కోల్‌కతాలో ఉద్రిక్తత.. టీఎంసీ ఆఫీస్‌పై మాస్క్ గ్యాంగ్ దాడి | kolkata watch masked men carry tvs printer out of kolkata tmc office | Sakshi
Sakshi News home page

కోల్‌కతాలో ఉద్రిక్తత.. టీఎంసీ ఆఫీస్‌పై మాస్క్ గ్యాంగ్ దాడి

Sep 3 2026 1:48 PM | Updated on Sep 3 2026 2:55 PM

kolkata watch masked men carry tvs printer out of kolkata tmc office

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో టీఎంసీ అధికారం కోల్పోయిన తర్వాత పరిస్థితులు ఏ విధంగా మారాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. టీఎంసీ నేతలపై దాడులు, ఆ పార్టీకి చెందిన నాయకుల తిరుగుబాటు, నాయకులపై కేసులు ఇలా ఆ పార్టీకి మెుత్తంగా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. తాజాగా కోల్‌కతాలోని స్థానికంగా గల టీఎంసీ కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈదృశ్యాలు అక్కడి సీసీటీవీలలో నమోదయ్యాయి.

సీసీటీవీలలో నమోదైన దృశ్యాలలో.. మాస్కులు, హెల్మెట్లు ధరించిన ధరించిన కొంతమంది వ్యక్తులు టీవీ స్క్రీన్‌లు, ప్రింటర్, ఇతర వస్తువులను తీసుకుని  బయటకు నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు నమోదయ్యాయి. అందులోని  ఫర్నిచర్ ,ఎలక్ట్రానిక్ పరికరాలు ధ్యంసమైనట్లు కనిపిస్తోంది. అయితే దాడి ఏవరు చేశారనే సంగతి మాత్రం ఇంతవరకూ తెలియలేదు. కోల్‌కతాలోని కామాక్ స్ట్రీట్‌లోని తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయంలో ఈ ఘటన జరిగినట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు.

కాగా ఈ ఘటనపై టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడూతూ.." బీజేపీ కార్యకర్తలు ఆయుధాలతో తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో పార్టీ కార్యాలయంలోకి చొరబడి, లోపల ఉన్న వారిపై దాడి చేసి, వారి ఫోన్లను లాక్కున్నారు.  ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి, ప్రాంగణాన్ని దోచుకున్నారు. దీనిని "చట్టబద్ధమైన పాలనపై జరిగిన అవమానకరమైన దాడి" అన్ని అన్నారు.

అయితే పార్టీ ఆఫీసుపై దాడి జరిగిన సమయంలో  కార్యకర్తలు, న్యాయవాదులు పోలీసులకు ఫోన్‌ చేసినట్పటికీ తక్షణమే స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడిలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ తక్షణమే అరెస్టు చేయాలని టీఎంసీ  డిమాండ్ చేస్తుందని పేర్కొన్నారు. అయితే ఈ అంశమై రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని వాటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతితో పాటు బెంగాల్ గవర్నర్‌కు టీఎంసీ లేఖ రాసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement