సడన్‌గా ఓటీటీకి టాలీవుడ్‌ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? | Tollywood Thriller Movie KJQ: King Jackie Queen Released In OTT, Check Out Streaming Platform Details | Sakshi
Sakshi News home page

Ott Movie: ఓటీటీలో టాలీవుడ్‌ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Aug 28 2026 8:32 AM | Updated on Aug 28 2026 11:11 AM

Tollywood Thriller Movie Sudden Streaming on this Ott

దీక్షిత్‌ శెట్టి, శశి ఓదెల, యుక్తీ తరేజా లీడ్‌ రోల్స్‌లో నటించిన మూవీ ‘కేజేక్యూ: కింగ్‌ జాకీ క్వీన్‌’. 1990 నేపథ్యంలో సాగే ఈ పీరియాడికల్‌ క్రైమ్‌ డ్రామాకు కేకే దర్శకత్వం వహించారు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి ఈ సినిమాను నిర్మించారు. ఆగస్టు 7న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం ఆడియన్స్‌ను అంతగా మెప్పించలేకపోయింది.

తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు వచ్చేసింది. ఎలాంటి ప్రకటన లేకుండానే అమెజాన్ ప్రైమ్‌లో సడన్‌ స్ట్రీమింగ్ ‍అవుతోంది. ఈ మూవీ తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం థియేటర్లలో మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి. కాగా..  ఈ సినిమాకు పూర్ణచంద్ర తేజస్వీ సంగీతమందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement