సాక్షి, ఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద నిరసనకారులకు ఆహరం పంపిణీ చేసిన వ్యక్తిని పోలీసులు విచారించిన తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. జునైద్ అనే వ్యక్తి అక్కడి నిరసన కారులకు ఆహరం సరఫరా చేశారు. దీనిని గమనించిన పోలీసులు అతనిని భిన్న విధాలుగా ప్రశ్నించి చివరికి కళ్లకు గంతలు కట్టి ముస్సోరిలో వదిలేశారు. ఈ వివరాలను ఆ బాధితుడు సోషల్ మీడియావేదికగా పంచుకున్నారు.
వివరాల్లోకి వెళితే గత శుక్రవారం జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న నిరసనకారులకు జునైద్ ఆహరం సరఫరా చేస్తున్నాడు. అయితే ఆ సమయంలో ఢిల్లీ పోలీసులు అతని వద్దకు వచ్చి ప్రశ్నించడం మెుదలు పెట్టారు. నువ్వు ఈ ఆహరం ఎందుకు పంపిణీ చేస్తున్నావు. దీనికోసం నీకు ఎవరు సహాయం చేస్తున్నారు. రాత్రంతా పోలీసుల అదుపులో ఉంచుకొని ఆ బాధితుడు కళ్లకు గంతలు కట్టి క్యాబ్‌లో తీసుకెళ్లి ముస్సోరిలో వదిలివేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే ఈ వివరాలు తెలుసుకున్న విద్యార్థుల న్యాయ సహాయ బృందం తనను సంప్రదించిందన జునైద్ తెలిపారు. కాగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం ధర్నా చేయగా ఎట్టకేలకు మంత్రి రాజీనామా చేశారు. దీంతో సీజేపీ నిరసన ముగిసింది.
Mohammad Junaid Used and Thrown by CJP Founders!!
Mohammad Junaid who played the biggest part in CJP Protest by supplying Non Stop Bread Pakodas, Samosas, Biryani and various other dishes for 40 days is now feeling cheated by CJP Founders!!
During an Interview the reporter… pic.twitter.com/L9j8qiwyaa— Rohit (@Iam_Rohit_G) July 26, 2026


