దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ నటుడు లీ యాంగ్-జూ (Lee Yong-joo) తన 44వ ఏట అకస్మాత్తుగా (ఆగస్టు 29, 2026న ) కన్నుమూశారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అతని అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. 'ది బ్లూ టవర్' (The Blue Tower) టీవీ షో ద్వారా ఆయన విశేష ప్రజాదరణ పొందారు. ఈ విషాద వార్త కుటుంబ సభ్యులు, చిత్ర పరిశ్రమ, అభిమానులును దిగ్భ్రాంతికి గురిచేసింది
లీ యాంగ్-జూ గుండెపోటు (cardiac arrest)తో మరణించినట్టు తెలుస్తోంది. ఆయన అంత్యక్రియలు గ్యోంగ్గి ప్రావిన్స్‌లోని సోంగ్నమ్‌లోని బుండాంగ్ జెసెంగ్ హాస్పిటల్' ఫ్యూనరల్ హాల్‌లో నిర్వహించనున్నారు. ఆగస్టు 31 ఉదయం 6:30 గంటలకు అంతిమ యాత్ర జరగనుంది.
కాగా లీ గతం నుంచే గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. 2013లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తనకు హైపర్‌ట్రోఫిక్ కార్డియోమైయోపతి (Hypertrophic Cardiomyopathy) అనే అరుదైన గుండె జబ్బు ఉందని, దానివల్ల సైనిక సేవ (compulsory military service) నుండి మినహాయింపు లభించిందని తెలిపారు. ఇదే వ్యాధి ఆయన తల్లికి కూడా ఉంది.
ఇదీ చదవండి: అపుడు భర్త, ఇపుడు భార్య రాజీనామా? యూపీ రాజకీయాల్లోకి ఎంట్రీ?
స్నేహితుడి ప్రకటన
"ఈ విషయాన్ని రాస్తున్నప్పుడు కూడా నేను నమ్మలేకపోతున్నాను. 'బ్లూ టవర్'లో 'న్యూ రిక్రూట్ లీ యాంగ్-జూ'గా అందరినీ నవ్వించిన లీ యాంగ్-జూ హఠాత్తుగా కన్నుమూశారు. ఆయన ఫోన్ పాస్‌వర్డ్ ప్రొటెక్ట్ అయి ఉండటం, వారాంతం కావడం వల్ల సమాచారం అందరికీ చేరలేదు. ఆయనతో కలిసి పనిచేసిన వారు ఈ వార్తను ఇతరులకు తెలియజేయగలరు" అని సోషల్ మీడియాలో కోరారు.
ఇదీ చదవండి: యూపీలో సీనియర్ ఐఏఎస్ అధికారిణి రాజీనామా కలకలం
ప్రముఖ నటుడిగా గుర్తింపు
లీ యాంగ్-జూ కె-డ్రామా ద్వారా ప్రజాదారణ పొందారు. 'ఫ్రాన్సిస్కా', 'ప్రిన్సెస్ అవర్స్', 'సెయింట్ వాలెంటైన్', 'అగ్లీ మిస్ యంగ్-యే' వంటి అనేక ప్రముఖ కె-డ్రామా (K-Drama) ప్రాజెక్ట్‌లలో నటించినప్పటికీ, 'ది బ్లూ టవర్' ఆయనకు అత్యంత ప్రజాదరణ తెచ్చిపెట్టింది.


