పనాజీ : ఢిల్లీనుంచి బయలుదేరిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఒక్కసారిగా ఆందోళన తలెత్తింది. గోవా-ఢిల్లీ మార్గంలో ప్రయాణిస్తున్న విమానాన్ని తిరిగి గోవా విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది.
మంగళవారం ఉదయం 9:10 గంటలకు గోవా నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానం (6E 2102), గాలిలో ఉండగా ఇంజిన్ వైఫల్యాన్ని సిబ్బంది గుర్తించారు. ఇంజిన్లలో ఒకటి సరిగా పనిచేయకపోవడంతో వెంటనే మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తిరిగి ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. దీంతో కొద్ది సమయం పాటు 'పూర్తి స్థాయి అత్యవసర పరిస్థితి' (full emergency) ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: లక్షల్లో జీతం, హెచ్1 బీ వీసా : తిరిగి ఇండియాకు, ఎందుకు?
ఇదీ చదవండి: రూ. 15 లక్షల కారు, 70 తులాల గోల్డ్ : అయినా కట్నదాహానికి టీచర్ భువనేశ్వరి ఆహుతి


