దుబాయ్ నుండి ముంబైకి ప్రయాణిస్తున్న ఇండిగో (IndiGo) విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. ఉన్నట్టుండి విమానంలోని కార్గో ఏరియా నుంచి పొగలు రావడంతో, సోమవారం రోజున గుజరాత్‌లోని రాజ్‌కోట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
మొత్తం 194 మంది సిబ్బందితో దుబాయ్ నుండి ముంబైకి బయలుదేరిన IGO 1452 విమానంలో మధ్యాహ్నం2:45 గంటలకు ఎయిర్‌లైన్ సిబ్బంది పొగను గుర్తించి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కి సమాచారం అందించగా, రాజ్‌కోట్ విమానాశ్రయంలో అత్యవసర పరిస్థితి (Emergency) ప్రకటించారు. మధ్యాహ్నం 3:27 గంటలకు విమానం రాజ్‌కోట్ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ అయింది. లోపల ఉన్న 194 మంది ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా ఉండటంతో అంతా ఊపిరి పాల్చుకున్నారు.
రాజ్‌కోట్ విమానాశ్రయ డైరెక్టర్ దిగంత బోరా, ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కె.పి. తరేతియా ఈ ఘటనపై స్పందిస్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదనీ విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని వెల్లడించారు.
ఇదీ చదవండి: హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ నా జీవితాన్నే మార్చేసింది
ప్రమాదం ఏమీ లేదు
ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే పైలట్ అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరారని అధికారులు తెలిపారు. ఇండిగో ఎయిర్‌లైన్స్ టెక్నికల్ టీమ్ వెంటనే విమానాశ్రయానికి చేరుకుని విమానాన్ని తనిఖీ చేసింది. తనిఖీల అనంతరం విమానంలో ఎలాంటి మంటలు (Fire) చెలరేగలేదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : రైల్వే ప్లాట్‌ఫాంమీద పడుకునే స్థాయినుంచి, రూ,1.69 లక్షల కంపెనీ!
ఇదీ చదవండి: వీకెండ్ క్లాస్‌లో ఐఐఎం ప్రొఫెసర్ సర్‌ప్రైజ్, నెటిజన్లు ఫిదా


