రూ. 1,200 కోట్లతో వందేళ్లు నిలిచేలా కొత్త సెక్రటేరియట్‌ | Tamil Nadu CM Vijay announces new Secretariat says will be functional for next 100 years | Sakshi
Sakshi News home page

రూ. 1,200 కోట్లతో వందేళ్లు నిలిచేలా కొత్త సెక్రటేరియట్‌

Sep 3 2026 2:50 PM | Updated on Sep 3 2026 3:05 PM

Tamil Nadu CM Vijay announces new Secretariat says will be functional for next 100 years

సాక్షి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్  సంచలన నిర్ణయాలతో దూసుకు పోతున్నారు. తాజాగా   చెన్నైలో కొత్త శాసనసభ - సచివాలయ (Assembly-cum-Secretariat)  భవన సముదాయాన్ని నిర్మించనున్నట్లు  గురువారం అసెంబ్లీలో ప్రకటించారు. ఈ నిర్మాణం రాబోయే 100 సంవత్సరాల వరకు ఉపయోగ పడేలా ఉంటుందని ఆయన తెలిపారు.

అసెంబ్లీలో రూల్ 110 కింద అనేక ప్రకటనలు చేస్తూ, తమిళనాడు ఒలింపిక్ సిటీని, చెన్నైలో మోటార్ స్పోర్ట్స్ సిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని  సీఎం ప్రకటించారు. రాష్ట్ర మౌలిక సదుపాయాలను  ప్రపంచ స్థాయికి పెంచడానికి ముఖ్యమంత్రి మూడు ప్రధాన అభివృద్ధి కార్యక్రమాలను ప్రకటించారు.

ఇదీ చదవండి: నెలకు రూ. 14 లక్షలు : ఏం వ్యాపారమో తెలిస్తే షాకవుతారు

ప్రస్తుతం ఫోర్ట్ సెయింట్ జార్జ్ (Fort St George) కాంప్లెక్స్ తమిళనాడు ప్రభుత్వ శాసనసభ , సచివాలయంగా పనిచేస్తోంది. సీఎం విజయ్‌ ఆధ్వర్యంలో రానున్న కొత్త సెక్రటేరియట్‌  అంచనా వ్యయం రూ. 1,200 కోట్లుగా భావిస్తున్నారు. 20 లక్షల చదరపు అడుగులవిస్తీర్ణంలో  ఇది రూపుదిద్దుకోనుంది. కొత్త కాంప్లెక్స్ నిర్మాణం కోసం ప్రభుత్వం పట్టణపాక్కం, నందంబాక్కం, కోయంబేడు మరియు గిండిలోని హైవేస్ డిపార్ట్‌మెంట్ ఆఫీస్ ప్రాంగణాలను ఎంపిక చేసింది. గతంలో మాజీ ముఖ్యమంత్రులు జయలలిత, ఎం. కరుణానిధి కూడా అసెంబ్లీ, సచివాలయాలను వేరే చోటికి మార్చాలని ప్రతిపాదించినప్పటికీ, దశాబ్దాలుగా ఫోర్ట్ సెయింట్ జార్జ్ ప్రాంగణమే పాలనా కేంద్రంగా కొనసాగుతోంది.

ఇదీ చదవండి: వారెవ్వా.. డ్రాగన్‌ ఫ్రూట్‌సాగుతో నెలకు రూ. 4 లక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement