అల్లరి నరేష్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ రంభ ఊర్వశి మేనక. (Ramba Oorvasi Menaka Movie)
ఈ సినిమాకు చంద్రమోహన్ చింతాడ దర్శకత్వం వహించారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం సెప్టెంబర్ 4న థియేటర్లలో సందడి చేయనుంది.
ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్– హాస్య మూవీస్ బ్యానర్స్‌పై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మించారు.
తాజాగా ఈ మూవీ నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్.
రంభగా రాశి సింగ్, ఊర్వశిగా విష్ణుప్రియ, మేనకగా ప్రిషా సింగ్ కనిపించనుండగా.. దేవేంద్రుడి పాత్రలో వెన్నెల కిషోర్ తన కామెడీతో అదరగొట్టేలా కనిపిస్తున్నారు.


