మండ్య జైలు అధికారి శతమ్మ బళ్లారికి బదిలీ
కర్ణాటక: విచారణ ఖైదీ అయిన శ్రీరంగపట్న ప్రభుత్వ అధికారి మహమ్మద్ హుస్సేన్‌కు సహాయం చేశారని, జైలులో డబ్బు చెల్లిస్తే రాజమర్యాదలు అందిస్తారని ఆరోపణలు రావడంతో జిల్లా జైలు ప్రధానాధికారి ఎం.శతమ్మను జైళ్ల చీఫ్ అలోక్ కుమార్ బళ్లారి సెంట్రల్ జైలుకు బదిలీ చేశారు.
జైలులో అక్రమాలపై ఖైదీలు రాసినట్లుగా భావిస్తున్న ఒక లేఖ వైరల్ అయిన తర్వాత ఈ ఉత్తర్వు వెలువడింది. ఫోర్జరీ విచారణ ఖైదీగా ఉన్న మహమ్మద్ హుస్సేన్.. అనారోగ్యం లేకున్నా జబ్బు సాకుతో మిమ్స్ ఆసుపత్రిలో చేరాడు. అక్కడ ప్రత్యేక గదిలో ప్రియురాలితో గడుపుతుండగా కొందరు గుట్టురట్టు చేశారు. జిల్లా సెషన్స్ జడ్జి బృందం ఆసుపత్రిని తనిఖీ చేసి విచారించారు. ఈ కేసులో శతమ్మ నిర్లక్ష్యం స్పష్టం కావడంతో బళ్లారి జైలుకు బదిలీ చేసి ఆమె స్థానంలో ఫక్కీరప్ప బరకర్‌ను నియమించారు.
చదవండి: రసోడా గ్యాంగ్ కి'లేడీ'ల కార్ఖానా


