బిగ్‌బాస్ సీజన్-10.. హౌస్‌లోకి చెన్నై లవ్ స్టోరీ నటుడు..! | Bigg Boss 10 Telugu, Chennai Love Story Actor Likely To Enter The Bigg Boss Reality Show, Read Story Inside | Sakshi
Sakshi News home page

Chennai Love Story: బిగ్‌బాస్ సీజన్-10.. చెన్నై లవ్ స్టోరీ నటుడి ఎంట్రీ..!

Aug 28 2026 7:40 AM | Updated on Aug 28 2026 9:52 AM

Chennai Love Story actor to join In Bigg Boss Season 10 goes Viral

బుల్లితెర ప్రియుల రియాలిటీ షో బిగ్‌బాస్ మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కానుంది. ఈ ఏడాది పదో సీజన్ కావడంతో మరింత స్పెషల్‌గా నిలవనుంది. ఇప్పటికే ప్రోమోలు రిలీజ్ చేయగా.. ఈ సీజన్ సరికొత్తగా ఉండనుందని హింట్ ఇచ్చేశారు. ప్రస్తుతం ఈ షోకు కంటెస్టెంట్ల వేట కొనసాగుతోంది. అగ్నిపరీక్ష పేరుతో కామనర్లను వడపోత పోస్తున్నారు. వీరిలో కొందరినీ ఎంపిక చేసే ప్రక్రియ ఇంకా నడుస్తోంది.

అయితే ఇప్పటి వరకు సెలబ్రిటీల ఎవరనే విషయంపై ఇంకా క్లారిటీ రావడం లేదు. ఈ సీజన్‌లో బుల్లితెర నటులతో పాటు కొందరు నటులు హౌస్‌లో అడుగుపెట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ బిగ్‌బాస్ సీజన్‌లో ఓ ప్రముఖ నటుడు ఎంట్రీ ఇవ్వనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇటీవల సూపర్ హిట్‌గా నిలిచిన కిరణ్ అబ్బవరం మూవీ నటుడు ఆదిత్ అరుణ్ ఈ సీజన్‌లో హౌస్‌లో అడుగుపెట్టనున్నారని లేటేస్ట్ టాక్.

(ఇది చదవండి: సడన్‌గా ఓటీటీకి టాలీవుడ్‌ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)

వచ్చేనెల ప్రారంభం కానున్న ఈ బిగ్ బాస్ తెలుగు సీజన్- 10 సెప్టెంబర్‌లో ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉంది. తేదీని ఇంకా అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు. దీంతో కంటెస్టెంట్స్‌ ఎవరనే విషయంపై రోజుకు ఒక పేరు వినిపిస్తోంది. తాజాగా ఆదితి అరుణ్ బిగ్‌బాస్‌లో కనిపిస్తారని వార్త వినిపిస్తోంది. దీనిపై రాబోయే రోజుల్లో మరింత క్లారిటీ రానుంది. ఈ పదో సీజన్‌కు సైతం కింగా నాగార్జునే హోస్ట్ కావడం విశేషం. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement