breaking news
national
-
సీఎం విజయ్ మరో సంచలనం.. మేనమామగ!
తమిళనాడు రాజకీయాల్లో సీఎం విజయ్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.. ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి దశాబ్ధాలుగా ఉన్న పార్టీలకే చెక్ పెట్టి అధికారంలోకి వచ్చారు. ఈ నేపథ్యంలోనే వచ్చిన నాటి నుంచి తనదైన పాలనా మార్కును చూపిస్తున్న విజయ్ ఇప్పుడు మరో అద్భుత పథకం అమలు చేయడానికి సిద్ధమయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రులలో జన్మించే బంగారు తల్లులకు కానుకగా గ్రాము పుత్తడి ఇచ్చే పథకాన్ని త్వరలో ప్రారంభించనున్నారు.తమిళనాడు ప్రజలకు విజయ్ ఇచ్చిన ఎన్నికల హామీలలో ప్రధానమైనది.. ప్రభుత్వ ఆసుపత్రులలో జన్మించిన నవజాత శిశువులకు ఒక గ్రాము బంగారు ఉంగరాల బహుమతి. ఈ నేపథ్యంలోనే 'తైమామన్ తంగ మోతిరం' (మేనమామ బంగారు ఉంగరం) పథకం సెప్టెంబర్ 28న లాంఛనంగా ప్రారంభించబడుతునట్లు సమాచారం. అయితే దీనికి ఈ ఏడాది జూన్ 22 నుండి ప్రభుత్వ ఆసుపత్రులలో జన్మించిన పిల్లలందరూ అర్హులుగా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ లెక్కలుప్రభుత్వ లెక్కల ప్రకారం తమిళనాడులో ఏటా సుమారు 7.8 లక్షల జననాలు నమోదవుతాయి. వీటిలో దాదాపు 99.9 శాతం ప్రసవాలు ఆసుపత్రులలో జరుగుతుండగా, సుమారు 4.2 లక్షలు - అంటే 53 శాతం - ప్రభుత్వ ఆసుపత్రులలో జరుగుతున్నాయి. తమిళనాడు శాశ్వత నివాసితులై, ఆర్.సి.హెచ్. గుర్తింపు సంఖ్యతో పి.ఐసి.ఎం.ఇ.లో నమోదు చేసుకున్న తల్లుల నవజాత శిశువులకు ఈ పథకం వర్తిస్తుంది. ప్రతి ఉంగరానికి ఒక ప్రత్యేకమైన సీరియల్ నంబర్ ఉంటుందని అది ట్యాంపర్-ప్రూఫ్ ప్యాకేజింగ్‌లో సరఫరా చేయబడుతుంది. మొదటి దశలో ఇప్పటికే 1.28 లక్షల ఉంగరాలను సేకరించినట్లు ప్రభుత్వం తెలిపింది.రెండు నియోజకవర్గాలకు బైపోల్ తమిళనాడులో మధురాంతకం, ధరాపురం నియోజకవర్గాలలో అక్టోబర్ 6న ఉపఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఉపఎన్నికల కోసమని ప్రవర్తనా నియమావళి (Model Code of Conduct) అమల్లోకి వచ్చింది. దీంతో ప్రస్తుతానికి ఆ రెండు నియోజకవర్గాల్లో ఈ పథకం అమలు తాత్కాలికంగా నిలిచిపోనుంది. -
పాక్ కేంద్రంగా ఉగ్ర కుట్రలు.. కేంద్రం కీలక నిర్ణయం
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న షెహజాద్ భట్టి నెట్వర్క్ (SBN)ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఈ వివరాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా తెలిపారు. ఉగ్రవాదంపై ప్రధాని మోదీ అనుసరిస్తున్న ‘జీరో టాలరెన్స్’ విధానంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. “ఈ ముఠా సరిహద్దుల గుండా ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌లో పాలుపంచుకోవడంతో పాటు, యువతను, చిన్న నేరస్థులను ఉగ్రవాదం వైపు ప్రేరేపిస్తోంది. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను, మత సామరస్యాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ సిండికేట్ విద్వేషపూరిత డిజిటల్ కంటెంట్‌ను కూడాప్రచురించింది” అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆ సంస్థను నిషేధించినట్లు తెలిపారు.షెహజాద్ భట్టి నెట్వర్క్ (SBN) అమాయక యువతను, స్థానిక నేరస్థులను ఉపయోగించుకుని సరిహద్దుల నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేయడం, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడటం ద్వారా దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు, మత సామరస్యానికి, అంతర్గత భద్రతకు తీవ్ర ముప్పు కలిగించడం లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ అని కేంద్ర హోంశాఖ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది.నిషేధిత ఉగ్రవాద సంస్థల జాబితా ఉన్న చట్టంలోని మొదటి షెడ్యూల్లో షెహజాద్ భట్టి నెట్వర్క్ (SBN)ను చేర్చేందుకుUAPAలోని సెక్షన్ 35(1)(a)ను కేంద్రం ఉపయోగించింది. ఎస్బీఎన్ ‘ఉగ్రవాదంలో’ పాలుపంచుకుందని, భారతదేశంలో వివిధ ఉగ్రవాద చర్యలకు పాల్పడిందని కేంద్రం భావిస్తున్నందున ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది. -
‘నాపై అంత జాలి ఉంటే..’ కల్యాణ్‌కు బైకర్ సియా కౌంటర్
రోడ్డుపై వెళ్తున్న ఓ యువతి బైక్‌ను కారు ఢీకొట్టడం.. ఆమె కిందపడిపోయినా వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోవడం.. ఆ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం.. గురుగ్రామ్‌లో జరిగిన ఈ వ్యవహారం ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది. తనను కారు కావాలనే వెంబడించి ఢీకొట్టారని బైకర్ ‘రెబల్ వీల్స్ సియా’ ఆరోపిస్తుండగా.. నిందితుడి తరఫు న్యాయవాది మాత్రం తప్పంతా బైకర్లదేనని అంటున్నాడు.గురుగ్రామ్ గోల్ఫ్ కోర్స్ రోడ్డుపై ఆదివారం ఈ ఘటన జరిగింది. సియా తన ఏప్రిలియా ఆర్ఎస్ 457 స్పోర్ట్స్ బైక్‌పై తోటి బైకర్లతో కలిసి వెళ్తోంది. ఆ సమయంలో తెల్లరంగు సెడాన్ తమను వెంబడించిందని ఆమె చెబుతోంది. కారులోని వారు తనకు దగ్గరగా వచ్చి ఇబ్బందికరంగా ప్రవర్తించారని, దూరంగా ఉండాలని తాను సూచించినా.. బైక్‌ను ఆపాలని సైగలు చేశారని ఆమె ఆరోపించింది. చివరకు కారు పక్క నుంచి వచ్చి తన బైక్‌ను ఢీకొట్టడంతో రోడ్డుపై పడిపోయానని తెలిపింది.‘నేను అక్కడికక్కడే చనిపోయేదాన్ని’ప్రమాదంపై తొలిసారి స్పందించిన సియా.. నిందితుడు కల్యాణ్ బైన్స్లా చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. ‘నాపై జాలిపడుతున్నానని చెబుతున్నారు. నిజంగా జాలిపడితే ప్రమాదం తర్వాత ఎందుకు ఆపలేదు?’ అని ప్రశ్నించింది. తనను కారు చాలా దూరం వెంబడించిందని చెబుతూ.. ‘నేను అక్కడికక్కడే చనిపోయేదాన్ని. ఎముకలు విరిగిపోయేంత తీవ్ర గాయాలు కూడా అయ్యుండొచ్చు’ అని పేర్కొంది.కారు తనను వెంబడించలేదన్న వాదనను కూడా ఆమె ఖండించింది. ‘నా జుట్టు కనిపించింది.. నా దగ్గరకు వచ్చారు.. ఆపాలని సైగ చేశారు. అలాంటప్పుడు బైక్‌పై మహిళ ఉందో లేదో తెలియదని ఎలా చెబుతారు?’ అని ప్రశ్నించింది. ప్రమాదానికి సంబంధించిన రెండు వీడియోల్లోనూ కారు తన బైక్ వైపు లేన్ మార్చి ఢీకొట్టిన దృశ్యాలు స్పష్టంగా ఉన్నాయని తెలిపింది.This isn't hit and run... it's hit and kill 🖐️Car No: HR 30Y 4949In Gurugram, first a female bike rider was harassed by 4 louts sitting in a Verna car, they made vulgar vulgar gestures When the girl stopped them from doing so and told them to leave, the beasts rammed her… pic.twitter.com/W1141MIGSJ— Ravi Pandey🇮🇳 (@ravipandey2643) September 14, 2026కొత్త వీడియో.. మరో కోణంలో ఢీకొట్టిన దృశ్యంఈ ఘటనకు సంబంధించి సియా వెనుకే వస్తున్న మరో బైకర్ రికార్డు చేసిన వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. అందులో కారు సియా బైక్ వైపు వచ్చి ఢీకొట్టినట్లు కనిపిస్తోంది. కారు తమను చాలా దగ్గరగా వెంబడించిందని, డ్రైవర్ కిటికీ దించి ఆపాలని సైగ చేశాడని ఆ బైకర్ ఆరోపించాడు. ప్రమాదం తర్వాత కారు వెళ్లిపోవడంతో తాను దాన్ని వెంబడించి డ్రైవర్ ముఖాన్ని కెమెరాలో రికార్డు చేశానని చెప్పాడు. ప్రమాదం కారణంగా సియాకు చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. అయితే రైడింగ్ గేర్ ధరించి ఉండటంతో తీవ్ర గాయాలు తప్పాయని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. బైక్ మాత్రం దెబ్బతింది.‘కారులో నలుగురు.. మద్యం మత్తులో ఉన్నారు’సియా సోదరుడు కూడా సంచలన ఆరోపణలు చేశాడు. ప్రమాదం జరిగిన వెంటనే తనకు సియా ఫోన్ చేసి.. ఎవరో కారుతో ఢీకొట్టి వెళ్లిపోయారని చెప్పిందన్నాడు. కారులో నలుగురు ఉన్నారని, వారంతా మద్యం మత్తులో ఉన్నట్లు కనిపించారని ఆమె చెప్పినట్లు వెల్లడించాడు. కారులోని వారు అసభ్యకరమైన సైగలు చేశారని కూడా ఆరోపించాడు. సియా తండ్రి ఈ ఘటనను సాధారణ ప్రమాదంగా చూడలేమని, ఇది హత్యాయత్నంగా భావిస్తున్నామని అన్నారు. రోడ్డుపై పెద్దగా ట్రాఫిక్ కూడా లేదని.. అలాంటి సమయంలో ఈ ప్రమాదం జరగడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు.‘తప్పంతా బైకర్లదే’.. నిందితుడి తరఫు వాదనగురుగ్రామ్ హిట్ అండ్ రన్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్యాణ్ బైన్స్లా బాడీబిల్డర్, జిమ్ ట్రైనర్. తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో ‘ఇంటర్నేషనల్ కబడ్డీ ప్లేయర్’, ‘ఇండియన్ రగ్బీ టీమ్ సభ్యుడు’గా రాసుకున్నాడు. హిట్ అండ్ రన్ కేసులో కల్యాణ్ బైన్స్లా తరఫు న్యాయవాది మాత్రం పూర్తిగా భిన్నమైన వాదన వినిపించారు. కారులో నలుగురు ఉన్నారని.. వారిలో బంధువులు కూడా ఉన్నారని చెప్పారు. బైకర్లు రోడ్డుపై అడ్డంకిగా మారుతున్నారని, వారి కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కారు ఫుట్‌పాత్‌ను తప్పించుకునే క్రమంలో కొంచెం ఎడమవైపు వెళ్లిందని.. అదే సమయంలో యువతి కుడివైపు రావడంతో ఢీకొట్టిందని న్యాయవాది చెప్పారు. ప్రమాదం తర్వాత ఆపకపోవడానికి కారణం అక్కడ గుమిగూడిన వారు దాడి చేస్తారనే భయమేనని, ఆ పరిస్థితుల్లో కారు వెళ్లిపోయిందని తెలిపారు. సియా సోషల్ మీడియాలో ఫాలోవర్లు, వ్యూస్ కోసం ఘటనను ప్రచారం చేస్తోందని కూడా ఆరోపించారు. ఆమె బైక్ వేగం గంటకు 140–170 కిలోమీటర్ల వరకు ఉందని వాదించారు.కారు ఎవరిది?ప్రమాదానికి ఉపయోగించిన కారు హరియాణాలోని పల్వాల్‌కు చెందిన మనీష్ పేరుతో రిజిస్టర్ అయి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే తాను ఆ సమయంలో కారులో లేనని మనీష్ స్పష్టం చేశాడు. తాను ఆర్మీలో పనిచేస్తున్నానని, ఘటన జరిగిన సమయంలో అసోంలో విధుల్లో ఉన్నానని చెప్పాడు. ఆదివారం తన కుటుంబానికి చెందిన కారును ఓ స్నేహితుడు తీసుకెళ్లాడని.. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయిన తర్వాతే ప్రమాదం విషయం తనకు తెలిసిందని వివరించాడు.పోలీసుల దర్యాప్తుకల్యాణ్ బైన్స్లా మాత్రం తాను కావాలనే బైకర్‌ను ఢీకొట్టలేదని చెబుతున్నాడు. బైకర్ అధిక వేగంతో వెళ్తుండగా, తాను కారు మలుపు తిప్పే సమయంలో ఢీకొన్నట్లు అతడి వాదన. ప్రమాదం తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోవడానికి బైకర్ల గుంపు దాడి చేస్తుందనే భయమే కారణమని కూడా అతడి తరఫున వాదన వచ్చింది. అయితే మహిళా బైకర్ మాత్రం కారు తనను ఉద్దేశపూర్వకంగా వెంబడించి ఢీకొట్టిందని ఆరోపిస్తోంది. ఈ రెండు వాదనలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గురుగ్రామ్ పోలీసులు ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వైరల్ వీడియోలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, కారు వివరాల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. అసలు ప్రమాదం ఎలా జరిగింది? కారు ఉద్దేశపూర్వకంగా బైక్‌ను ఢీకొట్టిందా? లేక ప్రమాదవశాత్తూ జరిగిందా? అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.ఇదీ చదవండి: బీజేపీ బిగ్ విక్టరీ -
బ్రిక్స్ ప్రారంభోపన్యాసంలో మోదీ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: బ్రిక్స్ సదస్సులో తీసుకునే నిర్ణయాల అమలు కోసం ఒక ప్రత్యేక యంత్రాంగాన్నే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీలో భరతమండపం వేదికగా జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో మోదీ ప్రారంభోపన్యాసం చేశారు. వచ్చే 20ఏళ్ల కాలానికి అవసరమైన ఎజెండాను రూపొందించాల్సిన అవసరం ఉందని నిర్ణీత గడువులోగా నిర్ణయాల అమలు కోసం వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు.మోదీ మాట్లాడుతూ.. "ప్రస్తుతం గ్లోబల్ సౌత్ అనేక సమస్యలను ఎదుర్కొంటుందని ప్రజల మేలు కోసం దేశాలన్నీ కలిసి పని చేయాల్సి ఉంది ప్రపంచ పరిపాలన మరింత మెరుగుపడాల్సి ఉంది. పరస్పరం గౌరవం, ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్తున్నాం" అని మోదీ అన్నారు. అయితే అంతకుముందు ప్రధాని మోదీ అబూదాబి యువరాజు మహమ్మద్ బిన్ జాయద్ అలీ నహియాన్‌తో హైదరాబాద్ హౌస్‌లో సమావేశమయ్యారు. ఇరు దేశాధినేతలు మలేషియా, ఇథీయోపియా దేశాధినేతలతో రక్షణ రంగంలో సహకారం అంశంపై చర్చలు జరిపారు.కాగా మరికోద్దిసేపట్లో సాయంత్రం 5:45 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారిగా జిన్‌పింగ్ భారత్ లో అడుగుపెట్టారు. చైనా అధ్యక్షుడితో ఆ దేశానికి చెందిన వ్యాపార ,అధికార ప్రతినిధి బృందంతో ఢిల్లీకి చేరుకుంది. గతంతో పోలిస్తే ఈ సారి పెద్ద మెుత్తంలో అధికార బృందం జిన్‌పింగ్‌తో ఉంది. భారత్‌తో ఆర్థిక వ్యాపార సంబంధాలను మరింత మెరుగుపరచుకోవాలని చైనా భావిస్తోన్నట్లు సమాచారం. -
అంతర్జాతీయ ఖ్యాతి.. అద్భుత ఆకృతి
ఢిల్లీ: 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు భారత్ అతిథ్యమివ్వడంతో ప్రపంచ దేశాధినేతలు భారత్‌కు తరలివచ్చారు. దీంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి భారత్‌పై పడింది. ఈ నేపథ్యంలో ఈ అంతర్జాతీయ శిఖరాగ్రసదస్సుకు ఆతిథ్యమిస్తున్న భరతమండపం ప్రత్యేకతలు ఏంటి..దానిని ఎప్పుడు నిర్మించారు. అనే వివరాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.ప్రపంచ దేశాల అగ్రనేతలు హాజరవుతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన 2026 బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సుకు భారత్ రాజధాని న్యూఢిల్లీ వేదికైంది. ఈ వార్షిక సదస్సు కోసం దేశ నడిబొడ్డున ఉన్న అత్యాధునిక 'భారత్ మండపం' సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అయితే ఇది వరకే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో సహా పలువురు ప్రపంచ స్థాయి నాయకులు ఈ సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీకి చేరుకున్నారు.భరత మండపం నిర్మాణంప్రగతి మైదాన్ కాంప్లెక్స్‌లో 123 ఎకరాల విస్తీర్ణంలో రూ.2,700 కోట్ల వ్యయంతో ఈ వేదికను నిర్మించారు. 2023లో ప్రారంభమైన ఈ సముదాయం నేడు భారతదేశ ఆతిథ్య సామర్థ్యానికి ప్రతీకగా నిలిచింది. 12వ శతాబ్దపు 'అనుభవ మండపం' స్ఫూర్తితో దీనికి 'భారత్ మండపం' అని నామకరణం చేశారు.నటరాజ విగ్రహం ప్రత్యేకతఈ సముదాయంలో ఏర్పాటు చేసిన 27 అడుగుల ఎత్తు, 18 టన్నుల బరువు కలిగిన భారీ నటరాజ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అష్టధాతువులతో తమిళనాడు శిల్పులు దీనిని అద్భుతంగా మలిచారు. ప్రధాన సమావేశ మందిరం భవనం 'శంఖం' ఆకారంలో రూపొందించబడింది. ఇది చేతన శక్తిని, శుభారంభాన్ని సూచిస్తుంది. సూర్య శక్తి, జీరో నుంచి ఇస్రో సాధించిన ప్రయాణం, పంచ మహాభూతాల ప్రాముఖ్యతను తెలిపేలా దీని లోపలి బయటి డిజైన్లు భారతీయ నాగరికతను ప్రతిబింబిస్తున్నాయి.భారత్ మండపంలో వివిధ హాళ్లు150 దేశాల ప్రతినిధులకు సరిపడే సామర్థ్యం ఉన్న ఈ హాలులో కీలకమైన ద్వైపాక్షిక, బహుపాక్షిక చర్చలు జరుగుతున్నాయి. సాంకేతికతకు పెద్దపీట వేస్తూ నిర్వహించిన 'భారత్ ఇన్నోవేట్స్' కార్యక్రమం ఇక్కడే జరిగింది. డ్రోన్ టెక్నాలజీతో పాటు భారత్ సాధించిన నూతన సాంకేతిక ఆవిష్కరణలను ప్రపంచానికి చాటిచెప్పారు.హాల్ నెం. 14: బ్రిక్స్ బిజినెస్ ఫోరం సమావేశాలు ఇక్కడ జరుగుతున్నాయి. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు పాల్గొనే ఈ వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యాపార వర్గాలనుద్దేశించి ప్రసంగించనున్నారు.హాల్ నెం. 5: ప్రపంచ వ్యాప్తంగా విచ్చేసిన సుమారు 1,200 నుంచి 1,400 మంది జర్నలిస్టుల కోసం ఇంటర్నేషనల్ మీడియా సెంటర్‌ను ఏర్పాటు చేశారు.ఈ సదస్సులో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, మధ్యప్రాచ్య సంక్షోభాలు, ఉగ్రవాద నిరోధక విధానాలు మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సవాళ్లపై ప్రపంచ నేతలు చర్చిస్తున్నారు. అలాగే బ్రిక్స్ దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య విధానాలను చర్చించనున్నారు.కట్టుదిట్టమైన భద్రతభారత్ మండపంలో భద్రతా వ్యవస్థ అత్యంత అత్యాధునిక సాంకేతికతతో, అభేద్యమైన కోటను తలపించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడింది. అంతర్జాతీయ సదస్సులు జరిగే సమయంలో ఇక్కడ శత్రు దుర్భేద్యమైన మల్టీ-లేయర్డ్ (బహుళ అంచెల) భద్రతా వలయాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాంగణంలోని ప్రధాన సెక్యూరిటీ ప్రత్యేకతలు భారత్ మండపం చుట్టూ సుమారు 5 కిలోమీటర్ల మేర బహుళ అంచెల భద్రతా వలయం ఉంటుంది. ఔటర్ రింగ్‌లో ఢిల్లీ పోలీస్ మరియు పారామిలటరీ బలగాలు కాపలా ఉంటే, అంతర్గత కోర్ జోన్లో (నేషనల్ సెక్యూరిటీ గార్డ్) కమాండోలతో పాటు ప్రత్యేక దళాలు మోహరిస్తాయి.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫేషియల్ రికగ్నైజేషన్: ఇక్కడి నిఘా వ్యవస్థలో AI సాంకేతికతను ఉపయోగిస్తారు. హై-రిజల్యూషన్ సీసీటీవీ కెమెరాలకు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ అనుసంధానించబడి ఉంటుంది. ఇది అనుమానాస్పద వ్యక్తులను లేదా నేరస్థుల డేటాబేస్‌లో ఉన్న ముఖాలను క్రౌడ్‌లో సైతం క్షణాల్లో గుర్తించి అలర్ట్ చేస్తుంది.డ్రోన్ సిస్టమ్స్ ఆకాశ మార్గం నుండి ఎలాంటి ముప్పు రాకుండా భవనం చుట్టూ అత్యాధునిక యాంటీ-డ్రోన్ డిఫెన్స్ సిస్టమ్స్ అప్రమత్తంగా ఉంటాయి. అనుమతి లేని ఏ డ్రోన్ లేదా ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ అయినా ఈ పరిధిలోకి వస్తే వాటిని జామ్ చేయడం లేదా కూల్చివేయడం జరుగుతుంది. ఇలా భరతమండపంకు ఆధునాతనమైన ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. -
భారత్‌కు కీలక దౌత్య విజయం.. న్యూఢిల్లీ డిక్లరేషన్కుఆమోదం
భారత్ ఆతిథ్యంగా జరుగుతున్న బ్రిక్స్ సదస్సు వేళ భారత్‌కు దౌత్య పరంగా కీలక విజయం లభించింది. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో సభ్యదేశాలన్నీ *"న్యూఢిల్లీ డిక్లరేషన్"*కు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. గతంలో పశ్చిమాసియా యుద్ధంపై విభేదాల కారణంగా విదేశాంగ మంత్రుల సమావేశంలో ఉమ్మడి ప్రకటన వెలువడకపోయినా, ఈసారి నాయకుల స్థాయిలో ఏకాభిప్రాయం వెలువడనుంది.న్యూఢిల్లీ డిక్లరేషన్‌లో అత్యంత ప్రధాన సందేశంగా "సంభాషణ (Dialogue), దౌత్యం (Diplomacy) ద్వారానే వివాదాలకు పరిష్కారం" అనే సూత్రాన్ని పునరుద్ఘాటించారు. ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా సంక్షోభం వంటి అంతర్జాతీయ ఘర్షణల నేపథ్యంలో ఇదే భారత్ నిరంతరం చెబుతున్న వైఖరిని ప్రధాని మోదీ పదే పదే స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కీలక ప్రకటన వెలువడింది. న్యూ ఢిల్లీ డిక్లరేషన్ ప్రధాన అంశాలుఅంతర్జాతీయ వివాదాలకు యుద్ధం కంటే చర్చలు, దౌత్యమే పరిష్కార మార్గమని స్పష్టం.ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లో ఖండిస్తూ దానికి ఎలాంటి సమర్థన ఉండదని పునరుద్ఘాటింపు.ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సహా ప్రపంచ పాలనా వ్యవస్థల్లో సమగ్ర సంస్కరణలకు మద్దతు.అభివృద్ధి చెందుతున్న దేశాలకు అంతర్జాతీయ నిర్ణయాల్లో మరింత ప్రాతినిధ్యం కల్పించాలనే డిమాండ్.వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, డిజిటల్ సహకారం, ప్రత్యామ్నాయ చెల్లింపు వ్యవస్థలపై సహకారాన్ని మరింత బలోపేతం చేయాలనే నిర్ణయం.బ్రిక్స్ విస్తరణ తర్వాత ఇరాన్–యూఏఈ వంటి విభేదాలున్న దేశాలను ఒకే ప్రకటనపై ఏకాభిప్రాయానికి తీసుకురావడం భారత్ అధ్యక్షతకు పెద్ద పరీక్షగా నిలిచింది. అయినప్పటికీ ఈ పరీక్షలో సభ్యదేశాలన్నిటినీ ఏకతాటిపైకి తేవడం దౌత్య పరంగా భారత్‌కు కీలక విజయం.బ్రిక్స్ నాయకుల సమావేశం ముగిసిన అనంతరం సాయంత్రం 4 గంటలకు న్యూఢిల్లీ డిక్లరేషన్‌తో కూడిన ఉమ్మడి ప్రకటన అధికారికంగా విడుదల కానుంది. ఇందులో భారత్‌కు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి శాశ్వత సభ్యత్వానికి మద్దతు, బహుపాక్షిక ప్రపంచ వ్యవస్థ బలోపేతంపై కీలక ప్రకటనలు ఉండే అవకాశం ఉండనున్నట్లు సమాచారం. -
బ్రిక్స్ సదస్సు.. ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఢిల్లీ: 18 అంతర్జాతీయ బ్రిక్స్ సదస్సుకు భారత్ అతిథ్య నివ్వనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 12,13 ఢిల్లీలోని భరత మండపంలో జరిగే ఈ సదస్సుకు ప్రపంచ అగ్రనేతలతో పాటు విదేశీ ప్రతినిధులు, ఉన్నతాధికారులు ఢిల్లీకి రానున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం అత్యంత కఠిన ఆంక్షలు విధించనుంది. సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మార్గాల మళ్లింపులు అమల్లో ఉండనున్నాయి.రేపు బ్రిక్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో నేటి నుంచి (శుక్రవారం) ఢిల్లీ డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ సహాయంతో నడిచే, గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. దీంతో ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాలు, స్వయంప్రతిపత్తి సంస్థలు, ఢిల్లీ ప్రభుత్వ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఆ రోజు పనిచేయవు. వారాంతం అనంతరం పాఠశాలలు సోమవారం నుంచి తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.ఢిల్లీ మెట్రో సేవలు కొనసాగింపుఅయితే బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ఢిల్లీ మెట్రో రైలు సేవలు పూర్తిగా నిలిపివేయడం లేదు. నగరవ్యాప్తంగా మెట్రో సేవలు కొనసాగుతాయి. అయితే సుప్రీంకోర్టు మెట్రో స్టేషన్‌లోని ఢిల్లీ మెట్రో మ్యూజియాన్ని సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు మూసివేయనున్నారు. 35కుపైగా రహదారులపై ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. విదేశీ ప్రముఖులు, వీవీఐపీల కాన్వాయ్‌ల రాకపోకల కోసం ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సుమారు 4,800 మంది ట్రాఫిక్ సిబ్బందిని విధుల్లో మోహరించారు. వీవీఐపీ రాకపోకలు, కాన్వాయ్ రిహార్సల్స్ సమయంలో 22 ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు.మథురా రోడ్, సర్దార్ పటేల్ మార్గ్, శాంతి పథ్, జనపథ్, అశోకా రోడ్, బరాఖంబా రోడ్, టాల్‌స్టాయ్ మార్గ్, ఆఫ్రికా అవెన్యూ రోడ్, నీతి మార్గ్, ఏపీజే అబ్దుల్ కలాం రోడ్ తదితర 35కుపైగా రహదారులపై వివిధ సమయాల్లో ట్రాఫిక్ ఆంక్షలు లేదా మళ్లింపులు ఉండవచ్చని అధికారులు తెలిపారు.బస్సులు, క్యాబ్‌లకు మార్గ మళ్లింపులుసదస్సు జరిగే రోజుల్లో పరిస్థితిని బట్టి బస్సుల రూట్లను మళ్లించడం లేదా కొంతకాలం నియంత్రించడం జరగవచ్చని అధికారులు పేర్కొన్నారు. క్యాబ్ సేవలు మాత్రం యధావిధిగా కొనసాగనున్నట్లు పేర్కొన్నారు. అత్యవసరం కాని ప్రయాణాలను ముందుగా ప్లాన్ చేసుకోవాలని, బయలుదేరే ముందు తాజా ట్రాఫిక్ పరిస్థితులను పరిశీలించాలని ఢిల్లీ వాసులకు అధికారులు సూచించారు. -
పాక్ వక్రబుద్ధి.. హేమ్‌కుండ్ సాహిబ్ దర్శనానికి అడ్డంకి
ఇస్లామాబాద్: పాకిస్థాన్ తన వక్రబుద్ధిని మరోసారి బయిటపెట్టింది. భారత్‌లోని సిక్కు పుణ్యక్షేత్రమైన శ్రీహేమ్కుండ్ సాహిబ్‌ను దర్శించుకునేందుకు వస్తున్న యాత్రికులను ఎన్వోసీ 'నో అబ్జెక్షన్ సర్టిఫికేట్' పేరుతో అడ్డుకుంది. దీంతో యాత్రికులు నిరాశ చెందాల్సి వచ్చింది. అయితే, తమ ప్రయాణానికి NOC అవసరమని అధికారులు ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని దీంతో తమ విమానాన్ని కోల్పోయి విమానాశ్రయంలోనే చిక్కుకుపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.యాత్రికుల వివరాల ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 2.10 గంటలకు ఫైసలాబాద్ నుంచి షార్జాకు విమానంలో వెళ్లి, అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకోవాల్సి ఉంది. అయితే విమానాశ్రయంలో NOC కోసం అధికారులు పట్టుబట్టడంతో వారు ప్రయాణం చేయలేకపోయారు. అంతకుముందు నంకానా సాహిబ్‌లో పాకిస్థాన్ పంజాబ్ సిక్కు మైనారిటీ మంత్రి, పాకిస్థాన్ సిక్కు గురుద్వారా ప్రబంధక్ కమిటీ (PSGPC) అధ్యక్షుడు రమేశ్ అరోరా, ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డు డిప్యూటీ సెక్రటరీ నాసిర్ ముష్తాక్ యాత్రికులను కలిశారు.విమాన మార్గంలో భారత్‌కు వెళ్లకుండా అట్టారి–వాఘా భూసరిహద్దు ద్వారా రోడ్డు మార్గంలో పంపిస్తామని వారు హామీ ఇచ్చినట్లు సింగ్ తెలిపారు. అయితే NOC విషయాన్ని ముందుగా తమకు ఎవరూ చెప్పలేదని, విమానాశ్రయంలో అధికారులు NOC అడిగినప్పుడు దాన్ని సమకూర్చాలని రమేశ్ అరోరాను కోరినా ఆయన తమకు సహాయం చేయలేకపోయారని సింగ్ పేర్కొన్నారు. యాత్రికులకు ఢిల్లీ, అమృత్సర్, శ్రీ ఆనంద్‌పూర్ సాహిబ్, శ్రీ హేమ్‌కుండ్ సాహిబ్‌లను సందర్శించేందుకు భారత వీసాలు ఇప్పటికే మంజూరయ్యాయి.అట్టారి–వాఘా భూసరిహద్దు మూసివేయడంతో తమకు విమాన మార్గం తప్ప మరో మార్గం లేకుండా పోయిందని యాత్రికులు తెలిపారు. శ్రీ హేమ్‌కుండ్ సాహిబ్ యాత్ర కోసం భారత్ 92 మంది సిక్కు భక్తులకు వీసాలు జారీ చేసిందని పపిందర్ సింగ్ చెప్పారు. ప్రయాణం, వసతి, ఇతర ఏర్పాట్ల కోసం వారు దాదాపు 2 కోట్ల పాకిస్థాన్ రూపాయలు ఖర్చు చేశారని, ఇప్పుడు ప్రయాణానికి అనుమతి లభించక తీవ్ర నిరాశకు గురయ్యారని తెలిపారు. ఫైసలాబాద్–షార్జా విమానం ఇప్పటికే మిస్ కావడంతో, షార్జా నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన తదుపరి విమానం సైతం మిస్ అయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు.ప్రస్తుతం యాత్రికులు విమానాశ్రయంలోనే ఉండి, పాకిస్థాన్ ప్రభుత్వం సమస్యను పరిష్కరించి అట్టారి–వాఘా భూసరిహద్దు ద్వారా భారత్‌కు వెళ్లేందుకు ప్రత్యేక అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. హేమ్‌కుండ్ సాహిబ్ యాత్రను సకాలంలో పూర్తి చేసుకునే అవకాశం కల్పించాలని వారు పాకిస్థాన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
క్విక్ కామర్స్ సంస్థలపై దాడులు.. సంచలన విషయాలు?
జైపూర్: రాజస్థాన్‌లోని క్విక్ కామర్స్ సంస్థలపై ఆహరభద్రత అధికారులు చేసిన తనిఖీల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ ఈ క్విక్-కామర్స్ సంస్థలైన బ్లింకిట్, జెప్టో సంస్థలు నిర్వహిస్తున్న డార్క్ స్టోర్లపై ఆహార భద్రత శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో గడువు ముగిసిన ఆహార పదార్థాలు, దెబ్బతిన్న ఉత్పత్తులు, సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయని పాల ఉత్పత్తులు పెద్ద మొత్తంలో గుర్తించారు. దీంతో వాటిని సీజ్ చేసి తనిఖీల నిమిత్తం ల్యాబ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. జగత్‌పురాలోని Zepto డార్క్ స్టోర్‌లో సుమారు 1,550 పాల ఉత్పత్తుల ప్యాకెట్లు సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయడం లేదని అధికారులు గుర్తించారు. పాలు, పెరుగు, మజ్జిగ వంటి డెయిరీ ఉత్పత్తులను నిర్దేశిత తక్కువ ఉష్ణోగ్రతల్లోనే ఉంచాలి. అయితే అక్కడి రిఫ్రిజరేషన్ యూనిట్లలో ఉష్ణోగ్రత 6 నుంచి 14 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదైంది. దీంతో అక్కడ నిల్వ ఉంచిన సుమారు 1,550 ప్యాకెట్లను అధికారులు ధ్వంసం చేసినట్లు తెలిపారు.అదే స్టోర్‌లో గడువు ముగిసిన సుమారు 7 కిలోల ఆహార పదార్థాలు కూడా బయటపడ్డాయని వాటిని ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు.అనంతరం జైపూర్‌లోని ఆదర్శ్ నగర్లో ఉన్న Blinkit డార్క్ స్టోర్‌ను తనిఖీ చేశారు. అక్కడ సుమారు 800 పాల ఉత్పత్తుల ప్యాకెట్లతో పాటు మరికొన్ని గడువు ముగిసిన దెబ్బతిన్న ఆహార పదార్థాలు సైతం గణనీయమైన పరిమాణంలో ఉన్నట్లు గుర్తించారు. అవన్నీ అక్కడికక్కడే ధ్వంసం చేశారు. అంతేకాకుండా పాలు, ఫుడ్-గ్రేడ్ నెయ్యి, Paper Boat కార్బొనేటెడ్ వాటర్ నమూనాలను సేకరించి ప్రయోగశాల పరీక్షలకు పంపించారు. ఈ పరీక్షల నివేదికల ద్వారా ఆ ఉత్పత్తుల నాణ్యతపై మరింత స్పష్టత వస్తుందని అధికారులు తెలిపారు.ఈ తనిఖీలపై ఫుడ్ సేఫ్టీ కమిషనర్ అవిచల్ చతుర్వేది మాట్లాడుతూ, ఆహార పదార్థాల నిల్వలో నిర్దేశిత ఉష్ణోగ్రతలు, పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. గడువు ముగిసిన, పాడైన ఉత్పత్తులను వెంటనే తొలగించి ధ్వంసం చేయాలని సంబంధిత సంస్థలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అలాగే డార్క్ స్టోర్లలో పరిశుభ్రత, కోల్డ్-చైన్ నిర్వహణ, ఆహార నిల్వ విధానాల్లో ఉన్న లోపాలను వెంటనే సరిచేయాలని అధికారుల బృందం సూచించింది.మొత్తంగా, జైపూర్‌లో జరిగిన ఈ తనిఖీల్లో సుమారు 2,350 డెయిరీ ఉత్పత్తుల ప్యాకెట్లను, అలాగే గడువు ముగిసిన మరియు దెబ్బతిన్న ఇతర ఆహార పదార్థాలను ధ్వంసం చేశారు. ముఖ్యంగా పాల ఉత్పత్తులను సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయకపోవడం, గడువు ముగిసిన వస్తువులు స్టోర్లలో ఉండటం, పరిశుభ్రత లోపాలు వంటి అంశాలను అధికారులు తీవ్రంగా పరిగణించారు. సేకరించిన నమూనాల ప్రయోగశాల పరీక్షల ఫలితాల ఆధారంగా తదుపరి చర్యలు ఉండే అవకాశం ఉందని తెలిపారు. -
భారత ఓటర్ల లిస్ట్‌లోకి అఫ్గాన్లు ?
రాంచీ: స్పెషల్ ఇంటెన్సివ్ (SIR) ప్రక్రియలో దుమారం చెలరేగింది. భారత్ ఓటర్ల జాబితాలో అఫ్ఘనిస్థాన్ దేశస్థుల పేర్లు నమోదవ్వడంపై రాజకీయంగా వివాదానికి దారి తీసింది. ప్రస్తుతం ఈ అంశం జార్ఘండ్‌లో చర్చాంశనీయంగా మారింది. జార్ఖండ్‌లో చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియ వివాదాలకు దారి తీసింది. జంషెడ్పూర్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలోని 286వ పోలింగ్ స్టేషన్ ఓటర్ల జాబితాలో అసిల్ ఖాన్, మహమ్మద్ అస్లాం, మహమ్మద్ ఇబ్రహీం అనే ముగ్గురు అఫ్గానిస్థానీయుల పేర్లు వరుసగా 30, 31, 33 నంబర్లతో ఓటర్ల లిస్టులో కనిపించాయి. దీంతో ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. విదేశీయుల పేర్ల ఎస్ఐఆర్ జాబితాలో ఎలా వచ్చాయంటూ ప్రశ్నించారు.ఈ విషయంపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సందీప్ వర్మ జేఎంఎం- కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం విదేశీ చొరబాటుదారుల పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, తమ పార్టీ మొదటి నుంచీ చెబుతూనే ఉందన్నారు. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జార్ఖండ్ ప్రధాన ఎన్నికల అధికారి కె. రవికుమార్ ఈ అంశంపై మాట్లాడుతూ " ఓటర్ల జాబితాలో విదేశీయులను చేర్చడం ఒక తీవ్రమైన విషయం. ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించాం. ఆ వ్యక్తులకు ఎవరు సహాయం చేశారు, ఏ ప్రక్రియ ద్వారా వారి పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చారు అనే దానిపై దృష్టి సారిస్తాం. ఇందులో ప్రమేయం ఉన్నట్లు తేలిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాం," అని ఆయన స్పష్టం చేశారు.అదే విధంగా ఓటర్ల జాబితాలో ఆ మూడు పేర్లు ఎలా చేర్చబడ్డాయి, ఈ ప్రక్రియలో ఏదైనా వ్యక్తి లేదా నెట్వర్క్ పాత్ర ఉందా అనే విషయాన్ని నిర్ధారించడానికి దర్యాప్తు సంస్థలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. -
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
సాక్షి, ఢిల్లీ: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. హౌరా- చెన్నై కారిడార్‌లో భాగంగా విశాఖ, విజయవాడ మీదుగా నాలుగు లేన్ల నిర్మాణానికి అంగీకారం తెలిపింది. ముంబై- చెన్నై కారిడార్‌లో భాగంగా గుంతకల్లు, రేణిగుంట మీదుగా నాలుగు లేన్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపింది. అదే విధంగా దేశంలో 7 హై డెన్సిటీ రైల్వే కారిడార్ల అభివృద్ధికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రయాణికుల రద్దీ తగ్గించేందుకు భారతీయ రైల్వేల భారీ ప్రణాళికలో భాగంగా ఢిల్లీ–హౌరా, ఢిల్లీ–ముంబై కారిడార్లకు ప్రాధాన్యం ప్రకటించింది. ఢిల్లీ–చెన్నై మార్గంలో విజయవాడ కీలక స్టేషన్‌గా అదేవిధంగా హౌరా–చెన్నై కారిడార్‌లో విశాఖపట్నం స్టేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పేర్కొంది. ముంబై–చెన్నై మార్గంలో రేణిగుంట, గుంతకల్ అభివృద్ధి కి ఊతం ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ అంశమై రైల్వేశాఖ మంత్రి మాట్లాడుతూ పలు మార్గాల్లో నాలుగో లైన్ పనులు చేపట్టడంతో పాటు మరికొన్ని కారిడార్లు డీపీఆర్, ఆమోద దశలో ఉన్నాయని తెలిపారు. కేంద్ర నిర్ణయాలతో సరుకు రవాణా, ప్రయాణికుల సేవల సామర్థ్యం పెరగనుందని రైళ్ల సమయపాలన మెరుగుపడుతుందని కేంద్రమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. -
పొలిటికల్ హీట్.. స్టాలిన్‌పై బాడీ షేమింగ్ ఆరోపణలు
చెన్నై: డీఎంకే అధినేత స్టాలిన్‌పై తమిళనాడు సీఎం విజయ్ బాడీషేమింగ్ చేసారన్న ఆరోపణలపై తాజాగా ఆయన స్పందించారు. అసెంబ్లీలో మాట్లాడుతుండగా తాను చేసిన హావభావం అనుకోకుండా జరిగిందని, అది ఏ విధంగానూ ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా ఎవరినైనా బాధపెట్టాలనే ఉద్దేశంతో తాను ఆ చర్య చేయలేదని తెలిపారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.ఈ విషయమై తన వివరణను ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ... “2026 సెప్టెంబర్ 7న శాసనసభలో పోలీసు శాఖ గ్రాంట్‌పై నా సమాధాన ప్రసంగం సందర్భంగా, మధ్యలో అనుకోకుండా కనిపించిన నా బాడీ లాంగ్వేజ్ ఏ విధంగానూ ఉద్దేశపూర్వకమైనది కాదు. అందువల్ల, ఎవరి వ్యక్తిగత భావాలను బాధపెట్టే ఉద్దేశంతో చేసిన చర్యగా దాన్ని అర్థం చేసుకోవద్దని కోరుతున్నాను” అని పేర్కొన్నారు.కాగా విజయ్ ప్రసంగం అనంతరం డీఎంకే ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ ఛాంబర్ వెలుపల నిరసనకు దిగారు. విజయ్ చేసిన వ్యాఖ్యలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం మార్షల్స్ జోక్యం చేసుకుని డీఎంకే ఎమ్మెల్యేలను అక్కడి నుంచి బలవంతంగా తొలగించారు.అదే సమయంలో సీపీఐ(ఎం) నేత పి. షణ్ముగం కూడా విజయ్‌పై తీవ్రంగా స్పందించారు. విజయ్ తన హావభావం ద్వారా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌పై వ్యక్తిగత దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా, స్టాలిన్ గతంలో మీసా నిర్బంధ సమయంలో ఎదుర్కొన్న దాడి కారణంగా దెబ్బతిన్న దవడను విజయ్ అనుకరించినట్లుగా కనిపించిందని షణ్ముగం పేర్కొన్నారు.ఎమర్జెన్సీ కాలంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలు జరిగాయని, అదే సమయంలో తీవ్ర అణచివేత, అకృత్యాలు చోటుచేసుకున్నాయని షణ్ముగం తన ఎక్స్ పోస్టులో గుర్తుచేశారు. ఆ సమయంలో మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను పోలీసులు దారుణంగా కొట్టడంతో ఆయన దవడ విరిగిందని తెలిపారు. ఎవరైనా ఒకరి శారీరక రూపాన్ని ఎగతాళి చేయడం ఖండించదగిన విషయం. ముఖ్యమంత్రి స్వయంగా అలా చేయడం బాధ్యతారాహిత్యమైన చర్యని షణ్ముగం విమర్శించారు.వివాదం ఎందుకు?ఈ వివాదానికి కారణమైన ఘటన నిన్న సోమవారం తమిళనాడు అసెంబ్లీలో విజయ్ చేసిన ప్రసంగంలో చోటు చేసుకుంది. అధికారంలో ఉన్న డీఎంకేపై విజయ్ తీవ్ర విమర్శలు చేశారు. తన ప్రసంగంలో మీసా కాలం గురించి ప్రస్తావిస్తున్న సమయంలో విజయ్ దవడను చూపించారు. ఈ హావభావాన్ని చాలామంది స్టాలిన్‌కు గతంలో జరిగిన దాడి, దాని కారణంగా ఆయన దవడ విరిగిన ఘటనకు సూచనగా భావించారు. దీంతో విజయ్ ఉద్దేశపూర్వకంగా స్టాలిన్ శారీరక పరిస్థితిని ఎగతాళి చేశారనే ఆరోపణలు వచ్చాయి.అయితే ఇప్పుడు విజయ్ ఇచ్చిన వివరణ ప్రకారం, ఆ హావభావం అనుకోకుండా జరిగినదే తప్ప, ఎవరినైనా వ్యక్తిగతంగా అవమానించాలన్న లేదా బాధపెట్టాలన్న ఉద్దేశం తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. We have seen Chief Ministers like a statesman, #MKStalin, speak respectfully in the Assembly; we have seen #Kalaignar speak sense with wit and wisdom; we have seen Madam #Jayalalithaa speak with confidence, elan and elegance; we have seen #EPS and #OPS speak sincerely and… pic.twitter.com/ry1bNWoLcL— Prakash Raghavadass (@PrakashRaghav) September 7, 2026 -
186 మందితో వెళుతున్న విమానం.. చెన్నైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
చెన్నై: కౌలాలంపూర్ నుంచి జెడ్డాకు వెళ్తున్న మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం MH156లోని నంబర్-2 ఇంజిన్‌లో అకస్మాత్తుగా సమస్య తలెత్తింది. దీంతో అప్రమత్తమైన ఫైలట్లు దీనిని వెంటనే సోమవారం సాయంత్రం చెన్నై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ప్రయాణ సమయంలో విమానంలో 186 మంది ప్రయాణికులు ఉన్నారు.విమానం వాస్తవానికి చెన్నై విమానాశ్రయానికి సాయంత్రం చేరుకోవాల్సి ఉంది. అయితే అత్యవసర పరిస్థితి కారణంగా ముందుగానే చెన్నైకి మళ్లించిన విమానం ముందుగానే సురక్షితంగా ల్యాండ్ అయింది. అత్యవసర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని విమానాశ్రయంలో అవసరమైన అత్యవసర స్పందనా ఏర్పాట్లన్నీ సిద్ధం చేసినట్లు విమానయాన అధికారులు తెలిపారు.విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని, విమానంలోని ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని చెన్నై విమానాశ్రయానికి చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు.ప్రస్తుతం విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్యపై మలేషియా ఎయిర్‌లైన్స్ సాంకేతిక బృందాలు, సంబంధిత అధికారులు పరిశీలన చేస్తున్నారు. ఇంజిన్‌లో అసలు ఎలాంటి సమస్య తలెత్తిందనే దానిపై మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
దేశానికి పతకం తీసుకొస్తే లైంగిక వేధింపులతో స్వాగతం!
దక్షిణాఫ్రికాలోని సన్ సిటీలో జరిగిన '2026 ఐపీఎఫ్ వరల్డ్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌ల'లో జూనియర్ మహిళల 47 కేజీల విభాగంలో భారత్‌కు చెందిన 21 ఏళ్ల అథ్లెట్ కీయా కునాల్ బెనర్జీ రజత పతకాన్ని సాధించింది. పోటీ సమయానికి కేవలం 45.70 కేజీల బరువున్న కీయా, తన శరీర బరువుకు మూడు రెట్ల కంటే ఎక్కువ బరువైన 140 కేజీల డెడ్‌లిఫ్ట్‌ను ఎత్తి సంచలనం సృష్టించింది. పవర్‌లిఫ్టింగ్ రంగంలో తన అద్భుత ప్రదర్శనతో భారతదేశానికి కీర్తి తెచ్చిన ఆమెకు కొంతమంది ఆన్లైన్ వేధింపులతో స్వాగతం పలకడం కలకలం రేపింది. ఆమె ఘనతను పొగడాల్సింది పోయి ఆన్లైన్ వేదికగా ఆమె పేరిట నకిలీ ఖాతాలు వెలిశాయి. అంతటితో ఆగకుండా కొంతమంది ఆమె ముఖాన్ని, శరీరాన్ని ఏఐ సాయంతో అసభ్యకరరీతిలో మార్ఫింగ్ చేసి వాటిని వైరల్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. జాతి వివక్ష వ్యాఖ్యలతో ఆమెను మానసికంగా ఒత్తిడికి లోనయ్యేలా చేశారు.ఇదే విషయమై కీయా కునాల్ మాట్లాడుతూ.. "పవర్‌లిఫ్టింగ్ అనేది నన్ను నేను సవాలు చేసుకోవడానికి మాత్రమే తప్ప సోషల్ మీడియా ప్రచారం కోసం కాదు. ఆటలో పోటీ పడి గెలవడమే తప్ప ఇలాంటి వేధింపులతో వచ్చే పేరు, ఫాలోవర్లు నాకొద్దు. నా అనుమతి లేకుండా ఏఐ చిత్రాలను సృష్టించడం దారుణం. డెడ్‌లిఫ్ట్ ఇష్టపడే ఒక సాధారణ అమ్మాయిగా బతికే ప్రశాంతమైన జీవితం మాత్రమే నాకు కావాలి. ప్లీజ్ నన్ను స్వేచ్ఛగా బతకనివ్వండి" అని కీయా కునాల్ బెనర్జీ ఆవేదన వ్యక్తం చేసింది.ఇక కీయా కునాల్ పాల్గొన్న టోర్నమెంట్ విషయానికొస్తే..ఫ్రాన్స్‌కు చెందిన ఇనెస్ హెర్బాక్స్ 165 కేజీలతో స్వర్ణం సాధించగా, ఐర్లాండ్‌కు చెందిన బ్లాత్నైడ్ ఓడ్వైర్ కూడా 140 కేజీలే ఎత్తినప్పటికీ, నియమాల ప్రకారం ఓ'డ్వైర్‌ను అధిగమించి కీయా రజత పతకాన్ని కైవసం చేసుకుంది. 140 కేజీల డెడ్‌లిఫ్ట్‌తో పాటు స్కౌట్లో 90 కేజీలు, బెంచ్ ప్రెస్‌లో 50 కేజీలు.. మొత్తం కలిపి 280 కేజీల బరువును ఎత్తి ఓవరాల్ విభాగంలో ఐదో స్థానంలో నిలిచింది. పవర్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు పతకం తీసుకొచ్చి దేశ ఖ్యాతిని ఇనుమడింపచేసిన కీయా కునాల్‌కు సంతోషంతో స్వాగతం పలకాల్సింది పోయి నరక కూపంలోకి నెట్టేశారు.वज़न 47 किलो Deadlift 140 किलो !ये हैं Keyaa Banerji!IPF World Championships में 140 KG वजन उठाकर Junior Silver Medal जीतकर Keyaa ने देश का नाम रोशन किया है।ये सिर्फ एक मेडल नहीं, बल्कि मेहनत, अनुशासन और हौसले की जीत है।जब कोई युवा अपने सपने को जुनून बना लेता है, तो… pic.twitter.com/s91X2i3e2U— Ashok Kumar IPS (@AshokKumar_IPS) September 3, 2026Keyaa Banerjee breaks silence on social media fake accounts and impersonation#KeyaaBanerjee #Powerlifting #IndianPowerlifting #IndiaSports pic.twitter.com/iEa7dlZiJo— Sports Today (@SportsTodayofc) September 7, 2026Read: సీపీఎల్‌లో నబీ విధ్వంసం.. ఆ జట్టుకు వరుస విజయాలు! -
చెన్నై-బెంగళూరు హైవేపై రోడ్డుప్రమాదం.. నలుగురు మృతి
చెన్నై-బెంగళూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళుతుండగా కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. మృతులంతా బెంగళూరు వాసులుగా తెలుస్తోంది. తిరుమల నుంచి వెళ్తుండగా బంగారుపేట వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలు తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. -
తీవ్ర విషాదం.. కల్తీ మద్యం సేవించి 10 మంది మృతి
భోపాల్: మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సాగర్ జిల్లాలో కల్తీ మద్యం సేవించి పదిమంది మృతిచెందారు. మృతులంతా అక్కడి ఘూఘర్, నౌరాజ్, బరాజ్ తదితర గ్రామాలకు చెందినవారిగా అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.అయితే నిన్న శనివారం మద్యం సేవించిన అనంతరం బాధితుల ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. దీంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో వారు మృతిచెందిట్లు వైద్యులు ప్రకటించారు. మరి కొంతమందికి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ మరణాలకు కల్తీ మద్యమే కారణమై ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నప్పటికీ, పోస్టుమార్టం నివేదికలు వచ్చే వరకు అధికారికంగా కారణాన్ని నిర్ధారించలేదు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.యూపీ నుంచి కల్తీ మద్యం సరఫరా?ఈ ఘటనపై ప్రాథమిక దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. సాగర్‌కు సరిహద్దుగా ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని లలిత్పూర్ కేంద్రంగా ఓ అక్రమ మద్యం సరఫరా నెట్వర్క్ పనిచేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.నిందితులు లలిత్‌పూర్‌లో నకిలీ మద్యాన్ని తయారు చేసి, సాగర్ సరిహద్దు గ్రామాలకు తరలించినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం.నకిలీ మద్యాన్ని అసలైన బ్రాండ్ల మాదిరిగా కనిపించేలా నకిలీ లేబుళ్లు, క్యాప్‌లు, క్యూఆర్ కోడ్లు ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. కార్లు, మోటార్‌సైకిళ్ల ద్వారా ఈ మద్యాన్ని వివిధ ప్రాంతాలకు తరలించినట్లు అనుమానిస్తున్నారు.బాంద్రీ, బరోడియా, ఘూఘారా ఖుర్ద్, నౌరాజ్, బరాజ్ తదితర గ్రామాలకు ఈ నకిలీ మద్యం చేరినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. మద్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరెవరు సరఫరా చేశారు? స్థానికంగా ఎవరైనా ఈ అక్రమ నెట్‌వర్క్‌కు సహకరించారా? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.ఘటనపై సీఎం సీరియస్సాగర్లో జరిగిన మరణాలపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. ఘటనాస్థలికి సంబంధిత మంత్రి, ఉన్నతాధికారులు వెళ్లి పరిస్థితిని పరిశీలించాలని ఆదేశించారు. పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. -
ఢిల్లీలో ఘోర ప్రమాదం.. సత్యనికేతన్ ప్రాంతంలో కుప్పకూలిన భవనం
సాక్షి, ఢిల్లీ : దేశ రాజధానిలో ఘోర ప్రమాదం జరిగింది. సత్యనికేతన్ ప్రాంతంలో విద్యార్థుల పేయింగ్ గెస్ట్ అకామిడేషన్ ఉన్న భవనంగా ఒక్కసారిగా కుప్పకూలింది. . ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. మరో పదిమందికి గాయాలు కాగా వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఆ భవనంలో దాదాపుగా 25 మంది విద్యార్థులున్నట్టు తెలుస్తోంది. అయితే భవనం కూలడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. -
"గ్లోబల్ టూరిజం అని బిల్డప్.. తీరా చూస్తే పరువు పాయే"
కోల్‌కతా: కొన్ని సార్లు మనం ఏదో గొప్పగా చేయాలనుకున్న పనే మనకు ఇబ్బందులు తెచ్చిపడుతుంది. తాజాగా బెంగాల్ సీఎం సువేందు అధికారి పరిస్థితి అలానే ఉంది. బెంగాల్ టూరిజంను ప్రపంచస్థాయిలో డెవలఫ్ చేద్దామనుకొని అన్ని హంగులతో ఒక నిమిషం నిడివి గల వీడియోని రూపొందించారు. అయితే అదే ఇప్పుడు ట్రోలింగ్‌కు గురవుతుంది. అసలు ఈ టూరిజం వీడియోల బెంగాల్ ఎక్కడుందంటూ నెటిజన్స్ ఆయనను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.ఇటీవల వెస్ట్ బెంగాల్ సీఎం సువేందు అధికారి రాష్ట్రంలోని పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ. 500 కోట్ల నిధులను ప్రకటించారు. అంతేకాకుండా నిన్న (శుక్రవారం) బెంగాల్ సాంస్కృతిక వారసత్వాన్ని భారతదేశం భిన్నంగా భావించే చోటు' అనే క్యాచ్లైన్తో ఒక లోగోనుఎంతో ఆర్భాటంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా సువేందు మాట్లాడుతూ" మనం మన రాష్ట్రంలో పర్యాటక మౌలిక సదుపాయాలను నాశనం చేశాం. పర్యాటకులు మన రాష్ట్రంలోని డార్జిలింగ్, కాలింపాంగ్ మీదుగా సిక్కింకు వెళతారు. దీనిని మార్చడానికి మేము నిశ్చయించుకున్నాము," అని అన్నారు.అయితే ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియో ఇప్పుడు ఆయనకు తలనొప్పిగా మారింది. బెంగాల్ టూరిజం వీడియోలో.. ఈఫిల్ టవర్, రష్యాలోని సెయింట్ బాసిల్ కేథడ్రల్, పిరమిడ్లు, రియోలోని క్రైస్ట్ ది రిడీమర్ ఉన్నాయి. బెంగాల్‌కు చెందిన ప్రసిద్ధ హౌరా వంతెన మాత్రమే అలా వచ్చి వెళ్లిపోతుంది. దీంతో ఇది చూసిన నెటిజన్స్ ఇక్కడ అసలు బెంగాల్ ఎక్కడ ఉంది అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అసలు ఇందులో బెంగాల్‌కు సంబంధించిన ప్రదేశాలు ఎక్కడున్నాయని ప్రశ్నిస్తున్నారు.పొలిటికల్ సెటైర్స్అయితే ఈ టూరిజం వీడియోపై స్వంత పార్టీలోనే తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. బీజేపీ సీనియర్ నేత త్రిపుర, మేఘాలయ మాజీ గవర్నర్ తథాగత రాయ్ దీనిపై తీవ్ర విమర్శలు చేశారు. ఇది "మూర్ఖపు" "అనుభవం లేని వీడియో" అని అభివర్ణించారు. వెంటనే దానిని తొలగించాలని డిమాండ్ చేశారు. "పశ్చిమ బెంగాల్‌పై తీసిన వీడియోలో మాస్కో, ఈజిప్ట్, రియో డి జనీరో దృశ్యాలు ఎందుకు ఉండాలి?" అని ప్రశ్నించారు. దీనిని రూపొందించిన వ్యక్తిని మత్స్యశాఖకు లేదా అలాంటి మరేదైనా విభాగానికి బదిలీ చేయాలని నేను సూచిస్తున్నాను అని వ్యంగ్యంగా మాట్లాడారు. టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయన్ "ఈ వీడియోకు 'చెత్త' అనే పదం కూడా చాలా తక్కువైనది అని ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. West Bengal tourism video for the new era 🔥 pic.twitter.com/djVMEihL6n— AniAdhikary (@aniadhikaryy) September 4, 2026 -
బొమ్మను చూసి అమ్మే అనుకుని..
ఆవు బొమ్మను చూసిన ఓ లేగదూడ అమాయకంగా దాని దగ్గరకు వెళ్లింది. డెయిరీ వ్యాన్‌పై ఉన్న ఆవు ఫొటోలోని నిండైన పొదుగు నుంచి పాలు తాగేందుకు ప్రయత్నించింది. అది బొమ్మ అని తెలియక.. ఆకలితో, అమ్మ కోసం వెతుకుతున్నట్టుగా వ్యాన్‌ను అనుసరించిన దృశ్యం చూపరులను కదిలించింది. నిజం తెలియని ఆ చిన్న ప్రాణి, తల్లి కోసం పడిన తపన ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఎంతో సహజసిద్ధంగా కారులో నుంచి వీడియో తీస్తున్నట్లు ఉంది. అయితే ఇది ఏఐ వీడియో.అయినప్పటికీ ఈ వీడియో చూస్తూ చాలామంది నవ్వుతూనే.. భావోద్వేగానికి లోనయ్యారు. బంధం అంటే ఇదేనేమో.. తల్లిని వెతికే మనసు అనేది ఇలానే ఉంటుంది కదా అని భావోద్వేగానికి లోనవుతున్నారు.. దాంతో ఈ వీడియో వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇందులో అత్యంత పవిత్రమైన తల్లి- బిడ్డ మధ్య ఉండే బంధం ఉండటంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తల్లి స్పర్శ అనేది బిడ్డకు ధైర్యాన్ని, రక్షణ ఇచ్చేది కావడం ఒకటైతే, భావోద్వేగాలతో ముడిపడి ఉంటుంది కాబట్టి వీడియోను వీక్షకులు అమితంగా ఇష్టపడుతూ తెగ వైరల్ చేస్తున్నారు. The ancients called it physis, the nature that precedes reason! Before we learn to speak, we learn to seek.A calf saw a cow image and without knowing the illusion from reality, walked towards it seeking milk.It is what Aristotle meant by saying: " Some bonds are not taught by… pic.twitter.com/UZDizeT3Kv— WireClicks (@Wireclicks) September 4, 2026 -
ఇది దేశం గర్వించదగ్గ విజయం.. మోదీ
ఢిల్లీ: జీఎస్ఎల్వీ-ఎఫ్17 ప్రయోగం విజయవంతమవడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది దేశం గర్వించదగిన సమయమని ఈ విజయంతో అంతరిక్ష రంగంలో భారత్ సత్తా మరోసారి ప్రపంచానికి తెలిసిందన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతాలో "ఇది ఇస్రో (ISRO) సాధించిన మరో అద్భుతమైన విజయం, మన దేశానికి గర్వకారణమైన క్షణం. భారతదేశపు మొట్టమొదటి ఇమేజింగ్ ఉపగ్రహం 'EOS-05'ను జియోసింక్రోనస్ కక్ష్యలోకి మోసుకెళ్లిన GSLV-F17 ప్రయోగం విజయవంతమైంది. భారత అంతరిక్ష రంగానికి ప్రత్యేక గుర్తింపునిచ్చే అత్యుత్తమ పనితీరు, ఆవిష్కరణలు ,సామర్థ్యాలకు నిదర్శనంగా నిలుస్తుంది. ఇస్రో ,భారతీయ పరిశ్రమల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యం మన అంతరిక్ష కార్యక్రమానికి కొత్త బలాన్ని, విస్తృతిని చేకూర్చడమే కాకుండా, మొత్తం అంతరిక్ష వ్యవస్థలో భారతదేశ సామర్థ్యాలను మరింత విస్తృతం చేస్తోంది. అని తన మోదీ పోస్ట్ చేశారు.కాగా ఈ రోజు ఉదయం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన జీఎస్ఎల్వీ-ఎఫ్17 ప్రయోగం విజయవంతమైంది. శుక్రవారం తెల్లవారుజామున 2.55 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.రెండో ప్రయోగ వేదిక నుంచి బయలుదేరిన జీఎస్ఎల్వీ-ఎఫ్17.. సరిగ్గా 18 నిమిషాల తర్వాత 3.13 గంటలకు 2,367 కిలోల బరువున్న ఈఓఎస్-05ను సబ్-జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ (సబ్-జీటీఓ)లోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఉపగ్రహం 170 కి.మీ. పెరీజీ, 28,934 కి.మీ. అపోజీ(భూమికి అత్యంత దూరం) ఉన్న కక్ష్యలోకి చేరింది.దీని ప్రత్యేకతలుఇక ఈఓఎస్-05ను ఇస్రో సైంటిస్టులు ‘స్మార్ట్ బాయ్’ అని పిలవడానికి కారణం దాని అత్యాధునిక నిఘా సామర్థ్యాలే. భూస్థిర కక్ష్యలో ఉండి భారత ఉపఖండాన్ని ప్రతి 10 నిమిషాలకు ఒకసారి చిత్రీకరించగల ఈ ఉపగ్రహం.. అధిక రిజల్యూషన్‌తో స్పష్టమైన చిత్రాలను అందిస్తుంది. మల్టీస్పెక్ట్రల్, హైపర్‌స్పెక్ట్రల్ కెమెరాలతో పంటలు, అడవులు, నీటి వనరులు, ఖనిజ సంపదతో పాటు వరదలు, తుపాన్లు, కార్చిచ్చుల వంటి విపత్తులను దాదాపు రియల్‌టైమ్‌లో పర్యవేక్షించగలదు. సరిహద్దుల్లోని కీలక ప్రాంతాలపై నిఘా పెట్టడంలోనూ ఇది ఎంతో ఉపయోగపడుతుంది. -
కోల్‌కతాలో ఉద్రిక్తత.. టీఎంసీ ఆఫీస్‌పై మాస్క్ గ్యాంగ్ దాడి
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో టీఎంసీ అధికారం కోల్పోయిన తర్వాత పరిస్థితులు ఏ విధంగా మారాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. టీఎంసీ నేతలపై దాడులు, ఆ పార్టీకి చెందిన నాయకుల తిరుగుబాటు, నాయకులపై కేసులు ఇలా ఆ పార్టీకి మెుత్తంగా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. తాజాగా కోల్‌కతాలోని స్థానికంగా గల టీఎంసీ కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈదృశ్యాలు అక్కడి సీసీటీవీలలో నమోదయ్యాయి.సీసీటీవీలలో నమోదైన దృశ్యాలలో.. మాస్కులు, హెల్మెట్లు ధరించిన ధరించిన కొంతమంది వ్యక్తులు టీవీ స్క్రీన్లు, ప్రింటర్, ఇతర వస్తువులను తీసుకుని బయటకు నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు నమోదయ్యాయి. అందులోని ఫర్నిచర్ ,ఎలక్ట్రానిక్ పరికరాలు ధ్యంసమైనట్లు కనిపిస్తోంది. అయితే దాడి ఏవరు చేశారనే సంగతి మాత్రం ఇంతవరకూ తెలియలేదు. కోల్‌కతాలోని కామాక్ స్ట్రీట్‌లోని తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయంలో ఈ ఘటన జరిగినట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు.కాగా ఈ ఘటనపై టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడూతూ.." బీజేపీ కార్యకర్తలు ఆయుధాలతో తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో పార్టీ కార్యాలయంలోకి చొరబడి, లోపల ఉన్న వారిపై దాడి చేసి, వారి ఫోన్లను లాక్కున్నారు. ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి, ప్రాంగణాన్ని దోచుకున్నారు. దీనిని "చట్టబద్ధమైన పాలనపై జరిగిన అవమానకరమైన దాడి" అన్ని అన్నారు.అయితే పార్టీ ఆఫీసుపై దాడి జరిగిన సమయంలో కార్యకర్తలు, న్యాయవాదులు పోలీసులకు ఫోన్ చేసినట్పటికీ తక్షణమే స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడిలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ తక్షణమే అరెస్టు చేయాలని టీఎంసీ డిమాండ్ చేస్తుందని పేర్కొన్నారు. అయితే ఈ అంశమై రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని వాటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతితో పాటు బెంగాల్ గవర్నర్‌కు టీఎంసీ లేఖ రాసింది. Attack on TMC Office in #KolkataMP Abhishek Banerjee alleged that an attack took place on the TMC office in Kolkata in the early hours of the morning. He stated that the staff were assaulted and furniture and equipment were destroyed.TMC leaders accused BJP workers of being… pic.twitter.com/WWMMx5G4qn— Siraj Noorani (@sirajnoorani) September 3, 2026 -
బైకుపై దూసుకెళ్లిన థార్.. ఇద్దరు మృతి
ఢిల్లీ: అతివేగం, నిర్లక్షపు డ్రైవింగ్ వాహనదారుల పట్ల శాపంగా మారింది. తాజాగా ఢిల్లీలో అతివేగంతో దూసుకవచ్చిన థార్ వాహనం రెండు ప్రాణాలను బలిగొంది. ద్విచక్రవాహనంపై వెళుతున్న ఇద్దరు వ్యక్తులను థార్ వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. అనంతరం వాహనదారుడు తప్పించుకునే యత్నం చేయడంతో స్థానికులు అతనిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.నిన్న బుధవారం రాత్రి ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.మృతులు అంజు, సుఖ్బీర్గా గుర్తించారు. ప్రమాద ఘటన వివరాలు తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టం పరీక్ష కోసం ఆసుపత్రికి తరలించారు. నిందితుడు అక్కడే రోహిణిలో ప్రాంతంలో పాడి వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. -
‘గొల్లల గుడి’కి అరుదైన గుర్తింపు
సాక్షి, ములుగు జిల్లా: పాలంపేటలోని ‘గొల్లల గుడి’ని జాతీయ ప్రాధాన్య కట్టడంగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ పరిధిలోని భారత పురావస్తు అధ్యయన విభాగం (ఏఎస్ఐ) జారీ చేసిన గెజిట్ ఆఫ్ ఇండియా (ప్రత్యేక సంచిక) పార్ట్- IIలోని సెక్షన్ 3 ఉప సెక్షన్ (ii) కింద ప్రచురితమైంది.“ప్రాచీన కట్టడాలు-పురావస్తు ప్రదేశాలు-అవశేషాల చట్టం-1958” (1958నాటి 24వ చట్టం)లోని సెక్షన్ 4, ఉప-సెక్షన్ (3) కింద సంక్రమించిన అధికారాల మేరకు ‘ఏఎస్ఐ’ ఈ ప్రకటన జారీ చేసింది. ములుగు జిల్లా పాలంపేట గ్రామంలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం ‘కాకతీయ రుద్రేశ్వర’ (రామప్ప) ఆలయానికి నైరుతి దిశలో ఈ ‘గొల్లల గుడి’ ఉంటుంది. ఇది తూర్పు ముఖంగా గల మండపం, దాని చుట్టూ మూడు గర్భాలయాలతో కూడిన ‘త్రికూటాలయం’గా కనిపిస్తుంది. దీని ప్రహరీ శిల్పాలంకృతమై, పైకప్పు అంచు నిర్మాణం, ద్వారబంధాల వద్ద చెక్కిన హంసల వరుసతో, ‘సునిశిత రంధ్రాల వల’ పనితనంతో ఈ ఆలయం ఎంతో విశిష్టమైనదిగా అలరారుతోంది.ఈ ప్రధాన ఆలయానికి ముందు వైపున రెండు ప్రత్యేక ఉప ఆలయాలు ఎంతో అందంగా చెక్కిన ద్వారపాలకుల విగ్రహాలతో అలంకృతమై ఉంటాయి. వీటికి ముందు గల అంతరాలయాల అంచులు కూడా చక్కని తెరలతో శోభాయమానంగా కనిపిస్తాయి. ప్రధాన ఆలయ నిర్మాణం ముందు భాగాన మండపం గుండా మధ్యలో గల ప్రధాన మందిరానికి మార్గం ఉంటుంది. దీనికి ఉత్తర, దక్షిణ, పశ్చిమ దిశలలో అంతరాలయాలతో మూడు గర్భాలయాలు కూడా ఉంటాయి. ఆలయ కుడ్యాలపై కనిపించే వివిధ గూళ్లలో విష్ణుమూర్తి, లక్ష్మి, గణేశుడు, మహిషాసురమర్దిని విగ్రహాలు దర్శనమిస్తాయి. జంతువుల ఆకారాలు, పుష్పాలంకరణతో కూడిన ఎత్తయిన వేదికపై ఈ ఆలయం నిర్మితమైంది. -
అయోధ్య ట్రస్ట్ సీఈవోగా ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా
లక్నో: అయోధ్య ట్రస్ట్ సీఈవోగా ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా ఎంపికయ్యారు. ఆయనను అయోధ్య ట్రస్ట్ సీఈవోగా ఎంపికచేస్తూ రామ జన్మభూమి ట్రస్ట్ ప్రకటన విడుదల చేసింది. జితేంద్ర మిశ్రా 39 ఏళ్ల పాటు ఎయిర్‌ఫోర్స్‌లో సేవలందించారు. కాగా రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తన మొట్టమొదటి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)కి దరఖాస్తులను ఆహ్వనించిన సంగతి తెలిసిందే. దాదాపు 5,500కి పైగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అనంతరం ముగ్గురు సభ్యుల నిపుణుల కమిటీ జితేంద్ర మిశ్రాను సీఈఓగా ఎంపిక చేసింది.జరిటైర్డ్ జస్టిస్ ప్రమోద్ కోహ్లీ, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ విష్ణుకాంత్ చతుర్వేది, నిపుణుల కమిటీ సభ్యుడు సురేష్ హవ్డేలతో కూడిన ప్యానెల్ ఈ ఎంపిక ప్రక్రియను చేపట్టింది. మొత్తం 5,585 దరఖాస్తులను క్షుణ్ణంగా సమీక్షించి, 16 మంది అభ్యర్థులతో ముఖాముఖి నిర్వహించినట్లు ట్రస్ట్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా వెల్లడించింది. జులై 11 నుంచి 18 వరకు దరఖాస్తులు స్వీకరించగా, 600 మార్కుల మూల్యాంకన విధానం ద్వారా అభ్యర్థుల అర్హతలను పరిశీలించారు. ప్రాథమిక పరిశీలన అనంతరం 3,577 మందికి ఫారాలు పంపగా, కనీసం 470 మార్కులు సాధించిన 108 మంది అర్హత పొందారు.వీరికి నాలుగు రోజుల పాటు వర్చువల్ ఇంటర్వ్యూలు నిర్వహించి, వారి ప్రతిభ ఆధారంగా 17 మందిని గ్రేడ్లుగా విభజించారు. చివరికి నిబద్ధత, దార్శనికత ఆధారంగా అత్యుత్తమమైన ముగ్గురిని ఎంపిక చేసి ట్రస్ట్‌కు సమర్పించారు. ట్రస్ట్ సభ్యుడు విమలేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రా మరణం, కానుకల చోరీ ఆరోపణలు, మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, సభ్యుడు అనిల్ మిశ్రాల రాజీనామాల అనంతరం ఏర్పడిన ఖాళీల నేపథ్యంలో ఈ నియామకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
మమతా బెనర్జీ కుటుంబంలో విషాదం
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ రోజు (మంగళవారం) ఆమె మేనకోడలు బ్రిస్టీ ముఖర్జీ ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. రాంపూర్హాట్ ప్రాంతంలోని కుసుంబా గ్రామంలో ఉన్న తన ఇంటి రెండో అంతస్తులోని ఓ గదిలో బ్రిస్టీ ముఖర్జీ ఉరివేసుకున్న స్థితిలో కనిపించారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం పరీక్ష కోసం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.అనంతరం పోలీసులు మాట్లాడుతూ ఆమె మృతికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. పోస్టుమార్టం నివేదికతో పాటు ఇతర న్యాయపరమైన, విధి సంబంధిత విచారణలు పూర్తయిన తర్వాత ఆమె మరణానికి దారితీసిన అసలు పరిస్థితులు స్పష్టమవుతాయని పోలీసు అధికారి తెలిపారు.అయితే కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, బ్రిస్టీ ముఖర్జీ కొంతకాలంగా విడాకుల ప్రక్రియను ఎదుర్కొంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆమె డిప్రెషన్‌తో బాధపడుతున్నారని, అందుకు చికిత్స సైతం తీసుకుంటున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.బ్రిస్టీ ముఖర్జీ తండ్రి నిహార్ ముఖర్జీ. స్థానిక తృణమూల్ కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నారు. ప్రస్తుతం బ్రిస్టీ ముఖర్జీ మృతికి సంబంధించిన అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక, కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు, ఇతర విధి సంబంధిత విచారణల ఆధారంగా ఆమె మరణానికి దారితీసిన పూర్తి పరిస్థితులను నిర్ధారించనున్నారు. -
మణిపూర్ జనగణనపై.. కేంద్రం కీలక నిర్ణయం
ఢిల్లీ: కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మణిపూర్‌లో జనగణన (సెన్సస్) కార్యకలాపాలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. మణిపూర్ ప్రజల మనోభావాలు, ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని ప్రతిపాదిత జనగణన ప్రక్రియను వాయిదా వేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అధ్యక్షతన ఈ కీలక సమావేశం జరిగింది.గత కొంతకాలంగా మణిపూర్‌లో నిరసనలు మిన్నంటాయి. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (NRC) అమలు చేసేకంటే ముందే రాష్ట్రంలో జనగణన ప్రక్రియను వాయిదా వేయాలని మణిపూర్‌లోని ప్రజలు డిమాండ్ చేశారు. దీంతో మణిపూర్ ప్రజల మనోభావాలు, ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని ప్రతిపాదిత జనగణన ప్రక్రియను వాయిదా వేయాలని నిర్ణయించినట్లు కేంద్రం తెలిపిందిఈ సమావేశం ముగిసిన అనంతరం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యుమ్నం ఖేమ్‌చంద్ సింగ్ మాట్లాడుతూ.. ప్రజల గొంతును విన్నందుకు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా తో పాటు ఇతర కేంద్ర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మణిపూర్ ప్రజల కోరికలను నెరవేర్చడంలో నిరంతరం మద్దతు ఇస్తున్నందుకు బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.మణిపూర్‌లో ఎన్ఆర్సీని అమలు చేయాలని ఇటీవల న్యూఢిల్లీలో క్యాంపెయిన్ నిర్వహించిన 14 సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ నాయకులు, బీజేపీ ఎమ్మెల్యేల ప్రతినిధి బృందం చేసిన కృషిని ఆయన అభినందించారు. కేంద్ర నాయకులు, అధికారులతో వారు క్రమం తప్పకుండా జరిపిన సంప్రదింపుల వల్లే ఈ రోజు ఈ నిర్ణయం సాధ్యమైందని ముఖ్యమంత్రి చెప్పారు.తొలుత ఎన్ఆర్సీని పూర్తి చేయకుండానే కేంద్రం జనగణన నిర్వహిస్తామని స్పష్టం చేయడంతో గత వారం మణిపూర్‌లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఎన్ఆర్సీ లేకుండా జనగణనను సమర్థించలేమని మైతేయి, నాగా వర్గాలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించగా, కుకీ-జో కౌన్సిల్ మాత్రం దీనికి భిన్నమైన వైఖరిని తీసుకుంది.కాగా, 2023 నుంచి రాష్ట్రంలో చెలరేగిన మైతేయి-కుకీ జాతి హింసాకాండ కారణంగా 50,000 మందికి పైగా నిర్వాసితులయ్యారు. 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కాగా ఈ రోజు ( సోమవారం) న్యూఢిల్లీలో జరిగిన అత్యున్నత స్థాయి భేటీలో మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా, ముఖ్యమంత్రి యుమ్నం ఖేమ్‌చంద్ సింగ్, కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
అఖిలేష్ యాదవ్ సీఎం కావాలంటే ఆయన కావాల్సిందే.. AIMIM నేత
లక్నో: ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌కి AIMIM నేత షాదాబ్ చౌహాన్ కీలక సూచన చేశారు. అఖిలేష్ యాదవ్ వచ్చే ఎన్నికల్లో గెలిచి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలంటే తప్పనిసరిగా ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మద్దతు తీసుకోవాల్సిందేనన్నారు. అలా లేకపోతే ముఖ్యమంత్రి కావాలని ఆయన కలలు కనలేరని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అక్కడి పొలిటికల్ పార్టీలు అధికారమే లక్షంగా వ్యుహా ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అమలు చేసిన ‘PDA’ రాజకీయ వ్యూహాం లక్షంగా షాదాబ్ చౌహాన్ వ్యాఖ్యానించారు. PDA అంటే ‘పిఛ్డే, దళిత్, అల్పసంఖ్యాక్’ — అంటే వెనుకబడిన తరగతులు, దళితులు, మైనారిటీలు అని సమాజ్‌వాదీ పార్టీ వివరిస్తోంది.పీడీఏలోని A పదం అసదుద్దీన్ ఓవైసీనిని సూచించేలా ఉండాలని షాదాబ్ చౌహాన్ వ్యాఖ్యానించారు. “అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి కావాలనుకుంటే, ఆయన అసదుద్దీన్ ఒవైసీ మద్దతు తీసుకోవాల్సి ఉంటుంది అఖిలేష్ యాదవ్ PDAలో ‘A’ అంటే అసదుద్దీన్ ఒవైసీ ఉండే వరకు, ఆయన అధికారంలోకి రావాలని కలలు కూడా కనలేరు” అని అన్నారు.ముస్లింలు తమ ఓట్లు తమ ప్రయోజనాలను ప్రతిబింబించే నాయకుడిని ఎన్నుకునేలా ఉపయోగపడాలని నిర్ణయించుకున్నారని అఖిలేష్ యాదవ్ రాజకీయ వ్యూహం అసదుద్దీన్ ఒవైసీ లేకుండా పూర్తికాదన్నారు. AIMIM ఉత్తరప్రదేశ్‌లో ఒక ముఖ్యమైన రాజకీయ ప్రత్యామ్నాయంగా కొనసాగుతోందని, అఖిలేష్ యాదవ్ తన ఎన్నికల అవకాశాలను బలోపేతం చేసుకోవాలంటే ఒవైసీ పార్టీతో సహకారం అవసరమని ఆయన సూచించారు. -
నేపాల్ వరదలు.. భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన
సాక్షి, ఢిల్లీ: నేపాల్ వరదల్లో గల్లంతైన భారతీయులపై విదేశాంగ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. ఆకస్మిక వరదల్లో మెుత్తంగా 287 మంది భారతీయులు గల్లంతు కాగా వారిలో 88 మంది సురక్షితంగా బయిటపడినట్లు తెలిపింది. గల్లంతైన వారిలో 128 మంది ఎన్నారైలు ఉన్నట్లు పేర్కొంది. గల్లంతైన వారి కోసం భారత సహాయక బృందాలు గాలింపులు చేపడుతున్నట్లు విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది.120 మంది భారతీయులు చైనా నుంచి నేపాల్ చేరుకున్నట్లు తెలిపింది. అదే విధంగా మృతుల డీఎన్ఏ పరీక్షల వివరాల కోసం ఆరు ఫోరెన్సిక్ టీములను కేంద్ర ప్రభుత్వం నేపాల్ పంపినట్లు పేర్కొంది. హైడ్రో పవర్ ప్రాజెక్టు నుంచి నలుగురు భారతీయులు సురక్షితంగా బయటపడినట్లు తెలిపింది. నేపాల్–టిబెట్ వరదలు: ప్రస్తుత వివరాలు1. మొత్తం పరిస్థితి • నేపాల్–టిబెట్ మానవతా సంక్షోభం విపత్కరం. • 633 మరణాలు, 2,980 మంది మిస్సింగ్ • నేపాల్: 626 మరణాలు, 2,426 తప్పిపోయినవారు (517 విదేశీయులు, 300+ భారతీయులు). • 3,700+ మంది రక్షణ, 2,400+ మందిని 14 సైనిక హెలికాప్టర్లు గాలివెంటన్. • 11,000+ భద్రతా సిబ్బంది సెర్చ్ అండ్ రెస్క్యూ. • రోడ్లు/వంతెనలు నాశనం, బురద, కొండచరియలు, వర్షం, కఠిన భూభాగం యాక్సెస్‌ను పరిమితం చేస్తున్నాయి. • నేపాల్ అంతర్జాతీయ సహాయం స్వీకరిస్తోంది. భారత్, ఇతర దేశాలు మద్దతు ఇస్తున్నాయి. 2. ఆంధ్రప్రదేశ్ – 13 మంది జాడ తెలియదు • 13 మంది AP సంబంధితులు జాడ తెలియదు (7 AP నివాసులు + 6 AP మూలం NRIలు/విదేశీయులు). • 6 మంది NRIలలో 4 మంది ఇషా ఫౌండేషన్ గ్రూప్‌కు సంబంధించినవారు. AP నివాసులు – 7: 1 అన్నండేవర వెంకట్రామ్ — 9663722477 | కాకినాడ/బెంగళూరు 2 అన్నండేవర అనఘ — 9663766711 | కాకినాడ/బెంగళూరు 3 చొప్పరాపు రమేష్ బాబు — 8861299006 | కృష్ణా/కనూరు | గైరాంగ్ ఇమ్మిగ్రేషన్ ఆఫీస్, చైనా 4 సంతోష్ సాహు — 447860430921 | పార్వతీపురం | NRT–లండన్ 5 స్పందన్ సాహు — 447587741850 6 పాధ్య సురభి మన్మథ్ — కాంటాక్ట్ అందుబాటులో లేదు 7 సైనా కుమారి సాహు — కాంటాక్ట్ అందుబాటులో లేదు AP మూలం NRIలు/విదేశీయులు – 6: 8. వి.ఎల్. బాల సుబ్రమణ్యం — 7416410673 | గైరాంగ్ | ఇషా ఫౌండేషన్9. అట్లూరి శశి కుమార్ — +1-6095778200 | గైరాంగ్ | ఇషా ఫౌండేషన్10. నిమ్మగడ్డ రాజ్యలక్ష్మి — 7416083300 | గైరాంగ్ | ఇషా ఫౌండేషన్11. కె. గోవింద్ — 6367167312 | ఇషా ఫౌండేషన్12. సుహాసిని రెడ్డి కండిమల్ల — కాంటాక్ట్/లొకేషన్ అందుబాటులో లేదు13. రంగనాథ్ — 8790040944 | ధుంచే/స్యాబ్రుబేసి | న్యూజిలాండ్ పౌరుడు (AP సంబంధం) 3. భాస్కర్ శాస్త్రి & కుటుంబం – ఆదోని, కర్నూలు • భాస్కర్ శాస్త్రి, మణి శారద, రఘునాద శాస్త్రి, హంశిక సురక్షితంగా ఉన్నారు. • రఘునాద శాస్త్రికి తీవ్ర పల్మనరీ ఎడిమా వచ్చి ఆక్సిజన్ అవసరం. • 28 ఆగస్టు: సాగా చేరి హోటల్లో ఆక్సిజన్ ఏర్పాటు. • 29 ఆగస్టు: న్యాలామ్ కౌంటీ చేరారు (కొడారి సరిహద్దుకు సుమారు 50 కి.మీ.). • కొడారి → కాఠ్మండు వైపు కదలనున్నారు (సరిహద్దు, వాతావరణం, రోడ్ పరిస్థితులపై ఆధారపడి). • కీలక అవసరం: కొడారి–కాఠ్మండు ప్రయాణానికి పోర్టబుల్ ఆక్సిజన్/ఆక్సిజన్ ఉన్న వాహనం ఏర్పాటు చేయాలి. • 30/31 ఆగస్టు కాఠ్మండు చేరే అవకాశం. 1 సెప్టెంబర్ 2026 కాఠ్మండు–ముంబై–హైదరాబాద్ ఫ్లైట్ ధృవీకరించబడింది.కాంటాక్ట్స్:భాస్కర్ శాస్త్రి: 94401 96543 | హంశిక: 9036536111 | గ్రూప్ కోఆర్డినేటర్: +977 9843057721 | మూన్ హిమాలయ అడ్వెంచర్: +977 9860455963 / +977 1-5924890 -
ఒకప్పుడు మాఫియాలదే ప్రభుత్వం..యోగీ సంచలన వ్యాఖ్యలు
లక్నో: మరో ఆరు నెలల్లో ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఇప్పటినుంచే పొలిటికల్ హీట్ నెలకొంది. తాజాగా ఆ రాష్ట్ర సీఎం యోగీ ఆదిత్యనాథ్, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్పీ అంటేనే దోపిడీ, వసూళ్లు.. దొంగల ముఠా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సమాజ్ వాద్ పార్టీ అధికారంలో ఉండగా రాష్ట్ర ఖజానాను దోచుకున్నారని ఇందుకు గానూ అఖిలేష్ యాదవ్ యూపీ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని యోగీ డిమాండ్ చేశారు.ఈ రోజు (శనివారం) డియోరియాలో రూ.305 కోట్లకు పైగా విలువైన 80 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎస్పీపై యోగీ ఆదిత్యనాథ్ తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. “ఎస్పీ అంటే దోపిడీ, వసూళ్లు. ఎస్పీ అంటే దొంగల ముఠా గత ప్రభుత్వాల హయాంలో ఉత్తరప్రదేశ్‌కు అభివృద్ధి లేకపోవడం, శాంతిభద్రతలు క్షీణించడం, నేరగాళ్ల ప్రభావం పెరగడం వంటి పరిస్థితులు ఉండేవి. ఒకప్పుడు ఉత్తరప్రదేశ్‌లో మాఫియాలదే సమాంతర ప్రభుత్వం. బీజేపీ అధికారంలోకి వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది" అన్నారు.రాష్ట్రంలో మాఫియా వ్యవస్థను అణచివేశామని ఉత్తరప్రదేశ్ ప్రతిష్ఠను మెరుగుపరిచామని చెప్పారు.ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌కు మంచి పేరు వచ్చింది. మాఫియాలను మట్టుబెట్టాం. మహిళలు, వ్యాపారుల భద్రతకు భంగం కలిగించే వారికి రెండు చోట్లే స్థానం ఉంది.. ఒకటి జైలు, మరొకటి నరకం అంటూ యోగి ఘాటుగా వ్యాఖ్యానించారు. అభివృద్ధి, సుపరిపాలనకు ప్రజలు ఎన్నుకునే ప్రజాప్రతినిధులే కారణమని ఆయన అన్నారు. మంచి ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటే మంచి ప్రభుత్వం వస్తుందని, దాని ఫలితంగానే అభివృద్ధి, సంపద, ఉపాధి అవకాశాలు ప్రజలకు అందుతాయని పేర్కొన్నారు.ఎన్సెఫలైటిస్ మరణాలపై ఎస్పీ-కాంగ్రెస్‌ను టార్గెట్ చేసిన యోగిఈ సందర్భంగా తూర్పు ఉత్తరప్రదేశ్‌ను దశాబ్దాలుగా వెంటాడిన ఎన్సెఫలైటిస్ సమస్యను కూడా యోగి ప్రస్తావించారు. ప్రతి ఏడాది జూలై 15 నుంచి నవంబర్ 15 మధ్య డియోరియా, మహారాజ్‌గంజ్, గోరఖ్‌పూర్, సిద్ధార్థ్‌నగర్, కుషీనగర్, సంత్ కబీర్ నగర్, బస్తీ జిల్లాల్లో ఈ వ్యాధి తీవ్ర ప్రభావం చూపేదని తెలిపారు.ఈ సమస్యను కేవలం వ్యాధిగా చూడలేమని, అప్పటి సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని యోగి ఆరోపించారు. గత 40 ఏళ్లలో ఎన్సెఫలైటిస్ కారణంగా సుమారు 50 వేల మంది అమాయక చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని, కానీ ఎస్పీ లేదా కాంగ్రెస్‌కు చెందిన ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఈ పరిస్థితిని పరిశీలించేందుకు కూడా ముందుకు రాలేదని తీవ్రంగా విమర్శించారు. -
సీఎం విజయ్ ఆకస్మిక పర్యటన.. నేరుగా ఖైదీలతో!
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ అక్కడి పుజల్ జైలులో ఆకస్మిక పర్యటన చేశారు. కారాగారంలో ఖైదీల బాగోగులు ఆరా తీశారు. ఖైదీలకు అందిస్తున్న ప్రాథమిక సౌకర్యాలు, వైద్య సంరక్షణ, ఆహార నాణ్యత, వృత్తి శిక్షణా కేంద్రాలను తనీఖీ చేశారు. అనంతరం ఖైదీలకు అందిస్తున్న సహాయ సహకారాలు తదితర విషయాలపై నేరుగా మాట్లాడి తెలుసుకున్నారు.ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విజయ్ శుక్రవారం పుజల్ సెంట్రల్ జైలులో ఆకస్మిక పర్యటన చేశారు. తన పర్యటన సందర్భంగా విజయ్, పుజల్ సెంట్రల్ జైలు-1లోని క్వారంటైన్ జోన్, సందర్శకుల హాల్, జైలు ఆసుపత్రి, రీహాబిలిటేషన్ సెంటర్, మహాత్మా గాంధీ కమ్యూనిటీ కళాశాలలోని తరగతి గదులు, గ్రంథాలయం, అధునాతన కంప్యూటర్ శిక్షణా కేంద్రం, హై-సెక్యూరిటీ బ్లాక్, ఉరితీత ప్రాంతంతో సహా పలు కీలక సౌకర్యాలను తనిఖీ చేశారు.అనంతరం అక్కడే వస్త్రాలు తయారు చేసే పవర్లూమ్ విభాగాన్ని, అలాగే టైలరింగ్ యూనిట్‌ను సమీక్షించారు. ఆయన ఖైదీలకు అందించే ఆహార నాణ్యతను స్వయంగా తనిఖీ చేసి, వారి సమస్యలు, అవసరాలను నేరుగా వినడానికి వారితో సంభాషించారు. జైలు సందర్శన అనంతరం ముఖ్యమంత్రి ఎం-3 పుజల్ పోలీస్ స్టేషన్‌ను అక్కడి పోలీసు అధికారులతో రోజువారీ కార్యకలాపాలను సమీక్షించారు, స్టేషన్ రిజిస్టర్లను పరిశీలించారు. సబ్-ఇన్స్పెక్టర్ గది, కంప్యూటర్ గది, లాకప్ సౌకర్యాలను తనిఖీ చేశారు.ముఖ్యమంత్రి పర్యటనలో సీఎంతో పాటు పోలీస్ డైరెక్టర్ జనరల్, జైళ్లు జైళ్ల డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (చెన్నై రేంజ్) టి. పళని, జైళ్ల సూపరింటెండెంట్ కృష్ణరాజ్ మరియు ఇతర సీనియర్ ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. -
ట్రాఫిక్ కష్టాలు తెలియాలా? ఒక్కరోజు పోలీసు కండి!
బెంగళూరు ట్రాఫిక్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలోనే అత్యధిక ట్రాఫిక్ జామ్ కలిగిన నగరంగా ఈ సిటీకి పేరు. ఈ నేపథ్యంలోనే నగర ట్రాఫిక్ సమస్యలను పౌరులకు తెలియజేయడాని అక్కడి ట్రాఫిక్ పోలీసులు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణలో ఎదురయ్యే సవాళ్లు తదితర సమస్యలు తెలుసుకోవడానికి ‘కాప్ ఫర్ ది డే’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని ద్వారా నగరవాసులు ఒక రోజు ట్రాఫిక్ పోలీస్ సిబ్బందితో కలిసి పనిచేస్తూ, నగరంలో ట్రాఫిక్ నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నారు. దీంతో ట్రాఫిక్ పోలీసుల విధులు, బాధ్యతలను స్వయంగా అర్థం చేసుకోవడంతో పాటు, రహదారులను మరింత సురక్షితంగా, సాఫీగా మార్చేందుకు తమ సూచనలు అందించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ట్రాఫిక్ పోలీసుల దృష్టికోణంలో బెంగళూరు ట్రాఫిక్‌ను అనుభవించాలని, విధి నిర్వహణలో వారు ఎదుర్కొనే సమస్యలను తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం తమ అనుభవాలను, రహదారి భద్రతకు సంబంధించిన సూచనలను పోలీసులతో పంచుకోవచ్చని తెలిపారు.బెంగళూరు సిటీ ట్రాఫిక్ విభాగం జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్తిక్ రెడ్డి, ఐపీఎస్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమాన్ని గతంలో విజయవంతంగా నిర్వహించామని, ఇప్పుడు మరోసారి అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. పీక్ అవర్స్‌లో ట్రాఫిక్‌ను నియంత్రించడం, వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించడం వంటి విధుల్లో ట్రాఫిక్ సిబ్బంది ఎదుర్కొనే సవాళ్లను పౌరులు ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకోవాలని ఆయన కోరారు.ఎలా నమోదు చేసుకోవాలి ?ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారు ముందుగా BTP ASTraM యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ చేసుకుని యాప్‌లోకి లాగిన్ అయిన తర్వాత హోమ్ పేజీలో కనిపించే “Traffic Cop for a Day” ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అనంతరం అడిగిన వివరాలను నమోదు చేసి దరఖాస్తును సబ్మిట్ చేయాలి.రిజిస్ట్రేషన్ విజయవంతమైన తర్వాత, ఎంపికకు సంబంధించిన తదుపరి సమాచారాన్ని అనుసరించి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఈ కార్యక్రమం ద్వారా ట్రాఫిక్ పోలీసుల రోజువారీ విధులను దగ్గరగా తెలుసుకోవడంతో పాటు, బెంగళూరు ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారాలపై పౌరులు తమ అభిప్రాయాలను నేరుగా పోలీసు విభాగంతో పంచుకునే అవకాశం లభించనుంది. -
బిహార్‌లో ఉద్రిక్తత.. సీఎం నివాసం వైపుగా ర్యాలీ
పాట్నా: బిహార్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 70వ బీపీఎస్సీ పరీక్షలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ విద్యార్థులు చేసిన నిరసన హింసాత్మకంగా మారింది. విద్యార్థులతంగా పెద్ద ఎత్తున నిరసన చేపడుతూ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి నివాసం వైపు భారీ ర్యాలీగా తరలివెళ్లారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించి ముందుకు సాగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పాటు వాటర్ క్యానన్లను ప్రయోగించారు.ప్రధానంగా 70వ బీపీఎస్సీ పరీక్షలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఆ పరీక్షను రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే పరీక్షల నిర్వహణలో స్పష్టత, నియామక ప్రక్రియలో పారదర్శకత, ఒకే పరీక్ష విధానం అమలు చేయాలని వారు కోరుతున్నారు. పాట్నాలోని గార్డనిబాగ్ ప్రాంతంలో కొంతకాలంగా ఈ అంశాలపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.ఈ నేపథ్యంలో ఈ రోజు (మంగళవారం) పట్నా,గాంధీ మైదాన్ నుంచి ఉదయం 10 గంటల ప్రాంతంలో విద్యార్థుల మార్చ్ ప్రారంభమైంది. పోటీ పరీక్షలు, ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన తమ డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేస్తూ విద్యార్థులు ముఖ్యమంత్రి నివాసం వైపు కదిలారు. మార్గమధ్యంలో పోలీసులు భారీగా బారికేడ్లు ఏర్పాటు చేసినప్పటికీ, వాటిని దాటుకుని విద్యార్థులు ముందుకు వెళ్లడంతో పోలీసులతో ఘర్షణ చోటుచేసుకుంది.సోమవారం విద్యార్థి ప్రతినిధులు బీహార్ ప్రభుత్వంతో చర్చలు జరిపారు. చర్చలు సానుకూలంగా సాగాయని విద్యార్థి నాయకులు చెప్పినప్పటికీ, తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ లభించకపోవడంతో ఆందోళన కొనసాగించాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరితో నేరుగా సమావేశం కావాలని వారు పట్టుబట్టారు. ముఖ్యమంత్రిని కలిసే అవకాశం లేకపోతే విద్యాశాఖ మంత్రితో మాట్లాడేందుకు సిద్ధమని, ఇతర అధికారులతో చర్చించబోమని స్పష్టం చేశారు.విద్యార్థుల ఆందోళనకు భూసంబంధిత సమస్యలపై నిరసన చేస్తున్న రైతుల బృందం కూడా మద్దతుగా చేరింది. రైతులు నల్ల జెండాలతో నిరసనలో పాల్గొనడంతో భద్రతను మరింత పెంచి నిరసన ప్రదేశంలో సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు.ఇదిలా ఉండగా, విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు బీహార్ ప్రభుత్వం ‘విద్యార్థి సహయోగ్ శివిర్’ పేరుతో నెలవారీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు సీఎం సమ్రాట్ చౌదరి ప్రకటించారు.ప్రతి నెల నాలుగో మంగళవారం విద్యా సంస్థల్లో ఈ శిబిరాలను నిర్వహించి విద్యార్థుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. ఆన్లైన్లో ఫిర్యాదులు నమోదు చేసి వాటి పరిష్కార స్థితిని తెలుసుకునే అవకాశం కూడా కల్పిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. -
మీది బోస్టన్ డిగ్రీ.. నాది 12వ తరగతి.. అయినా?
ఢిల్లీ: బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఇంగ్లీష్ మాట్లాడే విధానాన్ని.. తన లాంగ్వేజ్‌తో పోలుస్తూ ఓ వైరల్ రీల్‌ను తన సోషల్ మీడియా వేదికలో షేర్ చేశారు. దీంతో సీజేపీ, కంగనా రనౌత్ మధ్య మరోసారి పొలిటికల్ హీట్ నెలకొంది.సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన రీల్లో తొలుత అభిజిత్త్ దీప్కే ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్న దృశ్యాలను చూపించి, ఆ తర్వాత కంగనా ఇంగ్లీష్‌లో ప్రసంగిస్తున్న వీడియోను చూపించారు. దీనికి “12వ తరగతి చదివిన కంగనా, బోస్టన్ యూనివర్సిటీ చదివిన దీప్కే ఇంగ్లీష్ స్థాయి.. ఒకరు ఫైర్, మరొకరికి రీబూట్ అవసరం” అన్నట్లుగా సెటైర్ వేశారు. అనంతరం ఇంగ్లీష్ మాట్లాడ రాకపోవడం వల్ల తను ఎదుర్కొన్న అనుభవాల్ని పంచుకున్నారు.‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమంలో తన ఇంగ్లీష్‌పై నటి సోనమ్ కపూర్ ఎగతాళి చేశారని ఆమె గుర్తుచేసుకున్నారు. అయితే ఆ అవమానాలే తనను మరింత బలంగా ఎదగడానికి ప్రేరేపించాయని తెలిపారు. సినీ పరిశ్రమలో తాను ఎదుర్కొన్న పోరాటాల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని అన్నారు. ముఖ్యంగా బయట నుంచి వచ్చిన వారిని ఇంగ్లీష్ రాదనే కారణంతో ఎగతాళి చేయడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు.CJPపై కంగనా కౌంటర్లుCJP సభ్యులతో కంగనాకు సోషల్ మీడియాలో మాటల యుద్ధం జరగడం ఇదే తొలిసారి కాదు. ఇటీవల CJP అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ తనపై చేసిన వ్యాఖ్యలకు కూడా కంగనా ఘాటుగా స్పందించారు. 28 ఏళ్ల వయసున్న వ్యక్తి తనను విమర్శించడం గురించి ప్రస్తావిస్తూ.. తాను 20 ఏళ్లుగా ప్రజాజీవితంలో ఉన్నానని, తన వయసులోనే రెండు జాతీయ అవార్డులు అందుకున్నానని కంగనా కౌంటర్ ఇచ్చారు.అంతేకాదు, తాను ప్రస్తుతం ఎంపీగా ఉండటంతో పాటు నటి, దర్శకురాలు, నిర్మాత, స్క్రీన్‌రైటర్, పారిశ్రామికవేత్తగా కూడా పలు బాధ్యతలు నిర్వహిస్తున్నానని చెప్పారు. తన స్థాయిలో ఉన్న వ్యక్తి ఎదుర్కొనే ఒత్తిడి, బాధ్యతలు అర్థం చేసుకోవడం.. విమర్శలు చేసే వారికి సాధ్యం కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
కాక్రోచ్ జనతా పార్టీ కీలక ప్రకటన.. ఢిల్లీలో భారీ ర్యాలీ
సాక్షి, ఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ కీలక ప్రకటన చేసింది.విద్యార్థులపై ఎఫ్ఐఆర్ల రద్దుకై కేంద్రం వ్యవహారిస్తున్న వైఖరికి నిరసనగా భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 5న ఇండియా గేట్ నుంచి ఢిల్లీ పోలీస్ హెడ్ క్వార్టర్ వరకు నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్లు ప్రకటించింది. నీట్ వ్యతిరేక నిరసనల్లో విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకుంటామని కేంద్రం హామీ ఇచ్చి ఇప్పుడు కాలయాపన చేస్తుందని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ర్యాలీ చేపట్టనున్నట్లు తెలిపింది.ఏం జరిగింది?నీట్‌పేపర్ లీకేజ్‌కు నిరసనగా జూలై 20న జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల “సంసద్ చలో” నిరసన పార్లమెంట్ వైపు వెళ్లడంతో ఉద్రిక్తంగా మారింది. పోలీసులు నిరసనకారులను ఆపేందుకు లాఠీచార్జ్, టియర్ గ్యాస్ వంటి చర్యలు చేపట్టారు. నిరసనకారులు పోలీసుల ఆదేశాలను పట్టించుకోకుండా ముందుకు వెళ్లడం, బారికేడ్లను దాటేందుకు ప్రయత్నించడం, ఘర్షణలు జరగడం వంటి కారణాలతో కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.అయితే ఆందోళనల విరమణలకై జరిగిన ఒప్పందంలో కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల నిరసనకారులపై నమోదైన ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకుంటామని హామీ ఇచ్చినట్లు విద్యార్థులు తెలిపారు. ఇప్పుడు వాటిని నెరవేర్చడంలో ఆలస్యం చేస్తున్నందున సెప్టెంబర్ 5 న.. యువజన మార్చ్ నిర్వహిస్తామని ప్రకటించింది. -
ప్రభుత్వ బడుల పరిస్థితులేంటి? అభిజిత్ దీప్కే లేఖ
సాక్షి, ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై కాక్రోచ్ జనతా పార్టీ కన్వీనర్ అభిజీత్ దీప్కే అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులకు లేఖ రాశారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ప్రాథమిక సౌకర్యాలు లేవని దీంతో దేశ అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని లేఖలో ప్రశ్నించారు.? ప్రజా విద్యను ప్రాధాన్యతగా తీసుకొని పాఠశాలలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.అభిజిత్ దీప్కే ప్రస్తుత సమస్యను పరిష్కరించే ముందు ప్రస్తుత పరిస్థితి గురించి సమాచారం అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. దీంతో మీ మంత్రిత్వ శాఖ కింది వివరాలను బహిరంగంగా అందించాలని కోరుతున్నానని లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కింది పది పాయింట్లను వివరాలు అందించాలని కోరారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వ పాఠశాలలు పునరుద్ధరించబడ్డాయి? ప్రస్తుతం ఎన్ని మరమ్మతులు లేదా పూర్తి పునర్నిర్మాణం అవసరం. ప్రస్తుతం ఎన్ని ఉపాధ్యాయ పోస్టులు మంజూరు చేయబడ్డాయి? ఎన్ని భర్తీ అయ్యాయి? ఎన్ని ఖాళీగా ఉన్నాయి. గత ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలలకు ఎంత నిధులు కేటాయించబడ్డాయి? అందులో ఎంత ఖర్చు చేశారు? ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యకు సహేతుకమైన ప్రాప్యత ఉండేలా ఎన్ని అదనపు ప్రభుత్వ పాఠశాలలు అవసరం బోధనతో పాటు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు ఏ ఏ బోధనేతర విధులు, బాధ్యతలు అప్పగించబడ్డాయి? ప్రస్తుతం ఎన్ని ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్లు, డిజిటల్ లెర్నింగ్ సౌకర్యాలు, శుభ్రమైన పనిచేసే టాయిలెట్లు, సరైన క్రీడా సౌకర్యాలు & పరికరాలు ఉన్నాయి?అని అన్నిరాష్ట్రాల విద్యాశాఖలను ప్రశ్నించారు. ఇది రాజకీయం గురించి కాదని కేవలం విద్యార్థుల భవిష్యత్తు గురించి మాత్రమేనని లేఖలో పేర్కొన్నారు.ప్రతి విద్యార్థికి సురక్షితమైన తరగతి గది, శుభ్రమైన తాగునీరు, పనిచేసే టాయిలెట్, కూర్చోవడానికి బెంచీ, బోధించే ఉపాధ్యాయుడు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని కోరారు.మీ మంత్రిత్వ శాఖ ఈ సమాచారాన్ని బహిరంగం చేసి, అవసరమైన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం. అని లేఖలో పేర్కొన్నారు. -
తమిళనాడుకు సుప్రీంకోర్టు షాక్
సాక్షి, ఢిల్లీ: కావేరీ నదీ జలాల విడుదల వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నీటి వాటా విడుదలలో ఏవైనా అభ్యంతరాలు లేదా ఫిర్యాదులు ఉంటే వాటిని కావేరీ జలాల నిర్వహణ సంస్థ (CWMA) ముందే లేవనెత్తాలని తమిళనాడు ప్రభుత్వానికి స్పష్టం చేసింది. కర్ణాటక నుంచి తమకు రావాల్సిన అదనపు నిష్పత్తి నీటి వాటాను విడుదల చేసేలా ఆదేశించాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారించింది.వివరాల్లోకి వెళితే.. కావేరీ నీటి నియంత్రణ కమిటీ (CWRC) ఆగస్టు 12 నుండి 15 రోజుల పాటు ప్రతిరోజూ తమిళనాడుకు 12,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కర్ణాటకను ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని కావేరీ జలాల నిర్వహణ సంస్థ (CWMA) కూడా సమర్థించింది. అయితే వాటా న్యాయపరంగా తమకు దక్కడం లేదని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమిళనాడు తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సి.ఎస్. వైద్యనాథన్ వాదనలు వినిపిస్తూ, తమకు దక్కాల్సిన సరైన నిష్పత్తిలో నీరు అందడం లేదని ధర్మాసనానికి తెలిపారు. దురదృష్టవశాత్తూ క్షేత్రస్థాయిలో నీటి విడుదల సక్రమంగా జరగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం ఈ అంశాన్ని సంబంధిత అథారిటీ (CWMA) సమావేశంలోనే లేవనెత్తాలని సుప్రీంకోర్టు సూచించింది.గత విచారణలో కర్ణాటక ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ సమర్పించిన నీటి విడుదల వివరాల చార్ట్‌ను ధర్మాసనం ప్రస్తావించింది. ఆ చార్ట్ ప్రకారం CWMA ఆదేశాల మేరకే తమిళనాడుకు నీటిని విడుదల చేసినట్లు కనిపిస్తోందని బెంచ్ వ్యాఖ్యానించింది. దీనిపై వైద్యనాథన్ స్పందిస్తూ, నిష్పత్తి ప్రకారం నీటిని విడుదల చేయడానికి CWMA దిశా నిర్దేశం చేయడం లేదని, దీనివల్ల తమిళనాడులోని రైతులకు తాము ఒక్క చుక్క నీటిని కూడా విడుదల చేయలేకపోతున్నామని, కానీ కర్ణాటక మాత్రం తమ రైతులకు నీటిని ఇచ్చుకుంటోందని వాదించారు. దీంతో సుప్రీంకోర్టు ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 31కి వాయిదా వేస్తూ, ఆ రోజు నాటికి తాజా పరిస్థితిపై నివేదిక (అప్డేటెడ్ స్టేటస్) సమర్పించాలని ఇరు రాష్ట్రాలను ఆదేశించింది.అంతకుముందు ఆగస్టు 17న జరిగిన విచారణలో కూడా CWMA ఆదేశాలను కర్ణాటక తప్పనిసరిగా పాటించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.తమిళనాడు ప్రభుత్వం కోర్టుకు తెలిపిన వివరాల ప్రకారం, వర్షపాతం తక్కువగా ఉన్న ఈ సంవత్సరంలో తమకు రావలసిన న్యాయమైన వాటా దక్కడం లేదు. CWRC కేటాయించిన పరిమాణం కంటే, పొరుగున ఉన్న కర్ణాటక విడుదల చేసిన నీటి పరిమాణం చాలా తక్కువగా ఉందని తమిళనాడు తన పిటిషన్లో పేర్కొంది.జూలై 28న జరిగిన CWRC సమావేశంలో జూలై 29 నుండి 15 రోజుల పాటు రోజుకు 3,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కర్ణాటకను ఆదేశించినప్పటికీ, జూలై 29 నుండి ఆగస్టు 2 వరకు బిలిగుండ్లు వద్ద కేవలం 158 నుండి 550 క్యూసెక్కుల లోపే నీరు అందిందని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది.తమిళనాడు ప్రభుత్వం విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం.. ఆగస్టు 3 నాటికి కర్ణాటకలోని కేఆర్ఎస్, కబిని, హారంగి, హేమవతి జలాశయాలలో మొత్తం నీటి నిల్వ 77.537 టీఎంసీలుగా ఉంది. కాబట్టి తమిళనాడుకు చెందాల్సిన వాటాను నిష్పత్తి ప్రకారం విడుదల చేయడానికి కర్ణాటకకు ఎటువంటి ఇబ్బంది లేదని స్పష్టం చేసింది.కర్ణాటకలోని కేఆర్ఎస్, కబిని డ్యామ్‌ల క్యాచ్మెంట్ ఏరియాలలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా, బిలిగుండ్లు వద్ద తమిళనాడుకు అందాల్సిన నిష్పత్తి నీరు 26.954 టీఎంసీలుగా ఉండాలని పేర్కొంది. దీనితో పోలిస్తే కావేరీ జలాల నిర్వహణ సంస్థ (CWMA) కేటాయించిన 4.536 టీఎంసీలు చాలా తక్కువని తమిళనాడు ఆరోపించింది. మొత్తంగా కర్ణాటక ప్రభుత్వం తమిళనాడుకు ఇవ్వాల్సిన 26.954 టీఎంసీల న్యాయమైన వాటాను పంచుకోవడంలో విఫలమైందని తమిళనాడు ప్రభుత్వం తన అధికారిక ప్రకటనలో వెల్లడించింది. -
పాము కాటు.. సినిమాల్లో చూపించినట్లు నిజంగా చేయొచ్చా?
వర్షాకాలం వచ్చిందంటే చాలు.. పాముల సంచారం పెరుగుతుంది. పొలాలు, ఇళ్ల పరిసరాలు, గోదాములు, పొదలు.. ఇలా ఎక్కడైనా అవి కనిపించే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో పాము కాటు ఘటనలు కూడా పెరుగుతాయి. అయితే ఈ సీజన్లో దేశవ్యాప్తంగా తాజా గణాంకాలు మరీ ఆందోళనకరంగా ఉన్నాయి. సకాలంలో చికిత్స అందకపోవడం ఒక కారణమైతే.. కొన్ని నిర్ణయాలు పరిస్థితిని మరింత విషమంగా మారుస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. చాలా సందర్భాల్లో పాము విషం కంటే.. కాటు తర్వాత మనుషులు చేసే పొరపాట్లే ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఆలస్యం చేయకుండా సరైన వైద్య సహాయం పొందడం లేదు. దానికి బదులు సొంత వైద్యంతో సరిపెట్టుకుంటున్నారు. ఇదే ప్రాణాలు పోవడానికి కారణమవుతోంది. అదే సమయంలో మరికొందరు.. తాత్కాలిక ఉపశమనం పేరిట చేస్తున్న ప్రయత్నాలు కూడా మరణాల సంఖ్యను పెంచుతున్నాయి. అలాంటప్పుడు పాము కాటు వేసిన చోట కోత పెట్టడం.. నోటితో విషాన్ని పీల్చే ప్రయత్నం చేయడం, ఆకుపసరుల్లాంటివి రాయడం, కాటేసిన చోట గట్టిగా తాడు.. గుడ్డలు కట్టడం, పామును పట్టుకోవడానికి ప్రయత్నించడం ఇలా సినిమాల్లో చూపించినట్లు చేయడం కరెక్ట్ కాదా?.. వైద్యులు, నిపుణులు ఏం చెబుతున్నారంటే.. నోటితో విషం పీల్చొచ్చా?పాము కాటు వేసిన వెంటనే చాలామందికి గుర్తొచ్చేది సినిమాల్లో కనిపించే సన్నివేశాలే. కాటు వేసిన చోట కోత పెట్టి.. నోటితో విషాన్ని పీల్చడం ద్వారా ప్రాణాలు కాపాడినట్లు సినిమాల్లో చూపిస్తారు. పొలం పనులు చేసుకునేవాళ్లు.. ఎక్కువగా ఇదే చేస్తుంటారని, ఆ తర్వాత ఆకుపసరులాంటివి రాయడం చేస్తుంటారని గుర్తు చేస్తున్నారు. కానీ వాస్తవంలో ఇది పూర్తిగా తప్పు పద్ధతి అని వైద్యులు చెబుతున్నారు. నోటితో విషాన్ని పీల్చడం వల్ల శరీరంలోకి వెళ్లిన విషాన్ని బయటకు తీయడం సాధ్యం కాదని.. పైగా నోటిలో గాయాలు ఉంటే ప్రమాదం పెరగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే కాటు వేసిన ప్రాంతంలో కోతలు పెట్టడం వల్ల రక్తస్రావం, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు రావచ్చు కూడా. గట్టిగా కట్టడం కూడా ప్రమాదమేపాము కాటు తర్వాత చాలామంది విషం వ్యాపించకుండా ఉండేందుకు కాటేసిన పైభాగంలో తాడు, గుడ్డను బిగుతుగా కడుతుంటారు. కానీ ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ ఆగిపోయి కణజాలం దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. కాటు వేసిన అవయవాన్ని కదలకుండా స్థిరంగా ఉంచడం మాత్రమే చేయాలి. బిగుతైన వస్తువులు, ఉంగరాలు, గాజులు, కడియాలు ఉంటే వెంటనే తొలగించాలి. వాపు పెరిగితే ఇవి సమస్యగా మారొచ్చు.ముందుగా చేయాల్సింది ఇదేపాము కాటుకు గురైన వ్యక్తిని ముందుగా ప్రశాంతంగా ఉంచాలి. భయం, ఆందోళన వల్ల గుండె వేగం పెరిగి రక్త ప్రసరణ వేగవంతం కావడంతో విషం వ్యాప్తి చెందే అవకాశం పెరగవచ్చు. కాటు వేసిన చేతి లేదా కాలును ఎక్కువగా కదపకుండా చూడాలి. బాధితుడు స్వయంగా నడిచి వెళ్లకుండా.. ఇతరుల సహాయంతో వీలైనంత త్వరగా ఆసుపత్రికి తరలించాలి.పామును పట్టుకోవాలా?..కాటు వేసిన పాము ఏదో తెలుసుకుంటే చికిత్స సులభమవుతుందని చాలామంది భావిస్తారు. దీంతో కొందరు పామును పట్టుకోవడానికి లేదా చంపడానికి ప్రయత్నిస్తారు. ఇది మరింత ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పాము రంగు, ఆకారం వంటి వివరాలను దూరం నుంచి గుర్తుంచుకుంటే సరిపోతుంది. పామును పట్టుకుని ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు.లక్షణాలు కనిపించకపోయినా జాగ్రత్తప్రతి పాము కాటులోనూ విషం శరీరంలోకి వెళ్లకపోవచ్చు. కానీ కాటు విషపూరితమా కాదా అనేది సాధారణ వ్యక్తులు వెంటనే గుర్తించడం కష్టం. అందుకే ప్రతి పాము కాటును అత్యవసర పరిస్థితిగానే పరిగణించాలని వైద్యులు సూచిస్తున్నారు. కొన్ని పాముల విషం నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. మరికొన్ని రక్తం గడ్డకట్టే ప్రక్రియను దెబ్బతీస్తాయి. ఇంకొన్ని కణజాలాలు, కిడ్నీలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్రమైన వాపు, బలహీనత, రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అత్యవసర చికిత్స అవసరం.యాంటీ స్నేక్ వెనం ఎప్పుడు ఇస్తారు?పాము కాటు వేసిన ప్రతి ఒక్కరికీ యాంటీ స్నేక్ వెనం (ఏఎస్వీ) అవసరం ఉండకపోవచ్చు. బాధితుడి పరిస్థితి, లక్షణాలు, వైద్య పరీక్షల ఆధారంగా వైద్యులు నిర్ణయం తీసుకుంటారు. అయితే విష ప్రభావం ఉన్నట్లు గుర్తిస్తే ఆలస్యం చేయకుండా ఏఎస్వీ అందించడం కీలకం. అందుకే పాము కాటు తర్వాత ఇంటి చిట్కాలపై ఆధారపడకుండా ఆసుపత్రికి చేరుకోవడమే అత్యంత ముఖ్యం.ఆ ఐదు నిమిషాలే డిసైడ్ చేస్తాయిపాము కాటు వేసినప్పుడు భయం సహజం. కానీ ఆ భయంతో చేసే పొరపాట్లే ప్రమాదాన్ని పెంచుతాయి. నోటితో విషం పీల్చడం, కోతలు పెట్టడం, తాడు బిగించడం, పామును పట్టుకోవడం వంటి చర్యలకు దూరంగా ఉండాలి. పాము కాటు వేస్తే.. ముందుగా విషంతో కాదు.. అపోహలతో పోరాడాలి. సరైన సమయంలో సరైన చికిత్స పొందితే ప్రాణాలను కాపాడుకోవచ్చు.ఇదీ చదవండి: నేనంటే దెయ్యాలకు హడల్.. నా కౌగిలికి వచ్చేయండి -
ఎస్ఐఆర్పై మాజీ దౌత్యవేత్త అసహనం.. పౌరసత్వం నిరూపించుకోవాలా?
ఢిల్లీ: భారత్ తరపున పలు దేశాల్లో రాయబారిగా పనిచేసిన తననే ఎస్ఐఆర్ పేరుతో తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని మాజీ దౌత్యవేత్త నవదీప్ సూరి అసహానం వ్యక్తం చేశారు. తన ఓటరు వివరాలు 2003 నాటి రికార్డులతో సరిపోలడం లేదని, భారత పౌరసత్వాన్ని నిరూపించేందుకు పత్రాలు సమర్పించాలని అధికారులు కోరినట్లు ఆయన తెలిపారు.ఓటర్ల జాబితా సవరణ కోసం చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై పలు ప్రశ్నలు లేవనెత్తారు.గతంలోనవదీప్ సూరి యూఏఈ, ఈజిప్ట్ సహా పలు దేశాల్లో భారత రాయబారిగా పనిచేశారు. అంతేకాకు ఆయన ఆస్ట్రేలియాలో భారత హైకమిషనర్‌గానూ సేవలందించారు.పంజాబ్‌లో SIR ప్రక్రియలో తనకు ఎదురైన అనుభవాన్ని ఆయన ఆదివారం వరుస పోస్టుల ద్వారా వెల్లడించారు.ఆయన మాటల్లో “పంజాబ్‌లో SIR విషయంలో నా అనుభవాన్ని పంచుకుంటున్నాను. BLO (బూత్ లెవల్ ఆఫీసర్) వద్దకు వెళ్లి ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు సమర్పించాను. అన్నీ సక్రమంగానే ఉన్నాయని నాకు హామీ ఇచ్చారు. అయితే ఈరోజు ఒక వాలంటీర్ నుంచి సందేశం వచ్చింది. 2003 నాటి SIR వివరాలతో కొన్ని అంశాలు సరిపోలడం లేదని అందులో తెలిపారు” అని పేర్కొన్నారు.“నోటీసు తీసుకునేందుకు రావాలని, ఆ తర్వాత నేను భారతీయ పౌరుడినని నిరూపించే కొన్ని నిర్దిష్టంగా పేర్కొనని పత్రాలతో మళ్లీ రావాలని చెప్పారు. నేను 2003లో భారత్‌లో లేనని చెప్పాను. దాంతో పాస్‌పోర్ట్‌ను ఆధారంగా చూపించాలని వారు సూచించారు” అని ఆయన తెలిపారు. తన వద్ద ఓటర్ ఐడీ, ఆధార్‌తో పాటు ఇతర పత్రాలు కూడా ఉన్నాయని సూరి చెప్పారు. అయితే, “మూడు దేశాల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన తర్వాత కూడా నా పౌరసత్వాన్ని నిరూపించుకోవడంలో నాకు ఇబ్బంది ఎదురైతే, సాధారణ పౌరుడి పరిస్థితి ఏమిటి?” అని ఆయన ప్రశ్నించారు. కాగా ఎస్ఐఆర్ ప్రక్రియలో గతంలోనూ కొంతమంది ప్రముఖులకు ఇలాంటి ఘటనలే ఎదురయ్యాయి. దీంతో సంబంధిత రికార్డులను పరిశీలించిన తర్వాత వాటిని అధికారులు స్పష్టీకరించి పరిష్కరించారు. -
8 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ జాబ్స్?
ఢిల్లీ: ప్రస్తుతం దేశాన్ని పీడిస్తున్న సమస్యలలో నిరుద్యోగం ప్రధానమైనది. ఏళ్ల తరబడి పెద్ద పెద్ద చదువులు చదివినా దానికి సరిపడా ఉద్యోగం దొరకక యువతంతా ఉద్యోగాల కోసం తల్లడిల్లిపోతున్నారు. పెద్దచదువులు చదివినా దాని సరిపడా ఉద్యోగం దొరకక చిన్నా చితక జాబ్‌తో సరిపెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నిరుద్యోగులకు ఒక గుడ్ న్యూస్ అందింది. దేశంలో కేవలం కేంద్ర ప్రభుత్వంలోనే ఎనిమిది లక్షలకు పైగా ఉద్యోగ ఖాళీలున్నట్లు కేంద్రం తెలిపింది.నీమచ్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ ఉద్యోగాల ఖాళీలపై ఆర్టీఐ దాఖలు చేశారు. దానికి బదులిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని పే రీసెర్చ్ యూనిట్ 2024 మార్చి 1 నాటి గణాంకాలను వివరాలను వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సివిలియన్ ఉద్యోగాల్లో ఏకంగా 8,23,656 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు తెలిపాయి. ఈ లెక్కల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థలు PSUలను మినహాయించుకొని ఈ లెక్కలు ప్రకటించింది. ఇందులో అత్యధిక ఖాళీలు రక్షణ మంత్రిత్వ శాఖ సివిలియన్ విభాగంలో ఉన్నాయి. మొత్తం 5,56,248 పోస్టులు మంజూరై ఉండగా కేవలం 3,14,005 మంది మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో 2,42,243 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇది మొత్తం మంజూరైన పోస్టుల్లో దాదాపు 43.5 శాతం. అయితే ఈ సంఖ్యలు సైన్యం, నేవీ, వైమానిక దళంలోని ఉద్యోగాలకు సంబంధించినవి కావని, కేవలం రక్షణ శాఖ సివిలియన్ ఉద్యోగాలకే సంబంధించినవని అధికారులు స్పష్టం చేశారు.రైల్వేలోదేశంలో అతిపెద్ద ప్రభుత్వ ఉద్యోగ సంస్థల్లో ఒకటైన రైల్వేల్లోనూ భారీగా ఖాళీలు ఉన్నాయి. రైల్వేల్లో 14,79,701 పోస్టులు మంజూరై ఉండగా 12,39,576 మంది మాత్రమే ఉద్యోగాల్లో ఉన్నారు. దీంతో 2,40,125 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రైల్వేల్లోని ఖాళీలే ఆర్టీఐ ద్వారా వెల్లడైన మొత్తం ఖాళీల్లో దాదాపు 30 శాతం కావడం గమనార్హం. హోం మంత్రిత్వ శాఖఅంతర్గత భద్రత, పరిపాలనలో కీలకమైన కేంద్ర హోం మంత్రిత్వ శాఖలో 1,10,885 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ శాఖలో మొత్తం 11,18,233 పోస్టులు మంజూరై ఉండగా 10,07,348 మంది మాత్రమే పనిచేస్తున్నారు. రక్షణ శాఖ సివిలియన్ విభాగం, రైల్వేలు, హోం శాఖలను కలిపితే దాదాపు 5.93 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే మొత్తం ఖాళీల్లో దాదాపు మూడొంతులు ఈ మూడు ప్రధాన సంస్థల్లోనే ఉన్నాయి.పోస్టల్డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్‌లో 2,53,124 పోస్టులకు గాను 1,91,578 మంది పనిచేస్తున్నారు. దీంతో 61,546 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూలో 1,79,374 పోస్టులు మంజూరై ఉండగా 1,09,712 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. దీంతో 69,662 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇది మంజూరైన పోస్టుల్లో దాదాపు 39 శాతం కావడం విశేషం.వ్యవసాయంవ్యవసాయం, పశుసంవర్ధక రంగాల్లోనూ సిబ్బంది కొరత కనిపిస్తోంది. వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖలో 5,420 పోస్టులకు గాను 3,565 మంది మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో 1,855 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖలో 2,393 పోస్టులకు గాను కేవలం 1,015 మంది పనిచేస్తుండగా 1,378 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే ఈ శాఖలో దాదాపు 58 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి.పర్యావరణ శాఖపర్యావరణ శాఖలోనూ పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖలో 5,127 పోస్టులకు గాను 3,170 మంది మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో 1,957 పోస్టులు, అంటే దాదాపు 38 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖలో 6,302 పోస్టులకు గాను 3,684 మంది మాత్రమే పనిచేస్తుండగా 2,618 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.ఆరోగ్య రంగంఆరోగ్య రంగంలోనూ ఖాళీలు ఉన్నాయి. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో 27,427 పోస్టులకు గాను 25,845 మంది పనిచేస్తున్నారు. దీంతో 1,582 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆరోగ్య పరిశోధన శాఖలో 62 పోస్టులకు గాను కేవలం 28 మంది మాత్రమే పనిచేస్తుండగా 34 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆయుష్ శాఖలో 432 పోస్టులకు గాను 199 మంది మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో 233 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.దేశంలోని శాస్త్ర, సాంకేతిక రంగాలకు చెందిన కీలక శాఖల్లోనూ ఖాళీలు ఉన్నాయి. అణుశక్తి శాఖలో 37,250 పోస్టులకు గాను 27,016 మంది మాత్రమే పనిచేస్తుండగా 10,234 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంతరిక్ష శాఖలో 19,200 పోస్టులకు గాను 15,074 మంది పనిచేస్తున్నారు. దీంతో 4,126 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలో కూడా 1,681 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.దేశ అత్యున్నత పరిపాలనా కార్యాలయాల్లోనూ ఖాళీలు ఉండటం గమనార్హం. రాష్ట్రపతి సచివాలయంలో 803 పోస్టులు మంజూరై ఉండగా 516 మంది మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో 287 పోస్టులు, అంటే 35.74 శాతం ఖాళీగా ఉన్నాయి. ఇక ప్రధానమంత్రి కార్యాలయంలో (PMO) 441 పోస్టులకు గాను 315 మంది మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో 126 పోస్టులు, అంటే 28.57 శాతం ఖాళీగా ఉన్నాయి.ఈ భారీ ఖాళీలపై ఆర్టీఐ కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో నిరుద్యోగం, ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పెరుగుతున్న సమయంలో ఇంత పెద్ద సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉండటం ఆందోళనకరమని పేర్కొన్నారు. యువతకు ఉపాధి కల్పించడంతో పాటు ప్రభుత్వ శాఖల పనితీరు మెరుగుపడేందుకు ఈ ఖాళీలను అత్యంత ప్రాధాన్యతతో, మిషన్ మోడ్‌లో భర్తీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. -
రన్‌వేను తాకిన ఇండిగో విమానం.. గో-అరౌండ్తో 178 మంది సేఫ్
లక్నో: ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్‌లో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. 178 మంది ప్రయాణికులు, సిబ్బందితో ఢిల్లీ నుంచి గోరఖ్‌పూర్ వెళ్తున్న ఇండిగో ఫ్లైట్ 6E 2381 ల్యాండింగ్ సమయంలో విమానం వెనుక భాగం రన్‌వేను తాకింది. దీంతో వెంటనే అప్రమత్తమైన ఫైలట్ వెంటనే గో-అరౌండ్ చేసి విమానాన్ని మళ్లీ గాల్లోకి తీసుకెళ్లడంతో పెనుప్రమాదం తప్పింది. అనంతరం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) నుంచి అనుమతి తీసుకుని కొద్దిసేపటి తర్వాత విమానాన్ని రెండో ప్రయత్నంలో సురక్షితంగా విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. విమానం ల్యాండ్ అయిన తర్వాత నిర్వహించిన సాధారణ తనిఖీల్లో దాని వెనుక భాగంలోని ఆక్సిలరీ పవర్ యూనిట్ (APU) సమీపంలో గీతలు, రాపిడి గుర్తులు కనిపించాయి. దీంతో విమానాన్ని తాత్కాలికంగా సేవల నుంచి తొలగించారు.ప్రస్తుతం విమానంపై సాంకేతిక తనిఖీలు, మరమ్మతులు జరుగుతున్నాయని అవసరమైన సాంకేతిక అనుమతులు లభించిన తర్వాత మాత్రమే విమానాన్ని తిరిగి కార్యకలాపాల్లోకి తీసుకురానున్నట్లు ఇండిగో సిబ్బంది ప్రకటించారు. ఈ ప్రభావంతో గోరఖ్‌పూర్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో ఫ్లైట్ 6E-5013 సుమారు 5 గంటల 30 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరింది. కాగా ఇటీవల ఇండిగో విమానంలో తరచుగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కోల్‌కతా–చెన్నై 6E-723 విమానంలో ల్యాండింగ్‌కు ముందు ఎడమ ఇంజిన్ పనిచేయకుండా పోయింది. చెన్నైలో ఫుల్ ఎమర్జెన్సీ ప్రకటించగా, 224 మంది ఉన్న విమానం ఒక ఇంజిన్‌తో సురక్షితంగా ల్యాండ్ అయింది.ఆగస్టు 13న భువనేశ్వర్–కోల్‌కతా ఇండిగో విమానంలో ప్రయాణికులు ఎక్కుతున్న సమయంలో పైలట్ సాంకేతిక సమస్యను గుర్తించారు. భద్రతా కారణాలతో ఆ విమానాన్ని రద్దు చేశారు. ఇలాంటి ఘటనలు తరుచుగా జరగడం ప్రయాణికులకు ఆందోళన కలిగించే విషయం -
యుమునా నది వివాదం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ఢిల్లీ: ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. 2016లో ఢిల్లీలోని యమునా నది వరద మైదానాల్లో నిర్వహించిన ‘వరల్డ్ కల్చర్ ఫెస్టివల్’ కారణంగా పర్యావరణానికి నష్టం జరిగిందన్న ఆరోపణలపై విధించిన రూ.5 కోట్ల జరిమానాను తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ఈ కార్యక్రమం వల్ల యమునా నది సున్నితమైన పర్యావరణ వ్యవస్థకు నష్టం జరిగినట్లు నిర్ధారించే ప్రత్యక్ష ఆధారాలు లేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలోని రిజిస్టర్డ్ పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ వ్యక్తి వికాస్ కేంద్ర చెల్లించిన రూ.5 కోట్ల మొత్తాన్ని ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (DDA) తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ఈ రోజు శనివారం ఈకేసును విచారించిన సుప్రీంక్రోర్టు కీలక తీర్పు ఇచ్చింది.2017లో ఎన్జీటీ జరిమానా2016 మార్చి 11 నుంచి 13 వరకు ఢిల్లీలో యమునా నది ఒడ్డున ‘వరల్డ్ కల్చర్ ఫెస్టివల్’ నిర్వహించారు. కార్యక్రమం కోసం యమునా వరద మైదానాలను సిద్ధం చేయడం వల్ల పర్యావరణానికి నష్టం జరిగిందని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ వ్యవహారంపై విచారణ జరిపిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) 2017 డిసెంబర్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్‌ను నష్టానికి బాధ్యులుగా పేర్కొంది. పర్యావరణ నష్టానికి పరిహారంగా రూ.5 కోట్ల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. అయితే ఆ కేసుపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు తాజాగా ఆ కేసులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ తప్పిదమేమి లేదని తేల్చింది. పర్యావరణానికి జరిగిన నష్టాన్ని కార్యక్రమంతో నేరుగా అనుసంధానించే ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది.DDAపైనాా సుప్రీంకోర్టు ఆగ్రహంఈ సందర్భంగా యమునా వరద మైదానాలను పరిరక్షించడంలో DDA తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.అదే సమయంలో, యమునా వరద మైదానాల పునరుద్ధరణకు సంబంధించి NGT ఇచ్చిన ఆదేశాల ప్రకారం చేపట్టిన పనులను DDA కొనసాగించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారం చాలా ఏళ్ల పాటు సుప్రీంకోర్టులో ఎన్నో ఏళ్లపాటు న్యాయపోరాటంగా కొనసాగగా తాజా సుప్రీం తీర్పుతో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకు ఉపశమనం లభించింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీ శ్రీ రవిశంకర్ 1981లో స్థాపించారు. -
తేజస్ ఎంకే-2 సరిపోవు.. వాయుసేన మాజీ అధికారి సంచలన వ్యాఖ్యలు
భారతీయ వాయుసేన (IAF) మాజీ వైస్ చీఫ్ ఎయిర్ మార్షల్ నాగేష్ కపూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2030ల మధ్య నాటికి సర్వీసులోకి రానున్న 'తేజస్ ఎంకే-2' యుద్ధ విమానాలు ఫ్రంట్‌లైన్ పాత్రలో ఆపరేషనల్‌గా అంతగా ఉపయోగపడవని ఆయన స్పష్టం చేశారు .చైనా,పాక్ లు అత్యాధునిక 5,6వ తరగతి యుద్ధ విమానాలను సమకూర్చుకుంటున్న నేపథ్యంలో, కేవలం 4వ తరగతికి చెందిన తేజస్ ఎంకే-2పై భారత్ పూర్తిగా ఆధారపడటం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో స్వదేశీ యుద్ధ విమానాల తయారీ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత సరిహద్దుల్లో వ్యూహాత్మక సవాళ్లు ఎదురవుతున్న తరుణంలో, హెచ్ఏఎల్ (HAL) సంస్థ తీవ్రమైన జాప్యం ప్రదర్శిస్తోందని ఎయిర్ మార్షల్ మండిపడ్డారు. తేజస్ ఎంకే-1ఏ (Tejas Mk-1A) విమానాల సరఫరాలో తీవ్ర ఆలస్యం జరుగుతోందని, అమెరికాకు చెందిన జీఈ ఎఫ్404 ఇంజిన్ల డెలివరీలో వైఫల్యం విడిభాగాల అనుసంధాన సమస్యలే దీనికి కారణమని వెల్లడించారు. ఇచ్చిన మాట ప్రకారం నిర్దేశిత సమయానికి విమానాలను అందించడంలో హెచ్ఏఎల్ విఫలమవుతోందని, వాయుసేనకు ఉన్న అత్యవసర పరిస్థితి ఆ సంస్థలో కనిపించడం లేదని ఆరోపించారు.తేజస్ ఎంకే-2 మొదటి విమాన ప్రయోగం అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చి, ప్రస్తుతం 2027 మధ్యకాలానికి మళ్లింది. ఈ నేపథ్యంలో భారత్ కేవలం స్వదేశీ అభివృద్ధి కోసం దశాబ్దాల పాటు వేచి చూడకుండా, అంతర్జాతీయ భాగస్వామ్యాల వైపు మొగ్గాలని ఎయిర్ మార్షల్ సూచించారు. యూరప్‌కు చెందిన ఎఫ్సీఏఎస్ (FCAS) లేదా జీసీఏపీ (GCAP) వంటి ప్రతిష్టాత్మక 6వ తరగతి యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్ట్‌లలో భారత్ భాగస్వామి కావాలని ఆయన గట్టిగా వాదించారు.మరోవైపు, భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తొలి స్వదేశీ స్టెల్త్ ఫైటర్ ప్రాజెక్ట్ 'ఏఎంసీఏ' (AMCA) నుంచి హెచ్ఏఎల్ సంస్థను తొలగించడం గమనార్హం. ఆర్థిక, పారిశ్రామిక అర్హతల ప్రాతిపదికన ప్రైవేట్ రంగ కంపెనీలకే ప్రాధాన్యం దక్కింది. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, ఎల్&టీ-బీఈఎల్,భారత్ ఫోర్జ్-బీఈఎల్ కన్సార్టియమ్లు ఈ ప్రాజెక్ట్ రేసులో ముందుకు దూసుకెళ్లాయి.మొత్తంగా చూస్తే, సరికొత్త సాంకేతికతతో కూడిన 5వ, 6వ తరగతి విమానాలను సమీకరించడంలో భారత్ వేగం పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే రాబోయే దశాబ్దాల్లో గగనతల రక్షణ రంగంలో సాంకేతిక అంతరాలు ఏర్పడే ప్రమాదం ఉందని యుద్ధ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.. స్వదేశీ తయారీ అత్యంత కీలకమైనప్పటికీ, కాలానికి తగినట్లుగా వేగంగా స్పందించాల్సిన అవసరం సైతం ఎంతైనా ఉందని పేర్కొంటున్నారు.హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) అనేది భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఏకైక ప్రభుత్వ రంగ విమాన తయారీ సంస్థ.రక్షణ రంగంలో భారతదేశాన్ని స్వయంసమృద్ధ (ఆత్మనిర్భర్) దేశంగా మార్చడానికి, విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఈ సంస్థ ద్వారా యుద్ధ విమానాలను తయారు చేయిస్తుంది. విదేశాల (రష్యా, ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాల) నుండి యుద్ధ విమానాలను భారీ వ్యయంతో కొనుగోలు చేయడం కంటే, దేశీయంగానే సొంత సాంకేతికతను అభివృద్ధి చేసుకోవడం దీని ప్రధాన లక్ష్యం -
బీజేపీలో నితిన్ మార్క్ షురూ.. తొలి రోజే ఎన్నికల రోడ్‌మ్యాప్ సిద్ధం!
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నూతనంగా నియమితులైన జాతీయ కార్యవర్గంతో శనివారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, యువతకు మరింత చేరువకావడం తదితర అంశాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు.త్వరలో జరగనున్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా అసెంబ్లీ ఎన్నికల కార్యాచరణతో పాటు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. అత్యంత పిన్న వయస్కుడైన బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నిలిచిన నబీన్.. త్వరలోనే వివిధ రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు, ఇన్‌ఛార్జులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. Delhi: BJP national president Nitin Nabin chaired an introductory meeting with the BJP’s new team of national office-bearers at the party headquarters in Delhi(Source: ANI Picture Service) pic.twitter.com/deDwtFmgNw— ANI (@ANI) August 22, 2026ఇటీవలే ప్రకటించిన 65 మంది సభ్యుల నూతన కార్యవర్గంలో 13 మంది జాతీయ ఉపాధ్యక్షులు, 8 మంది ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. ఉపాధ్యక్షులుగా వసుంధర రాజే సింధియా, తీరథ్ సింగ్ రావత్, రామ్ మాధవ్ తదితరులు నియమితులయ్యారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా (సంస్థాగత) బీఎల్ సంతోష్ కొనసాగుతుండగా, సంయుక్త ప్రధాన కార్యదర్శులుగా శివప్రకాష్, సౌదాన్ సింగ్ వ్యవహరించనున్నారు. వినోద్ తావ్డే, సునీల్ బన్సల్, బిప్లవ్ కుమార్ దేవ్, స్మృతి ఇరానీ, సతీష్ పూనియా, గజేంద్ర పటేల్, హరీష్ ద్వివేది, సంజయ్ భాటియా ప్రధాన కార్యదర్శులుగా బాధ్యతలు చేపట్టారు.జాతీయ కోశాధికారిగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నియమితులయ్యారు. ఐటీ విభాగాధిపతిగా అమిత్ మాల్వియా స్థానంలో దీపక్ మ్హాస్కే, యువమోర్చా అధ్యక్షుడిగా తేజస్వి సూర్య స్థానంలో హేమాంగ్ జోషిని నియమించారు. నూతన కార్యవర్గానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘ఎక్స్ ’వేదికగా శుభాకాంక్షలు చెబుతూ.. అనుభవం, యువశక్తి కలగలసిన ఈ బృందం ప్రజాసేవలో ముందంజలో ఉంటుందని ఆకాంక్షించారు.ఇది కూడా చదవండి: అమెరికా వీసా రూల్స్ దెబ్బకు భారతీయ జంట విలవిల -
జమ్ముకశ్మీర్‌పై అమెరికా రాయబారి కీలక వ్యాఖ్యలు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌పై భారత్‌లోని అమెరికా రాయభారి కీలక ప్రకటన చేశారు. జమ్మూకశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని అమెరికా రాయబారి సెర్జియో గోర్ స్పష్టం చేశారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు బుధవారం శ్రీనగర్‌కు వచ్చిన ఆయన జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా అమెరికా ట్రావెల్ అడ్వైజరీపై సైతం పలు కీలక వ్యాఖ్యలు చేశారు.ఒమర్ అబ్దుల్లాతో జరిగిన సమావేశంపై గోర్ మాట్లాడుతూ.. ‘‘ కాశ్మీర్ భారత్‌లోని ముఖ్యమైన భాగం. నేను తొలిసారి ఇక్కడికి వచ్చాను. ఇది అద్భుతమైన అందమైన ప్రాంతం మా సమావేశం ఎంతో స్నేహపూర్వకంగా జరిగింది. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఎదురుచూస్తున్నాం’’ అని తెలిపారు. గోర్‌తో జరిగిన భేటీపై ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. అమెరికా-భారత్ సంబంధాలపై, ముఖ్యంగా జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ‘‘మాకు చాలా మంచి సమావేశం జరిగింది. ఇరు దేశాల సంబంధాలపై చర్చించే అవకాశం లభించింది. ముఖ్యంగా జమ్మూకశ్మీర్‌కు అమెరికా ఏ విధంగా సహకరించగలదనే అంశంపై మాట్లాడాం. కొన్ని పాత సమస్యలు ఉన్నాయి. వాటిని కాలక్రమంలో పరిష్కరించేందుకు మేము కృషి చేస్తాం. ఈ చర్చలను మరింత ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నాం’’ అని ఆయన అన్నారు.వాషింగ్టన్, న్యూఢిల్లీ, శ్రీనగర్ మధ్య ఈ చర్చలు కొనసాగుతాయని ఒమర్ అబ్దుల్లా చెప్పారు. ‘‘అమెరికా, జమ్మూకశ్మీర్ మధ్య సంబంధాలు రాబోయే సంవత్సరాల్లో మరింత విస్తరించి, బలోపేతం అవుతాయని మేము ఎంతో ఆశాభావంతో ఉన్నాం’’ అని తెలిపారు.అమెరికా ట్రావెల్ అడ్వైజరీపై కీలక వ్యాఖ్యలుగోర్ పర్యటనలో అత్యంత కీలకమైన అంశాల్లో అమెరికా జారీ చేసిన జమ్మూకశ్మీర్ ప్రయాణ హెచ్చరిక సైతం ఒకటి. అమెరికా తన పౌరులకు జారీ చేసే ట్రావెల్ అడ్వైజరీలను క్రమం తప్పకుండా సమీక్షిస్తుందని గోర్ తెలిపారు. జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన ప్రస్తుత ప్రయాణ హెచ్చరికను కూడా పునఃపరిశీలించే అవకాశం ఉందని ఆయన సూచించారు.కాశ్మీర్ లోయలో భద్రతా పరిస్థితులు మెరుగుపడుతున్నాయని ప్రశంసించిన గోర్.. ట్రావెల్ అడ్వైజరీని మార్చడంపై తాను ప్రస్తుతం ఎలాంటి ‘‘పెద్ద ప్రకటన’’ చేయలేనని స్పష్టం చేశారు. అయితే దానిని తగ్గించే అంశాన్ని అమెరికా ప్రభుత్వం పరిశీలించవచ్చని చెప్పారు.‘‘ఈ ప్రాంతాన్ని మరింత సురక్షితంగా, భద్రంగా మార్చేందుకు న్యూఢిల్లీ, ఇక్కడి ముఖ్యమంత్రి, జమ్మూకశ్మీర్ ప్రభుత్వం కొన్ని అద్భుతమైన చర్యలు తీసుకున్నాయని మేము భావిస్తున్నాం. అందువల్ల అమెరికా తన పౌరులకు జారీ చేసిన ప్రయాణ హెచ్చరికను తగ్గించాల్సిన అవసరం ఉందా అనే విషయాన్ని మేము పరిశీలిస్తాం’’ అని గోర్ తెలిపారు.‘‘ఇది ఎంతో అందమైన ప్రాంతం. చాలా మంది అమెరికన్లు ఇక్కడికి వచ్చి ఈ ప్రాంత అందాలను ఆస్వాదిస్తారని నేను భావిస్తున్నాను’’ అని ఆయన అన్నారు.ప్రస్తుతం అమెరికా ట్రావెల్ అడ్వైజరీలో ఎలాంటి మార్పును అధికారికంగా ప్రకటించలేదు. అయితే గోర్ వ్యాఖ్యలు మాత్రం ఈ అంశాన్ని వాషింగ్టన్ పరిశీలిస్తున్నట్లు సూచిస్తున్నాయి. జమ్మూకశ్మీర్ ప్రభుత్వం అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో అమెరికా ప్రయాణ హెచ్చరికను సడలిస్తే కాశ్మీర్ పర్యాటక రంగానికి మరింత ఊతం లభించే అవకాశం ఉంది.గతంలోనూ అమెరికా దౌత్యవేత్తలు జమ్మూకశ్మీర్‌ను సందర్శించారు. ముఖ్యంగా 2024 జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయపరమైన కార్యక్రమాల సందర్భంగా అమెరికా దౌత్యవర్గాలు ఈ ప్రాంతంలో పర్యటించాయి. అయితే గోర్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జమ్మూకశ్మీర్‌ను ‘‘భారత్‌లో ముఖ్యమైన భాగం’’గా ఆయన పేర్కొనడం, అదే సమయంలో అమెరికా ట్రావెల్ అడ్వైజరీని తగ్గించే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పడం న్యూఢిల్లీతో పాటు శ్రీనగర్‌లోనూ చర్చనీయాంశంగా మారింది.ఆపరేషన్ సిందూర్ తర్వాత జమ్మూకశ్మీర్‌లో గోర్ పర్యటించడం ఇదే తొలిసారి. ఆయన అమెరికా రాయబారిగా మాత్రమే కాకుండా.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల ప్రత్యేక ప్రతినిధిగానూ వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. ప్రాంతీయంగా వ్యూహాత్మక పరిణామాలు వేగంగా మారుతున్న సమయంలో అమెరికా నుంచి జమ్మూకశ్మీర్‌కు ఉన్నతస్థాయి దౌత్యపరమైన పర్యటన జరగడం ప్రాధాన్యంగా మారింది.గతంలో పలుమార్లు వివాదాస్పదంగాకాగా గతంలో పలుమార్లు అమెరికా జమ్ముకశ్మీర్ విషయంలో వివాదాస్పదంగా వ్యాఖ్యానించింది. 2003లో అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ అధికారిక మార్గదర్శకాల్లో కశ్మీర్ ప్రాంతం భారత్, పాకిస్థాన్, చైనా ఆధీనంలోని ప్రాంతాలతో కూడిన “disputed region” అని పేర్కొంది. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత కూడా అమెరికా తన విధానంలో ఎలాంటి మార్పు లేదని, భారత్, పాకిస్థాన్ కశ్మీర్‌పై నేరుగా చర్చించుకోవాలని చెప్పింది. 2021లోనూ బైడెన్ ప్రభుత్వం ఇదే వైఖరిని కొనసాగిస్తూ కు మద్దతు ఇస్తున్నట్లు తెలిపింది. ఈనేపథ్యంలో ప్రస్తుతం సెర్గియో గోర్ ఈవిధంగా వ్యాఖ్యానించడం గమనార్హం. -
భోపాల్ రోడ్లపై కదం తొక్కిన విద్యార్థులు
భోపాల్: ఇటీవల కాలంలో జెన్-జీ ఉద్యమం దేశవ్యాప్తంగా ఎంత ప్రాముఖ్యత సంపాదించిందో తెలిసిందే. నీట్ పేపర్ లీకేజ్‌కు వ్యతిరేకంగా జరిగిన ఈ ఉద్యమం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ రాజీనామాతో ముగిసింది. అయితే జెన్-జీ యువతకున్న పవరేంటో ఈ ప్రొటెస్ట్‌తో దేశం మెుత్తం తెలిసింది. కాగా ఇప్పుడు తాజాగా వారి తర్వాత తరం జెన్ అల్పా ఉద్యమ బాట పట్టారు. భోపాల్‌లోని తమ స్కూల్ విలీనానికి నిరసనగా రోడ్లెక్కారు.భోపాల్‌లోని రీజినల్ స్కూల్ ‘జెన్ ఆల్ఫా’ ఈ రోజు (బుధవారం) విద్యార్థులు నిరసనకు దిగారు. డెమాన్‌స్ట్రేషన్ మల్టీపర్పస్ స్కూల్ (DMS)లను కేంద్రీయ విద్యాలయ సంగఠన్ (KVS)లో విలీనం చేయాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ పాఠశాల ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విలీనంతో తమ విద్యాసంస్థకు ఉన్న ప్రత్యేక గుర్తింపు, విద్యా ప్రయోగాల లక్ష్యం దెబ్బతినే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.DMS స్కూల్స్ అంటే ఏమిటి?డెమాన్‌స్ట్రేషన్ మల్టీపర్పస్ స్కూల్స్‌ను రీజినల్ స్కూల్స్‌గానూ పిలుస్తారు. ఇవి 1965 డిసెంబర్ నుంచి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. భోపాల్, అజ్మీర్, మైసూరు, భువనేశ్వర్ నగరాల్లో ఈ ప్రయోగాత్మక పాఠశాలలను ఏర్పాటు చేశారు. కొత్త బోధనా పద్ధతులను అభివృద్ధి చేయడం, విద్యారంగంలో వినూత్న విధానాలను ప్రయోగించడం, వాటి ఫలితాలను పరిశీలించడం ఈ పాఠశాలల ప్రధాన ఉద్దేశంగా ఉంది.ఈ పాఠశాలలను KVSలో విలీనం చేయడం వల్ల వాటి ప్రత్యేక విద్యా విధానం, ప్రయోగాత్మక స్వభావం దెబ్బతినే ప్రమాదం ఉందని విద్యార్థులు, పాఠశాలతో సంబంధం ఉన్న సభ్యులు పేర్కొన్నారు. పరిపాలనా వ్యవస్థ మారితే విద్యా ప్రయోగాలు, పరిశోధనలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. నిరసన అనంతరం విద్యార్థులు తమ అభ్యంతరాలు, డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని రీజినల్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్.కే. గుప్తాకు సమర్పించారు. విలీన నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు.తమ డిమాండ్లపై అధికారులు త్వరగా స్పందించకపోతే ఆందోళనను దశలవారీగా తీవ్రతరం చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు. శాంతియుత నిరసనలు కొనసాగించడంతో పాటు సంబంధిత అధికారులు, శాఖల దృష్టికి తమ సమస్యను తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ప్రయోగాత్మక విద్యా కేంద్రాలుగా ఉన్న ఈ సంస్థలను మరింత బలోపేతం చేయాలని, వాటి అసలు లక్ష్యాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. భోపాల్‌లో ప్రారంభమైన ఈ నిరసన.. రీజినల్ స్కూల్స్‌ను KVSలో విలీనం చేసే ప్రతిపాదనపై విద్యార్థుల నుంచి వస్తున్న తొలి బహిరంగ వ్యతిరేకతగా నిలిచింది.भोपाल में ‘Gen Alpha Protest’! Regional School को केंद्रीय विद्यालय में मर्ज करने के प्रस्ताव के खिलाफ 300 से ज्यादा छात्र सड़क पर उतरे, बोले—“Save DMS” #GenAlpha #Bhopal #KhabarMirror pic.twitter.com/e7F4rH4sWY— Khabar Mirror (@KhabarMirror) August 19, 2026 -
విజయ్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు?
చెన్నై: తమిళనాడులో సీఎం కార్యాలయ మార్పు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఇటీవల ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ కొత్త కార్యాలయానికి మారాలన్న నిర్ణయం కొత్త రాజకీయ వివాదానికి దారితీసింది. ముఖ్యమంత్రి కార్యాలయాన్ని చెన్నైలోని ఫోర్ట్ సెయింట్ జార్జ్ నుంచి నామక్కల్ కవింగర్ మాలిగైకి మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే ఈ టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.బీజేపీ నేత సీఆర్ కేశవన్ ఈ అంశంపై స్పందిస్తూ.. కొత్త టీవీకే ప్రభుత్వం ప్రభుత్వ టెండర్ల ప్రక్రియలో పారదర్శకత తీసుకొస్తామని పదేపదే చెబుతోందని, అయితే కొత్త ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించిన టెండర్ ప్రక్రియలో అనేక అవకతవకలు జరిగినట్లు ప్రముఖ దినపత్రికలో వచ్చిన కథనం వెల్లడించిందని అన్నారు. ఆయన మాట్లాడుతూ "టెండర్ విలువ సుమారు రూ.5.5 కోట్లు. టెండర్ ప్రక్రియలో అనేక అక్రమాలు జరిగినట్లు వార్తా కథనాలు పేర్కొంటున్నాయి. టీవీకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం 100 రోజులు మాత్రమే అయ్యింది. అప్పుడే ప్రభుత్వం ఈ ఆరోపణలతో పరిశీలనకు గురవుతోంది. అయితే, టెండర్లో అవకతవకలు ఉన్నాయని ఒక ఆంగ్ల దినపత్రికలో కథనం వచ్చింది. టెండర్‌ను ఆన్లైన్లో కూడా ఆహ్వానించలేదని అందులో పేర్కొన్నారు. ప్రభుత్వం దీనిపై వివరణ ఇవ్వాలి" అని కేశవన్ అన్నారు.అయితే ఈ ఆరోపణలు మంత్రి, టీవీకే నేత ఆధవ్ అర్జున ఖండించారు. టెండర్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు.ముఖ్యమంత్రి విజయ్ తన కోసం మాత్రమే సౌకర్యవంతమైన కార్యాలయం కోరుకోవడం లేదని, తనతో కలిసి పనిచేసే అధికారులు, సిబ్బందికి కూడా మెరుగైన పని వాతావరణం ఉండాలనే ఉద్దేశంతోనే కార్యాలయాన్ని తాత్కాలికంగా మార్చాలని నిర్ణయించారని చెప్పారు.ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో అధికారులు, సిబ్బంది పనిచేస్తున్న ప్రదేశం 100 చదరపు అడుగుల కంటే కూడా తక్కువగా ఉందని ఆధవ్ అర్జున తెలిపారు. అందుకే తాత్కాలికంగా కార్యాలయాన్ని మరో భవనానికి మార్చే ప్రణాళిక రూపొందించామని చెప్పారు.ముఖ్యమంత్రి విజయ్ చాలా సాధారణంగా, సౌకర్యాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా పనిచేసే వ్యక్తి అని ఆయన అన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో కూడా సాధారణ హోటల్లో లేదా వ్యాన్‌లో విశ్రాంతి తీసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉండేవారని పేర్కొన్నారు.టెండర్ ప్రక్రియలో పూర్తిస్థాయి పారదర్శకత ఉండేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఖజానాకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని, ఎలాంటి బినామీ కంపెనీలను ఉపయోగించబోమని ఆయన స్పష్టం చేశారు. -
పీఎం కేర్ ఫండ్స్‌పై కేంద్రం కీలక ప్రకటన
సాక్షి, ఢిల్లీ: పీఎం కేర్ ఫండ్ వివరాలపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. పీఎం కేర్ ఫండ్స్‌లో ప్రస్తుతం రూ. 8,452 కోట్లు ఉన్నట్లు ప్రకటించింది. ఆ నిధులన్నీ FDల రూపంలో ఉన్నాయని తెలిపింది.ఇప్పుడు కరోనా లేనందున ఖర్చులు దాదాపు ఆగిపోయాయి. కేవలం కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల సహాయం కోసం మాత్రమే కొద్దిగా ఖర్చు చేస్తున్నారు.కరోనా మహమ్మారి సమయంలో కేంద్ర ప్రభుత్వం మార్చి 27, 2020న ప్రత్యేకంగా 'పీఎం కేర్స్ ఫండ్' పేరుతో పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసింది. కరోనా వంటి అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు మరియు బాధితులకు సహాయం అందించేందుకు ఈ నిధిని సృష్టించారు. దీని ద్వారా కరోనా సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల పేరుమీద బ్యాంకులో ప్రత్యేకంగా రూ. 10 లక్షల కార్పస్ ఫండ్ డిపాజిట్ చేస్తారు.18 ఏళ్లు నిండిన తర్వాత వారికి రూ. 10 లక్షల నుండి ప్రతి నెలా కొంత చొప్పున స్టైపెండ్ (నెలవారీ ఖర్చులు) ఇస్తారు. 23 ఏళ్లు నిండిన తర్వాత మొత్తం రూ. 10 లక్షల సొమ్మును ఒకేసారి వారి చేతికి అందిస్తారు. అర్హులైన అనాథ పిల్లలను గుర్తించి, వారి పేరు మీద కేంద్ర ప్రభుత్వమే ఈ రూ. 10 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లను/పాస్‌బుక్‌లను అందజేస్తుంది. -
వందేమాతరం వివాదంపై భగ్గుమన్న మల్లికార్జున్ ఖర్గే
సాక్షి, ఢిల్లీ: ఇటీవల కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియాగాంధీ జాతీయగేయం వందేమాతరాన్ని పూర్తిగా ఆలపించకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారంటూ వివాదం చెలరేగింది. తాజాగా దీనిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా స్పందించారు. తాము పాడిన వందేమాతరం గతంలో మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పాడినదేనని ఆయన స్పష్టం చేశారు. అది నేరమైతే మహాత్మా గాంధీ, నెహ్రూలపైనా కేసులు పెట్టాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఖర్గే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం వందేమాతరం ఆలాపన జరిగింది. అయితే గాయకులు వందేమాతరంలోని పూర్తి వెర్షన్‌ను ఆలపిస్తుండగా సోనియా గాంధీ ఖర్గే వైపు సైగ చేసి, అనంతరం గాయకులకు కూడా ఏదో చెప్పినట్లు కనిపించిందని బీజేపీ ఆరోపించింది. ఆమె వందేమాతరం పూర్తి ఆలాపనను ఆపించేందుకు ప్రయత్నించారని బీజేపీ నేతలు విమర్శించారు.అయితే కాంగ్రెస్ ఈ ఆరోపణలను ఖండించింది. ఖర్గే చాలాసేపు నిల్చోవడంతో ఆయనకు కుర్చీ ఏర్పాటు చేయాలని సోనియా గాంధీ నిర్వాహకులకు సైగ చేశారని కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ తెలిపారు. వందేమాతరం గీతాన్ని ఆపాలని ఆమె ఎలాంటి సూచన చేయలేదని స్పష్టం చేశారు. ఖర్గే ఆరోగ్యం బాగోలేదని, ఎక్కువసేపు నిల్చోలేరని ఆయన పేర్కొన్నారు.ఈ వ్యవహారంపై సోమవారం సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు నమోదైంది. వందేమాతరం గీతాలాపనను అడ్డుకునేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించారంటూ వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఫిర్యాదుదారు కోరారు. తాజాగా దీనిపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్రంగా స్పందించారు. ఖర్గే మాట్లాడుతూ.. ‘‘మేము పాడిన వందేమాతరం మహాత్మా గాంధీ పాడినదే. జవహర్లాల్ నెహ్రూ పాడినదే. గత 18 ఏళ్లుగా మేము అదే వందేమాతరాన్ని పాడుతున్నాం. వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలోనూ ఇదే పాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా 12 ఏళ్లపాటు ఇదే వందేమాతరం పాడారు’’ అని అన్నారు.‘‘మేము చేసినదే నేరమైతే.. గత 18 ఏళ్లుగా ఇదే నేరం జరుగుతున్నట్లే. అదే నేరమైతే మహాత్మా గాంధీపై కేసు పెట్టండి. నెహ్రూపైనా కేసు పెట్టండి’’ అని ఖర్గే వ్యాఖ్యానించారు. జాతీయ గీతాలు, జాతీయ గీతాలాపనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అనేక దశాబ్దాల క్రితమే తీర్మానం చేసిందని, ప్రస్తుతం విమర్శలు చేస్తున్న వారిలో చాలామంది పుట్టకముందే కాంగ్రెస్ ఈ అంశంపై నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు.ఇదిలా ఉండగా, వందేమాతరం వివాదం మరింత ముదిరింది. సోమవారం గోవాలో జరిగిన కాంగ్రెస్ కార్యక్రమంలో ఖర్గే స్వయంగా వందేమాతరాన్ని ఆలపించారు. అయితే ఈసారి గీతంలోని తొలి రెండు చరణాలను మాత్రమే పాడారు. గోవా కాంగ్రెస్ సదస్సు ప్రారంభానికి ముందు ఖర్గేతో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు వందేమాతరం ఆలపించారు.మరోవైపు, ఈ ఏడాది ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వం వందేమాతరం గీతాన్ని పూర్తి రూపంలో బహిరంగ సమావేశాలు, పాఠశాలలు, అధికారిక ప్రభుత్వ కార్యక్రమాలు తదితర సందర్భాల్లో ఆలపించడాన్ని తప్పనిసరి చేసింది. అంతేకాకుండా వందేమాతరం ఆలాపనను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం, అంతరాయం కలిగించడం లేదా నిలిపివేయడం నేరంగా పరిగణించేలా పార్లమెంట్లో బిల్లును కూడా ఆమోదించింది.దీంతో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన వందేమాతరం ఆలాపనపై బీజేపీ చేసిన ఆరోపణలు, సోనియా గాంధీపై వచ్చిన ఫిర్యాదు, కాంగ్రెస్ ఇచ్చిన వివరణలతో ఈ అంశం రాజకీయంగా మరింత వివాదాస్పదంగా మారింది -
కొత్త కార్యవర్గంతో.. బీజేపీ మాస్టర్ ప్లాన్
ఢిల్లీ: ప్రస్తుతం సోషల్ మీడియా ప్రాముఖ్యత గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల దేశంలో జరిగిన జెన్‌జీ ఉద్యమం నుంచి తమిళనాడులో విజయ్ వరకూ సోషల్ మీడియా ఆదారంగానే తమ ప్రచారాన్ని సాగించారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ సైతం కీలక నిర్ణయం తీసుకుంది. గత 11 ఏళ్లుగా సోషల్ మీడియా కన్వీనర్‌గా బాధ్యతలు స్వీకరించిన అమిత్ మాల్వీయా స్థానంలో దీపక్ మాస్కేకు బాధ్యతలు అప్పగించింది. త్వరలో కొన్ని రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది.బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితీన్ నబీన్ ఈ రోజు కొత్త జాతీయ కార్యవర్గ బృందాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. బీజేపీ జాతీయ బృందంలో భారీ మార్పులు చేపట్టింది. ఇందులో భాగంగా సోషల్ మీడియా విభాగానికి దీపక్ మాస్కేను కన్వీనర్‌గా నియమించింది. ఆయనకు పృతి గాంధీ, శివానంద్ ద్వివేది, అలోక్ భట్, అరుణ్ యాదవ్‌లు సోషల్ మీడియా కో-కన్వీనర్లుగా నియమించింది. రానున్న ఎన్నికల్లో సోషల్ మీడియానే కీలక పాత్ర పోషించనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.దీపక్ మాస్కే నేపథ్యందీపక్ మాస్కే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందినవారు. ఇటీవల జరిగిన బీహార్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ విజయంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ రాష్ట్రాల్లో పార్టీ అద్భుత విజయాలు సాధించడంలో ఆయన వ్యూహాలు తోడ్పడ్డాయి. ఎన్నికల డేటాను సేకరించడం, విశ్లేషించడంలో ఆయనకు మంచి పట్టు ఉంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల డేటాను విశ్లేషించి, పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి నివేదికలు రూపొందించారు.కమ్యూనికేషన్ వ్యూహానికి అనిల్ బలూనీపార్టీ కమ్యూనికేషన్ విభాగంలో సైతం కీలక మార్పులు చేసింది. మీడియా కోఆర్డినేటర్‌గా అనిల్ బలూనీని నియమించింది. ఆయనకు జాయింట్ కోఆర్డినేటర్లుగా ఆశిష్ ఉషా అగర్వాల్, ప్రదీప్ భండారీ, సిద్ధార్థ్ యాదవ్‌లను నియమంచింది.రాజకీయ పార్టీలు ఓటర్లు, పార్టీ కార్యకర్తలను నేరుగా చేరుకోవడానికి డిజిటల్ వేదికలపై మరింతగా ఆధారపడుతున్న సమయంలో ఈ నియామకాలు జరిగాయి. తాజా బృందంలో అనుభవజ్ఞులైన నాయకులతో పాటు సంస్థాగత, క్షేత్రస్థాయి అనుభవం ఉన్న నేతలకు ప్రాధాన్యం ఇచ్చారు. అదే సమయంలో కొత్త తరం నాయకులకు కూడా కీలక బాధ్యతలు అప్పగించారు.మోదీ అభినందనలునూతనంగా ఏర్పాటైన కార్యవర్గ బృందానికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.“కొత్తగా నియమితులైన ఈ బృందంలో సంస్థాగత అనుభవం, శక్తి, క్షేత్రస్థాయి అనుసంధానం కలిసివున్నాయి. పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజాసేవపై దృష్టి సారించడంలో వారు తమ వంతు కృషి చేస్తారని నమ్ముతున్నాను. వారికి నా శుభాకాంక్షలు” అని మోదీ పేర్కొన్నారు.మరోవైపు ఇప్పటివరకు బీజేపీ ఐటీ విభాగానికి సుదీర్ఘకాలంగా సేవలంధించిన అమిత్ మాలవీయ కొత్త బృందానికి అభినందనలు తెలిపారు. సోషల్ మీడియా విభాగం అధిపతిగా తన స్థానంలో దీపక్ మాస్కే బాధ్యతలు స్వీకరించనున్నారని పేర్కొన్నారు.“దీపక్ మాస్కే జీకి ప్రత్యేకంగా అభినందనలు. ఆయన ఇకపై బీజేపీ సోషల్ మీడియా విభాగానికి నాయకత్వం వహించనున్నారు. అలాగే కో-కన్వీనర్లుగా నియమితులైన పృతి గాంధీ, శివానంద్ ద్వివేది, అలోక్ భట్, అరుణ్ యాదవ్‌లకు శుభాకాంక్షలు” అని అమిత్ మాలవీయ తెలిపారు.బీజేపీ నయా టీమ్‌లో పలువురు సీనియర్ నేతలకు ప్రాధాన్యమైన బాధ్యతలు దక్కాయి. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, రామ్ మాధవ్, పీయూష్ గోయల్, బైజయంత్ జయ్ పాండా తదితరులకు కీలక బాధ్యతలు అప్పగించారు. అదే సమయంలో పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్న బీఎల్ సంతోష్‌ను జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగించారు. ఆయనకు సహాయంగా శివప్రకాశ్, సౌదాన్ సింగ్‌లను జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శులుగా నియమించారు. -
సుప్రీంకోర్టులో రాహుల్‌గాంధీకి భారీ ఊరట
సాక్షి, ఢిల్లీ: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు హైకోర్టు విచారణను కొనసాగించవద్దని అలహాబాద్ కోర్టుకు.. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.. సీబీఐ, ఈడీలు హైకోర్టుకు ఎలాంటి నివేదిక సమర్పించరాదని తెలిపింది. ఈ కేసును విచారించిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహన్లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది.ఆదాయానికి మించి ఆస్తుల కేసులో రాహుల్ గాంధీపై నమోదైన పిటిషన్‌ను విచారించిన అలహాబాద్ హైకోర్టు ధర్మాసనం, ఈ ఆరోపణలపై సీబీఐ (CBI), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు జరపాలని ఆదేశించింది. దర్యాప్తు పురోగతికి సంబంధించి నివేదికలు సమర్పించాలని, ఈడీ కూడా తగిన చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది. తాజాగా ఈ కేసుపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆ విచారణను నిలిపివేయాలని ఆదేశించింది. ఈ వ్యవహారంలో ఆరోపణలు అంత తీవ్రమైనవి అయితే మీ ఏజెన్సీలు ఇప్పటివరకు ఎందుకు మౌనంగా ఉన్నాయని ధర్మాసనం నిలదీసింది. "కోర్టు నుంచి ఆదేశాలు రావాల్సిందేనా? మీ అంతట మీరుగా సుమోటోగా ఎలాంటి చర్యలు తీసుకోలేదా?" అని జస్టిస్ బాగ్చి దర్యాప్తు అధికారులను ప్రశ్నించారు.కోర్టులో ఇరు పక్షాల వాదనలు.. రాహుల్ గాంధీ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ విఘ్నేష్ శిశిర్‌కు ఈ కేసులో పిటిషన్ దాఖలు చేసే అర్హత లేదని ప్రశ్నించారు. ఇది చట్టబద్ధత లేని, పూర్తిగా కక్షసాధింపు చర్య అని, పిటిషనర్ పదేపదే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. సీబీఐ కేవలం ఫిర్యాదును ధృవీకరించడం మించి ఏమీ చేయలేదని ఆయన పేర్కొన్నారు.కేంద్ర దర్యాప్తు సంస్థల తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ (ASG) ఎస్.వి. రాజు వాదిస్తూ.. ఇప్పటివరకు ఈ కేసులో తమ పాత్రేమీ లేదని, ఒకవేళ ఫిర్యాదులో గమనించదగ్గ నేరాలు ఉన్నట్లు తేలితే అది చాలా తీవ్రమైన విషయమవుతుందని తెలిపారు. కాగా, రాహుల్ గాంధీపై వచ్చిన అక్రమాస్తుల ఆరోపణలను ధృవీకరించాలని సీబీఐ, ఈడీలను ఆదేశిస్తూ అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ జూలై 20న ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే. సీబీఐ సమర్పించిన అఫిడవిట్లపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు, దీనిపై వ్యక్తిగతంగా మరో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా ప్రస్తుతానికి ఆయనకు ఊరట లభించింది. -
బావిలో విషవాయువు.. క్షణాల్లో నలుగురి మృతి
పాట్నా: బీహార్‌లోని గయా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. బావిలోని మోటార్‌ను రిపేర్ చేయడానికి బావిలోకి దిగి విషవాయువులు పీల్చి తాత, తండ్రి, మనువలు చనిపోయారు. ఈ విషాద ఘటన నిన్న (శుక్రవారం) గయా జిల్లా డోభీ పోలీస్ స్టేషన్ పరిధిలోని గర్ కర్మౌనీ గ్రామంలో జరిగింది.వివరాల్లోకి వెళితే.. బావిలో మోటార్‌ను మరమ్మతు కోసం తండ్రి, కుమారుడు సహా చమారీ మాంఝీ, ఆయన కుమారులు దిల్చంద్ మాంఝీ, వికాస్ చౌదరి, విజయ్ చౌదరి అందులోకి దిగారు. ఈ క్రమంలో మోటార్‌ను మరమ్మతు చేస్తుండగా విషవాయువులు విడుదలయ్యాయి దీంతో ఊపిరాడక వారు మృతి చెందారు. వివరాలు తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు.ఈ విషయమై గయా జిల్లా ఎస్ఎస్పీ సుశీల్ కుమార్ మాట్లాడుతూ, "బావిలో విషవాయువు కారణంగా ఊపిరాడక నలుగురు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడిస్తుంది.పోలీసులు బావిలో నుంచి నలుగురి మృతదేహాలను వెలికితీశారు. ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. బావి వంటి మూసివున్న ప్రదేశాల్లో ప్రమాదకర వాయువులు పేరుకుపోయి ఉండే అవకాశం ఉండటంతో, సరైన భద్రతా చర్యలు లేకుండా లోపలికి వెళ్లడం ప్రమాదకరం" అని అన్నారు.ఈ ఘటనపై బీహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గయాజీలో బావిలో విషవాయువుకు గురై నలుగురు మృతి చెందిన వార్త ఎంతో బాధాకరంగా ఉందని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు తక్షణమే ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. -
80 ఏళ్ల స్వాతంత్ర్య చరిత్రలో తొలిసారిగా.. ఎర్రకోటపై సరికొత్త చరిత్ర
ఢిల్లీ: భారత దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ ఢిల్లీలోని ఎర్రకోటపై సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తొలిసారిగా జాతీయ గేయం ‘వందే మాతరం’ను పూర్తిస్థాయిలో ఆలపించారు. అనంతరం సంప్రదాయబద్ధంగా జాతీయ గీతం జనగణమనను ఆలపించారు. ఈ ఏడాది ‘వందే మాతరం’ 150 సంవత్సరాల చరిత్రను పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వందేమాతరంపై ప్రత్యేక చట్టం తెచ్చిన సంగతి తెలిసిందే.ఇటీవల కేంద్ర ప్రభుత్వం ‘వందే మాతరం’కు అధికారిక కార్యక్రమాల్లో ప్రత్యేక ప్రాధాన్యం కల్పించే మార్గదర్శకాలను తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో నిన్న (శుక్రవారం) స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ముందు, ముగింపులోనూ ‘వందే మాతరాన్ని గేయాన్ని ఆలపించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. స్వదేశీ ఉద్యమ కాలంలో ‘వందే మాతరం’ ప్రజల గీతంగా మారిందని రాష్ట్రపతి తన ప్రసంగంలో పేర్కొన్నారు. బంకించంద్ర చటోపాధ్యాయ రచించిన ‘వందే మాతరం’ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారతీయులను ఏకం చేసిన ప్రధాన దేశభక్తి గీతాల్లో దీని ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. దేశభక్తి, మాతృభూమిపై గౌరవం, స్వాతంత్ర్య స్ఫూర్తికి ప్రతీకగా ఈ గీతం ప్రజల్లో విశేష ఆదరణ పొందింది. 2026లో 150 ఏళ్ల సందర్భంగా నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల్లో దీని చారిత్రక ప్రాధాన్యాన్ని దేశవ్యాప్తంగా గుర్తుచేస్తున్నారు. ఎర్రకోట స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తొలిసారిగా ‘వందే మాతరం’కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. -
టాప్ 100 పోలీస్ చీఫ్‌లలో ఇద్దరు తెలుగు అధికారులు
న్యూఢిల్లీ: దేశంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ నాయకత్వాన్ని గుర్తిస్తూ ఫేమ్ ఇండియా, ఏషియా పోస్ట్ సంయుక్తంగా 100 మంది ఉత్తమ పోలీస్ చీఫ్‌ల జాబితాను విడుదల చేశాయి. వీరిలో వి.వి.రాకేష్ రెడ్డి పి.(ఎస్.పి.గోల్పారా).. అసోం, గుండాలరెడ్డి రాఘవేంద్ర (ఎస్పీ ఝార్సుగూడ), ఒడిషా ఇద్దరు తెలుగు రాష్ట్రాలకు చెందిన అధికారులు చోటు దక్కించుకున్నారు. నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు అనుకూలమైన పోలీసింగ్, సాంకేతికత వినియోగం, పారదర్శక పరిపాలన, సంక్షోభ సమయాల్లో వేగవంతమైన నిర్ణయాలు, ప్రజలతో విశ్వాసపూర్వక సంబంధాలు వంటి అంశాల్లో విశేషంగా పనిచేసిన అధికారులను ఈ జాబితాకు ఎంపిక చేశారు.ఒక సమాజం నిజమైన అభివృద్ధి సాధించాలంటే ప్రజలు సురక్షితంగా ఉన్నామనే భావన కలిగి ఉండాలని, ఆ భద్రతే విద్య, వ్యాపారం, పరిశ్రమలు, సామాజిక జీవితం సజావుగా ముందుకు సాగేందుకు పునాదిగా నిలుస్తుందని ఫేమ్ ఇండియా పేర్కొంది. చట్టవ్యవస్థను కాపాడటం కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన వెన్నుముకగా పనిచేస్తుందని తెలిపింది. జిల్లా పోలీస్ చీఫ్‌లు, ప్రధాన పోలీస్ విభాగాల అధిపతులు ఎస్పీ, ఎస్ఎస్పీ, డీసీపీ, కమిషనర్ వంటి హోదాల్లో ఉన్నప్పటికీ వారి బాధ్యతలు అత్యంత విస్తృతంగా ఉంటాయంది. నేరాలను నియంత్రించడం, మహిళలు-పిల్లలకు రక్షణ కల్పించడం, సైబర్ నేరాలు-సంఘటిత నేరాలను అరికట్టడం, ట్రాఫిక్‌ను నిర్వహించడం, సంక్షోభ పరిస్థితుల్లో వేగంగా స్పందించడం వంటి బాధ్యతలతో పాటు ప్రజల విశ్వాసాన్ని కూడా వారు సంపాదించాల్సి ఉంటుందని పేర్కొంది.ఫేమ్ ఇండియా ఎడిటర్ ధీరజ్ కుమార్ మాట్లాడుతూ, నిర్మాణాత్మక జర్నలిజాన్ని ప్రోత్సహించడం తమ సంస్థ లక్ష్యాల్లో భాగమని, సమాజంపై సానుకూల ప్రభావం చూపుతున్న పరిపాలకులు, ప్రజాసేవకుల పనితీరును వెలుగులోకి తీసుకురావడంలో ఫేమ్ ఇండియా చాలాకాలంగా కృషి చేస్తోందని తెలిపారు. దేశవ్యాప్తంగా చట్టవ్యవస్థను పర్యవేక్షిస్తున్న అనేక మంది జిల్లా పోలీస్ చీఫ్‌లు, యూనిట్ అధిపతుల నుంచి 100 మందిని ఎంపిక చేయడం కష్టమైన ప్రక్రియని పేర్కొన్నారు.ఫేమ్ ఇండియా మేనేజింగ్ ఎడిటర్ అనిల్ సింగ్ మాట్లాడుతూ, ఈ సర్వే నిరంతర ప్రక్రియ అని, అధికారుల పనితీరు, ప్రజాసేవా రికార్డును భవిష్యత్తులోనూ పరిశీలిస్తామని చెప్పారు. తదుపరి దశలో ఈ 100 మంది నుంచి భారత్‌లోని టాప్ 25 పోలీస్ చీఫ్‌లను ఎంపిక చేసి, ఫేమ్ ఇండియా రాబోయే సంచికలో ప్రచురించనుంది. ఎంపికయ్యే ఆ 25 మంది అధికారులకు ప్రత్యేక సన్మానాలు కూడా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.కాగా ఈ గౌరవంపై గుండాలరెడ్డి రాఘవేంద్ర స్పందించారు. “ఇది మొత్తం జార్సుగూడ పోలీసు కుటుంబం సాధించిన సమిష్టి విజయం. వృత్తి నైపుణ్యం, సున్నితత్వం, సాంకేతికత, వినూత్న ఆలోచనలతో ప్రజలకు సేవ చేయడంతో పాటు నేరాలపై ఏమాత్రం సహనం లేకుండా పనిచేయడమే మా లక్ష్యం” అని రాఘవేంద్ర తెలిపారు.గుండాల రెడ్డి రాఘవేంద్ర నేపథ్యంజార్సుగూడ జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న , ఐపీఎస్ దేశవ్యాప్తంగా అత్యుత్తమంగా పనిచేస్తున్న టాప్ 100 ఐపీఎస్ అధికారులలో గుర్తింపు పొందారు. ఎస్పీగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సాంకేతికత ఆధారిత దర్యాప్తు, ముందస్తు నేర నియంత్రణ, మాదకద్రవ్యాల కట్టడి, సైబర్ నేరాల ఛేదన, కేసుల వేగవంతమైన దర్యాప్తు, బలహీన వర్గాల రక్షణతో పాటు పోలీసులపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడంపై రాఘవేంద్ర ప్రత్యేక దృష్టి సారించారు. ఆయన నాయకత్వంలో జార్సుగూడ పోలీసులు రాష్ట్రంలోని జిల్లా వారీ ప్రగతి డ్యాష్‌బోర్డ్‌లో మొదటి స్థానం, తప్పిపోయిన చిన్నారులను గుర్తించడంలో 95.7 శాతం ట్రేసింగ్ రేటు సాధించడంతో పాటు హత్యలు, దోపిడీలు, ఏటీఎం కేసులను విజయవంతంగా ఛేదించారు. అలాగే భారీగా మాదకద్రవ్యాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు పోక్సో, ఇతర కీలక క్రిమినల్ కేసుల్లో దోషులకు శిక్షలు పడేలా చేశారు. -
ఆగస్టు 15.. ఢిల్లీలో హైఅలర్ట్
సాక్షి, ఢిల్లీ: రేపు ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఎర్రకోట చుట్టూ బహుళ అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఎర్రకోట చూట్టూ వెయ్యి కెమెరాలతో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీలోకి వచ్చే వాహనాలన్నిటినీ తనిఖీ చేపడుతున్నారు.భారత్ రేపు తన 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది. రేపు ఆగస్టు 15 సందర్భంగా ప్రధాని ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేస్తారు. మన జాతీయ గేయం 'వందేమాతరం' రాసి 150 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని స్వాతంత్ర్య దినోత్సవ చరిత్రలోనే మొదటిసారిగా ఎర్రకోటపై వందేమాతరం గేయాన్ని ఆలపించనున్నారు.ఎర్రకోట నుండి ప్రధాని చేసే ప్రసంగాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత 'భాషిణి' అనువాదకం ద్వారా దేశంలోని 22 అధికారిక భాషల్లోకి ఒకే సమయంలో అనువదించి ప్రసారం చేస్తారు. దీనివల్ల ఎవరి మాతృభాషలో వారు ప్రసంగాన్ని స్పష్టంగా వినవచ్చు. -
మానవ చరిత్రలో కన్నీటి అధ్యాయం.. మోదీ
సాక్షి, ఢిల్లీ: దేశ చరిత్రలో అత్యంత బాధాకరమైన అధ్యాయాలలో దేశ విభజన ఒకటని ప్రధాని మోదీ అన్నారు. ఈ రోజు ఆగస్టు 14 "విభజన భయానక స్మృతి దినం" సందర్భంగా ఎక్స్ ఖాతాలో విభజన దినోత్సవ విషాద స్మృతులను ఆయన పంచుకున్నారు. దేశ విభజన అంతులేని జీవితాలను ఛిన్నాభిన్నం చేసిందని, కుటుంబాలను నిర్వాసితులను చేసిందని అపారమైన మానవ వేదనకు కారణమైందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.ప్రధాని ఎక్స్ ఖాతాలో "ఈరోజు మనం విభజన విషాధ స్మృతి దినాన్ని పాటిస్తున్నాము. విభజన కారణంగా ప్రభావితమైన ప్రతి ఒక్కరి ధైర్యాన్ని మనం గుర్తుచేసుకుంటున్నాము. ఇది అనేక జీవితాలను ఛిన్నభిన్నం చేసిన చారిత్రక క్షణం... కుటుంబాలు నిర్వాసితులయ్యాయి, ప్రియమైన వారిని కోల్పోయారు అపారమైన బాధను అనుభవించారు. " అని ప్రధాని మోదీ రాసుకొచ్చారు. ఈ విషాదాన్ని తట్టుకుని నిలబడిన వారి పట్టుదలను ఆ సందర్భంగా ఆయన కొనియాడారు.ఊహించని కష్టాలు ఎదురైనప్పటికీ, చాలా మంది తమ జీవితాలను మళ్లీ నిర్మించుకుని దేశ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని తెలిపారు. "వారి జీవిత ప్రయాణాలు మానవ ఆత్మ యొక్క బలాన్ని మనకు గుర్తుచేస్తాయి. మన దేశంలో ఐక్యతను, సౌభాత్రాన్ని కాపాడుకోవాలనే మన సంకల్పాన్ని ఈ రోజు మరింతగా బలోపేతం చేయాలి. ఒక వికసిత్ భారత్‌ను నిర్మించడానికి అందరం కలిసికట్టుగా కృషి చేద్దాం" అని ఆయన జోడించారు.కాగా విభజన బాధితులకు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ సైతం నివాళులర్పించారు. భారతదేశ విభజన వల్ల జరిగిన అపారమైన మానవ వేదనను ఆయన గుర్తుచేసుకున్నారు. ఎంతటి కష్టాలు ఎదురైనా తమ జీవితాలను తిరిగి నిర్మించుకున్న ప్రజల ధైర్యాన్ని మరియు పట్టుదలను ఆయన ప్రశంసించారు.లక్షలో సంఖ్యలో మరణాలు1947లో జరిగిన దేశ విభజన మానవ చరిత్రలోనే అత్యంత పెద్ద విషాదకరమైన వలసలలో ఒకటి. బ్రిటిష్ పాలన ముగిసిన తర్వాత భారతదేశం, పాకిస్తాన్ దేశాలుగా విడిపోయింది. ఆ సమయంలో దాదాపు 1 కోటి 50 లక్షల మంది ప్రజలు సరిహద్దులు దాటారు. విభజన రేఖల వల్ల రెండు వైపులా తీవ్రమైన మతకల్లోలాలు జరిగాయి. ప్రజలు తమ ఇళ్లు, భూములు, వ్యాపారాలను ఉన్నపళంగా వదిలి శరణార్థులుగా మారారు. రవాణాపై దాడులు శరణార్థులతో వెళ్తున్న రైళ్లు, బస్సులు నడిచి వెళ్తున్న కాన్వాయ్‌లపై దాడులు జరిగాయి. సుమారు 2 లక్షల నుండి 20 లక్షల మంది వరకు చనిపోయారని అంచనా. లక్షలాది మంది ప్రజలు తమ సర్వస్వాన్ని కోల్పోయి, ఏళ్ల తరబడి శరణార్థుల శిబిరాల్లో మగ్గిపోయారు. ఆ రోజు ప్రాణాలు కోల్పోయిన, నిరాశ్రయులైన ప్రజల త్యాగాల జ్ఞాపకార్థం 2021 నుండి ఏటా ఈ రోజును "విభజన భయానక స్మృతి దినం" గా జరుపుకుంటున్నారు. -
రాష్ట్రానికి PMAY-G 2.0 ఇళ్లను కేటాయించండి.. పొంగులేటి
సాక్షి, ఢిల్లీ: ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ (PMAY-G 2.0) కింద తెలంగాణ రాష్ట్రానికి సమగ్ర ప్రాతిపదికన ఒకేసారి 11,56,915 ఇళ్లను కేటాయించాలని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను పొంగులేటి కలిసి వినతి పత్రం అందించారు.గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాసిన లేఖను ఈ సందర్భంగా కేంద్రమంత్రికి గుర్తుచేశారు. రాష్ట్రంలో ఇళ్ల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఏడాది క్రితమే సర్వే పూర్తి.. మంజూరులోనే జాప్యంరాష్ట్రవ్యాప్తంగా ‘ఆవాస్ ప్లస్–2024’ యాప్ ద్వారా అత్యంత పారదర్శకంగా ఇంటింటి సర్వే నిర్వహించామని మంత్రి పొంగులేటి వివరించారు. ఈ సర్వేలో 11.56 లక్షలకు పైగా గ్రామీణ పేద కుటుంబాలు ఇళ్లకు అర్హులుగా తేలాయని తెలిపారు. వీటికి సంబంధించి సూపర్ చెక్, అనర్హుల తొలగింపు ప్రక్రియలన్నీ ఏడాది క్రితమే పూర్తయినప్పటికీ, కేంద్రం నుంచి లక్ష్యాల ప్రకటనలో జాప్యం జరుగుతోందన్నారు. తెలంగాణలో గత 12 ఏళ్లుగా పేదలకు ఇళ్ల నిర్మాణం నిలిచిపోయి తీవ్రమైన డిమాండ్ పేరుకుపోయినందున, ఒకేసారి ఈ ఇళ్లన్నింటినీ మంజూరు చేయాలని కోరారు.ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయంPMAY-G కింద ఇచ్చే కేంద్ర వాటా, సాధారణ రాష్ట్ర వాటాతో సంబంధం లేకుండా ప్రతి పేద కుటుంబం ఇల్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని పొంగులేటి వెల్లడించారు. ఇందుకు అవసరమైన నిధులను ఇప్పటికే రాష్ట్ర బడ్జెట్లో కేటాయించినట్లు స్పష్టం చేశారు.తెలంగాణ పర్యటనకు రావాల్సిందిగా ఆహ్వానంకేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను తెలంగాణలో పర్యటించాల్సిందిగా పొంగులేటి సాదరంగా ఆహ్వానించారు. స్వయంగా రాష్ట్రానికి వచ్చి PMAY-G 2.0 కింద ఇళ్ల కేటాయింపును ప్రకటిస్తే, తెలంగాణలోని గ్రామీణ పేదలకు కొండంత అండగా నిలుస్తుందని, అది చారిత్రాత్మక ఘట్టంగా మారుతుందని పేర్కొన్నారు. మంత్రి పొంగులేటి విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందిస్తూ, తెలంగాణలో పర్యటించేందుకు అంగీకరించారు.కేంద్ర మంత్రిని కలిసిన వారిలో ఎంపీలు మల్లు రవి, వేం నరేందర్ రెడ్డి, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, సురేష్ షెట్కార్, రామసహాయం రఘురాం రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్‌తో పాటు తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వీ.పీ.గౌతమ్ తదితరులు ఉన్నారు. -
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
సాక్షి, ఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ‘వందేమాతరం’ బిల్లుకు ఆమోదం తెలిపారు. దీంతో "ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ బిల్", 2026 ఇక చట్టంగా మారింది. ఇకపై జాతీయ గీతం ‘జనగణమన’కు ఉన్న చట్టపరమైన రక్షణే జాతీయ గేయం ‘వందేమాతరం’కు సైతం వర్తించనుంది.‘వందేమాతరం’ ఆలాపనను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం, నిలిపివేయడం లేదా ఆ పాట పాడుతున్న సభకు అంతరాయం కలిగించడం ఇకపై నేరంగా పరిగణిస్తారు. గతంలో Prevention of Insults to National Honour Act కింద జాతీయ గీతం ఆలాపనను అడ్డుకోవడం లేదా అంతరాయం కలిగించడం మాత్రమే శిక్షార్హమైన నేరంగా ఉండేది. ఈ నిబంధనను ఇప్పుడు జాతీయ గేయం ‘వందేమాతరం’కు కూడా వర్తించేలా చట్టాన్ని సవరించారు.ఈ నేరాలకు గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. రెండోసారి, ఆ తర్వాత జరిగే ప్రతి నేరానికి కనీసం ఏడాది జైలు శిక్ష ఉంటుంది. గత చట్టంలో ‘వందేమాతరం’కు ఇలాంటి ప్రత్యేక చట్టపరమైన రక్షణ లేదు.ఈ బిల్లును రాజ్యసభ జూలై 29న, లోక్‌సభ జూలై 30న ఆమోదించాయి. అనంతరం రాష్ట్రపతి ఆమోదంతో ఇది చట్టంగా మారింది. దీంతో ‘వందేమాతరం’కు జాతీయ గీతం ‘జనగణమన’తో సమానమైన చట్టపరమైన రక్షణ లభించింది. ఇదిలా ఉండగా, ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తొలిసారిగా ఎర్రకోట ప్రాకారాల నుంచి ‘వందేమాతరం’ ఆలపించనున్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది.జాతీయ గేయం, జాతీయ గీతం రెండింటినీ ఒకే కార్యక్రమంలో ఆలపించినప్పుడు ముందుగా ‘వందేమాతరం’, ఆ తర్వాత ‘జనగణమన’ ఆలపించాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ ఏడాది జనవరి 28న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జాతీయ గేయం ఆలాపనకు సంబంధించి తొలిసారిగా ప్రత్యేక ప్రోటోకాల్‌ను జారీ చేసింది.అధికారిక కార్యక్రమాల్లో రాష్ట్రపతి రాక, జాతీయ పతాకావిష్కరణ, గవర్నర్ల ప్రసంగాలు వంటి సందర్భాల్లో ‘వందేమాతరం’లోని మొత్తం ఆరు చరణాలను, సుమారు 3 నిమిషాల 10 సెకన్ల వ్యవధిలో ఆలపించాలని ఆదేశించింది. -
జమ్మూ.. డిప్యూటీ సీఎం వాహనం ఢీకొని వ్యక్తి మృతి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ డిప్యూటీ సీఎం సురీందర్ చౌదరికాన్వాయ్లోని ఒక వాహనం ఢీకొని బీహార్‌కు చెందిన ఒక వ్యక్తి దుర్మరణం చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే వాహన డ్రైవర్, సెక్యూరిటీ సిబ్బంది కిందకు దిగి తీవ్రంగా గాయపడిన భరత్ కాపర్‌ను ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. మృతుడు భరత్ కాపర్ , బీహార్‌లోని సమస్తిపూర్ నివాసి అని తెలుస్తోంది. నిన్న శనివారం రాత్రి సుమారు 9గంటల ప్రాంతంలో జమ్మూ శివారు ప్రాంతమైన గంగ్యాల్లో రోడ్డు దాటుతుండగా, వేగంగా వస్తున్న స్కార్పియో వాహనం ఆయన్ను ఢీకొట్టింది. అయితే జమ్మూకశ్మీర్ డిప్యూటీ సీఎం సురీందర్ చౌదరిని ఆయన నివాసంలో దించి వస్తున్న కాన్వాయ్లోనిదే ఆ స్కార్పియో వాహనమని తెలుస్తోంది.ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. రాత్రి వేళల్లో నగర ప్రాంతాల్లో అధికారిక కాన్వాయ్‌ల రాకపోకలు, రోడ్డు భద్రతపై ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనలను రేకెత్తించింది. -
ప్రమాదంలో ఆదివాసీ భాషలు
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మనం ఆదివాసీల హక్కులు, అడవులు, జీవన విధానం గురించి మాట్లాడుతుంటాం. కానీ అత్యంత విలువైన వారి వారసత్వమైన మాతృభాష గురించి మాత్రం తక్కువగా ఆలోచిస్తాం. ఒక భాష కేవలం సంభాషణ సాధనం కాదు. అది ఒక జాతి చరిత్ర, సంస్కృతి, జానపద విజ్ఞానం, ప్రకృతి పరిజ్ఞానం, జీవన తత్వాన్ని మోసుకెళ్లే సజీవ సంపద. అందుకే ఒక భాష అంతరించిపోతే, ఆ భాషతో పాటు ఒక ప్రపంచ దృష్టికోణం కూడా శాశ్వతంగా కనుమరుగవుతుంది.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా ప్రాంతాల్లో నివసించే కోయల మాతృభాష అయిన ‘కోయతూర్’ నేడు సవాళ్లను ఎదుర్కొంటోంది. గ్రామాల్లో పెద్దలు ఇప్పటికీ కోయతూర్లో మాట్లాడుతున్నప్పటికీ, కొత్త తరం విద్య, ఉపాధి, పట్టణీకరణ ప్రభావంతో తెలుగు, హిందీ లేదా ఆంగ్ల భాషల వైపు మొగ్గు చూపుతోంది. ఇంట్లోనే మాతృభాష వినిపించని పరిస్థితి ఏర్పడితే, ఆ భాషకు భవిష్యత్తు మరింత సంక్లిష్టమవుతుంది. ఇది కేవలం కోయ భాష సమస్య మాత్రమే కాదు. భారతదేశంలో అనేక ఆదివాసీ భాషలు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. యునెస్కో ప్రమాదంలో ఉన్న భాషల జాబితాలో భారతదేశానికి చెందిన అనేక భాషలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకు చెందిన కుపియా, గదబ, కొలామి, నాయకి, తోటి భాషా రూపాలు, అలాగే అండమాన్ దీవులలోని గ్రేట్ అండమానీస్, ఓంజీ వంటివారి భాషలు కూడా మాట్లాడేవారి సంఖ్య తగ్గిపోతోంది.ఆదివాసీ భాషలు అంతరించిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. పట్టణాలకు వలసలు, మాతృభాషలో విద్య లేకపోవడం, ప్రభుత్వ వ్యవహారాల్లో స్థానిక భాషలకు తగిన ప్రాధాన్యం లేకపోవడం, ఉద్యోగ అవకాశాల కోసం ఆధిపత్య భాషలను ఎంచు కోవడం వంటి అంశాలు కలిసి ఈ పరిస్థితిని తీసుకొచ్చాయి. భాషను కోల్పోవడం అనేది ఒక్కసారిగా జరిగే సంఘటన కాదు; ప్రతి తరం కొద్దికొద్దిగా దూరమవుతూ చివ రకు ఆ భాష మాట్లాడేవారు లేకుండా పోతారు. ‘‘మాకు వీలై నంతలో భాషను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్ప పూవుతో చాక్లెట్లు, లడ్డూలు చేస్తున్నాం. ఈ ఉత్పత్తులకు ‘పుంగార’ అనే పేరు పెట్టాము. పుంగార్ అంటే మా కోయ భాషలో పువ్వు అని అర్థం’’ అని చెప్పారు భద్రాచలంకు చెందిన స్వయం సహాయక సంఘ మహిళ సమ్మక్క.ఆదివాసీ పిల్లలకు మంచి విద్య, ఉపాధి అవకాశాలు కల్పించడం ఎంత అవసరమో, అంతే అవసరం వారిలో మాతృభాషపై గౌరవాన్ని పెంపొందించడం. తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలు నేర్చుకోవడం తప్పు కాదు. కానీ వాటిని నేర్చుకునే క్రమంలో వారి భాషను మరచిపోవడం మాత్రం ఒక సాంస్కృతిక నష్టంగా మిగిలిపోతుంది.ప్రభుత్వాలు ఆదివాసీ ప్రాంతాల్లో మాతృభాష ఆధారిత ప్రాథమిక విద్యను బలోపేతం చేయడం, వారి భాషలో పాఠ్యపుస్తకాలు, నిఘంటువులు, డిజిటల్ కంటెంట్ రూపొందించడం, భాష తెలిసిన ఉపాధ్యాయులను నియమించడం, జానపద గేయాలు, కథలు, సామెతలను డిజిటల్ రూపంలో భద్రపరచడం వంటి చర్యలు చేపట్టాలి.2020లో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన దివ్య దేవరాజన్ అక్కడి గోండుల సమస్యలు తెలుసుకోవడానికి స్వయంగా ఒక ట్యూటర్ని నియమించుకొని గోండు భాషను నేర్చుకున్నారు. ఆదివాసీ గూడేల్లో వారి అరుగుల మీద కూర్చొని వారి భాషలోనే ఆమె మాట్లాడుతున్నప్పుడు వారంతా వారి కష్టాలన్నీ ధైర్యంగా చెప్పుకునేవారు. దివ్య లాంటి అధికారులు ఆదివాసీ ప్రాంతాల్లో ఉండాల్సిన అవసరం ఉంది. భాషను కాపాడటం అంటే ఒక భాషను మాత్రమే కాదు, ఒక జాతి చరిత్రను, ప్రకృతితో ముడిపడిన జీవన తత్వాన్ని, వేల ఏళ్ల సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటమే. భాష బతికితేనే జాతి బతుకుతుంది.– శ్యాం మోహన్, ఆదివాసీ జీవనంపై అధ్యయనం చేస్తున్న జర్నలిస్ట్ (నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం) -
డీలిమిటేషన్ బిల్లుపై శిరోమణి అకాలీ దళ్ కీలక నిర్ణయం
చంఢీగఢ్: శిరోమణి అకాలీ దళ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కేంద్రం తీసుకవచ్చిన డీలిమిటేషన్ , మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుకు తమ పార్టీ మద్దతు ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో, శిరోమణి అకాలీ దళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ భేటీ అయిన ఒక రోజు అనంతరమే ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ మద్దతుతో రాబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో శిరోమణి–బీజేపీ కూటమి మళ్లీ ఏర్పడే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయిసుఖ్బీర్ సింగ్ బాదల్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. "దేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలని అకాలీ దళ్ డిమాండ్ చేస్తోంది. అలాగే అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను ఏకరీతిగా 50 శాతం పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు SAD మద్దతు ఇస్తుంది. ఈ మేరకు శిరోమణి అకాలీ దళ్.. చండీగఢ్‌లో జరిగిన పార్టీ సీనియర్ నాయకుల సమావేశంలో నిర్ణయం తీసుకుంది” అని బాదల్ ‘ఎక్స్’లో తెలిపారు.పార్లమెంట్ ముందున్న కీలక అంశాలపై సవివరంగా చర్చించిన అనంతరం.. అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించే విధంగా న్యాయమైన, సమతుల్య డీలిమిటేషన్ జరగాలని శిరోమణి అకాలీ దళ్ డిమాండ్ చేసిందని ఆయన పేర్కొన్నారు.గతంలో డీలీమిటేషన్‌కు వ్యతిరేకంగాఅయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కేంద్ర ప్రభుత్వం తొలిసారి ఏప్రిల్‌లో డీలిమిటేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు అకాలీ దళ్ దానిని వ్యతిరేకించింది. ప్రతిపక్ష పార్టీలతో కలిసి ఆ పార్టీ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసింది. ఆసమయంలో పంజాబ్‌కు ఈ బిల్లు వివక్ష చూపుతోందని అకాలీ దళ్ ఆరోపించింది. పంజాబ్‌కు సీట్ల సంఖ్యలో స్వల్ప పెరుగుదల మాత్రమే లభిస్తుండగా, పొరుగు రాష్ట్రాలు మరింత ఎక్కువ సీట్లు పొందే అవకాశం ఉందని పార్టీ పేర్కొంది.ఈ నేపథ్యంలో ఇటీవల మోదీతో భేటీ అయిన అనంతరం ఆ నిర్ణయాన్ని మార్చుకుంటూ డీలిమిటేషన్ బిల్లులకు మద్దతు తెలపడం విశేషం.2020లో తెగిపోయిన దాదాపు రెండున్నర దశాబ్దాల బంధంబీజేపీ–శిరోమణి అకాలీ దళ్ మధ్య దాదాపు రెండున్నర దశాబ్దాలుగా కొనసాగిన పొత్తు 2020లో తెగిపోయింది. అప్పట్లో వివాదాస్పదమైన మూడు వ్యవసాయ చట్టాల నేపథ్యంలో అకాలీ దళ్.. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) నుంచి వైదొలగాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మరోసారి ఈ రెండు పార్టీలు కలిసే పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
కిరణ్ రిజిజు, రాహుల్ మధ్య ముదిరిన వార్
సాక్షి, ఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మధ్య ఎక్స్ వేదికగా మాటల యుద్ధం నడిచింది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని ఆయన రాహుల్‌ను సవాల్ చేశారు. దీనికి రాహుల్ గాంధీ కౌంటర్ ఇస్తూ, మహిళా రిజర్వేషన్ చట్టాన్ని ఇదివరకే కాంగ్రెస్ ఆమోదం తెలిపిందని దాన్ని డీలిమిటేషన్‌తో ఎందుకు అనవసరంగా ముడిపెడుతున్నారని రాహుల్ కౌంటరిచ్చారు.అసలే ఏమైందంటేకిరణ్ రిజిజు తన ఎక్స్ ఖాతాలో మహిళలకు మరింత భావప్రకటన స్వేచ్ఛ ఉండాలని రాహుల్ గాంధీ మాట్లాడిన వీడియోను షేర్ చేస్తూ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత (LoP) రాహుల్ గాంధీ వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది “ఇది కాంగ్రెస్ నుంచి వచ్చిన సానుకూల సందేశంలా కనిపిస్తోంది. మహిళల విషయంలో రాహుల్ గాంధీ ఆలోచనా విధానంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది” అని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ ఎలాంటి షరతులు లేకుండా మద్దతు ఇవ్వాలని కూడా ఆయన కోరారు.రాహుల్ గాంధీ కౌంటర్కిరణ్ రిజిజు చేసిన ఈ పోస్ట్‌కు రెండు గంటలు కూడా గడవకముందే రాహుల్ గాంధీ నుంచి సమాధానం వచ్చింది. 2023లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు కాంగ్రెస్ మద్దతుతో పార్లమెంట్లో ఆమోదం పొందింది అనే విషయం కేంద్రమంత్రికి గుర్తు చేశారు.“ఈ బిల్లు ఇప్పటికే ఏకగ్రీవంగా, కాంగ్రెస్ పూర్తి మద్దతుతో ఆమోదించబడింది. అయితే మూడు సంవత్సరాలు గడిచినా ఇది ఎందుకు అమలు కాలేదు? ఇప్పుడు దీన్ని డీలిమిటేషన్‌తో ఎందుకు అనవసరంగా ముడిపెట్టాలని మీరు కోరుకుంటున్నారు?” అని ఆయన ప్రశ్నించారు.2023లో ఆమోదమైన చట్టాన్ని ఎలాంటి షరతులు లేకుండా అమలు చేయాలని కేంద్రాన్ని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.మహిళా కోటా, డీలిమిటేషన్ అంశంమహిళా రిజర్వేషన్ బిల్లు లేదా ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ 2023లో లోక్‌సభ, రాజ్యసభల్లో ఆమోదించబడింది. లోక్‌సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీల్లో కూడా 33 శాతం సీట్లను మహిళలకు రిజర్వ్ చేయడం ఈ చట్టం లక్ష్యం. అయితే 2023లో ఆమోదించిన చట్టం అమలును భవిష్యత్తులో నిర్వహించే జనగణనతో ముడిపెట్టింది. దీంతో పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియతో ముడిపెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయం కారణంగా ప్రతిష్టంభన ఏర్పడింది. ప్రతిపాదిత డీలిమిటేషన్ ప్రక్రియలో లోక్‌సభ మొత్తం సీట్ల సంఖ్యను ప్రస్తుత 543 నుంచి 850కి పెంచే అవకాశం ఉంది. అందులో 33 శాతం అంటే 273 సీట్లు మహిళలకు రిజర్వ్ చేయబడతాయి.గొడవ ఎందుకు?2011 జనగణన ఆధారంగా జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపడితే దక్షిణాది రాష్ట్రాల కంటే జనాభా పెరుగుదల ఎక్కువగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలకు అన్యాయంగా ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని ప్రతిపక్ష పార్టీలు వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్‌లో జరిగిన ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు ఆమోదించేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. ఇప్పుడు వర్షాకాల సమావేశాల్లో ఈ చట్టాన్ని ఆమోదింపజేయడానికి ప్రభుత్వం మరోసారి ప్రయత్నిస్తోంది.కాగా ఈ అంశమై కిరణ్ రిజిజు ఆగస్టు 5న రాహుల్ గాంధీతో 50 నిమిషాల పాటు చర్చలు జరిపారు. మహిళా రిజర్వేషన్‌ను డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం ఆమోదయోగ్యం కాదని రాహుల్ గాంధీ కేంద్ర మంత్రి రిజిజుకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఆగస్టు 6న కూడా రిజిజు ఫోన్ ద్వారా రాహుల్ గాంధీని సంప్రదించినట్లు సమాచారం. ఈసారి కాంగ్రెస్ ఈ అంశంపై అంతర్గతంగా చర్చించడంతో పాటు, తన ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలతో సైతం చర్చించి, అనంతరం తమ వైఖరిని తెలియజేస్తుందని రాహుల్ చెప్పినట్లు తెలుస్తోంది. -
చైనా ప్లాన్‌కు భారత్ చెక్! ఆ 27 ప్రాంతాలకు అధికారిక గుర్తింపు..
చైనా అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రాంతాల పేర్లను మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయం ఇదివరకు తెలిసిందే. అయితే, దీనికి ప్రతిస్పందనగా భారత్ ఆ రాష్ట్రంలోని 27 కీలక ప్రాంతాలు, భౌగోళిక ప్రదేశాలను సర్వే ఆఫ్ ఇండియా అధికారిక మ్యాప్‌లో గుర్తించింది. ఈ ప్రాంతాలను స్థానికులు, స్వదేశీయులలో అవగాహన పెంచేదిశగా అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వంతో సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.చైనా అరుణాచల్ ప్రదేశ్‌ను 'జాంగ్నాన్'గా పేర్కొంటూ అక్కడి ప్రాంతాలకు కొత్త పేర్లు పెడుతోంది. ఈ చర్యలను భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోంది. కేవలం పేర్లు మార్చడం ద్వారా భూభాగంపై హక్కులు మారవని భారత్ మరోసారి స్పష్టం చేసింది.అయితే, తాజాగా సర్వే ఆఫ్ ఇండియా అధికారికంగా గుర్తించిన మ్యాప్ ప్రాంతాల్లో వాస్తవాధీన రేఖ (LAC) సమీపంలోని లాంగ్జు కూడా ఉంది. 1959లో చైనా దళాలు ఈ ప్రాంతంలోకి ప్రవేశించడం భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతలకు తొలి ప్రధాన ఘటనల్లో ఒకటిగా నిలిచింది. ఎగువన ఉన్నటువంటి సుబన్సిరి జిల్లాలోని సమీప మాజా గ్రామాన్ని కూడా ఈ జాబితాలో చేర్చారు.అదేవిధంగా డ్జో లా (Dzo La), రిజా లా (Riza La), పుకుర్ లా (Pukur La) వంటి వ్యూహాత్మకంగా కీలకమైన ఎత్తైన పర్వత మార్గాలు ఉన్నాయి. 1962 భారత్-చైనా యుద్ధం ప్రారంభంలో దాడులు జరిగిన ప్రాంతాల్లో ఒకటైన థాగ్ లా (Thag La) కూడా ఈ అధికారిక మ్యాప్‌లో భాగమే.27 ప్రదేశాల జాబితా..అలాగే, 1962 భారత్-చైనా యుద్ధంలో కీలక పాత్ర పోషించిన జస్వంత్ గఢ్, షేర్-ఎ-థాపా మెమోరియల్ వంటి చారిత్రక ప్రాంతాలతో పాటు చాంగ్లాంగ్ జిల్లాలోని జైరాంపూర్ను కూడా ఈ జాబితాలో ఉంది. ఇది తూర్పు అరుణాచల్ ప్రదేశ్, మయన్మార్ సరిహద్దు ప్రాంతాల భద్రతా దళాల కదలికలకు ముఖ్యమైన కేంద్రం.అయితే, భారత భూభాగాలకు కల్పిత పేర్లు పెట్టేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలు 'ఆధారరహిత కథనాలను సృష్టించే ప్రయత్నాలు' మాత్రమేనని న్యూఢిల్లీ పేర్కొంది. ఇటువంటి చర్యలు వాస్తవ పరిస్థితులను ఎప్పటికీ మార్చలేవని స్పష్టం చేయడంతోపాటు ఇలాంటి చర్యలు ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచే ప్రయత్నాలకు ఆటంకం కలిగించవచ్చని భారత్ హెచ్చరించింది.చైనా తొలిసారిగా 2017లో అరుణాచల్ ప్రదేశ్‌లోని ఆరు ప్రాంతాలు, 2021లో 15 ప్రాంతాలు, 2023లో మరో 11 ప్రాంతాలకు పేర్లు మార్చినట్లు ప్రకటించింది. దీంతో అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో విడదీయరాని భాగమని భారత్ నిరంతరం స్పష్టం చేస్తోంది. అయితే, చైనా చేపట్టే పరిపాలనా లేదా మ్యాప్‌లకు సంబంధించిన చర్యలు భారతదేశ చట్టపరమైన, భౌగోళిక హక్కులపై ఎలాంటి ప్రభావం చూపవని ఈ సందర్భంగా పేర్కొంది. -
35 వేల అడుగుల ఎత్తులో షాక్.. విమానం డోర్ తెరవబోయిన సైకో
తిరువనంతపురం: ఒక సైకోచేసిన వింతఘటన ఆ విమానంలోని ప్రయాణికులందరినీ ఊపిరి బిగపట్టుకునేలా చేసింది. బాటిక్ ఎయిర్ కు చెందిన OD-231 విమానం మలేషియాలోని కౌలాలంపూర్ నుంచి వస్తుంది. అంతా ప్రయాణంలో సేదతీరుతుండగా ఒక్కసారిగా అందులోని ప్రయాణికుడు అకస్మాత్తుగా తన సీటు నుంచి లేచి ఎమర్జెన్సీ ఎగ్జిట్ తలుపు తెరవడానికి ప్రయత్నించాడు.దీంతో అందులోని వారంతా ఒక్కసారిగా తీవ్రభయాందోళనలకు గురయ్యారు.ఏం జరిగింది?విమానం గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో, 36 ఏళ్ల జంషీర్ అతనిక్కల్ అనే ప్రయాణికుడు అకస్మాత్తుగా తన సీటు నుంచి లేచి ఎమర్జెన్సీ ఎగ్జిట్ తలుపు తెరవడానికి ప్రయత్నించాడు.అంతే కాకుండా తలుపు వద్ద ఉన్న విండో ప్యానెల్‌ను కూడా బలంగా కొట్టి దెబ్బతీశాడు. దీంతో ఇది గమనించిన ప్రయాణికులు వెంటనే సిబ్బందికి సమాచారం అందించారు.క్యాబిన్ క్రూ వెంటనే స్పందించి, కొంతమంది ప్రయాణికుల సహాయంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే విమానం క్రూజింగ్ ఎత్తులో ఉండగా క్యాబిన్ లోపలి–బయటి గాలి పీడన మధ్య భారీ తేడా ఉండటంతో ఎమర్జెన్సీ తలుపు తెరవడం సాధారణంగా సాధ్యం కాలేదు దీంతో పెను ప్రమాదం తప్పింది. అయితే విమానం కొచ్చిలో ల్యాండ్ అయిన అనంతరం అతడిని సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. అతడి మానసిక పరిస్థితి, ఇతర కారణాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.అప్పట్లో రోడ్లపై, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో సైకోలను చూశాం... ఇప్పుడు విమానాల్లో కూడా అలాంటి సైకోలను చూస్తున్నాం.కౌలాలంపూర్–కొచ్చి బాటిక్ ఎయిర్ విమానంలో ఎమర్జెన్సీ డోర్ తెరవబోయిన ప్రయాణికుడు.గాల్లోనే ఎమర్జెన్సీ డోర్ తెరవడానికి 36 ఏళ్ల జంషీర్ అతానిక్కల్… pic.twitter.com/ubhOoZNxME— greatandhra (@greatandhranews) August 7, 2026 -
"జవాబ్ దేవో అమిత్‌షా" వర్షంలో ఎంపీల నిరసన
సాక్షి,ఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలో విద్యార్థులపై జరిగిన దాడిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా క్షమాపణలు చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు విపక్ష ఎంపీలు పార్లమెంటు ఎదుట ప్లకార్డులు పట్టుకొని ఆందోళన చేపట్టారు. అమిత్‌షా కనపడడం లేదని పార్లమెంటు సమావేశాలకు ఎందుకు హాజరు కావడం లేదని ఎంపీలు ప్రశ్నించారు. "అమిత్ షా జవాబ్ దేవ్" అని ప్లకార్డులు పట్టుకొని ఆందోళన చేశారు. అయితే ఎంపీల నిరసన సమయంలో భారీగా వర్షం పడుతున్నా వెనక్కి తగ్గలేదు. వానకు తడుస్తూనే నిరసన చేపట్టారు.కాగా ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభకు హాజరుకాకపోవడంపై అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది. జూలై 20న ఢిల్లీలో 'నీట్ యూజీ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా నిరసనలు తెలిపిన విద్యార్థులపై పోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు లాఠీఛార్జ్, పెల్లెట్ గన్లను ఉపయోగించాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. హోంశాఖ పరిధిలోని పోలీసుల చర్యలపై అమిత్ షా సభకు వచ్చి సమాధానం చెప్పాలని పట్టుబడుతున్నాయి.అయితే అమిత్ షా పార్లమెంట్‌కు దూరంగా లేరని, ఆయన రోజంతా పార్లమెంట్ హౌస్‌లోని తన ఛాంబర్ లోనే ఉంటూ అధికారిక విధులు నిర్వహిస్తున్నారని బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. ప్రతిపక్షాల గందరగోళమే కారణమని ప్రతిపక్షాలు నిరంతర నిరసనలతో సభను సజావుగా సాగనివ్వడం లేదని, సభను నడవనిస్తే అమిత్ షా వచ్చి ఖచ్చితంగా సమాధానం ఇస్తారని తెలిపారు. -
మరో వీడియా రిలీజ్ చేసిన ప్రధాని
సాక్షి, ఢిల్లీ: ఈ రోజు శుక్రవారం (ఆగస్టు 7) జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. చేనేత హ్యాండ్లూమ్ ఉత్పత్తులను కొనుగోలు చేసి, ఆ వీడియోలను చేనేత కార్మికులకు మద్దతుగా సోషల్ మీడియాలో వీడియోల రూపంలో పంచుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. స్నేహితుల దినోత్సవంఎంత ఉత్సాహంగా జరుపుకుంటామో, అదే ఉత్సాహంతో జాతీయ చేనేత దినోత్సవాన్ని కూడా జరుపుకోవాలని కోరారు.ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేసిన వీడియోలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. "1905 ఆగస్టు 7న స్వదేశీ ఉద్యమం ప్రారంభమైంది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారత స్వాతంత్ర్య పోరాటంలో ఈ ఉద్యమం కీలక పాత్ర పోషించిందని, దేశ ప్రజలను ఏకం చేయడంతో పాటు స్వావలంబనకు ప్రతీకగా నిలిచింది" అని పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం కూడా అదే స్పూర్తిని గుర్తు చేసే సందర్భంగా భావించాలని ప్రధాని అన్నారు.దేశవ్యాప్తంగా అనేక మంది నేత కార్మికులు చిన్న చిన్న ఇళ్లలోనే పనిచేస్తూ, విభిన్న రకాల చేనేత వస్త్రాలను అద్భుతమైన నైపుణ్యంతో తయారు చేస్తున్నారని కొనియాడారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక హ్యాండ్లూమ్ ఉత్పత్తిని కొనుగోలు చేయాలని, దానిని చూపిస్తూ ఒక చిన్న వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో పంచుకోవాలని ప్రధాని మోదీ సూచించారు.ఇలా చేయడం ద్వారా మరింత మంది చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ప్రేరణ పొందుతారని, నేత కార్మికులకు విస్తృత మద్దతు లభిస్తుందని ఆయన చెప్పారు. "ఆత్మనిర్భర్ భారత్ నిర్మించడమే మన లక్ష్యమని. అందుకోసం సమాజంలోని అత్యంత చిన్న, పేద కుటుంబాలు కూడా ఆర్థికంగా బలోపేతం కావాలి. ప్రజల మద్దతు పెరిగితే భారతీయ నేత కార్మికుల ప్రతిభ, వారి అద్భుతమైన కళాత్మక నైపుణ్యం ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు పొందుతుంది” అని ప్రధాని మోదీ ఇన్‌స్టా వేదికగా పేర్కొన్నారు. -
కన్నప్రేమకు కన్నీటి పరీక్ష.. విషాదకర ఘటన!
ఒక తండ్రి... కన్న బిడ్డలను అల్లారుముద్దుగా పెంచాడు. తన రెక్కలు ముక్కలు చేసుకుని జీవితాంతం కష్టపడి సంపాదించాడు. వారిని గొప్పగా చదివించి, ఉన్నత స్థానాల్లో నిలబెట్టాడు. కానీ చివరికి తన జీవిత ప్రయాణం ముగిసే సమయానికి ఆయన పక్కన నిలిచింది మాత్రం ఆ కుటుంబం కాదు... ఓ వృద్ధాశ్రమం.హరియాణాలోని సోనిపట్‌కు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త చివరి రోజులు ఒంటరితనంతో గడిపారు. జీవితమంతా కుటుంబం కోసం శ్రమించిన ఆయన, చివరికి వృద్ధాశ్రమంలో తుదిశ్వాస విడిచారు. అంతకంటే బాధాకరమైన విషయం ఏమిటంటే? ఆయన అంత్యక్రియలకు సొంత కుమార్తెలు కూడా రాలేదు.వీడియో కాల్ పెట్టండి...కన్నతండ్రి మరణించారని తెలుసుకున్న కుమార్తెలు కడసారి చూపుకైనా రాలేకపోయారు. తండ్రి చివరి ప్రయాణాన్ని వీడీయో కాల్రూపంలో మొబైల్ స్క్రీన్‌లో చూసేశారు. అలోచిస్తేనే బాధతో గుండెభారంగా మారుతున్న ఈ ఘటనలో.. చివరికి వారు తండ్రి అంత్యక్రియల ఖర్చుల కోసం రూ.5,100 పంపించి తమ బాధ్యత ముగిసిందని భావించినట్లుగా ఈ వీడియోలో వారి సన్నివేశం కనిపిస్తోంది. అయితే, ఈ సంఘటన ప్రస్తుతం ఒక ప్రశ్నగా మారి సమాజం ముందు నిలబెడుతోంది.బతికి ఉన్నప్పుడు కంటపడని కన్నప్రేమ.. కన్నుమూశాక వీడియో కాల్ దర్శనం! ఎటు పోతోంది ఈ సమాజం?!రెక్కలు ముక్కలు చేసుకుని పెంచి పెద్ద చేసిన కన్నప్రేమ పట్ల ఆప్యాయత, బాధ్యతలు ఏమైపోతున్నాయి? నేటి సమాజంలో యంత్రాల్లా మారుతున్న మానవ సంబంధాలు, మంటగలిసిపోతున్న నైతిక విలువలకు ఈ దృశ్యమే… pic.twitter.com/CCMMyqFMhl— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) August 5, 2026సాంకేతికత మనుషులనే కాకుండా.. పూర్తిగా మనసులను మరింత దూరం చేసింది. ఎన్ని కోట్లు సంపాదించినా... ఎంత పెద్ద పదవుల్లో ఉన్నా... తల్లిదండ్రుల చివరి క్షణాల్లో వారి పక్కన నిలబడలేకపోతే ఆ విజయం విలువ ఏమిటి? జీవితాంతం మన కోసం కష్టపడిన వాళ్లకు చివరి వీడ్కోలు కూడా ఇవ్వలేకపోతే అది అభివృద్ధా? లేక అనుబంధాల ఓటమా? అనే ఆలోచనలు ఇలాంటి ఘటనలు పదే పదే గుర్తు చేస్తున్నాయి.వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయి... వీడియో కాల్స్, ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్లు పెరుగుతున్నాయి... కానీ ఆప్యాయత, మమకారం, బాధ్యత కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయా అనే ప్రశ్న కూడా వెంటాడుతోంది. తల్లిదండ్రులు కోరుకునేది కోట్ల ఆస్తులు కాదు... వద్దాప్య చివరి రోజుల్లో నాలుగు ఓదార్పు మాటలు, పక్కన నిలిచే సొంత మనుషులు మాత్రమే. ఒకప్పుడు పిల్లల కోసం తమ జీవితాన్నే అంకితం చేసిన తల్లిదండ్రులు... నేడు వృద్ధాశ్రమాల్లో ఒంటరిగా కన్నుమూయాల్సి వస్తే, అది ఒక్క కుటుంబం వైఫల్యం మాత్రమే కాదు... సమాజమంతా ఆలోచించాల్సిన అంశం కూడా. -
డీలిమిటేషన్‌పై ప్రత్యేక సమావేశం.. కేంద్రం ప్లాన్
సాక్షి, ఢిల్లీ: లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. విపక్షాలు పెద్దఎత్తున నిరసనలు చేయడంతో లోక్‌సభ వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. కాగా ఈ నెల 13తో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగియనున్నాయి. దీంతో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది.ఈ నెల 16,17,18 తేదీలలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి డీలిమిటేషన్, మహిళా బిల్లులపై చర్చించేలా కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. కాగా ఇదివరకే లోక్‌సభలో డీలిమిటేషన్ బిల్లు, 2026 పై చర్చ ఈ ఏడాది ఏప్రిల్ 16న జరిగింది. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు.జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే మెుదటి నుంచి జనాభా నియంత్రణను పకడ్బందీగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని ఉత్తరాది రాష్ట్రాల (UP, బీహార్) సీట్లు రాజకీయ బలం భారీగా పెరుగుతాయని విపక్షాలు వ్యతిరేకించాయి. దానితో పాటు మహిళా రిజర్వేషన్‌తో లింక్ పెట్టడంతో మహిళా రిజర్వేషన్‌ను ప్రస్తుతమున్న సీట్లలోనే తక్షణమే అమలు చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో బిల్లులు ప్రత్యేక మెజారిటీ లేక చట్టసభలలో వీగిపోయాయి. -
విమానం గాల్లో ఉండగా కుదుపులు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
సాక్షి,ఢిల్లీ: ఎయిరిండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా కుదుపులకు గురయ్యింది. దీంతో ఫైలట్ చాకచక్యంగా వ్యవహరించి ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. కొంతమంది ప్రయాణికులకు గాయాలయ్యాయని అది మినహా ప్రయాణికులు, సిబ్బంది సేఫ్ అని విమానయాన సంస్థ ప్రకటించింది. పెనుప్రమాదం తప్పడంతో అంతా ఊపీరి పీల్చుకున్నారు. అయితే విమానం ఎందుకు కుదుపులకు గురయింది అనే విషయం తెలియాల్సి ఉంది. -
తంజావూరులో ఉద్రిక్తత.. విజయ్ దిష్టిబొమ్మ దగ్ధం
సాక్షి, చెన్నై: తమిళనాడు తంజావూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఉదయనిధి స్టాలిన్ అరెస్టును వ్యతిరేకిస్తూ డీఎంకే కార్యకర్తలు పెద్దఎత్తున ఆందోళనలను చేపడుతున్నారు. తంజావురులో షాపులని మూయిస్తున్నారు. అరెస్టును నిరసిస్తూ సీఎం విజయ్ దిష్టిబొమ్మ తగలబెట్టేందుకు యత్నించారు. దీంతో టీవీకే, డీఎంకే కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. ఇరుపార్టీల నేతలు పరస్పరం రాళ్లదాడి చేసుకున్నారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి.కావేరి ఇష్యూ నుంచి టాపిక్‌ను డైవర్ట్ చేయడానికి ఉదయనిధిని అరెస్టు చేయించారని డీఎంకే నేతలు ఆరోపిస్తున్నారు.డీఎంకే నిరసనలకు పన్నీర్ సెల్వం నాయకత్వం వహిస్తున్నారు. అరెస్టును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనననలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.కాగా సీఎం, విజయ్ సినీనటి త్రిషపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో తమిళనాడులో ఉద్రిక్తకర పరిస్తితులు ఏర్పడ్డాయి.మరోవైపు డీఎంకే అధినేత స్టాలిన్ డీఎంకే కేంద్రకార్యాలయానికి చేరుకున్నారు. ఉదయనిధి అరెస్టుపై పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారు. తదనంతరం తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కాగా తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు మరికాసేపట్లో విచారించనున్నట్లు సమాచారం.పార్లమెంటులో చర్చకాగా ఉదయనిధి అరెస్టు అంశం ఉదయనిధి అరెస్టుపై పార్లమెంటులో గందరగోళం చెలరేగింది. తమిళనాడులో భావప్రకటనా స్వేచ్ఛ లేకుండా పోయిందని ఆ పార్టీ ఎంపీ తిరిచ్చి శివ అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయన్నారు. అయితే లా అండ్ అర్డర్ అనేది రాష్ట్ర పరిధిలోని అంశంమని రాజ్యసభ స్పీకర్ బదులిచ్చారు. 🚨🇮🇳 #BREAKING — DMK cadres staged a protest in Thanjavur, condemning the arrest of opposition leader Udhayanidhi Stalin.Protesters also burned an effigy of Chief Minister Vijay during the demonstration.#TamilNadu #DMK #Thanjavur #UdhayanidhiStalin pic.twitter.com/G3qUtWQGUm— WarPolitics (@TheWarPolitics0) August 4, 2026 -
ఆప్ E20 మార్చ్ అడ్డగింత.. ఉద్రిక్తత
సాక్షి, ఢిల్లీ: ఈ20 పెట్రోల్‌కు వ్యతిరేకంగా ఆప్ నేతలు చేపట్టిన ఛలో ప్రధాని నివాస్ ర్యాలీని ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపైనే భైటాయించిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్‌లు.. ఇథనాల్ ఇంధనానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ20 పెట్రోల్‌కు వ్యతిరేకంగా ఆప్ రెండు లక్షలకు పైగా సంతకాల సేకరణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి ర్యాలీగా వెళ్లి.. ఆయనకు ఆ ప్రతిని అప్పగించాలని కేజ్రీవాల్ భావించారు. అయితే.. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే భైఠాయించి నిరసన తెలుపుతున్నారు.ఈ సందర్భంగా మాజీ సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘‘ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడికి లోనుకావద్దు. అమెరికా నుంచి ఎథనాల్ కొనుగోళ్లను నిలిపివేయాలి. దేశంలో E20 పెట్రోల్ విధానాన్ని బలవంతంగా అమలు చేయొద్దు. ఈ అంశంపై ప్రధానిని కలిసే విషయమై లేఖలు పంపాం. సమస్య పరిష్కారం అయ్యే వరకు మా పోరాటం కొనసాగుతుంది’’ అని స్పష్టం చేశారు.#WATCH | Delhi: AAP National Convenor Arvind Kejriwal says, "I want to say that PM Modi should not come under pressure from US President Trump. He should stop buying ethanol from the USA and stop imposing E20 on our country. I hope that the Prime Minister will call us. We have… https://t.co/HCiUUO0dW0 pic.twitter.com/xCNkecugvT— ANI (@ANI) August 4, 2026ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడకం వల్ల వాహనాల ఇంజిన్ సామర్థ్యం పాడవుతుందని వాదిస్తున్న కేజ్రీవాల్.. ప్రజలకు ఇంధనం వేసుకునే సమయంలో ప్యూర్ పెట్రోల్, ఇథనాల్ పెట్రోల్ అనే రెండు ఆప్షన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలోనే.. ఈ అంశంపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని అంటున్నారాయన. "కొన్ని రోజుల క్రితం ప్రధానికి ఉద్దేశించి ఆన్లైన్ వినతిపత్రం ప్రారంభించాం. చాలా తక్కువ సమయంలోనే సుమారు 2,33,238 మంది దానిపై సంతకం చేశారు. నా కార్యాలయం నుంచి అరెస్టులంటే భయపడని 100 మందితో కలిసి ప్రధాని నివాసానికి బయలుదేరుతాను. ఈ వినతిపత్రాన్ని ఆయనకు స్వయంగా అందించి, ఇథనాల్ విధానంలో ఉన్న లోపాల గురించి చర్చించాలని కోరతాం" అని కేజ్రీవాల్ ఇంతకు ముందే ప్రకటించారు. -
టీఎంసీకి మరోషాక్.. నేతాజీ మునిమనవడి రాజీనామా
కోల్‌కతా: తృణముల్ కాంగ్రెస్‌కు మరోషాక్ తగిలింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మునిమనవడు చంద్రకుమార్ బోస్ తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీకి రాజీనామా చేశారు. "వ్యక్తిగత కారణాల" వల్లే తాను ప్రాథమిక సభ్యత్వానికి స్వస్తి పలుకుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి తన రాజీనామా లేఖను పంపారు.పశ్చిమబెంగాల్ సాధారణ ఎన్నికల్లో ఓటమితో మమతా బెనర్జీకి మెుదలైన బ్యాడ్ టైమ్ ఇప్పట్లో ఆగేలా లేదు..అంతర్గత విబేధాల కారణంగా సుమారు 20 మంది ఎంపీలు టీఎంసీ నుంచి వేరుపడే ప్రయత్నాలు చేయడం, అలాగే రిషిబ్రతా బెనర్జీ, సందీప్ సాహా వంటి అసమ్మతి ఎమ్మెల్యేలపై పార్టీ బహిష్కరణ వేటు వేయడం వంటి పరిణామాలు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలోనే చాలా మంది నేతలు ఇప్పటికే తృణముల్‌కు గుడ్‌బై చెప్పారు. తాజాగా ఆ బాటలోనే చంద్రకుమార్ బోస్ నిలిచారు. వ్యక్తిగత కారణాలతోనే టీఎంసీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.ఈ సందర్భంగా చంద్రకుమార్ బోస్ .. "వ్యక్తిగత కారణాల దృష్ట్యా, నేను అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి తక్షణమే రాజీనామా చేస్తున్నాను. మీ భవిష్యత్ ప్రయత్నాలన్నింటిలోనూ మీకు, ఏఐటీసీకి నా శుభాకాంక్షలు" అని బోస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి రాసిన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.రాజకీయ నేపథ్యం2016లో అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన ఆయన, 2019 లోక్‌సభ ఎన్నికల్లో కోల్‌కతా దక్షిణ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) విచారణకు హాజరు కావాలని నోటీసులు రావడంతో ఆయన బీజేపీని వీడారు. స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మునుమడైన తన పౌరసత్వాన్నే ఎలా సందేహిస్తారంటూ ఆయన అప్పట్లో తీవ్రంగా ప్రశ్నించారు. ఈ కారణాలతో బీజేపీని వీడి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని వారాల ముందు, ఏప్రిల్ 12న చంద్రకుమార్ బోస్ తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. ఆ సమయంలో తాను బీజేపీలో చేరడం పెద్ద "తప్పు" అని ఆయన అభివర్ణించారు. -
ప్రశాంత్ కిషోర్ గెలుపు.. మార్పుకు సంకేతం.. కేజ్రీవాల్
సాక్షి, ఢిల్లీ: బిహార్‌లో ప్రశాంత్ కిషోర్ విజయంతో బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలిందని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.ఈ విజయంతో బీజేపీపై ప్రజల్లో ఏ విధంగా వ్యతిరేకత ఉందో స్పష్టంగా అర్థమైందన్నారు.బిహార్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో ఘన విజయం సాధించిన జనసూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్‌కు అభినందనలు చెబుతూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.అరవింద్ కేజ్రీవాల్ తన ఎక్స్ ఖాతాలో " బీజేపీ తన జాతీయ అధ్యక్షుడి సీటును కూడా కోల్పోయింది. బంకిపూర్ నుంచి ప్రశాంత్ కిషోర్ జీ భారీ మెజారిటీతో గెలుపొందారు. ఆయనకు హృదయపూర్వక అభినందనలు. బీజేపీ పట్టు పూర్తిగా చేజారిపోయింది. నిధుల దుర్వినియోగం, పత్రాల లీకులు, ఈ20... మోదీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. అహంకారం బద్దలవుతోంది. దేశ ప్రజలు మార్పునకు స్పష్టమైన సంకేతం ఇచ్చారు," అని ఆయన రాసుకొచ్చారు.మరోవైపు ప్రశాంత్ కిషోర్‌ను అభినందిస్తూ బిహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఎక్స్‌లో పోస్ట్ చేశారు."ప్రజాస్వామ్య మహోత్సవంలో, బంకిీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో ప్రజలు జన సురాజ్‌ను ఎన్నుకున్నారు. ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తూ, విజయం సాధించిన శ్రీ ప్రశాంత్ కిషోర్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను," అని పేర్కొన్నారు.కాగా దేశంలోని బంకీపూర్, మంజల్పూర్, దతియా అసెంబ్లీ నియోజక వర్గాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం జరిగింది. బిహార్‌లోని బంకీపూర్ నియోజకవర్గంలో జనసురాజ్ పార్టీ అభ్యర్థి ప్రశాంత్ కిశోర్ గెలుపొందారు. ఆయన 19 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో బీజేపీ నేత నీరజ్ కుమార్‌పై విజయం సాధించారు.గుజరాత్‌లోని మంజల్పూర్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సతేంద్రభాయ్ పటేల్ (సతీశ్ పటేల్) విజయం సాధించారు. ఆయనకు మొత్తం 55,481 ఓట్లు పడగా 30,630 ఓట్ల తేడాతో గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి భిఖంభాయి రబారీ రెండో స్థానానికి పరిమితమయ్యారు. మధ్యప్రదేశ్‌లోని దతియా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఘనశ్యామ్ సింగ్ విజయం సాధించారు. ఆయనకు మొత్తం 66757 ఓట్లు రాగా, 6,016 తేడాతో బీజేపీ అభ్యర్థి అశుతోష్ తివారీపై గెలుపొందారు. -
అయోధ్య విరాళాల వివాదం.. పప్పుయాదవ్‌పై దాడి
సాక్షి, ఢిల్లీ: ఎంపీ పప్పూ యాదవ్‌పై దాడి జరిగింది. ఈరోజు ఆదివారం ఢిల్లీలోని ఆయన నివాసం వద్ద మీడియా సమావేశం నిర్వహిస్తూఉండగా ఓ వ్యక్తి అతనిపై చెప్పు విసిరారు. అనంతరం ఎంపీపై దాడికి యత్నించగా మద్ధతుదారులు అతనిని పట్టుకొని చితకబాదారు.అనంతరం అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఇటీవల అయోధ్య రామమందిర హుండీ చోరి విషయంలో ఇటీవల ప్రతిపక్షాలు పార్లమెంటు ఎదుట నిరసన చేపట్టాయి. ఈ సందర్భంగా పప్పుయాదవ్ సన్యాసి వేశం వేసి హూండీ పట్టుకొని నాటకం వేశారు. కాగా ఈ నాటకం హిందూ ధర్మాన్ని కించపరిచే విధంగా ఉందంటూ వారణాసిలోని కొందరు సన్యాసులు, లాయర్లు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.ఆ నేపథ్యంలోనే లక్నోలోని ఓ హిందూ నాయకుడు పప్పూయాదవ్ తల తెచ్చిన వారికి రూ. 51 లక్షల రివార్డును ఇస్తానని ప్రకటించారు.ఇంతలోనే ఈ రోజు ఆయనపై దాడి జరిగింది. దాడి అనంతరం పప్పు యాదవ్ మాట్లాడుతూ "కొంతమంది బాబాలు ప్రతిరోజూ, "నన్ను చంపండి, కాల్చండి, నేను మీకు రూ. 51 లక్షలు ఇస్తాను. అంటున్నారు. అసలు నాతప్పేమిటి ఈ దాడి మీ కళ్ల ముందే జరిగింది. అసలు నేరం బ్రిజ్‌భూషణ్ తివారీ, చంపత్ రాయ్‌లది" అని అన్నారు.అయితే దాడి తర్వాత అక్కడ ఉద్రిక్తకర పరిస్తితులు ఏర్పడ్డాయి. ఎంపీ మద్దతుదారులు అతనిపై తీవ్రస్థాయిలో దాడికి యత్నించారు. దీంతో పోలీసులు అతి కష్టంమీద దాడి చేసిన వ్యక్తిని అక్కడి నుండి తరలించారు. కాగా నిందితుడు తనపై దాడికి కత్తి తీసుకవచ్చాడని పప్పూ యాదవ్ తెలిపారు.#Breaking - Delhi: Pappu Yadav attacked and brutally beaten A man with a knife tried to kill Pappu YadavPeople beat the man severely pic.twitter.com/uy5MQfRInS— NEWS WALA (@NEWSWALApy) August 2, 2026 -
రాహుల్, పప్పూయాదవ్‌లపై సాధువుల ఫిర్యాదు
లక్నో: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ పప్పూయాదవ్పై హిందూ సన్యాసులు, లాయర్లు ఫిర్యాదు చేశారు.అయోధ్య రామమందిర హుండీ చోరీ పేరుతో పార్లమెంట్ ఎదుట వీరు నాటకం వేశారన్నారు. ఆ నాటకం హిందూ ధర్మాన్ని సన్యాసులను అవమానించే విధంగా ఉందని వారణాసిలోని వివిధ పోలీస్ స్టేషన్లలలో ఫిర్యాదు చేశారు.హిందూ సాధువు బాలక్‌దాస్ దేవచార్య మాట్లాడుతూ "పార్లమెంటు బయట పప్పు యాదవ్ చేసిన చర్య ద్వారా, ఆయన కాషాయ వస్త్రాలను, సాధు సమాజాన్ని, శ్రీరాముడినీ అవమానించారు. ఇందులో ప్రమేయం ఉన్న ప్రతిపక్ష నాయకులందరిపై ఫిర్యాదు దాఖలు చేశాం, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాం," అని అన్నారు.అదే న్యాయవాది వినీత్ కుమార్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ ప్రతిపక్షం సనాతన ధర్మాన్ని అవమానిస్తోందన్నారు "నిన్న పార్లమెంటులో సనాతన ధర్మాన్ని అవమానించారని మేము భావిస్తున్న దానిపై ఫిర్యాదు చేశాము. పప్పు యాదవ్, రాహుల్ గాంధీలపై కేసు నమోదు చేయాలని కోరాము. మేము కేవలం వినతిపత్రం కాకుండా, కంటోన్మెంట్ పోలీసు అధికారులకు లిఖితపూర్వక ఫిర్యాదును సమర్పించాము." అని తెలిపారు.ఫిర్యాదు ఎందుకు కాగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అయోధ్య రామమందిర కానుకల దొంగతనాలపై పార్లమెంటు ఎదుట నిన్న (శుక్రవారం) కాంగ్రెస్ వినూత్న రీతిలో నిరసన చేపట్టింది. ఆ పార్టీ ఎంపీ పప్పూయాదవ్ కాషాయ వస్త్రాలు ధరించారు. పూజారి వేషంలో విరాళాల పెట్టె పట్టుకొని ముఖద్వారం వద్ద కూర్చొని నిరసన తెలిపారు.ఆ సమయంలో అక్కడి ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అరుస్తూ హుండీలో కానుకలు వేశారు. ఈ సందర్బంగా లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పప్పూయాదవ్‌కు నమస్కారం పెట్టి హుండీలో కానుకలు వేశారు. కాగా దీనిపై ఇప్పుడు ఫిర్యాదు చేశారు. -
అస్సాంలో వరద విలయం.. 82 మంది మృతి
దిస్పూర్: అస్సాంలో భారీ వరదలు తీవ్ర వినాశనాన్ని సృష్టించాయి. వరదల కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 82కి చేరుకుందని అక్కడి అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,92,799 మంది వరద ప్రభావిత ప్రాంతాల్లోనే ఉన్నట్లు పేర్కొన్నారు. వివిధ జిల్లాల్లో వరద తీవ్రతఅధికారుల వివరాల ప్రకారం.. అసోంలోని శివసాగర్, గోలాఘాట్, జోర్హాట్, నాగావ్, చరైడియో జిల్లాలలో వరద ప్రభావం ఇంకా కొనసాగుతోంది. వాటిలో అత్యధికంగా చరైడియో జిల్లాలో 77,456 మంది, తర్వాతి స్థానాల్లో శివసాగర్‌లో 63,492 మంది, జోర్హాట్లో 34,067 మంది ప్రజలు వరదల వల్ల ప్రభావితమయ్యారు. వరదల ప్రభావితమైన వారి కోసం 54 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశామని అందులో దాదాపు 13,000 మంది బాధితులు ఆశ్రయం పొందుతున్నారని పేర్కొన్నారు. మరో 26 రిలీఫ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు పనిచేస్తుండగా, వాటి ద్వారా 5,384 మందికి సాయం అందుతోందన్నారు. బాధితుల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్లు రంగంలోకి దిగి సహాయక చర్యలను ముమ్మరంగా నిర్వహిస్తున్నాయని తెలిపారు.వరద బాధితులకు ప్రభుత్వ ఊరట వరద పీడిత ప్రాంతాల్లోని ప్రజలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పీఎం సూర్య ఘర్ పెండింగ్ రాష్ట్ర సబ్సిడీ కింద 9,289 మంది లబ్ధిదారులకు రూ. 41.67 కోట్లను ప్రభుత్వం ఆమోదించింది. అస్సాం పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APDCL) ఈ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేలా మంగళవారం (ఆగస్టు 4, 2026) నాటికి పూర్తి చేయాలని పవర్ డిపార్ట్మెంట్ను సీఎం ఆదేశించారు. అంతకు ముందు ప్రధాని మాట్లాడుతూ వరద బాధితులకు తక్షణ సాయం అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కృషి చేస్తున్నాయని తెలిపారు. ఈ నాలుగు జిల్లాల్లోని వరద బాధితులందరికీ రుణాలు చెల్లించడంలో ఆరు నెలల మారటోరియం వర్తింపజేయాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (SLBC) ప్రత్యేక సమావేశంలో నిర్ణయించారు. -
శిక్ష ఖరారు..ఆప్ మాజీ కౌన్సిలర్‌కు జీవిత ఖైదు
ఢిల్లీ: ఆరేళ్ల క్రితం ఈశాన్య ఢిల్లీ అల్లర్ల సమయంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల్లో భాగంగా ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)) ఆఫీసర్ అంకిత్ శర్మ దారుణ హత్యకు గురైన కేసులో ఆప్ మాజీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్‌కు శిక్ష ఖరారు చేసింది ఢిల్లీ కోర్టు. ఇప్పటికే ఈ కేసులో తాహీర్ హుస్సేన్ దోషిగా తేల్చిన కోర్టు.. జీవిత ఖైదును శిక్షగా ఖరారు చేసింది. ఈ కేసులో ఐదుగుర్ని దోషులుగా తేల్చిన కోర్టు.. తాజాగా వారికి జీవిత ఖైదు విధించింది. ఈ మేరకు కోర్టు అదనపు సెషన్స్ జడ్జి (ASJ) ప్రవీణ్ సింగ్, మరణశిక్ష విధించాలన్న ప్రాసిక్యూషన్ అభ్యర్థనను తిరస్కరించి జీవితఖైదు విధించారు.కాగా, 2020, ఫిబ్రవరి 25వ తేదీన సీఏఏ అల్లర్ల సమయంలో ఐబీ ఆఫీసర్ అంకిత్ శర్మ దారుణ హత్యకు గురయ్యారు. ఆయన మృతదేహాన్ని చాంద్‌బాగ్ ప్రాంతంలోని ఓ డ్రైనేజీలో పడేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ రోజు సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన అంకిత్ శర్మ ఇక తిరిగి రాలేదు. ఆ రోజు అప్పుడే ఇంటికి వచ్చిన అంకిత్ శర్మ.. అల్లరి మూకలు స్థానికంగా రెచ్చిపోవడం గమనించారు. దాంతో బయటకు వెళ్లి వారిని సద్దుమణిచే యత్నం చేశారు. అలా ఆప్ కౌన్సిలర్‌గా ఉన్న హుస్సేన్ ఇంటికి వెళ్లిన అంకిత్ శర్మ హత్యకు గురయ్యారు. ఆ సమయంలో అంకిత్ శర్మను అతి దారుణంగా హత్య చేసి డ్రెయిన్‌లో పడేశారు. తన కొడుకు ఎంతకీ ఇంటికీ రాకపోయే సరికి ఆ మరుసటి రోజు ఫిబ్రవరి 26వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు తండ్రి రవీందర్ కుమార్. దాంతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు.. ఓ యువకుని మృతదేహం డ్రెయిన్‌లో ఉన్న విషయం గమనించడంతో అతను అంకిత్ శర్మగా నిర్దారణ అయ్యింది. దీనిపై హుస్సేన్‌తో పాటు 11 మందిపై కేసు నమోదైంది. అంకిత్ శర్మను అతి దారుణంగా హత్య చేశారు. విచారణలో అంకిత్ శర్మ 51 కత్తిపోట్లకు గురైనట్లు తేలింది.2023. మార్చిలో , అల్లర్లు, వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రేరేపించడం, హత్య, నేరపూరిత కుట్ర వంటి నేరాలకు సంబంధించి హుస్సేన్‌తో సహా 11 మంది నిందితులపై కోర్టు అభియోగాలను నమోదు చేసింది. ఆ సమయంలో తన గ్రూపును హుస్సేన్ రెచ్చగొట్టారనే ప్రాసిక్యూషన్ వాదనను కోర్టు సమర్ధించడంతో వారికి జైలు శిక్ష పడింది.తన బెయిల్‌కు చేసుకున్న అభ్యర్థనను కూడా అంతకుముందు ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. హుస్సేన్‌పై అభియోగాలు తీవ్రంగా ఉండటంతో బెయిల్ ఇవ్వడానికి ఢిల్లీ కోర్టు నిరాకరించింది. గత తీర్పులో వారిని దోషులుగా తేల్చగా, తాజాగా వారికి శిక్షలు ఖరారు చేసింది. -
పార్లమెంట్లో పేలిన హుండీ చోరీ స్కిట్
సాక్షి, ఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అయోధ్య రామమందిర కానుకల దొంగతనాలపై పార్లమెంటు ఎదుట శుక్రవారం కాంగ్రెస్ వినూత్న రీతిలో నిరసన తెలిపింది. ఆ పార్టీ ఎంపీ పప్పూయాదవ్ కాషాయ వస్త్రాలు ధరించారు. పూజారి వేషంలో విరాళాల పెట్టె పట్టుకొని ముఖద్వారం వద్ద కూర్చొని నిరసన తెలిపారు.ఆ సమయంలో అక్కడి ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అరుస్తూ హుండీలో కానుకలు వేశారు.హుండీలో కానుకలు పూజారి వేషంలో వచ్చిన పప్పూ యాదవ్ మంత్రాలు చదువుతూ పార్లమెంటు ఎదుట ముఖద్వారం వద్ద విరాళాల పెట్టె పట్టుకొని కూర్చున్నారు. దీంతో ఎంపీలంతా ఒక్కొక్కరిగా అతనికి హుండీలో విరాళాలు వేశారు. ఈ సందర్బంగా లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పప్పూయాదవ్‌కు నమస్కారం పెట్టి హుండీలో కానుకలు వేశారు. ఈ నిరసనలో ఎంపీలంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎంపీలు "అమిత్ షా పార్లమెంటుకు ఎందుకు గైర్హాజరయ్యారు?" అని రాసి ఉన్న బ్యానర్లను ప్రదర్శించారు.రామమందిర చోరీ కేసుజూన్ 2026లో వెలుగులోకి వచ్చిన అయోధ్య రామాలయ హుండీ చోరి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భక్తుల నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఆలయ లెక్కింపు సిబ్బంది, ఇతర నిందితులు కలిసి సుమారు రుూ. ఏడు కోట్ల నుండి రూ. 7.5 కోట్ల వరకు విరాళాల సొమ్మును కాజేసినట్లు ప్రాథమిక నివేదికలు తెలిపాయి. ఈ కేసులో ఇప్పటివరకు 8 మంది నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపారు.ఈ సందర్భంగా ఎంపీ డింపుల్ యాదవ్ మాట్లాడుతూ "అయోధ్య విరాళాల చోరీ వెనుక బడా నేతలు ఉన్నారు. చిన్న చిన్న వ్యక్తులను జైల్లో వేస్తున్నారు. వేల కోట్ల రూపాయల చందా చోరీ జరిగింది. రసీదులు ఇవ్వకుండా పెద్ద ఎత్తున విరాళాలు చోరీ చేశారు. చాలామంది బంగారం వెండి నాణేలు కూడా ఇచ్చారు. వాటి వివరాలు లేవు. భక్తిశ్రద్ధలతో ఇచ్చిన విరాళాలను దొంగతనం చేశారు. విరాళాల చోరీ పైన పార్లమెంట్లో చర్చ జరగాలి. భక్తుల విశ్వాసంతో ఆటలాడుకుంటున్నారు విరాళాల చోరీ అంశాన్ని రాబోయే ఎన్నికల ఎజెండాగా మారుస్తాం" అని అన్నారు.BJP: "Don't question Ram Mandir donations"OPPOSITION: Brings a Baba to Parliament. 🟧@RahulGandhi + Opposition MPs just staged the most unique protest we've ever seen.Pappu Yadav cosplayed as Baba with a donation box outside Parliament. Message was clear:IF YOU WON'T GIVE…— Sananda Banik (@Sbwritesco) July 31, 2026 -
మరోసారి కేంద్ర క్యాబినేట్ భేటీ .. కీలక నిర్ణయాలు?
సాక్షి, ఢిల్లీ: ఈ రోజు (శుక్రవారం) మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ (Union Cabinet) సమావేశం కానుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో విపక్షాల ఆందోళనలు, తాజా బిల్లుల వ్యూహాలపై ఈ భేటీలో చర్చించనుంది. కాగా నిన్న రాత్రి ప్రధాని మోదీ అత్యంత కీలకమైన భద్రతపై క్యాబినెట్ కమిటీ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఇంతలోనే క్యాబినేట్ మరోసారి సమావేశం కానుంది.ఈ రోజు జరగబోయే భేటీలో ఇటీవల ఆమోదం పొందిన జాతీయ గౌరవ నిరోధక సవరణ బిల్లు-2026, పేపర్ లీకేజీల నిరోధక బిల్లు వంటి కీలక అంశాలపై తదుపరి పార్లమెంటరీ వ్యూహాలను ఖరారు చేయనున్నారు.దానితో పాటు పశ్చిమాసియా యుద్ధ ప్రభావం వల్ల అంతర్జాతీయంగా ఎరువుల దిగుమతులకు ఆటంకం కలగవచ్చు. దేశంలోని రైతులకు రాబోయే రబీ సీజన్లో ఎరువుల కొరత రాకుండా, ప్రత్యామ్నాయ దేశాల నుంచి స్టాక్‌ను తెప్పించుకునే వ్యూహాత్మక ప్రణాళికను సిద్ధం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.కాగా నిన్న జరిగిన భేటీలో పశ్చిమాసియాలో ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితులు భారత రక్షణ, ఆర్థిక రంగాలపై దాని ప్రభావాన్ని సమీక్షించారు. ఈ సందర్బంగా యుద్ధ ప్రాంతాల్లో చిక్కుకున్న భారతీయ నావికులకు, ప్రవాస భారతీయుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని ఆదేశించారు. వారి కుటుంబాలకు సమాచారం, అత్యవసర సహాయం అందించేందుకు ప్రత్యేక సహాయక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు.అదే విధంగా పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల ముడిచమురు, ఎల్పీజీ, ఎల్ఎన్జీ సరఫరాకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ దేశాల నుంచి దిగుమతులను వేగవంతం చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కేంద్ర క్యాబినేట్ మరోసారి భేటీ కాబోతుంది.కాగా విపక్షాల ఆందోళన కారణంగా రాజ్యసభ ఆగస్టు 3వరకూ వాయిదా వేసినట్లు స్పీకర్ ప్రకటించారు. -
కుప్పకూలిన భవనం.. తొమ్మిది మంది మృతి
ముంబై: మహారాష్ట్ర భీవండిలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ రోజు (శుక్రవారం) ఉదయం శిథిలావస్థకు చెందిన ఓ భవనం మరమ్మత్తులు చేస్తున్న సమయంలో కుప్పకూలింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. దీంతో వివరాలు తెలుసుకున్న సహాయక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు.భీవండి నిజంపూర్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతంలోని ఈ పురాతన భవనం శిథిలావస్థకు చేరుకుందని గతంలోనే మున్సిపల్ అధికారులు హెచ్చరించారు. అయినప్పటికీ పట్టించుకోకుండా భవన నిర్మాణ పనులు చేపట్టారు. దీంతో భవనం కుప్పకూలినట్లు అధికారులు తెలిపారు. ఘటనా వివరాలు తెలుసుకున్న వెంటనే భీవండి ఫైర్ సిబ్బంది, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) బృందాలు భారీ యంత్రాల సహాయంతో సహాయక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకూ ఇద్దరి మృతదేహాలు వెలికితీశామని అధికారులు పేర్కొన్నారు. -
మోదీపై అభ్యంతకర పోస్టులు.. మెటా హెడ్‌పై కేసు
సాక్షి, హైదరాబాద్: ఇటీవల జంతర్ మంతర్ వద్ద సీజేపీ చేపట్టిన నిరసనలలో ప్రధాని మోదీకి అభ్యంకతరంగా పోస్టులు చేశారంటూ మోటా ఇండియా హెడ్ అరుణ్ శ్రీనివాస్‌పై కేసు నమోదైంది. ఆయనతో పాటు పలువురి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలపై ఇద్దరు బీజేపీ కార్యకర్తలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రధాని మోదీకి సంబంధించినటువంటి అభ్యంతరకరమైన, తప్పుడు కంటెంట్‌ను తమ ఫ్లాట్పారమ్లపై (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్) ప్రసారం కావడానికి అనుమతించారని,అటువంటి పోస్టులను తొలగించడంలో విఫలమయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇన్స్టాగ్రామ్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు, ప్రధానమంత్రిని అసభ్యకరంగా, అవమానకరంగా మరియు తప్పుదోవ పట్టించే విధంగా చిత్రీకరిస్తూ మార్ఫింగ్ చేయబడిన, డిజిటల్‌గా తారుమారు చేయబడిన అనేక వీడియోలు ,చిత్రాలు అందులో కనిపించాయని తెలిపారు.కాగా నీట్లీకేజ్కు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టింది. దీంతో మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ రాజీనామా చేశారు. మరిన్ని డిమాండ్లను సైతం కేంద్రం ముందుంచింది. -
వందేమాతరంపై ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: పార్లమెంటులో ఇటీవల ఆమోదం పొందిన వందేమాతరం బిల్లుపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వందేమాతరాన్ని జాతీయగీతంగా ప్రకటించే అంశంలో అప్పటి రాష్ట్రపతి ఒక పెద్ద తప్పు చేశారని తాను భావిస్తున్నట్లు తెలిపారు. వందేమాతరం దేవదేవతల ఆరాధనతో ముడిపడి ఉంటుందని. ఆయన ఎలాంటి అధికారిక తీర్మానం లేకుండానే దానిని 'జాతీయ గీతం'గా ప్రకటించారాని దాని కోసం ఒక తీర్మానం చేయాల్సిందన్నారు.వందేమాతరానికి చట్టపరమైన రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన 'ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ (అమెండ్మెంట్) బిల్లు, 2026' ఇటీవలే ఉభయసభల్లో ఆమోదం పొందింది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఈ బిల్లు చట్టరూపం దాల్చనుంది. వందేమాతరం ఆలపించకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం, లేదా దాని గానానికి భంగం కలిగించడం, లేదా అవమానించడం వంటి చర్యలను క్రిమినల్ నేరంగా పరిగణిస్తారు. అయితే తాజాగా ఈ బిల్లుపై అసదుద్దీన్ ఓవైసీ విమర్శలు వ్యక్తం చేశారు.అసదుద్దీన్ మాట్లాడుతూ "మీరు 'జన గణ మన' పాడినప్పుడు, దానిలో మీకు ఏమి కనిపిస్తుంది? మీకు ఈ దేశం, దాని ప్రజలు కనిపిస్తారు. మీరు 'వందేమాతరం' పాడినప్పుడు, అది దేవదేవతల ఆరాధనతో ముడిపడి ఉంటుంది. ఇప్పుడు, దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన ఆ 'ముజాహిదీన్-ఎ-ఆజాదీ' (స్వాతంత్ర్య సమరయోధుల) గురించి మీరేం చెబుతారు? 'జన గణ మన' ప్రజల కోసం వ్రాయబడింది. 1950లో రాజేంద్ర ప్రసాద్ ఒక పెద్ద తప్పు చేశారని నేను నమ్ముతున్నాను. ఆయన ఎలాంటి అధికారిక తీర్మానం లేకుండానే దానిని 'జాతీయ గీతం'గా ప్రకటించారు, కానీ దాని కోసం ఒక తీర్మానం ఆమోదించి ఉండాల్సింది. 'జాతీయ గీతం' నిర్వచనం ఎక్కడా ఇవ్వబడలేదు. (కేంద్ర ప్రభుత్వం) రాజ్యాంగంలోని 25, 26, 29 అధికరణలను ఉల్లంఘిస్తున్నారు." అని అన్నారు. -
పర్యావరణ అనుమతులపై సుప్రీం కోర్టు కీలక తీర్పు
సాక్షి, ఢిల్లీ : పర్యావరణ అనుమతులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ముందస్తు పర్యావరణ అనుమతులు తీసుకోకుండా పనులు ప్రారంభించిన ప్రాజెక్టులకు, పర్యావరణ అనుమతులు ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. కేంద్ర ప్రభుత్వం ఒక సాధారణ మెమోరాండమ్ (OM) ద్వారా పోస్ట్-ఫాక్టో (ముందు పని తరువాత అనుమతి) కుదరదని తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ విధానాన్ని అమలు చేసేందుకు కేంద్రం జారీ చేసిన 2021 ఆఫీస్ మెమోరాండమ్‌ను రద్దు చేసింది.ఫాస్ట్ ఫ్యాక్టో పర్యావరణ అనుమతుల కోసం ఆఫీస్ మెమోరాండం మాత్రమే సరిపోదని తెలిపింది. ఎట్టిపరిస్థితుల్లో నోటిఫికేషన్ ఇవ్వాల్సిందేనని పేర్కొంది. చట్టబద్ధ నోటిఫికేషన్ ద్వారా అవసరమైతే పోస్ట్-ఫాక్టో (తర్వాతి దశలో) పర్యావరణ అనుమతులు ఇచ్చే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం చట్టపరమైన నోటిఫికేషన్ జారీ చేసి పోస్ట్-ఫాక్టో పర్యావరణ అనుమతుల వ్యవస్థను అమలు చేసే అవకాశం ఉంది.ఈ కేసు వివరాలు2006 నాటి పర్యావరణ ప్రభావ అంచనా నిబంధనల ప్రకారం ఏ ప్రాజెక్టు ప్రారంభించాలన్నా ముందస్తు పర్యావరణ అనుమతి తప్పనిసరిగా ఉండేది. అయితే, ముందస్తు అనుమతులు లేకుండా అక్రమంగా పనులు ప్రారంభించిన కంపెనీలు/ప్రాజెక్టులకు, తదనంతరం (పోస్ట్-ఫాక్టో) అనుమతులు మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2017లో ఒక నోటిఫికేషన్, 2021లో ఒక ఆఫీస్ మెమోరాండమ్ (OM) జారీ చేసింది."వనశక్తి" అనే పర్యావరణ పరిరక్షణ స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం — చట్టబద్ధమైన పర్యావరణ నిబంధనలను కేవలం కార్యాలయ ఉత్తర్వుల (OM) ద్వారా సవరించడం చెల్లదని, ఇది పర్యావరణ చట్టాల ఆశయానికి విరుద్ధమని పేర్కొంటూ 2021 OMను కొట్టివేసింది. అయితే, ఇప్పటికే గత అనుమతుల ఆధారంగా మొదలైన ప్రాజెక్టులు దెబ్బతినకుండా పాత అనుమతులను సమర్థించింది. -
అమిత్‌షా ఆదేశాల ప్రకారమే దాడులు.. రాహుల్
సాక్షి, ఢిల్లీ: పేపర్ లీక్‌పై ఏం జరిగిందో ప్రభుత్వానికి తెలియాలంటే బీజేపీ ఎంపీలు వారి పిల్లలను అడగాలని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. యాంటీ పేపర్ లీక్ బిల్లుపై లోక్‌సభలో చర్చ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడారు. నీట్ పేపర్ లీక్‌పై విద్యార్థులు శాంతియుత నిరసన చేపట్టారని అన్ని పార్టీలు విద్యార్థులు ఆందోళనను గౌరవించాలన్నారు. ఢిల్లీ వీధుల్లో జరిగింది నిరసన కాదని అది భావప్రకటన స్వేచ్ఛని రాహుల్ గాంధీ కేంద్రాన్ని దుయ్యబట్టారు.విద్యావ్యవస్థ క్రూరంగా మారిపోయింది. విద్యను ప్రైవేటీకరించారు. విద్యను ఆరెస్సెస్మయం చేశారు. ఇది యూపీఏ పాలన.. మా మంత్రి రాజీనామా చేయరని మరో మంత్రి రాజ్‌నాథ్ అన్నారు. ధర్మేంద్ర ప్రదాన్‌ను విద్యాశాఖ మంత్రి అని మేం అనుకోలేదు. దేశంలో విద్యాశాఖను ఆరెస్సెస్నడిపిస్తోంది. దేశంలోని అన్ని యూనివర్సిటీలకు ఆరెస్సెస్ మనుషులే వీసీలుగా ఉన్నారు ఉన్నారు.భయాన్ని దాటుకుని విద్యార్థులు పోరాటం చేశారు. విద్యార్థులపై దాడికి హోం మంత్రే ఆదేశాలు ఇచ్చారు. విద్యార్థులపై పెల్లెట్స్ దాడికి హోం మంత్రే కారణం. నీట్‌పై చర్చ జరుగుతున్న సమయంలో హోం మంత్రి ఇప్పుడు ఇక్కడ ఎందుకు లేరు?. ఆయనకి ఇక్కడ కూర్చునే ధైర్యం లేదు. ఆయన భయంతో వణికిపోతున్నారు. పోలీసుల చర్యపై విద్యార్థులకు అమిత్ షా క్షమాపణలు చెప్పాలి అని రాహుల్ డిమాండ్ చేశారు.రిజిజు అభ్యంతరంకాగా రాహుల్ ప్రసంగంపై దుమారం చెలరేగింది. ఆయన చేసిన ‘ఇడియట్స్’ వ్యాఖ్యలతో ఎన్డీయే ఎంపీలు ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ వ్యాఖ్యలపై అని పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు అభ్యంతరం వ్యక్యం చేశారు. అన్ పార్లమెంటరీ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను కోరారు. ఆ సమయంలో స్పీకర్ ‘హుందాగా వ్యవహరించాలి’ అని సభ్యులను ఉద్దేశించి సూచించారు. రాహుల్‌వి తప్పుడు ఆరోపణలన్న కిరెన్ రిజిజు.. ఆధారాల్లేకుండా ఆయన ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. ‘‘విద్యార్థుల పేరుతో అనుచిత వ్యాఖ్యలు సరికాదు. హోం మంత్రే ఆదేశాలు ఇచ్చారని ఎలా అంటారు. రాహుల్ క్షమాపణలు చెప్పాలి’’ మంత్రి డిమాండ్ చేశారు. -
ఈ జెన్‌జీ భాష కనిపెట్టింది ఎవరో తెలుసా?
నిన్నటి వరకు సోషల్ మీడియా మీమ్స్, చాటింగ్‌ల్లో మాత్రమే కనిపించిన జెన్ జీ భాష.. ఇప్పుడు దేశ అత్యున్నత ప్రజాస్వామ్య వేదికలోనూ వినిపించింది. రాజకీయ విమర్శలకు యువత వాడే స్లాంగ్ పదాలను ఎంపీలు ఉపయోగించడం ఆసక్తికర చర్చకు దారితీసింది. సాధారణంగా ఇన్స్టాగ్రామ్ రీల్స్, మీమ్స్, ఆన్లైన్ సంభాషణల్లో కనిపించే పదాలు.. తాజాగా లోక్‌సభ చర్చలోనూ చోటు దక్కించుకున్నాయి.నీట్ పేపర్ లీక్ అంశంపై జరిగిన చర్చలో శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే తొలుత Gen Z పదజాలాన్ని ప్రస్తావించారు. ప్రతిపక్షాల నిరసనలను విమర్శిస్తూ.. ‘MIA’ (Missing In Action), ‘FOMO’ (Fear Of Missing Out), ‘Delulu’ (Delusional) వంటి పదాలను ఉపయోగించారు. ఆ తర్వాత బీజేపీ ఎంపీ బాన్సురి స్వరాజ్ కూడా ‘Clock it’ అనే పదాన్ని తన ప్రసంగంలో ప్రస్తావించారు. తేజస్వి సూర్య సైతం ‘Delulu’, ‘source code’ వంటి పదాలను ఉపయోగిస్తూ తన వాదనను వినిపించారు.It's raining Gen Z lingo in Loksabha.BJP MP Bansuri Swaraj said that PM Modi clocked by bringing a bill against the Paper leak. https://t.co/ovC4uz8QKs pic.twitter.com/o2cNJtUT4k— Political Kida (@PoliticalKida) July 28, 2026 "Congress was having FOMO and staying in DELULU".Dr. Shrikant Shinde of Shivsena just bodied Congress in Loksabha in GenZ style! 😂 pic.twitter.com/LMN5IRUQmt— Political Kida (@PoliticalKida) July 28, 2026 అయితే ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే మాత్రం ఈ కొత్త భాషపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్లో చర్చ జరుగుతున్నది విద్యా వ్యవస్థలోని సమస్యలపై అని.. కేవలం కొత్త పదాల ప్రదర్శన కోసం కాదని సూచించారు. అయితే ఆ తర్వాత ఆమె కూడా ‘Delulu’ పదాన్ని ఉపయోగిస్తూ.. యువత మొత్తం తమవైపే ఉందని భావించొద్దని బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.'Delulu' takes over #LokSabha: #TejasviSurya, #SupriyaSule clash over who has Gen Z's support🌍 Catch the day's latest news here ➠ https://t.co/40gdOz6FIS 🗞️ pic.twitter.com/B9cr59wJTm— Economic Times (@EconomicTimes) July 28, 2026అసలు ఈ Gen Z భాష పుట్టింది ఎక్కడ?Gen Z స్లాంగ్ అనేది ఏ ఒక్క వ్యక్తి కనిపెట్టిన భాష కాదు. ఇది ఇంటర్నెట్, సోషల్ మీడియా, మీమ్ సంస్కృతి, డిజిటల్ జీవనశైలి కలిసి సృష్టించిన కొత్త భాషా రూపం. సాధారణంగా 1997 నుంచి 2012 మధ్య జన్మించిన వారిని Gen Zగా పిలుస్తారు. ఈ తరం చిన్నప్పటి నుంచే స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్, సోషల్ మీడియాతో పెరిగింది. అందుకే వీరి సంభాషణల్లో వేగం, సంక్షిప్తతకు ఎక్కువ ప్రాధాన్యం ఏర్పడింది.ఎక్కువ భావాన్ని తక్కువ పదాల్లో చెప్పడం, సరదాగా స్పందించడం, ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకోవడం కోసం కొత్త పదాలు పుట్టుకొచ్చాయి. మొదట చిన్న ఆన్లైన్ గ్రూపులు, గేమింగ్ కమ్యూనిటీలు, సోషల్ మీడియా చర్చల్లో మొదలైన ఈ పదాలు.. TikTok, Instagram, YouTube వంటి వేదికల ద్వారా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాయి.మీమ్స్‌తో మొదలై..జెన్‌జీ భాష వ్యాప్తిలో మీమ్ కల్చర్ కీలక పాత్ర పోషించింది. ఒక సంఘటనను లేదంటే ఒక భావాన్ని సీరియస్‌గా కాకుండా సరదాగా చెప్పేందుకు యువత కొత్త పదాలను ఉపయోగించడం మొదలుపెట్టింది. ఒకప్పుడు కొత్త పదాలు సినిమాలు, టెలివిజన్, సంగీతం ద్వారా ప్రజల్లోకి వెళ్లేవి. ఇప్పుడు సోషల్ మీడియా ఆ స్థానాన్ని తీసుకుంది. ఒక వైరల్ వీడియో, ఒక మీమ్ లేదంటే ఒక ట్రెండ్ ద్వారా పుట్టిన పదం కొన్ని రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతోంది. ఇలా డిజిటల్ ప్రపంచంలో పుట్టిన పదజాలం ఇప్పుడు రాజకీయాలు, వ్యాపారం, ప్రకటనలు వంటి రంగాల్లోకి కూడా ప్రవేశించింది.యువత ఎందుకు ఇష్టపడుతోంది?ఈ భాషలో కొన్ని పదాలకు ప్రత్యేకమైన అర్థాలు ఉన్నాయి. ‘Delulu’ అంటే వాస్తవానికి దూరమైన ఊహల్లో ఉండటం, ‘FOMO’ అంటే ఏదైనా అవకాశం కోల్పోతామేమో అన్న భయం, ‘MIA’ అంటే కనిపించకుండా పోవడం, ‘Clock it’ అంటే ఒక విషయాన్ని గుర్తించడం లేదా నిజాన్ని బయటపెట్టడం. ‘Rizz’ అంటే ఆకర్షించే వ్యక్తిత్వం, ‘Slay’ అంటే అద్భుతంగా చేయడం, ‘No cap’ అంటే నిజం చెబుతున్నాను అనే అర్థం. సోషల్ మీడియా, మీమ్ కల్చర్ ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ పదాలు ఇప్పుడు యువత సంభాషణల్లో భాగమయ్యాయి.జెన్‌జీ భాషకు ప్రధాన ఆకర్షణ దాని సరళత, వేగం. సుదీర్ఘమైన భావాలను ఒకే పదంతో వ్యక్తం చేసే అవకాశం ఈ స్లాంగ్ ఇస్తోంది. అంతేకాదు.. ఒకే తరానికి చెందిన వారు ఒకే రకమైన పదాలను ఉపయోగించడం ద్వారా తమ మధ్య ప్రత్యేకమైన అనుబంధాన్ని కూడా ఏర్పరుచుకుంటున్నారు. ఇది కేవలం మాట్లాడే విధానంలో మార్పు కాదు.. డిజిటల్ యుగంలో ఒక తరం తన గుర్తింపును వ్యక్తం చేసుకునే మార్గంగా మారింది.వ్యాపారాలకు కూడా ఉపయోగమే..ఇప్పుడు కేవలం యువత సంభాషణలకే ఈ భాష పరిమితం కాలేదు. యువ ప్రేక్షకులను ఆకట్టుకోవాలనుకునే కంపెనీలు, బ్రాండ్లు కూడా ఈ పదజాలాన్ని గమనిస్తున్నాయి. ప్రకటనలు, సోషల్ మీడియా ప్రచారాల్లో యువతకు దగ్గరగా ఉండే భాషను ఉపయోగించేందుకు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఒక తరం ఎలా ఆలోచిస్తోంది, ఎలా స్పందిస్తోంది అనే విషయాలను అర్థం చేసుకోవడానికి ఈ స్లాంగ్ ఒక సాధనంగా మారింది.విమర్శలు కూడా..అయితే Gen Z భాషపై విమర్శలు కూడా ఉన్నాయి. అధికారిక వేదికల్లో ఇలాంటి స్లాంగ్ పదాలను ఉపయోగించడం సరైనదేనా అనే ప్రశ్నలు కొందరు లేవనెత్తుతున్నారు. ముఖ్యంగా విద్య, విధానాలు వంటి తీవ్రమైన అంశాలపై చర్చ జరిగే సమయంలో భాష మరింత గంభీరంగా ఉండాలని కొందరి అభిప్రాయం.భాష ఎప్పుడూ మారుతూ ఉంటుంది. ఒకప్పుడు కొత్తగా అనిపించిన ఎన్నో పదాలు ఇప్పుడు సాధారణ వాడుకలోకి వచ్చాయి. టెక్నాలజీ, సినిమాలు, వీధి సంస్కృతి నుంచి గతంలో పదాలు వచ్చినట్లే.. ఇప్పుడు సోషల్ మీడియా కొత్త పదాలకు వేదికగా మారింది. Gen Z భాష వెనుక అసలు కథ కొన్ని విచిత్రమైన పదాల కథ కాదు. ఇంటర్నెట్ యుగంలో పెరిగిన ఒక తరం తన భావాలను, ఆలోచనలను, గుర్తింపును వ్యక్తం చేసుకునేందుకు సృష్టించుకున్న కొత్త శైలి. అందుకే మీమ్స్, చాటింగ్‌ల నుంచి మొదలైన ఈ భాష.. ఇప్పుడు పార్లమెంట్ చర్చల వరకూ చేరింది.:::వెబ్ ప్రత్యేకం -
ధర్మేంద్రను తొలగించి ప్రధానికి కాపాడారు.. అఖిలేష్
కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూఎన్నో ఎంట్రన్స్ పేపర్లు, ఉద్యోగ పరీక్షల పేపర్లు లీకయ్యాయిపేపర్ లీకేజ్‌కు పాల్పడిన ముఠా రూ. 10 కోట్లు చెల్లించాలిలీకేజ్కు పాల్పడిన నిందితులకు 10 ఏళ్ల జైలు శిక్షపేపర్ లీకేజ్‌ల కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయబోతున్నాంఈ బిల్లు ద్వారా బాధితులకు సత్వరం న్యాయం జరుగుతుంది. అఖిలేష్ యాదవ్ కామెంట్స్ యువత కేంద్రం మెడలు వంచింది.గతంలో రైతులు కూడా ఈ విధంగానే చేశారుధర్మేంద్రను తొలగించి ప్రధానిని కాపాడారుఎన్డీఏ హయాంలో అనేకసార్లు పేపర్లీకేజ్లు ఎన్డీఏ హయాంలోనే రామ్‌మందిర్‌లో చోరీ జరిగింది -
జంతర్‌మంతర్ .. ఢిల్లీలో మునిగితే ముస్సోరిలో తేలాడు
సాక్షి, ఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద నిరసనకారులకు ఆహరం పంపిణీ చేసిన వ్యక్తిని పోలీసులు విచారించిన తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. జునైద్ అనే వ్యక్తి అక్కడి నిరసన కారులకు ఆహరం సరఫరా చేశారు. దీనిని గమనించిన పోలీసులు అతనిని భిన్న విధాలుగా ప్రశ్నించి చివరికి కళ్లకు గంతలు కట్టి ముస్సోరిలో వదిలేశారు. ఈ వివరాలను ఆ బాధితుడు సోషల్ మీడియావేదికగా పంచుకున్నారు.వివరాల్లోకి వెళితే గత శుక్రవారం జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న నిరసనకారులకు జునైద్ ఆహరం సరఫరా చేస్తున్నాడు. అయితే ఆ సమయంలో ఢిల్లీ పోలీసులు అతని వద్దకు వచ్చి ప్రశ్నించడం మెుదలు పెట్టారు. నువ్వు ఈ ఆహరం ఎందుకు పంపిణీ చేస్తున్నావు. దీనికోసం నీకు ఎవరు సహాయం చేస్తున్నారు. రాత్రంతా పోలీసుల అదుపులో ఉంచుకొని ఆ బాధితుడు కళ్లకు గంతలు కట్టి క్యాబ్‌లో తీసుకెళ్లి ముస్సోరిలో వదిలివేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.అయితే ఈ వివరాలు తెలుసుకున్న విద్యార్థుల న్యాయ సహాయ బృందం తనను సంప్రదించిందన జునైద్ తెలిపారు. కాగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం ధర్నా చేయగా ఎట్టకేలకు మంత్రి రాజీనామా చేశారు. దీంతో సీజేపీ నిరసన ముగిసింది.Mohammad Junaid Used and Thrown by CJP Founders!!Mohammad Junaid who played the biggest part in CJP Protest by supplying Non Stop Bread Pakodas, Samosas, Biryani and various other dishes for 40 days is now feeling cheated by CJP Founders!!During an Interview the reporter… pic.twitter.com/L9j8qiwyaa— Rohit (@Iam_Rohit_G) July 26, 2026 -
శబరిమల భక్తులకు గుడ్‌న్యూస్.. రైల్వేలైన్ పనులు ప్రారంభం
తిరువనంతపురం: సంవత్సరాల తరబడి నెలకొన్న అనిశ్చితి, జాప్యం తర్వాత, కేరళ ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను ప్రారంభించడంతో అంగమాలి - శబరి రైల్వే ప్రాజెక్టుకు పెద్ద ఊపు వచ్చింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టుకు మార్గం సుగమం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను ప్రారంభించిందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్‌సభలో ప్రకటించారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రాజెక్టు కోసం భారతీయ రైల్వే ₹505 కోట్లు కేటాయించింది.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థన మేరకు కేరళ ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను ప్రారంభించిందని, శబరి రైల్వే లైన్ నిర్మాణానికి ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని మంత్రి తెలిపారు. జూలై 22న లోక్‌సభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో ఆయన ఈ ప్రకటన చేశారు. భూసేకరణ ప్రక్రియకు సంబంధించి రైల్వే మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని ఆయన పేర్కొన్నారు.అంగమాలి-శబరి రైల్వే ప్రాజెక్ట్ మరియు ఆలస్యానికి గల కారణాలు1997-98లో ఎరుమేలి మీదుగా వెళ్లే 111 కిలోమీటర్ల అంగమాలి-శబరి రైల్వే లైన్‌ను మంజూరు చేశారు. 7 కిలోమీటర్ల అంగమాలి-కాలడి సెక్షన్ నిర్మాణం , 10 కిలోమీటర్ల కాలడి-పెరుంబవూర్ సెక్షన్‌పై ప్రాథమిక పనులు ప్రారంభమయ్యాయి. అయితే, రాష్ట్ర ప్రభుత్వం నుండి తగినంత మద్దతు లేకపోవడం, భూసేకరణ మరియు రైల్వే అలైన్‌మెంట్‌కు సంబంధించిన నిరసనలు , న్యాయపరమైన వివాదాల కారణంగా ఈ ప్రాజెక్టు ఆలస్యమైంది.సవరించిన ప్రాజెక్టు వ్యయం ₹3,801 కోట్లకు పెరిగిందని, ఈ సవరించిన అంచనా ఆమోదం , ప్రాజెక్టు వ్యయ పంపిణీ కోసం కేరళ ప్రభుత్వానికి ప్రతిపాదనను సమర్పించినట్లు మంత్రి తెలిపారు.2024 ఆగస్టులో , కేరళ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు షరతులతో కూడిన ఆమోదం ఇచ్చింది. అయితే, ప్రాజెక్టు వ్యయంలో 50% భరించడానికి రాష్ట్రం బేషరతుగా అంగీకరించాలని రైల్వే మంత్రిత్వ శాఖ కోరింది. ప్రాజెక్టు వ్యయంలో రాష్ట్రానికి ఉన్న 50% వాటాను ఉపయోగించి అవసరమైన భూమిని సేకరించాలని రైల్వే మంత్రి ముఖ్యమంత్రిని కూడా అభ్యర్థించారు.ప్రాజెక్టుకు అవసరమైన 302 హెక్టార్ల భూమిలో , ఇప్పటివరకు కేవలం 25 హెక్టార్లను మాత్రమే సేకరించారు. మిగిలిన 279 హెక్టార్లను ఇంకా సేకరించాల్సి ఉంది.అంగమలీ-శబరి రైల్వే ప్రాజెక్ట్ 14 ప్రతిపాదిత స్టేషన్లు అంగమలీ, కాలడి, పెరుంబవూరు, ఊడక్కలి, కొత్తమంగళం, మువాట్టుపుజా, వజకులం, తొడుపుజా, కరీంకున్నం, రామాపురం, భరణంగానం, చెమ్మలమట్టం, కంజిరపల్లి , ఎరుమేలి. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత శబరిమల యాత్రికులకు ఎంతో ప్రయోజనం చేకూర్చడంతో పాటు, మధ్య కేరళ వ్యాప్తంగా అనుసంధానాన్ని, అభివృద్ధిని గణనీయంగా మెరుగుపరుస్తుందని అంతా భావిస్తున్నారు. -
ఎల్జీబీటీ కమ్యూనిటిపై మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఎల్జీబీటీక్యూపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఎల్జీబీటీక్యూ వ్యక్తులు ఎప్పుడూ భారతీయ సమాజంలో అంతర్భాగంగానే ఉన్నారని, వారిని బహిష్కరించడం కాకుండా గౌరవం, ఆమోదం తెలపాలని అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మోహన్ భగవత్ ఈ విధంగా మాట్లాడారు. భారతీయ సంప్రదాయాలు చాలాకాలం క్రితమే వీరిని గుర్తించాయని సమాజంలో వాటికి తగిన స్థానం కల్పించాయని ఆయన పేర్కొన్నారు.మోహన్ భగవత్ మాట్లాడుతూ.."ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీలన్నీ సమాజంలో ఉన్నాయి. ఇటువంటి స్వభావాలు సమాజంలో సహజంగానే కనిపిస్తాయి. కొన్ని పుట్టుకతోనే ప్రకృతిసిద్ధంగా వస్తే, మరికొన్ని మనుషుల ఆలోచనా విధానం లేదా శారీరక ధోరణుల కారణంగా ఏర్పడతాయి.కమ్యూనిటీ సభ్యులను ఎట్టి పరిస్థితుల్లోనూ వెలివేయకూడదని ఆయన స్పష్టం చేశారు. మన సంప్రదాయం వారి ఉనికిని అంగీకరిస్తుంది. వారు కూడా మనుషులే, వారికి జీవించే హక్కు ఉంది. వారిని సమాజం నుంచి బహిష్కరించలేదు; విశాలమైన మన సామాజిక జీవన విధానంలో వారికి కూడా ఒక స్థానం ఉంది" అని తెలిపారు.భారతీయ సమాజం అటువంటి వర్గాల పట్ల పక్షపాతంతో వ్యవహరించకుండా చారిత్రాత్మకంగా మానవతా దృక్పథాన్నే అనుసరించిందని ఆయన తెలిపారు. నేటికీ వారికి స్వంత దేవతలు, పుణ్యక్షేత్రాలు ఉన్నాయని కుంభమేళాలో పాల్గొనే మహామండలేశ్వరులు కూడా వీరున్నారని ఆయన గుర్తుచేశారు. భారతీయ సమాజం సాంప్రదాయబద్ధంగా ఈ అంశాన్ని ఎప్పుడూ నిశ్శబ్దంగా, అత్యంత సానుకూల దృక్పథంతో అర్థం చేసుకుంటూ వారిని సమాజంలో అంతర్భాగంగానే చూసిందని ఆర్ఎస్ఎస్ చీఫ్ అన్నారు.గతంలోనూ ఇలా సమలింగ సంపర్కం, ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ గురించి మోహన్ భగవత్ బహిరంగంగా మాట్లాడటం ఇదే మొదటిసారి కాదు. 2023 జనవరిలో ఆర్ఎస్ఎస్ అనుబంధ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఎల్జీబీటీక్యూ వ్యక్తులు ఇతరులలాగే జీవించే హక్కు ఉన్న మనుషులు కాబట్టి, వారికి సొంత వ్యక్తిగత, సామాజిక స్థలం ఉండాలి" అని పేర్కొన్నారు. హిందూ గ్రంథాలు, పురాణాలను ఉదాహరణగా చూపుతూ, భారతీయ నాగరికత వారిని సామాజికంగా వెలివేయకుండా చారిత్రాత్మకంగా ఆమోదించిందని ఆయన వాదించారు.పెద్దల అంగీకారంతో కూడిన స్వలింగ సంబంధాలను 2018లో భారత సుప్రీంకోర్టు భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్ 377ను కొట్టివేసి నేరరహితం చేసింది. అయితే, స్వలింగ వివాహాలు, ఎల్జీబీటీక్యూ+ వర్గాలు కోరుతున్న అనేక ఇతర హక్కులు ఇప్పటికీ చట్టపరమైన గుర్తింపు పొందలేదు. స్వలింగ సంపర్కాన్ని సంచలనాత్మకంగా మార్చకూడదని, అది సమాజంలో ఒక సహజ వాస్తవమని భగవత్ గతంలో కూడా చెప్పారు. 2019 అక్టోషన్లో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మహాభారతంలోని శిఖండి వంటి పాత్రలను ఉదాహరణగా చూపుతూ, భారతీయ సమాజంలో లైంగిక వైవిధ్యం చాలా కాలంగా ఉందని ఆయన వాదించారు. "దీనిపై అనవసరమైన రాద్ధాంతం చేయడం సహాయపడదు" అని, కాలంతో పాటు సమాజం కూడా పరిణామం చెందాలని ఆయన అన్నారు. -
మోదీపై అభ్యంతకర పోస్టర్.. నటిపై ఫిర్యాదులు
కోల్‌కతా:ప్రధాని నరేంద్ర మోదీపై 'అసభ్యకరమైన' పోస్టర్‌ను ప్రదర్శించారనే ఆరోపణలతో ప్రముఖ బెంగాలీ నటి శ్రీలేఖ మిత్రపై ఫిర్యాదు నమోదైంది. కోల్‌కతాలో ఇటీవల జరిగిన విద్యార్థి నిరసనలో మోదీ చిత్రపటాన్ని అసభ్యకరరీతిలో ప్రదర్శించారని నటి శ్రీలేఖపై పలు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి.నిన్న (ఆదివారం) ఆనంద్‌పూర్ పోలీసు స్టేషన్లో బీజేపీ నాయకురాలు కేయా ఘోష్, నటి శ్రీలేఖ మిత్రపై అధికారికంగా ఫిర్యాదు చేశారు. కేవలం ఒకే చోట కాకుండా బిధాన్నగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌తో సహా పలు జిల్లాల్లోని వివిధ పోలీసు స్టేషన్లలో ఆమెపై ఫిర్యాదులు దాఖలైనట్లు నివేదికలు వెల్లడించాయి.ఈ అంశమై బీజేపీ నేత మాట్లాడుతూ.. "దేశ ప్రధానిని అవమానించేలా ఒక అసభ్యకరమైన పోస్టర్‌ను ప్రదర్శించినందుకు నటి శ్రీలేఖ మిత్రపై ఫిర్యాదు దాఖలైంది, ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. శ్రీలేఖ మిత్రను వీలైనంత త్వరగా అరెస్ట్ చేయాలి" అని పేర్కొన్నారు.నిరసన ప్రదర్శన నేపథ్యంNEET ప్రశ్నాపత్రం లీకేజీకి వ్యతిరేకంగా, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కోల్‌కతా రోడ్లపై భారీ నిరసన ప్రదర్శన జరిగింది.ఈ నిరసనలో శ్రీలేఖ మిత్ర కూడా పాల్గొన్నారు. ఆ సమయంలో ఆమె ప్రధాని మోదీకి సంబంధించిన అభ్యంతరకరమైన/అసభ్యకరమైన చిత్రంతో ఉన్న పోస్టర్‌ను పట్టుకున్నట్లు ఫోటోలు వెలువడ్డాయి.అయితే దీనిపై శ్రీలేఖ మిత్ర తన సోషల్ మీడియా పేజీలో ఒక వీడియో స్టేషను విడుదల చేస్తూ ఘాటుగా స్పందించారు."నన్ను అరెస్ట్ చేయాలనుకుంటే అరెస్ట్ చేయండి; నన్ను ఉరిశిక్షకు పంపాలనుకుంటే ఉరిశిక్షకు పంపండి. దీనికి వ్యతిరేకంగా కూడా కచ్చితంగా ఒక ఉద్యమం వస్తుందని నేను నమ్ముతున్నాను" అని ఆమె సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. -
సీజేపీ నిరసనలు.. మద్యం షాపులపై కీలక నిర్ణయం
సాక్షి, ఢిల్లీ :ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనలు తీవ్రస్థాయికి చేరుతుండడంతో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు (శని, ఆదివారాలు) నుంచి ఆదివారం వరకూ రాజధాని నగరంలోని మద్యం షాపులన్నింటినీ రాత్రి 8 గంటలకే మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది.సాధారణంగా ఢిల్లీలో మద్యం షాపులు రాత్రి 10 గంటల వరకూ వైన్ షాపులు రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటాయి. అయితే ప్రస్తుతం జంతర్ మంతర్ వద్ద నిరసనలు శాంతిభద్రతల దృష్ట్యా, నగరంలో ప్రస్తుత పరిస్థితులను సమీక్షించిన ఢిల్లీ పోలీసులు మద్యం షాపుల వేళలను కుదించాలని ప్రభుత్వానికి సూచించారు.కాగా ఇటీవలే ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా గురువారం రాత్రి కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే మద్యం షాపులను త్వరగా మూసివేయడంతో కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో ప్రభుత్వం రాత్రి ఎనిమిది గంటలకే మద్యం షాపులను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. -
నీట్ నిరసనల్లో బిగ్‌ట్విస్ట్.. 400 మంది క్రిమినల్స్ ?
సాక్షి, ఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసనలపై ఢిల్లీ పోలీసులు కీలక ప్రకటన చేశారు. జూలై 20 నుండి జూలై 24 మధ్య జంతర్ మంతర్ దాని పరిసర ప్రాంతాలలో నేర చరిత్ర ఉన్న సుమారు 400 మంది వ్యక్తులను ఢిల్లీ పోలీసుల ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ గుర్తించినట్లు తెలిపారు. వీరిలో కొందరికి జూలై 20న జరిగిన హింసాత్మక ఘటనలు, విధ్వంసంతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నారు.నీట్ లీకేజ్‌పై నిరసనలతో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జులై 20 న భారీగా హింస చేలరేగిన సంగతి తెలిసిందే. తాజాగా పోలీసులు దానిపై విచారణను ముమ్మరం చేశారు. ఆ రోజున జరిగిన హింసాత్మక ఘటనల్లో నేరస్థులకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు గుర్తించిన నేర చరిత్ర కలిగిన వ్యక్తులలో సాహిల్, మనోజ్ కుమార్, రూబల్ సాహిల్ సైఫీ ఉన్నారు. నిరసన సమయంలో వీరు ఏవైనా వ్యవస్థీకృత ముఠాలలో భాగస్వాములుగా ఉన్నారా లేదా అనే అంశాన్ని పోలీసులు తనిఖీ చేస్తున్నారు.పార్లమెంట్ వర్షాకాల సమావేశాల మొదటి రోజున, 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) చేపట్టిన 'చలో సన్సద్' మార్చ్‌లో వేలాది మంది నిరసనకారులు పాల్గొన్నారు. విద్యా సంస్కరణలు చేపట్టాలని మరియు పరీక్షల్లో అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. హై-సెక్యూరిటీ జోన్‌లోని బారికేడ్లను బద్దలు కొట్టడానికి నిరసనకారులు ప్రయత్నించడంతో జూలై 20న హింస చెలరేగింది. తాజాగా దీనిపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. -
యువతకు కృతజ్ఞతలు.. మోదీ మరో వీడియో
సాక్షి, ఢిల్లీ: ప్రధాని మోదీ మరో వీడియో విడుదల చేశారు. నిన్న అర్థరాత్రి (గురువారం) తను పోస్ట్ చేసిన వీడియోపై అభిప్రాయాలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. విలువైన సూచనలు చేసిన యువతకు ప్రత్యేక కృతజ్ఞతలని పేర్కొన్నారు. యువతరం ఇచ్చే విలువైన సలహాలు దేశ భవిష్యత్తుకు మరింతగా సహకరిస్తాయని మోదీ అభిప్రాయపడ్డారు. కేంద్ర కేబినేట్ భేటీ అనంతరం మోదీ ఈ వీడియోని విడుదల చేశారు.మోదీ మాట్లాడుతూ "ధన్యవాదాలు మిత్రులారా. నిన్న రాత్రి ఆలస్యంగా మిమ్మల్ని కలిసే అవకాశం నాకు లభించింది. నా వీడియోకు మీరు స్పందించిన తీరును, మీ సానుకూల సూచనలను నేను అభినందిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు..." అని అన్నారు. కాగా నిన్న (గురువారం) నీట్ లీకేజ్‌పై జరుగుతున్న నిరసనలపై మోదీ కీలక ప్రకటన చేశారు" నీట్ లీకేజ్‌పై కేంద్ర కేబినేట్లో పేపర్‌లీక్‌పై చర్యలు తీసుకుంటామన్నారు. పేపర్ లీకెజ్‌లపై కఠిన చర్యలు తీసుకునేలా నిర్ణయాలుంటాయని తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకునేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ వివరాలను ఇన్‌స్టా వేదికగా వెల్లడించారు. #WATCH | Prime Minister Narendra Modi shared a video on his Instagram handle;, "Thanks to the youngsters who watched my video yesterday and sent insightful suggestions."He says, "Thank you friends. I had the opportunity to meet you late last night. I appreciate the way you… https://t.co/B4hrqwPwic pic.twitter.com/t6hfaVcvET— ANI (@ANI) July 24, 2026 -
బ్రో ఇక చాలు సోనమ్‌కు.. సల్మాన్ ఖాన్ విజ్ఞప్తి
సాక్షి, ఢిల్లీ: పేపర్ లీకేజీల నిరసనలపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన ఆందోళనకు మద్దతు తెలిపిన మరుసటి రోజే, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సామాజిక వేత్త సోనమ్ వాంగ్చుక్ను తన నిరాహార దీక్షను విరమించాలని కోరారు. వాంగ్చుక్కు తన ఇంటి నుంచి వండిన భోజనాన్ని పంపుతానని.. పేపర్ లీకేజీలపై ప్రధానమంత్రి ఇప్పటికే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినందున నిరసన తెలుపుతున్న విద్యార్థులను కూడా తమ ఇళ్లకు తిరిగి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు.సల్మాన్ మాటల్లో "సోనమ్, ఇంకా చాలు బ్రో. దీన్ని ఇంకా పొడిగించవద్దు. అత్యవసరమైతే ఆ పట్టుదలను మరొక దాని కోసం ఉంచుకోండి—అయినా ఇప్పుడు దానికి అవసరం లేదనే భావిస్తున్నాను. ఏదైనా తినండి. నీకు కావాలంటే మా ఇంటి నుంచే భోజనం పంపిస్తాను" అని సల్మాన్ సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు.చదువు పరంగా, భద్రత పరంగా విద్యార్థులే దేశానికి మొదటి ప్రాధాన్యత అని, ప్రధాని నుంచి ఇప్పటికే హామీ లభించినందున వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సల్మాన్ నొక్కి చెప్పారు. "విద్యాపరంగా, భద్రత పరంగా విద్యార్థులే అత్యున్నత ప్రాధాన్యత. కాబట్టి వారు భయపడాల్సిన పనిలేదు, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేయాల్సిన అవసరం లేదు. గౌరవనీయ ప్రధానమంత్రి ట్వీట్ చేశారు. ఈ లీకేజీకి బాధ్యులైన వారందరిపై ఆయన కఠిన చర్యలు తీసుకుంటారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. కాబట్టి విద్యార్థులారా, దయచేసి మీ ఇళ్లకు, మీ తల్లిదండ్రుల వద్దకు తిరిగి వెళ్లండి" అని సల్మాన్ తెలిపారు.రాజకీయ హైజాక్బాలీవుడ్ స్టార్ అంతకుముందు కూడా విద్యార్థుల నిరసనకు మద్దతు తెలపడమే కాకుండా, వారి ఉద్యమాన్ని ఎవరూ 'హైజాక్' చేయకూడదని హెచ్చరించారు. ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో ఆయన విద్యార్థులు చేపట్టిన "శాంతియుత" నిరసనను ప్రశంసించడమే కాకుండా, వారిని "ధైర్యవంతులు, సాహసవంతులు" అని కొనియాడారు. "ఈ సమస్య విద్యార్థులకు, విద్యా వ్యవస్థకు మధ్య ఉన్నది. దీనిని రాజకీయంగా హైజాక్ చేయకూడదు. దీని శ్రేయస్సు అంతా మన దేశ విద్యార్థులకే దక్కాలి. ప్రభుత్వం కూడా వారికి పూర్తి మద్దతు ఇచ్చి, విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని నేను నమ్ముతున్నాను. ఇది అందరికీ మంచి జరిగే పరిస్థితి. అనుకూలమైన నిర్ణయం వస్తుందని ఆశిస్తూ ప్రార్థిస్తున్నాను. చదువుకోవాలనుకునే మీ అందరినీ దేవుడు ఆశీర్వదించుగాక" అని ఆయన అంతకుముందు రాసుకొచ్చారు.కాగా పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్ చుక్ తన నిరాహార దీక్షను విరమింపజేశారు. కేంద్రమంత్రి జేపీ నడ్డా అతనికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. -
కాక్రోచ్ ఆందోళన .. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, ఢిల్లీ: సీజేపీ నిరసనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర విద్యాశాఖ కార్యదర్శిని బదిలీ చేసింది. ఆయన స్థానంలో ఉన్నత విద్యాశాఖ నూతన కార్యదర్శిగా నరేశ్ పాల్ గంగ్వార్ని నియమించింది. ఈ మేరకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.ప్రస్తుత కార్యదర్శి వినిత్ జోషిని పంచాయతీరాజ్ శాఖకు బదిలీ చేసింది.అదే విధంగా ప్రధాని ఆదేశాలతో నీట్ లీకేజ్‌పై ఢిల్లీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసింది. రౌస్ అవెన్యూ కోర్టు కాంప్లెక్స్ పరిధిలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు సేవలు జరగనున్నాయి. స్పెషల్ కోర్టు జడ్జిగా అనుగ్రోవర్ని నియమించింది. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం కింద నమోదైన కేసులను విచారణ చేపట్టడం కొరకే స్పెషల్ కోర్టున ఏర్పాటు చేసినట్లు తెలిపింది. -
ప్లాన్-ఏకి భయపడి.. ప్లాన్-బీతో ఘాతుకం!
యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన పుణె లోహగఢ్ కోట హత్య కేసు దర్యాప్తులో మరిన్ని సంచలనాలు బయటకు వస్తున్నాయి. యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్‌తో వివాహం ఇష్టం లేకనే సియా గోయల్, చేతన్ చౌదరి కలిసి హత్య చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ఇప్పుడో షాకింగ్ విషయం బయటపడింది. ప్లాన్ ఏకు భయపడి.. ప్లాన్ బీను అమలు చేసి సియా ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. కేతన్, సియాలకు ఈ ఏడాది ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిగింది. నవంబర్‌లో రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఘనంగా వివాహం జరిపేందుకు ఇరు కుటుంబాలు ఏర్పాట్లలో తలమునకలై ఉన్నాయి. అయితే చేతన్‌తో ప్రేమలో ఉన్న సియా మాత్రం ఈ పెళ్లి ఎలాగైనా ఆపాలని తీవ్ర ప్రయత్నాలు చేసింది. ఓవైపు కేతన్‌తో సన్నిహితంగా ఉంటూనే.. మరోవైపు ప్రియుడితో దారుణమైన స్కెచ్‌లు గీసింది. ఇందుకోసం వెబ్ సిరీస్‌లు, క్రైమ్ సినిమాలు చూస్తూ గంటల తరబడి గడిపింది. చివరకు.. చేతన్‌తో కలిసి ఈ పెళ్లి ఆపడానికి రెండు ప్లాన్లు గీసింది. అందులో.. మొదటిది కేతన్కు యాక్సిడెంట్ చేయడం!. అతడిని గాయపరిచి పెళ్లిని వాయిదా వేయాలని.. ఆ తర్వాత కలిసి పారిపోవడమో లేదంటే ఈ గ్యాప్‌లో మరేదైనా ప్లాన్ అమలు చేయాలని భావించింది. అయితే ఆ ప్లాన్‌లో రిస్క్ ఎక్కువగా ఉందని భావించి డ్రాప్ అయ్యారు. కేతన్‌ను ఈ విషయం తెలిసిపోతే తమ పని అయిపోయినట్లేనని భయపడ్డారు. ఒకవేళ ప్లాన్ బెడిసి కొట్టి బలవంతంగా పెళ్లి జరిగితే ఆ తర్వాత తమ బంధం కొనసాగదని భావించారు. అందుకే ప్లాన్ బీ అమలు చేయాలని ఫిక్స్ అయ్యారు. పక్కా ప్లాన్ గీసి కేతన్‌ను అంతమొందించారు. సస్పెన్స్ సినిమాలు.. ఆన్లైన్ సెర్చ్లుహత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు నిందితులు పక్కా ప్రణాళిక వేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇందుకోసం సస్పెన్స్ సినిమాలు చూసారని, హత్య తర్వాత ఆధారాలు దొరకకుండా ఉండేందుకు ఇంటర్నెట్లో సమాచారం వెతికారని తెలిపారు. సియా ఫోన్ హిస్టరీలో ఈ విషయం బయటపడిందని తెలిపారు. అంతేకాదు.. కేతన్‌ను ఎక్కడ హత్య చేస్తే అది ప్రమాదంలా కనిపిస్తుందో తెలుసుకునేందుకు పలు ప్రాంతాలను పరిశీలించినట్లు వెల్లడించారు. లోనావాలాలోని టైగర్ పాయింట్, విశాపూర్ కోట తదితర ప్రాంతాలను పరిశీలించిన తర్వాత లోహగఢ్ కోటను ఎంచుకున్నారని చెప్పారు.ముందుగానే రెక్కీ చేసిన సియా?దర్యాప్తులో భాగంగా సియా మే 31న కేతన్‌తో కలిసి లోహగఢ్ కోటకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఆ పర్యటన హత్యకు ముందు చేసిన రెక్కీ అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అక్కడ ఎక్కడ నుంచి తోసేస్తే కేతన్ మృతి చెందుతాడు.. ఆధారాలు దొరకకుండా ఎలా చేయాలనే విషయాలను పరిశీలించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆ తర్వాత జూన్ 3న మరోసారి అక్కడికి వెళ్లేందుకు కేతన్‌ను ఒప్పించే ప్రయత్నం చేసినట్లు తెలిపారు.బాలి ట్రిప్ కూడా కుట్రలో భాగమేనా?సియా, కేతన్‌లు జూన్ 6న ఇండోనేషియాలోని బాలి పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఎనిమిది రోజుల పాటు అక్కడ గడపాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే ఆ ప్రయాణం తమ కుట్రకు అడ్డుగా మారుతుందని భావించిన నిందితులు.. ఎలాగైనా ఆ పర్యటనను ఆపాలని ప్రయత్నించారు. ముంబై పర్యటన సమయంలో సియా కేతన్ పాస్‌పోర్ట్‌ను దొంగిలించిందని.. దీంతో బాలి ప్రయాణం రద్దయిందని పోలీసులు తెలిపారు.ముందే ఒకసారి హత్యాయత్నం?లోహగఢ్ కోట వద్ద జూన్ 14న సియా కేతన్‌ను తోసేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే కేతన్ ఓ పొదను పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాడని తెలిపారు. ఆ సమయంలో అనుమానం రాకుండా.. పాము నుంచి కాపాడేందుకు తానే తోశానని సియా చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు. తర్వాత జూన్ 18న మరోసారి లోహగఢ్ కోటకు తీసుకెళ్లి.. చేతన్‌తో కలిసి కేతన్‌ను లోయలోకి తోసి చంపినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈ కేసులో దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ మరిన్ని కొత్త విషయాలు బయటపడే అవకాశం కనిపిస్తోంది. -
ఘోర ప్రమాదం. టన్నెల్ కూలిన ఘటనలో 20కి చేరిన మృతులు
గాంగ్టక్: సిక్కింలోని నామ్చి జిల్లాలో నిర్మిస్తున్న ఎన్‌హెచ్‌పిసి తీస్తా స్టేజ్-VI జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగం కూలిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 20 కి చేరుకుంది. ప్రాజెక్ట్ అధికారులతో సహా మొత్తం 25 మంది కార్మికులు టన్నెల్లో చిక్కుకోగా, వారిలో 20 మంది మరణించినట్లు నామ్చి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అధికారికంగా ప్రకటించారు.కాగా మృతిచెందిన వారిలో ఇప్పటివరకు 12 మృతదేహాలను బయటకు తీశారు. అందులో ఏడు మృతదేహాలను గుర్తించగా, మిగిలిన వాటి గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. కాగా ఈ ప్రమాదంలో కేరళలోని కోట్టాయం జిల్లాకు చెందిన జియాలజిస్ట్ అనీష్ మోహన్ గల్లంతయ్యారు.ప్రాథమిక అంచనా ప్రకారం రాళ్ల మధ్యలో పేరుకుపోయిన మిథేన్ గ్యాస్ అకస్మాత్తుగా పేలడంతో దట్టమైన పొగ, విషవాయువులు టన్నెల్ అంతటా వ్యాపించాయి. ఈ పేలుడు కారణంగానే టన్నెల్ కూలిపోయిందని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు, గాయపడిన వారికి ₹50,000 చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రధాని నరేంద్రమోదీ ఈ దుర్ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ₹2 లక్షలు, గాయపడిన వారికి ₹50,000 చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. ముఖ్యమంత్రితో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. -
రాహుల్ గాంధీపై మండిపడ్డ ధర్మేంద్ర ప్రధాన్
సాక్షి, ఢిల్లీ: లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, ప్రధాని నివాసం ఎదుట చేసిన నిరసనపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ రోజు ( మంగళవారం) మండిపడ్డారు. విద్యార్థులకు మీరు ఆగ్రహం కంటే బాధ్యతనే బాకీ ఉన్నారన్నారు. విద్యార్థుల ఆందోళనను రాజకీయంగా వాడుకోవడం ఆపాలని హితవు పలికారు.ఈ రోజు సాయంత్రం ప్రధాని నివాసం ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నీట్ లీకేజ్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ నిరసన చేశారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తకర పరిస్థితులు ఏర్పడ్డాయి.కాగా తాజాగా ఈ అంశంపై ఎక్స్ వేదికగా ధర్మేంద్రప్రధాన్ మాట్లాడుతూ" ప్రజలకు అసౌకర్యం కలిగిస్తూ, నిర్ధారిత భద్రతా నియమాలను ఉల్లంఘించి, గౌరవనీయ ప్రధానమంత్రి గారి నివాసం బయట ధర్నాకు దిగారు. సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసినప్పటికీ, కాంగ్రెస్ ప్రజాస్వామ్య చర్చ కన్నా రాజకీయ ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చింది. వారి లక్ష్యం విద్యార్థులకు పరిష్కారాలు అందించడం ఎన్నడూ కాదు, కేవలం రాజకీయ శీర్షికల కోసం గందరగోళం సృష్టించడమే. నీట్ గురించి చర్చించడానికి, సభలో మన యువత యొక్క ప్రతి నిజమైన ఆందోళనను పరిష్కరించడానికి మా ప్రభుత్వం 100% కట్టుబడి ఉంది. విద్యార్థులకు మనం ఆగ్రహం కన్నా ఎక్కువ ఇవ్వాలి. వారికి మనం సమాధానాలు, సంస్కరణలు మరియు జవాబుదారీతనం ఇవ్వాలి. వాటిని అందించడానికే మా ప్రభుత్వం కట్టుబడి ఉంది." అని రాసుకొచ్చారు. -
సీజేపీ నిరసన పునః ప్రారంభం
ఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిన్న సోమవారం రాత్రి 10:30 గంటలకు తిరిగి ప్రారంభించింది. యాథావిధిగా తమ వేదికను ఏర్పాటు చేసుకొని నిరసన కొనసాగిస్తుంది. కాగా నిన్న (సోమవారం) సీజేపీ పార్లమెంటుకు నిర్వహించిన మార్చ్ సందర్భంగా, నిరసనకారులకు, పోలీసులకు మధ్య పెద్దఎత్తున ఘర్షణలు చెలరేగాయి. దీంతో పోలీసులు సాయంత్రం 5 గంటలకు జంతర్ మంతర్‌ను ఖాళీ చేయించారు.సీజేపీ ఆందోళన హింసాత్మకంకాగా నిన్న (సోమవారం) సీజేపీ పార్టీ చేపట్టిన పార్లమెంట్ మార్చ్ హింసాత్మకంగా మారింది. నిరసన కారుల దాడుల్లో ప్రభుత్వ ఆస్తులకు భారీగా నష్టం వాటిల్లిందని పోలీసులు పేర్కొన్నారు. ఘర్షణల్లో 118 మంది పోలీసులకు గాయాలయ్యాయని 20కి వాహనాలు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. అదే విధంగా 60 మంది నిరసనకారులకు గాయాలయ్యాయని తెలిపారు.నిరసనలు ఎందుకు? దేశవ్యాప్తంగా జరిగిన నీట్ ప్రవేశ పరీక్షల అక్రమాలు, పేపర్ లీకేజీలపై పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్ చుక్ జంతర్ మంతర్ వద్ద గత 20 రోజులుగా నిరాహార దీక్ష చేశారు. అయితే ఆయన ఆరోగ్యం క్షీణించిందనే నెపంతో పోలీసులు ఆయన్ను బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. దీన్ని ప్రభుత్వం చేసిన "అపహరణ"గా భావించిన యువత, ఆయన్ను వెంటనే విడుదల చేయాలని నిరసనను ఉధృతం చేశారు. -
చలో సంసద్.. రణరంగం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ ఉదంతంలో నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ‘చలో సంసద్ ర్యాలీ’రణరంగాన్ని తలపించింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజే ఉభయసభల సాక్షిగా ఎంపీలను నిలదీసి విద్యార్థుల సమస్యలకు పరిష్కారం తేల్చుకుంటామంటూ వేలాది మంది కాక్రోచ్ పార్టీ కార్యకర్తలు, పరీక్షార్థుల తల్లిదండ్రులు సోమవారం పార్లమెంట్ దిశగా మొదలెట్టిన ర్యాలీ చివరకు ఉద్రిక్తంగా ముగిసింది. ఆదివారం అర్ధరాత్రి నాటికే జంతర్‌మంతర్‌లోని దీక్షా స్థలికి వేలాదిగా మద్దతుదారులు, విద్యార్థులు చేరుకుని సోమవారం ఉదయం పార్లమెంట్ దిశగా ర్యాలీ మొదలుపెట్టగా పోలీసులు మొదట్లోనే అడ్డుకున్నారు. పార్లమెంట్, సెంట్రల్ విస్టా, కన్నాట్ ప్లేస్, సమీప ప్రాంతాల్లో 163వ సెక్షన్‌ను విధించారు. ర్యాలీకి అనుమతిలేనందున ఐదుగురికి మించి గుమికూడవద్దని హెచ్చరించారు. వదంతలు వ్యాపించకుండా ఉండేందుకు సెంట్రల్ ఢిల్లీ పరిధిలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను కొన్ని గంటలపాటు పోలీసులు నిలిపేశారు. ఉద్యమకారులున్న చోట్ల జామర్లను ఏర్పాటుచేశారు. అయినాసరే పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ మరింత మంది విద్యార్థులు, కార్యకర్తలు, మద్దతుదారులు బస్సులు, ఆటోలు, బైక్‌లలో వేర్వేరు దారుల్లో పార్లమెంట్ సమీపానికి చేరుకున్నారు. స్కూల్ యూనిఫామ్‌లో పాఠశాల విద్యార్థులు మొదలు కాలేజీ స్టూడెంట్స్, తల్లిదండ్రులు, విద్యావేత్తలు, వృద్ధులు, యోగేంద్ర యాదవ్ వంటి సామాజికవేత్తలు పెద్దసంఖ్యలో పార్లమెంట్ సమీప రోడ్లమీదకొచ్చారు. జాతీయజెండాలు చేతపట్టుకుని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలుచేశారు. భారత్ మాతాకీ జై, జై భీం, వందేమాతరం, ధర్మేంద్ర ప్రధాన్ దిగిపో నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. వీళ్లు ముందుకెళ్లకుండా పోలీసులు బారికేడ్లను అడ్డుగా ఉంచారు. వాటినీ ఆందోళనకారులు తొలగించారు. దీంతో వీళ్లను అదుపుచేయడం కోసం పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేశారు. దీంతో పలువురు తీవ్రస్థాయిలో గాయపడ్డారు. పార్లమెంట్ స్ట్రీట్, పటేల్ చౌక్, కాన్స్టిట్యూషన్ క్లబ్, శాస్త్రీ భవన్, రైల్ భవన్ సమీప ప్రాంతాల్లో జనాన్ని చెదరగొట్టేందుకు బాష్పవాయుగోళాలు సైతం ప్రయోగించారు. పోలీసులు ఇష్టమొచ్చినట్లు చితకబాదుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. తోటి కార్యకర్తలను కొడుతున్నాసరే ఇంకొందరు అలాగే రోడ్డు మీద బైఠాయించి ‘కొట్టండి సార్ కొట్టండి’అని తమ తీవ్రస్థాయి నిరసన తెలపడం ఒక వీడియోలో కన్పించింది. ‘‘పోలీసులు కొందరి తల పగలగొట్టారు. కిందపడ్డ విద్యార్థులనూ వదల్లేదు’’అని 55 ఏళ్ల హెలెన్ అనే మహిళ తెలిపారు. గాయపడిన వారిని తోటి విద్యార్థులు హుటాహుటిన సమీప ఆస్పత్రుల్లో చేర్పించారు. అయితే విద్యార్థుల నుంచి సైతం పోలీసులు తీవ్రస్థాయిలో ప్రతిఘటన ఎదుర్కొన్నట్లు పోలీసువర్గాలు తెలిపాయి. ఈ తోపులాటలో 118 మంది పోలీసులు గాయపడ్డారని పోలీసు వర్గాలు తెలిపాయి. తమపై జనం రాళ్లు రువ్వడంతోనే లాఠీచార్జ్ చేయాల్సివచ్చిందని పోలీసులు తమ చర్యను సమరి్థంచుకున్నారు. ఈ ఘటనలో 100కుపైగా ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. వెరిఫికేషన్ ప్రక్రియ తర్వాత అందర్నీ విడిచిపెట్టే ఆస్కారముందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే సమీప రామ్మనోహర్ లోహియా ఆస్పత్రిలో 65 మెడికో లీగల్ కేసులు నమోదయ్యాయి. ర్యాలీలో లద్దాఖ్ సామాజికవేత్త, నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలిని పోలీసులు జుట్టు పట్టుకుని లాగి కొట్టారని వచ్చిన వార్త అవాస్తవమని ఢిల్లీ డీసీపీ సచిన్ శర్మ స్పష్టం చేశారు.మా డిమాండ్లు నెరవేర్చండి నడ్డాతో సీజేపీ ప్రతినిధుల చర్చలు విన్నపాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానన్న మంత్రి న్యూఢిల్లీ: దాదాపు మూడు వారాలుగా దీక్షపర్వంలో మునిగిపోయిన సీజేపీ కార్యకర్తలకు తొలిసారిగా ప్రభుత్వం నుంచి పిలుపొచ్చింది. దీంతో సీజేపీ అధికార ప్రతినిధులు అశుతోష్ రంకా, సౌరవ్ దాస్‌లు సోమవారం సాయంత్రం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమ ప్రధాన డిమాండ్లను మంత్రికి వెల్లడించారు. ‘‘ఎలాంటి షరతుల్లేకుండా ఆస్పత్రి నుంచి సోనమ్ వాంగ్చుక్ను విడుదలచేయాలి. ఆయన ఒక వీడియో సందేశం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అందుకు అనుమతించాలి. ధర్మేంద్ర ప్రధాన్‌ను విద్యాశాఖ పదవి నుంచి తప్పించాలి లేదా ఆయనతో రాజీనామా చేయించాలి. నీట్–యూజీ,2026 ప్రశ్నపత్రాలు లీక్ కావడంతో తీవ్ర నిరాశతో బలవన్మరణాలకు పాల్పడిన పరీక్షార్థులకు తలో రూ.1 కోటి చొప్పున నష్టపరిహారం ప్రభుత్వం తక్షణం ప్రకటించాలి. దీక్షాస్థలిని నాశనంచేసిన పోలీసులు ఇకపై కార్యకర్తల జోలికి వెళ్లకూడదు. శాంతియుత నిరసనను పోలీసులు ఉక్కుపాదంతో అణచివేసేందుకు యత్నించకూడదు’’అని నడ్డాకు అందజేసిన లేఖలో సీజేపీ ప్రతినిధులు పేర్కొన్నారు. సీజేపీ డిమాండ్లపై ప్రభుత్వ నాయకత్వం అంతర్గతంగా చర్చించేలా చేస్తానని ప్రతినిధులకు నడ్డా హామీ ఇచ్చారు. సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయని తర్వాత నడ్డా మీడియాతో చెప్పారు. ‘‘మా షరతులను నడ్డాకు తెలిపాం. వీటిని తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన మాకు హామీ ఇచ్చారు’’అని తర్వాత అశుతోష్ రంకా తెలిపారు. సోమవారం ఉదయం 11.50 గంటలకు సీజేపీ ప్రతినిధులతో ఫోన్లో మంతనాలు జరిపామని, సాయంత్రం వాళ్లు స్వయంగా వచ్చి మెమోరాండం సమర్పించారని నడ్డా చెప్పారు. ఇప్పటికే ఈ మూడు డిమాండ్లపై ప్రభుత్వ పెద్దలు అంతర్గతంగా చర్చలు జరుపుతున్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దీక్ష కొనసాగిస్తా వాంగ్‌చుక్ సంసద్ ర్యాలీలో పాల్గొనేందుకు తనను డిశ్చార్జ్ చేయాలని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్‌కు సోనమ్ వాంగ్‌చుక్ ఒక లేఖ రాశారు. ఆస్పత్రిలో తన ఆరోగ్యం బాగానే ఉందని, నిరసన ర్యాలీలో పాల్గొనేందుకు పంపించాలని కోరారు. తాను నిరాహార దీక్షను విరమించాలంటే ప్రభుత్వం మూడు షరతుల్ని ఒప్పుకోవాలని చెప్పారు. ‘‘పేపర్ లీకేజీ ఉదంతాలకు తమదే బాధ్యత అని ప్రభుత్వం తన తప్పు ఒప్పుకోవాలి. లేదంటే ర్యాలీగా పార్లమెంట్‌కు వచ్చిన సీజేపీ నాయకులతో ఉభయసభల ఎంపీలు మాట్లాడి ఈ అంశాన్ని పార్లమెంట్లో చర్చిస్తామని వెంటనే హామీ ఇవ్వాలి. లేదంటే అధికార కూటమి ఎంపీలు ఆస్పత్రికి వచ్చి ఇదే అంశంపై నాకు స్వయంగా హామీ ఇవ్వాలి’’అని వాంగ్‌చుక్ ఒక టిష్యూపేపర్ మీద షరతులు రాసి ‘ఎక్స్’లో పోస్ట్‌చేశారు. కానీ ర్యాలీలో కార్యకర్తలతో పోలీసులు అమానుషంగా ప్రవర్తించిన కారణంగా తన దీక్షను ఇకమీదటా కొనసాగించాలని ఆయన ఆ తర్వాత నిర్ణయించుకున్నారు.దీప్కేను నిర్బంధించిన పోలీసులు! దీక్షా స్థలి నుంచి సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కేను పోలీసులు రహస్య ప్రదేశానికి తరలించారని సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్, అశుతోష్ ఆరోపించారు. సోమవారం సాయంత్రంకల్లా దీక్షా స్థలిలోని టెంట్లు, మైకులు, కార్పెట్లు, బ్యానర్లు, జెండాలను పోలీసులు తొలగించారు. అటువైపు ఎవరూ రాకుండా జంతర్‌మంతర్ వద్ద రోడ్డుకు రెండు వైపులా పోలీసులు బారికేడ్లు ఏర్పాటుచేశారు. దీంతో దాదాపు 1,000 మంది ఉద్యమకారులు కొంతదూరంలోనే నిలిచిపోయారు. సమీపంలోని కేరళ హౌస్ సమీపంలో భైఠాయించి ఇక్కడి నుంచే ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఉద్యమనేతలు స్పష్టంచేశారు. అయితే దీప్కేను అరెస్ట్చేశామన్న వార్తల్లో నిజంలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టంచేశారు. -
బిహార్‌లో ప్రమాదం.. 40 మందితో వెళుతున్న పడవ బోల్తా
పాట్నా: బిహార్‌లోని సీతామర్హి జిల్లాలో ఘెర ప్రమాదం జరిగింది. బాగ్మతి నదిలో దాదాపు 40 మందితో ప్రయాణిస్తున్న ఓ పడవ బరువు తట్టుకోలేక నదిలో బోల్తాపడింది. అక్కడే ఉన్న స్థానికులు వెంటనే స్పందించి నదిలో పడ్డవారిని రక్షించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.బాగ్మతి నదికి ఇరువైపులా ఉన్న గ్రామాలకు వెళ్లాలంటే ఖచ్చితంగా ఈ నది దాటాల్సిందే. అయితే ఈ నదిపై ప్రభుత్వం వంతెన నిర్మించకపోవడంతో రోజూ గ్రామస్థులు, రైతులు, విద్యార్థులు, ఇతర వ్యాపారులు తమ రోజువారీ పనులకోసం పడవల ద్వారానే రాకపోకలు సాగిస్తుంటారు. కాగా పడవలు నడిపే వారు సామర్థ్యంకు మించి ప్రయాణికులను ఎక్కించుకోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్థులు అంటున్నారు. వారు తక్షణమే స్పందించడంతోనే ఎవరికి ప్రాణాపాయం కలగలేదని చెబుతున్నారు.ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న స్థానిక పరిపాలనా యంత్రాంగం, పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. దీనిపై స్పందించిన అధికారులు ఇకపై ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఓవర్ లోడింగ్‌కు పాల్పడే నావికులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నదిలో నడిచే అన్ని పడవల్లో తప్పనిసరిగా లైఫ్ జాకెట్లు, లైఫ్ బాయ్స్ వంటి ప్రాణరక్షణ పరికరాలను అందుబాటులో ఉంచాలని నావికులకు ఆదేశాలు జారీ చేశారు.#BREAKING : Boat Carrying 40 Passengers Capsizes in Bihar's Bagmati RiverA boat carrying around 35 to 40 passengers capsized in the Bagmati River in Bihar's Sitamarhi district after reportedly becoming overloaded. The vessel lost balance midstream and overturned, triggering… pic.twitter.com/4hatCRP27D— upuknews (@upuknews1) July 19, 2026 -
పాట పాడింది.. దేశం చప్పట్లు కొట్టింది
ఒక పాట.. భాషల సరిహద్దులను దాటి కోట్లాది మనసులను తాకుతుంది. ఒక స్వరం... కళ్లతో కాదు, హృదయంతో ప్రపంచాన్ని చూస్తుందని నిరూపిస్తుంది. అలాంటి అరుదైన గాయని వైక్కం విజయలక్ష్మి. 2024 సంవత్సరానికి ప్రకటించిన జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ మహిళా నేపథ్య గాయని అవార్డును ఆమె సొంతం చేసుకున్నారు.కేరళలోని కొట్టాయం జిల్లా వైకోమ్లో విజయలక్ష్మి అనంత సుబ్రహ్మణియన్ జన్మించారు. పుట్టుకతోనే తీవ్రమైన దృష్టిలోపంతో జన్మించిన ఆమెకు ఈ ప్రపంచాన్ని కళ్లతో చూసే అదృష్టం లేకపోయినా, సంగీతాన్ని మాత్రం హృదయంతో ఆస్వాదించే వరం లభించింది. చిన్నప్పటి నుంచే కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో శిక్షణ తీసుకున్న ఆమె, వీణ వాయించడంలోనూ విశేష ప్రతిభ కనబరిచారు. సంగీతమే జీవితంగా భావిస్తూ నిరంతర సాధనతో తన ప్రతిభను మెరుగుపరుచుకున్నారు.2013లో విడుదలైన సెల్యులాయిడ్ సినిమాతో నేపథ్య గాయనిగా సినీ రంగంలో అడుగుపెట్టిన వైక్కం విజయలక్ష్మి, తొలి పాటతోనే సంగీత దర్శకులు, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత ఒరు వడక్కన్ సెల్ఫీ చిత్రంలోని కైక్కొట్టుం కండిట్టిల్లా పాట ఆమెకు అపారమైన గుర్తింపును తీసుకొచ్చింది. అనంతరం ‘తెరి’ చిత్రంలోని ఎన్ జీవనే, కనా చిత్రంలోని వాయాడి పెట్ట పుల్ల వంటి పాటలు దక్షిణ భారత సంగీత ప్రపంచంలో ఆమె స్థానాన్ని మరింత బలపరిచాయి. భావోద్వేగాన్ని స్వరంలో పలికించడంలో ఆమెకు ఉన్న ప్రత్యేక నైపుణ్యమే ప్రతి పాటను శ్రోతల హృదయాలకు చేరువ చేసింది.ఆమె ప్రయాణంలో గుర్తింపులు కూడా తక్కువేం కాదు. ఫిల్మ్‌ఫేర్ పురస్కారం, ఏషియానెట్ పురస్కారం, వనిత పురస్కారం, కేరళ ప్రభుత్వ గౌరవాలు సహా అనేక అవార్డులు ఆమెను వరించాయి. అయితే భారతీయ సినీ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర పురస్కారం మాత్రం కాస్త సమయం పట్టింది. ఆ నిరీక్షణకు ముగింపు పలికింది ఏఆర్ఎమ్ చిత్రంలోని అంగు వాన కొనిలు పాట.భావోద్వేగాలతో నిండిన ఈ గీతంలో వైక్కం విజయలక్ష్మి తన గాత్రంతో ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకెళ్లారు. మలయాళంలో పుట్టిన ఈ పాట భాషల సరిహద్దులను దాటి తెలుగు ప్రేక్షకుల హృదయాలను సైతం తాకింది. పదాలు అర్థం కాకపోయినా.. ఆమె స్వరంలో వినిపించిన ఆవేదన, మమకారం, ప్రేమ ప్రతి ఒక్కరి మనసును కదిలించాయి. అదే గీతం ఇప్పుడు ఆమెకు జాతీయ ఉత్తమ మహిళా నేపథ్య గాయని పురస్కారాన్ని అందించింది.వైక్కం విజయలక్ష్మి ప్రయాణం ఒక గాయని విజయగాథ మాత్రమే కాదు.. జీవితం మనకు ఏమి ఇవ్వలేదన్నది కాదు, ఉన్న ప్రతిభతో ఎంత ఎత్తుకు ఎదిగామన్నదే ముఖ్యమని చెప్పే స్ఫూర్తిదాయకమైన కథ. కళ్లలో వెలుగు లేకపోయినా.. తన గాత్రంతో కోట్లాది మంది హృదయాల్లో వెలుగులు నింపిన ఆమె ఇప్పుడు భారతీయ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆమె గెలిచింది ఒక అవార్డును మాత్రమే కాదు... కోట్లాది మంది అభిమానుల మనసులను కూడా. -
బాణసంచా ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. 8మంది మృతి
అహ్మాదాబాద్ బాణసంచా ఫ్యాక్టరీలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. బాణసంచా ఫ్యాక్టరీలో భారీగా పేలుళ్లు సంభవించి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా, మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వివరాలు తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
శబరిమల వెళ్లే భక్తులకు ఐఎండీ కీలక సూచన
తిరువనంతపురం: కేరళ శబరిమల భక్తులకు వాతావరణ శాఖ కీలక సూచన జారీ చేసింది. ఈ జూలై 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.దీంతో అక్కడికి వెళ్లే భక్తులు జాగ్రత్తగా ఉండాలని రెయిన్ కోట్, గొడుగులు తమ వెంట తీసుకెళ్లాలని సూచించింది. గతంలో నాలుగు జిల్లాలకు జారీ చేసిన హెచ్చరికను ఈ రోజు (శనివారం) ఏడు జిల్లాలకు పెంచి ఎల్లో అలర్ట్ జారీ చేసింది.రానున్న 24 గంటల వ్యవధిలో 64.5 మిల్లీమీటర్ల నుండి 115.5 మిల్లీమీటర్లు వరకు భారీ వర్షపాతం కురుస్తుందని హెచ్చరిక జారీ చేసింది. పతనంతిట్ట , కొట్టాయం , ఇడుక్కి, మలప్పురం , కోజికోడ్ , కన్నూర్ , కాసరగోడ్ జిల్లాలకు ఇదివరకే ఎల్లో అలర్డ్ జారీ చేయగా తాజాగా మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కన్నూర్ కాసరగోడ్లలో ఎల్లో అలర్ట్ జారీ చేయబడింది.నైరుతి రుతపవనాలు బంగాళాఖాతం నుండి ఉత్తర లక్షద్వీప్ ప్రాంతం మీదుగా, ఉత్తర తమిళనాడు,దక్షిణ అంతర్గత కర్ణాటక ,ఉత్తర కేరళ వరకు విస్తరిస్తాయని అల్పపీడన ప్రాంతం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. -
‘ఒక్క పెళ్లి చేసుకున్న వారే రాష్ట్రంలో ఉంటారు’
భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నివసించాలంటే కేవలం ఒక్క వివాహం మాత్రమే చేసుకుని ఉండాలన్నారు. ఈ మేరకు త్వరలో యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్ అమలులోకి తెచ్చే యత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని పౌరులందరికీ ఒకే రకమైన చట్టం ఉండేలా చేయడమే దీని ఉద్దేశమని పేర్కొన్నారు.రాబోయే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ) బిల్లును ప్రవేశపెడుతుందని, "ఒకే వివాహం చేసుకున్న వారికి మాత్రమే రాష్ట్రంలో నివసించే చట్టపరమైన హక్కు ఉంటుంది" అని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నొక్కి చెప్పారు.కట్నీ జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో మోహన్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే అధిపతి, ఒకే జెండా ఉండాల్సినప్పుడు, హిందువులకు, ముస్లింలకు వేర్వేరు చట్టాలు ఎందుకు ఉండాలి? అందరికీ ఒకే చట్టం ఉండాలి. రామ్‌కు ఒకే వివాహం చేసుకునే అవకాశం ఉన్నప్పుడు, రహీమ్‌కు రెండు, మూడు లేదా నాలుగు వివాహాలు ఎందుకు ఉండాలి? మన ముస్లిం సోదరీమణులు కూడా మన సోదరీమణులే. ప్రతిపాదిత ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) ప్రకారం, ఒకే వివాహం చేసుకున్న వ్యక్తికి మాత్రమే మధ్యప్రదేశ్‌లో నివసించే చట్టపరమైన హక్కు ఉంటుంది," అని తేల్చిచెప్పారు.రాబోయే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ) బిల్లును ప్రవేశపెడుతుందని ఆ ప్రాతిపాదిత చట్టం ఏకరీతి న్యాయ వ్యవస్థను అందిస్తుందని, తక్షణ ట్రిపుల్ తలాక్ యుగం ముగిసిందని పేర్కొన్నారు.కాగా భారతదేశంలో యూసీసీని చట్టబద్ధం చేసి, విజయవంతంగా అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. 2024 లోనే అసెంబ్లీలో బిల్లు పాస్ అవ్వగా, 2025 జనవరి 27 నుండి ఈ చట్టం అధికారికంగా అమలులోకి వచ్చింది. వివాహాలు, విడాకులు, ఆస్తి హక్కులు, సహజీవనం వంటి అంశాలపై ఇక్కడ అందరికీ ఒకే చట్టం వర్తిస్తుంది. -
"జులై 20 వరకూ ప్రాణాలతో ఉంటా.".. వాంగ్ చుక్
సాక్షి, ఢిల్లీ: జులై 20 న సీజేపీ తలబెట్టబోయే శాంతియుత యాత్ర వరకూ తాను ఎట్టిపరిస్థితుల్లో ప్రాణాలతో ఉంటానని ప్రముఖ విద్యావేత్త సోనమ్ వాంగ్ చుక్ అన్నారు. తన ఆరోగ్య పరిస్థితి విషమిస్తున్న నేపథ్యంలో ఈ రోజు శుక్రవారం ఆయన మాట్లాడారు. నీట్ లీకేజ్‌కు నిరసనగా జులై 20న పార్లమెంట్ వరకూ చేపట్టబోయే శాంతియుత యాత్రలో పెద్దఎత్తున ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. నీట్ లీకేజ్‌కు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడంతో మరికొన్ని డిమాండ్లు కోరుతూ సోనమ్ వాంగ్ చుక్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నారు. దీక్ష 20 రోజుకు చేరుకున్న నేపథ్యంలో వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని హెచ్చరించారు. అయినప్పటికీ ఆయన దీక్ష కొనసాగిస్తున్నారు. అభిమానులతో పాటు ప్రజలు ఆందోళన చెందుతున్నారు.ఆ నేపథ్యంలో వాంగ్‌చుక్ మాట్లాడుతూ "జూలై 20 వరకు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణాలతో ఉంటాను. నేను బయటకు బలహీనంగా కనిపిస్తున్నప్పటికీ, లోపల చాలా బలంగా ఉన్నాను. మీరంతా కూడా లోపల, బయట అంతే బలంగా ఉన్నారని నాకు తెలుసు. జూలై 20న మనం చేపట్టబోయే శాంతియుత పార్లమెంట్ మార్చ్‌కు ఈ శక్తే మనకు కావాలి. మేమంతా కలిసి ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంట్‌కు వెళ్లి మా విజ్ఞప్తిని సమర్పిస్తాం."ఈ సమయంలో ఆయన సరదాగా మాట్లాడుతూ "నేను జూలై 20 వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణాలతో ఉంటాను. ఒకవేళ మీరు రాకపోయినా, జూలై 20 మార్చ్ విజయవంతం కాకపోయినా, నేను దెయ్యంగానైనా తిరిగి వస్తాను" అని అనడంతో అక్కడ ఉన్న మద్దతుదారులు హర్షధ్వానాలు చేశారు.ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకుండా దీక్షను విరమిస్తే సమాజానికి తప్పుడు సందేశం వెళ్తుందని, అందుకే వెనక్కి తగ్గేదే లేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు అందరి దృష్టి జూలై 20 పార్లమెంట్ మార్చ్‌ను విజయవంతం చేయడంపైనే ఉండాలని కోరారు.గత 20 రోజులుగా సోనమ్ వాంగ్‌చుక్ కేవలం నీటి పైనే జీవిస్తున్నారని, ఇది ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని ఆయనకు నిరంతరం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్ సతీష్ లంబా హెచ్చరించారు.సుదీర్ఘ ఉపవాసం వల్ల ఆయన శరీరంలోని కొవ్వు, కండరాలు కరిగిపోతున్నాయి. దీనివల్ల ఆయన ఇప్పటికే 9 కిలోల బరువు తగ్గారు.ఢిల్లీ హైకోర్టు జోక్యంఈ వ్యవహారంపై ఢిల్లీ హైకోర్టు కూడా స్పందించింది. సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిని ప్రతిరోజూ నిశితంగా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించింది. ఒకవేళ ఆయన ఆరోగ్యం మరింత క్షీణిస్తే తక్షణమే అవసరమైన వైద్య సహాయాన్ని అందించాలని కోర్టు స్పష్టం చేసింది.NEET పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా జూన్ 20 నుంచి కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఈ నిరసనలను ప్రారంభించగా, జూన్ 28న సోనమ్ వాంగ్‌చుక్ ఈ ఉద్యమంలో భాగస్వామ్యమై ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. -
ఆమిర్ ఖాన్‌ను చంపితే ఐదు కోట్ల నజరానా
లక్నో: అయోధ్య తపస్వీకి ఛావని మఠం అధిపతి, జగద్గురు పరమహంస ఆచార్య.. ఆమిర్ ఖాన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమిర్ ఖాన్ని చంపిన వారికి రూ. 5 కోట్లు బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. అంతే కాకుండా అతనిని చంపిన వ్యక్తికి ఎదురయ్యే న్యాయపరమైన ఖర్చులను తానే భరిస్తానని సంచలన ప్రకటన చేశారు. ఆమిర్ ఖాన్ మూడోపెళ్లిపై లవ్ జిహాద్ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పరమహంస ఈ విధంగా మాట్లాడారు.వివాదం ఎందుకుఇటీవల బీజేపీ ఎమ్మెల్యే షిర్డీలో మీడియాతో మాట్లాడుతూ “ప్రముఖులు తమ వ్యక్తిగత జీవితాల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు, హిందూ సమాజం దాని గురించి ఆలోచించాలి. ఇది నా అభిప్రాయం. లవ్ జిహాద్‌కు బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? ఆమిర్ ఖాన్ అలా మారడం లేదా? అతని సినిమాలు చూసే హిందూ యువత, అలాంటి నటులను పెద్ద స్టార్లుగా చేసే ముందు వివేకంతో ఆలోచించాలి.” అని అన్నారు దీంతో ఈ వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది.జగద్గురు పరమహంస ఆచార్య స్పందననితేష్ రాణే చేసిన “లవ్ జిహాద్” వ్యాఖ్యను సమర్థిస్తూ పరమ , జగద్గురు పరమహంస ఆచార్య, ఆమిర్ “లవ్ జిహాద్”ను ప్రోత్సహించడానికే ఒక హిందూ మహిళను వివాహం చేసుకున్నారని ఆరోపించారు. తాజాగా ఆయన మాట్లాడుతూ హిందూ మహిళలను "ఉచ్చులో" పడేస్తున్నారన్నారు ఆమిర్ ఖాన్ మూడుసార్లు వివాహం చేసుకున్నారని, ఆ మూడు వివాహాలు కూడా హిందూ మహిళలతోనే జరిగాయని పరిగణనలోకి తీసుకుంటే, నితేష్ రాణే చేసిన ప్రకటన ఆరోపణ కాదు, అది ఒక వాస్తవం. ఇలాంటి వారిపై తక్షణమే చర్య తీసుకోవాలి. వారు సమాజంలో అనైక్యత సృష్టిస్తూ, అతను 'లవ్ జిహాద్' అని మిషనను ప్రోత్సహిస్తూ సమాజానికి తీవ్రమైన నేరం చేస్తున్నారని ఆరోపించారు.ఆమిర్‌ను చంపితే ఐదుకోట్లుపరమహంస మాట్లాడుతూ" ఏ విధంగానైనా ఆమిర్ ఖాన్‌ను ఎవరు చంపినా, వారి న్యాయపరమైన ఖర్చులన్నీ నేనే భరిస్తా వారి కుటుంబానికి రూ. 5 కోట్లు ఇస్తా, నా దృష్టిలో 'లవ్ జిహాద్'ను ప్రోత్సహించే అలాంటి 100-200 మందిని హతమార్చగలిగితే, 'లవ్ జిహాద్' పూర్తిగా అంతమవుతుంది". అని సంచలన వ్యాఖ్యలు చేశారు. పెళ్లి ఆమిర్ ఖాన్ జూలై 5న తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్ ను మూడో వివాహం చేసుకున్నారు. ముంబైలోని బాంద్రా పాలి హిల్‌లో ఉన్న ఆయన నివాసంలో ఈ వివాహం అత్యంత నిరాడంబరంగా, కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో రిజిస్టర్ పద్ధతిలో జరిగింది. -
ఐబీ ఆఫీసర్ హత్య కేసు: ఆప్ మాజీ నేతను దోషిగా తేల్చిన కోర్టు
న్యూఢిల్లీ: ఆరేళ్ల క్రితం ఈశాన్య ఢిల్లీ అల్లర్ల సమయంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల్లో భాగంగా ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)) ఆఫీసర్ అంకిత్ శర్మ దారుణ హత్యకు గురైన కేసులో ఆప్ మాజీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్‌తో పాటు మరో నలుగురిని ఢిల్లీలోని కర్కర్దూమా కోర్టు దోషులుగా తేల్చింది.ఈ కేసులో మొత్తం 11 మంది నిందితులు ఉండగా, మొత్తం ఐదుగురిని దోషులుగా నిర్ధారించింది కోర్టు, ఈ కేసులో అదనపు సెషన్స్ జడ్జి ప్రవీణ్ సింగ్తుది తీర్పును వెలువరించారు. 11 మంది నిందితులకు గాను తాహిర్ హుస్సేన్, హసీన్ (అలియాస్ ముల్లాజీ), నజీమ్, కాసిమ్, సమీర్ ఖాన్‌లను కోర్టు దోషులుగా నిర్ధారించింది. మరో ఆరుగురిని సాక్ష్యాధారాలు లేకపోవడంతో నిర్దోషులుగా వదిలేసింది. దోషులుగా తేలిన వారిపై హత్య (302), అల్లర్లు (147, 148), మత విద్వేషాలు రెచ్చగొట్టడం (153A) తదితర ఐపీసీ సెక్షన్ల కింద అభియోగాలు రుజువయ్యాయి. దోషులకు విధించే శిక్షల వివరాలను త్వరలోనే కోర్టు ఖరారు చేయనుంది.2020, ఫిబ్రవరి 25వ తేదీన సీఏఏ అల్లర్ల సమయంలో ఐబీ ఆఫీసర్ అంకిత్ శర్మ దారుణ హత్యకు గురయ్యారు. ఆయన మృతదేహాన్ని చాంద్‌బాగ్ ప్రాంతంలోని ఓ డ్రైనేజీలో పడేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ రోజు సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన అంకిత్ శర్మ ఇక తిరిగి రాలేదు. ఆ రోజు అప్పుడే ఇంటికి వచ్చిన అంకిత్ శర్మ.. అల్లరి మూకలు స్థానికంగా రెచ్చిపోవడం గమనించారు. దాంతో బయటకు వెళ్లి వారిని సద్దుమణిచే యత్నం చేశారు. అలా ఆప్ కౌన్సిలర్‌గా ఉన్న హుస్సేన్ ఇంటికి వెళ్లిన అంకిత్ శర్మ హత్యకు గురయ్యారు. ఆ సమయంలో అంకిత్ శర్మను అతి దారుణంగా హత్య చేసి డ్రెయిన్‌లో పడేశారు. తన కొడుకు ఎంతకీ ఇంటికీ రాకపోయే సరికి ఆ మరుసటి రోజు ఫిబ్రవరి 26వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు తండ్రి రవీందర్ కుమార్. దాంతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు.. ఓ యువకుని మృతదేహం డ్రెయిన్‌లో ఉన్న విషయం గమనించడంతో అతను అంకిత్ శర్మగా నిర్దారణ అయ్యింది. దీనిపై హుస్సేన్‌తో పాటు 11 మందిపై కేసు నమోదైంది. అంకిత్ శర్మను అతి దారుణంగా హత్య చేశారు. విచారణలో అంకిత్ శర్మ 51 కత్తిపోట్లకు గురైనట్లు తేలింది.2023. మార్చిలో , అల్లర్లు, వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రేరేపించడం, హత్య, నేరపూరిత కుట్ర వంటి నేరాలకు సంబంధించి హుస్సేన్‌తో సహా 11 మంది నిందితులపై కోర్టు అభియోగాలను నమోదు చేసింది. ఆ సమయంలో తన గ్రూపును హుస్సేన్ రెచ్చగొట్టారనే ప్రాసిక్యూషన్ వాదనను కోర్టు సమర్ధించడంతో వారికి జైలు శిక్ష పడింది.తన బెయిల్‌కు చేసుకున్న అభ్యర్థనను కూడా అంతకుముందు ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. హుస్సేన్‌పై అభియోగాలు తీవ్రంగా ఉండటంతో బెయిల్ ఇవ్వడానికి ఢిల్లీ కోర్టు నిరాకరించింది. తాజాగా వారిని దోషులుగా తేల్చుతూ కర్కర్దూమా కోర్టు తీర్పును వెలువరించింది. -
సోనమ్ వాంగ్‌చుక్ దీక్షకు సీపీఎం మద్దతు
సాక్షి, ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్య విలువలు పూర్తిగా లేకుండా పోయాయని సీపీఏం కార్యదర్శి శ్రీనివాస్ రావు అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి నిర్బంధిస్తున్నారన్నారు. ఈ రోజు (సోమవారం) పర్యావరణకారుడు సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్షకు సీపీఎం ఏపీ కార్యదర్శి శ్రీనివాసరావు, తెలంగాణ జాన్ వెస్లీ మద్దతు ప్రకటించారు.ఈ సందర్భంగా శ్రీనివాస్ రావు మాట్లాడుతూ నీట్ పరీక్ష తర్వాత పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని నీట్ పరీక్ష లీక్ కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం దేశంలోని యువతరమంతా ఆగ్రహంతో ఉందన్నారు. జాన్‌వెస్లీ మాట్లాడుతూ నీట్ పరీక్ష పేపర్ లీక్ కావడం వల్ల లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటుందని తెలిపారు. సీజేపీ దీక్షకు సీపీఏం పూర్తి మద్దతిస్తోందని పేర్కొన్నారు. సీజేపీ ఆందోళనకు సీపీఎం పూర్తిగా మద్దతిస్తుందని స్పష్టం చేశారు.ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జూన్ 28 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. నీట్ (NEET) సహా పోటీ పరీక్షల్లో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అదేవిధంగా లద్దాక్ ప్రత్యేక డిమాండ్ల వెంటనే నెరవేర్చాలని దీక్షకు దిగారు.గత 15 రోజులుగా ఆయన దీక్ష చేయడంతో వాంగ్‌చుక్ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. ఆహరం తీసుకోకపోవడంతో ఆయన రక్తపోటు (బీపీ), బ్లడ్ షుగర్ స్థాయిలు పడిపోయాయి.మొత్తంగా ఆయన 7.8 కిలోల బరువు తగ్గారు. దీంతో ఆయన ఆరోగ్యంపై ఆందోళన నెలకొంది. -
శబరిమల కానుకలపై హైకోర్టు కీలక ఆదేశాలు
తిరువనంతపురం: కేరళ హైకోర్ట్.. ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డుకు కీలక ఆదేశాలు జారీ చేసింది. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో భక్తులు సమర్పించిన కానుకల మదింపులో మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేటీ శంకరన్‌కు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించాలని ఆదేశించింది. అయ్యప్పస్వామికి సంబంధించిన బంగారు కానుకలతో పాటు ఇతర విలువైన వస్తువులను 80 బస్తాలలో నిల్వ ఉంచిన నేపథ్యంలో వాటి లెక్కింపుకు సహకరించాలని కోర్టు తెలిపింది.భవిష్యత్తులో స్వీకరించే విలువైన కానుకలను సురక్షితంగా భద్రపరచడానికి అనుసరించబోయే విధానం గురించి సైతం తమకు ఖచ్చితంగా తెలియజేయాలని బోర్డు స్టాండింగ్ కౌన్సిల్‌కు ఆదేశాలిచ్చింది. అటువంటి కానుకలను క్రమానుగతంగా మదింపు చేసి, సమగ్రమైన డిజిటల్ ఇన్వెంటరీ ద్వారా నమోదు చేయడమే దీని ఉద్దేశమని తెలిపింది. ప్రత్యేక కమిషనర్ సమర్పించిన నివేదికను పరిశీలిస్తున్న సమయంలో జస్టిస్ వి.రాజా విజయ రాఘవన్ ఈ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కేసును తదుపరి విచారణ కోసం కోర్టు ఆగస్టు 4వ తేదీకి వాయిదా వేసింది . ఆరన్ముళ స్ట్రాంగ్ రూమ్‌లో 'కనిపొన్ను' అని లేబుల్ చేసి 80 సంచులలో వీటిని నిల్వ ఉంచారు. శబరిమల ఆలయ తిరువాభరణం రిజిస్టర్లో నమోదైన అన్ని వస్తువులతో పాటు, ఆరన్ముళ స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచిన విలువైన వస్తువుల సమగ్ర మదింపును చేపట్టేందుకు, జస్టిస్ కేటీ శంకరన్‌ను హైకోర్టు 2025 సెప్టెంబర్ 29 న నియమించింది . ప్రత్యేక కమిషనర్ నివేదిక ప్రకారం, మదింపు ప్రక్రియ ఇప్పుడు పూర్తి కావస్తోంది.అయితే, జూలై 4న నిర్వహించిన తనిఖీలో'కనిపొన్ను' అని గుర్తించబడిన 80 సంచులలో బంగారం, వెండి కానుకలు మాత్రమే కాకుండా అనేక ఇతర సామగ్రి కూడా ఉన్నట్లు అధికారులు కనుగొన్నారు. విలువైన వస్తువుల నుండి విలువ లేని వస్తువులను ముందుగా వేరు చేస్తే తప్ప, ఆ విలువైన వస్తువుల సరైన విలువను నిర్ధారించడం సాధ్యం కాదని నివేదిక పేర్కొంది.అయితే ఈ విషయంలో పూర్తి సహకారం అందిస్తామని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు హామీ ఇచ్చిన నేపథ్యంలో సంచులలోని వస్తువులను వేరు చేయడం వాటిలో ఉన్న విలువైన వస్తువుల విలువను అంచనా వేయడం రెండింటికీ సహకరించాలని బోర్డును ఆదేశించింది.శబరిమల ఆలయానికి వచ్చే విలువైన వస్తువుల కోసం ఒక క్రమబద్ధమైన, డిజిటల్ పద్ధతిలో నిర్వహించబడే జాబితా వ్యవస్థను ప్రవేశపెట్టడం ద్వారా , భక్తులు సమర్పించే కానుకల నమోదు మరియు భద్రతను బలోపేతం చేయడానికి కోర్టు ఆదేశాలు దోహదపడతాయని అంతా భావిస్తున్నారు. -
120 కిమీ వేగం.. గడ్కరీ కాన్వాయ్ అడ్డగింత!
భోపాల్: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ హైవేపై మంత్రి కాన్వాయి 120 కిలోమీటర్ల వేగంతో వెళుతున్న సమయంలో హఠాత్తుగా నలుగురు యువకులు రోడ్డుపైకి వచ్చారు. దీంతో వెంటనే అప్రమత్తమైన డ్రైవర్లు వారిని కార్లు ఢీకొనకుండా తప్పించి కాన్వాయిలోని కార్లు ఢీకొనకుండా కార్లు నడిపించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.అయితే ఆ యువకులు ఈ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం కారణంగా ఆ పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లో, వ్యవసాయ పొలాల్లో నీరు నిలిచిపోతోందని తాము ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లడానికే గ్రామస్థులు అలా రోడ్డుపైకి వచ్చారని సమాచారం. అయితే కేంద్రమంత్రి కాన్వాయికి సరైన భద్రత కల్పించకపోవడంతో స్థానిక పోలీసు యంత్రాంగపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.A security lapse was reported during Union Minister Nitin Gadkari's convoy movement after villagers reportedly came onto the 8-lane highway. The incident could have led to a major accident, prompting questions over security arrangements.#NitinGadkari #SecurityBreach #RoadSafety… pic.twitter.com/e5P3dfUzJy— IndiaToday (@IndiaToday) July 9, 2026 -
సౌరవ్యవస్థ కీలక సమాచారం చిక్కనుందా..?
‘న్యూ హొరైజన్స్’… అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ 2006లో గ్రహాంతర అన్వేషణ కోసం ప్రయోగించిన వ్యోమనౌక. ప్రస్తుతం భూమికి 950 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్లూటో ఆవల దాదాపు ఏడాదిగా సుప్తావస్థలో ఉన్న ఈ ప్రోబ్ తాజాగా జాగృతమైంది. విశ్వంలో సుదూర ప్రయాణం చేసే ఇలాంటి వ్యోమనౌకలను అప్పుడప్పుడు నిద్రావస్థలోకి పంపుతుంటారు శాస్త్రవేత్తలు. వ్యోమనౌకలోని కొన్ని వ్యవస్థలు, పరికరాలను పనిచేయించడం నిలిపివేసి పవర్ ఆదా చేయడమే దీని ఉద్దేశం.వ్యోమనౌక సుప్తావస్థలో ఉన్నప్పటికీ అందులోని కీలక పరికరాలు యథావిధిగా సమాచార సేకరణ కొనసాగిస్తూ, అధ్యయనం జరుపుతూనే ఉంటాయి. గత ఏడాది ఆగస్టులో నిద్రలోకి జారుకున్న ‘న్యూ హొరైజన్స్’, ప్రస్తుతం ‘మంచి ఆరోగ్యంతో’ మేల్కొన్నట్టు నాసా ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యోమనౌక నుంచి భూమికి రేడియో సంకేతాలు అందడానికి 9 గంటలు పడుతోంది. నిద్ర మత్తు వదిలించుకున్న ‘న్యూ హొరైజన్స్’… గత 321 రోజులుగా తాను సేకరించిన డేటాను ఇక భూమికి ప్రసారం చేయనుంది. ప్లూటో, దాని చంద్రుళ్ల అధ్యయనం కోసం ప్రయోగించిన తొలి, ఏకైక మిషన్ ‘న్యూ హొరైజన్స్’. ఈ నౌక 2015లో ప్లూటోకు 12 వేల కిలోమీటర్ల దగ్గరగా వెళ్లి పరిశోధించింది. ఆ తర్వాత నాలుగేళ్లకు 2019 జనవరి 1న ప్లూటోకు 160 కోట్ల కిలోమీటర్ల ఆవల ఉన్నప్పుడు... సౌరకుటుంబంలో అత్యంత దూరంలో ‘క్యూపర్ బెల్ట్’లో ‘మంచు మనిషి’ ఆకారంలో ఉన్న గ్రహశకలం ‘అరాకోట్’ (2014MU69/అల్టిమా థూలే) చెంతకు వెళ్లి అధ్యయనం చేసింది. ఈ నౌక ప్రస్తుతం భూమి నుంచి ఏడాదికి 48 కోట్ల కిలోమీటర్ల వంతున దూరంగా వెళుతోంది.బాహ్య హీలియోస్ఫియర్ ఉదజనిపై గురి!‘న్యూ హొరైజన్స్’ వ్యోమనౌక మరో మూడు వారాల్లో సూర్యుడి ‘బాహ్య హీలియోస్ఫియర్’లోని హైడ్రోజన్ గురించి పరిశోధన నిర్వహించనుంది. సూర్యుడి నుంచి నిరంతరం అంతరిక్షంలోకి విడుదలయ్యే అత్యంత శక్తిమంతమైన ఆవేశపూరిత కణాల ప్రవాహాన్ని ‘సౌర గాలి’ (సోలార్ విండ్) అంటారు. ఈ సౌర పవనం- మన సౌరవ్యవస్థలోని గ్రహాలను కూడా దాటి అంతరిక్షంలో ఓ భారీ ప్లాస్మా బుడగ ఆకృతిలో ‘హీలియోస్ఫియర్’ను ఏర్పరుస్తుంది. సాగదీసిన అశ్రుబిందువులా కనిపించే హీలియోస్ఫియర్... హానికర కాస్మిక్ రేడియేషన్, నక్షత్రాంతర ధూళి నుంచి మన సౌరవ్యవస్థను ఓ రక్షణ కవచంలా కాపాడుతుంది. సౌరవ్యవస్థ అంచుల్లో బాహ్య హీలియోస్ఫియర్ ఉదజనిపై ‘న్యూ హొరైజన్స్’ చేపట్టబోయేది ఓ కొత్త తరహా పరిశోధన. బాహ్య సౌరవ్యవస్థకు, నక్షత్రాంతర రోదసి (ఇంటర్స్టెల్లార్ స్పేస్)కి సరిహద్దుగా ఉండే ప్రాంతాన్ని ‘టెర్మినేషన్ షాక్’ అంటారు. మన సూర్యుడి మాదిరిగానే పాలపుంతలోని ఇతర నక్షత్రాల నుంచి దూసుకొచ్చే ఆవేశిత కణాలను గెలాక్టిక్ రేడియేషన్ అంటారు.ఈ ఆవేశిత కణాలతో కూడిన నక్షత్రాంతర మాధ్యమం (ఇంటర్స్టెల్లార్ మీడియం)ను సూర్యుడి బాహ్యవ్యవస్థ నిలువరించే సరిహద్దు ప్రాంతమే ‘టెర్మినేషన్ షాక్’. సూర్యుడి నుంచి గంటకు 30 లక్షల కిలోమీటర్ల ప్రచండ వేగంతో దూసుకొచ్చే సౌర గాలి ఈ ‘టెర్మినేషన్ షాక్’ హద్దును చేరుకోగానే నక్షత్రాంతర మాధ్యమ పీడనాన్ని ఎదుర్కొని వేగం కోల్పోతుంది. నక్షత్రాంతర మాధ్యమాన్ని ఢీకొని చివరికి ధ్వని వేగం కంటే కూడా తక్కువకు సౌర గాలి వేగం పడిపోతుంది. ‘టెర్మినేషన్ షాక్’ హద్దు వద్ద ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి ఇకపై శాస్త్రవేత్తలకు అవకాశం లభించనుంది. 11 ఏళ్ల పాటు కొనసాగే సౌరచక్రంలో సౌర గరిష్ఠం, సౌర కనిష్ఠం దశల సందర్భంగా ఉండే సూర్యుడి స్థితి ఆధారంగా పై హద్దులు వ్యాకోచిస్తూ, సంకోచిస్తూ మారుతుంటాయి. నాసా ప్రయోగించిన వోయేజర్-1, వోయేజర్-2 జంట వ్యోమనౌకలు 2012, 2018 సంవత్సరాల్లో హీలియోస్ఫియర్ దాటి ముందుకెళ్లాయి.అయితే బాహ్య సౌరవ్యవస్థ అన్వేషణార్థం ప్రస్తుతం ‘న్యూ హొరైజన్స్’లో ఉన్న అధునాతన శాస్త్రీయ పరికరాలు వాటిలో లేవు. ‘న్యూ హొరైజన్స్’ 2029-2040 సంవత్సరాల మధ్య కాలంలో ‘టెర్మినేషన్ షాక్’ ప్రాంతాన్ని చేరుతుందని భావిస్తున్నారు. అది అందించే డేటా కోసం ప్రపంచవ్యాప్తంగా అంతరిక్షరంగ భౌతిక శాస్త్రవేత్తలు ఆసక్తిగా నిరీక్షిస్తున్నారు. జంట వోయేజర్స్ తర్వాత విశ్వంలో సౌరవ్యవస్థను దాటి ప్రయాణించబోతున్న మూడో మానవ నిర్మిత వస్తువు ‘న్యూ హొరైజన్స్’!జమ్ముల శ్రీకాంత్ -
"నెట్ పరీక్షలో 90 ప్రశ్నలు మ్యాచ్"
సాక్షి,ఢిల్లీ: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు.యూజీసీ-నెట్ సోషియాలజీ పరీక్షకు ముందు 100 పేజీల PDF సర్క్యులేట్ అయిందని, అందులోని దాదాపు 90 ప్రశ్నలు అసలు పరీక్ష పేపర్‌తో మ్యాచ్ అయ్యాయన్నారు. నీట్ పరీక్ష పేపర్ ఉదంతం ముగిసి కొద్దిరోజులైన గడవక ముందే.. యూజీసీ నెట్ పేపర్‌కు సంబంధించిన ఆరోపణలు తీవ్ర ఆవేదన కలిగిస్తుందన్నారు. ఈ విషయమై ఎక్స్ ఖాతా వేదికగా ప్రభుత్వాన్ని నిలదీశారు. గత వారం జరిగిన యూజీసీ-నెట్ పరీక్షకు సంబంధించి వెలుగులోకి వచ్చిన తీవ్రమైన ఆరోపణలు అత్యంత దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయని రాహుల్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.."పరీక్షకు ముందు 100 పేజీల పీడీఎఫ్ విక్రయం జరిగింది. ఈ పీడీఎఫ్ ప్రశ్నపత్రం రూపకల్పనకు సంబంధించినది, ఇది కేవలం ఎన్‌టిఎ (NTA) వద్ద మాత్రమే అందుబాటులో ఉంటుంది. - ఈ పీడీఎఫ్‌లోని దాదాపు 90 ప్రశ్నలు అసలు సోషియాలజీ ప్రశ్నపత్రంలోని ప్రశ్నలతో సరిపోలుతున్నాయి". అని అన్నారు.ఆ పీడీఎఫ్‌ని బీహార్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్‌లలో రూ. 2.25 లక్షలకు అమ్ముతున్నారని. ఇదే నెట్వర్క్, సీఎస్ఐఆర్-నెట్, హెచ్టిఇటి, ఏడిఎ (ADA) వంటి రాబోయే పరీక్షలకు సైతం ప్రశ్నపత్రాలను అందిస్తున్నట్లు సమచారం అందిందని తెలిపారు. నీట్, నెట్లో పదే పదే కుంభకోణాలు జరుగుతున్నప్పటికీ, మోదీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.పేపర్ లీక్ వ్యవహారంలో ఒక పెద్ద మాఫియా పని చేస్తుందని, వారిపై దృష్టి పెట్టాల్సింది పోయి... విద్యార్థులను, సోషల్ మీడియాను నియంత్రించాలని చూడటం సరికాదన్నారు. ఈ పేపర్ లీకేజీలను ఒక పెద్ద ఉద్యమంగా మార్చాలని, దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల గొంతుక ద్వారానే విద్యావ్యవస్థలో మార్పు వస్తుందని ఆయన పిలుపునిచ్చారు. -
మోదీ ఖాతాలో మరో పురస్కారం.. "భారతీయులకు దక్కిన గౌరవం"
జకార్తా: భారత ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం దక్కింది.ఇండోనేషియా అత్యున్నత పురస్కారం 'బింతాంగ్ ఆదిపూర్ణ'ను ఆదేశ అధ్యక్షుడు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో చేతుల మీదుగా (మంగళవారం) పీఎం మోదీ అందుకున్నారు. ఈ అవార్డు కోట్లాదిమంది భారతీయులకు దక్కిన గౌరవమని మోదీ పేర్కొన్నారు.భారత్-ఇండోనేషియా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించినందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇండోనేషియా అత్యున్నత పురస్కారమైన 'బింతాంగ్ ఆదిపూర్ణ' ఇండోనేషియా ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రిఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ..."ఈ ఉదయం నాకు ఇండోనేషియా అత్యున్నత పురస్కారాన్ని ఎంతో ఆప్యాయతతో అందించారు. ఈ గౌరవం కోట్లాది మంది భారతీయులకు దక్కినది... ఇది ఇండోనేషియా ప్రజల సెంటిమెంట్‌కు, భారత్-ఇండోనేషియాల మధ్య ఉన్న చారిత్రాత్మక, సన్నిహిత సంబంధాలకు ప్రతీక. ఈ సందర్భంగా అధ్యక్షుడు ప్రబోవో జీకి, ఇండోనేషియా ప్రభుత్వానికి ఇక్కడి ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను" అని పీఎం మోదీ పేర్కొన్నారు.విదేశాంగ శాఖ స్పందనవిదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ అవార్డును "భారత్-ఇండోనేషియా స్నేహానికి దక్కిన నివాళి" గా అభివర్ణించారు. మన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత లోతుగా చేయడంతో పాటు, భారత్ - ఆసియాన్ సంబంధాలను బలోపేతం చేయడానికి పీఎం మోదీ చేసిన నిరంతర కృషికి ఈ పురస్కారమే నిదర్శనమని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఎక్స్‌లో రాసుకొచ్చారు.'బింతాంగ్ ఆదిపూర్ణ' పురస్కార చరిత్రఈ అవార్డును 1959 లో ఇండోనేషియా ప్రభుత్వం ప్రారంభించింది. ఇది రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, అత్యున్నతమైన పురస్కారం. ఇండోనేషియా రిపబ్లిక్ యొక్క ఐక్యత, నిరంతర వృద్ధి, శ్రేయస్సు కోసం అసాధారణమైన సేవలు అందించిన వ్యక్తులకు ఈ అత్యున్నత గౌరవాన్ని అందజేస్తారు. -
కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ రిలీఫ్
సాక్షి, ఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కేసులో ఢిల్లీ హైకోర్టు మంగళవారం కీలక తీర్పు ఇచ్చింది. ఎక్స్ ఖాతాపై (గతంలో ట్విట్టర్) ఖాతాపై ఉన్న బ్లాక్‌ను తొలగించి, దానిని పునరుద్ధరించాలని ఆదేశించింది. నీట్ పరీక్ష ముగిసిపోయినందున, కేంద్ర ప్రభుత్వం వ్యక్తం చేసిన ప్రాథమిక ఆందోళనకు ఇప్పుడు ఎలాంటి ప్రాధాన్యత లేదని పేర్కొంటూ జస్టిస్ స్వర్ణ కాంత శర్మతో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది.ఈ అంశంపై కోర్టులో ప్రభుత్వం తరపున భారత సొలిసిటర్ జనరల్ (SG) తుషార్ మెహతా వాదనలు వినిపించారు. నీట్ పరీక్ష సమయంలో ఈ పార్టీ చేసే పోస్టుల వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులలో గందరగోళం,అశాంతి నెలకొనే అవకాశం ఉందనే ప్రాథమిక ఆందోళనతోనే కేంద్ర ప్రభుత్వం ఆ అకౌంట్‌ను బ్లాక్ చేయాల్సి వచ్చిందని తెలిపారు. అయితే ప్రస్తుతం పరీక్షలు పూర్తయినందున ఆ ఆందోళనలు తొలగిపోయాయని, కాబట్టి ఆ అకౌంట్‌ను అన్‌బ్లాక్ చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. దీంతో కోర్టు కేంద్ర ప్రభుత్వ బ్లాకింగ్ ఆర్డర్‌ను రద్దు చేస్తూ తదుపరి చర్యలు చేపట్టింది.గతంలో, ఈ విషయమై కాక్రోచ్ ఫౌండర్ అభిజిత్ దీప్కే కేసును పరిశీలించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కి చెందిన రివ్యూ కమిటీని కోర్టు ఆదేశించింది. అలాగే వర్చువల్ విధానంలో కమిటీ ముందు హాజరయ్యేందుకు దీప్కేకు అవకాశం కూడా కల్పించింది.కాగా నీట్ అవకతవకలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టింది. -
భారత గడ్డపై అడుగుపెట్టిన జపాన్ ప్రధాని
జపాన్ ప్రధానమంత్రి సనాయే తకైచి మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం బుధవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటన జూలై ఒకటి నుంచి 3 వరకు కొనసాగనుండగా.. ఇందులో భారత్-జపాన్ 16వ వార్షిక శిఖరాగ్ర సమావేశం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు భారత్‌కు వచ్చిన సనాయే తకైచి.. ప్రధాని మోడీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ సహకారం, సెమీకండక్టర్లు, కృత్రిమ మేధస్సు, కీలక ఖనిజాలు, స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్ వ్యూహం తదితర అంశాలపై ఇరు దేశాలు చర్చించనున్నాయి. అలాగే ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కూడా అభిప్రాయాలు పంచుకోనున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి పదవి చేపట్టిన తర్వాత సనాయే తకైచి భారత్‌కు రావడం ఇదే తొలిసారి. ఈ పర్యటనతో భారత్-జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, గ్లోబల్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.#WATCH | Japanese Prime Minister Sanae Takaichi arrives in Delhi on her Official Visit to India. Union Minister Dr Jitendra Singh receives her at the airport. pic.twitter.com/RNz9gnSIT4— ANI (@ANI) July 1, 2026 -
సీఎం విజయ్‌పై 'హార్స్ ట్రేడింగ్' ఆరోపణలు!
సాక్షి, చెన్నై: తమిళనాడు సీఎం విజయ్‌కు షాక్ తగిలింది. తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను రాజీనామా చేసేలా విజయ్, టీవీకే సెక్రటరీ వైకో ప్రలోభ పెడుతున్నారని డీఎంకే ఆర్గనైజింగ్ సెక్రటరీ గవర్నర్‌కు లేఖ రాశారు. తమ ఎమ్మెల్యేలకు డబ్బుల ఆశ చూపుతూ హర్స్ ట్రేడింగ్‌కు పాల్పడుతున్నారని లేఖలో ఆరోపించారు. వారిద్దరిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు.ఎన్నికలు ముగిసి దాదాపు రెండు నెలలు గడిచిన తమిళనాడు రాజకీయాలు ఇంకా చల్లబడడం లేదు. తాజాగా డీఎంకే పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్.ఎస్ భారతి సీఎం విజయ్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఆ రాష్ట్ర గవర్నర్‌కు లేఖ రాశారు.ఆ లేఖలో... డీఎంకే పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు టీఎం, రాజేంద్రన్, సెంథిల్ సెల్వన్ లను తమ ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేయాల్సిందిగా తమిళనాడు సీఎం విజయ్ ఒత్తిడి చేస్తున్నారు. దీనికోసం హర్స్ ట్రేడింగ్ ఎమ్మెల్యేల బేరసారాలకు పాల్పడుతున్నారు. కనుక గవర్నర్ తక్షణమే చర్యలు తీసుకొని పూర్తి స్థాయి విచారణకు ఆదేశించాలి. వీరిద్దరు డీఎంకే గుర్తుపై గెలిచిన వ్యక్తులు కనుక తప్పనిసరిగా ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.అదే విధంగా డీఎంకే ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్.ఎస్. భారతి తమిళనాడు గవర్నర్‌తో పాటు అవినీతి నిరోధక శాఖ (DVAC)కు కూడా అధికారికంగా లేఖ రాశారు. అయితే ఇటీవల సీఎం విజయ్ తన మిత్రపక్షాలతో కలిసి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి VCK,IUML,MDMK పార్టీలను ఆహ్వానించారు. త్వరలోనే విజయ్ సెక్యూలర్ ఫ్రంట్ అనే కొత్త కూటమిని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.కాగా కొద్దిరోజుల క్రితం డీఎంకే అధినేత ఎం.కే స్టాలిన్ మాట్లాడుతూ తమిళనాడులో ఏ క్షణాన్నైన ఎన్నికలు రావచ్చు అన్నారు. దీంతో విజయ్ తన ప్రత్యర్థులకు చెక్ పెట్టి తన బలం పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నాడని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
సచిన్ అహీర్ పార్టీ మార్పుపై.. ఆదిత్యా ఠాక్రే ఆగ్రహం
ముంబై: ప్రస్తుతం శివసేన (యూబీటీ)కి ఎదురుగాలి వీస్తుంది. ఇటీవలే ఆపార్టీకి చెందిన ఆరుగురు ఎంపీలు శిండే నేతృత్వంలోని శివసేనకు మద్దతు ప్రకటించారు. తాజాగా ఆ పార్టీ కీలక నేత ఎమ్మెల్సీ సచిన్ అహీర్ .. ఉద్ధవ్‌కు హ్యాండిచ్చి ఏక్నాథ్ శిందేతో చేతులు కలిపారు. అయితే దీనిపై ఆదిత్యా ఠాక్రే చాలా సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఆ పార్టీ నేతలతో సచిన్‌ను తన వద్దకు పిలిపించండి అని అన్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఠాక్రేలకు మహారాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన ఎదురుగాలి వీస్తుంది. ఎన్నో ఏళ్లుగా వారి కంచుకోటలా ఉన్న ముంబై పీఠం వారి చేయి జారిపోవడం.. ఇటీవల ఆపార్టీకి చెందిన ఆరుగురు లోక్‌సభ ఎంపీలు షిండే వర్గంలో చేరడం.. తాజాగా ఆదిత్యా ఠాక్రేకు ఎంతో నమ్మిన బంటుగా ఉంటూ తన రైట్‌హ్యాండ్‌గా చలామణీ అవుతున్న సచిన్ అహిర్ సైతం పార్టీని వీడడంతో వారికి దెబ్బమీద దెబ్బ తగులుతుంది. ఈ విషయమై ఆదిత్యా ఠాక్రే పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది.ఆదిత్యఠాక్రే ఈ అంశంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. "జీవితంలో కొన్ని సూత్రాలు ఉండాలి. పార్టీ మీకు అన్ని ఇచ్చినప్పుడు, కష్టకాలంలో పార్టీతోనే నిలబడాలి. ఆయన్ను నా ముందుకు తీసుకురండి, పార్టీ ఆయనకు ఏమి ఇవ్వలేదో నేనే అడుగుతాను" అంటూ ఆదిత్య ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పత్రికా కథనాలు పేర్కొన్నాయి. అయినా ఉద్ధవ్ వర్గాన్ని వీడడం పార్టీకి మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా ఆదిత్యాఠాక్రేకు తీరని దెబ్బని భావిస్తున్నారు. కాగా సచిన్ అహిర్ పార్టీలోకి వస్తూనే "సిక్స్ కొట్టారు" అని ఏక్ నాథ్ శిండే ప్రశంసించారు. "ఆయన క్షేత్రస్థాయి కార్యకర్త, ప్రజలు ఆయన రాజకీయ శైలిని ఇష్టపడతారు. ఆయన మా జట్టు ఆటగాడు, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నీ ఆయనే చేస్తారు" అని షిండే సంతోషం వ్యక్తం చేశారు.మహాయుతి కూటమిలో డిప్యూటీ చైర్పర్సన్ పదవి కోసం నీలం గోర్హే, కృపాల్ తుమనే వంటి శివసేన నేతలు గట్టిగా ప్రయత్నించారు. కానీ శిండే శివసేన తరుపున సచిన్ అహిర్ మహారాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి నామినేషన్ దాఖలు చేశారుకాగా 2019లో ఆదిత్య ఠాక్రే తన మొదటి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు, అప్పటివరకు ఎన్సీపీలో ఉన్న అహిర్‌ను శివసేనలోకి తీసుకొచ్చి వర్లీ ఎన్నికల పూర్తి బాధ్యతలను అప్పగించారు. ఈ నేపథ్యంలో ఆయన షిండే వర్గంలో చేరడం శివసేన ఉద్ధవ్ వర్గంలో తీవ్ర కలకలం రేపుతుంది. -
కూలిన పైకప్పు 8 మంది మృతి.. శిథిలాల కింద 45 మంది
పశ్చిమబెంగాల్: కోల్‌కతాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ గోడౌన్ పైకప్పు కుప్పకూలి ఎనిమిది మంది కార్మికులు మృతి చెందారు. శిథిలాల కింద మరో 45 మంది కార్మికులు చిక్కుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న సహాయకు సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. అయితే శిథిలాల కింద పెద్దఎత్తున కార్మికులు చిక్కుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
రాహుల్‌పై మండిపడ్డ ధర్మేంద్ర ప్రధాన్
సాక్షి, ఢిల్లీ: నీట్ వ్యవహారంలో లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అత్యంత దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ అన్నారు. ఈ మెుత్తం ఎపిసోడ్లో ఆయన వ్యవహారించిన తీరు తనను తీవ్ర అసహానానికి గురిచేసిందన్నారు. ఇటీవల నీట్ పరీక్ష ముగిసిన నేపథ్యంలో ఈరోజు( మంగళవారం) ఎన్డీటీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ముఖాముఖీలో ఆయన మాట్లాడుతూ "ప్రశ్నలు అడిగే హక్కు ప్రతిపక్షానికి ఉంది. కానీ పరీక్షకు మూడు రోజుల ముందు, విద్యార్థులను భయపెట్టడానికి, వారి సన్నద్ధతను దెబ్బతీయడానికి రాహుల్ గాంధీ కోటాలో ఒక కార్యక్రమం నిర్వహించారు.విద్యార్థుల సన్నద్ధతను దెబ్బతీయడానికి, అరాచకాన్ని సృష్టించడానికి ఆయన ప్రయత్నించారు" అని అన్నారు.నీట్ పరీక్ష లీకేజ్‌తో విద్యార్థుల ఆత్మహత్యల పట్ల తీవ్ర కలత చెందాను. ఈ విషయంలో విద్యాశాఖ మంత్రిగా, విద్యార్థి ఆత్మహత్య జరిగిన ప్రతిసారీ నన్ను నేనే తిట్టుకుంటాను. ఈ విచ్ఛిన్నమైన వ్యవస్థను మనం సరిదిద్దాలి. కానీ కాంగ్రెస్, రాహుల్ గాంధీ విద్యార్థుల ఆత్మహత్యలను వాడుకున్న తీరు నీచమైన రాజకీయాలని మండిపడ్డారు. ప్రస్తుత వ్యవస్థను ఎలా మెరుగుపరచాలనే దానిపై రాహుల్ గాంధీ , కాంగ్రెస్ నుంచి ఇదివరకూ ఒక్క సానుకూల సూచన కూడా తనకు అందలేదన్నారు.ఒక విద్యార్థికి అబుదాబిలో పరీక్షా కేంద్రాన్నివిద్యార్థి తండ్రి అభ్యర్థన మేరకే కేటాయించారని మంత్రి స్పష్టం చేశారు. "ఈ విషయం వెలుగులోకి రాగానే, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కొన్ని గంటల్లోనే స్పందించి, కేంద్రాన్ని నాగ్‌పూర్‌కు మార్చిందని తెలిపారు. ఈ ఘటనను సైతం రాహుల్ గాంధీ రాజకీయాలకు వాడుకుంటున్నారని దుయ్యబట్టారు.కాగా నీట్-యూజీలో పేపర్ లీక్‌లు, పరీక్షా కేంద్రాల సమస్యలతో సహా జరిగిన అవకతవకలపై రాహుల్ గాంధీ, కాంగ్రెస్.. ప్రభుత్వంపై పదేపదే విమర్శలు గుప్పించాయి. గత వారం కోటాలో విద్యార్థులతో జరిగిన ఒక సమావేశంలో గాంధీ మాట్లాడుతూ, పరీక్షా విధానం మోసపూరితంగా ఉందని, విద్యా వ్యవస్థలోని అవినీతి కారణంగా లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
టెలిగ్రామ్ సేవలు పునఃప్రారంభం
సాక్షి, ఢిల్లీ: దేశంలో టెలిగ్రామ్ సేవలు మళ్లీ పునఃప్రారంభమయ్యాయి. జూన్ 21న జరిగిన నీట్ రీఎగ్జామ్ రీత్యా భద్రతా కారణాలతో టెలిగ్రామ్ సేవలను జూన్ 22వరకూ టెలిగ్రామ్ యాక్సెస్ తాత్కాలికంగా కేంద్రం నిలిపివేసింది. ఎగ్జామ్ ముగియడంతో సేవలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. అదే విధంగా ఈ నెల 30 వరకు టెలిగ్రామ్‌లోని ఎడిట్ ఆఫ్షన్ తొలిగింపు కొనసాగనుంది. పేపర్ లీక్ మోసాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.జూన్ 21న నీట్ ఎగ్జామ్ ప్రశాతంగా ముగిసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారిక గణాంకాల ప్రకారం పునఃపరీక్షకు దేశవ్యాప్తంగా 20 లక్షల కంటే ఎక్కువ మంది విద్యార్థులు హజరైనట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో నీట్ పరీక్షను దాదాపు 3.65 లక్షల మంది విద్యార్థులు రాశారు. కొన్ని ప్రాంతాలలో విద్యార్థులు సమయానికి రాకపోవడంతో విద్యార్థులను పరీక్ష కేంద్రాలలోకి అనుమతించలేదు. దీంతో వారు పరీక్షకు అనుమతించాలని తీవ్రంగా విలపించారు. ఇలాంటి చిన్న చిన్న ఘటనలు మినహా ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది -
అగ్నిప్రమాదంపై ప్రధాని విచారం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన
యూపీ: లక్నోలోని కోచింగ్ సెంటర్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషయమై ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. " లక్నోలో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అధికారులు సాధ్యమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నారు". అని ప్రధాని విచారం వ్యక్తం చేశారు.మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుండి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 పరిహారం అందజేస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. కాగా ఈ రోజు (సోమవారం) మధ్యాహ్నం లక్నోలోని ఓ కోచింగ్ సెంటర్లో జరిగిన అగ్నిప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తో్ంది.ప్రమాదం ఎలా జరిగింది?ఈరోజు (సోమవారం) మధ్యాహ్నం 3 గంటల సమయంలో అలీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉషా మెహతా మార్గ్‌లో ఉన్న మూడంతస్తుల వాణిజ్య భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఒక దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ప్రారంభమయ్యాయని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మంటలు క్షణాల్లోనే పై అంతస్తులకు విస్తరించాయి. ఆ సమయంలో రెండో, మూడో అంతస్తుల్లో కంప్యూటర్ కోచింగ్ సెంటర్, లైబ్రరీలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు. భవనం మొత్తం పొగలు, మంటలు అలుముకోవడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే అగ్నిమాపక దళం వెంటనే స్పందించినప్పటికీ అయితే మంటలు భారీగా ఉండటంతో లోపలికి వెళ్లడం అగ్నిమాపక సిబ్బందికి కష్టతరమైంది. నిచ్చెనల సహాయంతో కిటికీలను పగలగొట్టి లోపల చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ భారీగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ స్పందించారు. గాయపడిన బాధితులకు సమీప ఆసుపత్రుల్లో మెరుగైన ఉచిత వైద్య చికిత్స అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.Anguished by the loss of lives in a fire mishap in Lucknow, Uttar Pradesh. My condolences to the bereaved families. May the injured recover at the earliest. Rescue operations are underway and authorities are providing all possible assistance. An ex-gratia of Rs. 2 lakh from…— PMO India (@PMOIndia) June 22, 2026 -
ఇండియా కూటమిలో చేరనున్న డీఎంకే..?
సాక్షి, చెన్నై: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఎవరూ ఉండరంటారు.. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అదే విషయం మరోసారి రుజువయ్యేలా కనిపిస్తుంది. ఇటీవలే ఇండియా కూటమి నుంచి వైదొలిగిన డీఎంకేకు... రాహుల్ గాంధీ మరోసారి కలిసి పనిచేసేలా రాయబారం పంపినట్లు సమాచారం. అసలేం జరిగిందంటే ...?ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు దేశవ్యాప్తంగా అధికార ఎన్టీఏ కూటమిని మరింత బలీయంగా మార్చగా అదే సమయంలో ఇండియా కూటమిని బలహీన పరిచాయి. కూటమిలో ప్రధానంగా ఉన్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్, బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓడిపోవడం.. అదే విధంగా టీవీకేకు మద్ధతిచ్చి మిత్ర ధర్మాన్ని పాటించలేదని ఆగ్రహం చెంది.. ఇండియా కూటమి నుంచి వైదొలిగింది. ఈ పరిస్థితులు నడుమ ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జన్మదినం సందర్బంగా డీఎంకే అధినేత స్టాలిన్ "గౌరవనీయ ప్రతిపక్ష నాయకులు తిరు రాహుల్ గాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు మంచి ఆరోగ్యంతో, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను." అని సాధారణంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే దీనికి బదులిచ్చిన రాహుల్ గాంధీ "భారతదేశ భావనను, మన రాజ్యాంగాన్ని, సమాఖ్యవాదాన్ని పరిరక్షించాలనే మన ఉమ్మడి సంకల్పం మనకు మార్గదర్శకంగా కొనసాగుతుంది - ఇది మన ప్రజాస్వామ్య ఆత్మ కోసం చేసే పోరాటం, మనం గెలిచే వరకు దీన్ని కలిసికట్టుగా పోరాడతాం." అని ప్రత్యత్తరమిచ్చారు. దీంతో రాహుల్ వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో హాట్‌టాఫిక్‌గా మారాయి. ఇండియా కూటమిలోకి మళ్లీ రావాలని రాహుల్ స్టాలిన్‌కు రాయభారం పంపారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా గతేడాది రాహుల్ గాంధీకి స్టాలిన్ శుభాకాంక్షలు తెలుపుతూ "రక్త సంబంధంతో కాదు, ఆలోచన, దార్శనికత, లక్ష్య సాధన ద్వారా బంధించబడిన నా ఆదర్శ సోదరుడు మీరు ఇలాగే దృఢంగా నిలబడి, ధైర్యంతో నాయకత్వం వహించాలి. ఉజ్వల భారతదేశం వైపు మన పయనించే ఈ ప్రయాణంలో విజయం మనదే అవుతుంది." అని రాహుల్ ని ప్రశంసిస్తూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ ఏడాది మాత్రం నామమాత్రంగా విషెస్ చెప్పారు. -
కర్ణాటకలో క్రాస్ ఓటింగ్.. కాంగ్రెస్ ఘన విజయం
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ తీవ్ర కలకలం రేపుతోంది. మొత్తం 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అధికార కాంగ్రెస్ పార్టీకి 135 మంది సభ్యుల బలం ఉండగా ఏకంగా 151 ఓట్లను సాధించి, 5 స్థానాలను కైవసం చేసుకుంది. ప్రతిపక్ష బీజేపీ కేవలం 2 స్థానాలను మాత్రమే గెలుచుకోగా, జేడీఎస్ అభ్యర్థి ఓటమి పాలయ్యారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జేడీఎస్ (JD-S) పార్టీలకు చెందిన 12 మంది వరకు ఎమ్మెల్యేలు తమ పార్టీ ఆదేశాలను ధిక్కరించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా ఓటు వేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా జేడీఎస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డట్లు సమాచారం. ఆ పార్టీకి అసెంబ్లీలో 18మంది ఎమ్మెల్యేలున్నారు. అంటే జేడీఎస్ అభ్యర్థికి 18ఓట్లు రావాలి. కానీ, జేడీఎస్ మొదటి ప్రాధాన్యతా ఓట్లు 14 మాత్రమే వచ్చాయి. అంటే, నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డట్లు సమాచారం. బీజేపీ కనీసం మూడు ఓట్లను కోల్పోగా కాంగ్రెస్‌కు అదనంగా వచ్చిన ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయనే గందరగోళం ఏర్పడింది. దీనిపై విచారణ సాగుతుంది.ఈ క్రాస్ ఓటింగ్ ద్వారా కాంగ్రెస్ అఖండ విజయం సాధించగా, ప్రతిపక్ష శిబిరంలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. బీజేపీ, జేడీఎస్ కూటమి నుండి క్రాస్ ఓటింగ్ జరగడంపై ఆయా పార్టీల అగ్రనాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై అంతర్గత విచారణ జరిపి, బాధ్యులైన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని బిజెపి నేతలు ప్రకటించారు. కాగా సీఎంగా డీకే శివకుమార్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికలు ఇందులో కాంగ్రెస్ విజయం సాధించడంతో ఈ గెలుపుపై ఆయన సంతోషం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. -
ఎస్పీలో చీలికలు.. అఖిలేష్ రియాక్షన్
లక్నో: సమాజ్ వాద్ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ బీజేపీకి స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. SP అన్ని ఒడిదొడుకులు ఎదుర్కొని బీజేపీకి ఎదురు నిలిచిందన్నారు. అంతర్గతంగా ఎన్ని సంక్షోభాలను సృష్టించినా వాటిని ఎదుర్కొనేందుకు తామెప్పుడూ సిద్ధంగా ఉంటామని ప్రకటించారు. ఎస్పీలో చీలికలు మెుదలయ్యాయి. అఖిలేష్ అరెస్టు కాబోతున్నారని బీజేపీ మంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో ఈ రోజు (బుధవారం) అఖిలేష్ యాదవ్ బదులిచ్చారు.యూపీ మంత్రి ప్రకాశ్ రాజ్ భర్ సమాజ్ వాద్ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. "త్వరలో సమాజ్ వాదీ పార్టీలో ఒక పెద్ద చీలిక రాబోతోంది. ఇప్పటికే ఎస్పీ రాజ్యసభ సభ్యుడు రామ్ గోపాల్ యాదవ్ కేంద్ర మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు .మైనింగ్ కేసులో సీబీఐ అఖిలేష్ యాదవ్ పేరు ఉందని త్వరలోనే జైలుకు వెళ్తారు..మహారాష్ట్ర, బెంగాల్ తర్వాత ఎస్పీ బీజేపీలో చేరడానికి సిద్దంగా ఉన్నారు." అని అన్నారు. దీంతో ఈ వార్త దేశవ్యాప్తంగా ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఈ అంశంపై స్పందించారు.అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.." బీజేపీ చీలికలు, ఫిరాయింపులను రాజకీయ వ్యూహంగా పదేపదే ఉపయోగించుకుంది. పలు పార్టీలలో సంక్షోభం సృష్టించింది. సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, చివరికి రాజ్యసభకు వెళ్లిన నాయకులను కూడా అది తనవైపు లాక్కుంది. దురాశ, అంతర్గత శక్తులతో నడిచే వ్యక్తులు ఎప్పుడూ ఉంటారు, కానీ అటువంటి సవాళ్లను ఎదుర్కోవడానికి సమాజ్‌వాదీ పార్టీ పూర్తిగా సిద్ధంగా ఉంది." అని ఆయన అన్నారుఎన్నో సంవత్సరాలుగా రాజకీయ ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, ఎస్పీ బలమైన పార్టీగానే నిలిచిందని పేర్కొన్నారు. సమాజ్‌వాదీ పార్టీ ఒక బలమైన సంస్థ అని ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తాము బీజేపీని సవాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని అఖిలేష్ తేల్చి చెప్పారు. -
ప్రియురాలి కోసం హత్య.. ప్రసాదంలో విషం కలిపి
బెంగళూరు: కర్ణాటకలో విషాదం చోటు చేసుకుంది. తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందనే నెపంతో ఓ భర్త తన భార్యకు ప్రసాదంలో విషం కలిపి ఇచ్చాడు. అనంతరం ఆమె స్ప్రహ కోల్పోవడంతో గొంతునులిమి చంపాడు. మహిళ మృతి పట్ల అనుమానం రావడంతో పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.పోలీసుల కథనం ప్రకారం..బెళగావి జిల్లా గోకాక్ కు చెందిన సంతోష్ పటాయత్కు, ధార్వాడ్ తాలూకా కల్లూరు గ్రామానికి చెందిన సక్కుబాయి పటాయత్తో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. అయితే, గత నాలుగేళ్లుగా సంతోష్ తన గ్రామానికి చెందిన ఒక వితంతువుతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమెతోనే జీవితాంతం కలిసి ఉండాలని నిర్ణయించుకుని, భార్యను వదిలించుకోవాలని ప్లాన్ వేశాడు.ప్రస్తుతం ‘అధిక మాసం’ నడుస్తుండటంతో, భార్య సక్కుబాయిని బైల్‌హోంగల్ తాలూకా మరకూంబి గ్రామంలోని చాముండేశ్వరి దేవాలయానికి తీసుకెళ్లాడు. దర్శనం ముగించుకుని తిరిగి వస్తుండగా, మార్గమధ్యంలో కూల్ డ్రింక్‌లో ఎలుకల మందు, గాజుల ముక్కల పొడిని కలిపి.. అది ‘దేవుడి ప్రసాదం’ అని నమ్మించి భార్యతో తాగించాడు. విషం ప్రభావంతో సక్కుబాయి స్పృహ కోల్పోతుండగా, సంతోష్ ఆమెను రోడ్డు పక్కన గొంతు పిసికి దారుణంగా హత్య చేశాడు.రోడ్డుప్రమాదంగా డ్రామా అనంతరం ఈ హత్యను రోడ్డు ప్రమాదంగా నమ్మించేందుకు ఒక డ్రామా ఆడాడు. భార్య మృతదేహంపై మోటార్ సైకిల్‌ను పడేసి, ప్రమాదం జరిగినట్లు కలరింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత కొన్ని గంటల పాటు అక్కడే ఉండి, తానే స్వయంగా పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి ప్రమాదం జరిగిందని సమాచారం ఇచ్చాడు. అయితే సక్కుబాయి మృతి చెందిన తీరుపై పోలీసులకు అనుమానం రావడంతో, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం చేయగా నివేదికలో అది రోడ్డు ప్రమాదం కాదని హత్యేనని తేలింది. దీంతో నిందితున్ని అరెస్టు చేశారు. కాగా ఈ హత్యలో సంతోష్ ప్రియురాలైన సదరు వితంతువు పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నారు. -
యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం
లక్నో: నీట్ రీఎగ్జామ్‌పై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 21న నీట్ రాసే విద్యార్థులకు బస్సు టికెట్లలో 50 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. విద్యార్థులు అడ్మిట్ కార్డు చూపించి ఈ సేవలు పొందవచ్చని తెలిపింది. విద్యార్థులు మరోసారి నీట్ ఎగ్జామ్ రాస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.జూన్ 21న నీట్ రీఎగ్జామ్ జరగనున్న నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ రోజు (బుధవారం) అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. నీట్ పునఃపరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ (యూపీఎస్ఆర్టీసీ) బస్సు ఛార్జీలలో 50 శాతం రాయితీని యోగి ప్రకటించారు. ఎన్టీఏ ఇచ్చిన మార్గదర్శకాలను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా ఇతర జిల్లాల నుంచి వచ్చే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వసతి సదుపాయాలతో పాటు పరీక్ష కేంద్రాలకు సరైన సమాయానికి చేరుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు.అదే విధంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను నిశితంగా పర్యవేక్షించాలని, పరీక్షకు సంబంధించిన వదంతులు, తప్పుడు సమాచారం లేదా తప్పుదారి పట్టించే కంటెంట్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలి. నీట్ పునఃపరీక్ష విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగాలు, పోలీసు అధికారులు, ఇతర శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. కాగా ఉత్తరప్రదేశ్‌లో దాదాపుగా దాదాపు 3.5 లక్షల మంది అభ్యర్థులకు పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి నిర్ణయం నేపథ్యంలో వారందరికీ మేలు చేకూరనుంది.టెలిగ్రామ్ బ్యాన్ కాగా నీట్ పరీక్ష కోసం కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేదం విధించింది. జూన్ 22వరకూ టెలిగ్రామ్ యాక్సెస్ నిషేదించింది. అదే విధంగా ఈ నెల 30 వరకు టెలిగ్రామ్‌లోని ఎడిట్ ఆఫ్షన్ తొలిగిస్తున్నట్లు ప్రకటించింది. పేపర్ లీక్ మోసాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా నీట్ రీటెస్ట్‌కు హాజరయ్యే విద్యార్థులకు పరీక్షా సమయాన్ని పెంచడంతో పాటు బుక్‌లెట్‌లో రఫ్ వర్క్ చేసుకునేందుకు అదనపు పేజీలను కేటాయించింది. గతంలో నీట్ పరీక్ష వ్యవధి 180 నిమిషాలు (3 గంటలు) ఉండేది. తాజా నిర్ణయంతో ఈ సమయాన్ని 195 నిమిషాలకు (3.15 గంటలకు) పెంచింది.పెంచిన సమయం ప్రకారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. ఈ నేపథ్యంలో పరీక్షలో ఎలాంటి మోసాలకు తావు లేకుండా కీలక చర్యలు తీసుకుంటుంది. కాగా ఇటీవల ప్రశ్నాపత్రాల తరలింపుకు విమానాలను వాడింది. ఒక పరీక్ష పత్రాలకోసం విమాన సేవలను వినియోగించుకోవడం దేశంలోనే ఇది తొలిసారి. -
నీట్ ఎగ్జామ్.. భారత్‌లో టెలిగ్రామ్‌పై బ్యాన్!
ఢిల్లీ: కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 21న నీట్ రీఎగ్జామ్ జరగనున్న నేపథ్యంలో టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేదం విధించింది. జూన్ 22వరకూ టెలిగ్రామ్ యాక్సెస్ నిషేదించింది. అదే విధంగా ఈ నెల 30 వరకు టెలిగ్రామ్‌లోని ఎడిట్ ఆఫ్షన్ తొలిగిస్తున్నట్లు ప్రకటించింది. పేపర్ లీక్ మోసాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.ఈ పరీక్ష కోసం ఇదివరకే నీట్ కీలక వెసులుబాట్లు కల్పించింది. నీట్ రీటెస్ట్‌కు హాజరయ్యే విద్యార్థులకు పరీక్షా సమయాన్ని పెంచడంతో పాటు బుక్‌లెట్‌లో రఫ్ వర్క్ చేసుకునేందుకు అదనపు పేజీలను కేటాయించింది. గతంలో నీట్ పరీక్ష వ్యవధి 180 నిమిషాలు (3 గంటలు) ఉండేది. తాజా నిర్ణయంతో ఈ సమయాన్ని 195 నిమిషాలకు (3.15 గంటలకు) పెంచింది. పెంచిన సమయం ప్రకారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి మోసాలకు తావు లేకుండా కీలక చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ప్రశ్నాపత్రాల తరలింపుకు విమానాలను వాడింది. ఒక పరీక్ష పత్రాలకోసం విమాన సేవలను వినియోగించుకోవడం దేశంలోనే ఇది తొలిసారి.ఎగ్జామ్ రద్దునీట్ ఎగ్జామ్ మే 3న జరగాల్సి ఉండగా, అంతకంటే ముందే పేపర్ లీక్ అయినట్లు అధికారులు గుర్తించారు.ఈ లీక్ వ్యవహారంపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరగడంతో, మే 12న ఆ పరీక్షను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.పేపర్ లీక్ బయటపడిందిలారాజస్తాన్లోని జామ్వా రామ్‌గఢ్‌కు చెందిన మంగీలాల్, దినేశ్ బివాల్ సోదరులు ఏప్రిల్ 26న గురుగ్రామ్‌లోని ఓ డాక్టర్ నుంచి రూ.30 లక్షలకు నీట్ పేపర్‌ను కొనుగోలు చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. వీరిలో ఒక వ్యక్తి సికార్ టౌన్లో నీట్‌కు సిద్ధమవుతున్న తన కుమారుడికి పేపర్‌ను చేరవేశాడు. సోదరులిద్దరూ ఏప్రిల్ 29న మరికొందరికి ఈ ప్రశ్నపత్రాన్ని విక్రయించి, సొమ్ము చేసుకున్నారు. జామ్వా రామ్‌గఢ్ నుంచే పేపర్ సికార్‌లోని ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ఏజెంట్ రాకేశ్ కుమార్‌కు చేరింది.అతడు ఈ పేపర్‌ను రూ.30,000కు కేరళలోని ఎంబీబీఎస్ విద్యార్థికి విక్రయించాడు. తర్వాత ఆ విద్యార్థి సికార్‌లో హాస్టల్‌ను నిర్వహిస్తున్న తన తండ్రికి ఇంటర్నెట్ ద్వారా చేరవేశాడు. ఆ తండ్రి ద్వారానే ఈ మొత్తం లీకేజీ వ్యవహారం బయటకు వచ్చింది. రాకేశ్ కుమార్ ఈ పేపర్‌ను 700 మంది నీట్ అభ్యర్థులకు విక్రయించినట్లు దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. -
టీచర్స్ స్కామ్.. అభిషేక్ బెనర్జీపై ప్రశ్నల వర్షం
సాక్షి, కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఉపాధ్యాయ నియామకాల్లో జరిగిన భారీ అవినీతి స్కామ్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ లోతైన విచారణ జరుపుతుంది. ఈ అంశంలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీని ఈ రోజు (సోమవారం) అధికారులు విచారించారు. కోల్‌కతాలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. కాగా నిన్న ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ కేసులో అధికారులు అభిషేక్ బెనర్జీని దాదాపు ఎనిమిదిన్నర గంటల పాటు విచారించారు.మనీ లాండరింగ్, ఆర్థిక లావాదేవీలు ,నియామక ప్రక్రియలో జరిగిన అక్రమాల్లో ఆయన పాత్రపై ఈడీ అభిషేక్ బెనర్జీని సుదీర్ఘంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. డబ్బుకు బదులుగా ఉద్యోగాలు ఇప్పించేందుకు ఒక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారని ఆరోపిస్తోంది. ఈనెట్‌వర్క్ ద్వారా, అర్హులైన అభ్యర్థుల కంటే లంచాలు చెల్లించిన వ్యక్తులకే ప్రాధాన్యత లభించిందని దర్యాప్తు సంస్థ ఆరోపిస్తోంది. స్కామ్ నేపథ్యంపశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్, పశ్చిమ బెంగాల్ ప్రాథమిక విద్యా మండలి ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో గ్రూప్-సి, గ్రూప్-డి సిబ్బందితో పాటు ప్రైమరీ, సెకండరీ, హయ్యర్ సెకండరీ ఉపాధ్యాయుల నియామకాల కోసం పరీక్షలు నిర్వహించారు. అయితే, అర్హత గల అభ్యర్థులను పక్కన పెట్టి, పెద్ద మొత్తంలో లంచాలు తీసుకుని అర్హత లేని వారికి, తక్కువ మార్కులు వచ్చిన వారికి ఉద్యోగాలు ఇచ్చారనేది ప్రధాన ఆరోపణ. అక్రమాల కోసం OMR షీట్ల తారుమారు చేశారని కొందరు ఖాళీ పేపర్లు వదిలినా వారికి ఉద్యోగాలు వచ్చాయని, అధికారిక అర్హత లేకపోయినా, అక్రమ మార్గాల్లో వందలాది మందికి నకిలీ సిఫార్సు లేఖల ద్వారా నియామక పత్రాలు అందజేశారు. అర్హులైన అభ్యర్థుల పేర్లను వెనుకకు నెట్టి, లంచాలు ఇచ్చిన వారి పేర్లను మెరిట్ లిస్ట్‌లో పైకి చేర్చారని ఆరోపణలున్నాయి. దీంతో ఈ స్కామ్‌పై కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణ ప్రారంభించాయి. పశ్చిమ బెంగాల్ మాజీ విద్యాశాఖ మంత్రి పార్థా ఛటర్జీని, ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీని ED అరెస్ట్ చేసింది. అర్పితా ముఖర్జీ నివాసాల నుంచి సుమారు రూ. 50 కోట్లకు పైగా నగదు, భారీగా బంగారం, ఆస్తుల పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకోవడం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. -
భారత్ తదుపరి ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్
సాక్షి,ఢిల్లీ: కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత తదుపరి ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్‌ను నియమించింది. ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పదవీ కాలం జూన్ 30 నుంచి ముగుస్తుంది. ఆరోజే ఆర్మీ చీఫ్‌గా ధీరజ్ సేథ్ బాధ్యతలు స్వీకరిస్తారించనున్నట్లు తెలుస్తోంది.ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ పదవీకాలం మూడు సంవత్సరాలు లేదా ఆయనకు 62 ఏళ్ల వయస్సు వచ్చే వరకు, ఈ రెండింటిలో ఏది ముందు అయితే అది వర్తిస్తుంది.ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ సేవలందిస్తున్నారు, ఖడక్ వాస్లాలోని ప్రతిష్టాత్మక 'నేషనల్ డిఫెన్స్ అకాడమీ' (NDA) పూర్వ విద్యార్థి. ఆయన డిసెంబర్ 1986లో ఆయన భారత సైన్యంలో చేరారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా భారత ఆర్మీకి సేవలందిస్తున్నారు. విస్త్రతశ్రేణి కమాండ్, స్టాఫ్,లాంటి పలు వ్యూహత్మక బాధ్యతలు నిర్వహించారు. గతంలో లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ గతంలో సాయుధ రెజిమెంట్‌కు, సాయుధ బ్రిగేడ్ తిరుగుబాటు నిరోధక దళానికి కమాండర్‌గా పనిచేశారు. ప్రతిష్టాత్మక సుదర్శన్ చక్ర కార్ప్స్కు నాయకత్వం వహించారు. ఢిల్లీ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ జీవోసీగా పని చేశారు. కాగా ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది జూన్ 2024 లో బాధ్యతలు స్వీకరించారు. -
డీకే శివకుమార్‌కు కొత్త తలనొప్పి.. ఇదేం కర్మరా బాబు
బెంగళూరు: కర్ణాటక రాజకీయాలు రోజుకో మలుపుతిరుగుతున్నాయి. ఎన్నో అపసోపాలు పడి ఎట్టికేలకు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన డీకే శివకుమార్‌కు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. కొద్దిరోజుల క్రితం తనకు కీలక శాఖ కేటాయించలేదని పార్టీ సీనియర్ నేత రామలింగారెడ్డి రాజీనామా అనంతరం అది సద్దుమణగడం జరిగింది. ఇప్పుడు తాజాగా మరోనేత డీకే శివకుమార్‌పై అసమ్మతి గళం వినిపిస్తున్నారు.కన్నడ మంత్రి కృష్ణ బైరేగౌడకు ఇటీవల జరిగిన క్యాబినేట్ విస్తరణలో బెంగళూరు డెవలఫ్‌మెంట్ ఫోర్ట్ పోలియో కేటాయించారు. అయితే అందులో కీలకమైన గ్రేటర్ బెంగళూరు అభివృద్ధి బాధ్యతలు సీఎం వద్దే ఉండటం, బీడీఏ, బీఎంఆర్డీఏ వంటి కీలక సంస్థలు కూడా ఆయన పరిధిలో ఉండడంతో ఆయనకు అధికార విభజనపై గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో కృష్ణబైరే గౌడ స్పందించారు. తనకు కేటాయించిన ఫోర్ట్ పోలియోపై స్పష్టతనివ్వాలని సీఎం శివకుమార్‌ను కోరారు.కృష్ణబైరే గౌడ మాట్లాడుతూ " నాకు ఎలాంటి అసంతృప్తి లేదు. బెంగళూరు అభివృద్ధిని పర్యవేక్షించే కష్టమైన బాధ్యతను పార్టీ నాకు అప్పగించింది. ఇది చాలా కఠినమైన పని. నేను దీనిని అధికార సమస్యగా చూడటం లేదు. ఇలాంటి బాధ్యత తీసుకునేటప్పుడు స్పష్టత ఉండాలి, ఎందుకంటే నేను ఏ బాధ్యత తీసుకున్నా నా వైపు నుండి జవాబుదారీతనం ఉంటుంది. స్పష్టత ఉన్నప్పుడే మనం ఫలితాలను అందించగలం," అని గౌడ అన్నారు.నాకు ఒక బాధ్యత ఇచ్చినప్పుడు దానిపై స్పష్టత ఆశిస్తానని పేర్కొన్నారు. అయితే ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తానని సీఎం తనకు హామీ ఇచ్చారని పేర్కొన్నారు.కాగా ఈ అంశంమై కృష్ణబైరే గౌడ ఇదివరకే అదిష్ఠానంతో చర్చించడానికి ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం. ఇక కర్ణాటకలో గత వారం కేబినెట్ విస్తరణలో మొత్తం 13 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా.. ఇంకా 21 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలపై తీవ్ర స్థాయిలో లాబీయింగ్ కొనసాగుతోంది. ఒక్కో శాఖ కేటాయింపే ఇప్పుడు రాజకీయ ప్రాధాన్యం పొందుతుండటంతో కాంగ్రెస్‌లో అంతర్గత సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. -
మార్కో రూబియోకు జైశంకర్ ఫోన్.. దాడిపై సీరియస్
న్యూఢిల్లీ: హర్ముజ్ జలసంధిలో ఇటీవల అమెరికా జరిగిన దాడిలో ముగ్గురు భారత నావికులు మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశంపై భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్స్పందించారు. ఈ విషయమై ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రితో మాట్లాడినట్లు పేర్కొన్నారు.ఇటీవల హర్ముజ్ జలసంధిలో అమెరికా భారత నావికులు ప్రయాణిస్తున్న నౌకలపై అమెరికా తరచుగా దాడులకు తెగబడుతుంది. ఈ దాడులలో ముగ్గురు భారతీయులు మృతిచెందారు. అయినప్పటికీ మరోసారి దాడులకు తెగబడింది20 మంది భారతీయ నావికులతో వెళ్తున్న 'గినియా-బిస్సావు' పతాకం గల నౌకపై అమెరికా అటాక్ చేసింది. ఈ నేపథ్యంలో భారత్ ఈ అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ భారత్‌లో అమెరికా అత్యున్నత దౌత్యవేత్త (ఛార్జ్ డి అఫైర్స్) జాసన్ మీక్స్‌కు రెండు సార్లు సమన్లు జారీ చేసింది.ఇదిలా ఉండగా తాజాగా ఈ అంశంపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు. ఎక్స్ ఖాతాలో "ఈ సాయంత్రం అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో మాట్లాడాను. గల్ఫ్‌లో అమెరికా నౌకాదళం జరిపిన దాడుల్లో ముగ్గురు భారతీయ నావికులు మరణించడాన్ని భారతదేశం తీవ్రంగా నిరసిస్తున్నట్లు మరోసారి పునరుద్ఘాటించాను. వాణిజ్య నౌకలపై ఇటువంటి ప్రాణాంతక చర్యలు సమర్థనీయం కావు." అని మాట్లాడినట్లు తెలిపారు.కాగా ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇది వరకే వివరణ ఇచ్చారు. ఒమన్ తీరం సమీపంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకలపై దాడి చేసింది తాము కాదని.. అది ముమ్మాటికీ ఇరాన్ ఘాతుకమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిన్న( శుక్రవారం) తేల్చిచెప్పారు. హర్ముజ్ జలసంధి నుంచి బయలుదేరిన నౌకలపై ఇరాన్ సైన్యం డ్రోన్లు ప్రయోగించిందని ఆరోపించారు. ఇలాంటి చర్యలు ఎంతమాత్రం అంగీకార యోగ్యం కాదని పేర్కొన్నారు. ఈ మేరకు ట్రూత్ సోషల్‌లో పోస్టుచేశారు. -
అహ్మాదాబాద్ ప్రమాద ఘటన దర్యాప్తులో పురోగతి
సాక్షి,అహ్మదాబాద్: గతేడాది సరిగ్గా ఇదే రోజు భారత దేశ విమాన చరిత్రలోనే అత్యంత తీవ్రమైన విషాదం చోటుచేసుకుంది. టేకాఫ్ అయిన 32 సెకన్లకే అహ్మదాబాద్ నుండి లండన్ గాట్విక్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో విమానంలో ఉన్న 242 మంది ప్రయాణికులలో 241 మందితో పాటు, మరో 19 మంది దుర్మరణం పాలయ్యారు. సరిగ్గా ఈ ఘటనకు సంబంధించిన దర్యాప్తులో కీలక విషయాలను దర్యాప్తు సంస్థ ప్రకటించింది.అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం AI-171 ప్రమాదం జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ ప్రమాద దర్యాప్తులో తాము గణనీయమైన పురోగతి సాధించామని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) (శుక్రవారం) ప్రకటించింది. దర్యాప్తుకు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించింది.ఆ సంస్ధ విడుదల చేసిన వివరాలు. "గత ఏడాది కాలంగా, దర్యాప్తు బృందం ఈ ప్రమాదానికి సంబంధించిన అన్ని సాంకేతిక, కార్యాచరణ సంస్థాగత మానవ తప్పిదాలకు సంబంధించిన కోణాలను అత్యంత నిశితంగా, కఠినంగా పరిశీలించింది. ఈ ప్రక్రియలో గుర్తింపు పొందిన ప్రతినిధులు, సాంకేతిక సలహాదారులు, సంబంధిత సంస్థలకు చెందిన నిపుణుల సహాయం తీసుకున్నాం. విమాన వ్యవస్థలు, ఫ్లైట్ రికార్డర్ డేటా (బ్లాక్ బాక్స్), ఇంజిన్‌కు సంబంధించిన విడిభాగాలు, నిర్వహణ, కార్యాచరణ రికార్డులతో పాటు ఈ విచారణకు అవసరమైన ఇతర కీలక ఆధారాలను విశ్లేషించడంలో సమాచార సేకరణ పరంగా గణనీయమైన పురోగతి లభించింది." అని ప్రకటన విడుదల చేసింది.ఆ రోజు ఏం జరిగింది?2025 జూన్ 12న అహ్మదాబాద్ నుండి లండన్ గాట్విక్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI171 (బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్), టేకాఫ్ అయిన కేవలం 32 సెకన్లకే కుప్పకూలింది. అయితే, విమానంలో ఉన్న ప్రయాణికులలో ఒకరు మాత్రం ఈ ప్రమాదం నుండి అద్భుతంగా ప్రాణాలతో బయటపడ్డారు.AAIB, గతేడాది జూలైలో తన ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే రెండు ఇంజిన్ల ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లు "RUN" పొజిషన్ నుండి "CUTOFF" పొజిషన్‌కు మారిపోయాయని, దీనివల్ల ఇంజిన్లకు ఇంధన సరఫరా నిలిచిపోయిందని ఆ నివేదిక పేర్కొంది. అయితే, ఆ స్విచ్‌లు అలా మారడానికి గల అసలు కారణం ఏమిటనేది మాత్రం ఆ నివేదికలో స్పష్టం చేయలేదు. అలాగే ఈ ప్రమాదానికి సంబంధించి ఇది వరకూ ఎవరినీ బాధ్యులుగా ప్రకటించలేదు. -
వాణిజ్య నౌకలపై అమెరికా వరుస దాడులు
సాక్షి, ఢిల్లీ: హర్ముజ్ జలసంధిలో 20 మంది భారతీయ నావికులతో వెళ్తున్న 'గినియా-బిస్సావు' పతాకం గల నౌకపై అమెరికా దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై భారత్ సీరియస్ అయ్యింది. ఆ దేశ రాయబారికి సమన్లు జారీ చేసింది. ఇటీవల భారత్‌కు చెందిన చమురు నౌకలపై అమెరికా తరచుగా దాడులు చేస్తోంది. ఒమన్ సమీపంలోని హర్మూజ్ సముద్ర జలాల్లో చమురు రవాణా నౌకపై అమెరికా జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన పూర్తై రెండురోజులైన గడవక ముందే మరోసారి భారతీయ నావికులు ప్రయాణిస్తున్న నౌకపై దాడులు చేసింది. దీంతో ఈ ఘటనపై భారత్ సీరియస్ అయ్యింది..ఈ ఘటనను నిరసిస్తూ (శుక్రవారం) భారత్‌లోని అమెరికా తాత్కాలిక రాయబారి జేసన్ మీక్స్‌కు భారత విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. భారత విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శి , అమెరికా రాయబారితో ఈ విషయమై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అంతకుముందు బుధవారం నాడు 'పలావు' పతాకంగల MT సెట్టెబెల్లో నౌకపై జరిగిన దాడికి సంబంధించి కూడా జేసన్ మీక్స్‌ను MEA పిలిపించి మాట్లాడింది. మూడు రోజుల్లో అమెరికా దౌత్య కార్యాలయానికి సమన్లు జారీ చేయడం ఇది రెండోసారి.భారతీయ నావికులే టార్గెట్‌గా జరుగుతున్న ఈ దాడులను భారతదేశం తీవ్రంగా ఖండించింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో హర్ముజ్ జలసంధి సమీపంలో భారత నౌకాదళం అత్యున్నత నిఘాను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. "వాణిజ్య నౌకలు, పౌర మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడులు తక్షణమే ముగియాలి. అంతర్జాతీయ చట్టాలకు లోబడి అంతర్జాతీయ జలమార్గాలలో స్వేచ్ఛా వాణిజ్యం, నౌకల రాకపోకలను పునరుద్ధరించాలి. ఈ ప్రాంతంలో కొనసాగుతున్న ఘర్షణల వల్ల భారతీయ నావికులకు ముప్పు వాటిల్లడం తీవ్ర ఆందోళనకరం." అని తెలిపింది.కాగా ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతంలో 18,000 మందికి పైగా భారతీయ నావికులు పనిచేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ నావికుల భద్రత, క్షేమం, దేశ సముద్ర ప్రయోజనాలను కాపాడటమే తమ మొదటి ప్రాధాన్యత అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. -
నాకు కడుపుమండి చెప్తున్నా... DSC లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినవాళ్ళను
-
తమిళనాడు నుంచి దుబాయికి బస్సు టికెట్
చెన్నై: తమిళనాడులో ఓ కండక్టర్ ఇచ్చిన టికెట్ ప్రయాణికున్ని సంభ్రమాశ్చర్యానికి గురిచేసింది. తన సమీపంలోని ఊరికి వెళ్లాలని ప్రయాణికుడు సదరు కండక్టర్ని టికెట్ అడిగారు. దానికి సరే అని తలూపిన కండక్టర్ టికెట్ ఇచ్చారు. తీరా టికెట్ చూస్తే అందులో వేరే దేశానికి టికెట్ ఉంది. అంతే కాకుండా దాని ఖరీదు రూ. 10 వేలుగా ఉంది.అసలేం జరిగిందంటే?దామోదరన్ అనే వ్యక్తితో పాటు అతని స్నేహితుడు కలిసి బెంగళూరు వెళ్తున్న తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థ బస్సు ఎక్కారు. వారు తమిళనాడులోని హుసూరు ప్రాంతానికి వెళ్లడానికి టికెట్ అడిగారు. దీంతో కండక్టర్ టికెట్ ఇచ్చారు. అయితే, కండక్టర్ తన ఎలక్ట్రానిక్ టికెటింగ్ మిషన్ ద్వారా ప్రింట్ తీసి ఇచ్చిన టికెట్లను చూసి దామోదరన్ షాక్‌కు గురయ్యాడు.అందులో అతడు వెళ్లాల్సిన గమ్యస్థానం హుసూరుకు బదులు (దుబాయి, యుఏఈ) అని అని రాసి ఉంది. అంతే కాకుండా టికెట్ ధర రూ. పదివేలుగా ఉంది. దీంతో సదరు ప్రయాణికుడు షాక్‌కు గురయ్యాడు. దీంతో ఒక సాధారణ అంతర్రాష్ట్ర బస్సు ప్రయాణం కాస్తా, అంతర్జాతీయ విమాన ప్రయాణంలా మారిపోయిందని ఆశ్చర్యపోయాడు. సాధారణంగా అతను వెళ్లాల్సిన గమ్యస్థానానికి రూ.150 వరకూ టికెట్ ధర ఉంటుంది.సోషల్ మీడియాలో ట్రెండింగ్అయితే ఈ ఘటనను తాలూకా వివరాలతో పాటు ఆ టికెట్‌ను ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ ఫోటో కాస్తా ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అయింది. నెటిజన్లు దీనిపై రకరకాల జోకులు, మీమ్స్‌తో విరుచుకుపడ్డారు. తమిళనాడు రవాణా సంస్థ గల్ఫ్ దేశాలకు కూడా బడ్జెట్ బస్సు సర్వీసులను ప్రారంభించిందా ఏంటి? అంటూ కొందరు సరదాగా కామెంట్లు చేశారు. సముద్రాలను దాటి బస్సు ప్రయాణిస్తుందా అని ప్రశ్నిస్తున్నారు.అధికారుల వివరణఈ టికెట్ వైరల్ కావడంతో తమిళనాడు రవాణా సంస్థ (TNSTC) సేలం డివిజన్ అధికారులు వెంటనే స్పందించారు... కండక్టర్ ఉపయోగించిన ఎలక్ట్రానిక్ టికెటింగ్ మిషన్‌లో ఏర్పడిన ఒక సాంకేతిక లోపం వల్లే టికెట్‌పై దుబాయ్ అని ప్రింట్ అవ్వడం, అంత భారీ మొత్తంలో ఛార్జీ పడటం జరిగాయి. ప్రయాణికుల నుంచి కేవలం ఛార్జీ రూ. 150 మాత్రమే వసూలు చేశారని, ఈ తప్పు కేవలం టికెట్‌పై ప్రింట్ అయిన వివరాలకే పరిమితమైందని అధికారులు స్పష్టం చేశారు. -
రికార్డుపై స్పందించిన మోదీ.. వారికే ఇది దక్కుతుంది
ఢిల్లీ: ప్రధాని మోదీ ఈ రోజుతో సరికొత్త రికార్డు నెలకొల్పారు. ప్రజాస్వామ్య భారత్‌లో అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగా సరికొత్త చరిత్ర సృష్టించారు.. నేపథ్యంలో ఈ రికార్డుపై ప్రధాని మోదీ తొలిసారిగా పెదవివిప్పారు. వినయంతో అంకితభావంతో, కర్తవ్యభావంతో అవిశ్రాంతంగా వ్యక్తి మాత్రమే ప్రజల నమ్మకాన్ని గెలుచుకుంటాడు. అని అన్నారు.2014 మే 26న తొలిసారిగా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ.. 2019, 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ వరుస విజయాలు సాధించి అధికారంలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఇవాళ్టితో ఆయన ప్రధానమంత్రి పదవిలో 4,399 రోజులు పూర్తి చేసుకున్నారు. దీంతో ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చి నిరవధికంగా అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన నాయకుడిగా నిలిచారు. ఇదివరకూ ఈ రికార్డు దివంగత నేత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పేరిట ఉండేది.ఈ అరుదైన ఘనతపై ఎక్స్ వేదికగా స్పందించిన మోదీ "ప్రజా సేవయే సుపరిపాలనకు గొప్ప కొలమానం. వినయంతో, అంకితభావంతో, కర్తవ్య భావంతో అవిశ్రాంతంగా పనిచేసే వ్యక్తి మాత్రమే ప్రజల నమ్మకాన్ని గెలుచుకుంటాడు. స్వభావరీత్యా భక్తిపరుడై, ఎల్లప్పుడూ తన ప్రజల సంక్షేమం గురించే ఆలోచించేవాడే అత్యున్నత కీర్తిని పొందుతాడు. వినయశీలి అయిన రాజు నిజంగానే అత్యున్నత కీర్తిని పొందుతాడు." అని అన్నారు. ఈ మేరకు ఒక వీడియోని ఎక్స్ వేదికగా షేర్ చేశారు.జవహార్ లాల్ రికార్డును అధిగమించిజవహార్ లాల్ నెహ్రూ మెుదటగా 1947 నుండి 1952 వరకు ప్రధానిగా ఉన్నారు. అయితే అప్పుడు ప్రజలు నేరుగా ఓటువేసి ఎన్నుకోలేదు. 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి రావడంతో "సార్వత్రిక వయోజన ఓటుహక్కు" హక్కు కల్పించారు. ఆ తర్వాత జరిగిన సాధారణఎన్నికలను పరిగణలోకి తీసుకుంటే (1952 మే నుండి 1964 మే లో ఆయన మరణించే వరకు) నెహ్రూ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రధానిగా నిరంతరాయంగా 4,398 రోజులు పదవిలో ఉన్నారు. జూన్ 2026 నాటికి నరేంద్ర మోదీ ప్రధానిగా నిరంతరాయంగా 4,399 రోజులు పూర్తి చేసుకుని, నెహ్రూ రికార్డును అధిగమించారు. जनसेवा ही सुशासन की सबसे बड़ी कसौटी है। विनम्रता, समर्पण और कर्तव्यनिष्ठा के साथ निरंतर कार्य करने वाला व्यक्ति ही जनविश्वास अर्जित करता है।सदानुरक्तप्रकृतिः प्रजापालनतत्परः। विनीतात्मा हि नृपतिर्भूयसी श्रियमश्नुते॥ pic.twitter.com/mn0Ax0F8hs— Narendra Modi (@narendramodi) June 10, 2026 -
కేంద్రంపై సమరమే
సాక్షి, న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విపక్ష ‘ఇండియా’కూటమి సమరశంఖం పూరించింది. మోదీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలు, రాజ్యాంగంపై జరుగుతున్న దాడులను గట్టిగా తిప్పికొట్టాలని, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాటం సాగించాలని నిర్ణయించింది. నీట్, సీబీఎస్ఈ పరీక్షల నిర్వహణలో అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని కూటమి నేతలు ఏకగ్రీవంగా డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ముసుగులో సాగుతున్న ఓట్ల లూటీపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయాలని నిర్ణయించారు.ఇండియా కూటమి సమావేశం రెండేళ్ల విరామం తర్వాత సోమవారం ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగింది. కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్విని యోగం, నిరుద్యోగం, పెరుగుతున్న ధరలపై భవిష్యత్ పోరాట కార్యాచరణపై రెండున్నర గంటలపాటు సుదీర్ఘంగా చర్చించారు. విపక్షాల ఐక్యతను చాటుతూ ఇకపై ప్రతి రెండు నెలలకోసారి సమావేశం కావాలని నిర్ణయానికి వచ్చారు. తదుపరి సమావేశం ఆగస్టులో హైదరాబాద్‌లో జరుగనుంది. రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమా వేశాల్లో సమన్వయంతో పనిచేయాలని తీర్మానించారు. ఐక్యతను బలోపేతం చేసుకోవాలి మోదీ ప్రభుత్వ దుష్పరిపాలన కారణంగా దేశం ఎదుర్కొంటున్న రాజకీయ, ఆర్థిక, సామాజిక, విదేశాంగ విధాన సవాళ్లను ఎదుర్కొనేందుకు కూటమి ఐక్యతను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని మల్లికార్జున ఖర్గే చెప్పారు. దేశంలో రాజ్యాంగంపై దాడి కొనసాగు తోందని, రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి పాల కులు దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నారని ధ్వజమె త్తారు. కూటమి సమావేశంలో ఆయన ప్రారంభోపన్యా సం చేశారు. మోదీ పాలనలో ఆర్థిక వ్యవస్థ దిగజారిందని, కొత్త పెట్టుబడులు రావడం లేదని, నూతన ఉద్యోగాల కల్పన జరగడం లేదని చెప్పారు.పరీక్షల వ్యవస్థలో అక్రమాలు లక్షలాది మంది యువత ఆశలను, ఆకాంక్షలను దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. 2026 ఏప్రిల్ 17న డీలిమిటేషన్‌పై మోడీ ప్రభుత్వ బిల్లులను ఓడించడానికి లోక్‌సభలో ప్రతిపక్షాలు గొప్ప ఐక్యతను ప్రదర్శించాయని గుర్తుచేశారు. ఇప్పుడు అదే స్ఫూర్తిని మరింత బలోపేతం చేసుకుని ముందుకు సాగాలని ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు. ఎస్ఐఆర్ పేరిట కోట్లాది మంది పౌరుల నుంచి ఓటు హక్కును లాగేసుకుంటున్నారని ఖర్గే ఆరోపించారు. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలపై కేంద్రం పక్షపాత వైఖరి ప్రదర్శిస్తోందని మండిపడ్డారు.విదేశాంగ విధానంలో ప్రభుత్వం రాజీ నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని, కొత్త పెట్టుబడులు రాకపోవడంతో ఆర్థిక వ్యవస్థ మందగించిందని కూటమి నేతలు పేర్కొన్నారు. కొన్ని రంగాల్లో ప్రైవేట్ గుత్తాధిపత్యాన్ని ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు. దీనివల్ల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు(ఎంఎస్ఎంఈ) తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. పరీక్షల వ్యవస్థ పూర్తిగా గాడితప్పిందని విమర్శించారు.కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తప్పుకోవాలని కూటమి పక్షాలు పట్టుబట్టాయి. దశాబ్దాలుగా దేశం పటిష్టంగా పాటిస్తున్న సంప్రదాయ విలువల నుంచి మోదీ సర్కార్ పక్కకు జరిగిందని, విదేశాంగ విధానంలో పూర్తిగా రాజీ పడిందని విపక్షాలు ఆక్షేపించాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బలహీన వర్గాలపై దాడులు ఆగడం లేదని మండిపడ్డాయి.హాజరైన 23 పార్టీల నేతలు విపక్ష కూటమి భేటీకి కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, ఎన్సీపీ నేత సుప్రియా సూలే, సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్, సీపీఐ అగ్రనేత డి.రాజా, స్వతంత్ర ఎంపీ కపిల్ సిబల్ తదితరులు హాజరయ్యారు.శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, జేఎంఎం నేత హేమంత్ సోరెన్ వర్చువల్‌గా పాల్గొన్నారు. మొత్తం 23 పార్టీల నాయకులు ఈ సమావేశంలో భాగస్వాములయ్యారు. 2024 జూన్ 1న ఢిల్లీలో ఖర్గే నివాసంలో ఇండియా కూటమి ఆరో సమావేశం జరిగింది. ఆ తర్వాత సోమవారం అగ్రనేతలంతా ఒకే వేదికపైకి వచ్చారు. విపక్షాలన్నీ కలిసికట్టుగా ముందుకు సాగడమే ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని ఎన్సీపీ(ఎప్పీ) అధినేత శరద్ పవార్ స్పష్టం చేశారు.డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ గైర్హాజరు సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలిసారిగా సమావేశమైన విపక్ష కూటమిలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఈ కీలక భేటీకి డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ హాజరు కాకపోవడం గమనార్హం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్, డీఎంకేల మధ్య దూరం పెరిగింది. ఇకపై తాము ఇండియా కూటమిలో భాగస్వామి కాదని డీఎంకే తాజాగా ప్రకటించింది. ఆమ్ ఆద్మీ పార్టీ గతంలోనే ఇండియా కూటమికి దూరమైంది. కాంగ్రెస్ మిత్రపక్షమైన తమిళగ వెట్రి కళగం(టీవీకే) నేతలు కూడా ఈ భేటీకి హాజరుకాలేదు.రాహుల్‌కు వ్యతిరేకంగా పోస్టర్ల కలకలం ఢిల్లీలోని అక్బర్ రోడ్డులో సోమవారం ఉదయం రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు కలకలం రేపాయి. రాహుల్ గాంధీకి నిలకడ లేదంటూ శరద్ పవార్ అన్నట్లుగా ఆ పోస్టర్లలో ముద్రించారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడికి చేరుకుని పోస్టర్లను చించివేశారు. వీటిని ఎవరు ఏర్పాటు చేశారన్న దానిపై స్పష్టత రాలేదు.ఐదు అంశాలపై అంగీకారం: ఖర్గే దేశంలో అస్థిర ఆర్థిక పరిస్థితి, నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతుల సమస్యలు, ప్రజా సంబంధిత అంశాలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే డిమాండ్ చేశారు. సోమవారం ఇండియా కూటమి భేటీ అనంతరం రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీతోపాటు ఇతర నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఐదు అంశాలపై తాము అంగీకారానికి వచ్చిననట్లు తెలిపారు. ఎస్ఐఆర్లో అక్రమాలు, ఓట్ల లూటీ, ఎన్నికల్లో అవకతవకలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయయూర్తికి లేఖ రాయబోతున్నట్లు చెప్పారు.విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నారు. ప్రజా సమస్యలపై చర్చించడానికి కేంద్రం వెంటనే అఖిలపక్ష భేటీ నిర్వహించాలని తేల్చిచెప్పారు. ఇకపై ప్రజలకు సంబంధించిన అనేక అంశాలను లేవనెత్తబోతున్నామని, దీనికి కూటమి పార్టీలు ఏకగ్రీవంగా అంగీకరించాయని ఖర్గే పేర్కొన్నారు. రాబోయే వర్షాకాల సమావేశాల్లో సమన్వయంతో పనిచేస్తామని, ప్రతిరోజూ ఉదయం విపక్ష నేత చాంబర్లో తమ భేటీ జరుగుతుందని వెల్లడించారు. ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీ 2029 లోక్‌సభ ఎన్నికల్లో విపక్ష కూటమి తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేరును ప్రకటించాలని శివసేన(ఉద్ధవ్) నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ సోమవారం సూచించారు. బీజేపీ వ్యతి రేక కూటమి ఐక్యంగా ఉందని, రాహుల్ గాంధీ నాయకత్వంలోనే భవిష్యత్ వ్యూహాన్ని నిర్ణయించుకుంటామని తెలి పారు. ప్రధానమంత్రి అభ్యర్థిని ముందుగానే ప్రకటించి రాబోయే లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కోవాలని చెప్పారు. అవినీతిపరులను, దోపిడీదార్లను అధికారం నుంచి దించేయడమే ప్రజల ఎజెండా అని స్పష్టంచేశారు. -
విద్యాశాఖ మంత్రి రాజీనామా?.. ఇండి కూటమి కీలక నిర్ణయం
సాక్షి, ఢిల్లీ: నీట్ పరీక్షపత్రాల లీకేజ్‌కి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని ఇండియా కూటమి డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ఈరోజు (సోమవారం) ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు కూటమి నేతలు తెలిపారు. ఎలక్షన్ కమిషన్ నిర్వహించే Sirపై త్వరలోనే భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయాలని నిర్ణయించారు.కేంద్ర ప్రభుత్వ విధానాలపై పోరాటం కోసం విపక్ష ఇండియా కూటమి ఈ రోజు ఢిల్లీలో సమావేశమైంది. ఈ మీటింగ్‌లో ఎన్డీఏపై పోరాటానికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అవి 1 ఎన్నికల్లో ఓటు చోరీపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం. 2 విద్యామంత్రి వెంటనే రాజీనామా చేయాలి . NEET, CBSE పరీక్షలు రాసిన లక్షలాది యువకులను మోసం చేశారు. 3 దేశ ఆర్థిక పరిస్థితి, నిరుద్యోగం, ఇతర సమస్యలపై చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే అన్ని పార్టీల సమావేశం పిలవాలి. 4 అన్ని పార్టీలు ప్రతి రెండు నెలలకొకసారి సమావేశం.తదుపరి సమావేశం ఆగస్టు నెలలో హైదరాబాద్‌లో జరుగుతుందని తెలిపారు. వర్షాకాల పార్లమెంటు సమావేశాలలో ఇండియా కూటమి ఐక్యత కొనసాగించాలని కలిసికట్టుగా ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. -
సింగిల్ డిజిట్‌కు పడిపోయిన ఎమ్మెల్యేలు
కోల్‌కతా: మమతా బెనర్జీ పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. దశాబ్ధన్నర కాలంగా బెంగాల్‌ను శాసించిన మమతా బెనర్జీ తన రాజకీయ జీవితంలోనే తొలిసారిగా అత్యంత గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటుంది. ఈ రోజు (శుక్రవారం) కోల్‌కతా కాళీఘాట్‌లోని ఆమె నివాసంలో నిర్వహించిన పార్టీ సమావేశానికి తృణముల్ కాంగ్రెస్‌కు చెందిన కేవలం ఎనిమిది మంది ఎమ్మెల్యేలే హాజరయ్యారు. ప్రస్తుతం మమతా బెనర్జీ తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఇటీవల తృణముల్ పార్టీలో చీలిక రావడం ఆ పార్టీకి చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని వార్తలు రావడం ఇలా రాజకీయంగా మునుపెన్నడూ లేని సంక్షోభాన్ని చవి చూస్తోంది. ఈ నేపథ్యంలోనే మమతా బెనర్జీ నిర్వహించిన సమావేశం ఇప్పుడు మరోసారి హాట్‌టాఫిక్‌గా మారింది.కోల్‌కతాలోని ఆమె కాళీఘాట్ నివాసంలో జరిగిన ఈ భేటీకి కేవలం 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. దీంతో తృణముల్ కాంగ్రెస్ పార్టీలో మమతాపై ఉన్న వ్యతిరేఖత స్పష్టమవుతోంది. అంతేకాకుండా అత్యధిక సంఖ్యలో లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు కూడా ఈ భేటీని బహిష్కరించారు.తృణమూల్ కాంగ్రెస్‌కు ఉన్న 28 మంది లోక్‌సభ ఎంపీలలో కేవలం నలుగురు మాత్రమే శుక్రవారం నాటి సమావేశానికి వచ్చారు. (వీరిలో మమతా బెనర్జీ 13 మంది రాజ్యసభ ఎంపీలలో కేవలం ఇద్దరే డెరెక్ ఒబ్రెయిన్, డోలా సేన్ మాత్రమే హాజరయ్యారు.అయితే ఇటీవలే తిరుగుబాటు జెండా ఎగురవేసిన "రీతాబ్రతా బెనర్ మాట్లాడుతూ మమతా బెనర్జీని తమ నాయకురాలిగా అంగీకరించే ప్రసక్తే లేదు. ప్రస్తుతం మాకున్న ఎమ్మెల్యేల బలం 2/3 వంతు కంటే ఎక్కువే ఉంది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే నాటికి మా సంఖ్య ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గదు. వేచి చూడండి, ఏం జరుగుతుందో మీకే తెలుస్తుంది. అయితే ఎంపీల విషయమై గత ఏడు రోజులుగా నేను ఎవరితోనూ మాట్లాడలేదు, కాబట్టి వారి గురించి నేను ఇప్పుడు ఏమీ చెప్పలేను" అని జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. రీతాబ్రతా బెనర్జీకి ప్రస్తుతం 60 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు సమాచారం . -
హైదరాబాద్‌లో ఎబోలా కలకలం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎబోలా వైరస్ అనుమానిత కేసు కలకలం రేపింది. ఎబోలా లక్షణాలతో సూడాన్ దేశస్తుడు.. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి ఐసోలేషన్ వార్డులో చేరాడు. శాంపిల్స్ సేకరించిన అధికారులు పుణే ల్యాబ్‌కు పంపించారు. టెస్ట్ రిజల్ట్ వారం రోజుల్లో వచ్చే అవకాశం ఉందని.. ఎబోలా అనుమానిత వ్యక్తికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.ఈ నేపథ్యంలో తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రయాణికుడిని ప్రత్యేక అంబులెన్స్‌లో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించి ఐసోలేషన్ వార్డులో ఉంచారు. వైద్యులు అతని ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఆఫ్రికా ఖండంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న ప్రాణాంతక ‘ఎబోలా’ వైరస్ విషయంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది.సెంట్రల్ ఆఫ్రికాలో ఎబోలా వైరస్ మహమ్మారి విలయం సృష్టిస్తున్న నేపథ్యంలో, ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశీయంగా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు దేశంలోని అన్ని ప్రధాన అంతర్జాతీయ రవాణా కేంద్రాల వద్ద కఠినమైన నిఘా, స్క్రీనింగ్ చర్యలను చేపట్టాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది.ఎబోలా ప్రభావిత దేశాలైన డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, సౌత్ సూడాన్ నుండి వచ్చే ప్రయాణికులు తమ ప్రయాణ వివరాలను తప్పనిసరిగా వెల్లడించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఇప్పటికే నిబంధనలను జారీ చేసింది. ఇటీవలే ఎబోలా వైరస్ పీడిత దేశాల నుంచి 28 మంది ప్రయాణికులు దేశంలోకి వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు. దాంతో ఒక్కసారిగా అప్రమత్తమైన ఆరోగ్య యంత్రాంగం విమానాశ్రయంలో ప్రయాణికులను పరీక్షించడమే కాకుండా... ఒకవేళ వారు ఎబోలా విస్తరిస్తున్న ప్రాంతాల నుంచి వచ్చినట్టు గుర్తిస్తే... వెంటనే వారిని 21 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంచి పరిశీలిస్తారు. -
నేపాల్ సరిహద్దులో చైనా జోక్యం..? భారత్ రియాక్షన్
న్యూఢిల్లీ: నేపాల్- భారత్ సరిహద్దు వివాదంలో నేపాల్ ప్రధాని చేసిన వ్యాఖ్యలను భారత్ ఖండించింది. ఈ ద్వైపాక్షిక అంశంలో మూడో పక్షం ప్రమేయం అవసరం లేదని తేల్చిచెప్పింది. నిన్న (మంగళవారం) ఢిల్లీలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యల చేశారు.ఇటీవల నేపాల్ ప్రధాని బాలేంద్రషా కీలక వ్యాఖ్యలు చేశారు. నేపాల్- భారత్ సరిహాద్దు వివాదంలో చైనా, బ్రిటన్లు జోక్యం చేసుకోవాలని కోరారు. తాజాగా భారత్ దీనిపై స్పందించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ "సరిహద్దు విషయాలకు సంబంధించిన అన్ని అంశాలను పరిష్కరించడానికి మేము ద్వైపాక్షిక యంత్రాంగాలను ఏర్పాటు చేసుకున్నాము. భారత్-నేపాల్ మధ్య ఉన్న ఈ ద్వైపాక్షిక అంశంలో మూడో పక్షానికి ఎలాంటి పాత్ర లేదనే విషయం సంబంధిత వర్గాలన్నింటికీ స్పష్టంగా అర్థం కావాలి" అని జైస్వాల్ పేర్కొన్నారు.సరిహద్దు సమస్యకు గల కారణాలుగండక్ నది మార్గం మారడం: 98% సరిహద్దు గుర్తింపు పూర్తయినప్పటికీ, గండక్ నది తన ప్రవాహ మార్గాన్ని మార్చుకోవడం వల్ల కొన్ని ప్రాంతాలలో ఇంకా సమస్యలు పరిష్కారం కాలేదన్నారు.గుర్తించబడిన సరిహద్దు ప్రాంతాలలో సరిహద్దు దాటి ఆక్రమణలు జరిగిన కేసులు ఉన్నాయి, ప్రస్తుతం వీటిని ఇరుదేశాలు కలిసి ఉమ్మడిగా మ్యాపింగ్ చేస్తున్నాయని పేర్కొన్నారు. కైలాష్ మానససరోవర్ యాత్ర వివాదంలిపులేఖ్ పాస్ ద్వారా భారత్ నిర్వహించ తలపెట్టిన కైలాష్ మానససరోవర్ యాత్రపై నేపాల్ గత నెలలో అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ఆ ప్రాంతం ఉత్తరాఖండ్‌లో భాగమని భారతదేశం ఎప్పటినుంచో స్పష్టం చేస్తోంది. మే 3న దీనిపై స్పందించిన భారత్, నేపాల్ ఏకపక్షంగా సరిహద్దులను పెంచి చూపిస్తోందని దీనికి ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవని కొట్టిపారేసింది. -
బీజైపీకీ అన్నామలై గుడ్‌బై..?
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో మరో పెను సంచలనం చోటుచేసుకోబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి కే అన్నామలై త్వరలోనే భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేయనున్నట్లు సమాచారం అందుతోంది. అనంతరం త్వరలోనే సొంతంగా ఒక రాజకీయ ఉద్యమాన్ని, ఆ తర్వాత కొత్త పార్టీని స్థాపించే యోచనలో ఉన్నట్లు సమాచారం.బీజేపీ నేత అన్నామలైకి అధిష్ఠానంతో అస్సలు పొసగడంలేదు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో (2026) ఒంటరిగా పోటీ చేయాలని అన్నామలై భావించినప్పటికీ, బీజేపీ అధిష్టానం మాత్రం తిరిగి AIADMKతో పొత్తు పెట్టుకుంది. ఈ క్రమంలోనే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి ఒత్తిడి మేరకు అన్నామలై తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి కూడా తప్పుకోవాల్సి వచ్చింది. ఈ ఎన్నికల్లో ఆయన కనీసం పోటీ కూడా చేయకుండా కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితమయ్యారు.ఈ నేపథ్యంలో పార్టీలో తనకు సరైన గుర్తింపు, భవిష్యత్తు లేవనే అసంతృప్తితో ఉన్న ఆయన ఈ విషయమై బీజేపీ జాతీయ నేత నితిన్ నబిన్‌తో సమావేశం కావడానికి నిన్న( సోమవారం) ఢిల్లీ పయనమయ్యారు. చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న ఆయనను మీడియా ప్రతినిధులు పలకరించగా.. "దయచేసి రెండు రోజులు ఆగండి, మనం కూర్చొని వివరంగా మాట్లాడుకుందాం" అని క్లుప్తంగా సమాధానమిచ్చారు. అయితే, ఆయన విమానాశ్రయానికి వచ్చిన వాహనానికి బీజేపీ జెండా లేకపోవడంతో ఆయమ పార్టీ మారనున్నారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి.ప్లాన్ సిద్ధమైందా..?కాగా జూన్ 4న అన్నామలై పుట్టినరోజు సందర్భంగా చెన్నైలో ఇప్పటికే "మా నాయకుడా, వచ్చి మమ్మల్ని నడిపించు" అనే నినాదాలతో భారీ పోస్టర్లు వెలిశాయి. ఆయన ప్రస్తుతం నడిపిస్తోన్న "వి ది లీడర్స్" అనే స్వచ్ఛంద సంస్థ ఆధారంగా ఒక బలమైన నెట్‌వర్క్‌ను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. తొలుత ఉద్యమం చేపట్టి ఆపై దానిని ఒక రాజకీయ పార్టీగా మార్చేలా అన్నామలై వ్యూహం రచిస్తోన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
భారత్‌లో ట్రంప్ కుమార్తె.. అబ్బురపోయే అనుభూతి
ఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు కుమార్తె టిఫానీ ట్రంప్ ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్నారు. తన భర్త మైఖేల్ బౌలోస్‌తో కలిసి వ్యక్తిగత పర్యటన నిమిత్తం భారత్ వచ్చిన ఆమె.. ఢిల్లీలోని చారిత్రాత్మక బాప్స్ అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం ఆగ్రాలోని తాజ్ మహల్‌తో పాటు రాజస్థాన్‌లోని జైసల్మేర్ వెళ్లారు. టిఫానీ ట్రంప్ భారత్‌లో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా తన భర్త మైఖేల్ బౌలోస్, స్నేహితులతో కలిసి ఢిల్లీలోని ప్రపంచ ప్రసిద్ధ బీఏపీఎస్ స్వామినారాయణ అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించారు. భారతీయ సాంప్రదాయం ప్రకారం ఆలయ నిర్వాహకులు టిఫానీ ట్రంప్ దంపతులకు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అక్షరధామ్ ఆలయంలోని అద్భుతమైన శిల్పకళను, కట్టడాలను టిఫానీ దంపతులు మంత్రముగ్దులయ్యారు.అనంతరం ఆలయ ప్రాంగణంలో సాంప్రదాయ పూలమాలలు ధరించి వారు ఫోటోలు దిగారు. ఆచిత్రాలను టిఫాని తన సామాజిక మాధ్యమ ఖాతాలలో పంచుకున్నారు. ‘‘భారతీయ సంస్కృతి, వారసత్వాన్ని అన్వేషించడానికి ఇదొక అద్భుతమైన రోజు’’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇదొక మరువలేని అద్భుతమైన అనుభూతి అని ప్రశంసించారు. -
ఉగ్రకుట్ర భగ్నం చేసిన ఢిల్లీ పోలీసులు.. 8 మంది అరెస్ట్
ఢిల్లీ పోలీసులు పాకిస్థాన్ ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేశారు. ఆ దేశ గూఢచార సంస్థ ఐఎస్ఐ, దావూద్ ఇబ్రహీం, షాజాద్ భట్టి నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న ఎనిమిది మంది ఉగ్రవాదులను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అరెస్టు చేశారు. వారి వద్ద కీలకమైన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల కథనం ప్రకారం, విజయ్ అలియాస్ షూటర్‌కు ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్లలో ఉగ్రవాద, నేర కార్యకలాపాలు నిర్వహించే కీలక బాధ్యతను పాక్ ఉగ్రవాద సంస్థ అప్పగించింది. దీంతో ఢిల్లీ-ఎన్సిఆర్లోయూలో ఉగ్రవాదులు కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఢిల్లీ, ముంబై, పంజాబ్, చండీగఢ్‌లలోని ప్రధాన మతపరమైన ప్రదేశాలు, ప్రభుత్వ భవనాలు, మంత్రిత్వ శాఖలు, భద్రతా దళాలపై దాడులకు వారు కుట్ర పన్నుతున్నారని పోలీసులు తెలిపారు. నిందితులందరూ పాకిస్తాన్, దుబాయ్‌లలోని హ్యాండ్లర్లతో సంబంధాలు కలిగి ఉన్నారన్నారు. వీరిలో ప్రధాన నిందితుడి కోసం గాలింపులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అరెస్టయిన నిందితుల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన విజయ్ అలియాస్ షూటర్, జార్ఖండ్‌కు చెందిన నితీష్ పాశ్వాన్, మహారాష్ట్రకు చెందిన తౌకీర్ రిజ్వాన్ అహ్మద్ షేక్ మరియు సాజిద్ మెహబూబ్ షేక్ అలియాస్ అర్బాజ్ ఖాన్, పంజాబ్‌కు చెందిన హర్విందర్ సింగ్, గగన్‌దీప్ సింగ్, మంజీత్ సింగ్, నేపాల్ పౌరుడు అంగ్ కమీ లామాలు ఉన్నారని పేర్కొన్నారు. వారి వద్ద నుంచి ఒక పిస్తోల్, మందుగుండు సామాగ్రి, గ్రానైట్లు, బైకులు, మెుబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
రిజర్వు తీర్పులకు 3 నెలలే గడువు!
సాక్షి, న్యూఢిల్లీ: తీర్పులు ఆలస్యమైతే కక్షిదారులకు తీరని నష్టం వాటిల్లుతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. విచారణ పూర్తయి, తీర్పు రిజర్వు చేసిన తేదీ నుంచి మూడు నెలల్లోపే తీర్పులను వెలువరించాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసులపై మరింత శ్రద్ధ పెట్టాలని హైకోర్టులను ఆదేశించింది. తీర్పుల వెల్లడిలో జరుగుతున్న మితిమీరిన జాప్యానికి అడ్డుకట్ట వేసేలా అన్ని హైకోర్టులు పాటించాల్సిన కఠినమైన, ఏకరూప మార్గదర్శకాలను శుక్రవారం జారీ చేసింది. ముఖ్యంగా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన బెయిల్ లాంటి కేసుల్లో నిర్ణయాలు అత్యంత వేగంగా ఉండాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.ఏళ్ల తరబడి రిజర్వులోనే జార్ఖండ్ హైకోర్టుకు సంబంధించిన ఒక కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ కీలక మార్గదర్శకాలను వెలువరించింది. కొందరు ఎస్టీ, ఓబీసీ జీవిత ఖైదీల క్రిమినల్ అప్పీళ్లపై విచారణను పూర్తిచేసిన జార్ఖండ్ హైకోర్టు ఏళ్ల తరబడి తీర్పును వెలువరించకుండా రిజర్వులో ఉంచింది. కనీసం తీర్పు కాపీలను కూడా వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదు. దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని బాధిత ఖైదీలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సత్వర న్యాయం పొందడం రాజ్యాంగంలోని ఆరి్టకల్ 21 కింద ప్రాథమిక హక్కు అని, తీర్పుల్లో ఇలా ఏళ్ల తరబడి జాప్యం చేయడం తమ హక్కును తీవ్రంగా ఉల్లంఘించడమేనని పిటిషనర్లు వాదించారు.హైకోర్టులకు ఏకరూప నిబంధనలుహైకోర్టుల్లో తీర్పుల జాప్యాన్ని నివారించేందుకు కచ్చితంగా అమలు చేయాల్సిన మార్గదర్శకాలను ధర్మాసనం వెలువరించింది. ‘వాదనలు ముగిసి రిజర్వులో ఉంచిన కేసుల్లో గరిష్టంగా మూడు నెలల్లోగా తప్పనిసరిగా తీర్పులు వెలువరించాలి. వాదనలు ముగిసిన తర్వాత, తీర్పును రిజర్వు చేసిన తేదీని హైకోర్టు వెబ్సైట్లో స్పష్టంగా పొందుపరచాలి. బెయిల్ పిటిషన్లు, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసుల్లో విచారణ జరిగిన రోజే తీర్పును వెలువరించాలి.ఒకవేళ రిజర్వు చేస్తే మరుసటి రోజుకల్లా కచ్చితంగా తీర్పు వెలువరించి, అప్లోడ్ చేయాలి. బెయిల్ ఉత్తర్వులు వెలువడిన రోజే ఆ విషయాన్ని సంబంధిత జైలు అధికారులకు తెలియజేసి, విచారణ ఖైదీలను అదే రోజు లేదా మరుసటి రోజుకల్లా విడుదల చేయాలి. అత్యవసర కేసుల్లో తీర్పును వెలువరించేటప్పుడు కేవలం ముఖ్యమైన నిర్ణయాన్ని కోర్టులో చదివితే సరిపోతుంది. పూర్తిస్థాయి తీర్పు కాపీని గరిష్టంగా ఏడు రోజుల్లోగా వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి.రిజర్వు చేసిన మూడు నెలల తర్వాత కూడా తీర్పు రాకపోతే ఆ విషయాన్ని హైకోర్టు రిజిస్టార్ జనరల్, ప్రధాన న్యాయమూర్తి (సీజే) దృష్టికి తీసుకెళ్లాలి. అప్పుడు సీజే ఆ ధర్మాసనానికి మరో రెండు వారాల అదనపు గడువు ఇస్తారు. ఆ తర్వాత కూడా తీర్పు రాకపోతే ఆ కేసును వేరే ధర్మాసనానికి బదిలీ చేయవచ్చు. తీర్పు కోసం రిజర్వు చేసిన 3 నెలలకు అదనంగా మరో నెల దాటితే (3+1 నెలలు), కక్షిదారులు తాజా విచారణ కోసం తమ కేసును వేరే ధర్మాసనానికి బదిలీ చేయాలని నేరుగా ప్రధాన న్యాయమూర్తికి దరఖాస్తు చేసుకోవచ్చు’అని ధర్మాసనం తన మార్గదర్శకాలను స్పష్టంగా పేర్కొంది. వ్యవస్థాగత లోపాలను సరిదిద్దేందుకేపిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ విపిన్ ఎం.పంచోలిల త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. విచారణ పూర్తయిన తర్వాత కూడా ఏకారణం లేకుండా తీర్పు ఇవ్వడం ఆలస్యమైతే కక్షిదారులు తీవ్రంగా నష్టపోతారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తాము జారీ చేస్తున్న ఈ మార్గదర్శకాలు ఏ నిర్దిష్ట న్యాయమూర్తిని లేదా కోర్టును తప్పుబట్టే ఉద్దేశంతో ఇచ్చినవి కావంది. వ్యవస్థాగత జాప్యాన్ని నివారించడమే లక్ష్యమని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్.. హైకోర్టు న్యాయమూర్తిగా తన 15 ఏళ్ల సర్వీసులో ఏనాడూ తీర్పును రిజర్వు చేసి మూడు నెలలు దాటనివ్వలేదని గుర్తుచేశారు. తీర్పుల కోసం కక్షిదారులు ఏళ్ల తరబడి ఎదురుచూసే పరిస్థితి ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. -
దారుణం.. భూతగాలతో ఆరుగురి హత్య
బెంగళూరు: కర్ణాటకలోని విజయపుర జిల్లాలో శుక్రవారం (నిన్న) దారుణం జరిగింది.గోవింద్పూర్ గ్రామంలో భూతగాదాలతో ఆరుగురు వ్యక్తులపై ప్రత్యర్థులు కాల్పులు జరిపారు. ఆపై అత్యంత దారుణంగా నరికి చంపారు.పోలీసుల వివరాల ప్రకారం.. స్థానికంగా ఉండే 'నిరాలే', 'గోలగి' కుటుంబాల మధ్య గత కొంతకాలంగా భూవివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో గోలగి కుటుంబ సభ్యులు ఈ దాడికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితులపై మొదట కాల్పులు జరిపి, ఆ తర్వాత కత్తులతో నరికి చంపారు. మృతిచెందిన వారి వివరాలు చందు నిరాలే, దుండప్ప నిరాలే, శివపుత్ర నిరాలే, రాహుల్ నిరాలే, సమర్థ్ నిరాలే షబ్బీర్ నదాఫ్ గా పేర్కొన్నారు. వీరంతా గోవింద్పూర్ గ్రామానికి చెందిన వారు.అయితే ఈ ఘటనపై లోతైన విచారణ జరుపుతున్నామని ఇప్పటివరకూ నిందితులను ఎవరిని అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పోలీసులు వెల్లడించారు. -
ప్రఖ్యాత ఉర్దూ కవి బషీర్ బద్ర్ కన్నుమూత
భోపాల్: ‘‘ఉజాలే అప్నీ యాదోం కే హమారే సాథ్ రెహ్నే దో’వంటి పంక్తులతో సాహితీ లోకంలో విశేషంగా గుర్తింపు పొందిన ప్రఖ్యాత ఉర్దూ కవి బషీర్ బద్ర్ దీర్ఘకాలిక అనారోగ్యంతో గురువారం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 91 ఏళ్లు. చాలా సంవత్సరాలుగా మతిమరుపు వ్యాధితో బాధపడుతున్న బషీర్ బద్ర్ భోపాల్‌లోని స్వగృహంలో కన్నుమూశారని ఆయన కుమారుడు సయ్యద్ బద్ర్ తెలిపారు. తమ కుటుంబానికి, ఆప్తులకు, అభిమానులకు ఇది చాలా బాధాకరమైన రోజు అని చెప్పారు. తన తండ్రి ప్రేమ, జీవితానికి సంబంధించిన కవిత్వంతో సాహిత్య ప్రియుల హృదయాల్లో చెరగ ని ముద్ర వేశారని పేర్కొన్నారు. జ్ఞాపకశక్తి క్షీణించడం మొదలయ్యాక జన సమూహానికి దూరమయ్యారని వెల్లడించారు. గత పదేళ్లుగా కవి సమ్మేళనాల్లో పాల్గొనడం లేదన్నారు.ఏడేళ్ల వయసులోనే సాహిత్య ప్రయాణం..బషీర్ బద్ర్ ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో 1935 ఫిబ్రవరి 15న జన్మించారు. బాల్యంలోనే సాహిత్యంపై ఆసక్తి పెంచుకున్నారు. ఉర్దూ బాషలో ప్రావీణ్యం సంపాదించారు. ఏడేళ్ల వయస్సులోనే కవిత్వం రాయడం ప్రారంభించారు. మొదట గజల్స్ రాశారు. ఆయనకు పర్షియన్, హిందీ, ఆంగ్ల భాషల్లోనూ మంచి పట్టుంది. అవార్డులు గెలుచుకున్న 69 గజల్స్‌తో ‘ఆస్’అనే సంకలనం విడుదల చేశారు. ఇది బద్ర్ కవితా కిరీటంలో ఒక ఆభరణంగా గుర్తింపు పొందింది. అంతేకాకుండా 1999లో ఆయనకు ఉర్దూలో సాహిత్య అకాడమీ అవార్డును సంపాదించి పెట్టింది. బద్ర్ సంకలనాల్లో ఒకటైన ‘కులియతే బషీర్ బద్ర్’ను పాకిస్తాన్లో కూడా ప్రచురించారు.బషీర్ బద్ర్ ఉర్దూలో ఏడుకు పైగా కవితా సంకలనాలు, హిందీలో ఒక సంకలనాన్ని వెలువరించారు. రెండు సాహిత్య విమర్శ పుస్తకాలు కూడా రాశారు. కొన్ని ఉర్దూ గజల్స్‌ను ‘ఉజాలే అప్నీ యాదోంకే’పేరిట దేవనాగరి లిపిలో తీసుకొచ్చారు. ఆయన రచనలు గుజరాతీ బాషలోనూ ప్రచురితమయ్యాయి. ఆంగ్లం, ఫ్రెంచ్ భాషల్లోకి అనువాదం చేశారు. సాహిత్య రంగానికి చేసిన సేవకు గాను బషీర్ బద్ర్ను భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఉత్తరప్రదేశ్ ఉర్దూ అకాడమీ నుంచి నాలుగు సార్లు, బిహార్ ఉర్దూ అకాడమీ నుంచి ఒకసారి పురస్కారాలు పొందారు. సాహితీ సంస్థల నుంచి పలు అవార్డులు, గౌరవాలు అందుకున్నారు.మీరట్‌లో చేదు అనుభవాలు..బషీర్ బద్ర్ జీవితం సాఫీగా సాగలేదు. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. 1987 ఏప్రిల్‌లో ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో మత కలహాలు జరిగినప్పుడు బషీర్ బద్ర్ ఇంటిని దుండగులు దహనం చేశారు. ఆయన రాసిన పుస్తకాలు, ప్రచురితం కాని గ్రంథాలకు సైతం నిప్పు పెట్టారు. ఈ సంఘటన తర్వాత ఆయన భోపాల్‌కు వలస వెళ్లారు. అక్కడే కొత్త జీవితం ఆరంభించారు. బద్ర్‌కు ప్రయాణాలంటే ఇష్టం. తన రచనలకు ఉన్న విస్తృతమైన పాఠకవర్గం కారణంగా అమెరికా, దుబాయ్, ఖతార్, పాకిస్తాన్ సహా ప్రపంచవ్యాప్తంగా చాలాదేశాల్లో పర్యటిచారు. ఆయనకు భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. బద్ర్ మరణం పట్ల బాలీవుడ్ రచయిత జావెద్ అక్తర్ సహా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. -
మండే ఎండలతో జాగ్రత్త!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఎండలు భగ్గుమంటున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు పలు సూచనలు చేశారు. ఎండల తీవ్రత సమయంలో అప్రమత్తంగా ఉండాలని బుధవారం ఆయన ఎక్స్ ద్వారా కోరారు. అనారోగ్యం బారినపడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.‘దేశంలోని పలు ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు నిరంతరం పెరుగుతున్నాయి. అందరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎండల కారణంగా సాధారణ జీవనంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు మంచినీళ్లు తప్పకుండా వెంట తీసుకెళ్లాలి. శరీరంలో నీటి లోపం రాకుండా తరచూ నీరు తాగుతూ హైడ్రేట్‌గా ఉండాలి.మరిముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, కార్మికులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అననుకూల వాతావరణ పరిస్థితుల్లో మానవత్వం, పరస్పర సహకారం ఎంతో అవసరం. దాహంతో ఉన్న వారికి సాధ్యమైనంత వరకు ఒక గ్లాసు మంచినీళ్లు అందించాలి’అంటూ విజ్ఞప్తి చేశారు. ‘ఆరు బయట పనులు చేసే వారు తీవ్రమైన వేడికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. కాబట్టి, ఎవరూ అలసట, నీరసం వంటి ముందస్తు హెచ్చరిక సంకేతాలను నిర్లక్ష్యం చేయరాదు.ఏమాత్రం అలక్ష్యం చేసిన ప్రమాదకరంగా మారి చివరికి వడదెబ్బకు దారి తీయవచ్చు. కళ్లు తిరగడం, వికారం, తీవ్రమైన అలసట వంటి అధిక వేడి వల్ల కలిగే లక్షణాలను గమనిస్తూ ఉండండి. మీ చుట్టుపక్కల ఎవరికైనా ఒంట్లో బాగోలేకపోయినా, బలహీనంగా అనిపించినా, తలనొప్పితో బాధపడుతున్నా వెంటనే వారిని చల్లని, నీడ ఉన్న ప్రదేశానికి తరలించడానికి సాయం పడటం ఉత్తమం. వారికి మంచి నీరు, ఓఆర్ఎస్ వంటివి ఇవ్వాలి. దాంతో, వారికి సాంత్వన చేకూరుతుంది. ఈ విషయంలో సకాలంలో స్పందించడం తప్పనిసరి’అని ఆయన సూచించారు. -
సుప్రీంకోర్టు కొలీజియం కీలక నిర్ణయం
ఢిల్లీ: సుప్రీంకోర్టు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది. నలుగురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో పాటు ఒక సీనియర్ మహిళా అడ్వకేట్‌ని సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. మే 22, మే 27 తేదీలలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని సమావేశమైన కొలీజియం బృందం ఈ నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు కోలిజియం సిపార్సు చేసిన న్యాయమూర్తులు జస్టిస్ శీల్ నాగు, పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. జస్టిస్ శ్రీ చంద్రశేఖర్. బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. జస్టిస్ సంజీవ్ సచ్‌దేవా ,మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. జస్టిస్ అరుణ్ పల్లి , జమ్మూ కాశ్మీర్ ,లడఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. వి. మోహన (సీనియర్ అడ్వకేట్): సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న ఒక సీనియర్ మహిళా న్యాయవాది.సీనియర్ అడ్వకేట్ వి. మోహనను నేరుగా బార్ (న్యాయవాది వృత్తి) నుండి సుప్రీంకోర్టు జడ్జిగా ఎంపిక చేయడం విశేషం. ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేవలం ఒకే ఒక మహిళా జడ్జి (జస్టిస్ బి.వి. నాగరత్న) ఉన్నారు. మోహన నియామకం జరిగితే కోర్టులో మహిళల ప్రాతినిధ్యం మరింత పెరుగుతుంది. రిటైర్డ్ జస్టిస్ ఇందు మల్హోత్రా తర్వాత బార్ నుండి నేరుగా సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందుతున్న రెండో మహిళా న్యాయవాదిగా ఆమె గుర్తింపు పొందుతారు.దేశంలో పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించడానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా సుప్రీంకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్యను (CJI తో కలిపి) 38 కి పెంచింది. ప్రస్తుతం కోర్టులో 32 మంది జడ్జీలు విధులు నిర్వహిస్తున్నారు. కొలీజియం సిఫార్సు చేసిన ఈ ఐదుగురి నియామకాలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి, రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్ ఇస్తే సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 37 కి చేరుకుంటుంది. -
ఎబోలాపై కేంద్రం కీలక ప్రకటన
ఢిల్లీ: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎబోలా వైరస్ ఆందోళన కలిగిస్తోంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ‘పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్’ గా ఎబోలాను ప్రకటించడంతో ఆందోళన మరింత తీవ్రతరమైంది. ఈ నేపథ్యంలో భారత్ కీలక ప్రకటన చేసింది. దేశంలో ఇప్పటి వరకూ ఎబోలా కేసులు నమోదు కాలేదని తెలిపింది. వైరస్ దేశంలోకి ప్రవేశించకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.భారతదేశంలో ఇప్పటివరకు ఎలాంటి ఎబోలా కేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. దేశంలోకి వైరస్ ప్రవేశించకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం, విమానాశ్రయాలు మరియు ఓడరేవుల్లో విదేశీ ప్రయాణికులకు కఠిన స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించిందినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.ఎబోలా కలకలంఆఫ్రికా ఖండంలోని డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (డీఆర్సీ), ఉగాండా, దక్షిణ సూడాన్‌లలో ఎబోలా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రాణాంతకమైన ‘బుండిబుగ్యో’ రకం ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో, భారత కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. ఈ దేశాలకు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని భారత పౌరులను హెచ్చరించింది.అత్యవసర పరిస్థితిప్రపంచ ఆరోగ్య సంస్థ మే 17న, ఈ ఎబోలా వ్యాప్తిని ‘పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్’గా ప్రకటించింది. అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనల ప్రకారం ఈ వైరస్ ముప్పు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (ఆఫ్రికా సీడీసీ) సైతం, దీనిని ‘పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ కాంటినెంటల్ సెక్యూరిటీ’గా పేర్కొంటూ కఠిన నిఘా ఉంచాలని సూచించింది.ఎబోలా వ్యాప్తి ?ఎబోలా అత్యంత ప్రమాదకరమైన వైరల్ వ్యాధి. ఇది సోకిన వ్యక్తుల రక్తం, వాంతులు, వీర్యం, చెమట, ఇతర శరీర ద్రవాలతో నేరుగా సంబంధం ఏర్పడినప్పుడు ఇతరులకు వేగంగా వ్యాపిస్తుంది. ఒకసారి వైరస్ సోకిన తర్వాత, వ్యాధి తీవ్రత చాలా వేగంగా పెరుగుతుంది. సకాలంలో సరైన చికిత్స అందకపోతే, ఇది ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.


