త్రీ రోజెస్‌ | Glimpse of Rashi Singh from Web Series 3 Roses Season 2 Released | Sakshi
Sakshi News home page

త్రీ రోజెస్‌

May 9 2025 3:11 AM | Updated on May 9 2025 3:11 AM

Glimpse of Rashi Singh from Web Series 3 Roses Season 2 Released

ఈషా రెబ్బా, హర్ష చెముడు, ప్రిన్స్  సిసిల్, హేమ, ‘సత్యం’ రాజేశ్, కుషిత కల్లపు ప్రధానపాత్రల్లో నటించిన వెబ్‌ సిరీస్‌ ‘త్రీ రోజెస్‌’. ఆహా ఓటీటీలో సూపర్‌ హిట్‌గా నిలిచిన ఈ సిరీస్‌కు సీజన్‌ 2 రాబోతోంది. ఇందులో ఈషా రెబ్బా, కుషిత కల్లపు, రాశీ సింగ్‌ లీడ్‌ రోల్స్‌లో నటించారు. డైరెక్టర్‌ మారుతి షో రన్నర్‌గా వ్యవహరిస్తున్న ‘త్రీ రోజెస్‌’ సీజన్‌ 2కి రవి నంబూరి, సందీప్‌ బొల్ల రచన చేయగా, కిరణ్‌ కె.కరవల్ల దర్శకత్వం వహించారు.

మాస్‌ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై ఎస్‌కేఎన్‌ నిర్మించిన ఈ సిరీస్‌ ఆహా ఓటీటీలో త్వరలో స్ట్రీమింగ్‌ కానుంది. ఇదిలా ఉంటే.. ‘త్రీ రోజెస్‌’ సీజన్‌ 2 నుంచి రాశీ సింగ్‌ గ్లింప్స్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఆమె ఎందుకు ట్రెడిషనల్‌ నుంచి మోడ్రన్‌గా మారారు? అనేది గ్లింప్స్‌లో ఆసక్తి కలిగిస్తోంది. ‘త్రీ రోజెస్‌’ సీజన్‌ 2 నుంచి ఇప్పటికే రిలీజ్‌ చేసిన ఈషా రెబ్బా, కుషిత కల్లపు గ్లింప్స్‌లకు మంచి స్పందన వచ్చింది. రాశీ సింగ్‌ క్యారెక్టర్‌ గ్లింప్స్‌కి కూడా అద్భుతమైన స్పందన వస్తోంది’’ అని మేకర్స్‌ పేర్కొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement