'ఐ బొమ్మ బ్యాన్ చేశారుగా..' ఫుల్ కామెడీగా జెట్లీ ట్రైలర్ | Comedian Satya JETLEE Release Trailer Out Now | Sakshi
Sakshi News home page

JETLEE Release Trailer: 'ఐ బొమ్మ బ్యాన్ చేశారుగా..' నవ్వులు పూయిస్తోన్న జెట్లీ ట్రైలర్

Apr 30 2026 5:15 PM | Updated on Apr 30 2026 5:22 PM

Comedian Satya JETLEE Release Trailer Out Now

టాలీవుడ్ కమెడియన్ సత్య హీరోగా వస్తోన్న చిత్రం జెట్లీ. ఈ మూవీకి రితేశ్ రానా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ గ్లింప్స్, పోస్టర్స్, ట్రైలర్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.  ఈ చిత్రంలో సత్య సరసన రియా సింఘా హీరోయిన్‌గా కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ రిలీజ్‌కు సిద్ధమైంది.

ఈ నేపథ్యంలో జెట్లీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే ఓ ట్రైలర్‌ రాగా.. తాజాగా రిలీజ్‌ ట్రైలర్‌ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఫ్లైట్‌లో వచ్చే సీన్స్‌ ఫుల్ కామెడీని తలపిస్తున్నాయి. ఈ మూవీని క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో నిర్మించారు.  ఈ సినిమా మే 1వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రానికి కాల భైరవ సంగీతమందించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement