వంద కోట్ల క్లబ్‌లో మమితా బైజు లేటేస్ట్ మూవీ | Mamitha Baiju Bethlehem Family Unit Hits 100 Crores At Worldwide Box Office Collections In Just 6 Days, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

Mamitha Baiju: వంద కోట్ల క్లబ్‌లో మమితా బైజు లేటేస్ట్ మూవీ

Aug 28 2026 7:24 AM | Updated on Aug 28 2026 9:53 AM

Mamitha Baiju Bethlehem Family Unit Hits 100 Crores ar Boxoffice

కంటెంట్ ఉంటే చాలు ఏ సినిమాకైనా కాసుల వర్షమే. అదే నిజమని ప్రతిసారి రుజువవుతోంది. ఇటీవలే విడుదలైన రవితేజ ఇరుముడి సైతం ఇదే నిరూపించింది. తండ్రీ కూతుళ్లు సెంటిమెంట్‌తో వచ్చిన ఈ ‍మూవీ ఇప్పటికే వసూళ్లపరంగా సెంచరీ కొట్టేసింది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.

ఇటీవలే మలయాళంలో విడుదలైన మరో మూవీ సైతం కంటెంట్‌తో అదరగొడుతోంది. మమితా బైజు, నివిన్ పౌలీ కీలక పాత్రల్లో వచ్చిన సినిమా బెత్లెహెమ్ ఫ్యామిలీ యూనిట్. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మలయాళ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డ్ సృష్టించింది. కేవలం విడుదలైన 6 రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కేరళలో ఓనం పండుగకు అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది.

(ఇది చదవండి: సడన్‌గా ఓటీటీకి టాలీవుడ్‌ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)

ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు గిరీష్ ఏడీ దర్శకత్వం వహించారు.  ఇతర భాషల్లోకి డబ్బింగ్ చేయకపోయినా కూడా.. కేవలం మలయాళం వర్షన్‌తోనే ఈ సినిమా రికార్డులు సృష్టిస్తోంది. మలయాళ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీకి పోటీ లేకపోవడం బాగా కలిసొచ్చింది. ఓనం పండుగ కూడా రావడంతో ఈ సినిమాకు ప్లస్ అయింది. ఈ చిత్రాన్ని భావన స్టూడియోస్ బ్యానర్‌లో నిర్మించారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement