ఆరోగ్యంగా ఉండాలని అందరూ అనుకుంటారు. ఉద్యోగ ఒత్తిళ్లు, గంటల తరబడి కూర్చునే జాబ్ నుంచి ఫిట్‌గా మారాలని నిర్ణయించుకుని, తీవ్ర కసరత్తు చేస్తారు. కానీ దీనికి సంబంధించి వైద్యుల సలహాలు, మందస్తు ప్రిపరేషన్ లేకపోతే ముప్పు తప్పదు. బెంగళూరుకు చెందిన ఒక ఉద్యోగికి ఎదురైన చేదు అనుభవం ఈ విషయాన్నే మరోసారి రుజువు చేసింది. పరుగు మంచిదే, కానీ ముందస్తు ప్రిపరేషన్ అవసరం,సురక్షితమైన ఆరోగ్యమే అంతిమ లక్ష్యం కావాలి అనే అంశంపై ఓ కథనం.
బెంగళూరుకు చెందిన, 40 ఏళ్ల మధ్య వయసు కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని భావించాడు. ఏళ్ల తరబడి ఒత్తిడితో కూడినడెస్క్ జాబ్‌నుంచి ఫిట్‌గా మారాలను కున్నాడు. అంతేకాదు లాంగ్-డిస్టెన్స్ రన్నింగ్‌ను చేపట్టాలని నిర్ణయించుకున్నాడు అమెరికాలో 100 కిలోమీటర్ల అల్ట్రామారథాన్‌ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. కానీ అంతలోనూ ఊహించని ప్రమాదం అతణ్ని మృత్యువు అంచుల దాకా తీసుకెళ్లింది. ఇంతకీ ఏమైందంటే.
అల్ట్రామారథాన్‌కోసం శ్రద్ధగా శిక్షణ పొందాడు. గుండె జబ్బులు, ఇతర అనారోగ్య సంకేతాలవీ లేకుండా ఆరోగ్యంగా కనిపించాడు. ఆ తర్వాత జరిగిన సంఘటన అతనికి షాక్ ఇచ్చింది. అతను తన ప్రాక్టీస్ రన్‌ల సమయంలో ట్రాక్‌పై కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న స్నేహితులు ఎమర్జెన్సీ రూమ్‌కు తీసుకువెళ్లారు. వైద్య పరీక్షలో అతని గుండెకు రక్తాన్ని సరఫరా చేసే మూడు ప్రధాన కరోనరీ ధమనులలో క్లాట్స్ ఉన్నట్లు తేలింది. అంతేకాదు ఆ తరువాత పరీక్షల్లో హై కొలెస్ట్రాల్ స్థాయిలు, కుటుంబంలో గుండె జబ్బుల చరిత్రతో సహా, ఏళ్లుగా గుర్తించడని పలు అంతర్లీన ప్రమాద కారకాలు బయటపడ్డాయి.
ఒక విధంగా చెప్పాలంటే అతను చాలా అదృష్టవంతుడు. ఒక పెను ప్రమాదం జరగక ముందే అతని పరిస్థితిని గుర్తించారు. గుండె ఆరోగ్యానికి పరుగు ఉత్తమమైన వ్యాయామమే అయినప్పటికీ, మధ్య వయస్సులో ఎలాంటి ముందస్తు సన్నాహం లేకుండా అకస్మాత్తుగా తీవ్రమైన ఓర్పు శిక్షణను ప్రారంభించడం, సంవత్సరాలుగా నిశ్శబ్దంగా ఉన్న అంతర్లీన వ్యాధిని కొన్నిసార్లు బయట పెట్టగలదని ఈ కేసు గుర్తు చేస్తుంది.
పరుగు తీయడం వల్ల గుండె జబ్బులు రావు. నిజానికి ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే, సుదీర్ఘకాలం పాటు ఎటువంటి శారీరక శ్రమ లేకుండా చాలా కాలం గడిపి, ఒక్కసారిగా 40 ఏళ్ల వయసులో తీవ్రమైన పరుగు పందాలు (మార్గాథాన్‌లు) ప్రారంభించడం వల్ల, లోపల దాగి ఉన్న గుండె సమస్యలు అకస్మాత్తుగా బయటపడే ప్రమాదం ఉంది.
40 ఏళ్లు పైబడిన వారు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి?
అధిక కొలెస్ట్రాల్, బీపీ, మధుమేహం, ధూమపానం వంశపారంపర్య గుండె జబ్బుల వంటి రిస్క్ ఫ్యాక్టర్లు చాలా సంవత్సరాలుగా లోపల నెమ్మదిగా ధమనులలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తాయి.
బయటకు ఎంతో ఫిట్‌గా కనిపించే వ్యక్తికి కూడా లోపల గుండె ధమనులలో తీవ్రమైన బ్లాక్స్ ఉండే అవకాశం ఉంది.
ఒక్కసారిగాతీవ్రంగా శ్రమించడం వల్ల గుండెపై ఒత్తిడి పెరిగి, రక్తపోటు ఎక్కువ అవుతుంది. దీనివల్ల లోపల ఉన్న కొవ్వు పలకలు (plaques) ఊడిపోయి హార్ట్ ఎటాక్‌కు దారితీయవచ్చు.
40 ఏళలు దాటిన తరువాత ముందే కార్డియాక్ స్క్రీనింగ్ అంటే గుండె పరీక్షలు చేయించుకోవాలి. డాక్టర్ల సలహా మేరకు ECG, ఎకోకార్డియోగ్రామ్ , ట్రెడ్‌మిల్ టెస్ట్ వంటివి చేయించుకోవడం ఉత్తమం.
పరుగు, లేదా కఠిన వ్యాయామాలను ఆరంభించే ముందు ఒకసారి వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి.
ప్రధానంగా రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు, కొలెస్ట్రాల్ పరీక్షలతో ఫ్యామిలీ హిస్టరీని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
రిస్క్ ఎక్కువగా ఉన్నవారికి 'కరోనరీ CT యాంజియోగ్రఫీ' ద్వారా లోపల ఉన్న బ్లాక్స్‌ను ముందే గుర్తించవచ్చు.
వ్యాయామాన్ని ఒకేసారి తీవ్రం చేయకూడదు
కొన్ని సంవత్సరాలుగా రన్నింగ్ చేయని వారు ఒక్కసారిగా కొన్ని నెలల్లోనే పెద్ద రేసులకు సిద్ధం కాకూడదు.
తొలుతసాధారణ నడకతో ప్రారంభించి, ఆపై వేగంగా నడవడం (Brisk Walking), ఆ తర్వాతే రన్నింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి.
వేగం లేదా దూరం కంటే క్రమం తప్పకుండా చేయడం (Consistency) ముఖ్యం. దీనివల్ల గుండె, కండరాలు, కీళ్లకు తగిన సమయం దొరుకుతుంది.
మరి ఏం చేయాలి?
40 ఏళ్లు దాటిన తర్వాత శరీరంలో కండరాల సాంద్రత సహజంగానే తగ్గుతుంది. కాబట్టి కేవలం పరుగు మాత్రమే సరిపోదు. స్ట్రెంత్ ట్రైనింగ్ (కండరాల వ్యాయామం) తప్పనిసరి
వారానికి కనీసం రెండు సార్లు కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు (Strength Training) చేయాలి.
ఇది మోకాళ్లు, నడుము, తుంటి భాగాలపై ఒత్తిడిని తగ్గించి గాయాలు కాకుండా కాపాడుతుంది.
అంతేకాదు భారీ భోజనం వెంటనే రన్నింగ్ చేయకూడదు. ఆహారం తిన్న తర్వాత కనీసం రెండు గంటల సమయం ఇచ్చి, ఆపై రన్నింగ్ చేయడం వల్ల జీర్ణక్రియ సమస్యలు రావు. శరీరం కూడా బాగా సహకరిస్తుంది.
ఇదీ చదవండి: 10 రోజులు లీవ్ తర్వాత ఉద్యోగికి బాస్ బంపరాఫర్


