బిగ్‌ బాస్‌ వ్యాఖ్యాతగా సౌరవ్‌ గంగూలీ | Bigg Boss Bangla 3 Grand Premiere Tonight with Host Sourav Ganguly | Sakshi
Sakshi News home page

బిగ్‌ బాస్‌ వ్యాఖ్యాతగా సౌరవ్‌ గంగూలీ

Aug 30 2026 1:58 PM | Updated on Aug 30 2026 1:58 PM

Bigg Boss Bangla 3 Grand Premiere Tonight with Host Sourav Ganguly

ముంబై: పదేళ్ల విరామం తర్వాత బెంగాలీ రియాలిటీ షో ‘బిగ్‌ బాస్‌ బంగ్లా’ మూడో సీజన్‌తో పునఃప్రారంభం కానుంది. భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ వ్యాఖ్యాతగా (హోస్ట్‌) వ్యవహరిస్తున్న ఈ షో ఆదివారం(ఈరోజు) రాత్రి గ్రాండ్‌గా మొదలుకానుంది. రెండో సీజన్‌కు నటుడు జీత్‌ హోస్ట్‌గా వ్యవహరించగా, తాజా సీజన్‌తో గంగూలీ ఈ రియాలిటీ షోలోకి అరంగేట్రం చేస్తుండటం విశేషం.

ఆదివారం రాత్రి 8 గంటలకు ప్రత్యేక గ్రాండ్‌ ప్రీమియర్‌ ఎపిసోడ్‌ ప్రసారం కానుంది. రెగ్యులర్‌ ఎపిసోడ్‌లు ఆగస్టు 31 నుంచి ప్రతిరోజూ రాత్రి 9:30 గంటలకు రానున్నాయి. ఈ షోను స్టార్‌ జల్సా ఛానల్‌తో పాటు జియోహాట్‌స్టార్‌ ఓటీటీ వేదికలోనూ వీక్షించవచ్చు. అలాగే జియోహాట్‌స్టార్‌లో 24x7 లైవ్‌ ఫీడ్‌ అందుబాటులో ఉండనుంది. ఈ సీజన్‌లో సుమారు 15 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. మరోవైపు బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్‌గా ‘బిగ్‌ బాస్‌’ హిందీ 20వ సీజన్‌ సెప్టెంబరు 6 నుంచి ప్రారంభం కానుంది. ఈసారి ఈ ఫ్రాంచైజీ అత్యంత భారీ స్థాయిలో హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, బంగ్లా అనే ఆరు ప్రాంతీయ భాషల్లో ఒకేసారి రాబోతోంది. వీటికి సల్మాన్‌ ఖాన్‌, విజయ్‌ సేతుపతి, అక్కినేని నాగార్జున, కిచ్చా సుదీప్‌, మోహన్‌లాల్‌, సౌరవ్‌ గంగూలీ వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్నారు.

ఇది కూడా చదవండి: చిన్నారిపై అమాసుషం కేసులో నిందితుడు ఎన్‌కౌంటర్!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement