breaking news
Rashi Singh
-
లెక్చరర్‌తో ప్రేమ.. కానీ, అలాంటిది ఏమీ జరగలేదు: రాశీ సింగ్
మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్కేఎన్ నిర్మించిన ‘త్రీ రోజెస్’ సీజన్ 2లో ఈషా రెబ్బా, కుషిత కల్లపు, రాశీ సింగ్ లీడ్ రోల్స్‌లో నటించారు. డిసెంబర్ 12న ఆహా తెలుగులో స్ట్రీమింగ్ కానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమం మొదలు పెట్టింది. అయితే, రాశీ సింగ్ తన కాలేజ్ రోజుల నాటి లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చారు. ఏకంగా తన లెక్చరర్‌తో ఉన్న రిలిలేషన్ గురించి మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు.రాశీ సింగ్ ఇలా చెప్పారు 'స్కూల్ డేస్ అయిపోయాక కాలేజీలో చేరాను. ఆ సమయంలో నాకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అతను మాకు లెక్చరర్ కూడా.. కాలేజీలో నాకు ఎంతో ఫేవర్ చేసేవాడు. పరీక్షలు ఉన్నప్పుడు ఎగ్జామ్ పేపర్లు కూడా నాకు ముందే ఇచ్చేవాడు. వైవా జరిగే సమయంలో నన్ను ఎలాంటి ప్రశ్నలు అడిగేవాడు కాదు. సరదాగా కూర్చోని కబుర్లు చెప్పుకుంటూ టైమ్ పాస్ చేసేవాళ్లం. ఆ సమయంలో నా వయసు 17 ఏళ్లు.. అతను కూడా చాలా యంగ్.. పెళ్లి కూడా కాలేదు. అయినప్పటికీ మా మధ్య ఏమీ జరగలేదు. కొన్నేళ్ల క్రితం ఆయన పెళ్లి చేసుకున్నారు. నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో అవుతున్నాడు. వాళ్ళ వైఫ్ కూడా ఫాలో అవుతుంది.' అని రాశీ సింగ్ చెప్పారు. నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఒక లెక్చరర్‌ను ప్రేమించాను. ఆయన నాకు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లు ఇచ్చేవారు, వైవాలో ఏమి అడిగేవారు కాదు, దాని బదులు మేమిద్దరం టైమ్ పాస్ చేసుకున్నాం. - Rashi Singh#3Roses Season2 pic.twitter.com/sQYQaSihSi— idlebrain.com (@idlebraindotcom) December 7, 2025 -
హీరోయిన్ రాశి సింగ్ అందాలు... శారీ ఫోటోషూట్ చూశారా? (ఫొటోలు)
-
ఓటీటీలో రొమాంటిక్ బోల్డ్ సిరీస్.. కొత్త సీజన్ టీజర్ రిలీజ్
కరోనా టైంలో పలు తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్‌లు నేరుగా ఓటీటీల్లో రిలీజై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. అలాంటి వాటిలో 'త్రీ రోజెస్' ఒకటి. 2021లో ఆహా ఓటీటీలో ఇది స్ట్రీమింగ్ అయింది. బోల్డ్ కంటెంట్, దానికి తోడు రొమాంటిక్ కామెడీతో దీన్ని తీశారు. తెలుగమ్మాయి ఈషా రెబ్బా, పాయల్ రాజ్‌పుత్, పూర్ణ లీడ్ రోల్స్ చేశారు. ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత రెండో సీజన్ స్ట్రీమింగ్కి సిద్ధమైంది.(ఇదీ చదవండి: మళ్లీ వచ్చేశాడు.. 'ద ఫ్యామిలీ మ్యాన్ 3' రివ్యూ)వచ్చే నెల 12 నుంచి ఆహా ఓటీటీలో '3 రోజెస్' రెండో సీజన్ స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా టీజర్ లాంచ్ చేశారు. ఈసారి కూడా ఈషా రెబ్బా ఉండగా.. పాయల్, పూర్ణకి బదులు రాశి సింగ్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ కుషిత కొత్తగా వచ్చి చేరారు. టీజర్లో అయితే అడల్ట్ టచ్ ఉన్న జోక్స్, సీన్స్ కనిపించాయి. సిరీస్‌లోనూ వీటితో పాటు రొమాంటిక్ కామెడీ ఉండనుంది. (ఇదీ చదవండి: మనసు దోచేస్తున్న 'రాంబాయి'.. ఇంతకీ ఎవరీమె? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?) -
‘పాంచ్ మినార్’ మూవీ రివ్యూ
టైటిల్: పాంచ్ మినార్నటీనటులు: రాజ్ తరుణ్, రాశి సింగ్,అజయ్ ఘోష్, బ్రహ్మాజీ, శ్రీనివాస్ రెడ్డి, నితిన్ ప్రసన్న, రవి వర్మ, సుదర్శన్, కృష్ణ తేజ, నంద గోపాల్, ఎడ్విన్ లక్ష్మణ్ మీసాల, జీవా, అజీజ్ తదితరలునిర్మాణ సంస్థ: కనెక్ట్ మూవీస్ LLPసమర్పణ: గోవింద రాజురచన & దర్శకత్వం: రామ్ కడుములనిర్మాతలు: మాధవి, MSM రెడ్డిసంగీతం: శేఖర్ చంద్రడీవోపీ: ఆదిత్య జవ్వాదివిడుదల తేది: నవంబర్ 21, 2025రాజ్ తరుణ్ ఖాతాలో హిట్ పడి చాలా ఏళ్లు అవుతుంది. ఆయన నుంచి వరుస సినిమాలు వస్తున్నాయి కానీ.. కొన్ని అయితే రిలీజ్ అయిన విషయం తెలిసేలోపే థియేటర్స్ నుంచి వెళ్లిపోయాయి. దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు ఈ యంగ్ హీరో. కాస్త గ్యాప్ తీసుకొని ఈ సారి క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ ‘పాంచ్ మినార్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రంతో అయినా రాజ్ తరుణ్ ఖాతాలో హిట్ పడిందా? లేదా? రివ్యూలో చూద్దాం. కథేంటంటే..కృష్ణచైతన్య అలియాస్ కిట్టు(రాజ్ తరుణ్) ఉద్యోగం కోసం వెతుకుతుంటాడు. ప్రియురాలు ఖ్యాతి(రాశి సింగ్) ఒత్తిడి చేయడంతో సాఫ్ట్వేర్ జాబులో జాయిన్ అయ్యానని అబద్దం చెప్పి.. క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. డబ్బులు ఎక్కువ వస్తాయనే ఆశతో తనకు చెవుడు ఉన్నట్లుగా నటిస్తాడు. ఓ రోజు ఇద్దరు కిరాయి హంతకులు కిట్టు క్యాబ్‌ని బుక్ చేసుకొని.. అతని ముందే గ్యాంగ్‌స్టర్ చోటు(రవి వర్మ)ని హత్య చేస్తారు. ఈ హత్య చేసినందుకు మూర్తి(అజయ్ ఘోష్) వారికి రూ. 5 కోట్లు ఆఫర్ చేస్తాడు. ఆ డబ్బుని తీసుకునేందుకు వెళ్తున్న క్రమంలో హంతకులు పోలీసులకు చిక్కుతారు. చెవిటి వాడిలా నటించిన కిట్టు.. హంతకులకు తెలియకుండా ఆ డబ్బుని కొట్టేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఈజీగా వచ్చిన డబ్బు.. కిట్టుకు ఎలాంటి సమస్యలు తెచ్చిపెట్టింది? తనను చంపేందుకు కుట్ర పన్నిన హంతకులు, సీఐ (నితిన్ ప్రసన్న)ల నుంచి కిట్టు ఎలా తప్పించుకున్నాడు? చివరకు రూ. 5 కోట్లు ఎవరికి దక్కాయి? ఈ కథకు ‘పాంచ్ మినార్’ అనే టైటిల్ ఎందుకు పెట్టారు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. ఇదొక మంచి క్రైమ్ కామెడీ సినిమా.ఉద్యోగం సాధించాలనే క్రమంలో ఈజీగా డబ్బులు సంపాదించాలనుకునే ఓ కుర్రాడు ఎలాంటి సమస్యలో ఇరుక్కున్నాడు అనేది ఈ చిత్ర కథాంశం. కొత్త కథ అని చెప్పలేం కానీ.. జానర్‌కు తగ్గట్లు ప్రతి సందర్భంలో నుంచి థ్రిల్.. వినోదాన్ని పుట్టించే ప్రయత్నం చేశాడు దర్శకుడు రామ్ కడుముల. ఒకవైపు నవ్వులు పూయిస్తూనే..మరోవైపు తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీని పెంచేలా చేశాడు. హీరో పాత్ర ప్రాబ్లమ్స్లో నలిగిపోతున్న ప్రతిసారి ప్రేక్షకులు నవ్వుతారు. చోటు తండ్రి మరణించే సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత హీరో ఎంట్రీ..ఉద్యోగం కోసం ఆయన పడే పాట్లు.. అన్నీ నవ్వులు పూయిస్తాయి. చోటు హత్య తర్వాత అసలు కథ ప్రారంభం అవుతుంది. పాంచ్ మినార్ పదం కిట్టు జీవితాన్ని ఎలా మార్చేసిందనేది తెరపై చూడాల్సిందే. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో కథనం పరుగులు తీస్తుంది. తన ప్రాణాలతో పాటు డబ్బుని కూడా రక్షించుకునేందుకు హీరో చేసే ప్రయత్నాలు అలరిస్తాయి. చిన్న చిన్న టిస్టులు థ్రిలింగ్ కలిగిస్తాయి. ఇక క్లైమాక్స్‌లో వచ్చే ఓ ట్విస్ట్ అదిరిపోతుంది. ఎలాంటి వల్గారిటీ, రక్తపాతం లేకుండా ఫ్యామిలీ అందరూ కలసి హాయిగా నవ్వుకుని చూసే క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ ఈ పాంచ్ మినార్.ఎవరెలా చేశారంటే...కిట్టు పాత్రలో రాజ్ తరుణ్ చక్కగా నటించాడు. ఇటీవల ఆయన నుంచి వచ్చిన చిత్రాలతో పోలిస్తే..ఇందులో రాజ్ తరుణ్ చాలా హుషారుగా కనిపించాడు. ఆయన పాత్ర సమస్యల్లో ఇరుకున్న ప్రతిసారి ప్రేక్షకుడు నవ్వుతాడు. ఖ్యాతి పాత్రకి రాశిసింగ్ న్యాయం చేసింది. ఇక నెగెటివ్ షేడ్స్ ఉన్న సీఐగా నితిన్ ప్రసన్న చక్కగా నటించాడు. కామెడీ విలన్‌గా అజయ్ ఘోష్ తనదైన శైలీలో నటించి మెప్పించాడు. సుదర్శన్, లక్ష్మణ్‌లు పంచ్ డైలాగ్స్‌లో నవ్వులు పూయించారు. మరోవైపు హీరో తండ్రిగా బ్రహ్మాజీ తెరపై కనిపించేది కాసేపే అయినా..బాగా నవ్వించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. శేఖర్ చంద్ర నేపథ్య సంగీతం, పాటలు సినిమాకు ప్లస్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ చాలా షార్ప్‌గా ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నంగా ఉన్నాయి.-రేటింగ్: 2.75/5 -
‘రాజు గాని సవాల్’ కోసం ఎదురు చూస్తున్నా : డింపుల్ హయతి
లెలిజాల రవీందర్, రితికా చక్రవర్తి హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న సినిమా ‘రాజు గాని సవాల్’. ఈ చిత్రాన్ని లెలిజాల కమల ప్రజాపతి సమర్పణలో, ఎల్ ఆర్ ప్రొడక్షన్ బ్యానర్ పై లెలిజాల రవీందర్ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. రక్షా బంధన్ పండుగ సందర్భంగా ఆగస్టు 8న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని హీరోయిన్స్ డింపుల్ హయతి, రాశీ సింగ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరోయిన్ డింపుల్ హయతి మాట్లాడుతూ - "రాజు గాని సవాల్" మూవీ ట్రైలర్, సాంగ్స్ చాలా బాగున్నాయి. నేను కెరీర్ ప్రారంభించిన కొత్తలో కలిసిన సినిమా మీద ప్రేమ ఉన్న ముగ్గురు వ్యక్తులు బాపిరాజు గారు, సునీల్ కుమార్ రెడ్డి గారు, రవీందర్ రెడ్డి గారు. ఈ అమ్మాయి బాగుంటుందని నాకు మొదటి సినిమా అవకాశం ఇచ్చారు ఈ ముగ్గురు. "రాజు గాని సవాల్" మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కు మీరు వస్తారా అని బాపిరాజు గారు అడిగినప్పుడు తప్పకుండా వస్తా సార్ అని చెప్పాను. బాపిరాజు గారు సినిమాను సినిమాను రూపొందించడమే కాదు ప్రేక్షకుల దగ్గరకు రీచ్ అయ్యేలా చేస్తారు. "రాజు గాని సవాల్" సినిమా సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. ఈ మూవీ రిలీజ్ కోసం నేనూ ఎదురుచూస్తున్నా. అన్నారు.హీరోయిన్ రాశీ సింగ్ మాట్లాడుతూ.. ‘ఈ ఈవెంట్ కు వచ్చే ముందే "రాజు గాని సవాల్" సినిమా ట్రైలర్ చూశాను చాలా బాగుంది. ఇదొక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా మూవీ. హీరో రవీందర్ గారితో పాటు రితిక, సంధ్య బాగా నటించారు. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తున్న సందర్భంగా టీమ్ అందరికీ కంగ్రాట్స్ చెబుతున్నా. బాపిరాజు గారి నమ్మకాన్ని ఈ మూవీ నిలబెట్టాలి. "రాజు గాని సవాల్" సినిమా ఘన విజయాన్ని సాధిస్తుందని ఆశిస్తున్నా’ అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు భారత్ భూషణ్, ప్రొడ్యూసర్స్ దామోదర ప్రసాద్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ప్రసన్నకుమార్, గీత రచయిత గోరటి వెంకన్న, నటుడు డా.భద్రం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. -
ఓటీటీలో 'నవీన్ చంద్ర' క్రైమ్ థ్రిల్లర్ సినిమా
టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర (Naveen Chandra), రాశీసింగ్ (Rashi Singh) జంటగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం 'బ్లైండ్ స్పాట్'(Blind Spot). తాజాగా ఓటీటీ విడుదలపై అధికారికంగా ప్రకటన వచ్చేసింది. మే 9న విడుదలైన ఈ చిత్రం పెద్దగా ప్రేక్షకులకు కనెక్ట్ కాకపోయినప్పటికీ క్రైమ్ కథలను ఇష్టపడే వారిని మెప్పించింది. ఈ సినిమాకు రాకేశ్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను మ్యాంగో మాస్ మీడియా రామకృష్ణ వీరపనేని నిర్మించారు. ఈ మూవీలో ఆలీ రెజా, గాయత్రి భార్గవి, రవి వర్మ తదితరులు నటించారు.'బ్లైండ్ స్పాట్' చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానున్నట్లు ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని అందులో తెలిపారు. ఈ చిత్రంలో ఒక పాత్రే రెండు విభిన్న కోణాల్లో చాలా ఆసక్తిగా దర్శకుడు చూపారు. కథ రొటీన్‌గానే ఉన్నప్పటికీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా అక్కడక్కడ పండుతుంది. ఓటీటీలో చూడతగిన సినిమానే అని చెప్పవచ్చు.కథ ఏంటి..?హైదరాబాద్‌కు చెందిన మెన్ జైరాం (రవి వర్మ) ప్రముఖ వ్యాపారవేత్తగా ఉంటాడు. అయతే, తన భార్య దివ్య (రాశీ సింగ్)తో తరుచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఆమె అనుమానాస్పదంగా మరణిస్తుంది. అది హత్య లేక ఆత్మహత్యనా అనేది అంతుపట్టదు. దివ్య మరణించిన విషయాన్ని ఆ ఇంటి పనిమనిషి పోలీసులకు సమాచారం ఇస్తుంది. అప్పుడు ఆ ఏరియా పోలీస్ విక్రమ్ (నవీన్ చంద్ర) రంగంలోకి దిగుతాడు. ఇక ఇక్కడ నుంచి అసలు కథ మొదలౌతుంది. ఆమెది ఆత్మహత్య కాదు హత్య అని విక్రమ్ చెబుతాడు. మరి ఆ హత్యకు కారణాలు ఏంటి..? ఎవరు చేశారు..? ఆమెను చంపే అంత అవసరం ఎందుకు వచ్చింది..? ఇంట్లో ఉన్నవారితోనే ప్లాన్ వేశారా..? దివ్య మానసిక పరిస్థితి ఎలా ఉండేది? చివరికి హత్య చేసిన వారిని పోలీసులు ఎలా పట్టుకున్నారు..? అనేది తెలియాలంటే 'బ్లైండ్ స్పాట్' చూడాల్సిందే. -
తెలుగు బ్యూటీ న్యూ బిగినింగ్స్.. పెళ్లికి రెడీ అన్న ఐశ్వర్య
దుబాయ్‌లోనే చిల్ అవుతున్న సమంత... నక్షత్రాలను అందుకుంటానంటూ పోస్ట్ఫుట్బాల్ గ్రౌండ్లో జెనీలియా దేశ్ముఖ్న్యూ బిగినింగ్స్ అంటూ గుడికి వెళ్లిన ఫోటోలు షేర్ చేసిన గౌరీప్రియడోసు పెంచిన రాశీ ఖన్నారెడ్ మిర్చిలా 3 రోజెస్ బ్యూటీ రాశీ సింగ్ పెళ్లికి రెడీ అంటున్న ఐశ్వర్య.. కాకపోతే ఎవరో పెళ్లో గెస్ చేయమన్న బ్యూటీ View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Simran Rishi Bagga (@simranrishibagga) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Sri Gouri Priya (@srigouripriya) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Raashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by Aishwarya pisse__Official (@aishwarya_pisse_) -
దూసుకెళ్తున్న నవీన్ చంద్ర.. అప్పుడే మరో కొత్త సినిమా!
హీరో నవీన్ చంద్ర వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఈ మధ్య లెవన్ సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఈ టాలెంటెడ్ హీరో..తాజాగా మరో కొత్త సినిమాను ప్రకటించాడు. ఈ చిత్రానికి ‘కరాలి’అనే టైటిల్ ఫిక్స్ చేశారు. రాకేష్ పొట్టా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీమతి మందలపు ప్రవల్లిక సమర్పణలో విక్రాంత్ ఫిల్మ్ క్రియేషన్స్ బ్యానర్ మీద మందలపు శివకృష్ణ నిర్మిస్తున్నారు. రాశీసింగ్, కాజల్ చౌదరి హీరోయిన్లు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత సాహు గారపాటి, రాజా రవీంద్ర వంటి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిత్ర యూనిట్‌కు సాహు గారపాటి స్క్రిప్ట్‌ను అందజేశారు. ముహూర్తపు సన్నివేశానికి సాహు గారపాటి క్లాప్ కొట్టగా, శ్రీహర్షిణి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అధినేత గోరంట్ల రవికుమార్, యాస్పైర్ స్పేసెస్ మేనేజింగ్ డైరెక్టర్ తుమాటి నరసింహా రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నవీన్ చంద్ర మాట్లాడుతూ... ‘కొత్త వారు కొత్త పాయింట్‌తో వచ్చినప్పుడు సినిమాలు నిర్మించేందుకు శివ గారి లాంటి ధైర్యం ఉన్న వాళ్లు ముందుకు రావాలి. ‘కరాలి’ అనే టైటిల్ ఎంత కొత్తగా, డిఫరెంట్‌గా ఉందో సినిమా కూడా అంతే కొత్తగా ఉంటుంది. ఇంత వరకు నేను చేయని ఓ డిఫరెంట్ యాక్షన్ డ్రామా. కాజల్ చౌదరి నటించిన ‘అనగనగా’ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. మా సినిమాకు మంచి టీం దొరికింది. ఇంత వరకు నన్ను ఆడియెన్స్, మీడియా ఎంకరేజ్ చేస్తూనే వచ్చింది. ఈ మూవీని ఆడియెన్స్ అంతా ఎంజాయ్ చేసేలా రూపొందిస్తున్నామ’ని అన్నారు.‘నేను చెప్పిన స్క్రిప్ట్ నచ్చడంతో నిర్మించేందుకు వచ్చిన శివ గారికి థాంక్స్. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని మేం చాలా నమ్మకంగా ఉన్నాం’ అని చిత్ర దర్శకుడు రాకేష్ పొట్టా అన్నారు.నాకు స్క్రిప్ట్ చాలా నాకు నచ్చింది. నవీన్ చంద్ర గారి సినిమాలు, ఆయన ఎంచుకునే కథలు ఎలా ఉంటాయో చెప్పాల్సిన పని లేదు. మళ్లీ ఈ మూవీతో మంచి కథతో మీ అందరి ముందుకు రాబోతోన్నాం’అని హీరోయిన్ కాజల్ చౌదరి అన్నారు. -
త్రీ రోజెస్
ఈషా రెబ్బా, హర్ష చెముడు, ప్రిన్స్ సిసిల్, హేమ, ‘సత్యం’ రాజేశ్, కుషిత కల్లపు ప్రధానపాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘త్రీ రోజెస్’. ఆహా ఓటీటీలో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సిరీస్‌కు సీజన్ 2 రాబోతోంది. ఇందులో ఈషా రెబ్బా, కుషిత కల్లపు, రాశీ సింగ్ లీడ్ రోల్స్‌లో నటించారు. డైరెక్టర్ మారుతి షో రన్నర్‌గా వ్యవహరిస్తున్న ‘త్రీ రోజెస్’ సీజన్ 2కి రవి నంబూరి, సందీప్ బొల్ల రచన చేయగా, కిరణ్ కె.కరవల్ల దర్శకత్వం వహించారు.మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్కేఎన్ నిర్మించిన ఈ సిరీస్ ఆహా ఓటీటీలో త్వరలో స్ట్రీమింగ్ కానుంది. ఇదిలా ఉంటే.. ‘త్రీ రోజెస్’ సీజన్ 2 నుంచి రాశీ సింగ్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఆమె ఎందుకు ట్రెడిషనల్ నుంచి మోడ్రన్‌గా మారారు? అనేది గ్లింప్స్‌లో ఆసక్తి కలిగిస్తోంది. ‘త్రీ రోజెస్’ సీజన్ 2 నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన ఈషా రెబ్బా, కుషిత కల్లపు గ్లింప్స్‌లకు మంచి స్పందన వచ్చింది. రాశీ సింగ్ క్యారెక్టర్ గ్లింప్స్‌కి కూడా అద్భుతమైన స్పందన వస్తోంది’’ అని మేకర్స్ పేర్కొన్నారు. -
నవీన్ చంద్ర ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ .. ఆడియన్స్‌కు సవాల్ విసిరిన హీరో!
టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర, రాశి సింగ్ జంటగా నటిస్తోన్న క్రైమ్ థ్రిల్లర్ బ్లైండ్ స్పాట్. ఈ సినిమాకు రాకేశ్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను మ్యాంగో మాస్ మీడియా రామకృష్ణ వీరపనేని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈవెంట్‌కు హాజరైన హీరో నవీన్ చంద్ర తన అభిమానులకు ఓ ఛాలెంజ్ విసిరారు. బ్లైండ్ స్పాట్ మూవీ పోస్టర్లోనే ఓ క్లూ ఉందని.. అది కనిపెట్టిన వారితో తానే స్వయంగా థియేటర్లో మూవీ చూస్తానని అన్నారు.నవీన్ చంద్ర మాట్లాడుతా..'బ్లైండ్ స్టాట్ పోస్టర్లోనే ఓ క్లూ ఉంది. ఆ క్లూ ఎవరైతే కనిపెట్టి నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో డీఎం చేస్తే వారిని వ్యక్తిగతంగా కలుస్తా. అలాగే వారితో కలిసి థియేటర్లో సినిమా చూస్తా. ఈ మూవీపై నాకు అంత కాన్ఫిడెన్స్ ఉంది. ఈ విషయాన్ని నిర్మాత చెప్పలేదు, డైరెక్టర్ చెప్పలేదు. నేనే వ్యక్తిగతంగా చెబుతున్నా. అంతా కాన్ఫిడెంట్‌గా ఉన్నా. యాక్టర్ ఫర్మామెన్స్, టెక్నీషియన్స్ వర్క్‌తో ఈ కథను ఆడియన్స్‌ను ఎలా మెప్పించాలో రాకేశ్ పనిని చూసి బానిసను అయిపోయా' అని అన్నారు.ఇవాళ విడుదలైన బ్లైండ్ స్పాట్ ట్రైలర్ చూస్తే ఓ అమ్మాయి ఆత్మహత్య చుట్టూ తిరిగే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నవీన్ చంద్ర పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ట్రైలర్లో సన్నివేశాలు చూస్తే ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేస్తోంది. కాగా.. ఈ చిత్రంలో అలీ రెజా, రవి వర్మ, గాయత్రి భార్గవి, కిషోర్ కుమార్, హారిక పెడద, హర్ష రోషన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. #BlindSpot పోస్టర్ లోనే ఒక CLUE ఉంది. దాన్ని కనిపెట్టిన వాళ్ళతో కలిసి నేను సినిమా చూస్తా - #NaveenChandra#Tollywood #MangoMassMedia #TeluguFilmNagar pic.twitter.com/hWUHvMiNXp— Telugu FilmNagar (@telugufilmnagar) April 18, 2025 -
రాజ్ తరుణ్ ‘పాంచ్ మినార్’ టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ప్రపంచంలో అన్నింటికన్నా సులభమైన పనేంటో తెలుసా?.. నవ్వులు పూయిస్తోన్న టీజర్
రాజ్‌తరుణ్, రాశీసింగ్.. హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న కామెడీ ఎంటర్టైనర్ 'పాంచ్ మినార్'. ఈ సినిమాకు రామ్ కడుముల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని కనెక్ట్ మూవీస్ బ్యానర్‌పై మాధవి, ఎంఎస్ఎం రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు.తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ చూస్తుంటే థియేటర్లలో నవ్వులు పూయించడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా రాజ్ తరుణ్ నటన, ఫన్నీ డైలాగ్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. నాటకాలు ఆడుతున్నావా? బ్యాగ్ ఎక్కడ అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది. ఆ తర్వాత 'ప్రపంచంలో అన్నింటికన్నా సులభమైన పనేంటో తెలుసా? డబ్బులు సంపాదించడం' అనే కోటేషన్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది. ఇంటర్వ్యూలో ఆన్సర్లు తెలియకపోయినా పర్లేదు కానీ.. కనీసం క్వశ్చన్స్ అయినా తెలిసుండాలిగా అని బ్రహ్మాజీ చెప్పే డైలాగ్ నవ్వులు తెప్పిస్తోంది. కాగా.. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, శ్రీనివాస్‌రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం పాంచ్ మినార్ టీజర్ చూసేయండి. -
Rashi Singh: తిరుమల మెట్లు ఎక్కిన హీరోయిన్ (ఫోటోలు)
-
గులాబీలా మెరిసిపోతున్న హీరోయిన్ రాశీ సింగ్.. చూస్తే అంతే (ఫొటోలు)


