అప్పుడు సత్య షాకయ్యాడు : రితేష్‌ రానా | Ritesh Rana Made Interesting Comments About Satya's Upcoming Jetlee Movie, Set To Release On May 1st | Sakshi
Sakshi News home page

అప్పుడు సత్య షాకయ్యాడు : రితేష్‌ రానా

Apr 25 2026 6:08 PM | Updated on Apr 25 2026 6:20 PM

Ritesh Rana Talk About Satya Jetlee Movie

హాస్య నటుడు సత్య హీరోగా నటించిన సినిమా ‘జెట్లీ’. రితేష్‌ రానా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రియా సింఘా హీరోయిన్‌గా నటించగా, ‘వెన్నెల’ కిశోర్, అజయ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు నిర్మించిన ఈ సినిమా మే 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో రితేష్‌ రానా మాట్లాడుతూ– ‘‘జయేంద్ర అనే రచయిత, నేను 2020లో ఓ ఇంటెన్స్‌ థ్రిల్లర్‌ స్టోరీ అనుకున్నాం. ఆ కథకు కొంతమంది హీరోలను సంప్రదించాం.   కానీ కుదర్లేదు. ఇదే కథలో సత్యది ముందు ఫ్లైట్‌ అటెండర్‌ క్యారెక్టర్‌. ఆ తర్వాత ఈ కథకు కాస్త హ్యూమర్‌ జోడించి, సత్యతోనే హీరో పాత్ర  చేయించాం. ‘నువ్వే హీరో’ అని సత్యకు చెప్పగానే షాక్‌ అయి, రిస్క్‌ అన్నారు. కానీ ఈ కథను ఎలా తెరకెక్కిస్తానో చెప్పగానే, హీరోగా నటించేందుకు ఓకే చెప్పారు.

‘వెన్నెల’ కిశోర్‌గారు ఈ సినిమా అంతా సుడోకు ఆడుకుంటుంటారు. ఆయనది కాస్త టిపికల్‌ క్యారెక్టర్‌. రియా సింఘా స్పెషల్‌ ఏజెంట్‌ రోల్‌ చేశారు. అలాగే ఈ సినిమాలోని కీలకమైన ప్రజాపతి పాత్రను అజయ్‌గారు చేశారు. 

ప్రధాన కథ ఆయన పాత్ర చుట్టూ తిరుగుతుంది. ప్రజాపతి యాభైవేల కోట్ల రూపాయల బ్యాంకు స్కామ్‌ చేసి, పారిపోతాడు. ఆయన్ను దుబాయ్‌ నుంచి కొచ్చికి తీసుకురావడమే ఈ సినిమా స్టోరీ. యాక్షన్, థ్రిల్, హ్యూమర్‌తో సాగే మంచి ఎంటర్‌టైనర్‌. 80 శాతం కథ ఫ్లైట్‌లోనే జరుగుతుంది. ఎకానమీ, బిజినెస్‌ క్లాస్, కార్గో, కాక్పిట్‌ ఇలా ఒకే ఫ్లోర్‌పై ఐదు సెట్లు వేశాం. 

ఈ సినిమా హిట్‌ అయితే సీక్వెల్‌ గురించి ఆలోచిస్తాను. నా నెక్ట్స్‌ మూవీ హారర్‌ జానర్‌లో ఉంటుంది. చెర్రీగారి నిర్మాణంలోనే ఉండొచ్చు. ‘మత్తు వదలరా 3’ సినిమా ఆలోచన ఉంది’’ అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement