTel_) May 17, 2026 -
లేటెస్ట్ తెలుగు సినిమాలు.. తొలిరోజు కలెక్షన్స్ ఎంత?
ఈ వీకెండ్ థియేటర్లలోకి తెలుగులో చెప్పుకోదగ్గ మూవీస్ రిలీజ్ కాలేదు. కమెడియన్ సత్య హీరోగా నటించిన 'జెట్లీ', దర్శకుడు తరుణ్ భాస్కర్ లీడ్ రోల్ చేసిన 'గాయపడ్డ సింహం' చిత్రాలు.. ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఈ రెండింటికి పాజిటివ్ టాక్ అయితే రాలేదు. మరి తొలిరోజు కలెక్షన్స్ ఎంత వసూలు చేశాయి? వీటి కంటే ఒకరోజు ముందు రిలీజైన ధనుష్ 'కర' సంగతేంటి?(ఇదీ చదవండి: సత్య 'జెట్లీ' సినిమా రివ్యూ)కమెడియన్ సత్య, లీడ్ రోల్ చేసిన 'జెట్ లీ' చిత్రానికి రితేష్ రానా దర్శకుడు. ప్రమోషన్స్‌తో అయితే ఆకట్టుకున్నారు గానీ మూవీలో చెప్పుకోదగ్గ కామెడీ లేదు, అలానే స్టోరీ కూడా గందరగోళంగా ఉండటం లాంటివి మైనస్ అయ్యాయి. స్టార్స్ ఎవరూ లేకపోయినప్పటికీ ఉన్నంతలో బాగానే వసూలు చేసింది. తొలిరోజు రూ.1.30 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.ఈ ఏడాది ప్రారంభంలో ఓ సినిమాతో వచ్చిన తరుణ్ భాస్కర్.. మూడు నెలలు తిరిగేసరికల్లా 'గాయపడ్డ సింహం' అంటూ వచ్చాడు. ట్రంప్‌పై చేతబడి చేయడం అనే విచిత్రమైన స్టోరీ లైన్‌తో తీసిన ఈ మూవీలోనూ పెద్గగా చెప్పుకోదగ్గ కామెడీ లేదు. దీంతో దీనికి నెగిటివ్ టాక్ వచ్చింది. ఈ క్రమంలోనే తొలిరోజు రూ.76 లక్షల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు సమాచారం.(ఇదీ చదవండి: ‘గాయపడ్డ సింహం’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)ఇకపోతే గురువారం(ఏప్రిల్ 30) థియేటర్లలోకి వచ్చిన ధనుష్ 'కర' సినిమా సీరియస్‌గా సాగే డ్రామా. కొందరికి నచ్చగా మరికొందరికి నచ్చలేదు. అయితేనేం రెండు రోజుల్లో రూ.20.20 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్ వచ్చాయి. 1990ల్లో రైతుల్ని బ్యాంక్‌లు లోన్స్ పేరు చెప్పి ఎలా మోసం చేసేవి అనే కల్పిత కథతో దీన్ని తెరకెక్కించారు.(ఇదీ చదవండి: ‘కర’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్) -
మిస్ యూనివర్స్ ఇండియా టు హీరోయిన్.. ఎవరీ రియా సింఘా? (ఫొటోలు)
-
జెట్లీ ప్రదర్శనను నిలిపివేయడం తగదు
మల్టీప్లెక్స్ తరహాలోనే పర్సెంటే జీ విధానంలో సినిమాలను ప్రదర్శించాలని హైదరాబాద్‌లోని 23 సింగిల్ స్క్రీన్ల థియేటర్ల యజమానులు నిర్ణయించినట్లు ‘తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్’(టీఎఫ్‌సీసీ) గతంలో ఓ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ పర్సెంటేజీ బేస్డ్ స్క్రీనింగ్ విధానాన్ని తాము అంగీకరించమని, పాత విధానాన్నే కొనసాగించాలని ‘యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్’ సభ్యులు ‘టీఎఫ్‌సీసీ’కి లేఖ పంపిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో వీకెండ్ రెంటల్స్, రెవెన్యూ షేరింగ్ నిబంధనలపై గత కొంతకాలంగా మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పీ సంస్థకు, ఎగ్జిబిటర్లకు మధ్య భేదాభిప్రాయాలు నడుస్తున్నాయి. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు ‘మైత్రి’ సినిమాలను సింగిల్ స్క్రీన్లలో ప్రదర్శించకూడదని ఎగ్జిబిటర్లు నిర్ణయించుకున్నారు. అయితే శుక్రవారం మైత్రి సంస్థ నుంచి విడుదలైన ‘జెట్లీ’ సినిమాను పలు మల్టీప్లెక్స్‌లలో ప్రదర్శించలేదట. ఈ విషయంపై మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పీ భాగస్వామి అయిన కేతిరెడ్డి శశిధర్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘సింగిల్ స్క్రీన్ థియేటర్ల సమస్యపై మొదటి నుంచి మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం. ఈ సమస్య ఇంకా పరిష్కారం కానప్పటికీ మీ నిర్ణయాన్ని మేము గౌరవించాం. కానీ ‘జెట్లీ’ మూవీ విషయంలో జరిగింది ఆమోదయోగ్యం కాదు. మీ నియంత్రణలో ఉన్న మల్టీప్లెక్స్‌లో మా సినిమా ప్రదర్శనను నిలిపివేశారు. ఈ నిర్ణయం మాపై ఒత్తిడి తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నంలా కనిపిస్తోంది. వెంటనే పునరాలోచించి మల్టీప్లెక్స్‌లలో ‘జెట్లీ’ ప్రదర్శనకు అనుమతించాలి’’ అని కోరారు. -
సత్య 'జెట్లీ' సినిమా రివ్యూ
ఎన్నో సినిమాల్లో కమెడియన్‌గా ఆకట్టుకున్న సత్య.. హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'జెట్లీ'. వెన్నెల కిశోర్, రియా సింఘా, అజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 'మత్తు వదలరా' ఫేమ్ రితేష్ రానా దీనికి దర్శకుడు. ప్రమోషనల్ కంటెంట్‌తో అలరించిన ఈ చిత్రం ఇప్పుడు థియేటర్లలోకి వచ్చేసింది. ఇంతకీ ఇది ఎలా ఉంది? కమెడియన్ సత్య.. హీరోగా హిట్ కొట్టాడా అనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: తండ్రి కాబోతున్న నారా రోహిత్.. ఆ ఇద్దరు కూడా)కథేంటి?ప్రజాపతి(అజయ్) బ్యాంక్ స్కామ్ చేసి రూ.15,000 కోట్లతో దుబాయికి పారిపోతాడు. అతన్ని చంపడానికి కొంతమంది ప్రయత్నిస్తుంటారు. ప్రాణాలని కాపాడకునేందుకు తనే లొంగిపోతాడు. ఏజెంట్ శివాని (రియా సింఘా) తన టీంతో కలిసి ప్రజాపతిని విమానంలో ఇండియాకు తీసుకురావడానికి బయలుదేరుతారు. అదే విమానాన్ని తన మనుషులతో హైజాక్ చేయించి పారిపోవాలని ప్రజాప్రతి ప్లాన్ వేస్తాడు. మరి ఇది సక్సెస్ అయ్యిందా? అదే విమానంలో ఉన్న వేదవ్యాస్(సత్య)ఎవరు? అంధ వైద్యుడిగా ఎందుకు నటించాడు? ప్రజాపతిని చంపడానికి ప్రయత్నించేది ఎవరు? హోం మంత్రి మేల్కోటే (సాయి శ్రీనివాస్)కి బ్యాంక్ స్కాంతో ఉన్న సంబంధమేంటి? హరిచంద్ర (శుభలేఖ సుధాకర్), వెన్నెల కిషోర్ పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే?ఇన్నాళ్లు తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించిన సత్య.. హీరోగా సినిమా చేస్తున్నాడని ప్రకటించిన రోజు నుంచే 'జైట్లీ'పై అంచనాలు ఏర్పడ్డాయి. సత్య హీరో కాబట్టి హాయిగా రెండున్నర గంటలపాటు నవ్వుకోవచ్చు అని థియేటర్‌కి వచ్చిన ప్రేక్షకుడికి నిరాశ తప్పదు. కామెడీ ఏమో గానీ కనీసం చెప్పుకోవడానికి కథ కూడా లేని మూవీ ఇది. బ్యాంకు స్కామ్ మర్డర్‌తో కథని ఆసక్తికరంగా ప్రారంభించిన దర్శకుడు.. కాసేపటికి అర్థంపర్థం లేని డైలాగులు సాగదీత సన్నివేశాలతో నీరసం తెప్పించాడు. కథ మొత్తం విమానంలోనే జరుగుతుంది.ఫస్టాప్ అంతా ప్రజాపతి పాత్ర గురించి చూపించి తను దుబాయి నుంచి ఇండియాకి తిరిగి రావడం, ఫ్లైట్‌లో ఉండడం, ఫ్లైట్‌లో ఉన్న జనాలు, వాళ్ల పాత్రల గురించి చూపిస్తారు. సత్య తనని తాను మర్చిపోయినట్టు, తనపై దాడి జరిగినట్టు, అతను ఎవరో గుర్తుతెచ్చుకునే ప్రాసెస్ చూపిస్తారు. ఫస్ట్ హాఫ్ బోరింగ్‌గా అక్కడక్కడ కామెడీ డైలాగ్స్‌తో, స్పూఫ్ సీన్ తో సాగుతుంది. సెకండాఫ్‌లో అసలు కథ మొదలవుతుంది. ఈ బ్యాంక్ స్కామ్ ఏంటి? సత్య అసలు ఎలా వచ్చాడు? సత్య ఎవరు? వెన్నెల కిషోర్ పాత్ర ఏంటి? అని కథతో పాటు అక్కడక్కడ కామెడీ నడిపించారు. సినిమా చూస్తున్నంత సేపు ఎప్పుడు అయిపోతుందా అని ప్రేక్షకులు భావించేలా ఉండడం మైనస్ పాయింట్. ఫస్టాఫ్ కొంతవరకు నవ్విస్తుంది కానీ, సెకండ్ హాఫ్ మాత్రం ఆకట్టుకోదు. కావాలని రాసుకున్న కొన్ని ట్విస్టులు పేలకపోగా, ఎబ్బెట్టుగా అనిపించాయి.ఎవరెలా చేశారు?లీడ్ రోల్ చేసిన సత్య.. తనదైన కామెడీతో ఆకట్టుకున్నారు. వెన్నెల కిశోర్ కూడా కనిపించిన ప్రతిసారి నవ్వించాడు. హీరోయిన్ రియా సింఘా, అజయ్ కూడా పర్లేదనిపించారు. కాకపోతే స్టోరీలో సరైన కంటెంట్ లేకపోవడంతో పని జరగలేదు. టెక్నికల్ టీమ్ విషయానికొస్తే.. ఉన్న రెండు పాటలు ఏమంత ఆకట్టుకోలేదు. బ్యాక్ గ్రౌండ్ కూడా వర్కౌట్ కాలేదు. సెకండాఫ్‌లో కొన్ని సీన్స్ ట్రిమ్ చేయొచ్చనిపించింది. సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ చాలా కష్టపడి విమానంలో వాతావారణాన్ని బాగా సృష్టించారు. అవి రియలస్టిక్‌గా అనిపించాయి. ఓవరాల్‌గా చెప్పుకొంటే 'జెట్లీ'.. వర్కౌట్ కాలేదు!(ఇదీ చదవండి: ‘కర’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్) -
'ఐ బొమ్మ బ్యాన్ చేశారుగా..' ఫుల్ కామెడీగా జెట్లీ ట్రైలర్
టాలీవుడ్ కమెడియన్ సత్య హీరోగా వస్తోన్న చిత్రం జెట్లీ. ఈ మూవీకి రితేశ్ రానా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ గ్లింప్స్, పోస్టర్స్, ట్రైలర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో సత్య సరసన రియా సింఘా హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ కామెడీ ఎంటర్టైనర్ రిలీజ్‌కు సిద్ధమైంది.ఈ నేపథ్యంలో జెట్లీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే ఓ ట్రైలర్ రాగా.. తాజాగా రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఫ్లైట్‌లో వచ్చే సీన్స్ ఫుల్ కామెడీని తలపిస్తున్నాయి. ఈ మూవీని క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నిర్మించారు. ఈ సినిమా మే 1వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రానికి కాల భైరవ సంగీతమందించారు. -
అప్పుడు సత్య షాకయ్యాడు : రితేష్ రానా
హాస్య నటుడు సత్య హీరోగా నటించిన సినిమా ‘జెట్లీ’. రితేష్ రానా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రియా సింఘా హీరోయిన్గా నటించగా, ‘వెన్నెల’ కిశోర్, అజయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు నిర్మించిన ఈ సినిమా మే 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో రితేష్ రానా మాట్లాడుతూ– ‘‘జయేంద్ర అనే రచయిత, నేను 2020లో ఓ ఇంటెన్స్ థ్రిల్లర్ స్టోరీ అనుకున్నాం. ఆ కథకు కొంతమంది హీరోలను సంప్రదించాం. కానీ కుదర్లేదు. ఇదే కథలో సత్యది ముందు ఫ్లైట్ అటెండర్ క్యారెక్టర్. ఆ తర్వాత ఈ కథకు కాస్త హ్యూమర్ జోడించి, సత్యతోనే హీరో పాత్ర చేయించాం. ‘నువ్వే హీరో’ అని సత్యకు చెప్పగానే షాక్ అయి, రిస్క్ అన్నారు. కానీ ఈ కథను ఎలా తెరకెక్కిస్తానో చెప్పగానే, హీరోగా నటించేందుకు ఓకే చెప్పారు.‘వెన్నెల’ కిశోర్‌గారు ఈ సినిమా అంతా సుడోకు ఆడుకుంటుంటారు. ఆయనది కాస్త టిపికల్ క్యారెక్టర్. రియా సింఘా స్పెషల్ ఏజెంట్ రోల్ చేశారు. అలాగే ఈ సినిమాలోని కీలకమైన ప్రజాపతి పాత్రను అజయ్‌గారు చేశారు. ప్రధాన కథ ఆయన పాత్ర చుట్టూ తిరుగుతుంది. ప్రజాపతి యాభైవేల కోట్ల రూపాయల బ్యాంకు స్కామ్ చేసి, పారిపోతాడు. ఆయన్ను దుబాయ్ నుంచి కొచ్చికి తీసుకురావడమే ఈ సినిమా స్టోరీ. యాక్షన్, థ్రిల్, హ్యూమర్‌తో సాగే మంచి ఎంటర్టైనర్. 80 శాతం కథ ఫ్లైట్‌లోనే జరుగుతుంది. ఎకానమీ, బిజినెస్ క్లాస్, కార్గో, కాక్‌పిట్ ఇలా ఒకే ఫ్లోర్‌పై ఐదు సెట్లు వేశాం. ఈ సినిమా హిట్ అయితే సీక్వెల్ గురించి ఆలోచిస్తాను. నా నెక్ట్స్ మూవీ హారర్ జానర్లో ఉంటుంది. చెర్రీగారి నిర్మాణంలోనే ఉండొచ్చు. ‘మత్తు వదలరా 3’ సినిమా ఆలోచన ఉంది’’ అని చెప్పారు. -
‘జెట్లీ’ మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)


