అవకాడో ఒకప్పుడు అంతగా పరిచయం లేని పండుగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరి భోజనాల్లో ప్రముఖంగా మారింది. దాన్ని వివిధ స్మూతీలు, సలాడ్ల వరకు విరివిగా ఉయోగిస్తూ..ఆధునిక ఆహారంలో అత్యంత ముఖ్యమైనవిగా మారిపోయాయి. దీని గురించి సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ కూడా మాట్లాడారు. మరి ఆయన ఏం అన్నారంటే..
భారత్‌లో ఈ పండు పట్ల పెరుగుతున్న ఆదరణ, ఆరోగ్య ప్రయోజనల గురించి చెప్పారు. ఇంతకుముందుక అంతగా ఎవ్వరికీ తెలియని ఈ పండుకి ప్రస్తుతం డిమాండ్, క్రేజ్ ఎక్కువయ్యాయి. ప్రతి డైనింగ్ టేబుల్‌పై తప్పనిసరిగా ఇది కనిపిస్తోంది. అంతేగదు మన అన్నదాత రైతన్నకి కూడా ఇష్టమైన పండుగా మారింది అంటూ ఆంధ్రప్రదేశ్ రైదు కర్ప వరదరాజు గురించి ప్రస్తావించారు.
వరదరాజ్ తన స్నేహితుడు పొలంలో అవకాడో పండుని చూసి యూట్యూబ్ ద్వారా ఆ పంట పెంపకం గురించి నేర్చుకుని మరి పండించడం ప్రారంభించాడు. మోదీ ప్రకారం..వరదరాజ్ ఇప్పుడు సుమారు నాలుగు టన్నుల అవకాడోలను ఉత్పత్తి చేసి, వాటిని నేరుగా దుకాణాల్లో విక్రయిస్తున్నాడు. నగరాల్లోని తీని గురించి ఎక్కువగా వింటుంటాం. అలాంటి దాంతో రైతులు వినూత్నంగా సంపాదించే మార్గాన్ని కనుగొన్నారు. మన దేశపు అవకాడోల రుచి పెరగడమే కాదు, రైతుల ఆదాయం కూడా పెరిగింది అంటూ తన సంభాషణను ముగించారు.
అవకాడోల వల్ల కలిగే లాభాలు..
వీటిలో ఆరోగ్యకరమైన మోనోఅన్‌శాచురేటెడ్ ఒలిక్ యాసిడ్, అధిక డైటరీ ఫైబర్‌తో నిండిన పోషకాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.
కొవ్వులో కగిగే విటమిన్లు శోషణను పెంచడంలో సమర్థవంతంగా ఉంటాయి.
వయసు సంబంధిత కీళ్ల సమస్యలు, దృష్టిని మెరుగుపరిచేలా ల్యూటిన్, జీక్సాంథిన్ వంటి యాక్సిడెంట్లు ఉంటాయి.
అలాగే ఎముకల సాంద్రతను బలోపేతం చేసే విటమిన్ కె కూడా ఉంటుంది.
(చదవండి: మీనాక్షి దేవతను తలపించేలా నికితా పోర్వాల్ అద్భుత నృత్యం..!)


