చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్‌.. 19 ఏళ్లలో ఒకే ఒక్కడు | Sanju Samson Breaks Multiple IPL Records With Wankhede Century | Sakshi
Sakshi News home page

IPL 2026: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్‌.. 19 ఏళ్లలో ఒకే ఒక్కడు

Apr 23 2026 10:17 PM | Updated on Apr 24 2026 9:00 AM

Sanju Samson Breaks Multiple IPL Records With Wankhede Century

ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ స్టార్ ఓపెన‌ర్ సంజూ శాంస‌న్ మ‌రోసారి శ‌త‌క్కొట్టాడు. ఈ ధ‌నాధ‌న్ లీగ్‌లో భాగంగా వాఖండే స్టేడియం వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌తో మ్యాచ్‌లో శాంస‌న్ అద్భుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగాడు. ఈ కేర‌ళ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్‌ ముంబై బౌల‌ర్ల‌ను త‌నదైన శైలిలో ఉతికారేశాడు.

కేవలం 54 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌లతో 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సంజూకు ఇది 5వ ఐపీఎల్ సెంచరీ కావడం గమనార్హం. ఓవరాల్‌గా టీ20 క్రికెట్‌లో ఇది అతడికి ఎనిమిదివ సెంచరీ. ఈ క్రమంలో శాంసన్‌ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

సంజూ సాధించిన రికార్డులు ఇవే
ముంబై ఇండియన్స్‌పై సెంచరీ చేసిన మొట్టమొదటి సీఎస్‌కే బ్యాటర్‌గా శాంసన్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో సంజూ కంటే ముందు ఈ సీఎస్‌కే బ్యాటర్ కూడా ముంబైపై మూడంకెల స్కోరును అందుకోలేదు.

అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఒకే సీజన్‌లో రెండు సెంచరీలు చేసిన మొదటి భారత బ్యాటర్‌గా సంజూ రికార్డు నెలకొల్పాడు.

ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో కెఎల్ రాహుల్‌తో కలిసి నాలుగో స్థానంలో శాంసన్‌ నిలిచాడు.

టీ20 క్రికెట్‌లో భారత తరపున అత్యధిక సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా రోహిత్ శర్మ సరసన శాంసన్ నిలిచాడు. వీరిద్దరూ ఇప్పటివరకు 8 టీ20 సెంచరీలు సాధించారు. ఈ జాబితాలో విరాట్ కోహ్లి(9), అభిషేక్ శర్మ(9) సంయుక్తంగా అగ్రస్ధానంలో ఉన్నారు.
చదవండి: IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి విధ్వంసకర ప్లేయర్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement