నేటికి 9 సంవత్సరాలు పూర్తిచేసుకున్నా అర్జున్ రెడ్డి సినిమా క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. ఈ సినిమాతో ఇటు డైరెక్టర్, అటు హీరో ఇద్దరూ వారివారి భవిష్యత్తులకు పునాదివేసుకున్నారు. 2017లో సంచలనం సృష్టించిన ఈ తెలుగు సినిమా.. తర్వాత హిందీలోనూ రీమేక్ అయ్యి మంచి విజయం సాధించుకుంది. ప్రేమకథను ఇలా కూడా చూపించవచ్చా అనేలా అర్జున్ రెడ్డి సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఈ ఒక్క సినిమాతోనే విజయ్ దేవరకొండ ఓ స్టార్ ఇమేజ్ సంపాదించేశాడు.
అయితే ఇటీవల ఓ మూవీ ఈవెంట్ కార్యక్రమంలో డెరెక్టర్ సందీప్ రెడ్డి.. అర్జున్‌రెడ్డి సినిమాకు సంబంధించిన పలు విషయాలను పంచుకున్నాడు. మళ్లీ ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు హింట్ ఇచ్చాడు. అయితే ఈసారి పూర్తి సినిమాను ఎటువంటి కటింగ్స్ లేకుండా విడుదల చేస్తున్నట్లు వెల్లడించాడు. అయితే దీనికి కొంత సమయం కావాలని అన్నారు. ఇప్పటికే ఈ విషయమై హీరో విజయ్ దేవరకొండతో కూడా మాట్లాడడం జరిగిందని తెలిపారు. ఇప్పుడీ వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది.
(చదవండి: పెళ్లి తర్వాత తొలి చిత్రం.. అప్‌డేట్ వచ్చేసింది..)
3.45 నిమిషాల నిడివితో..
అయితే గతంలో ఈ సినిమా రీరిలీజ్ అవుతుందని చిత్రబృందం ప్రకటించింది. కట్ చేసిన సీన్లతో మొత్తం 3.45 నిమిషాల నిడివి గల సినిమాను అర్జున్ రెడ్డి మూవీ ఐదేళ్లు పూర్తయ్యే సందర్భంగా 2022 ఆస్టు 25న విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నామని అప్పట్లో సందీప్ రెడ్డి తెలిపారు. అయితే అప్పట్లో విడుదల కాలేదు.
ఈ సీన్లు ఉంటాయట..
ఈ 3.45 నిమిషాల నిడిలో చాలా ఫన్నీ సీన్లు కూడా ఉన్నాయట. శివ, కమల్, విద్య, కీర్తి ఎలా క్లోజ్ అయ్యారు, అర్జున్ రెడ్డి స్కూల్ ఫ్రెండ్స్.. అతని బాల్యం, బుల్లెట్ బైక్ సంబంధించిన సీన్లు కొత్తగా విడుదల చేయబోయే సినిమాలో ఉంటాయట. అలాగే అర్జున్ రెడ్డి పెంచుకున్న కుక్కకు సంబంధించిన కామెడీ సీన్ కూడా ఉండబోతుదంట. ఇదే జరిగితే మళ్లీ ఈ సినిమా ఏ రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి మరి. కాగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, షాలినీ జంటగా తెరకెక్కిన చిత్రం అర్జున్ రెడ్డి. 2017లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. దీంతో పాటు యూత్‌లో విపరీతమైన ట్రెండ్ సృష్టించింది.


