మీ గ్యాంగ్‌తో రెడీ అయిపోండి! | Ee Nagaraniki Emaindi 2 Trailer Release Date and Time Announced | Sakshi
Sakshi News home page

మీ గ్యాంగ్‌తో రెడీ అయిపోండి!

Nov 1 2026 5:25 AM | Updated on Nov 1 2026 5:27 AM

Ee Nagaraniki Emaindi 2 Trailer Release Date and Time Announced

విశ్వక్‌ సేన్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఈఎన్‌ఈ రిపీట్‌’ (ఈ నగరానికి ఏమైంది రిపీట్‌). విశ్వక్‌ సేన్‌ లీడ్‌ రోల్‌లో తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వం వహించిన ‘ఈ నగరానికి ఏమైంది’ (2018) మూవీకి సీక్వెల్‌గా విశ్వక్‌ సేన్‌–తరుణ్‌ భాస్కర్‌ కాంబినేషన్‌లోనే ‘ఈఎన్‌ఈ రిపీట్‌’ రూపొందింది. శ్రీనాథ్‌ మాగంటి, అభినవ్‌ గోమఠం, వెంకటేశ్‌ కాకుమాను ఇతర పాత్రలు పోషించారు. 

ఎస్‌ ఒరిజినల్స్, రూట్‌ నోడ్‌ సినిమా పతాకాలపై సృజన్‌ యరబోలు, సందీప్‌ నాగిరెడ్డి నిర్మించిన ఈ మూవీ ఈ నెల 19న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ని ఈ నెల 3న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ‘బాయ్స్‌ కొత్త మిషన్‌తో తిరిగి వచ్చారు.. మీ గ్యాంగ్‌తో రెడీ అయిపోండి’ అంటూ ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌ విడుదల చేశారు.

‘‘ఇప్పటికే విడుదలైన ‘ఈఎన్‌ఈ రిపీట్‌’ ప్రమోషనల్‌ కంటెంట్‌ మంచి అంచనాలు క్రియేట్‌ చేసింది. తొలి భాగంలో తమ స్నేహం, కామెడీతో యువ ప్రేక్షకులకు దగ్గరైన ఈ నలుగురి గ్యాంగ్‌ మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: వివేక్‌ సాగర్, కెమెరా: ఏజీ ఆరోన్, ఎగ్జిక్యూటివ్‌ ప్రోడ్యూసర్‌: సౌమిత్రి .ఎన్, లైన్‌ ప్రోడ్యూసర్‌: శ్రీను ఈర్ల.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement